
కళ్యాపూర్‌లో రోడ్డుపై వరినాట్లు వేస్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్
రెంజల్: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కళ్యాపూర్ గ్రామ చౌరస్తాలోని బురద రోడ్డుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ప్రజా గోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా ఆయన నాలుగు రోజులుగా బోధన్ నియోజక వర్గంలో బైక్ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఆదివారం కళ్యాపూర్ మీదుగా యాత్ర సాగింది. రోడ్డు బురదమయం కావడంతో వాహన దారులు ఇబ్బంది పడుతున్నారు.
దీంతో బురద రోడ్డుపై ఎమ్మెల్యే నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నాలుగు రోజులుగా బోధన్ నియోజక వర్గంలో పర్యటిస్తున్నానని, రోడ్లపై ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయని తెలి పారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ఇసుక అక్రమ మాఫియాను నడిపిస్తూ సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment