paddy
-
లక్ష ఎకరాల్లో ఎండిన వరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, నిజామాబాద్, కామారెడ్డి, వనపర్తి, యాదాద్రి, మెదక్, సిద్దిపేట, భద్రాద్రి, ఖమ్మం, సిరిసిల్ల జిల్లాల్లో వరిమళ్లు ఎండుతున్నాయి. ప్రాజెక్టుల నీటి మీది ఆశతో వరి సాగు చేసిన రైతులతో పాటు బోర్లు, బావుల కింద పంట వేసిన లక్షలాది మంది రైతులు పొట్ట కొచ్చే దశలో ఉన్న వరిని చూసి తల్లడిల్లుతున్నారు. ప్రాజెక్టుల కింద ఉన్న పొలాలకు వారబందీ ప్రాతిపదికన నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, దేవాదుల,ఎల్ఎండీ, మిడ్‌మానేరు, మల్లన్నసాగర్, సీతారామసాగర్ మొదలైన ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని పొదుపుగా కిందకు వదులుతుండడంతో ఆయకట్టు చివర ఉన్న పొలాలకు నీరు అందడం లేదు. దీంతో పలు జిల్లాల్లో వరిమళ్లు ఎండుతున్నాయి. ఇప్పటికే సుమారు లక్ష ఎకరాల్లో వరి పంట ఎండిపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిసింది. పడిపోతున్న భూగర్భ జలాలు: ఈ ఏడాది మార్చిలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. చాలాచోట్ల ఏప్రిల్‌లో ఉండే ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. గత సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో నమోదైన భూగర్భ నీటి మట్టాలు ఈసారి మార్చి నెలలోనే ఆ స్థాయికి వెళ్లాయి. గత నెలాఖరు నాటికే వికారాబాద్ జిల్లాలో 13.67 మీటర్ల లోతుకు వెళ్లగా, ప్రస్తుతం 14 మీటర్లు దాటింది. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, సిరిసిల్ల, మహబూబ్‌నగర్, భద్రాద్రి, భూపాలపల్లి జిల్లాల్లో.. ఫిబ్రవరిలో రాష్ట్ర సగటు భూగర్భ జల మట్టం 8.32 మీటర్లను మించి 9 మీటర్ల నుంచి ఏకంగా 13 మీటర్ల వరకు వెళ్లింది. ఇక మార్చి రెండో వారం దాటే నాటికి కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో భూగర్భ మట్టాలు మరింత అడుగంటినట్లు అధికారులు చెపుతున్నారు. రికార్డు స్థాయిలో పంటల సాగు రాష్ట్రంలో ఈ యాసంగిలో అత్యధికంగా 73.65 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో వరే 56.13 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ప్రభుత్వం సన్న ధాన్యానికి బోనస్ కింద క్వింటాలుకు రూ.500 ఇస్తుండడంతో సాగు గణనీయంగా పెరిగింది. సన్నాల సాగు పెరగడంతో సాగునీటి అవసరం మరింత పెరిగింది. పంట కాలం ఎక్కువ కావడంతో నీటి తడులు కూడా ఎక్కువ కావలసి ఉంది. అయితే ఎస్ఆర్ఎస్పీ, దేవాదుల వంటి ప్రాజక్టుల కింద పొలాలకు వారబందీ కింద ఒక వారం నీరిచ్చి, మరో వారం బంద్ చేస్తుండడంతో వారం పాటు పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. భూగర్భ జలాలపై ఆధారపడి పంటలు వేసిన చాలా గ్రామాల్లో పంటను పశువులకు వదిలేశారు. మొక్కజొన్న పంట కూడా సాధారణ సాగుతో పోలిస్తే ఈసారి ఏకంగా మూడున్నర లక్షల ఎకరాలు అధికంగా సాగైంది. గిట్టుబాటు ధర ఉండడంతో రైతులు 8.09 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఆరు తడి పంటగా సాగయ్యే మొక్క జొన్నకు వారం, పదిరోజులకు కూడా ఒక తడి నీరు ఇవ్వని పరిస్థితుల్లో నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో మొక్కజొన్న ఎండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మొక్కజొన్న, వేరుశనగ కూడా..నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, మెదక్ మొదలైన జిల్లాల్లో మొక్కజొన్న, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, వికారాబాద్ తదితర జిల్లాల్లో వేరుశనగ పంటలు కూడా నీళ్లు లేక ఎండిపోతున్నట్లు రైతులు వాపోతున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు వరి పంట కోతకు వచ్చే అవకాశం ఉండడంతో అప్పటి వరకు ఆయకట్టుకు నీరు ఎలా ఇవ్వాలో తెలియక నీటిపారుదల శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల బాధలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ నీరు పెద్దపల్లి జిల్లా గుండా మంథని వరకు నిరాటంకంగా వెళ్లేలా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రయతి్నస్తున్నప్పటికీ, వచ్చే నెలలో ఎలా ఉంటుందో చెప్పలేమని ఓ అధికారి పేర్కొన్నారు. -
‘చెప్పు’కోలేని బాధలు..
సైదాపూర్ (హుజూరాబాద్): యూరియా తదితర ఎరువుల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు రైతులు ఉదయమే చేరుకున్నారు. ప్రస్తుతం యాసంగి నేపథ్యంలో ఉదయం 7 నుంచి 8 గంటల సమయంలో ఎరువులు తీసుకెళ్తుంటారు. కానీ ఆ సమయంలో గేటు తీయకపోవడంతో.. గోడపై నుంచి లోపలికి దూకి చెప్పులను క్యూలో పెట్టారు. గోడపై ఉదయం 10 గంటల వరకు కూర్చుని నిరీక్షించారు. అధికారులు ఎరువుల కొరత తీర్చాలని అన్నదాతలు కోరుతున్నారు.పంటలు తడారి.. పొలాలు ఎడారిరాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పలు గ్రామాల్లో వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్నాయి. వరినాట్లు వేసిన రైతులు పంట పొలాలకు నీరు సరిపోకపోవడంతో ఎండుతున్న పొలాలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పంట పొలాల్లో గొర్రెలను మేపుతున్నారు. మండల కేంద్రానికి చెందిన కాకల్ల ఎల్లయ్య, గొల్లపల్లి శ్రీనులు తమకున్న భూమిలో ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు వరి సాగు చేశారు. వర్షాలు సరిగ్గా లేకపోవడం.. వారం రోజులుగా ఎండలు తీవ్రం కావడంతో భూగర్భ జలాలు అడుగంటి పొలాలకు నీరు అందడం లేదు. దీంతో ఎండిపోయిన వరి పొలంలో మూగజీవాలను తోలి మేపుతున్నారు. వర్ణాల పొద్దుఉదయాస్తమయాలు ఎప్పుడూ మనోహరమే. ప్రకృతి ప్రేమికులకు పరవశమే. పగలంతా వెలుగులు నింపే భానుడు.. సాయం సంధ్య వేళ కాషాయరంగులో నిష్క్రమించడం అద్భుతమే. పెద్దపల్లి శివారులో సూర్యాస్తమయమిది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి స్కానర్ కొట్టు.. కల్లు పట్టు మారుతున్న కాలానికి అనుగుణంగా మారితేనే మనుగడ సాధ్యం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లికి చెందిన గీత కార్మికుడు గంగపురపు వెంకన్న ఇందుకు నిదర్శనం. వెంకన్న వద్దకు కల్లు తాగడానికి వచ్చే వారిలో ఎక్కువ మందికి స్మార్ట్ ఫోన్ ఉంది. వెంకన్న వద్ద స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో చెల్లింపులకు ఇబ్బంది ఏర్పడి.. గిరాకీ దెబ్బ తింది. దీంతో చేసేదిలేక వెంకన్న ఇటీవల తన బ్యాంక్ ఖాతాపై క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు కల్లు ప్రియులంతా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి.. డబ్బు చెల్లించి కల్లు తాగుతున్నారు. – కేసముద్రంయక్షగాన కళాకారుల భిక్షాటన టీవీలు, స్మార్ట్ ఫోన్ల రాకతో వీధి నాటకాలు అంతరించి పోయాయి. నేటి తరానికి యక్షగానం అంటే తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆదరణ లేక యక్షగాన కళాకారులు.. బతుకు కోసం భువనగిరిలో భిక్షాటన చేస్తూ కనిపించారు. – భువనగిరి టౌన్చదవండి: ఆ రోజు ఇల్లు కదలరు.. ముద్ద ముట్టరుగుమ్మి.. జ్ఞాపకాలు విరజిమ్మి గ్యాస్ పొయ్యిలు వచ్చాక కట్టెల పొయ్యిల్ని మరిచిపోయారు. కానీ ఒకప్పుడు కట్టెల పొయ్యి వెలిగించి వంట చేయాలంటే.. కంకిబెండ్లు, పిడకలు, కట్టెలు.. సేకరించి.. ఇలా గుమ్మిలో దాచుకోవలసిందే. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనుకుల గ్రామ శివారులోని ఓ ఇంట్లోని గుమ్మిలో దాచిన కంకిబెండ్లు పాత జ్ఞాపకాలను ఇలా గుర్తు చేశాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
చిరుధాన్యాలపై రైతుల అనాసక్తి
రామన్నపేట: గడ్డిజాతి పంటలైన చిరుధాన్యాల సాగు విస్తీర్ణం ఏటేటా పడిపోతోంది. ఆహారం, పశుగ్రాసం కోసం సాగుచేసే చిరుధాన్యా లను సిరిధాన్యాలు అని కూడా అంటారు. మంచిపోషకాలు కలిగిన చిరుధాన్యాలు వర్షా ధార పంటలు. సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, అరికెలు వంటి చిరుధాన్యాలు గోధు మలతో సరితూగుతాయి. యాదాద్రి భువన గిరి జిల్లాలో సాగునీటి వనరులు పెరగడంతో రైతులు వరిసాగుకే మొగ్గు చూపుతున్నారు. ఆ తరువాత వాణిజ్య పంట అయిన పత్తిని పెద్దమొత్తంలో సాగు చేస్తున్నారు.గతంలో సగం చిరుధాన్యాలేచిరుధాన్యాలను సాధారణంగా వానాకాలంలోనే సాగు చేస్తారు. స్వల్ప ఖర్చుతో సేంద్రియ పద్ధతుల్లో రసాయనాలు వాడకుండా పండించేవారు. 10–15 సంవత్సరాల క్రితం వరకు సాగులో సగం వరకు చిరుధాన్యాలపంటలే ఉండేవి. వీటిలో అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు, నాణ్యమైన విత్తనాలు లేకపో వడం.. ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో సాగు విస్తీర్ణం ఏటా పడిపో తోంది. పిట్టల నుంచి కాపాడుకోవడం కష్టత రంగా మారడం, ఇటీవలి కాలంలో కోతుల బెడద ఎక్కువ అవడం, సాగునీటి వనరులు మెరుగు పడడం కూడా చిరుధాన్యాల సాగు తగ్గడానికి కారణంగా మారాయి. ఆరోగ్యానికి మేలుదశాబ్దం క్రితంవరకు సామాన్యుడి ఆహారంలో చిరుధాన్యాలతో వండే సజ్జగట్క, జొన్నగట్క, రొట్టెలు, రాగిజావను ఎక్కువగా ఉండేవి. వీటిలో అధిక పోషకాలు ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి. విటమిన్ బీ 12, బీ 17, బీ 6ను కలిగి ఉండడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఇటీవ చిరుధాన్యాలను భుజించడం సర్వసాధారణమైంది. అయితే పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సాగు విస్తీర్ణం పెరగడం లేదు. పైగా ప్రతి ఏటా తగ్గుతూ వస్తుంది. -
ధాన్యం కొనుగోలులో దళారీలు వచ్చేసారు..
-
ధాన్యం కొనాలి.. మద్దతు ధర చెల్లించాలి
మిర్యాలగూడ: ధాన్యం కొనాలని..మద్దతు ధర కల్పించాలని అన్నదాతలు రోడ్డెక్కారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలోని అవంతీపురం వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజే మిర్యాలగూడ పరిధిలోని రైస్ మిల్లులకు 3వేల ట్రాక్టర్లకుపైగా ధాన్యం తరలివచి్చంది. దీంతో కోదాడ రోడ్డు వైపు యాద్గార్పల్లి మిల్లుల్లో ఉదయం పూట ధాన్యం నిల్వలు భారీగా పేరుకుపోయాయని, నిల్వ సామర్థ్యం లేదని ఉదయం 11గంటల వరకు ధాన్యం కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో మద్దతు ధరకు వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రోడ్లపైనే ట్రాక్టర్లు నిలిపి రైతులు రాస్తారోకో చేశారు.మరోవైపు నల్లగొండ రోడ్డులో వేములపల్లి మండల పరిధిలోని రైస్ మిల్లుల వద్ద ట్రాక్టర్లు భారీ ఎత్తున తరలివచ్చాయి. ఒక ట్రాక్టర్ ప్రమాదానికి గురై రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో 2 గంటల పాటు ధాన్యం ట్రాక్టర్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందు లు కలిగాయి. వెంటనే అధికారులు ఆ ట్రాక్టర్‌ను తొలగించడంతో పలు మిల్లుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. మహీంద్ర, పద్మ చింట్లు తదితర ఎర్ర రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,150 నుంచి రూ.2,250 వరకు ధర వేస్తు న్నారని రైతులు యాద్గార్పల్లి మిల్లుల వద్ద, వేములపల్లి మండల పరిధిలోని మిల్లుల వద్ద ధర్నా చేశారు. అదనపు కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్షించినా... ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలంటూ శనివారం మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మిర్యాలగూడ ఏరియా రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్ 3గంటల పాటు సమీక్షించారు. సన్నరకం ధాన్యానికి రూ.2,320 నుంచి రూ.2,400 వరకు కొనుగోలు చేయాలని సూచించారు. దీనికి రైస్ మిల్లర్లు అంగీకరించారు. కానీ, ఆదివారం మిల్లుల వద్ద భారీగా ట్రాక్టర్లు బారులుదీరడంతో పచ్చి గింజ, తేమ అధికంగా ఉందని, ధాన్యం రంగు మారిందని పలు సాకులతో రూ.2,150 నుంచి రూ.2,350 వరకు కొనుగోలు చేశారు.ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ చెప్పినా కూడా మద్దతు ధర చెల్లించకుండా కేవలం రూ.2,300లోపు ధరకు చాలా ధా న్యం కొనుగోలు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వి షయం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని మిల్లర్లను ఆదేశించారు.పచ్చి వడ్లు అని ధర తగ్గిస్తున్నారు వడ్లలో నాణ్యత లేదని, పచి్చ గా ఉన్నాయని, తేమ శాతం అధికంగా ఉందని, తాలుగింజలు ఉందని సాకు చూపి మిల్లర్లు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. క్వింటాకు రూ.2,250కే కొన్నారు. అధికారులు మిల్లుల వద్దకు రాకపోవడం వల్లే రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు క్షేత్ర పర్యటన చేసి మద్దతు ధర ఇప్పించాలి. – వీరబోయిన లింగయ్య, రైతు, పాములపహాడ్ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాంమిర్యాలగూడ పరిసర ప్రాంతాల మిల్లులకు ఆదివారం సుమారు 3వేలకు పైగా ట్రాక్టర్లలో ధాన్యం వచ్చింది. రైతులు సహకరిస్తే కొనుగోళ్లు వేగవంతమవుతాయి. ఆదివారం ఉద యం 10గంటల వరకు కొనుగోలు కాస్తా మందగించాయి. మధ్యాహ్నం 1గంట వరకు కొనుగోలు చేశాం. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొస్తే రూ.2,320కు పైగా ధర చెల్లిస్తున్నాం. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం. తడిసి రంగు మారి న ధాన్యాన్ని కూడా కొనాలని అన్ని మిల్లులకు ఫోన్లు చేసి చెప్పాం. – కర్నాటి రమేశ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
వరిలోనే గోనె సంచుల్లో కూరగాయల సాగు!
నీరు నిల్వగట్టే రబీ వరి పొలాల్లో కూరగాయల సాగుతో పౌష్టికాహార భద్రతతో పాటు అదనపు ఆదాయంఅధిక ఉష్ణోగ్రతల్లోనూ నిశ్చింతగా కూరగాయల దిగుబడిహెక్టారులో 4–5 టన్నుల వరి ధాన్యంతో పాటు 60 క్వింటాళ్ల టొమాటోలు లేదా 30 క్వింటాళ్ల క్యారట్/ ముల్లంగి దిగుబడి పొందవచ్చుఐసిఎఆర్ సంస్థ ‘క్రిజాఫ్’ పరిశోధనల్లో వెల్లడిసార్వా, దాళ్వా సీజన్లలో (వర్షాకాలం, ఎండాకాలాల్లో) విస్తారంగా వరి పంట సాగయ్యే ప్రాంతాల్లో గట్ల మీద తప్ప పొలంలో అంతర పంటలుగా కూరగాయ పంటలను నేలపై సాగు చేయటం సాధ్యపడదు. అయితే, వరి సాళ్ల మధ్యలో వరుసలుగా ఏర్పాటు చేసిన గోనె సంచుల్లో సాధ్యపడుతుంది. గోనె సంచిలో అడుగు ఎత్తున మట్టి + మాగిన పశువుల ఎరువు/ఘన జీవామృతాల మిశ్రమం నింపి.. అందులో రకరకాల కూరగాయ మొక్కలు సాగు చేసుకునే అవకాశం మెండుగా ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. స్వల్ప ఖర్చుతోనే వరి రైతులు అధికాదాయం పొందేందుకు అవకాశం ఉంది. వరి సాగయ్యే ప్రాంతాల్లో స్థానికంగా కూరగాయల లభ్యత పెరగటంతో ప్రజలకు పౌష్టికాహార భద్రత చేకూరుతుందని ఈ పద్ధతిపై సుదీర్ఘ పరిశోధన చేసిన విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ.కె. ఘోరాయ్ అంటున్నారు. పశ్చిమ బెంగాల్ బారక్పుర్లోని (ఐసిఎఆర్ అనుబంధ సంస్థ) సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జ్యూట్ అండ్ అల్లీడ్ ఫైబర్స్ (ఐసిఎఆర్ – క్రిజాఫ్)లో ఈ పరిశోధనలు చేశారు. అధిక ఉష్ణోగ్రతల్లోనూ నిశ్చింతగా కూరగాయల దిగుబడి పొందవచ్చని ఈ పరిశోధనల్లో తేలింది.పదేళ్ల పరిశోధన2011–2021 మధ్యకాలంలో క్రిజాఫ్ ఆవరణలో, మరికొన్ని జిల్లాల్లో రబీ వరి పొలాల్లో గోనె సంచుల్లో కూరగాయలను అంతర పంటలుగా ప్రయోగాత్మకంగా సాగు చేశారు. నీరు నిల్వ ఉండే చోట నేలలో ప్రాణవాయువు లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ ద్విదళ జాతికి చెందిన కూరగాయ పంటలు సాగు చేసుకోవచ్చని తేలింది. మట్టి లోతు తక్కువగా ఉండే రాళ్ల నేలల్లో, చౌడు నేలల్లో కూడా ఈ విధంగా గోనె సంచుల్లో మట్టి మిశ్రమం నింపుకొని కూరగాయ పంటలు నిశ్చింతగా పండించుకోవచ్చు. ఎండాకాలంలో మంచి ధర పలికే టొమాటోలు, క్యారట్, ముల్లంగి, వంగ, పొద చిక్కుడు, కాళీఫ్లవర్, క్యాబేజి వంటి పంటలతో పాటు బీర, పొట్ల, సొర, ఆనప, గుమ్మడి, బూడిద గుమ్మడి వంటి తీగజాతి కూరగాయలను, కొత్తిమీర, ఉల్లి, కంద తదితర పంటలను పండించి మంచి ఆదాయం గడించవచ్చని డాక్టర్ఘోరాయ్ తెలిపారు. తీగలు పాకడానికి మూడు కర్రలు పాతి, పురికొస చుట్టి ఆసరా కల్పించాలి. వరి పంట కోసిన తర్వాత నేల మీద పాకించవచ్చు. అవసరాన్ని బట్టి తాత్కాలిక పందిరి వేసుకోవచ్చు. ఈ మడుల్లో ఒక పంట పూర్తయ్యాక మరో పంటను వేసుకోవచ్చు.గోనె సంచుల్లో సాగు ఎలా?ప్లాస్టిక్ వాడకం జోలికి పోకుండా వాడేసిన గోనె సంచిని అడ్డంగా ముక్కలుగా చేయాలి. బ్లైటాక్ నాడ్ రోగార్ కలిపిన నీటిలో గోనె సంచిని శుద్ధి చేస్తే శిలీంధ్రాలు, పురుగులను తట్టుకోవడానికి వీలుంటుంది. వాటికి నిలువుగా నిలబెట్టి, మట్టి+ సేంద్రియ ఎరువు నింపాలి. బయట ఏర్పాటు చేసి తీసుకెళ్లి పొలంలో పెట్టకూడదు. నీటిని నిల్వగట్టిన వరి పొలంలోనే వీటిని తయారు చేసుకోవాలి. గోనె అడుగున మొదట 2 అంగుళాల మందాన ఎండు వరి గడ్డి వేయాలి. దానిపై వరి పొలంలోని బురద మట్టినే 4 అంగుళాలు వేయాలి. ఆపైన మాగిన పశువుల ఎరువు లేదా ఘన జీవామృతం 2 అంగుళాల మందాన వేయాలి. ఆపైన మళ్లీ 2 అంగుళాల మందాన ఎండు వరి గడ్డి, మట్టి, ఎరువు పొరలుగా వేసి ఆపైన కొంచెం మట్టి కలపాలి. అంతే.. కూరగాయ మొక్కలు నాటడానికి గోనె సంచి మడి సిద్ధమైనట్టే. వరి గడ్డి క్రమంగా కుళ్లి పోషకాలను అందించటంతో పాటు మట్టి పిడచకట్టుకుపోకుండా గుల్లబరుస్తుంది. ఈ గోనె సంచుల మడులకు పనిగట్టుకొని నీరు పోయాల్సిన అవసరం లేదు. కాపిల్లరీ మూమెంట్ ద్వారా మట్టి అడుగున ఉన్న నీటి తేమను ఎప్పటికప్పుడు పీల్చుకొని మొక్కల వేర్లకు అందిస్తుంది. అప్పుడప్పుడూ ద్రవజీవామృతం తదితర ద్రవరూప ఎరువులను ఈ మడుల్లో పోస్తుంటే మొక్కలకు పోషకాల లోపం లేకుండా పెరిగి ఫలసాయాన్నిస్తాయి. వరి పంటను కంబైన్ హార్వెస్టర్‌తో కోత కోసే పనైతే.. అది వెళ్లడానికి వీలైనంత దూరంలో ఈ కూరగాయ మొక్కలను వరుసలుగా ఏర్పాటు చేసుకోవాలి.హెక్టారుకు 3 వేల మడులు95 సెం.మీ. పొడవుండే 50 కిలోల గోనె సంచిని అడ్డంగా 3 ముక్కలు చేసి మూడు మడులు ఏర్పాటు చేయొచ్చు. హెక్టారుకు వెయ్యి గోనె సంచులు (3 వేల మడులకు) సరిపోతాయి. మడి ఎత్తు 30 సెం.మీ. (అడుగు), చుట్టుకొలత 45 సెం.మీ. ఉంటుంది. వరిపొలంలో 5–10 సెం.మీ. లోతు నీరుంటుంది. కాబట్టి కూరగాయ మొక్కలకు ఇబ్బంది ఉండదు. హెక్టారుకు 3 వేల గోనె సంచి మడులు పెట్టుకోవచ్చు. 3వేల వంగ మొక్కల్ని లేదా 6 వేల క్యాబేజి మొక్కల్ని వేసుకోవచ్చు. సమ్మర్ కేరట్ లేదా ముల్లంగి హెక్టారుకు 30 క్వింటాళ్లు దిగుబడి తీసుకోవచ్చు. టొమాటో మొక్కకు 2 కిలోల చొప్పున హెక్టారుకు 60 క్వింటాళ్ల టొమాటోల దిగుబడి పొందవచ్చు. హెక్టారుకు 4–5 టన్నుల వరి ధాన్యానికి అదనంగా కూరగాయలను పుష్కలంగా పండించుకోవచ్చని డాక్టర్ ఘోరాయ్ వివరించారు. రబీ వరిలో అంతరపంటలుగా కూరగాయల సాగుపై మన యూనివర్సిటీలు / కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తే రైతులు అందిపుచ్చుకుంటారు. ఈ పంటల వీడియోలను డాక్టర్ ఘోరాయ్ తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. నీరు నిల్వ గట్టే వరి పొలాల్లో గోనె సంచుల్లో వరుసలుగా ఈ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తే రైతుల కుటుంబాలకు, స్థానిక ప్రజలకు పుష్కలంగా కూరగాయలు అందుబాటులోకి వస్తాయి. ఒకే స్థలంలో అవే వనరులతో వరితో పాటు అనేక రకాల కూరగాయ పంటలు పండించుకోవచ్చు. వరి రైతులు రూ;eయి అదనంగా ఖర్చుపెట్టి పది రెట్లు ఆదాయం సమకూర్చుకోవచ్చు. వరి పొలంలో నీరు నిల్వ ఉండటం వల్ల ఆరుబయట కూరగాయ తోటలతో పోల్చితే 6–8 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎండలు ముదిరిన తర్వాత కూడా కూరగాయల దిగుబడి బాగుంటుంది. వేసవిలో నీరు తదితర వనరులను మరింత ఉత్పాదకంగా వినియోగించుకోవటానికి ఈ పద్ధతి తోడ్పడుతుంది. – డాక్టర్ ఎ.కె. ఘోరాయ్, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జ్యూట్ అండ్ అల్లీడ్ ఫైబర్స్ (ఐసిఎఆర్ – క్రిజాఫ్),బారక్‌పుర్, పశ్చిమ బెంగాల్. -
అవినీతి మానేసి హామీలపై దృష్టిపెట్టండి
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరిట అవినీతి ఆలోచనలు మానుకొని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు హితవు పలికారు. మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామంటున్న ముఖ్యమంత్రికి రైతు భరోసా, దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చేందుకు డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ దుయ్యబట్టారు.ఈ మేరకు సీఎం రేవంత్‌కు కేటీఆర్ శుక్రవారం లేఖ రాశారు. సీఎం నిర్వహించిన వ్యవసాయ సమీక్షలో దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్, వర్షాకాలంలో రైతు భరోసా వంటి అంశాలపై చర్చించలేదని విమర్శించారు. గత సీజన్లోనూ రైతులకు వరి ధాన్యంపై బోనస్ చెల్లించకుండా ప్రభుత్వం మోసగించిందని ఆరోపించారు. కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే ప్రకటనతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. 80 శాతం మంది రైతులు దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి కూడా కేవలం సన్న వడ్లకే ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వకుంటే రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ హెచ్చరించారు.రైతు భరోసా సంగతి తేల్చండి: వానాకాలం సీజన్ పూర్తయినా ప్రభు త్వం రైతు భరోసా సంగతి తేల్చడం లేదని కేటీఆర్ లేఖలో మండిపడ్డారు. రైతుబంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామనే హామీని విస్మరించిందని, నేటికీ రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని దుయ్యబట్టారు. రైతులకు బాకీ పడిన రైతు భరోసాను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 100 శాతం రుణమాఫీ చేస్తామని ప్రకటించినా 20 లక్షల మంది రైతులకు నేటికీ మాఫీ వర్తించలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా రైతులకు మేలు జరగట్లేదని.. రేవంత్ చేతకానితనం అన్నదాతలకు శాపంగా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. -
పోటెత్తిన తుంగభద్ర డ్రెయిన్
తెనాలి: తుంగభద్ర డ్రెయిన్ పోటెత్తింది... సమీప పంట పొలాలను ముంచెత్తింది. ఫలితంగా గుంటూరు జిల్లా తెనాలి, వేమూరు, పొన్నూరు నియోజకవర్గాల్లోని గ్రామాలకు చెందిన వేలాది ఎకరాల్లోకి పంట పొలాలు మునకేశాయి. వరి పొలాలైతే చాలా చోట్ల మొనలు కూడా కనిపించడం లేదు. బీపీటీ వరిపై రైతులు ఆశలు వదిలేసుకున్నారు. కూరగాయలు, నిమ్మ, అరటి పొలాల్లో రోజుల తరబడి నీరు నిలిచి ఉండటంతోపంట నష్టం అనివార్యంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు నల్ల డ్రెయిన్... ఒకప్పుడు రైతుల దుఃఖదాయినిగా పేరు. తెనాలి నియోజకవర్గంలోని సంగం జాగర్లమూడి వద్ద కొమ్మమూరు కాలువ దిగువన అదనంగా అండర్ టన్నెల్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి తుంగభద్ర డ్రెయినుగా మారుతుంది. వేమూరు నియోజకవర్గంలోని దుండిపాలెం, యడ్లపల్లి, వలివేరు, చుండూరు, మోదుకూరు, ఆరెమండ్ల, తాళ్లపాలెం, పొన్నూరు, ములుకుదురు, మాచవరం మీదుగా సముద్రంలో కలుస్తుంది. ఎప్పుడు వరదలొచ్చినా 24 గంటల్లో డ్రెయిను సాధారణ పరిస్థితికి వస్తుంది. అయితే ఈసారి ఆగస్టు 31, ఈ నెల 1న కురిసిన భారీ వర్షాలకు పోటెత్తిన తుంగభద్ర, వర్షాలు ఆగిపోవడంతో రెండో తేదీ తర్వాత తగ్గుముఖం పట్టింది. మళ్లీ అనూహ్యంగా 3వ తేదీ మధ్యాహ్నం నుంచి నీరు పోటెత్తింది. 36 గంటలుగా ఇదే పరిస్థితి. మార్గమధ్యంలోని వంతెనల అంచులను తాకుతూ, కట్టలపై డ్రెయిన్ పొంగిపొర్లుతూ ప్రవహిస్తోంది. మంగళగిరి, చినకాకాని, కాజ, టోల్గేట్ ప్రాంతాల్లోని నీరు తుంగభద్ర డ్రెయినుకు రావడమే ఇందుకు కారణం. మరోవైపు తుంగభద్రలో కలిసే కొండేరు డ్రెయినుతో సహా పలు మురుగుకాల్వలు ఎగదన్ని పంటపొలాలను ముంచాయని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా తెనాలి సమీపంలోని పినపాడు–దుండిపాలెం, చుండూరు మండలంలోని నడిగడ్డపాలెం–చుండూరు, చుండూరు–మోదుకూరు గ్రామాల మధ్య రోడ్లు జలమయమయ్యాయి. చుండూరు–మోదుకూరు, నడిగడ్డపాలెం–చుండూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు కూడా తిరగడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. -
అన్నదాతలకు వాయు‘గండం’..
సాక్షి, అమరావతి: భారీ వర్షాలకు పెద్దఎత్తున వ్యవసాయ, ఉద్యాన పంటలు ముంపునకు గురవుతున్నాయి. బుడమేరు, ఎర్రకాలువలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఎన్టీఆర్, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని వేలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. ఇక ఉద్యాన పంటల విషయానికొస్తే అత్యధికంగా కూరగాయలు, అరటి, పసుపు, మిరప, తమలపాకు పంటలకు అపార నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. కూరగాయల పంటలే ఎక్కువగా దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు.ఈ వర్షాలవల్ల 30వేల మందికి పైగా రైతులు ప్రభావితమైనట్లు సమాచారం. ప్రస్తుతం వరి పంట దుబ్బులు కట్టే దశలో ఉండడంతో ఈ వర్షాలు మేలుచేస్తాయని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. అయితే, ముంపునీరు 5–6 రోజులకు మించి చేలల్లో ఉంటే మాత్రం పంటలకు నష్టం వాటిల్లే అవకాశముందని చెబుతున్నారు. నిజానికి.. సీజన్ ఆరంభం నుంచి రైతులు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఖరీఫ్ సాగుచేస్తున్నారు. ఇప్పటికే జులైలో కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతినడంతో నష్టపోయిన రైతులు రెండోసారి విత్తుకున్నారు. తాజాగా.. కురుస్తున్న వర్షాలు వారిని మరింత కలవరపెడుతున్నాయి.13 జిల్లాల్లో పంటలపై తీవ్ర ప్రభావం..రాష్ట్రంలోని 13 జిల్లాల్లో.. 135 మండలాల పరిధిలోని 581 గ్రామాల్లో భారీ వర్షాలవల్ల పంటలు ముంపునకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనా ప్రకారం శనివారం రాత్రికి 1.60 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 10 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్లు గుర్తించారు. ఇది ఇంకా ఎక్కువే ఉంటుందని క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం. ఈ వర్షాలు ఉభయ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, నంద్యాల, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. -
సాగు ఢమాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు గణనీయంగా పడిపోయింది. రాష్ట్రమంతా వర్షాలు పూర్తి స్థాయిలో పడకపోవడం, చెరువులు, కుంటలు నిండకపోవడం, ఇటీవలి కాలం వరకు జలాశయాల్లో తగినంత నీరు లేకపోవడం..తదితర కారణాలతో పంటల సాగు విస్తీర్ణం భారీగా పడిపోయిందని వ్యవసాయశాఖ వర్గాలు విశ్లేíÙస్తున్నాయి. గత ఏడాది వానాకాలంలో ఇదే సమయానికి సాగైన పంటలతో పోలిస్తే, ఈసారి ఏకంగా 15.30 లక్షల ఎకరాల మేరకు సాగు తగ్గిపోయింది. ఈ వానాకాలం సీజన్లో 1.34 కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరుగుతుందని పంటల ప్రణాళికలో వ్యవసాయశాఖ అంచనా వేసింది.అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని పేర్కొంది. కానీ ఆశించిన స్థాయిలో సాగు జరగక పోవడం ఆందోళన కలిగిస్తోంది. రైతుభరోసా కింద పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం, రుణమాఫీకి ముందు పంట రుణాలు ఇవ్వకపోవడం వంటి కారణాలు కూడా సాగు తగ్గడానికి కారణాలుగా రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే కొందరు రైతులు భూముల్ని కౌలుకు ఇవ్వకుండా వదిలేశారన్న చర్చ కూడా జరుగుతోంది. కౌలు రైతులకు పెట్టుబడి సాయం చేస్తే, తమకు రైతు భరోసా రాదని కొందరు రైతులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 8.79 లక్షల ఎకరాల మేర తగ్గిన వరి గతేడాది వానాకాలం సీజన్ ఇదే సమయానికి అన్ని పంటలు కలిపి 99.89 లక్షల (దాదాపు కోటి) ఎకరాల్లో సాగయ్యాయి. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 84.59 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే సాగు విస్తీర్ణం ఏకంగా 15.29 లక్షల ఎకరాల్లో విస్తీర్ణం తగ్గిందని వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వరి, పత్తి సాగు గణనీయంగా పడిపోయింది.గతేడాది వానాకాలంలో ఇదే సమయానికి 34.37 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడగా, ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 25.58 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. అంటే గతేడాదితో పోలిస్తే 8.79 లక్షల ఎకరాలు తగ్గింది. దీనిని బట్టి చూస్తే పంటల ప్రణాళిక ప్రకారం ఈ సీజన్లో 66 లక్షల ఎకరాల్లో సాగు సాధ్యమయ్యేలా కని్పంచడం లేదు. వరికి రూ.500 బోనస్ కేవలం సన్నాలకే ఇస్తామని ప్రభుత్వం చెప్పడం, ఆ వరి రకాల పేర్లను మొన్నమొన్నటి వరకు బహిరంగపరచకపోవడం, ఇప్పుడు వాటిని రైతులకు అందుబాటులో ఉంచకపోవడం తదితర కారణాలు ఏమైనా రైతులను గందరగోళపరిచాయా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. గతేడాది వానాకాలంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగవడం గమనార్హం. పత్తి సాగూ తగ్గింది.. పత్తి విషయానికొస్తే.. గతేడాది ఇదే సమయానికి 44.32 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈసారి కేవలం 41.65 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే 2.67 లక్షల ఎకరాల మేర విస్తీర్ణం తగ్గిందన్నమాట. వాస్తవానికి పత్తి సాగును 60 లక్షల ఎకరాలకు పెంచాలని, వీలైతే 70 లక్షల ఎకరాలకు పెంచినా మంచిదేనన్న అభిప్రాయంతో వ్యవసాయ శాఖ ఉంది. ఆ మేరకు ప్రణాళికలు వేసుకుంది.కానీ కీలకమైన సమయంలో రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంలో విఫలమైంది. అనేకమంది రైతులు విత్తనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు గతేడాది పత్తి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడంతో రైతులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉండిపోయారని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. ఇక గతేడాదితో పోలిస్తే మొక్కజొన్న సాగు 93,635 ఎకరాల్లో, కంది 35,176 ఎకరాల్లో, సోయాబీన్ 72,744 ఎకరాల్లో తగ్గింది. వనపర్తి జిల్లాలో 20.59 శాతమే సాగు రాష్ట్రంలో అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో 20.59 శాతమే పంటలు సాగయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 32.02 శాతం, ములుగు జిల్లాలో 32.57 శాతం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 41.67 శాతం, రంగారెడ్డి జిల్లాలో 44.89 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో అత్యంత ఎక్కువగా పంటల సాగు నమోదు కావడం గమనార్హం. ఆ జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 5,62,098 ఎకరాలు కాగా, 5,63,481 ఎకరాల్లో సాగైంది. జిల్లాల వారీగా వరి, పత్తి సాగు ఇలా.. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వరి నాట్లు ఊపందుకోలేదు. నల్లగొండ జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 2.54 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, ఇప్పుడు కేవలం 79,085 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. సూర్యాపేట జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 1.87 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, 97,087 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో గతేడాది 2.21 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, ఇప్పుడు కేవలం 1.50 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. మెదక్ జిల్లాలో గతేడాది 2.49 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, ఇప్పుడు కేవలం 1.22 లక్షల ఎకరాల్లోనే పడ్డాయి.ఇదేవిధంగా కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగాం, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో నాట్లు గణనీయంగా తగ్గాయి. ఇక పత్తి నల్లగొండ జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 5.86 లక్షల ఎకరాల్లో సాగైతే, ఈ ఏడాది ఇప్పటివరకు 5.22 లక్షల ఎకరాలకే పరిమితమైంది. నాగర్‌కర్నూలు జిల్లాలో గతేడాది 2.41 లక్షల ఎకరాల్లో సాగైతే, ఇప్పుడు 1.89 లక్షల ఎకరాలకే పరిమితమైంది. నారాయణపేట జిల్లాలో గతేడాది 2.02 లక్షల ఎకరాల్లో సాగవగా, ఇప్పుడు 1.65 లక్షల ఎకరాలకే పరిమితమైంది. జనగామలో గతేడాది ఇదే సమయానికి 1.35 లక్షల ఎకరాల్లో సాగవగా, ఇప్పుడు కేవలం 97,225 ఎకరాల్లోనే సాగైంది. సంగారెడ్డి, పెద్దపల్లి, నిర్మల్ తదితర జిల్లాల్లోనూ పత్తి సాగు తగ్గింది. వర్షాల కోసం చూస్తున్నా.. నాకు నాలుగున్నర ఎకరాల సొంత పొలం ఉంది. ఏటా మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకుంటా. నాలుగున్నర ఎకరాల్లో మెట్ట పంటలు వేసి మిగతా 20 ఎకరాల్లో వరి సాగు చేస్తా. అయితే ముసురు వర్షాలకు కారణంగా ఇప్పటివరకు మూడెకరాల్లోనే వరి నాట్లు వేశా. మిగిలిన 17 ఎకరాల సాగుపై ఎటూ తోచడం లేదు. ప్రస్తుతానికైతే మరో పదెకరాల వరకు నారుమడి సిద్ధం చేసుకున్నా. కానీ ఇదే పరిస్థితి ఆగస్టు నెలాఖరు వరకు ఉంటే వేసిన మూడెకరాల వరి కూడా పండదు. అందుకే భారీ వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాం. – మల్లు వెంకటేశ్వర్‌రెడ్డి, మాచన్‌పల్లి, మహబూబ్‌నగర్ జిల్లా 15,131చెరువులు ఖాళీరాష్ట్రంలో 34,716 చెరువులు, కుంటలున్నాయి. అందులో 3,247 చెరువులు ఇటీవలి వర్షాలతో అలుగు పోస్తున్నాయి. 6,735 చెరువులు నిండుగా నీటితో కళకళలాడుతున్నాయి. 3,438 చెరువుల్లో 50 నుంచి 75% నీటి నిల్వలున్నాయి. 6,165 చెరువుల్లో మాత్రం 25 నుంచి 50% మాత్రమే నీరు చేరింది. 15,131 చెరువుల్లో నీటి నిల్వలు ఇంకా 25% లోపలే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 61.34 శాతం చెరువుల్లో 50% కంటే తక్కువగానే నీటినిల్వలున్నాయి. -
రైతులకు రేవంత్ మోసం.. ప్రతిపక్షాలు ఫైర్
-
తెలంగాణలో సన్నబియ్యం రాజకీయం..
-
సన్న బియ్యం పెద్ద లొల్లి
-
సీఎం జగన్ కోసం.. వరి పంటతో భారీ గజమాల..!
-
భారత హాకీ జట్టు శిక్షణ బృందంలో ప్యాడీ ఆప్టన్
పారిస్ ఒలింపిక్స్ సమయంలో భారత పురుషుల హాకీ జట్టు సభ్యుల మానసిక దృఢత్వం కోసం... దక్షిణాఫ్రికాకు చెందిన విఖ్యాత మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ సేవలు తీసుకోవాలని హాకీ ఇండియా నిర్ణయం తీసుకుంది. 2011లో వన్డే ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన భారత క్రికెట్ జట్టుకు ప్యాడీ ఆప్టన్ మెంటల్ కండీషనింగ్ కోచ్‌గా ఉన్నారు. ఇటీవల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా క్రీడల సమయంలోనూ ఆప్టన్ భారత హాకీ జట్టు వెంబడి ఉన్నారు. -
రివైండ్ 2023.. 'వెలుగు' నీడలు..
ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయ్యింది. ఒకేసారి ఏడు ప్రభుత్వ కాలేజీల ప్రారం¿ోత్సవం, వచ్చే సంవవత్సరానికి మరో ఏడు జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా వైద్యవిద్యకు పెద్దపీట వేశారు. ఇది సాకారం అయితే దేశంలోనే ప్రతిజిల్లాలోనూ మెడికల్ కాలేజీలున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కుతుంది. సాగునీటిరంగంలో కాళేశ్వం ప్రాజెక్టు లోపాలు పెద్ద కుదుపుగా చెప్పవచ్చు. పింఛన్లు పెంపు ఆసరా లబ్ధిదారులకు కొంత ఊరట కలిగించింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. బదిలీలు, పదోన్నతులకు బ్రేక్ పడింది. కేంద్రంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘర్షణ వైఖరి కారణంగా ఉపాధి హామీ నిధుల విడుదలలో జాప్యం జరిగింది. వైద్య, ఆరోగ్యశాఖ ఈ ఏడాది సాధించిన ప్రధాన విజయాల్లో కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించడంగా చెప్పవచ్చు. 2023–24 సంవత్సరంలో కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. ఈ ఏడాది ఇప్పటికే మెడికల్ విద్యార్థులు వాటిల్లో చేరారు. ఇక 2024–25 సంవత్సరంలోనూ జోగుళాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఒక్కో కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోనుంది. అంటే 800 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. 33 జిల్లాలకుగాను ఇప్పటికే 25 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకాగా, తాజాగా అనుమతించిన 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే అన్ని జిల్లాల్లో ఒక మెడికల్ కాలేజీ లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకుంటుంది. ఇవి పూర్తయితే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య మొత్తం 34కు చేరుతుంది. తాజా నిర్ణయంతో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండే ఏకైక రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నట్టే. అంటే మొత్తంగా రాష్ట్రంలో 10 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. పీఆర్ అండ్ ఆర్డీ పింఛన్ రూ. 3,016 నుంచి రూ.4,016కు పెంపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ విషయానికొస్తే..ప్రధానంగా ఆసరాలో భాగంగా దివ్యాంగుల పింఛన్ రూ.3,016 నుంచి రూ. 4,016కు బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది. పెంపునకు అనుగుణంగా 5,11,656 మందికి నెలకు రూ.205.48 కోట్లు అందజేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ♦ జీపీలు, సర్పంచ్‌లకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధుల విడుదలలో జాప్యం గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎప్పటికప్పుడు రావాల్సిన నిధులు విడుదల కాకపోవడంతో పలు జీపీల్లో సర్పంచ్‌లు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు. వివిధ పనుల కోసం సొంత నిధులు ఖర్చు చేసినా ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాలేదు. ఈ బిల్లుల కోసం ఎదురుచూస్తూ, ఆర్థిక ఇబ్బందుల్లో మునిగి కొందరు సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారు. ♦ జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లోనూ నిధుల సమస్య ఉపాధి హామీ అమల్లో భాగంగా... తెలంగాణలో నియమ,నిబంధనలు, మార్గదర్శకాలు సరిగ్గా పాటించడం లేదంటూ రాష్ట్రానికి కేంద్రం నిధులు నిలిపేసింది. అయితే కేంద్రం పక్షపాతం ప్రదర్శిస్తూ సకాలంలో నిధులు విడుదల చేయడం లేదంటూ బీఆర్ఎస్ సర్కార్ విమర్శలు సంధించింది. ఇదిలా ఉంటే...ఈ పథకంలో భాగంగా ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్, ఔట్సోర్సింగ్–కాంట్రాక్ట్ పద్ధతుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి గత రెండు, మూడు నెలలుగా వేతనాలు విడుదల కాకపోవడంతో వీరిలో తీవ్ర ఆందోళన నెలకొంది. మా‘స్టార్’ ఏదీ? ♦ సాగని పదోన్నతులు... ఆగిన బదిలీలు ఆఖరులో తప్పని ♦ టెట్ చిక్కులు.. టీచర్ పోస్టులకూ బ్రేకులు ♦ ఉన్నత విద్యామండలిలో మహా నిశ్శబ్దం దీర్ఘకాలిక డిమాండ్ అయిన బదిలీలు, పదోన్నతులుపై ఆశలు రేకెత్తిందీ ఈ ఏడాదే. 10 వేలమంది టీచర్లు ప్రమోషన్లపై కలలుగన్నారు. దాదాపు 50 వేలమంది స్థానచలనం ఉంటుందని ఆశించారు. కానీ నోటిఫికేషన్ ఇచ్చిన ఊరట ఎంతోకాలం నిలవలేదు. అడ్డుపడ్డ కోర్టు వ్యాజ్యాలు టీచర్ల ఆనందాన్ని ఆవిరి చేసింది. ప్రమోషన్లకూ బ్రేకులు పడటం 2023 మిగిల్చిన చేదు జ్ఞాపకమే. ఉపాధ్యాయ కొలువుల భర్తీపై నిరుద్యోగుల గంపెడాశలకు 2023 నీళ్లు చల్లింది. విద్యాశాఖలో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నా, 5 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ రావడం, అదీ అర్ధంతరంగా ఆగిపోవడం నిరుద్యోగులకు 2023 అందించిన ఓ పీడకల. జాతీయ ర్యాంకుల్లో మన విశ్వవిద్యాలయాల వెనుకబాటు, యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ కోసం జరిగిన ఉద్యమాలు దూరమయ్యే కాలంలో కని్పంచిన దృశ్యాలు. బాసర ట్రిపుల్ ఐటీలో వెంటవెంట జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు విద్యార్థిలోకాన్ని కలవరపెట్టాయి. టెన్త్ పరీక్షల సరళీకరణ, ఇంటర్ పరీక్షల్లో మార్పులకు శ్రీకారం 2023లో కనిపించిన కొత్తదనం. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఉన్నత విద్యామండలిలో కుదుపులకు గతించే కాలమే సాక్షీభూతమైంది. మండలి చైర్మన్, వైస్‌చైర్మన్ తొలగింపుతో కార్యకలాపాలే మందగించిపోవడం ఈ ఏడాదిలో ఊహించని పరిణామమే. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు విద్యార్థులు పోటెత్తడం ఈ సంవత్సరంలో కనిపించిన విశేషం. కరోనా కాలం నుంచి ఆటుపోట్లు ఎదుర్కొంటున్న జేఈఈ మెయిన్ కాస్తా గాడిలో పడింది. రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి ♦ 2022–23 సీజన్లో వరి ఉత్పత్తి ♦ 2.58 కోట్ల టన్నులు రికార్డులు బద్దలు కొట్టిన తెలంగాణ వ్యవసాయరంగం రాష్ట్రంలో వరి ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరిగింది. 2022–23 వానాకాలం, యాసంగి సీజన్లలో వరి ధాన్యం 2.58 కోట్ల టన్నులు ఉత్పత్తి అయ్యింది. వానాకాలం సీజన్లో 1.38 కోట్ల టన్నులు, యాసంగిలో 1.20 కోట్ల టన్నులు ఉంది. ఈ మేరకు తుది నివేదికను ఈ ఏడాది ప్రభుత్వం విడుదల చేసింది. వానాకాలం సీజన్లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఉత్పాదకత ఎకరానికి 2,124 కిలోలు వచ్చింది. కాగా, ఈ యాసంగిలో 57.46 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వరి ఉత్పాదకత ఎకరానికి 2,091 కిలోలు వచ్చింది. మొత్తంగా చూస్తే ఈ రెండు సీజన్లలో 1.22 కోట్ల ఎకరాల్లో వరి సాగు కాగా, ఎకరానికి 2,108 కిలోల ఉత్పాదకత వచ్చింది. ఆ మేరకు 2.58 కోట్ల టన్నుల వరి ఉత్పత్తి అవుతుందని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం గత మార్చి 15వ తేదీన విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణ వరి ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. కాగా, ఈ ఏడాది వరకు 11 విడతల్లో కలిపి రైతుబంధు కింద రైతులకు పెట్టుబడి సాయం రూ. 72,815 కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం 12వ విడత సొమ్మును కొత్త ప్రభుత్వం అందజేసే ప్రక్రియ చేపట్టింది. అందులో ఒక ఎకరాలోపు రైతులకు రైతుబంధు సొమ్ము అందజేస్తున్నారు. కాళేశ్వరం ‘కుదుపు’ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో మసకబారిన గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చివరకు బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టను కుంగదీసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో బయటపడిన లోపాలు.. 2023 చివరి త్రైమాసికంలో రాష్ట్ర రాజకీయాలను కుదిపివేశాయి. మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ పియర్లు గత అక్టోబర్ 21వ తేదీన కుంగిపోగా, కొన్ని రోజులకే అన్నారం బ్యారేజీలో బుంగలు ఏర్పడ్డాయి. ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకులోని పియర్లు కుంగినట్టు ..నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. 7వ బ్లాక్‌ను పూర్తిగా పునర్నిర్మించాల్సిందేనని సిఫారసు చేసింది. ఇతర బ్లాకులూ విఫలమైతే బ్యారేజీని పూర్తిగా పునర్నిర్మించక తప్పదని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకి సైతం ఇలాంటి డిజైన్లు, నిర్మాణ పద్ధతులనే అవలంబించడంతో భవిష్యత్‌లో వాటికి సైతం ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చని ఎన్డీఎస్ఏ ఆందోళన వ్యక్తం చేసింది. అన్నారం బ్యారేజీ పునాదుల (రాఫ్ట్) కింద నిర్మించిన కటాఫ్ వాల్స్కి పగుళ్లు రావడంతోనే బ్యారేజీకి బుంగలు ఏర్పడినట్టు ఎన్డీఎస్ఏ బృందం మరో నివేదికలో స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను సొంత ఖర్చులతో చేస్తామని గతంలో హామీ ఇచ్చిన నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే మాట మార్చింది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ విషయం ఎవరు చేపట్టాలని అన్న అంశంపై ఎల్అండ్ టీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇంకా ఎలాంటి అంగీకారం కుదరలేదు. మిల్లుల్లోనే రూ. 22 వేల కోట్ల విలువైన బియ్యం పేదలకు ఉచిత బియ్యం పంపిణీతో పాటు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించే బృహత్తర బాధ్యత నిర్వహిస్తున్న పౌరసరఫరాల శాఖ 2023లో కొన్ని తప్పటడుగులు వేసింది. తద్వారా కార్పొరేషన్‌కు అప్పులు గుదిబండగా మారాయి. 2022 రబీ(యాసంగి)లో రైతుల నుంచి సేకరించిన సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి అప్పగించకపోవడంతో ఆ భారం సంస్థపై పడింది. యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయడం వల్ల బియ్యం విరిగి తమకు నష్టం వస్తుందని, అందుకే మిల్లింగ్ చేయలేమని రైస్‌మిల్లర్ల వాదనను అంగీకరించింది. మిల్లర్ల పట్ల ఉదారత చూపి, ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రయత్నించగా, ఎన్నికల సంఘం బ్రేక్ వేయడంతో మిల్లుల్లోనే 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉండిపోయాయి. వీటితో పాటు అంతకు ముందు లెక్క తేలని ధాన్యం కలిపి సుమారు రూ. 22వేల కోట్ల విలువైన 83 ఎల్ఎంటీ ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్లు మిల్లర్లు చూపారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే ఈ లెక్కలు తీసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌరసరఫరాల సంస్థ ఏకంగా రూ.56వేల కోట్ల అప్పులు ఉన్నట్లు లెక్కలు చెప్పారు. ఇవి కాకుండా రూ. 11వేల కోట్లు సంస్థ నష్టపోయినట్లు తేల్చారు. మిల్లర్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరించిన కారణంగా 2023లో ఆ సంస్థ ప్రజల్లో పలుచనైపోయిందన్న వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. -
రైతుల ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సరఫరా
-
Video: ఆసక్తికర వీడియోను షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత
సాక్షి, నిజామాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో ఆసక్తికర పోస్టు చేశారు. ఆమె ప్రయాణిస్తున్నదారిలో రోడ్డు పక్కన ఆరబోసిన వరి ధాన్యపు రాశులను చూసిన కవిత.. తన ఫోన్లో చిత్రీకరించి, ట్విట్టర్లో షేర్ చేశారు. ఎన్నికల ప్రచారారంలో భాగంగా ఎమ్మెల్సీ కవిత శుక్రవారం నిజామాబాద్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో.. ఆర్మూర్‌లోని సిద్దులగుట్ట వద్ద రోడ్డుకు ఇరువైపులా రైతులు వడ్లను ఆరబెట్టారు. వీటిని చూసి మురిసిపోయిన కవిత.. ఈ దృశ్యాలను తన ఫోన్లో చిత్రీకరించారు. “ధాన్యపు రాశుల తెలంగాణ. అప్పుడు ఎట్లుండే తెలంగాణ..!! ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ !!” అంటూ రోడ్డు పక్కన ఆరబోసిన వరి ధాన్యపు రాశుల వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు. ధాన్యపు రాశుల తెలంగాణ !!! అప్పుడు ఎట్లుండే తెలంగాణ !! ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ !! enroute to Jagityal ... This scene is at siddula gutta, Armur. Same scene across Telangana !! Jai Telangan !! Jai KCR !! Vote For CAR to continue the growth story of Telangana !!!… pic.twitter.com/BSK7hxG4tA — Kavitha Kalvakuntla (@RaoKavitha) November 18, 2023 -
వరికి బదులుగా ఆరుతడి పంటల సాగు
-
ఏపీలో ధాన్యం ఉత్పత్తి వ్యయం తక్కువే
సాక్షి, అమరావతి: ధాన్యం ఉత్పత్తి వ్యయం పంజాబ్ తరువాత ఆంధ్రప్రదేశ్‌లోనే తక్కువగా ఉంది. దేశ సగటుతో పోల్చినా రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి వ్యయం తక్కువగానే ఉంది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల్లో వెల్లడించింది. పంజాబ్‌లో క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి వ్యయం రూ.808 ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,061గా నమోదైంది. దేశంలో క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి సగటు వ్యయం రూ.1,360 ఉన్నట్టు తెలిపింది. వ్యవసాయ భూమి లీజుతోపాటు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలు, కుటుంబ సభ్యుల శ్రమ, పశువుల శ్రమ, ఇరిగేషన్ చార్జీలు, పెట్టుబడి వ్యయం, వడ్డీలను కలిపి రాష్ట్రాల వారీగా 2022–23లో ధాన్యం క్వింటాల్ ఉత్పత్తి వ్యయాన్ని వెల్లడించింది. ప్రభుత్వ చర్యలే కారణం రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలోనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి సేద్యానికి అవసరమైన అన్నిరకాల ఇన్‌పుట్స్‌ను రైతులకు అందుబాటులోకి తెచ్చింది. సబ్సిడీపై విత్తనాలను అందించడంతో పాటు వైఎస్సార్ రైతు భరోసా కింద వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందిస్తోంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు చేయడంతోపాటు ప్రకృతి వైపరీత్యాలకు పంటలు దెబ్బతింటే ఆ సీజన్ దాటకుండానే ఇన్పుట్ సబ్సిడీ అందిస్తోంది. కూలీలకు బదులుగా వ్యవసాయ పరికరాలను వినియోగించడాన్ని ప్రోత్సహించడంతో సేద్యం వ్యయం తగ్గుతోంది. వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల ద్వారా 50 సబ్సిడీతో వ్యవసాయ పరికరాలను అందిస్తోంది. యంత్ర పరికరాల వినియోగం కారణంగా ఉత్పత్తి వ్యయం తగ్గుతోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తుండటం, మెరుగైన వ్యవసాయ పద్ధతుల కారణంగా ధాన్యం ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటోంది. దేశంలో ఎక్కువగా ధాన్యం పండించే రాష్ట్రాల్లో పంజాబ్, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండగా మహారాష్ట్రలో క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి వ్యయం అత్యధికంగా ఉంది. ఆ తరువాత పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడుల్లో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉంది. వరి పండించే రాష్ట్రాల్లో పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి వ్యయం మిగతా రాష్ట్రాల కన్నా తక్కువగా ఉంది. -
Fact Check: వాస్తవాలకు మసిపూసి ‘ఈనాడు’ విష ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి రైతుకు విత్తు నుంచి విక్రయం వరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోంది. వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు దక్కేలా కృషి చేస్తోంది. ఏ సీజన్‌కు ఆ సీజన్ ముందుగానే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను గ్రామ స్థాయిలోనే రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ద్వారా అందిస్తోంది. దీంతో రైతులపై రవాణా చార్జీల భారం తప్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కామన్ వెరైటీ, గ్రేడ్–ఏ రకాల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తూ బాసటగా నిలుస్తోంది. ఇలా ప్రతి దశలోనూ రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంటే వాస్తవాలకు ముసుగేసి ‘ఈనాడు’ తనదైన శైలిలో విషం చిమ్ముతోంది. ప్రభుత్వ సహకారాన్ని ప్రస్తావించకుండా, ఇతర రాష్ట్రాల్లో బోనస్ అంటూ రైతులను తప్పుదోవ పట్టించేలా ‘వరి రైతుకు మిగిలేదేంటి?’ శీర్షికన ఓ కథనాన్ని వండివార్చింది. ఇందులో నిజానిజాల్లోకి వెళితే.. ఆరోపణ: 2022–23లో 9 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గింది. వాస్తవం: రాష్ట్రంలో వరి సాధారణ విస్తీర్ణం ఖరీఫ్‌లో 38.8 లక్షల ఎకరాలు, రబీలో 19.92 లక్షల ఎకరాలు.. అంటే మొత్తం విస్తీర్ణం 58.72 లక్షల ఎకరాలు. కాగా 55.52 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అంటే వ్యత్యాసం 3.20 లక్షల ఎకరాలు. రబీలో బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలను ప్రభుత్వం ప్రోత్సహించడంతో 1.15 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు, 50 వేల ఎకరాల్లో చిరుధాన్యాలు, మొక్కజొన్న, నూనెగింజల సాగు విస్తీర్ణం పెరిగింది. మరో 35 వేల ఎకరాల్లో మత్స్య సాగు విస్తరించింది. మిగిలిన భూమిని ఇళ్ల స్థలాల కోసం సేకరించారు. వాస్తవం ఇలా ఉంటే ఏకంగా 9 లక్షల ఎకరాలు తగ్గిపోయిందంటూ ‘ఈనాడు’ వక్రభాష్యం చెప్పింది. ఆరోపణ: క్వింటా రూ.3,126 ప్రతిపాదిస్తే ఎందుకు తగ్గించారు? వాస్తవం: పెట్టుబడి ఖర్చుల ఆధారంగా దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు పంటల వారీగా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని ప్రతిపాదిస్తాయి. ఇలా మన రాష్ట్రంలో ఖరీఫ్‌లో ఎకరాకు రూ.32 వేలు, రబీలో రూ.41 వేలు ఖర్చవుతుందన్న అంచనాతో క్వింటా రూ.3,126గా ఎంఎస్పీ నిర్ణయించాలని కేంద్రానికి నివేదిక పంపింది. ఇదే రీతిలో పంటల వారీగా ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో రీతిలో వచ్చే ప్రతిపాదనలన్నీ క్రోడీకరించుకొని పంట కాలానికయ్యే సాగు ఖర్చును సరాసరి లెక్కించి పంటల వారీగా అన్ని రాష్ట్రాలకు ఒకే రకమైన మద్దతు ధరను కేంద్రం ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అదే రీతిలో 2023–24 సీజన్‌కు సాధారణ రకానికి క్వింటాకు రూ.2,183, గ్రేడ్–ఏ రకానికి రూ.2,203గా కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ విధి ప్రతిపాదనలు పంపించడం వరకే. నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదేనన్న విషయం రామోజీకి తెలియనట్లుంది కాబోలు. ఆరోపణ: బోనస్ ఇవ్వాలన్న ఆలోచనే మరిచారు వాస్తవం: కేరళ, తమిళనాడు, జార్ఖండ్ వరికి బోనస్ ఇస్తున్నాయంటూ ‘ఈనాడు’ కొత్త వాదన తీసుకొ చ్చింది. మరి బోనస్ ఇస్తున్నా ఆయా రాష్ట్రాల్లో వరి సాగు ఎందుకు పెరగడం లేదు? ఏపీలో 24 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుంటే కేరళలో 1.98 లక్షల హెక్టార్లు, జార్ఖండ్‌లో 13.57 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 19 లక్షల హెక్టార్లలో మాత్రమే వరిసాగవుతోంది. ఇక దిగుబడిని పరిశీలిస్తే ఏపీలో ఎకరాకు 23.24 క్వింటాళ్ల్ల దిగుబడి (2022–23) వస్తుంటే, తమిళనాడులో 17, జార్ఖండ్‌లో 9, కేరళలో 13 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ఎంతగా ప్రోత్సహిస్తున్నా, వరిసాగు కంటే ఎక్కువ ఆదాయం వచ్చే పంటల వైపు అక్కడి రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే కేరళ.. ఏటా మన గోదావరి జిల్లాల్లో సాగయ్యే బోండాల కోసం క్యూ కడుతుంటే, తమిళనాడు.. రాయలసీమ జిల్లాల్లో సాగయ్యే ఫైన్ వెరైటీ, జార్ఖండ్.. ఉత్తరాంధ్రలో సాగయ్యే ఫైన్ వెరైటీ ధాన్యం కొనుగోలుకు ఎగబడుతున్నాయి. సాధారణంగా డిమాండ్ కంటే తక్కువ ఉత్పత్తి ఉన్న పంటల సాగును ప్రోత్సహించాలన్న సంకల్పంతోనే బోనస్ ప్రకటిస్తుంటారు. మన రాష్ట్రంలో డిమాండ్‌కు మించి ఉత్పత్తి జరుగుతోంది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క సీజన్లో కూడా ఒక్క రూపాయి బోనస్ ప్రకటించిన పాపాన పోలేదు. అయినా ఇదేంటని రామోజీ అప్పట్లో ఏనాడైనా ప్రశ్నించారా? ఆరోపణ: మిల్లర్లకు ఎదురు సొమ్ము ఇవ్వాల్సి వస్తోంది వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో మిల్లర్లు, దళారీల కనుసన్నల్లోనే ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకే ధాన్యం సేకరణ జరిగేది. ఏనాడూ ఏ ఒక్క రైతుకు కూడా ఎమ్మెస్పీ దక్కిన దాఖలాలు లేవు. కానీ నేడు దళారీలు, మిల్లర్ల ప్రమేయం కూడా లేకుండా ప్రతి గింజను కనీస మద్దతు ధరకే ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం ఆర్బీకేలన్నింటిని ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా గుర్తించింది. నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తోంది. కొనుగోలు చేసిన ధాన్యంలో మంచి రకాలను ఎంపిక చేసి అదనపు ఖర్చుల కింద క్వింటాకు రూ.110 వెచ్చించి నాణ్యమైన బియ్యంగా మార్చి కార్డుదారులకు ఇంటి వద్దే అందిస్తోంది. ఇవేమీ ‘ఈనాడు’కు కనిపించడం లేదు. ఆరోపణ: వరి రైతుకు కనీస మద్దతు ధర దక్కడం లేదు వాస్తవం: చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 17,94,279 మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2,65,10,747 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. బాబు హయాంలో తక్కువ మంది రైతుల వద్ద నుంచి ఎక్కువ మొత్తం ధాన్యం సేకరించేవారు. ఉదాహరణకు 2014–15లో 1.18 లక్షల మంది రైతుల నుంచి రూ.5,583 కోట్ల విలువైన 40.62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. నూటికి 90 శాతం సన్న, చిన్నకారు రైతులున్న ఈ రాష్ట్రంలో ఈ స్థాయిలో ధాన్యం అమ్మారంటే వార్ని ఏమంటారో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ఏకంగా 32,76,354 మంది రైతుల నుంచి రూ.58,739 కోట్ల విలువైన 3,10,56,117 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. గతంతో పోలిస్తే ధాన్యం అమ్ముకున్న రైతుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. ఆరోపణ: అమ్మాలంటే అగచాట్లు వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని బస్తా (75 కిలోలు)కు మద్దతు ధర కంటే రూ.200 నుంచి రూ.500 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరాకు తక్కువలో తక్కువ 30–33 బస్తాల దిగుబడి వేసుకున్నా రూ.6 వేలకు పైగా రైతులు నష్టపోయేవారు. అంతేకాకుండా దళారులు, వ్యాపారులు తేమ శాతం పేరిట ఇష్టమొచ్చినట్టు కోత పెట్టేవారు. కానీ ప్రస్తుతం జిల్లాకో మొబైల్ మిల్లును పంపి రైతుల ఎదుటే శాంపిల్స్ పరీక్షించి మరీ కొనుగోలు చేశారు. ముక్క విరుగుడు ధాన్యాన్ని బాయిల్డ్ రకంగా పరిగణించి మరీ కొన్నారు. గత ఖరీఫ్ సీజన్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను తేమ, నూక శాతాలతో సంబంధం లేకుండా కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. బోనస్‌కు మించి జీఎల్టీ రైతు ప్రయోజనార్థం రైతు భరోసా కేంద్రాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రంగా గుర్తించింది. అంతటితో ఆగకుండా రైతు పొలం నుంచే నేరుగా కొనుగోలు చేసేందుకు అదనపు ఖర్చులు భరించింది. మునుపెన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలులో గోనె సంచులు, హమాలి.. రవాణా చార్జీలు మద్దతు ధరతో పాటు కలిపి చెల్లిస్తోంది. ఒక్కో గోనె సంచి ఖరీదు రూ.70. ఈ లెక్కన ఒక టన్ను ధాన్యం నిల్వ చేసేందుకు గోనె సంచుల కోసం రూ.1,750 ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. హమాలి ఖర్చు టన్నుకు రూ.220, రవాణాకు రూ.468 (25 కి.మీ పరిధిలో) చొప్పున.. మొత్తంగా టన్నుకు రూ.2,523 చొప్పున ప్రభుత్వం జీఎల్టీ (గన్నీ బాగులు, లేబర్, ట్రాన్స్పోర్ట్) రూపంలో ఖర్చు చేస్తోంది. ఈ మొత్తం ధాన్యం కొనుగోలు సొమ్ముతో కలిపి రైతు ఖాతాల్లో జమ చేస్తోంది. చదవండి: Fact Check: అసత్యాల్లో నిండా మునిగిన ‘ఈనాడు’ ఇది ఆయా రాష్ట్రాల్లో ఇచ్చే బోనస్‌తో పోల్చుకుంటే చాలా ఎక్కువ. పైగా పక్క రాష్ట్రాల్లో పరిమితికి లోబడే కొనుగోలు చేస్తారు. మన రాష్ట్రంలో మాత్రం ఆర్బీకే వద్దకు వచ్చిన ప్రతి రైతు నుంచి ఈ–క్రాప్ ఆధారంగా ధాన్యం కొనుగోలు చేస్తుండటం బహిరంగ రహస్యం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోని ఈనాడు ప్రభుత్వంపై పనిగట్టుకుని బురద చల్లడమే లక్ష్యంగా అర్ధసత్య కథనాలు ఎవరి కోసం రాస్తోంది? -
ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచన.. ఐడియా భలే ఉందే!
ఎండలతో బయటకు రావాలంటేనే జనం జంకుతున్న పరిస్థితుల్లో.. ఆటోడ్రైవర్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ ఆటోడ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. బస్తాలో వడ్ల గింజలు వేయడంతో అవి మొలకెత్తాయి. దీంతో నారుతో కూడిన బస్తాలను ఆటో టాప్‌పై వేయగా.. ఎండ వేడి నుంచి ఉపశమనం లభిస్తోందని చెప్పాడు. మహబూబాబాద్ జిల్లా నుంచి అద్దెపై ఖమ్మం వచ్చిన ఆటోడ్రైవర్‌ను పలకరించగా.. గంటకోసారి బస్తాను నీటితో తడుపుతుండడంతో తనతో ప్రయాణికులు సేదదీరుతున్నారని తెలిపాడు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం -
అబ్బాయిపాలెంలో రోడ్డెక్కిన రైతులు
-
అన్నదాతకు భరోసా.. తక్షణమే ఆదుకోవాలంటూ సీఎం వైఎస్ జగన్ ఆదేశం
కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చే వేళ కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ ప్రత్యేక అధికారులు, స్థానిక అధికారులు రంగంలోకి దిగారు. ప్రచారానికి దూరంగా, పనికి ప్రాధాన్యత ఇస్తూ చేపట్టాల్సిన చర్యలన్నీ వెనువెంటనే తీసుకుంటూ ధాన్యం కొనుగోలుకు ఉపక్రమించి, రైతులకు భరోసా కల్పిస్తున్నారు. ఇదివరకెన్నడూ లేని విధంగా కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా ప్రభుత్వమే గన్నీ సంచులు, లేబర్, రవాణా చార్జీల కోసం నిధులు విడుదల చేయడం ద్వారా మరో అడుగు ముందుకు వేసి ఆదుకుంటోంది. ఈ వాస్తవాలను స్థానికంగా రైతులు నిర్ధారిస్తున్నప్పటికీ.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మాత్రం ఎప్పటిలాగే అబద్ధాలతో కూడిన ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రచారం కోసం పాకులాడుతున్నారు. ఆయన హయాంలో గన్నీ సంచుల కోసం, రవాణా కోసం, లేబర్ కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించిన పాపాన పోలేదు. ఈ విషయాన్ని దాచిపెట్టి.. ‘నేనొచ్చే వరకు గోతాలకూ దిక్కులేద’ని రైతులను రెచ్చగొట్టి.. రాజకీయ లబ్ధి పొందాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుత సహాయ కార్యక్రమాల్లో గత చంద్రబాబు ప్రభుత్వంలా ప్రచారార్భాటం లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టడం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. తక్షణ స్పందన రాష్ట్రంలో రబీలో 54 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సకాలంలో విత్తనాలు, సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉంచడంతో రైతులు సాగు వేళ ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. గత రబీ కంటే మిన్నగా 86.64 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశారు. ముఖ్యంగా ధాన్యం 54.23 లక్షల టన్నులు, మొక్కజొన్న 18.44 లక్షల టన్నులు, జొన్నలు 2.02 లక్షల టన్నులు వస్తాయని లెక్కలేశారు. కోతలు మొదలయ్యే సమయంలో.. దాదాపు రాష్ట్రమంతా 40 శాతం మాసూళ్లు కూడా పూర్తవని దశలో అనూహ్యంగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు రైతులను ఆందోళనకు గురిచేశాయి. రైతుల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగింది. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లోని టోల్ ఫ్రీ నంబర్ 155251తో పాటు ధాన్యం కొనుగోలు సందర్భంగా తలెత్తే సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ 1967ను ఏర్పాటు చేశారు. ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తూనే ఎవరు ఫోన్ చేసినా, క్షణాల్లో స్పందించేలా ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ దిశా నిర్ధేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంఓ, వ్యవసాయ ఉన్నతాధికారులతో రోజువారీ సమీక్షించడమే కాకుండా, ఎప్పటికప్పుడు అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో ప్రత్యేకాధికారులతో పాటు మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా రంగంలోకి దిగారు. శాస్త్రవేత్తలు, సంబంధిత అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు గ్రామ స్థాయిలో పర్యటిస్తూ పంట నష్టం తీవ్రతను తగ్గించేందుకు రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. వాట్సప్ గ్రూపుల ద్వారా చిన్న చిన్న వీడియో సందేశాలను పంపిస్తూ పంటను ఏ విధంగా కాపాడుకోవాలో అర్థమయ్యే రీతిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాకొక ఐఏఎస్ అధికారి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లాకో సీనియర్ ఐఎఎస్ అధికారిని నియమించగా, వారంతా గత మూడు రోజులుగా ఆయా జిల్లాల్లో మకాం వేశారు. ముంపు ప్రభావం ఉన్న గ్రామాల్లో పర్యటిçస్తూ రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టారు. మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పల్లెల్లో పర్యటిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. కల్లాల్లోని ధాన్యం రవాణాలో సమస్య రాకుండా జిల్లాకు రూ.కోటి చొప్పున కార్పస్ ఫండ్‌ను విడుదల చేశారు. ప్రభావిత జిల్లాల్లో ధాన్యం కొనుగోలుకు గన్నీ సంచుల కొరత లేకుండా చర్యలు చేపట్టారు. పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గన్నీ బ్యాగ్స్‌ను ముంపు ప్రభావిత జిల్లాలకు తరలించారు. ఇప్పటికే 40–50 శాతం మేర వరి కోతలు పూర్తి కాగా, మిగిలింది పంటపై ఉంది. జొన్న, మొక్కజొన్నలు కూడా 50–60 శాతం వరకు కోతలు పూర్తయ్యాయి. మిగిలిన పంటను మిషన్లపై కోసేలా అవగాహన కల్పిస్తున్నారు. 3 రోజుల్లో 80 వేల టన్నుల కొనుగోలు రబీలో 30 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా 2,636 ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 66 వేల మంది రైతుల నుంచి రూ.1315 కోట్ల విలువైన 6.18 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తున్నారు. వాటిని బాయిల్డ్ రకాలుగా గుర్తించి మద్దతు ధర కల్పిస్తున్నారు. ఇప్పటికే కోతలు పూర్తయి పంటలో 70 శాతం సేకరించగా మిగిలింది రెండ్రోజుల్లో కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గత మూడు రోజుల్లో సుమారు 80 వేల టన్నులు సేకరించారు. మొలక 7–10 శాతం ఉన్నా సరే.. మార్చిలో కురిసిన వర్షాలు, ఏప్రిల్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల అధిక తేమ శాతం, గింజ విరుగుడు సమస్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల బారిన పడి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో పెద్ద ఎత్తున ధాన్యం రాశులు తడిచిపోయాయి. రైతులు వాటిని ఆరబెట్టు కోలేని పరిస్థితుల నేపథ్యంలో నేరుగా ఆఫ్‌లైన్‌లో (వాస్తవానికి పూర్తిగా ఆన్లైన్లో) కొనుగోలు చేస్తున్నారు. వాటిని బాయిల్డ్ రకంగా పరిగణించి బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నారు. సాధారణంగా 5 శాతం మొలక ధాన్యానికి మినహాయింపు ఉంటుంది. వర్షాల వల్ల ప్రస్తుతం మొలక శాతం 7–10 వరకు ఉంటోంది. అయినా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అవసరమైన చోట్ల ఉపాధి కూలీలతో పంట పొలాల్లో నిలిచిపోయిన ముంపు నీరు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. మరో వైపు తేమ, నూక శాతం తగ్గించేందుకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. నూర్పిడులు పూర్తిగా మిషన్లపై చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మండలానికో మినీ మొబైల్ మిల్లు నూక శాతం పేరుతో మిల్లర్లు రైతులను దోపిడీ చేయకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. మండలానికి ఒకటి చొప్పున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, గోదావరి జిల్లాల్లో మొబైల్ మినీ మిల్లులు ఏర్పాటు చేశారు. మండల వ్యవసాయశాఖాధికారి, టెక్నికల్ అసిస్టెంట్లు వీటిని పర్యవేక్షిస్తున్నారు. ఈ మినీ మిల్లుల ద్వారా మిల్లరు, రైతుల ఎదుటే ధాన్యాన్ని మరాడించి ఎంత శాతం నూక వస్తుందో పరిశీలిస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్ అధికారులను కస్టోడియన్ ఆఫీసర్లుగా మిల్లుల వద్ద నియమించి రైతులకు సమస్య రాకుండా చూస్తున్నారు. ఆర్బీకేలో ధాన్యం అప్పగించి రసీదు పొందే వరకే రైతు బాధ్యత. ఆ తర్వాత మిల్లర్లు పిలిచినా వెళ్లనవసరం లేదని రైతులకు స్పష్టం చేస్తున్నారు. ఏ మిల్లర్ అయినా íపిలిస్తే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. రైతులను ఇబ్బందిపెట్టిన కారణంగా ఇప్పటికే 39 రైస్ మిల్లులపై చర్యలు తీసుకున్నారు. రంగంలోకి మార్క్‌ఫెడ్ వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న మొక్క జొన్న రైతులను ఆదుకుందుకు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపారు. 66 వేల టన్నులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మొక్క జొన్న ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లోని 3,330 ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటికే 5,036 మంది రైతులు సీఎం యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరి నుంచి కనీస మద్దుత ధర రూ.1,962 చొప్పున ఫైన్ వెరైటీ మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 60 శాతం పంట కోతలు పూర్తయ్యాయి. బాపట్ల, ఏలూరు, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి జిల్లాల్లో 17–18.5 శాతం తేమ ఉన్నట్టుగా గుర్తించారు. తేమ శాతాన్ని 14 శాతానికి తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు ఇలా.. జిల్లా రైతుల సంఖ్య సేకరించిన ధాన్యం (టన్నుల్లో) పశ్చిమగోదావరి 28,650 2,62,711 ఏలూరు 11,423 1,34,543 తూర్పుగోదావరి 12,998 1,19,748 కోనసీమ 5,975 46,669 కాకినాడ 2,481 18,357 కృష్ణా 2,598 15,298 బాపట్ల 1968 12,014 నెల్లూరు 281 4257 ప్రకాశం 411 2577 ఎన్టీఆర్ 113 1456 ––––– వేగంగా స్పందించి కొన్నారు నేను 4 ఎకరాల్లో వరి సాగు చేశాను. ఎకరానికి 45 బస్తాల దిగుబడి వచ్చింది. అకాల వర్షాలు భయపెట్టాయి. ధాన్యం తడిసిపోయి 48 గంటలు దాటకుండానే ప్రభుత్వం ఆర్బీకే ద్వారా కొనుగోలు చేసింది. 75 కిలోల బస్తాకు రూ.1,530 చొప్పున ఇచ్చారు. 6 రోజుల్లోనే బ్యాంకు ఖాతాలో నగదు జమ చేశారు. ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించడం ఎన్నడూ చూడలేదు. – కుసుమ శివప్రసాద్, ఈదరాడ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రభుత్వం వల్లే ధాన్యం అమ్మగలిగా రెండెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశా. మిషన్‌తో కోయించా. వర్షానికి తడిసిపోయిందని తక్కువ రేటుకు అడిగారు. ఏం చేయాలో పాలుపోలేదు. శుక్రవారం కలెక్టర్, అధికారులు మా గ్రామానికి వచ్చినప్పుడు చూపించా. కలెక్టర్ ఆదేశాలతో ఆర్బీకే సిబ్బంది సంచులిచ్చి, దగ్గరుండి కాటా వేయించి, ట్రాక్టర్‌తో రైసు మిల్లుకు తీసుకెళ్లారు. మద్దతు ధరకు కొంటామని చెప్పడంతో గట్టెక్కగలిగాను. లేకపోతే అయినకాడకు అమ్ముకోవాల్సి వచ్చేది. ప్రభుత్వం చాలా వేగంగా స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది. – పేపకాయల వెంకటరమణ, కౌలురైతు, కరప, కాకినాడ జిల్లా తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నాం జిల్లా అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నాం. రైతుల వద్ద ఉన్న తడిసిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలుపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. తుపాన్‌ను దృష్టిలో పెట్టుకొని రైతుల వద్ద కోత కోసిన ధాన్యాన్ని సేకరించేందుకు ఆదేశాలిచ్చాం. అలాగే చేలల్లో నీరు నిల్వ ఉన్న చోట్ల బయటకు పంపేందుకు చర్యలు చేపట్టాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ, స్పెషలాఫీసర్, పశ్చిమగోదావరి జిల్లా వేగంగా ధాన్యం తరలింపు అకాల వర్షాలతో రైతుల ధాన్యం తడిచింది. ఎక్కడా ఆరబెట్టుకోలేని పరిస్థితి. రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. అందుకు చాలా వరకు నిబంధనల్లో సడలింపులు ఇచ్చాం. తడిచిన, మొలకొచ్చిన ధాన్యాన్ని సైతం తీసుకుంటున్నాం. వాటిని బాయిల్డ్ రకాల జాబితాలో కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నాం. కోసిన పంట కోసినట్టు ఆఫ్‌లైన్‌లో నమోదు చేసి సేకరిస్తున్నాం. ప్రత్యేక అధికారుల దగ్గర నుంచి జిల్లా కలెక్టర్లు, జేసీలు, పౌర సరఫరాల సంస్థ డీఎంలు, తహసీల్దార్లు, ఏవోలు, ఆర్బీకే సిబ్బంది ఇలా నిరంతరం రైతులకు అందుబాటులో ఉన్నారు. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ రబీ సీజన్లో టీడీపీ హయాంలో కొనుగోళ్లు ఇలా.. సంవత్సరం టన్నులు 2014–15 18,91,106 2015–16 20,70,540 2016–17 16,95,341 2017–18 18,12,994 2018–19 16,47,193 (మార్చి 31 వరకు) మొత్తం 91,17,174 –––– వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2018–19 11,05,578 (ఏప్రిల్ 1నుంచి) 2019–20 34,73,827 2020–21 37,23,522 2021–22 26,22,386 2022–23 6,17,761 (మే 6వ తేదీ వరకు) 1,15,43,074 ధాన్యం కొనుగోలు కోసం ప్రత్యేక అధికారులు జిల్లా ఐఏఎస్ అధికారి అల్లూరి సీతారామరాజు ప్రవీణ్‌కుమార్, ఎండీ ఎపీఐఐసీ అనకాపల్లి జే.నివాస్, కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ బాపట్ల కాటమనేని భాస్కర్, కమిషనర్, స్కూల్ ఎడ్యుకేషన్ (ఇన్ఫ్రా) తూర్పు గోదావరి వివేక్‌యాదవ్, కమిషనర్ సీఆర్డీఎ ఏలూరు శశిభూషణ్‌కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ, జలవనరుల శాఖ గుంటూరు ఎండీ ఇంతియాజ్, చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్, సెర్ప్ కాకినాడ పీఎస్ ప్రద్యుమ్న, ప్రిన్సిపల్ సెక్రటరీ, రోడ్లు, భవనాల శాఖ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వీరపాండ్యన్, ఎండీ ఏపీఎస్సీఎస్సీఎల్ కృష్ణా లక్ష్మీశా, ఎండీ, ఎపీఎస్‌హెచ్‌సీఎల్ ఎన్టీఆర్ గిరిజా శంకర్, కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ ఎస్పీఎస్ నెల్లూరు చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ పల్నాడు సూర్యకుమారి, కమిషనర్, పంచాయతీరాజ్ పార్వతీపురం మన్యం ముద్దాడ రవిచంద్ర, ప్రిన్సిపల్ సెక్రటరీ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రకాశం ఎం.టీ.కృష్ణబాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్య ఆరోగ్య శాఖ శ్రీకాకుళం సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విజయనగరం సురేష్ కుమార్, కమిషనర్, పాఠశాల విద్య పశ్చిమగోదావరి కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ అనంతపురం ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గొల్లవిల్లి గ్రామానికి చెందిన సలాది లక్ష్మణబాబు.. రబీలో రెండున్నర ఎకరాల్లో ఎంటీయూ–3626 (జయ) రకం ధాన్యం సాగు చేశాడు. ఎకరాకు రూ.25 వేలు ఖర్చు చేశాడు. తెగుళ్ల బెడద లేకపోవడంతో దిగుబడి బాగా వచ్చింది. కోతలు కోసి కుప్పనూర్చాడు. అయితే తెల్లారేసరికి కుండపోత వర్షాలు. వారం పాటు ధాన్యాన్ని ఎలా రక్షించుకోవాలా అని ఆందోళన చెందాడు. కళ్లెదుటే ధాన్యంలో కొంత మేర మొలకలొచ్చేశాయి. కనీసం పెట్టుబడి అయినా దక్కుతుందో లేదోనని భయపడ్డాడు. అంతలో ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించడం.. సీఎం వైఎస్ జగన్ ఆదేశించడంతో కలెక్టర్ సహా అధికారులంతా ఆ గ్రామానికి వచ్చారు. మొలకెత్తిన ధాన్యాన్ని చూశారు. వెంటనే బస్తాలకు ఎక్కించి మిల్లుకు తరలించారు. ‘ఆందోళన చెందకండి.. కనీస మద్దతు ధరకు మీ ధాన్యం కొనుగోలు చేస్తాం’ అని అభయమిచ్చారు. దీంతో లక్ష్మణబాబు ఆందోళన మాయమైంది. కాకినాడ జిల్లా పత్తిగొందికి చెందిన సేలం శ్రీనివాసరావు 10 ఎకరాల్లో వరివేశాడు. మాసూళ్లు ప్రారంభించే సరికి కురిసిన భారీ వర్షాలతో 4 ఎకరాల్లో పంట పూర్తిగా ముంపునకు గురైంది. ఆర్బీకే సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి తీవ్ర నష్టం జరగకుండా చూశారు. ముంపునకు గురైన వరిచేలలో నీటిని ఉపాధి కూలీల సాయంతో అధికారులు బయటకు పోయేలా చర్యలు చేపట్టారు. వరి పనలు మొలకెత్తకుండా శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు ఉప్పునీటి ద్రావణం చల్లాడు. తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు భరోసా ఇవ్వడంతో ఇతనికి ఊరట కలిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడిన ప్రతి చోటా ప్రభుత్వం రైతుల వెన్నంటి ఉంటూ అండగా నిలుస్తోంది. -
ప్రభుత్వ కేంద్రాలున్నా.. ప్రైవేట్‌కే ధాన్యం అమ్ముకోవాలా?
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా వరికోతలు ప్రారంభమై ధాన్యం కేంద్రాలకు తరలుతున్నా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒకవైపు కొనుగోళ్లు చేపట్టకపోవడం, మరోవైపు అకాల వర్షాలకు చేతికొచ్చిన పంటను కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో కొంతమంది రైతులు నేరుగా మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా మిల్లర్లు సైతం బస్తాకు రెండు నుంచి మూడు కిలోల చొప్పున అదనంగా తూకం వేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాలను ప్రారంభించి, వేగంగా తూకం వేస్తే ప్రైవేటుకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఉండదని రైతులు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రారంభమైనవి 20 కేంద్రాలే.. జిల్లాలో ఈసారి మొత్తం 214 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. కోతల సీజన్ ప్రారంభమై పదిరోజులు గడుస్తున్నా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా కేవలం 20 కేంద్రాలను మాత్రమే అధికారులు ప్రారంభించారు. ఇవి కూడా కొల్లాపూర్ నియోజకవర్గంలోనే అధికంగా ఉన్నాయి. మిగితా చోట్ల ఎక్కడా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం కాలేదు. ఇప్పటికే జిల్లాలోని బిజినేపల్లి, తాడూరు, తిమ్మాజిపేట, తెలకపల్లి, నాగర్‌కర్నూల్ మండలాల్లో వరిపంటను కోసం పది రోజులు గడుస్తున్నా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభం కాక రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. అకాల వర్షాల నేపథ్యంలో కల్లాలకు తెచ్చిన ధాన్యం నీటిపాలవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం 214 కొనుగోలు కేంద్రాలకు ప్రస్తుతం 20 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. ఈసారి సీజన్లో మొత్తం 1.50లక్షల ఎకరాల్లో వరి సాగైంది. మొత్తం 2.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయాలని జిల్లా అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు కొనుగోలు చేసింది మొత్తం 1,069 మెట్రిక్ టన్నులు మాత్రమే. ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో చాలావరకు ధాన్యం ప్రైవేటుకు తరలుతోంది. దీంతో జిల్లాలో ప్రభుత్వ లక్ష్యం మేరకు ధాన్యం సేకరణ చేపట్టకుండా, కొంతమేరకు కొనుగోళ్లకే అధికారులు పరిమితం చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తేమ పేరుతో కొర్రీలు.. జిల్లాలో చాలాచోట్ల వరికోతలు పూర్తయ్యి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో ఇంకా కాంటాలు మొదలు కావడం లేదు. ధాన్యం ఇప్పుడిప్పుడే కేంద్రాలకు వస్తోందని, తేమ శాతం సరిగ్గా ఉంటే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 17శాతం తేమ ఉంటే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం చేపట్టాలి. కానీ జిల్లాలోని చాలా కేంద్రాల్లో 16 నుంచి 14 శాతం వరకు ఉంటేనే తీసుకుంటున్నారు. అప్పటివరకు రైతులతో మళ్లీ ఆరబోయిస్తున్నారు. కొన్నికేంద్రాల్లో తేమ శాతం ఉన్నా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లర్లకే విక్రయిస్తున్నారు. ‘ఈ ఫొటోలోని రైతు పేరు సాగర్. జిల్లాలోని తాడూరు మండలం చర్లఇటిక్యాల గ్రామానికి చెందిన రైతు సాగర్ 14 రోజుల కిందట వరిపంటను కోశాడు. అయితే ఇప్పటివరకు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి కొనుగోళ్లను ప్రారంభించలేదు. దీంతో జిల్లాకేంద్రంలో సమీపంలోని మిల్లుకు ధాన్యాన్ని తరలించాడు. మిల్లు నిర్వాహకుడు బస్తాకు కిలోన్నర చొప్పున కట్ చేసుకున్నాడని వాపోయాడు. గ్రామంలో అధికారులు కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో అకాల వర్షాల భయానికి ప్రైవేటు మిల్లులకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.’ తేమ శాతం ఉంటే వెంటనే కొనుగోలు చేస్తున్నాం.. జిల్లాలో ఈసారి మొత్తం 214 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నాం. జిల్లాలోని చాలాచోట్ల ఇంకా వరికోతలు పూర్తికాలేదు. ఇప్పుడిప్పుడే ధాన్యం సెంటర్లకు వస్తోంది. కేంద్రానికి వచ్చిన ధాన్యం నిర్ణీత తేమ శాతం ఉంటే వెంటనే కొనుగోలు చేస్తాం. – మోహన్‌బాబు, జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి జిల్లాలో ఏర్పాటుచేయనున్న కొనుగోలు కేంద్రాలు - 214 ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు - ప్రారంభమైనవి - 20 -
ప్యాడీ డ్రయ్యర్: ధర రూ. 15 లక్షలు.. 50–60% సబ్సిడీ! పొలం దగ్గరే ఇలా!
రైతులు రోడ్లపై ధాన్యాన్ని ఆరబెడుతూ ప్రజలకు అసౌకర్యం కలిగించటం తగదని సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ధాన్యాన్ని కొద్ది గంటల్లోనే నాణ్యత కోల్పోకుండా ఆరబెట్టుకోవడానికి ట్రాక్టర్‌తో నడిచే పాడీ డ్రయ్యర్లు వీలు కల్పిస్తున్నాయి. 50 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతతో ధాన్యాన్ని నాణ్యత చెడకుండా, మొలక శాతం తగ్గకుండా ఆరబెట్టే ఆధునిక సాంకేతికతతో కూడిన పాడీ డ్రయర్లు బాపట్లలోని కోత అనంతర పరిజ్ఞాన పరిశోధన కేంద్రం ద్వారా రైతులకు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ధాన్యాన్ని నూర్చిన తర్వాత తేమ తగ్గేవరకూ సరిగ్గా ఆరబెట్టకపోవటం వల్ల సుమారు 10 శాతం మేరకు నష్టం కలుగుతోందని అంచనా. అధిక తేమ ఉన్న ధాన్యాన్ని బస్తాల్లో నిల్వ చేస్తే ధాన్యం వేడెక్కి రంగు మారుతుంది. అటువంటి అనుకూల వాతావరణంలో ముక్క పురుగులు, శిలీంధ్రాలు ఆశిస్తాయి. బూజు పడుతుంది. ధాన్యం చెడిపోయి వాసన వస్తుంది. వరి ధాన్యాన్ని (కంబైన్ హార్వెస్టర్) యంత్రాల ద్వారా కోసిన తర్వాత సక్రమంగా ఆరబెట్టకపోతే నాణ్యత దెబ్బతింటుంది. 12% కన్నా తక్కువ తేమ శ్రేయస్కరం సాధారణంగా కంబైన్ హార్వెస్టర్‌తో గింజరాలు నష్టాన్ని తగ్గించడానికి వరి ధాన్యంలో తేమ శాతం 22–24% ఉన్నప్పుడు వరి కోతలు చేస్తుంటారు. నాణ్యత కోల్పోకుండా ఉండాలంటే ధాన్యం నూర్చిన 24 గంటల్లోగా తేమ శాతాన్ని 17–18కి తగ్గేలా ఆరుదల చేయాల్సి ఉంటుంది. వరి ధాన్యాన్ని నాణ్యత కోల్పోకుండా ఆరు నెలల వరకు నిల్వ ఉంచాలంటే తేమను 12–13 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. ఏడాది కంటే ఎక్కువ కాలం నిల్వ ఉంచాలంటే 12 కన్నా తక్కువ శాతానికి తేమను తగ్గించాల్సి ఉంటుంది. ఏకకాలంలో రైతులందరూ పంట నూర్పిళ్లు చేయటం వల్ల పాత పద్ధతుల్లో నేలపైన నచ్చు/ పరదాలపై లేదా రోడ్లపైన ధాన్యాన్ని ఆరబెట్టడం సాధ్యం కావటం లేదు. ఒక్కోసారి అకాల వర్షాల వల్ల ఆరబెట్టిన ధాన్యం తడిచి నాణ్యత మరింత కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రాక్టర్ ద్వారా నడిచే మొబైల్ ప్యాడీ డ్రయ్యర్లు రైతులకు ఉపయోగకరంగా ఉన్నాయి. గ్రీన్‌సిగ్నల్ పరిశోధనా సంస్థలు, కంపెనీలు రూపొందించే వ్యవసాయ యంత్రాలు, పరకరాలను అధికారికంగా క్షేత్రస్థాయిలో సబ్సిడీపై అందుబాటులోకి తేవాలంటే వాటి పనితీరును పరిశీలించి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలోని యంత్రీకరణ– సాంకేతిక విభాగం ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరి 23న యంత్రీకరణ– సాంకేతిక విభాగం డిప్యూటీ కమిషనర్ ఎ.ఎన్. మెష్రం 32 యంత్రాలు, పరికరాలకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నైలోని కర్ది డ్రయ్యర్స్ సంస్థ రూపొందించిన ప్యాడీ మొబైల్ డ్రయ్యర్ కూడా ఒకటి. సబ్–మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ (ఎస్.ఎం.ఎ.ఎం.) పథకం ద్వారా కస్టమ్ హైరింగ్ సెంటర్స్ / హైటెక్ హబ్స్, గ్రామస్థాయి ఫామ్ మెషినరీ బ్యాంక్స్‌కు మాదిరిగానే స్వీయ సహాయక బృందాల (ఎస్.హెచ్.జి.ల)కు కూడా ఈ డ్రయ్యర్‌ను సబ్సిడీపై అందించవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీలు, చిన్న, సన్నకారు రైతులు, మహిళలకు 60%, ఇతరులకు 50% సబ్సిడీపై ఈ మొబైల్ పాడీ డ్రయ్యర్‌ను అందించవచ్చని ఆ ఉత్తర్వు పేర్కొంది. బ్యాచ్‌కు 2–12 టన్నులు కోయంబత్తూరులోని ఐసిఏఆర్ అనుబంధ సంస్థ అయిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లోని ప్రాంతీయ విభాగంతో పాటు, బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ కోత అనంతర పరిజ్ఞాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు తమ 2.5 టన్నుల మొబైల్ పాడీ డ్రయ్యర్ పనితీరును పరీక్షించి, సంతృప్తిని వ్యక్తం చేశాయని కర్ది డ్రయ్యర్స్ సంస్థ తెలిపింది. ధాన్యాన్ని ఎత్తిపోయటం ద్వారా ఆరుదల చేసే అనేక స్టాటిక్(స్థిర), మొబైల్(చర) డ్రయ్యర్లను ఈ సంస్థ రూపొందిస్తూ దేశ విదేశాల్లో విక్రయిస్తోంది. స్థిరంగా ఒకచోట నెలకొల్పి విద్యుత్/ డీజిల్ జనరేటర్ ద్వారా ధాన్యాన్ని ఆరుదల చేసే 12 టన్నుల సామర్థ్యం గల డ్రయ్యర్లను సైతం ఈ సంస్థ రూపొందించింది. అదేవిధంగా, పొలం దగ్గరకే తీసుకువెళ్లి ధాన్యాన్ని నూర్చిన వెంటనే అక్కడికక్కడే ఆరబెట్టుకునేందుకు ఉపయోగపడే మొబైల్ పాడీ డ్రయ్యర్లలో బ్యాచ్‌కు 2 టన్నుల నుంచి 70 టన్నుల సామర్థ్యం కలిగిన డ్రయ్యర్లు అందుబాటులోకి వచ్చాయి. ట్రాక్టర్‌తో పొలం దగ్గరకే లాక్కెళ్లి రీసర్క్యులేటరీ వ్యవస్థ ద్వారా ధాన్యాన్ని ఆరుదల చేయడానికి ఉపకరించే 2 టన్నుల సామర్ధ్యంగల మొబైల్ డ్రయ్యర్ ధర రూ. 15 లక్షలు. 50–60% సబ్సిడీపై అందించడానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదిస్తున్నామని కర్ది డ్రయ్యర్స్ సంస్థ జనరల్ మేనేజర్ దిలీపన్(90940 13375) తెలిపారు. వరితోపాటు మొక్కజొన్న బ్యాచ్‌కు 1 టన్ను నుంచి 5 టన్నుల సామర్థ్యం గల మొబైల్ పాడీ డ్రయ్యర్ల ద్వారా వరి ధాన్యంతో పాటు మొక్కజొన్నలు, తీపి మొక్కజొన్నలు, బార్లీ, గోధుమలను కూడా ఆరుదల చేయవచ్చని దిలీపన్ వివరించారు. 35–65 హెచ్‌పి ట్రాక్టర్ పిటిఓ ద్వారా ఇవి పనిచేస్తాయి. అతి తక్కువ ఖర్చుతో ధాన్యాలను ఆరబెట్టడంతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించుకోవచ్చు. ఎండలో ఆరుబయట ఆరబెట్టే సమయంలో 20% సమయంలోనే (2–2.5 గంటలు) ఈ డ్రయ్యర్‌తో కోత కోసిన రోజే, తక్కువ శ్రమతో ఆరుదల చేసి, వెంటనే బస్తాల్లోకి నింపుకోవచ్చు. ఎక్కువ తక్కువ లేకుండా ధాన్యం అంతా సమంగా, సక్రమంగా ఆరుదల జరుగుతుంది కాబట్టి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. వెంటనే అమ్మేసుకోవాల్సిన అవసరం ఉండదు. నిశ్చింతగా నిల్వ ఉంచుకొని మంచి ధరకు అమ్ముకోవచ్చు. మొబైల్ డ్రయ్యర్ పనితీరు బాగుంది పచ్చి వరి ధాన్యాన్ని (బక్కెట్ ఎలివేటర్‌తో తిరిగి ఎత్తిపోస్తూ) ఆరుదల చేసే ఈ 2.5 టన్నుల మొబైల్ డ్రయ్యర్‌ను బాపట్లలోని మా పరిశోధనా కేంద్రంలో పరీక్షించాం. తేమ శాతం 22% నుంచి 13.5%కి తగ్గింది. చాలా బాగా పనిచేస్తోంది. బ్యాచ్‌కు ముప్పావు ఎకరంలో వరి ధాన్యం (35 బస్తాలు) ఆరుదల చేయొచ్చు. రోజుకు 5 బ్యాచ్‌లు చేయొచ్చు. డ్రయ్యింగ్ రెండు దశల్లో చేయాలి. 17–18% వరకు మొదటి దశ, 13% వరకు రెండో దశలో తగ్గించాలి. ఈ ధాన్యాన్ని విత్తనంగా కూడా వాడుకోవచ్చు. మొలక శాతంలో ఎటువంటి తేడా ఉండదు. నూక శాతం తగ్గుతున్నట్లు కూడా నిర్థరణైంది. ప్రభుత్వానికి నివేదిక పంపాం. – డా. బి.వి.ఎస్. ప్రసాద్ (80083 73741), ప్రధాన శాస్త్రవేత్త (వ్యవసాయ ఇంజనీరింగ్),అధిపతి, కోత అనంతర పరిజ్ఞాన పరిశోధన కేంద్రం, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, బాపట్ల -
శుద్ధిచేసిన మురుగు నీటితో వరి సాగు.. ప్రొటీన్ రిచ్ రైస్, ఇంకా..
వరి సాగుకు రసాయనిక ఎరువులు, మంచి నీరు అవసరం లేదు.. శుద్ధిచేసిన మున్సిపల్ మురుగు నీటిని క్రమం తప్పకుండా డ్రిప్ ద్వారా అందిస్తే చాలు.. చక్కని దిగుబడులూ వస్తాయి. ఇలా పండించిన వరి బియ్యంలో ప్రొటీన్ (ప్రొటీన్ రిచ్ రైస్) కూడా అధికంగా ఉంటుంది అంటున్నది జపాన్‌కు చెందిన యమగటా విశ్వవిద్యాలయం. అంతేకాదు, రసాయనిక వ్యవసాయం వల్ల వెలువడే కర్బన ఉద్గారాల్లో 70% వరకు తగ్గుతాయి అంటున్నారు ‘యమగటా’ శాస్త్రవేత్తలు. అర్బన్ వ్యర్థ జలాల పునర్వినియోగం ద్వారా రసాయనిక ఎరువులను, మంచి నీటిని నూటికి నూరు శాతం ఆదా చేసుకోగలగటం హర్షదాయకం. ముఖ్యంగా, వరి బియ్యాన్నే ప్రధాన ఆహారంగా తీసుకునే ఆసియా వాసులకు ఇదెంతో శుభవార్త. పైపులైన్ల ద్వారా నేరుగా వేరు వ్యవస్థకు సాగు నీరందించే మెరుగైన భూగర్భ నీటిపారుదల వ్యవస్థ ఉపయోగం గురించి కూడా యమగటా విశ్వవిద్యాలయం పరిశోధించటం విశేషం. పట్టణాలు, నగరాల్లో జనావాసాల నుంచి వెలువడే మురుగు నీరు కానే కాదు. నిజానికి శుద్ధి చేసి తిరిగి వాడుకుంటే వ్యవసాయానికి ఇది గొప్ప పోషక జలంలా ఉపయోగపడుతుందని తమ పరిశోధనల ద్వారా నిరూపించారు యమగటా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. జపాన్‌లోని సురుయోకా నగరంలో ఈ విశ్వవిద్యాలయం ఉంది. బురదను కంపోస్టుగా మార్చి జనావాసాల నుంచి వెలువడే మురుగు నీటిలో నుంచి హానికారక క్రిములు, భార లోహాలు వంటి కలుషితాలేవీ లేకుండా శుద్ధి చేసి వరి పొలాలకు డ్రిప్ ద్వారా అవసరం మేరకు నిరాటంకంగా అందించాలి. దీనితో పాటు, మురుగునీటిని శుద్ధి చేసే క్రమంలో వెలువడే బురదను కంపోస్టుగా మార్చి, ఆ సేంద్రియ ఎరువును సైతం వరి పొలాల్లో వేసుకుంటే చాలు. అంతకన్నా ఇంక ఏ ఎరువులూ అవసరం లేకుండా వరి పంటలో చక్కని దిగుబడులు సాధించవచ్చు. ఇందుకోసం వినూత్న నీటిపారుదల వ్యవస్థలను రూపొందించి, పరీక్షించి చక్కని ఫలితాలు సాధించాం అంటున్నారు ‘యమగటా’ పరిశోధకులు. అర్బన్ మురుగు నీటిని శుద్ధి చేసి పునర్వినియోగించే వరి నీటిపారుదల వ్యవస్థలను అభివృద్ధి చేశారు. శుద్ధి చేసిన మురుగు నీటిని వరి పొలంలో సాధారణ పద్ధతిలో నీటిని నిల్వగట్టి పంటలు పండించారు. అదేవిధంగా, భూగర్భ పైపుల వ్యవస్థ ద్వారా వరి మొక్కల వేరు వ్యవస్థకు నేరుగా నీటిని పొదుపుగా అందించటం ద్వారా వరి సాగు చేసి పంట దిగుబడులు తీశారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. శుద్ధి చేసిన మురుగు నీరు కేవలం నీరు మాత్రమే కాదు, పోషకాలతో కూడిన జలం. తద్వారా రసాయనిక ఎరువుల వాడకాన్ని నూటికి నూరు శాతం నివారించవచ్చు. బోర్లు లేదా కాలువల ద్వారా ఇప్పుడు వరి సాగుకు వాడుతున్న మంచి నీటిని ఆదా చేసుకొని, ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. దిగుబడులు తగ్గే అవకాశం లేదు. రసాయనిక సేద్యంలో పండించిన వరి బియ్యంలో కన్నా ఎక్కువ ప్రోటీన్‌తో కూడిన బియ్యం ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. నీరు నిల్వగట్టి రసాయనాలతో పండించే వరి పొలాల నుంచి విడుదలయ్యే మీథేన్ ఉద్గారాలను 80%, నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలను కనీసం 60% తగ్గించడానికి ఆస్కారం ఉందని ‘యమగటా’ పరిశోధనల్లో తేలింది. తద్వారా సాంప్రదాయ వరి పొలాల వల్ల పెరిగే భూతాపాన్ని 70% తగ్గించవచ్చని ఈ ప్రయోగాల్లో నిరూపితమైంది. పట్టణాలు, నగరాల్లో జనావాసాల నుంచి వెలువడే వ్యర్థ జలాలను శుద్ధి చేసి పునర్వినియోగించడం ద్వారా తక్కువ ఖర్చుతోనే వరి పొలాలకు నీటిని, పోషకాలను అందించడం సాధ్యమేనని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ సాంకేతికతపై యమగటా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ మేధోహక్కుల సంస్థ(వైపో) నుంచి పేటెంట్ పొందింది. ప్రొటీన్ గణనీయంగా పెరిగింది వాతావరణ మార్పుల్ని దీటుగా ఎదుర్కొనేందుకు ఈ గ్రీన్ టెక్నాలజీ దోహదపడుతుందని అంతర్జాతీయ మేధోహక్కుల సంస్థ(వైపో) ప్రశంసించింది. ప్రొటీన్ గణనీయంగా పెరిగింది. జనావాసాల నుంచి వెలువడే మురుగు నీటిని శుద్ధిచేసి వరి సాగులో డ్రిప్ ద్వారా ఉపయోగించినప్పుడు బియ్యంలో ప్రొటీన్లు, రాగి గణనీయంగా పెరిగాయి. పాషాణం సమస్య 50% తగ్గింది. శుద్ధిచేసిన మురుగు నీటితోపాటు, మురుగు నీటిని శుద్ధి చేసే క్రమంలో వెలువడే బురదతో తయారు చేసిన సేంద్రియ ఎరువులను వాడటం వల్ల భూసారం బాగుంది. లెడ్, జింక్, నికెల్, కాడ్మియం సమస్య రాలేదు. నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లో వ్యర్థజలాలను శుద్ధి చేసుకొని వరిసాగుకు వాడుకోవటం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించవచ్చని మా అధ్యయనంలో నిర్థారణ అయ్యింది. – నిండియా ఊబా, యమగటా విశ్వవిద్యాలయం, జపాన్ నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ చదవండి: తేనెటీగల పెంపకంలో రాణిస్తున్న యువకుడు.. 400 బాక్సులతో 200 కేజీల తేనె -
మిల్లులపై కొరడా! సీఎంఆర్ అక్రమాలపై సర్కారు నజర్
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడే రైస్‌మిల్లుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లాలోని 8 మిల్లుల్లో ‘కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)’ కోసం కేటాయించిన ధాన్యం మాయమైన విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. కొందరు మిల్లర్ల తీరు వల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తప్పుబట్టే పరిస్థితి తలెత్తుతున్న క్రమంలో కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. సదరు మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టి, వాటి నుంచి మాయమైన రూ.138.50 కోట్ల విలువైన ధాన్యానికి సమానమైన బియ్యాన్ని వెంటనే రికవరీ చేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో గత సీజన్లలో రాష్ట్రవ్యాప్తంగా మిల్లులకు సీఎంఆర్ కోసం కేటాయించిన ధాన్యం, మిల్లింగ్ చేశాక తిరిగి ఇచ్చిన బియ్యం, ఇంకా మిగిలిన ధాన్యం లెక్కలు తీయాలని అధికారులను పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. దీనిపై అప్రమత్తమైన అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులు.. మిల్లుల్లో ధాన్యం లెక్కలు తీసే పనిలో పడ్డారు. భారీగా బియ్యం పెండింగ్.. రాష్ట్రంలో రైతుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా పౌరసరఫరాల శాఖ సేకరిస్తుంది. దాన్ని రైస్‌మిల్లులకు పంపుతుంది. మిల్లర్లు ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి వచి్చన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ప్రతి క్వింటాల్ ధాన్యానికి సుమారు 67 కిలోల బియ్యం వస్తుంది. ఇలా ఇచ్చే బియ్యాన్నే ‘కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)’ అంటారు. మిల్లింగ్ చేసి ఇచి్చనందుకు రైస్‌మిల్లర్లకు నిరీ్ణత మొత్తం చార్జీలను చెల్లిస్తారు. ప్రతి సీజన్లో పౌరసరఫరాల శాఖ మిల్లుల సామర్థ్యం, గతంలో సకాలంలో సీఎంఆర్ ఇచి్చన తీరు వంటి అంశాలను బేరీజు వేసుకుని.. ఆయా మిల్లులకు ధాన్యాన్ని కేటాయిస్తుంది. కానీ గత రెండేళ్లుగా కొందరు మిల్లర్లు తమకు కేటాయించిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండగా.. గత సంవత్సరం (2021–22) వానకాలం సీజన్లో మిల్లులకు పంపిన ధాన్యాన్నే ఇంకా పూర్తిగా కస్టమ్ మిల్లింగ్ చేసి ఇవ్వలేదు. ఆ సీజన్‌కు సంబంధించి ఇంకా 14 లక్షల టన్నులకుపైగా బియ్యం ఎఫ్‌సీఐకి అందాల్సి ఉంది. అంటే లెక్కప్రకారం మిల్లుల్లో 20 లక్షల టన్నులకుపైగా ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్టు. కొన్ని జిల్లాల్లో సగమే సీఎంఆర్.. కామారెడ్డి, పెద్దపల్లి, మెదక్, కరీంనగర్, జగిత్యాల, వనపర్తి, సూర్యాపేట, సిరిసిల్ల, యాదాద్రి, నాగర్‌కర్నూల్, మంచిర్యాల జిల్లాల్లో మిల్లర్లు గతేడాది వానాకాలం సీఎంఆర్‌లో 50శాతం కూడా అప్పగించలేదు. వరిసాగు తక్కువగా ఉండే ఆదిలాబాద్, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో మాత్రమే 100 శాతం, మిగతా జిల్లాల్లో 80శాతం వరకు సీఎంఆర్ పూర్తయింది. ఇక గత యాసంగికి సంబంధించి మిల్లులకు కేటాయించిన 50లక్షల టన్నుల ధాన్యం కస్టమ్ మిల్లింగ్ చాలా జిల్లాల్లో మొదలేకాలేదు. ఈ ధాన్యం నుంచి 17 లక్షల టన్నులమేర పారాబాయిల్డ్ (ఉప్పుడు) పోషక బియ్యంగా మార్చేందుకు అనుమతి లభించినా అంతంత మాత్రంగానే మిల్లింగ్ జరుగుతోంది. మరోవైపు ఈ ఏడాది వానకాలం ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే 20 లక్షల టన్నులకుపైగా ధాన్యం మిల్లులకు చేరింది. మరో 80 లక్షల టన్నులు వచ్చే అవకాశముంది. నాణ్యమైనది అమ్ముకుని..! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉప్పుడు బియ్యం, రారైస్ విషయంలో తలెత్తిన వివాదాలను మిల్లర్లు తమకు అనుకూలంగా మలుచుకొని అక్రమాలకు పాల్పడుతున్నట్టు విమర్శలు ఉన్నాయి. కొందరు మిల్లర్లు సీఎంఆర్ కోసం వచి్చన ధాన్యంలో మేలురకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపణలు చాలాకాలం నుంచి ఉన్నాయి. ఇదే సమయంలో రేషన్ బియ్యాన్ని, పాత ముతక బియ్యాన్ని కొని రిసైక్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి అప్పగించడం పెద్దపల్లి, కరీంనగర్, సూర్యాపేట, సిద్దిపేట వంటి పలుజిల్లాల్లో సాధారణమేనని పౌరసరఫరాల శాఖ అధికారులే చెప్తున్నారు. ఈ ఆరోపణలపై గతంలో పెద్దపల్లి, మంచిర్యాల, నల్లగొండ, కరీంనగర్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో పలుమిల్లులపై ఆంక్షలు విధించినా.. రాష్ట్రస్థాయిలో పైరవీలతో తమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఎఫ్‌సీఐ ఆగ్రహించి సీఎంఆర్ ఆపినా.. మిల్లర్లు ఎఫ్‌సీఐకి అప్పగించే సీఎంఆర్ విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ కేంద్రం కొన్ని నెలల కింద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్‌సీఐ విధించిన నిబంధనలను తుంగలో తొక్కి రీసైక్లింగ్ బియ్యం, పాత బియ్యాన్ని సెంట్రల్‌పూల్ కింద ఎఫ్‌సీఐకి ఇవ్వడాన్ని తప్పుబట్టింది. దీనితోపాటు సకాలంలో సీఎంఆర్ ఇవ్వకపోవడంపై ఆగ్రహిస్తూ.. జూలైలో సీఎంఆర్ బియ్యాన్ని తీసుకోబోమని తేలి్చచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కమలాకర్, అధికారులు పలుమార్లు కేంద్రంతో సంప్రదింపులు జరిపాక.. 45 రోజుల తర్వాత తిరిగి సీఎంఆర్‌కు అనుమతిచ్చింది. అయినా మిల్లర్లు సీఎంఆర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికార వర్గాలు చెప్తున్నాయి. కాగా సూర్యాపేట జిల్లాలో రూ.67 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ ఇవ్వాల్సిన రెండు మిల్లులపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మేలురకం అమ్మేసుకోవడంతోనే! రాష్ట్రంలో పెరిగిన ధాన్యం ఉత్పత్తిని కొందరు మిల్లర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు పౌరసరఫరాల శాఖ గతంలోనే గుర్తించింది. మిల్లులు సీఎంఆర్ కోసం అందిన ధాన్యంలో మేలురకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, నాణ్యమైన బియ్యాన్ని అధిక ధరకు అమ్ముకుంటున్నాయని తేల్చింది. తర్వాత నాసిరకం ధాన్యాన్ని రైతుల నుంచి తక్కువ ధరకు కొని ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. ఇందువల్లే సీఎంఆర్ అప్పగించడంలో జాప్యం జరుగుతోందని అంటున్నాయి. ఈ క్రమంలోనే తనిఖీలు, చర్యలకు ప్రభుత్వం నిర్ణయించిందని వివరిస్తున్నాయి. నాలుగు సార్లు గడువు పెంచినా.. వాస్తవానికి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుకు చేరిన 45 రోజుల్లోనే బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించాలి. గత ఏడాది వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు డిసెంబర్లోనే ముగిశాయి. అంటే ఈఏడాది ఫిబ్రవరి 15లోగా బియ్యాన్ని అప్పగించాలి. కానీ మిల్లులు ఇవ్వలేదు. దీంతో ఎఫ్‌సీఐ మార్చి నెలాఖరు వరకు గడువు ఇచి్చంది. అయినా మిల్లర్లు బియ్యాన్ని సకాలంలో ఇవ్వలేకపోవడంతో తర్వాత జూన్ వరకు, మళ్లీ సెపె్టంబర్ వరకు, చివరికి నవంబర్ 30వ తేదీ వరకు గడువు ఇచి్చంది. అయినా ఇంకా 14 లక్షల టన్నులకుపైగా బియ్యం పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఇదీ చదవండి: పసుపురంగు దేవతావస్త్రం! -
సరి లేదు ‘వరి’కేదీ!.. రాష్ట్ర చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో నాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరిసాగు గత ఏడాది రికార్డును బద్దలు కొట్టింది. కొత్త రికార్డు సృష్టించింది. తెలంగాణ చరిత్రలోనే ఎన్నడూలేనంత అత్యధికంగా ఈ వానాకాలం సీజన్లో ఇప్పటివరకు సాగవడమే కాకుండా ఇంకా ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటివరకు 62.12 లక్షల ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేశారు. ఈ నెలాఖరు వరకు సీజన్ కొనసాగనున్నందున ఇంకా నాట్లు పడతాయని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది (2021) కూడా రికార్డు స్థాయిలో ఏకంగా 61.94 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యింది. ఇతర పంటలు ఎక్కువగా సాగు చేయాలని వ్యవసాయ శాఖ చెబుతున్నా..సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావడం, నీటి వనరులు పుష్కలంగా ఉండటం, పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో పాటు ఉచిత విద్యుత్‌తో రైతులు వరి వైపే మొగ్గు చూపుతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈసారి ధాన్యపు సిరులు రాష్ట్రాన్ని ముంచెత్తనున్నాయి. ఏటా పెరుగుతున్న సాగు రాష్ట్రంలో వరి సాగు ఏడాదికేడాదికీ పెరిగిపోతోంది. తెలంగాణ రాకముందు 2013లో 29.16 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఇప్పుడు అంతకు రెట్టింపు పైగానే సాగు కావడం విశేషం. ఈ ఏడాది మొత్తం 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 45 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేయాలని ప్రతిపాదించింది. అదే సమయంలో పత్తి సాగు లక్ష్యం 70 లక్షల ఎకరాలుగా పేర్కొంది. బుధవారం నాటికి 1.32 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అయితే పత్తి 49.58 లక్షల ఎకరాలకే పరిమితమైంది. కీలకమైన సమయంలో వర్షాలు కురవడం వల్ల వేసిన పత్తి కూడా లక్షలాది ఎకరాల్లో దెబ్బతింది. రెండోసారి వేసే వీలు కూడా లేకుండాపోయింది. మొత్తం మీద వర్షాలు పత్తి సాగు పెరగకుండా అడ్డుకున్నాయి. దీంతో వరి సాగు గణనీయంగా పెరిగింది. కంది ప్రతిపాదిత సాగు లక్ష్యం 15 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 5.57 లక్షల ఎకరాల్లో సాగైంది. సోయాబీన్ లక్ష్యం 3.88 లక్షల ఎకరాలు కాగా, 4.29 లక్షల ఎకరాల్లో వేశారు. మొక్కజొన్న 8.18 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 6.14 లక్షల ఎకరాల్లో సాగైంది. పంటల సాగులో నల్లగొండ టాప్.. రాష్ట్రంలోని 24 జిల్లాల్లో వంద శాతానికి పైగా వానాకాలం సీజన్ పంటలు సాగయ్యాయి. 11.14 లక్షల ఎకరాల సాగుతో నల్లగొండ టాప్‌లో నిలిచింది. 7.75 లక్షల ఎకరాలతో సంగారెడ్డి, 6 లక్షల ఎకరాలతో వికారాబాద్ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. సూర్యాపేట (5.91 లక్షలు), ఆదిలాబాద్ (5.61 లక్షలు), ఖమ్మం (5.56 లక్షలు), కామారెడ్డి (5.12 లక్షలు), నిజామాబాద్ (5.10 లక్షలు), నాగర్‌కర్నూల్ (5.10 లక్షలు) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. అత్యంత తక్కువగా మేడ్చల్ (20 వేలు), ములుగు (1.27 లక్షలు), వనపర్తి (2.21 లక్షలు) ఎకరాల్లో సాగయ్యాయి. నీటి వనరులు పెరగడం,ఉచిత విద్యుత్ వల్లే.. వరి రికార్డు స్థాయిలో సాగైంది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ ప్రాంతంలో వరి అంతంతే. కానీ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కాళేశ్వరంతో రిజర్వాయర్లు నిండిపోవడం, పుష్కలంగా నీటి వనరులు అందుబాటులోకి రావడం, ఉచితంగా 24 గంటలూ కరెంటు ఇస్తుండటంతో రైతులు వరి సాగువైపు మళ్లుతున్నారు. కేంద్రం కొనకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం కొంటుందన్న ధీమాతో వరి వేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. – పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చైర్మన్, తెలంగాణ రైతుబంధు సమితి -
Photo Feature: నేలతల్లి సాక్షిగా.. కన్నవారికి నివాళి అర్పించి‘నారు’
సాక్షి, నిజామాబాద్: సేంద్రియ విధానంలో అనేక దేశీయ వరి రకాలను పండిస్తున్న నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూరుకు చెందిన ఆదర్శ రైతు చిన్నికృష్ణుడు (నాగుల చిన్నగంగారాం) తన తల్లిదండ్రులు ముత్తెన్న, భూదేవిలను నేలతల్లి సాక్షిగా వినూత్నంగా స్మరించుకున్నారు. ‘మా అమ్మ నాన్న–చిన్నికృష్ణుడు’ అనే అక్షరాల రూపంలో పొలంలో భారీ పరిమాణంలో వరి పంట పెరిగేలా వేశారు. 24 రోజుల క్రితం తన సాగు భూమిలో ‘చింతలూరు సన్నాలు’ వరిని విత్తనాల కోసం నాటారు. అయితే మధ్యలో ఒక మడిని ‘బంగారు గులాబీ’ అనే నల్ల రంగు వరిని తన తల్లిదండ్రుల రూపం వచ్చేలా నాటారు. చుట్టూ బోర్డర్ వచ్చేలా ‘పంచరత్న’ రకం వరిని వేశారు. ఇందుకోసం ముందుగా ఓ ఆర్కిటెక్ట్‌తో కాగితంపై మ్యాప్ గీయించుకుని అందుకు అనుగుణంగా వరి రకాలను నాటారు. తాజాగా గురువారం డ్రోన్ ద్వారా చిన్నికృష్ణుడు ఈ చిత్రాన్ని ఫొటో తీయించారు. -
బురద రోడ్డుపై నాట్లు వేసిన ఎమ్మెల్యే
రెంజల్: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కళ్యాపూర్ గ్రామ చౌరస్తాలోని బురద రోడ్డుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ప్రజా గోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా ఆయన నాలుగు రోజులుగా బోధన్ నియోజక వర్గంలో బైక్ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఆదివారం కళ్యాపూర్ మీదుగా యాత్ర సాగింది. రోడ్డు బురదమయం కావడంతో వాహన దారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో బురద రోడ్డుపై ఎమ్మెల్యే నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నాలుగు రోజులుగా బోధన్ నియోజక వర్గంలో పర్యటిస్తున్నానని, రోడ్లపై ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయని తెలి పారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ఇసుక అక్రమ మాఫియాను నడిపిస్తూ సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. -
టెస్ట్ మిల్లింగ్‌కు రెండు వంగడాలు
సాక్షి, హైదరాబాద్/సిద్దిపేట: రాష్ట్రంలో యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయడం వల్ల వచ్చే నూకల శాతాన్ని పరీక్షించేందుకు మైసూర్‌కు చెందిన సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టి ట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ) శాస్త్రవేత్తల బృందాలు ఈ నెల 20 నుంచి రంగంలోకి దిగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాలు సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, యాదాద్రి భువన గిరి, కామారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, వనపర్తి జిల్లాల్లోని 11 మిల్లులను టెస్ట్ మిల్లింగ్ కోసం శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు. మొదటి విడతగా మే 27, 28, 29 తేదీల్లో శాస్త్రవేత్తలు మిల్లులను పరి శీలించి, ఎన్నిరకాల వడ్లు పండిస్తారో తెలుసుకుని వాటి నమూనాలను సేకరించిన విషయం తెలిసిం దే. యాసంగిలో రైతాంగం అత్యధికంగా సాగు చేసే వెయ్యిపది (ఎంటీయూ 1010) రకంతోపాటు మ రో స్థానిక వంగడాన్ని తాజాగా టెస్ట్ మిల్లింగ్ కో సం ఎంపిక చేశారు. ఎంపిక చేసిన 11 మిల్లుల్లో ఈ రెండు రకాల ధాన్యాన్ని ఆయా మిల్లుల సామర్థ్యానికన్నా ఐదు రెట్లు అధికంగా అందుబాటులో ఉంచాలని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20 నుంచి జూలై ఒకటో తేదీ వరకు టెస్ట్ మిల్లింగ్ ప్రక్రియ సాగనుంది. మొదటి, రెండో విడత పరీక్షల ఫలితాలను బేరీజు వేసుకొని నూక శాతాన్ని ప్రకటించనుంది. ఏయే జిల్లాల్లో ఏ రకం ధాన్యం మిల్లింగ్ చేస్తే ఎంతశాతం నూకలు వస్తున్నాయో పరీక్షించి, ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. తదనుగుణంగా ప్రభుత్వం మిల్లులకు పరిహారం ఇవ్వాలని భావిస్తోంది. బాయిల్డ్ రైస్ వద్దనడంతో వచ్చిన చిక్కు తెలంగాణలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే ఎక్కువగా నూక అవుతుందన్న విషయం తెలిసిందే. సాధారణంగా క్వింటాలు ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 67 కిలోల బియ్యం రావాలి. కానీ, యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే కొన్ని జిల్లాల్లో 40 కిలోల బియ్యం కూడా రాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో యాసంగి ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌గా మిల్లింగ్ చేయడం వల్ల నూక శాతం తగ్గి, ఔటర్న్ రేషియో నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. కానీ, కేంద్రం ఇక నుంచి బాయిల్డ్ రైస్‌ను తీసుకునే ప్రసక్తేలేదని తేల్చిచెప్పింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే కష్టనష్టాలను ఓర్చి అయినా యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగానే ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన మిల్లే.. మే నెలలో శాస్త్రవేత్తలు వచ్చి జిల్లాలో వివిధ రకాల వడ్ల శాంపిల్స్‌ను సేకరించారు. మిల్లులను సైతం పరిశీలించారు. శాస్త్రవేత్తలే మిల్లులను ఎంపిక చేసుకున్నారు. టెస్ట్ మిల్లింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా నుంచే టెస్ట్ మిల్లింగ్ ప్రారంభం కానుంది. –హరీశ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్, సిద్దిపేట -
రైతులు దర్జాగా ధాన్యం అమ్మకం
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులకు ఇబ్బందులు లేకుండా సర్కారే నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ప్రతిపక్ష పార్టీలు పని గట్టుకుని అసత్య ప్రచారాలు చేసినా లక్షల టన్నుల ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తోంది. కొనుగోలు చేయడమే కాకుండా రైతులకు రావాల్సిన నగదును వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ధాన్యం కొనుగోలులోను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాలోని ఉన్నతాధికారులు కూడా ఎక్కడా చిన్న పొరపాటు కూడా లేకుండా ధాన్యం సేకరణ నిర్వహిస్తున్నారు. నెల్లూరు (సెంట్రల్): జిల్లాలో రబీ సీజన్లో దాదాపుగా 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. తద్వారా 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 4.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. రూ.600 కోట్ల వరకు చెల్లింపులు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 246 ఆర్బీకేల ద్వారా ఇప్పటి వరకు 22,202 మంది రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి మొత్తం 948.87 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే రూ.648 కోట్లను ఆయా రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇంకా ఆర్బీకేల ద్వారా ఇంకా భారీ మొత్తంలో మిల్లులకు ధాన్యం సరఫరా చేశారు. అయితే వీటికి సంబంధించి బ్యాంక్ గ్యారెంటీలు రాకపోవడంతో ట్రక్ షీట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఇంకా ఎక్కువ మొత్తంలో ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారిక ధ్రువీకరణ లభిస్తుంది. ఇటీవల కొనుగోలు చేసి వాటికి మాత్రమే మిగిలిన నగదు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. త్వరలో రైతుల ఖాతాల్లో పడే విధంగా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి ఏటా పెరుగుదల రాష్ట్ర సర్కారు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసే ధాన్యం పరిశీలిస్తే ప్రతి ఏటా అధికంగానే కొనుగోలు చేస్తోంది. 2020లో దాదాపు 3.90 లక్షల మెట్రిక్ టన్నులు, 2021లో 4.40 లక్షల మెట్రిక్ టన్నులు, 2022లో ఇప్పటి వరకు 4.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లకు ఏ రైతులు విక్రయం చేయడానికి వచ్చినా కచ్చితంగా కొనుగోలు చేసే విధంగా అధికారులు గట్టి చర్యలు తీసుకోవడంతో ఎక్కడా ఇబ్బందులు లేకుండా నిర్వహించారు. త్వరలోనే ఇస్తాం జిల్లాలోని ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రావాల్సిన నగదును త్వరితగతిన ఇచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతోంది. చాలా మంది రైతుల ఖాతాల్లో నగదు చేయడం జరిగింది. ఇటీవల కొనుగోలు చేసిన రైతులకు మాత్రమే నగదు ఇవ్వాల్సి ఉంది. త్వరలోనే ఇస్తాం. – పద్మ, పౌరసరఫరా శాఖ సంస్థ జిల్లా మేనేజర్ చదవండి: స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రప్రథమం... భూవివాదాలకు చెక్..! -
ఆందోళనొద్దు.. ఆదుకుంటాం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రైతాంగానికి భరోసా ఇచ్చారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందొద్దని, ఆధైర్యపడాల్సిన అవసరం లేద న్నారు. అన్నదాతలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందన్నారు. అకాల వర్షాలపై ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితు లతోపాటు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల సోమవారం పౌర సరఫరాల భవన్లో ఉన్నతస్థాయిలో సమీక్షించారు. ధాన్యం కొనుగోళ్లు, తరలింపు, తడిసిన ధాన్యం, గన్నీ బ్యాగులు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు. ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి.. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని సరైన పద్ధతిలో ఆరబెట్టి నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు మంత్రి గంగుల విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో అధికారులు రైతులకు మరింత అవగాహన కల్పించాలన్నారు. వచ్చే 2–3 రోజుల్లోనూ అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, రైతాంగానికి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు వెంటనే అన్లోడింగ్ చేసుకొని వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కొను గోలు కేంద్రాల్లో అవసరమైన మేరకు టార్పా లిన్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. 20.25 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతోందని, ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర, తరుగు తదితర అంశాలపై రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందడం లేదని మంత్రి గంగుల తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం ఏమాత్రం సహకరించ కున్నా.. కొత్తగా ఒక గన్నీ బ్యాగును ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పటివరకు 9.97 కోట్ల గన్నీ బ్యాగులను సమకూర్చు కుందని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకుంటున్నా మని, కొనుగోలు ప్రక్రియను కూడా వేగవంతం చేశామన్నారు. రోజుకు దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 6,832 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ధాన్యం దిగుబడికి అనుగుణంగా ఇప్పటివరకు 6,369 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు గంగుల తెలిపారు. 3.18 లక్షల మంది రైతుల నుంచి రూ. 3,961 కోట్ల విలువైన 20.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు. ఇందులో 19.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించామన్నారు. తరుగు తీస్తే చర్యలు తప్పవు... తాలు, తరుగు పేరుతో కోతలు విధిస్తే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గంగుల హెచ్చరించారు. అవసరమైతే వారిని బ్లాక్ లిస్టులో పెట్టాడానికి కూడా వెనకడాబోమని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాక అక్కడ తాలు పేరుతో తరుగు తీయడం చట్ట విరుద్ధమన్నారు. ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రత్యేక నిఘా ఉంచాలని సూచిం చారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, మెదక్ కలెక్టర్ హరీశ్, మెదక్, సిద్దిపేట అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కేసీఆర్ చెప్తేనే అలా చేశాం.. మోసపోయాం.. పరిహారమిచ్చి ఆదుకోండి
ఉప్పల్వాయికి చెందిన తిరుమలయ్యకు పెద్ద చెరువు కింద ఏడు ఎకరాల భూమి ఉంది. చెరువులో నీరు ఉండటంతో వానాకాలంలో మొత్తం వరి సాగు చేశాడు. యాసంగిలో కూడా వరి వేద్దామనుకున్నాడు. కానీ ప్రభుత్వం ధాన్యం కొనం అనడంతో ఐదు ఎకరాలు బీడు ఉంచి రెండు ఎకరాల్లో వేశాడు. తీరా ప్రభుత్వం ఇప్పుడు పంట కొంటాం అనడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మద్దికుంటకు చెందిన బండి నవీన్‌కు 3 ఎకరాల ఏడు గుంటల భూమి ఉంది. రెండు బోర్లు మంచిగా పోస్తాయి. యాసంగిలో వడ్లు కొనం అని ప్రభుత్వం ప్రకటించడంతో తన భూమిలో ఇతర పంటలు పండవని బీడుగా వదిలేశాడు. తీరా ఇప్పుడు ధాన్యం కొంటుండంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. సర్కార్ మాట విని మోసపోయానని వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. రామారెడ్డి (నిజామాబాద్): సర్కార్ మాట విని యాసంగిలో వరి వేయకుండా ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలంలో పంట వర్షాలకు దెబ్బతిని నష్టపోయామని, ఇప్పుడు ప్రభుత్వం మాట విని బీళ్లుగా ఉంచామని వాపోతున్నారు. యాసంగిలో వరి వేయద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసింది. ఒక వేళ వరి సాగు చేసిన కొనుగోలు చేయమని ప్రకటించింది. దీంతో చాలామంది రైతులు నీళ్లున్నా.. భూములను బీళ్లుగా ఉంచారు. చెరువుల కింద ఇతర పంటలు పండక పోవడంతో చాలావరకు బీడు పెట్టారు. కొంతమంది మాత్రం ధైర్యం చేసి వరి వేశారు. జిల్లాలో భూములు ఆరుతడి పంటలను అనుకులంగా లేకపోవడం, కోతుల బెడద, పెట్టుబడి ఖర్చులు భారీగా పెరగడంతో చాలా మంది రైతులు పంటలు వేయలేదు. ప్రభుత్వ ప్రకటనతో జిల్లాలో వరి సాగు తగ్గింది. గతేడాది యాసంగిలో జిల్లాలో 2.47 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా ఈ సీజన్లో 1.5లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఉపాధి కరువు జిల్లాలో ఎక్కువగా బోరు బావులు, చెరువు నీళ్లు పారకంతో వ్యవసాయం చేస్తుంటారు. వడ్లు కొనమని చెప్పడంతో ఎకరం ఉన్న రైతులు బీడుగా వదిలేయగా, 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులు 2 ఎకరాల వరకు వరి పంటను సాగు చేశారు. చాలా మంది యువ రైతులు, వ్యవసాయ కూలి పనులు చేసుకునే వారు ఉపాధి కరువై వలస బాట పట్టారు. పనులు లేకపోవడంతో హైదరాబాద్, ముంబాయి నగరాలకు వెళ్లారు. తీరా ఇప్పుడు కొనుగోళ్లు ప్రా రంభించడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. సీఎం చెప్పడంతోనే తాము వరి వేయలేదని.. కొనుగోలు చేస్తామని ముందే చెబితే తాము నష్టపోయేవారం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాట విని పొలాలను బీళ్లుగా ఉంచిన వారికి పరిహారం ఇవ్వాలని వారు కోరుతున్నారు. కేసీఆర్ వద్దంటేనే వేయలేదు వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్ అనడంతోనే పంట వేయలేదు. ఇప్పుడు వడ్లు కొంటామని చెప్తున్నారు. నీళ్లు ఉన్నా వరి వేయని మా పరిస్థితి ఏమిటి? వరి వేయని రైతులకు పరిహారం ఇవ్వాలి. – రాములు, రైతు, గిద్ద పరిహారం ఇవ్వాలి వరి సాగు చేయవద్దని వ్యవసాయాధికారులే చెప్పారు. ఇప్పుడు వడ్లు కొంటాం అంటున్నారు. వారి మాట విన్న మేము మోసపోయాం. ప్రభుత్వం పరిహారం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. – రాజయ్య, రైతు, గిద్ద -
చేతనైతే ప్రధాని అవినీతి బయటపెట్టు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు సత్తా ఉంటే, చేతనైతే ప్రధాని మోదీ అవినీతి చిట్టాను ప్రజల ముందు ఉంచాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రంపై, ప్రధానిపై గాలి మాటలు మాట్లాడ వద్దని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లు సహా ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమన్నారు. గౌరవప్రదమైన భాషలో మాట్లాడితేనే వస్తానని శనివారం మీడియాతో కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్లో భూకంపం రాకుండా చూసుకోండి గవర్నర్ విషయంలో టీఆర్ఎస్ సర్కార్ దిగజారి ప్రవర్తిస్తోందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ‘మరో గవర్నర్ ఉండి ఉంటే కాళ్ల మీద పడతాడు, ఈ గవర్నర్ కాళ్లు పీకుతున్నాడు. ఇంత దిగజారుడు వ్యవహారం ఏ సీఎం చేయలేదు’ అని అన్నారు. ఢిల్లీ వెళ్లి భూకం పం సృష్టిస్తామన్నారని, ముందు టీఆర్ఎస్లో భూకంపాలు, ప్రళయాలు రాకుండా కేసీఆర్ చూసుకోవాలని ఎద్దేవా చేశారు. తెలంగాణలో సీబీఐ, ఈడీ ఒక్క కేసు అయినా రాజకీయ కోణంలో పెట్టిం దేమో చూపాలన్నారు. ‘111జీఓ పరిధిలో మీకు ఏమైనా భూములు ఉన్నాయా... ఈడీ, సీబీఐలకు ఎందుకు భయపడుతున్నారు.’అని ప్రశ్నించారు. గవర్నర్ పాలన రావాలనుకోవడం లేదు తెలంగాణలో గవర్నర్ పాలన రావాలని తాము అనుకోవడం లేదని కేంద్రమంత్రి చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ఇక్కడ గెలిచి అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్ని తెలంగాణ ప్రజాభవన్‌గా మారుస్తామన్నారు. ‘రూ.10 వేల కోట్లతో రోడ్ల నిర్మాణానికి రాష్ట్రం సహకరించలేదు. సైన్స్ సిటీకి భూమి ఇవ్వలేదు. ఎంఎంటీఎస్ రెండో దశ ప్రారంభించడం లేదు. వరంగల్‌లో సైనిక్ స్కూల్ ఇస్తే పెట్టలేదు. మెట్రో పనులు ఆపారు’ అని విమర్శించారు. రాష్ట్రంలో నడుస్తున్న బస్తీ దవాఖానాలు ఎవరివో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా స్పం దించడంతో చివరకు ఈ నెల 29న కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి రూ.10 వేల కోట్ల రోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. కక్షపూరిత రాజకీయాలు టీఆర్ఎస్ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, సోషల్ మీడియాపై నిర్బంధం పెరిగి పోయిందని కేంద్ర మంత్రి విమర్శించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల వేధింపులు విపరీతంగా పెరిగాయని అన్నారు. ఖమ్మం బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌పై 16 కేసులు పెట్టారని, మూడుసార్లు జైలుకు పంపించి పోలీసులు వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్‌పై కేసు పెట్టారు కానీ అందుకు కారణం అయిన వారిపై మాత్రం కేసు పెట్టలేదని విమర్శించారు. -
వడ్లు వేయొద్దన్నరు.. ఇప్పుడేమి కొంటున్నరు
ముస్తాబాద్ (సిరిసిల్ల): పోయిన సీజన్లో దొడ్డు వడ్లు వేయొద్దన్నరు.. యాసంగిలో వరి పెడితే ఉరేనని భయపెట్టిండ్రు.. ఇప్పుడేమి వడ్ల కొంటున్నరు.. ప్రభుత్వం కొనదేమోనని ముందుగా రైస్ మిల్లులకు తక్కువ ధరకు అమ్మి నష్టపోయినం.. మా పరిస్థితి ఏంటి.. అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామ రైతులు అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్‌ను నిలదీశారు. ఆవునూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం చేందుకు శుక్రవారం గ్రామానికి వచ్చిన అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌కు ఈ అనుభవం ఎదురైంది. వరి వేయొద్దని ఆవునూర్ రైతు వేదికలోనే కలెక్టర్ చెప్పడంతో గ్రామంలో చాలా మంది రైతులు వరి వేయలేదని రైతులు వాపోయారు. కొందరే మో బీడు భూములు ఉంచడం ఇష్టం లేక వరి పండించి.. ఎవరూ కొనమంటే రైస్‌మిల్లులకు తక్కువ ధరలకే అమ్ముకున్నామన్నారు. దీనిపై అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తామన్నారు. ఆవునూర్‌లో పంట కోతలు ముందుగా వస్తాయని.. ఎందరు రైతులు మిల్లర్లకు విక్రయించారో విచారణ జరిపి వారికి మద్దతు ధర ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. -
ధాన్యం అన్‌లోడింగ్‌కు మిల్లర్లు ఓకే
సాక్షి, హైదరాబాద్: కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వచ్చే యాసంగి ధాన్యాన్ని దించుకునేందుకు (అన్లోడింగ్) మిల్లర్లు అంగీకరించారు. వేసవిలోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వంతో కలసి నడుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు మిల్లర్లతో రాష్ట్ర పౌరసర ఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం హైదరాబాద్ లోని పౌరసరఫరాల శాఖ భవన్లో భేటీ అయ్యారు. కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాల నుంచి పంపిన ధాన్యాన్ని అన్లోడింగ్ చేయడానికి మిల్లర్లు విముఖత చూపుతున్న అంశంపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాల ని కోరారు. అదే సమయంలో మిల్లర్లు రైతులను తరుగు, తాలు పేరుతో ధాన్యం కోతలతో వేధించడాన్ని మంత్రి తప్పుబట్టారు. మిల్లర్‌కు, రైతుకు మధ్య సంబంధం ఉండరాదని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాల ప్రకారమే ధాన్యాన్ని మిల్లులకు పంపుతున్నామని, అందువల్ల ఒక్క కిలో కూడా మిల్లుల్లో కోత పెట్టరాదని ఆదేశించారు. సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ యాసంగి ధాన్యం కస్టమ్ మిల్లింగ్ చార్జీలు నిర్ణయిస్తుందన్నారు. అలాగే రైస్ మిల్లర్ల ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకుంటామని గంగుల హామీ ఇచ్చారు. మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించడం బాధాకరం... ఈ భేటీలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ధాన్యం సేకరణ, మిల్లింగ్‌లో కీలకపాత్ర పోషిస్తున్న మిల్లర్లను దొంగలుగా చిత్రీకరించడం బాధాకరమని వాపోయారు. ఇప్పటికే నష్టాల్లో ఉండటం వల్ల యాసంగిలో ఎఫ్‌సీఐ కోరిన మేరకు 67 శాతం ఔటర్న్ రాదనే భయంతో ధాన్యం అన్‌లోడింగ్‌కు కొందరు మిల్లర్లు భయపడుతున్నారని మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి మంత్రికి వివరించారు. రాష్ట్రంలో 2,400 మిల్లుల్లో 1,500కుపైగా బాయిల్డ్ మిల్లులున్నా యని... ఎఫ్‌సీఐ, కేంద్రం తీరుతో వాటిపై ఆధారపడి న లక్షలాది కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొందన్నారు. రా రైస్ మర ఆడించడం వల్ల కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువ బియ్యం వచ్చే అవకాశం ఉందన్నారు. అందువల్ల తమకు నష్టాలు లేకుండా చూడాలని కోరారు. భేటీలో సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్, కార్పొరేషన్ జీఎంలు, మిల్లర్లు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై సీఎస్ కమిటీ భేటీ యాసంగి ధాన్యం సేకరణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన ప్రత్యేక కమిటీ శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమైంది. ఈ భేటీలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌరసరఫరాల కమిషనర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లాలవారీగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు, ధాన్యం కొనుగోళ్లు, ఎఫ్‌సీఐకి అందించాల్సిన ధాన్యంపై చర్చించారు. -
4.54 లక్షల బస్తాలు మాయం
సాక్షి, న్యూఢిల్లీ: ‘తెలంగాణలోని రైస్ మిల్లుల్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఉండాల్సిన ధాన్యం నిల్వలు ఉండట్లేదు. గత నెల 31న ఎఫ్‌సీఐ అధికారులు చేసిన తనిఖీల్లో 40 రైస్ మిల్లుల్లో 4,53,896 బస్తాల ధాన్యం కొరత ఉన్నట్టు తేలింది’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ‘మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యాన్ని ఎక్కడికి తరలించారు. ఎవరిని మోసం చేసేందుకు, ఎవరి బ్యాంక్ వడ్డీని తప్పించుకోవడం కోసం ప్రయత్నించారు. ఎఫ్‌సీ ఐకి అందించాల్సిన సమయంలో ధాన్యం ఎలా అం దిస్తారు?’ అని ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం అవకతవకల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రైస్ మిల్లుల్లో స్టాక్స్ పరిశీలనకు ఆకస్మిక తనిఖీలు చేయాలని ఎఫ్‌సీఐ అధికారులను కేంద్రం ఆదేశించిందన్నారు. కొన్ని మిల్లుల్లో ధాన్యం కొరత విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని కోరామని, రైస్ మిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం ఎం దుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. మిల్లు లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర సర్కారుకు కేంద్రం లేఖ రాయబోతోంద న్నారు. రైస్ మిల్లులు, కేంద్రానికి/ఎఫ్‌సీఐకి మధ్య ఎలాంటి ఒప్పందాలు ఉండని కారణంగా నేరుగా సీబీఐ దర్యాప్తు చేయించే అవకాశం కేంద్రానికి ఉండదన్నారు. బియ్యం కొనుగోలుకు అంగీకరించి ఏర్పాట్లు చేయరా? ప్రస్తుత యాసంగి సీజన్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇచ్చేందుకు ఈ నెల 13న తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు ఈ నెల 18న కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఏర్పాట్లు ప్రారంభించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులు, రైస్ మిల్లర్లకు స్పష్టత ఇవ్వలేదన్నారు. పైగా బియ్యం కొనుగోలుకు కేంద్రం అంగీకరించిన తర్వాత కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి గతంలో కేంద్రం అనేక సమావేశాలను నిర్వహిం చినా పచ్చి అబద్ధాలు, విష ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడంతో రాష్ట్రంలోని చాలా మంది రైతులు మద్దతు ధర కన్నా తక్కువకే ధాన్యం అమ్ముకున్నారని, దీనికి బాధ్యులెవరని ప్రశ్నించారు. రాజకీయ స్వలాభం కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడారని, రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని విమర్శించారు. 15 కోట్ల గోనె సంచులకు రాష్ట్రం దగ్గర కోటి కూడా లేవు గత రబీ, ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ టార్గెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి చేయలేదని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుత యాసంగి సీజన్ 60 ఎల్ఎంటీ ధాన్యం సేకరణకు కనీసం 15 కోట్ల గోనె సంచులు అవసరం కాగా తెలంగాణలో కోటి బస్తాలు కూడా లేవన్నారు. అన్ని రాష్ట్రాలూ జనవరి నుంచే గోనె సంచుల సేకరణ ప్రారంభించా యని, తెలంగాణలో మాత్రం ప్రారంభంకాలేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ రకంగా ధాన్యాన్ని సేకరించి రవాణా చేస్తారన్నారు. ‘తండ్రీకొడుకుల ప్రభుత్వం.. తట్టల్లో బియ్యం మోస్తుందా?’ అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలని, యుద్ధ ప్రాతిపదికన రైతుల నుంచి ధాన్యం కొనాలని, రైస్ మిల్లర్లపై అజమాయిషీ చేసి రైతులను ఆదుకునేందుకు ముందుకురావాలని అన్నారు. కమీషన్ల కోసం అప్పులు తెస్తున్నారు రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేసీఆర్ నష్ట పరిహారం ఇస్తే తమకేం ఇబ్బంది లేదని కిషన్‌రెడ్డి అన్నారు. అయితే రాష్ట్రంలో పేదలే లేనట్టు, రైతుల ఆత్మహత్యలు జరగనట్టు, నిరుద్యోగ యువకుల బలిదానాలు చేసుకోనట్టు చూపించే ప్రయత్నం చేయొద్దన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ రాజకీయలు, దుర్మా ర్గాలు, మాఫియా కారణంగా ఆత్మహత్యలు చేసు కుంటున్న కుటుంబాలను ముందు ఆదుకోవాల న్నారు. రాష్ట్రంలో చనిపోయిన రైతులు, అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలన్నారు. కమీషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెస్తోందని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం ఆలోచించే తమకు కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబీకుల సర్టిఫికెట్ అవసరంలేదన్నారు. లేఖలు రాస్తే పట్టించుకోరా? ‘వరి, గోధుమ ఎక్కువగా పండే ప్రాంతాల్లో జీవ ఇంధన అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేయాలని 2018లో అన్ని రాష్ట్రాలను కేంద్రం కోరింది. అదే సంవత్సరంలో అప్పటి పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్.. సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 2019లో తెలంగాణ సీఎస్‌కు మరోసారి లేఖ రాశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పాలసీని ఉపయోగించు కోలేదు. పైగా ఫోర్టిఫైడ్ రైస్ విషయంలోనూ రైస్‌మిల్లర్లను ప్రోత్సహించడంలో విఫలమైంది’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
అక్రమాలపై ఎఫ్‌సీ‘ఐ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ ద్వారా అప్పగించే క్రమంలో రైస్ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాల తీరుపై భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సీరియస్‌గా ఉంది. సేకరించిన ధాన్యాన్ని బియ్యం(సీఎంఆర్)గా ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన మిల్లర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారని.. సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యానికి బదులు పాత బియ్యం, రీసైక్లింగ్ చేసిన పీడీఎస్ (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) బియ్యం ఇస్తున్నారని భావిస్తోంది. దీంతో రాష్ట్రం లోని అన్ని మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ చేశాకే బియ్యం సేకరించాలని జిల్లాల వారీగా ఎఫ్‌సీఐ అధికారులకు ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులకు ఎఫ్‌సీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అశోక్‌కుమార్ బుధవారం లేఖ రాశారు. గత నెలలో భౌతిక తనిఖీల్లో మాయమైన ధాన్యం ఏమైందో తేల్చాలని కూడా రాష్ట్ర ఉన్నతాధికారులను ఎఫ్‌సీఐ ఆదేశించినట్లు సమాచారం. 18,156 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం 2020–21 యాసంగి, 2021–22 వానకాలం సీజన్లలో సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం తీసుకెళ్లిన రైస్ మిల్లులు.. ఆ బస్తాలను నిల్వ చేసి ఎప్పటికప్పుడు మర పట్టించి బియ్యంగా ఎఫ్‌సీఐకి ఇవ్వాలి. అయితే బియ్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించిన విషయం గత నెలలో వెలుగు చూసింది. దీంతో మార్చి 20 నుంచి 23వ తేదీ వరకు 425 మిల్లుల్లో 2020–21 యాసంగి ధాన్యం బస్తాలను, 533 మిల్లుల్లో మొన్నటి వానకాలం సీజన్ ధాన్యం బస్తాలను ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీ చేశారు. 2020–21 యాసంగి ధాన్యానికి సంబంధించి 19 మిల్లుల్లో 1.96 లక్షల ధాన్యం సంచులు, వానకాలం ధాన్యానికి సంబంధించి 21 మిల్లుల్లో 2.58 లక్షల ధాన్యం సంచులు.. మొత్తంగా 18,15 మెట్రిక్ టన్నుల (4.54 లక్షల బ్యాగులు) ధాన్యం మాయమైనట్టు గుర్తించారు. ఈ ధాన్యం బస్తాలకు సంబంధించిన వివరాలేవీ మిల్లర్లు వెల్లడించకపోవడంతో చర్యలు తీసుకోవాలని మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌సీఐ సమాచారమిచ్చింది. గతంలోనూ 20 మిల్లుల్లో జరిపిన భౌతిక తనిఖీల్లో 2020–21 యాసంగి ధాన్యానికి సంబంధించి 1.76 లక్షల బ్యాగులు మిస్సయ్యాయి. ఏమాత్రం తేడా ఉన్నా.. గత మార్చిలో 3,278 రైస్ మిల్లుల్లో భౌతిక తనిఖీలకు ఎఫ్‌సీఐ ఆదేశించింది. అయితే 958 మిల్లుల్లో జిల్లా స్థాయి ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు చేయగా 40 మిల్లుల్లో అవకతవకలు బయటపడ్డాయి. ఇంకో 2,320 మిల్లుల్లో తనిఖీలు చేయాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల ప్రక్రియ సాగలేదు. తాజాగా యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియ మొదలవుతున్నందున గత సంవత్సరం యాసంగి, వానాకాలం ధాన్యం నిల్వలపై తనిఖీలు జరపాలని సంస్థ నిర్ణయించిన ఎఫ్‌సీఐ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 27 కల్లా మిగిలిన 2,320 మిల్లుల్లో ధాన్యం బస్తాలను లెక్కించేందుకు వీలుగా ఉంచాలని ఆదేశించింది. 28న అన్ని మిల్లుల్లో పౌరసరఫరాల శాఖతో కలిసి ఎఫ్‌సీఐ ఫిజికల్ వెరిఫికేషన్ జరపనుంది. బస్తాల లెక్కతో పాటు ఇప్పటి వరకు మిల్లుల్లో సాగిన లావాదేవీలు, లెక్కలనూ అధికారులు తనిఖీ చేయనున్నారు. ధాన్యం బస్తాల నిల్వల్లో ఏమాత్రం తేడాలున్నా రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఎఫ్‌సీఐ నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. యాసంగి సీజన్లో ముడి బియ్యాన్ని సీఎంఆర్‌గా చేసివ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై ఇప్పటికే ఆందోళన చెందుతున్న మిల్లర్లకు ఇది అశనిపాతమే. పాతవో, కొత్తవో తేల్చేందుకు పరీక్షలు మిల్లర్లు ఎఫ్‌సీఐకి అప్పగించే బియ్యం విషయంలో ఇక కఠినంగా ఉండాలని ఎఫ్‌సీఐ నిర్ణయించింది. బియ్యం ఏ సీజన్లో పండిన ధాన్యానికి సంబంధించిందో తేల్చడంతో పాటు ముడి బియ్యమా, ఉప్పుడు బియ్యమా లేక స్టీమ్డ్ రైసా నిర్ధారించేందుకు శాస్త్రీయ పద్ధతితో లిట్మస్ టెస్టు నిర్వహించనుంది. థియో–బార్బిట్యూరిక్ యాసిడ్ (టీబీఏ)తో పరీక్షించడం ద్వారా బియ్యం నాణ్యత తెలుస్తుందని ఇప్పటికే తేలడంతో ఎఫ్‌సీఐ ఈ నిర్ణయం తీసుకుంది. -
ధాన్యం కొనుగోళ్లకు 12 వేల కోట్ల బ్యాంక్ రుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం బ్యాంకుల నుంచి రూ.12 వేల కోట్ల రుణం తీసుకోనుంది. మరోవైపు 6,983 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా కోతలు మొదలైన జిల్లాల్లో ఇప్పటికే 536 కేంద్రాలను ఏర్పాటు చేసి 1,200 టన్నుల మేర ధాన్యం కొనుగోలు చేసింది. అలాగే ధాన్యం కొనుగోలుకు 15 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవగా ఇప్పటివరకు 1.6 కోట్ల గన్నీ బ్యాగులను సేకరించింది. మరో 6.15 కోట్ల బ్యాగుల కోసం ఆర్డర్ ఇవ్వగా ఇంకో 8 కోట్ల బ్యాగులను టెండర్ ద్వారా సేకరించనుంది. అందుబాటులో రూ. 4,350 కోట్లు .. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైతే రైతులకు చెల్లించేందుకు అవసరమైన నిధులను కూడా పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం ఈ శాఖ దగ్గర రూ. 4,350 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తంతో 22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయవచ్చు. కాగా, కేంద్రం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) చెల్లింపులు ప్రతిరోజు రూ.40 కోట్ల వరకే చేసేలా ఫ్రీజింగ్ పెట్టడంతో రాష్ట్రంలో ధాన్యం సేకరణ పరిస్థితిని వివరించి ఒకేరోజు రూ.1,900 కోట్లు విడుదలయ్యేలా మంత్రి గంగుల కమలాకర్ చర్యలు తీసుకున్నారు. కాగా, వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణకు ధాన్యం రాకుండా నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో 51 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు మంత్రి గంగుల తెలిపారు. -
మిల్లింగ్‌పై కొర్రీలు పెట్టొద్దు
సాక్షి, హైదరాబాద్: రైతుల శ్రేయస్సు దృష్ట్యా అదనపు ఆర్థికభారాన్ని భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం సేకరిస్తున్నందున మిల్లింగ్ విషయంలో ఎఫ్‌సీఐ అనవసర కొర్రీ లు పెట్టొద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. యాసంగి ధాన్యం సేకరణ నేపథ్యంలో ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో భేటీ అయ్యారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులతో కలసి ధాన్యం సేకరణ, సీఎంఆర్, గోడౌన్ సమస్యలపై చర్చించారు. యాసంగిలో తెలంగాణలో పండే ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూక శాతం ఎక్కువగా ఉం టుందనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. నూక శాతం పెరగడం వల్ల ఎదురయ్యే అదనపు భారాన్ని భరించి సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి ముడి బియ్యం ఇచ్చేందుకు తమ ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. నాణ్యతాప్రమాణాల మేరకు ముడిబియ్యం అందిస్తామని కేంద్రానికి, ఎఫ్‌సీఐకి లేఖలు రాసినట్లు చెప్పారు. గత యాసంగికి సంబంధించి ఎఫ్‌సీఐ సేకరించాల్సిన 5.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ‘ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్’రూపంలో తీసుకోవాలని సూచించారు. వానాకాలం సీజన్ కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని వేగంగా అందించేలా రైల్వే ర్యాకులు, అదనపు స్టోరేజీ కల్పించాలని కోరారు. ధాన్యం తక్కువ సేకరించే రాష్ట్రాలకు, అధి కంగా సేకరించే తెలంగాణకు సీఎంఆర్‌లో ఒకే గడువు ఇస్తున్నారని, ఈ అసమగ్ర విధానాన్ని పున:సమీక్షించాలని దీపక్ శర్మను కోరారు. ఈ యాసంగిలో దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించనున్నామని చెప్పారు. ఇందుకోసం 15 కోట్ల గన్నీ సంచులు అవసరమని, వీటి కోసం జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశామని చెప్పారు. యాసంగి ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడటానికి ఎఫ్‌సీఐ నుంచి డీజీఎం కమలాకర్, పౌర సరఫరాల సంస్థ జీఎం రాజిరెడ్డిని నోడల్ ఆఫీసర్లుగా నియమించనున్నట్లు చెప్పారు. పక్క రాష్ట్రాల ధాన్యాన్ని అడ్డుకోవాలి ఎఫ్‌సీఐ జీఎంతో సమావేశం అనంతరం ధాన్యం కొనుగోలు ప్రక్రియపై పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి కమలాకర్ సమీక్షించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. పక్క రాష్ట్రాల నుంచి ఒక్క వడ్ల గింజ కూడా కొనుగోలు కేంద్రాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం విజిలెన్స్ టీం పక్కా ప్రణాళికలతో ఈ రెండు నెలలు క్షేత్రస్థాయిలో నిరంత రం పర్యవేక్షించాలన్నారు. రీసైక్లింగ్ బియ్యం రాకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని, వస్తే కేసులు నమోదు చేయాలని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 34 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. అనంతరం ధాన్యం సేకరణలో ఉన్న ఆర్థికపరమైన అంశాలపై రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో బీఆర్కే భవన్లో భేటీ అయ్యారు. రుణాలపై రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ, గత బకాయిలు వంటి అంశాలను చర్చించారు. -
బియ్యం అక్రమాలపై సీబీఐ విచారణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) పేరుతో రైస్ మిల్లుల్లో జరుగుతున్న అవకతవకలు, బియ్యం రీ సైక్లింగ్‌పై తక్షణం సీబీఐ విచారణ జరిపించాలని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 2014 నుంచి ఇప్పటివరకు సీఎంఆర్ కేటాయింపులు, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు చేసిన సరఫరా, మాయమైన బియ్యం నిల్వలన్నింటిపైనా విచారణ సమగ్రంగా జరగాలని కోరారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి సూత్రధారులుగా ఉన్న టీఆర్ఎస్ ముఖ్యులపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తెలిపారు. టీఆర్ఎస్పై ఉత్తుత్తి పోరాటాలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టడం కాదని, తక్షణం బియ్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ చేశారు. భారీగా అవకతవకలు రాష్ట్రంలో ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్, ధాన్యా న్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసే ప్రక్రియలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల మేర ధాన్యం కుంభకోణానికి పాల్పడుతున్నారని రేవంత్‌రెడ్డి లేఖ లో ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 900 మిల్లుల్లో తనిఖీ చేస్తేనే రూ.400 కోట్ల కుంభకోణం బట్టబయలైందని, ఇంత స్పష్టంగా కుంభకోణం జరుగు తున్నట్టు ఆధారాలు కనిపిస్తుంటే కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. -
ఉప్పుడు బియ్యం బంద్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కోరిన విధంగా యాసంగిలో పండిన ధాన్యాన్ని ముడిబియ్యంగానే (రా రైస్) ఎఫ్‌సీఐకి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సుమారు రెండు దశాబ్దాలకు పైగా యాసంగిలో పండిన ధాన్యాన్ని లెవీ కింద ఉప్పుడు బియ్యంగా (పారాబాయిల్డ్ రైస్) ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నప్పటికీ, ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో దానికి ఫుల్స్టాప్ పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా, ఎన్ని లేఖలు రాసినా, ఆందోళనలు చేసినా ఉప్పుడు బియ్యాన్ని సేకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పడే భారాన్ని భరించి యాసంగిలో బాయిల్డ్ రైస్ స్థానంలో ముడిబియ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీంతో మిల్లర్లు ఉప్పుడు బియ్యానికి స్వస్తి చెప్పి, కేవలం ముడిబియ్యం మిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 2,470 ముడి బియ్యం మిల్లులు ఉండగా, 970 బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయి. అయితే బాయిల్డ్ రైస్ మిల్లుల్లో ముడిబియ్యం మిల్లింగ్ చేసే అవకాశం కూడా ఉంది. వానాకాలంలో అలా.. ఇప్పటివరకు ఉన్న పద్ధతి ప్రకారం.. వానాకాలం (ఖరీఫ్) సీజన్లో వచ్చే ధాన్యాన్ని రైతులు తమ ఆహార అవసరాలకు మినహాయించుకోగా మిగతా దానిని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయిస్తారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మిల్లింగ్‌కు పంపించి ముడిబియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగిస్తుంది. యాసంగిలో ఇప్పటివరకు.. యాసంగి (రబీ)లో వచ్చే ధాన్యంలో కూడా తన అవసరాలకు పోను 80 నుంచి 90 శాతం ధాన్యాన్ని రైతు కొనుగోలు కేంద్రాలకు విక్రయిస్తాడు. ఆ ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లులకు పంపించి, ఉప్పుడు బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగిస్తుంది. ముడిబియ్యంగా మారిస్తే అదనంగా 17 కిలోల నూకలు ప్రస్తుతం యాసంగి పంట కోతలకు వస్తుండటం, కేంద్రం ఉప్పుడు బియ్యం తీసుకోబోమనడం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎఫ్‌సీఐకి ముడి బియ్యాన్నే పంపించాలని స్పష్టం చేయడంతో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. యాసంగి ధాన్యాన్ని సాధారణ పద్ధతుల్లో మిల్లింగ్ చేసి ముడిబియ్యంగా మారిస్తే క్వింటాలుకు అదనంగా 17 కిలోల వరకు నూకలు వచ్చే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పెద్దమొత్తంలో నూక ఉన్న బియ్యాన్ని కేంద్రం తీసుకోదు. కాబట్టి ఆ మేరకు బియ్యాన్ని కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుంది. ఈ భారాన్ని ఎలా భరించాలనే విషయాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించనుంది. ఇప్పటివరకు ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారమే.. ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం.. క్వింటాలు ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే ఏ సీజన్లో అయినా 67 కిలోల బియ్యం రావాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి ఇచ్చే 67 కిలోల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక క్వింటాలు ధాన్యంగా పరిగణనలోకి తీసుకొని కనీస మద్దతు ధర కింద రూ.1,960 రాష్ట్రానికి చెల్లిస్తుంది. అయితే ఈ 67 కిలోల బియ్యంలో 17 కిలోల (25 శాతం) వరకు నూకలు ఉన్నా ఎఫ్‌సీఐ అంగీకరించి, క్వింటాలు ధాన్యంగానే లెక్క కట్టి డబ్బులు చెల్లిస్తుంది. ఇప్పటివరకు ఉప్పుడు బియ్యం ఎఫ్‌సీఐకి ఇచ్చిన నేపథ్యంలో ఎఫ్‌సీఐ నిబంధనల మేరకే అంతా సాగింది. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.2 వేల కోట్ల భారం! ప్రస్తుతం ఉప్పుడు బియ్యం బదులు ముడిబియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి రావడంతో ఈ లెక్కలు మారబోతున్నాయి. యాసంగిలో తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా బియ్యం మొదళ్లు విరిగి నూకల శాతం రెట్టింపు అవుతుంది. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటే, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో కొంత తక్కువగా ఉంటుంది. యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మార్చడం వల్ల క్వింటాలు ధాన్యంపై సగటున మరో 17 కిలోల వరకు నూకలు పెరుగుతాయని అంచనా వేస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2 వేల కోట్ల వరకు భారం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత యాసంగి ధాన్యాన్ని ప్రయోగాత్మకంగా మిల్లింగ్ చేసి, ఎంత మేరకు నూకలు వస్తాయో చూసి, ఎంత భారం పడుతుందో అంచనా వేయడంతో పాటు తక్కువ భారంతో గట్టెక్కేందుకు ఏం చేయాలో సీఎస్ కమిటీ నివేదించనుంది. ఎఫ్‌సీఐకి రెండు మార్గాల్లో.. క్వింటాల్ ధాన్యానికి 67 కిలోల ముడిబియ్యం ఇచ్చేలా రైస్‌మిల్లర్లతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని, అదనంగా సగటున 17 కిలోల వరకు వచ్చే నూకలకు సంబంధించిన మొత్తాన్ని మిల్లర్లకే ఇవ్వాలనేది ఒక ఆప్షన్. అప్పుడు నూకలతో సంబంధం లేకుండా మిల్లర్లు 67 కిలోల బియ్యం ఎఫ్‌సీఐకి అప్పగిస్తారు. ఇక రెండో ప్రత్యామ్నాయంలో క్వింటాల్ ధాన్యాన్ని మిల్లర్లకు ఇస్తే, 67 కిలోలకు బదులు ఎన్ని కిలోల బియ్యం, నూకలు కలిపి ప్రభుత్వానికి ఇస్తారనే దానిపై ఒప్పందం కుదుర్చుకోవలసి ఉంటుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగిస్తుంది. ఈ అంశంపై వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్పాయి. 43 ఎల్ఎంటీ బియ్యం అప్పగించాలి రాష్ట్రంలో ఈ యాసంగిలో 36 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా, 80 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో తిండిగింజలు, విత్తన ధాన్యం, ప్రైవేటుగా విక్రయించే ధాన్యం పోను 65 లక్షల మెట్రిక్ టన్నుల(ఎల్ఎంటీ) ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానుంది. దీన్ని మిల్లింగ్ చేస్తే వచ్చే 43 ఎల్ఎంటీ బియ్యం ఎఫ్‌సీఐకి సీఎంఆర్ కింద అప్పగించాల్సి ఉంటుంది. ఉప్పుడు బియ్యం అంటే... యాసంగి సీజన్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తెలంగాణలో పండిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసేటప్పుడు బియ్యం చివరన విరిగిపోతుంది. దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు దశాబ్దాల క్రితమే ఉప్పుడు బియ్యం విధానం అమలులోకి వచ్చింది. ధాన్యాన్ని నానబెట్టి, నిర్ణీత ఉష్ణోగ్రతలో ఉడకబెట్టి, ఆరబోసి ఆ తర్వాత మిల్లింగ్ చేస్తే వచ్చేది ఉప్పుడు బియ్యం. ఇందుకోసం ప్రత్యేకంగా యంత్రాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ముడి బియ్యం అంటే... పండిన పంటను సాధారణ పద్ధతుల్లో మిల్లింగ్ చేస్తే వచ్చే బియ్యమే ముడి బియ్యం. వానాకాలంలో పండే ధాన్యాన్ని సాధారణ పద్ధతుల్లోనే మిల్లింగ్ చేస్తారు. యాసంగి ధాన్యాన్ని సాధారణ పద్ధతుల్లో మిల్లింగ్ చేస్తే (ముడి బియ్యంగా మారిస్తే) నూకల శాతం ఎక్కువగా వస్తుంది. అందువల్లే రాష్ట్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యంగా మార్చి ఇస్తోంది. అయితే ఉప్పుడు బియ్యానికి డిమాండ్ లేకపోవడంతో ముడి బియ్యం మాత్రమే సేకరిస్తామని కేంద్రం చెబుతోంది. ఇదీ కొనుగోలు విధానం.. రైతు పంట కోసి తేమ 17 శాతానికి తగ్గేవరకు ఎండబెట్టి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తాడు. అక్కడ రైతు పట్టా పాసు పుస్తకంలో ఉన్న భూమి విస్తీర్ణం ఆధారంగా ఎకరాకు 28 క్వింటాళ్ల లోపు దిగుబడి కింద లెక్కలేసి కొనుగోలు చేస్తారు. రైతు విక్రయించిన ధాన్యం డబ్బులు వారం రోజుల్లో బ్యాంకు ఖాతాలో వేస్తారు. ఇక కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యాన్ని అధికారులు మిల్లులకు తరలిస్తారు. మిల్లర్లు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి క్వింటాల్‌కి 67 కిలోల బియ్యం (సీఎంఆర్) చొప్పున ఎఫ్‌సీఐ గోడౌన్లకు తరలిస్తారు. ఇందులో ప్రజాపంపిణీ వ్యవస్థకు అవసరమైన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టిపెట్టుకొని, మిగతా బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగిస్తుంది. -
యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు: సీఎస్ సోమేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఈ మేరకు సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌న్ నిర్వహించారు. జిల్లాల వారీగా యాసంగిలో సాగు విస్తీర్ణం, పంట దిగుబడి అంచనాలపై చర్చించారు. కొనుగోలు కేంద్రాలు తగ్గించొద్దు: ‘సీఎం సూచనల మేరకు ప్రతి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పా టు చేయాలి. మొత్తం జిల్లా పాలనా యంత్రాంగాన్ని ధాన్యం కొనుగోలులో నిమగ్నం చేయాలి. సంబంధిత మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై ఆయా జిల్లాల అధికారులతో వెంటనే సమీక్ష సమావేశం నిర్వహించాలి. కొనుగోళ్లకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక రూపొందించుకోండి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు, ప్రజా ప్రతినిధులతో వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలి. ఎక్కడెక్కడ ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారో నివేదిక రూపొందించుకోవాలి..’అని సీఎస్ సూచించారు. రోజుకు నాలుగైదు కేంద్రాల తనిఖీ: ‘జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు రోజుకు కనీసం నాలుగైదు కొనుగోలు కేంద్రాలను సందర్శించేలా ప్రణాళిక తయారు చేసుకోవాలి. గత సంవత్సరం యాసంగి సీజన్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల సంఖ్యకు తగ్గకుండా ఈసారి కూడా ఏర్పాటు చేయాలి. ప్రతి కేంద్రానికి ఓ అధికారిని నియమించి కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలి. ముఖ్యంగా గన్ని బ్యాగుల సేకరణపై దష్టి పెట్టాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించి తగు పర్యవేక్షణ జరపాలి. రైతుకు కనీస మద్దతు ధర రూ.1,960 లభిం చేలా చర్యలు చేపట్టాలి. వ్యవసాయ విస్తరణాధికారుల సేవలను వినియోగించుకోవాలి. జిల్లాల్లో ఎక్కడైనా ధాన్యం కొనుగోలులో సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలి..’అని ఆదేశించారు. ఏరోజుకారోజు నివేదికలు:‘కొనుగోలు కేంద్రా ల్లో సేకరించిన ధాన్యాన్ని వెం టనే రవాణా చేసేందుకు అవసరమైన వాహనాలు ఏర్పాటు చేసుకోవాలి. ధాన్యం సేకరణపై ఏరోజు కారోజు నివేదికలు పంపించాలి. జిల్లాల్లో వ్యవసాయ అధికారుల వద్ద ఉన్న వరి కోతల వివరాల ఆధారంగా తగు ప్రణాళిక రూపొందించుకోవాలి. పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా చర్యలు చేపట్టాలి. అందు కోసం పోలీసు, రవాణా తదితర శాఖల అధికారుల సహకారం తీసుకోవాలి..’అని సీఎస్ చెప్పారు. హైదరాబాద్, కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయా లని సోమేశ్‌కుమార్ ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్‌లో వ్యవసా య శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పంచా యి తీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాని యా, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్.. డ్రామాలు ఆపాలి: కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం తమ రాజకీయ డ్రామాలకు తెరదించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హితవు పలికారు. ధాన్యం సేకరణపై చేసినట్టు రాజకీయ డ్రామాలు ఇకపై చేయొద్దన్నారు. కేసీఆర్ వైఖరి ఇలాగే కొనసాగితే రాష్ట్ర ప్రజలు వీళ్ల డ్రామాలకు తెరవేస్తారని హెచ్చ రించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగం గా ఢిల్లీలోని అశోకా హోటల్లో బుధవారం నిర్వ హించిన ‘అమృత్ సమాగమ్’కార్యక్రమంలో పాల్గొ న్న తర్వాత కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ధాన్యం సేకరణలో మిగతా రాష్ట్ర ప్రభుత్వాల్లాగే కేసీఆర్ సర్కారు వ్యవహరించి ఉంటే హుందాగా ఉండేది. ధాన్యం సేకరణతో పాటు అనేక అంశాల్లో ప్రజలను మభ్యపెట్టేలా కేసీఆర్ రాజకీయ నాటకం ఆడుతున్నారు. రైతు దీక్షల పేరుతో రాజకీయ దీక్షలు చేశారు. ప్రతి గ్రామం, జిల్లా, చివరికి ఢిల్లీకి వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేసి లాభం పొందాలని చూశారు. కానీ రాష్ట్ర రైతులు కేసీఆర్ ఆందోళనల్లో ఎవరూ భాగస్వాములు కాలేదన్నారు. ధాన్యం సేకరణలో ఏ రాష్ట్రంలో లేని సమస్య తెలంగాణలోనే ఎందుకొచ్చిందో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. 75 పర్యాటక కేంద్రాల్లో యోగా వేడుకలు ఈ ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ప్రపంచంలోని వివిధ దేశాల్లోని 75 ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 15న దేశం కోసం త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకునేలా ప్రతీ ఇంటిపైన జాతీయ జెండా ఎగరేయాలని దేశ ప్రజలను కోరారు. ఢిల్లీలో నిర్వహించిన ‘అమృత్ సమాగమ్’కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశాభివృద్ధిలో పాలుపంచుకున్న 14 మంది ప్రధానుల స్మారకంగా ప్రధానమంత్రి సంగ్రహాలయ పేరుతో ఏర్పాటుచేసిన మ్యూజియంను గురువారం ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారని చెప్పారు. -
రేపట్నుంచే కొనుగోళ్లు
సాక్షి , హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినప్పటికీ, రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో యాసంగి ధాన్యం కొనుగోలుకు ముందుకొచ్చారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయన్నారు. శుక్రవారం నుంచి కొనుగోళ్ల ప్రక్రియ మొదలుకాబోతుందని తెలిపారు. యాసంగి కొనుగోళ్లపై బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రి.. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించారు. పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అనంతరం అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, డీఎంలు, డీఎస్ఓలు, పోలీస్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను మొదలుపెట్టాలని ఆదేశించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నెలాఖరుకు కోతలు ముమ్మరం ఇప్పటికే వరి కోతలు ప్రారంభమైన నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట వంటి జిల్లాల్లో అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. ఏప్రిల్ చివరి వరకు కోతలు ముమ్మరమవుతాయని, మే 10వ తేదీ తరువాత అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం చేరుకుంటుందని అన్నారు. 60 రోజుల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తామని, ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమచేయడం జరుగుతుందని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన సొమ్ము రూ.15 వేల కోట్ల వరకు బ్యాంక్ గ్యారంటీ ద్వారా సమకూర్చుకోనున్నట్లు చెప్పారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు.. తెలంగాణ చుట్టూ ఉన్న 4 రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చర్యలకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి కమలాకర్ చెప్పారు. రాష్ట్ర సరిహద్దుల్లో పోలీస్ శాఖ ద్వారా 51 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయశాఖ సాగు లెక్కలు, పంట దిగు బడి అంచనాలకు అనుగుణంగా సాగైన 36 లక్షల ఎకరాల నుంచి 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అంచనా వేసినట్లు చెప్పారు. ఎకరాకు 28 క్వింటాళ్లలోపు ధాన్యం మాత్రమే దిగుబడిగా వ్యవసాయ శాఖ ఇచ్చిన లెక్కల మేరకే కొనుగోళ్లు జరుపుతామన్నారు. కేంద్రంలో అమ్మడం వరకే రైతు బాధ్యత.. రైతు ఆధార్ కార్డుతో లింకైన పట్టాదారు పాస్ పుస్తకం ద్వారానే కొనుగోళ్లు సాగుతాయని, డాష్ బోర్డు విధానంలో ఏరోజుకారోజు ధాన్యం సేకరణ లెక్కలు అందుతాయని గంగుల చెప్పారు. రైతుకు మిల్లర్‌తో ఎలాంటి సంబంధం లేకుండా కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మడం వరకే రైతు బాధ్యతగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కొత్తగా 7.50 కోట్ల గన్నీబ్యాగులు కావాలి.. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే 6 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలకు 15 కోట్ల గన్నీబ్యాగులు అవసరమవుతాయన్నారు. ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ వద్ద 1.60 కోట్ల గన్నీబ్యాగులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న పాత బ్యాగులు పోగా, కొత్తగా 7.50 కోట్లు కావాలని అన్నారు. కేంద్రం పారిపోతే కేసీఆర్ ముందుకొచ్చారు ► కేసీఆర్ మెడలు వంచి ధాన్యం కొనేట్లు చేశా మని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పడం సిగ్గుచేటని గంగుల విమర్శించారు. చేతగాని కేంద్రం తన బాధ్యత నుంచి పారిపోతే, మానవత్వంతో కేసీఆర్ రైతుల కోసం వేల కోట్ల నష్టాన్ని భరించి ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ధాన్యం కొనుగోలు విషయంలో అవగాహన లేకుం డా మాట్లాడుతున్నారని విమర్శించారు. -
Sakshi Cartoon: ఇదే మాటను వాళ్లు ఢిల్లీలో అంటున్నార్సార్!
ఇదే మాటను వాళ్లు ఢిల్లీలో అంటున్నార్సార్! -
రబీ బియ్యాన్నే ఇంతవరకు ఇవ్వలేదు: కిషన్‌రెడ్డి ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన 8.34 లక్షల మెట్రిక్ టన్నుల రబీ బియ్యాన్నే తెలంగాణ ప్రభుత్వం ఎఫ్‌సీఐకి ఇంకా ఇవ్వలేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కిషన్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియా తో మాట్లాడుతూ 1.34 ఎల్ఎంటీ బాయిల్డ్ రైస్‌తోపాటు 7 ఎల్ఎంటీ ముడిబియ్యాన్ని తీసుకొనేందుకు కేంద్రం ఇప్పటికే ఆరుసార్లు టార్గెట్ పొడిగించిందని తెలిపారు. 2020–21 రబీ సీజన్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం చివరి గింజ వరకు కొంటామని తాను చెప్పానని పేర్కొన్నారు. ఆ అగ్రిమెంట్లో మిగులు బాయిల్డ్ రైస్ ఉంటే, వాటిని కూడా కొనుగోలు చేస్తామని గతంలో తాను చెప్పానన్నారు. అయితే ఇచ్చిన టార్గెట్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బియ్యాన్ని ఎందుకు ఇవ్వలేకపోయింది? ఇంత పంట పండలేదా? సేకరించి బ్లాక్‌లో అమ్ముకున్నారా? లేదా రైస్ మిల్లర్లు విదేశాలకు ఎగుమతి చేసుకున్నారా? అసలు ఏమైందో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెప్పాలని డిమాండ్ చేశారు. టార్గెట్‌ను సకాలంలో సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వం ప్రగల్భాలు పలికి, ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గిందో చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ వైఖరి విచిత్రంగా ఉందన్నారు. అయితే మీటర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని రైతులు కూడా అర్ధం చేసుకున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. గతేడాది భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమంటూ రాసిచ్చిన మాట నిజమా కాదా? అని నిలదీశారు. గిట్టుబాటు ధర లేకపోతే రైతు సమన్వయ సమితులు కొంటాయని గతంలో కేసీఆర్ చెప్పారని, సమితులు ఉన్నాయో లేవో తెలియదు కానీ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాత్రం ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎంఎస్పీ పెంచడమే రైతు వ్యతిరేక విధానమా? ఢిల్లీలో చేసినది రైతు దీక్ష, రైతు పోరాటం ఏమాత్రం కాదని, ఇది కేవలం రాజకీయ ఆరాటం, అధికారం నిలుపుకోవడం కోసం చేసే ప్రయత్నం మాత్రమే అని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాకుండా పంజాబ్‌లో బాయిల్డ్ రైస్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ‘కనీస మద్ధతుధర పెంచడమే మా పొరపాటా? ఇదే రైతు వ్యతిరేక విధానమా? దేశంలో ఒకే విధానం ఉంది. ప్రధాని మోదీకి కేసీఆర్‌ను టచ్ చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలే 2024లో టచ్ చేసి చూపిస్తారు’అని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయొద్దని, గవర్నర్ వ్యవస్థపై కత్తులు నూరడం సరికాదని పేర్కొన్నారు. -
ప్రతి గింజా మేమే కొంటాం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: యాసంగి సీజన్లో పండిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో కొనుగోలు చేయనుంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కుంటిసాకులు చెపుతూ వెనకడుగు వేస్తున్నందున రైతుల ప్రయోజనాల దృష్ట్యా మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ‘తెలంగాణ రైతాంగానికి మేం అండగా ఉంటాం. యాసంగిలో పండిన పంట చివరి గింజ వరకు మేమే కొనుగోలు చేస్తాం. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆధ్వర్యంలో ఆర్థిక, వ్యవసాయ, నీటిపారుదల శాఖల కార్యదర్శులతో కమిటీ వేసి తక్కువ నష్టంతో ధాన్యం కొనుగోలుకు ఏం చేయాలో నిర్ణయిస్తాం. బుధవారం నుంచే కొనుగోలు ప్రక్రియ మొదలవుతుంది. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, 3, 4 రోజుల్లో కొనుగోళ్లను ప్రారంభిస్తాం. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది కనుక క్వింటాల్‌కు రూ.1,960 కన్నా తక్కువకు ఏ రైతూ ధాన్యం అమ్మొద్దు. దిక్కుమాలిన కేంద్రం చేతులెత్తేసినంత మాత్రాన మేం వెనక్కుపోం..’ అని సీఎం స్పష్టం చేశారు. మంగళవారం ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. నూకల వల్ల పడే రూ.3 వేల కోట్ల నుంచి రూ.3.5 వేల కోట్ల భారాన్ని తామే భరించడానికి ముందుకు వచ్చామన్నారు. ‘ఉచిత విద్యుత్‌కు రూ.12 వేల కోట్లు, రైతుబంధుకు రూ.15 వేల కోట్లు, రైతుబీమాకు రూ.1,600 కోట్లు భరిస్తున్న మేం రూ.3, 4 వేల కోట్లకు వెనక్కుపోతమా? ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొంటది. ఏర్పాట్లన్నీ మంత్రి గంగుల కమలాకర్ చూస్తారు. మంత్రులందరూ తమ తమ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటును నేటి నుంచే పర్యవేక్షించాలి..’అని కేసీఆర్ చెప్పారు. కేంద్రం తీరును ఎండగట్టినం ‘ఇటీవల ఆదానీ గ్రూపునకు కేంద్రం రూ.12 వేల కోట్లు మాఫీ చేసింది. కార్పొరేట్ కంపెనీలకు ఇప్పటిదాకా రూ.10.50 లక్షల కోట్లు మాఫీ చేసింది. కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం రూ.3 వేల కోట్లు భరించే స్థితిలో కేంద్రంలోని రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వం లేదు. కేంద్రంలో పనికిమాలిన ప్రభుత్వం ఉన్నదని చెప్పి యాసంగిలో 20 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గించినం. రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత మీదని గుర్తు చేయడం మా బాధ్యత. అందుకే గొడవ చేసినం. ఢిల్లీ వేదికగా అడిగినం. దోషిగా నిలబెట్టినం. ఒక రాష్ట్రానికి న్యాయం చేసే దమ్ము లేదా? మనసు లేదా ? అని నిలదీసినం. భారత రైతుల పట్ల అవలంబిస్తున్న తీరును ఎండగట్టినం. ఆహారభద్రత చట్టం అమలు బాధ్యత నుంచి కేంద్రం వెనక్కి వెళ్లిన తీరును దేశమంతా గుర్తించింది..’అని సీఎం అన్నారు. జలాశయాల పరిరక్షణకు కమిటీ ‘రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో 111 జీవో కారణంగా అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం కలుగుతున్నదని అభిప్రాయపడిన కేబినెట్ ఈ జీవోను ఎత్తివేయాలని నిర్ణయించింది. ఎంతో కాలంగా ఆ జీవో పరిధిలోని ప్రాంతాల ప్రజల నుంచి వస్తున్న విన్నపాల మేరకు 111 జీవో రద్దుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీ ద్వారా జలాశయాల పరిరక్షణ కోసం నియమ నిబంధనలతో ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తాం. మూసీ, ఈసా నదులు, జంట జలాశయాల్లోనూ కాలుష్య జలాలు చేరడానికి వీల్లేకుండా కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖల ద్వారా పరిరక్షిస్తాం..’అని సీఎం చెప్పారు. వర్సిటీల్లో 3,500 పైచిలుకు నియామకాలు ‘విశ్వవిద్యాలయాల సిబ్బంది నియామకాలను కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా జరపాలని కేబినెట్ నిర్ణయించింది. విశ్వవిద్యాలయాలే నియామకాలు జరుపుకునే విధానం కాకుండా విద్యా శాఖ ద్వారా పారదర్శకంగా ఒకే నియామక సంస్థ ద్వారా జరుపుతాం. 3,500 పైచిలుకు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను చేపడతాం..’అని తెలిపారు. రాష్ట్రంలో ఆరు ప్రైవేటు యూనివర్సిటీలు ► ‘తెలంగాణలో మరో ఆరు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కావేరి అగ్రికల్చర్ యూనివర్సిటీతో పాటు అమిటీ, సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ), గురునానక్, నిప్‌మర్, ఎంఎన్ఆర్ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. అలాగే ఫార్మా యూనివర్సిటీని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ఇటీవల మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా అనేక కంపెనీలు ఇందులో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకొచ్చాయి. సివిల్ ఏవియేషన్ కోర్సులకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు తర్వాత అతిపెద్ద విమానాశ్రయం హైదరాబాదే. విమానాశ్రయంలో ఉత్తరం వైపు రన్‌వేను నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. ’అని ముఖ్యమంత్రి వివరించారు. ఇతర జిల్లాలకు విద్యాసంస్థల విస్తరణ ‘విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ఇతర నగరాలకు విస్తరింప చేయాలి. దీనివల్ల హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గడంతో పాటు, ఇతర నగరాలు అభివృద్ధి చెందుతాయి..’అని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో నూతన ఉన్నత విద్యాసంస్థల స్థాపనను ప్రోత్సహించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని కేబినెట్ ఆదేశించింది. ఇతర నిర్ణయాలు ► మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని 5 మండలాలు 103 గ్రామాలకు సాగు, తాగునీరు అందించే ‘చెన్నూరు ఎత్తిపోతల పథకానికి’కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.1,658 కోట్లు మంజూరు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీల గోదావరి నీటిని ఈ పథకానికి వినియోగించనున్నారు. ►మే 20 నుంచి జూన్ 5వ తేదీ వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించాలి. ►ఆదివాసి, గిరిజన ప్రాంతాలైన ఆసిఫాబాద్, సారపాక, భద్రాచలం గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ఆమోదం. ► వైద్య కళాశాలల ప్రొఫెసర్లను వైద్య విద్య డైరెక్టర్, అదనపు డైరెక్టర్లుగా నియమించేందుకు అనుమతి. ► రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగార్థుల నుండి వచ్చిన అభ్యర్థన మేరకు.. పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించి అభ్యర్థుల వయోపరిమితిలో 3 సంవత్సరాలు సడలింపు. ► గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర గెజిటెట్ పోస్టుల నియామకాల్లో పాదర్శకత కోసం ఇకపై కేవలం లిఖిత పరీక్షనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇంటర్వ్యూ ఉండదు. ► ఐటీ తదితర పరిశ్రమల స్థాపన కేవలం నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాలకే పరిమితం కాకూడదు. ఇతర ప్రాంతాలకు కూడా విస్తరింపజేయాలి. తద్వారా హైదరాబాద్ నలుమూలలా సమానమైన అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. -
కేసీఆర్ దమ్ముంటే.. ఢిల్లీలో కాదు, గల్లీలో తేల్చుకుందాం: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ చీఫ్ మినిస్టర్ కాదని.. ‘చీఫ్ మిస్‌లీడర్’(మొత్తం మభ్యపెట్టి తప్పుదోవ పట్టించే) అని పార్లమెంటరీ, విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనాలన్నారు. పంట చేతికొచ్చినా టీఆర్ఎస్ సర్కార్ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తక్కువ ధరకే దళారులకు అమ్ముకుంటూ మోసపోతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వడ్లు కొనాలని లేదా తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ‘కేసీఆర్ వడ్లు కొను లేదా రాజీనామా చెయ్’నినాదంతో రైతు దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు ముఖ్యఅతిథిగా హాజరైన మురళీధరన్ మాట్లాడారు. ‘కేసీఆర్ అంటే... కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాదు, కరప్షన్ రావు, కమీషన్ రావు. రైతుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే మా పార్టీ ఈ దీక్ష నిర్వ హిస్తోంది. రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రం ఎంతో కృషి చేస్తున్నా.. ధాన్యం కొనేందుకు టీఆర్ఎస్ సర్కార్ ఏ ప్రయత్నం చేయట్లేదు. తెలంగాణ రైతుల కోసం ఏడేళ్లలో కేంద్రం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసింది. మిల్లర్లతో టీఆర్ఎస్ నేతలు ఒప్పం దం కుదుర్చుకుని రైతులను మోసం చేస్తు న్నారు. అసలు కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో చెప్పాలి? ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కమీషన్ రావు వాటిని నెరవేర్చారా? ముఖ్యమంత్రి.. ప్రజలను మిస్లీడ్ చేస్తూ ’చీఫ్ మిస్‌లీడర్’ అయ్యారని ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతోంది’అన్నారు. ఢిల్లీలో కాదు, గల్లీలో తేల్చుకుందాం: బండి ‘వడ్ల కొనుగోలు పేరిట సీఎం ఢిల్లీకి పోయి దొంగ దీక్ష చేస్తున్నడు. ఉద్యమ సమయంలోనూ దొంగ దీక్షలు చేసిన చరిత్ర ఆయనది. కేసీఆర్ దమ్ముంటే.. ఢిల్లీలో కాదు, గల్లీలో తేల్చుకుందాం రా. వడ్లు కొనేదాకా నిన్ను వదిలిపెట్టం.. ఉరికిస్తం. కేంద్రం వడ్లు కొనేందుకు సిద్ధం. సేకరించి ఇచ్చే దమ్ము ఉందో.. లేదో.. కేసీఆర్ చెప్పాలి. పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలను చూసి జనం భగ్గుమంటున్నరు. దీని నుంచి దారి మళ్లించేందుకే ఇలా ఢిల్లీలో డ్రామాలాడుతున్నరు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోందని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇప్పుడెందుకు యాసంగి పంట కొనడం లేదో ప్రజలకు జవాబు చెప్పాలి. మోదీని గద్దె దించేంతటి మొనగాడివా? రాష్ట్ర ప్రజలు నిన్ను గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్నరు. ఢిల్లీలో ఉదయం నుంచి సాయంత్రం దాకా దీక్ష చేస్తానన్న కేసీఆర్.. గంటసేపు కూడా కూర్చోలేకపోయాడు’అని ఎద్దేవా చేశారు. ఈ దీక్షలో ఎంపీలు సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, పార్టీ నేతలు డీకే అరుణ, డాక్టర్ కె.లక్ష్మణ్, నల్లు ఇంద్రసేనారెడ్డి, విజయశాంతి, గరికపాటి మోహన్‌రావు, జి.వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎ. చంద్రశేఖర్, సుద్దాల దేవయ్య, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చాడ సురేశ్‌రెడ్డి, రవీంద్రనాయక్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, సీహెచ్.విఠల్, రాణి రుద్రమదేవి, జె.సంగప్ప, పోరెడ్డి కిశోర్ పాల్గొన్నారు. -
ధాన్యంపై కేంద్రం క్లారిటీ.. ఏం చెప్పిందంటే!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ పట్ల ఎలాంటి వివక్ష చూప డం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పంజాబ్‌లో ధాన్యాన్ని కొనుగోలు చేసిన తరహాలోనే దేశమంతటా ఒకే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపింది. దీనికి సంబంధించి టీఆర్ఎస్ ప్రభు త్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే పేర్కొన్నారు. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనాల్సిందేనంటూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఢిల్లీలో దీక్ష చేపట్టిన నేపథ్యంలో సుధాంశుపాండే మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో డీసెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ విధానం (డీసీపీ)లో బియ్యం సేకరిస్తున్నామని.. పంజాబ్ నుంచి నాన్ డీసీపీ విధానంలో సెంట్రల్ పూల్ ద్వారా బియ్యం సేకరించి ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నామని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ నేటిదాకా ఒకే విధానం అమల్లో ఉందని చెప్పారు. తెలంగాణ అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన బియ్యాన్ని సెంట్రల్ పూల్ కింద ఎఫ్‌సీఐకి అప్పగిస్తోందని గుర్తు చేశారు. ఇన్నాళ్లూ ఏటా యాసంగిలో పండిన పంటను బాయిల్డ్ రైస్‌గా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగిస్తోందన్నారు. అదే పంజాబ్ అయితే ఖరీఫ్ సీజన్లో మాత్రమే వరి పండించి బియ్యాన్ని సెంట్రల్ పూల్ కింద ఎఫ్‌సీఐకి అప్పగిస్తుందని.. రబీలో గోధుమలను పండిస్తోందని వివరించారు. పంజాబ్ నుంచి కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోవడం లేదని.. ఆ రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు ధాన్యం సేకరిస్తోందని తెలిపారు. రాష్ట్రం ఒప్పుకున్నాకే.. తెలంగాణతోపాటు దక్షిణ భారతదేశం నుంచి ఎఫ్‌సీఐ సేకరించే బాయిల్డ్ రైస్‌ను సెంట్రల్ పూల్ కింద కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు పంపిస్తామని సుధాంశు పాండే తెలిపారు. తెలంగాణ కూడా పశ్చిమ బెంగాల్, బిహార్‌లకు బాయిల్డ్ రైస్‌ను పంపుతుందన్నారు. తెలంగాణలో బాయిల్డ్ రైస్ వినియోగం లేనందున మొత్తం బియ్యాన్ని ఎఫ్‌సీఐకే పంపిస్తూ వస్తోందన్నారు. దేశంలో ప్రస్తుతం నాలుగేళ్లకు సరిపడా బాయిల్డ్ రైస్ నిల్వలు ఉన్నందున తెలంగాణ నుంచి రా రైస్ మాత్రమే సేకరిస్తామని ముందే చెప్పామని.. రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంగీకరించి ఒప్పందంపై సంతకం కూడా చేసిందని వివరించారు. అంతేగాకుండా 2021–22 యాసంగి ధాన్యం సేకరణ ప్రతిపాదనను తెలంగాణ పంపలేదని చెప్పారు. -
24 గంటల్లో తేల్చాలి.. లేదంటే.. : సీఎం కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: ‘హిట్లర్, నెపోలియన్, ముస్సోలినీ వంటి ఎందరో నియంతలు మట్టిలో కలిశారు..మీరెంత?’ అంటూ కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. నూకలు తినండి... పనీ పాటా లేదా అని మంత్రులతో ఎలా వ్యాఖ్యానిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద మాటలు చెప్పే ప్రధాని, కేంద్ర ప్రభుత్వానికి చిన్న రాష్ట్రమైన తెలంగాణలో పండే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు డబ్బులు లేవా..? లేక నరేంద్రమోదీకి కొనాలన్న మనసు లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఓట్లు, సీట్లు కావాలి కానీ ధాన్యం వద్దా అంటూ మండిపడ్డారు. కేంద్రంతో పోరు మొదలైందని, అంతిమ విజయం సాధించే వరకు ఈ పోరు ఆగదని చెప్పారు. వీలైనంత త్వరగా రైతుల శ్రేయస్సు కోరే రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రుల మద్దతు కూడగట్టి దేశంలో తాము సృష్టించే భూకంపానికి పీయూష్ ‘గోల్మాల్’పరిగెత్తుతూ కనిపించడం తథ్యమని అన్నారు. దేశంలో జరుగబోయే రైతుల మహా సంగ్రామానికి తెలంగాణ ప్రజలు, రైతులు పూర్తి మద్దతు ఇస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలుపై ఢిల్లీ తెలంగాణ భవన్ వేదికగా సోమవారం జరిగిన ప్రజా ప్రతినిధుల నిరసన దీక్షలో కేసీఆర్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. హృదయంలో రగులుతున్న అగ్నిజ్వాల యావత్ దేశ ప్రజల హృదయాల్లో రగులుతున్న అగ్ని జ్వాల మా హృదయంలోనూ రగులుతోంది. ఈ అగ్నిజ్వాల వ్యాపించి బీజేపీని నాశనం చేసేవరకు వదలదు. ధాన్యం కొనుగోలు విషయమై వారాల పాటు కేంద్రమంత్రుల కార్యాలయాల చుట్టూ తిరిగిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలను గంటలపాటు ఎదురుచూసేలా చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం నడిపించే విధానమా? కేంద్రం కుట్రలు ఇకపై సాగవు తెలంగాణ ప్రభుత్వం రైతులను గంగలో ముంచేంత బలహీనమైనది కాదు. మా ప్రాణాలు పోయినా రైతులకు నష్టం రానీయబోం. వారిని కాపాడుకుంటాం. కానీ కేంద్రంలోని బీజేపీ.. రైతులతో ఏవిధంగా వ్యవహరిస్తోందన్నది దేశం మొత్తానికి తెలియాలి. ధాన్యం విషయంలో అన్యాయాన్ని ప్రశ్నిస్తూ గొంతెత్తితే, కుట్రపూరితంగా బీజేపీ నేతలతో హైదరాబాద్‌లో ధర్నా చేయించడం సిగ్గు చేటు. ఇలాంటి కుట్రలు దేశంలో ఇకపై సాగబోవు. ప్రశ్నిస్తే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులేనా..? దేశంలో వ్యవసాయాన్ని కార్పొరేట్ రంగానికి అప్పగించి, రైతులను కూలీలుగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారి ని అవమానిస్తున్నారు. విపక్ష నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారు. బీజేపీలోని నాయకులందరూ సత్యహరిశ్చంద్రులేనా? బీజేపీలో ఒక్క నాయకుడు కూడా అవినీతిపరుడు లేడా? బీజేపీ నాయకులపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరగవు? ఎవరైతే కేంద్రాన్ని ప్రశ్నిస్తారో, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని జైలుకు పంపిస్తామంటూ మాట్లాడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి ముఖ్యమంత్రిని జైలుకి పంపిస్తామంటూ రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. దమ్ముంటే రండి... ఎవరు ఎవరిని పంపిస్తారో చూద్దాం. రాష్ట్రపతి ఎన్నికలపై విపక్షాలతో చర్చిస్తా.. దేశం మొత్తం మీ వైఖరి అర్థమైపోయింది. ఇక దేశం నోర్మూసుకొని కూర్చొనే పరిస్థితి లేదు. తెలంగాణలో ఇప్పటికే చాలా చేశాం.. ఇప్పుడు దేశం కోసం చేయనున్నాం. రాష్ట్రపతి ఎన్నికల గురించి విపక్ష మిత్రులతో కలిసి చర్చించేందుకు త్వరలో మళ్ళీ ఢిల్లీ వస్తా. అప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి వారితో మాట్లాడతా. ఆఖరి రక్తపు బొట్టు వరకు పోరాటం కేంద్ర విధానాల విషయంలో అన్ని పార్టీలను ఏకం చేసి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు రైతులకు రాజ్యాంగబద్ధ రక్షణ కోసం ఆఖరి రక్తపు బొట్టు వరకు పోరాటం కొనసాగుతుంది. దేశంలో రాకేశ్ టికాయత్ చేయబోయే మరో పోరుకు మద్దతిస్తున్నాం. తెలంగాణ రైతులు ఏం పాపం చేశారు? రైతులు కన్నీళ్ళు పెట్టుకొనేలా చేసిన ప్రభుత్వం తప్పనిసరిగా కూలిపోతుంది. గద్దె దించే సత్తా రైతులకు ఉంది. ఇది దేశ రైతుల శక్తి. ప్రపంచంలో ఎక్కడా జరగనట్లుగా 13 నెలలపాటు జరిగిన రైతు ఉద్యమం కారణంగా ప్రధాని రైతులకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ప్రధాని క్షమాపణ కోరుతుంటారు. భవిష్యత్తులోనూ కోరతారు. గుజరాత్ రైతులు రోడ్డున పడ్డారు దేశం మొత్తం గందరగోళంలో ఉంది. దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం ఉంది. గుజరాత్ రాష్ట్ర రైతులు కరెంటు కోసం డిమాండ్ చేస్తూ రోడ్డున పడ్డారు, కేవలం తెలంగాణలో మాత్రమే అన్ని వర్గాల ప్రజ లకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందుతోందని గర్వంగా చెప్తున్నా. కొత్త సాగు విధానం తేవాలి... దేశ రైతులు భిక్షగాళ్లు కాదు. హక్కులు కోరుతున్నారు. దేశంలో కొత్త వ్యవసాయ విధానం రూపొందించకుంటే అధికారం నుంచి దింపడం ఖాయం. తెలంగాణ ప్రజలు పోరుకు బయలుదేరితే విజయం సాధించే వరకు ఆగే ప్రసక్తే లేదు. రైతుల్ని రెచ్చగొట్టిన బీజేపీ నేతలు రాష్ట్రంలో పంటమార్పిడి చేయమని కేంద్రం చెబితే, రాష్ట్రంలో ప్రతి రైతుకూ పంట మార్చాలని చెప్పాం. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలు వరి వేయాలని, ప్రతి గింజా కేంద్రం కొంటుందంటూ రైతులను రెచ్చగొట్టారు. -
యాసంగి ధాన్యమే ఎజెండా!
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. ధాన్యం కొనుగోలుపై 24 గంటల్లో స్పందించాలని ఢిల్లీలో దీక్ష సందర్భంగా కేంద్రానికి గడువు విధించిన కేసీఆర్.. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో ఈ భేటీ జరుగుతుంది. ఢిల్లీలో దీక్ష సందర్భంగా.. కేంద్రం కొనుగోలు చేయకున్నా తెలంగాణ పేదరికంలో లేదని ప్రకటించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేస్తుందనే సంకేతాలు సీఎం ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే కేబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే అంశమే ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశముంది. యాసంగిలో వరిసాగు విస్తీర్ణం, విత్తనాలు, వ్యక్తిగత అవసరాలు, మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యం తదితరాలను మినహాయిస్తే ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన ధాన్యం ఎంత ఉంటుంది? తదితర అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. యాసంగిలో 36 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగ్గా, 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశముందని ఇప్పటికే అంచనా వేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రమే కొనుగోలు చేస్తే ఎంత మేర ఆర్థిక భారం పడుతుందో చర్చించనున్నారు. 15 తర్వాత పార్టీ విస్తృత స్థాయి భేటీ కేంద్రంపై పోరులో అనుసరించాల్సిన ఉద్యమ కార్యాచరణపైనా మంత్రివర్గ భేటీలో చర్చించే అవకాశముంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూనే కేంద్రం వైఖరిని రైతుల్లోకి బలంగా తీసుకెళ్లే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ఈ నెల 15 తర్వాత మళ్లీ పార్టీ విస్తృత స్థాయి భేటీ నిర్వహించి ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశముంది. నెలాఖరులో ఢిల్లీలో కీలక సమావేశం: ఈ నెలాఖరులో ఢిల్లీలో బీజేపీయేతర పార్టీల సీఎంలు, ఇతర నేతలతో సమావేశం నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ భేటీ తర్వాత మే మొదటి వారంలో మహబూబ్‌నగర్ లేదా కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ సభకు రైతు నేత రాకేశ్ టికాయత్ సహా ఇతర రాష్ట్రాల సీఎంలు ఒకరిద్దరు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ధాన్యం దుడ్లు... భరించేదెట్టా..? యాసంగి ధాన్యం కొనుగోళ్లపై నేటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి సారించింది. యాసంగి దిగుబడుల అంచనా ప్రకారం.. ధాన్యం కొనుగోలుకు ఏ మేరకు నిధులు అవసరమవుతాయో అంచనా వేసింది. ధాన్యాన్ని పచ్చి బియ్యంగా మార్చి కేంద్రానికి ఇచ్చాక.. మిగిలే ఉప్పుడు బియ్యంతో రూ. 3 వేల కోట్లకుపైగా రాష్ట్రంపై భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో «ధాన్యం కొనుగోలుకు అవసరమయ్యే నిధులు సమకూర్చుకోవడంతోపాటు ఖజానాపై పడే అదనపు భారం రూ. 3 వేల కోట్లను సర్దుబాటు చేసే అంశంపైనా ప్రణాళిక ప్రకారం ముందుకెళుతున్నామని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయని, కొనుగోలు కేంద్రాలు, ఇతర వసతులు సమకూర్చుకోవాల్సి ఉందన్నారు. -
ధాన్యం సేకరణ కేవలం ఉత్పత్తిపైనే ఆధారపడి ఉండదు: గోయల్
-
ధాన్యంపై రోజుకో డ్రామా
సాక్షి , న్యూఢిల్లీ: యాసంగి ధాన్యం విషయంలో సీఎం కేసీఆర్ రోజుకో కొత్త డ్రామా ఆడుతూ రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎవరూ తన పాలనపై ప్రశ్నించకుండా ఉండేందుకే ఇలాంటి డ్రామాలను కేసీఆర్ ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతి పైసా కేం ద్రమే చెల్లిస్తోందని చెప్పారు. భవిష్యత్తులోనూ తెలంగాణ రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది కేవలం బ్రోకరిజమేనని సంజయ్ తెలిపారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సహచర ఎంపీ ధర్మపురి అరవింద్, ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వయసు పెరిగి మతి తప్పింది.. సీఎం కేసీఆర్‌కు వయసు పెరిగి మతి తప్పిన కారణంగా గంటల కొద్దీ ఏదేదో మాట్లాడుతున్నారని సంజయ్ ఎద్దేవా చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు బియ్యం సేకరణపై స్పందించినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు స్పందించలేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పారన్నారు. ధాన్యం సేకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అంచనా, విధివిధానాల్లేవని గోయల్ తెలిపారన్నారు. ఇన్నాళ్లూ బాయిల్డ్ రైస్ కొనాలని డ్రామాలాడిన కేసీఆర్ ఇప్పుడు మాటమార్చి వడ్లే కొనాలని మళ్లీ కొత్త డ్రామా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మెడమీద కత్తిపెడితే బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాసిచ్చానంటూ కేసీఆర్ అబద్ధాలాడుతున్నారని సంజయ్ విమర్శించారు. ధాన్యం సేకరణ విషయంలో కేసీఆర్ ఎందుకు డ్రామాలాడుతున్నారని, కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు సహకరించట్లేదని ప్రశ్నించారు. వడ్లు మాత్రమే కొనాలని ఇన్నాళ్లూ ఎందుకు అడగలేదని నిలదీశారు. ధాన్యం కొనుగోళ్లలో గోల్మాల్ ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలే అక్రమాలకు పాల్పడినట్టుగా తమ దగ్గర సమాచారం ఉందని సంజయ్ చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ ఎందుకు జరపట్లేదని ప్రశ్నించారు. బియ్యం అక్రమాలపై గతంలో కొన్నిచోట్ల ఫిర్యాదులు వస్తే.. విచారణలో నిజమేనని తేలిందని, అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. కేసీఆర్‌కు రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనే దమ్ము లేక పోలీసుల ద్వారా తప్పుడు కేసులు పెట్టి అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వరి వేస్తే ఉరే గతి అని రైతులను బెదిరించిన కేసీఆర్.. తన ఫాంహౌస్‌లో వరి పంట వేసి కోటీశ్వరుడయ్యాడని విమర్శించారు. -
కిషన్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: మంత్రి నిరంజన్ రెడ్డి
న్యూఢిల్లీ: తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉంచాలా? లేదా? అనే దానిపై స్పష్టత ఇవ్వాలని కేంద్రమంత్రి పీయుష్ గోయల్‌ని అడిగినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుపై కేంద్రం రెండు రోజుల్లో రాతపూర్వక హమీని ఇవ్వాలన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రైల్వే రెక్స్ కేటాయించకపోవడం వల్లే.. రబీ బియ్యం సరఫరా పూర్తికాలేదన్నారు. తాము రాజకీయాల కోసం రాలేదని.. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రజల కోసమే వచ్చామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం -
ఆమె శాపం చంద్రబాబుకి తప్పనిసరిగా తగులుతుంది: కొడాలి నాని
సాక్షి, తాడేపల్లి: ‘‘చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెప్పినట్లు తప్పుడు వ్యాఖ్యలు చేసిన వాళ్ళు వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. వ్యాఖ్యలు చేయకపోయినా చేసినట్లు చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. ఆడవాళ్ళని రోడ్డు మీదకు తెచ్చిన వారికి కూడా ఈ శాపం వర్తిస్తుంది. ఎవరన్నా భార్యని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారా... ఆమె శాపం చంద్రబాబుకి తప్పనిసరిగా తగులుతుంది. చంద్రబాబుకి రాబోయే ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతుంది’’ అన్నారు మంత్రి కొడాలి నాని. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడారు. ‘‘పంట వేసుకోవడం రైతు ఇష్టం.. మనం కేవలం సలహాలు ఇవ్వడమే. ఎంత వరి ధాన్యం వచ్చినా ప్రతి గింజా కొనుగోలు చేస్తాం. ధాన్యం కొనుగొల్లలో రైతులకు ఇబ్బంది లేకుండా ఆర్బీకెల ద్వారా చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. తడిసిన ధాన్యంతో సహా ప్రతి గింజను కొనుగోలు చేయాలని సీఎం చెప్పారు. కేవలం 21 రోజుల్లో వారికి పేమెంట్ ఇవ్వాలన్నారు. పక్కనున్న రాష్ట్రాల్లో బహిరంగంగా కొనుగోలు చేయలేమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి కానీ మనకు ఇబ్బందులు ఉన్నా కొనుగోలు చేస్తున్నాం’’ అన్నారు. (చదవండి: సేవల్లో అలసత్వం వద్దు: సీఎం జగన్) ‘‘పార్లమెంట్ చట్టం వల్ల దొంగ ఓట్ల బెడద తగ్గుతుంది. చంద్రబాబు కుప్పంలో 10 వేలకు పైగా దొంగఓట్లు చేర్చారు. ఇలాంటి వారికి ఇలాంటి నిర్ణయం వల్ల చెక్ పడుతుంది. చంద్రబాబు ముఖం చూసి అప్పులిస్తామని అన్నారట.. జగన్‌ను చూసి ఇవ్వడం లేదు అన్నారు. ఇప్పుడు మళ్లీ అదే నోటితో జగన్ విపరీతంగా అప్పులు చేశారు అంటారు. అన్ని పరిశీలించే బ్యాంకులు అప్పులు ఇస్తాయి. ఇక్కడ పెట్టె పెట్టుబడులు, తీర్చే పరిస్థితి చూసే బ్యాంకులు అప్పులు ఇస్తాయి’’ అని మంత్రి నాని తెలిపారు. (చదవండి: Andhra Pradesh: పారిశ్రామిక విప్లవం) ‘‘స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆపాల్సిన బాధ్యత కేంద్రానిది. మేము ఏమి చేయాలో మాకు తెలుసు. పార్లమెంటులో మా ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తే ప్రయివేటీకరణ ఆగిపోతుందా. మా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. పవన్ కళ్యాణ్ కాదు మాకు సలహాలు ఇవ్వడానికి. మేము చేసేది చేస్తాము.. ముందు నువ్వేమి చేస్తావో చెప్పు. నీ దత్తత తండ్రి చంద్రబాబుకి ఇవ్వండి మీ సలహాలు. ముద్రగడ దీక్ష చేస్తే ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడో అందరూ చూసారు. అదీ అరాచక పాలన. ఇప్పుడు చంద్రబాబుకి ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చిందా’’ అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. చదవండి: బియ్యం ఎగుమతుల్లో దూసుకుపోతున్న ఏపీ -
తరుగని..దగా!..తాలు, నల్లబడ్డ ధాన్యం పేరుతో మిల్లర్ల తరుగు
ఈ రైతు పేరు డప్పురి భుజంగం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ గ్రామం. రెండెకరాల 30 గుంటల్లో వరివేయగా.. 70 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. పుల్కల్ కొనుగోలు కేంద్రానికి తెచ్చి తూకం వేయించాడు. బస్తాకు 40కిలోల ధాన్యానికి బదులు 42 కిలోల చొప్పున తూకం వేశారు. నిబంధనల ప్రకారం 17% తేమ ఉన్నా పర్వాలేదు. అలాంటిది అంతకన్నా తక్కువగా 15 శాతమే తేమ ఉన్నా తరుగు తీశారు. దీనితో మూడు క్వింటాళ్ల ధాన్యాన్ని నష్టపోయాడు. ..ఒక్క భుజంగమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా వరి పండించిన రైతులందరిదీ ఇదే సమస్య. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెస్తే.. రోజుల తరబడి ఎదురుచూపులు. ఎలాగోలా తూకం పూర్తయి మిల్లర్లకు పంపితే.. తాలు, తరుగు పేరిట కోతలు. మిల్లర్లను ఎంత బతిమాలినా.. ఏమాత్రం కనికరం లేకుండా బస్తాకు రెండు కిలోల నుంచి నాలుగు కిలోలదాకా తరుగు తీస్తుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరి రైతు అరిగోస పడుతున్నాడు. నానా తంటాలు పడి ధాన్యం అమ్ముకుంటున్నా.. అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్ల దోపిడీతో నిండా మునుగుతున్నాడు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసినా.. మిల్లర్లు బస్తాకు రెండు కిలోల నుంచి నాలుగు కిలోలదాకా తరుగు తీస్తుండటంతో నష్టపోతున్నాడు. రైతులు ఇదేమిటని అడిగితే మిల్లర్లు ధాన్యాన్ని తిప్పిపంపేస్తూ ఇబ్బందులపాలు చేస్తున్నారు. రైస్‌మిల్లులు అధికంగా ఉన్న పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, జనగామ, వరంగల్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మిల్లర్లు అడ్డగోలుగా తరుగు తీస్తుండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా పౌరసరఫరాల శాఖ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. కొనుగోలు కేంద్రం నుంచే మొదలు.. కొనుగోలు కేంద్రాల్లో ఒక్కో బస్తాలో 40కిలోల ధాన్యాన్ని నింపుతారు. ధాన్యంలో తేమ 17శాతం, అంతకన్నా తక్కువ ఉంటేనే తూకం వేస్తారు. అయితే కొనుగోలు కేంద్రాల్లోని హమాలీలు, నిర్వాహకులు తరుగు, ఇతర వేస్టేజీ పేరుతో సాధారణంగానే ఒక కిలోదాకా ఎక్కువ ధాన్యం వేసి.. 41 కిలోలతో బస్తాను నింపుతున్నారు. కానీ 40 కిలోల లెక్కనే నమోదు చేస్తున్నారు. ధాన్యం మొత్తం ఎన్ని బస్తాలు, మద్దతు ధర ప్రకారం అదే సొమ్ము ఎంత అన్న వివరాలను ఒక చీటీ మీద రాసి రైతులకు ఇస్తున్నారు. నిజానికి ఇక్కడితో రైతుల బాధ్యత పూర్తయినట్టే. తర్వాత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆ ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ అధికారులు సూచించిన మిల్లులకు పంపుతారు. మిల్లుకు చేరగానే కొర్రీలు.. మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని తీసుకుని.. తమకు అందినట్టుగా నమోదు చేయాలి. కానీ ఇక్కడే కొర్రీలు మొదలవుతున్నాయి. ధాన్యంలో తాలు, తేమ ఎక్కువగా ఉన్నాయని, నల్లటి ధాన్యం ఉందని సాకులు చెప్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు ఫోన్ చేసి.. ‘‘మిల్లు వాళ్లు వడ్లు తీసుకోరట. తరుగు ఉంది. వడ్లు నల్లబడ్డాయి. ఒకవేళ తీసుకోవాలంటే.. బస్తాకు కనీసం 2 నుంచి 4 కిలోల తరుగు తీయాల్సి ఉంటుంది. మీరు సరేనంటే మిల్లు వాళ్లు తీసుకుంటారట. లేకుంటే తిప్పి పంపేస్తామంటున్నారు..’’ అని చెప్తున్నారు. రైతులు చేసేదేమీ లేక తరుగుకు ఒప్పుకుంటున్నారు. 40 కిలోల బస్తాకు 2 కిలోల నుంచి 4 కిలోల వరకు అంటే.. క్వింటాల్‌కు 5 నుంచి 10 కిలోల ధాన్యాన్ని వదులుకోవాల్సి వస్తోంది. జాప్యం ఇందుకే.. కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యంతోపాటు మిల్లర్ల జోక్యం మితిమీరడం వల్లే వానాకాలం పంట కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు వాపోతున్నారు. రోజుకు లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు పౌరసరఫరాల సంస్థ చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి మరోలా ఉంది. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు మొదలై నెలా 15 రోజులు దాటినా.. ఇప్పటివరకు లక్ష్యంలో 33 శాతమే కొనుగోళ్లు పూర్తయ్యాయి. మొత్తంగా కోటి టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 34.26 లక్షల టన్నులే పూర్తయింది. ఈ నెలాఖరు వరకు కూడా కొనుగోళ్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అంతా కుమ్మక్కై! కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లుల యజమానులు కుమ్మ ౖక్కై రైతులను దోచుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చాలా చోట్ల మిల్లర్లు చెప్పినట్టుగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని.. వారు చెప్పినట్టు ధాన్యం సేకరణ సాగుతోందని రైతులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా పౌర సరఫరాల సంస్థ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో 453 కేంద్రాలు తెరవగా కొనుగోళ్లు దాదాపుగా పూర్తయి 427 కేంద్రాలను మూసేశారు. అదే సమయంలో భూపాలపల్లి, కొత్తగూడెం, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఇంకా కొనుగోళ్లు మొదలేకాలేదు. బస్తాకు 2 కిలోలు కట్ చేశారు మా పొలంలో పండించిన వడ్లను ఊరిలోని ఐకేపీ సెంటర్లో అమ్మిన. కానీ జనగామలోని రైస్‌మిల్లు వాళ్లు వడ్లలో తాలు ఉందంటూ రెండు రోజులు లారీ నుంచి వడ్లు దించుకోలేదు. తర్వాత బక్కో బస్తాకు 2 కిలోల లెక్కన తరుగు కింద కట్ చేశారు. నా 600 బస్తాలకు 12 క్వింటాళ్లు తరుగు చూపించారు. అంటే రూ. 24 వేలు నష్టపొయిన. – కొల్ల నర్సిరెడ్డి, రైతు,బండనాగారం, జనగామ జిల్లా తాలు, తప్ప లేకుండా తేవాలి వడ్లలో తాలు, రాళ్లు లేకుండా శుభ్రం చేసి ధాన్యం తేవాలి. కొందరు కొనుగోలు కేంద్రంలో ఉన్న నిర్వాహకులను మేనేజ్ చేసుకుని, ధాన్యం కాంటా వేయిస్తున్నారు. దానిని రైస్ మిల్లులకు పంపుతున్నారు. తాలు లేకుండా తెస్తే ఎలాంటి కటింగ్ ఉండదు. మేం కూడా రైతులమే.. –మినుపాల ప్రకాశ్‌రావు, రైస్ మిల్లు యాజమాని, సుల్తానాబాద్ తరుగు తీస్తే కఠిన చర్యలు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చేంత వరకే రైతుల బాధ్యత. కొనుగోలు కేంద్రం నుంచి రైస్‌మిల్లులకు పంపించాల్సింది కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే. ధాన్యం ఒక్కసారి రైస్‌మిల్లుకు చేరాక.. రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. రైస్‌మిల్లర్లు ధాన్యంలో కోతపెట్టడం, తాలు, తరుగు తీయడం అనేది నిబంధనలకు విరుద్ధం. మిల్లర్లు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం. – గంగుల కమలాకర్,పౌరసరఫరాల శాఖ మంత్రి -
రైతుల గోస పట్టని సీఎం కేసీఆర్: షర్మిల
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు యాసంగి రైతుల గోస పట్టడం లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. పంట వేసుకోవాల్సిన రైతు ఇంకా వానాకాలం పంట అమ్ముడుపోక, కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా కేసీఆర్ వైఖరిని ఎండగట్టారు. చివరిగింజ వరకు కొంటామని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మరోవైపు తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. -
బియ్యం నిల్వకు గోదాములెక్కడ?
సాక్షి, హైదరాబాద్: రైతులు ధాన్యం పండిస్తారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేస్తుంది. రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి పండించిన ధాన్యాన్ని సేకరించి.. మిల్లింగ్ చేయించి.. ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐ సూచించిన గోడౌన్లకు రాష్ట్రం పంపిస్తుంది. ఎఫ్‌సీఐ సెంట్రల్‌పూల్ విధానం ద్వారా ఆ బియ్యాన్ని పీడీఎస్, ఇతర సంక్షేమ పథకాల(ఓడబ్లు్యఎస్) కింద మళ్లీ ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. సాధారణంగా ఇదీ ధాన్యం సేకరణ, బియ్యం పంపిణీ విధానం. కానీ, దేశవ్యా ప్తంగా ధాన్యం దిగుబడి పెరిగి, బియ్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రేషన్ విధానాన్ని అమలు చేస్తుంది. అవసరాల మేరకే కొనుగోలు.. ఎఫ్‌సీఐకి ఉన్న గోడౌన్లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ సంస్థల ఆధ్వర్యంలోని గోడౌన్లు, ప్రైవేటు గోడౌన్లను కేంద్రమే అద్దెకు తీసుకుని నిర్వహిస్తుంది. కేంద్రం బియ్యం కొనుగోలు చేస్తేనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే తెలంగాణ ప్రభుత్వానికి పెట్టుబడి తిరిగివస్తుంది. అయితే నిల్వసామర్థ్యం, మార్కెటింగ్‌ను బట్టే రాష్ట్రాలు పండించిన పంటలో తనకు అవసరమైన మేరకే బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తోంది. ముందుగానే ఆ సంవత్సరానికి కొనుగోలు చేసే కోటా ఎంతో నిర్ణయించి ఎఫ్‌సీఐ ద్వారా సేకరిస్తుంది. మొత్తం బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తే.. నిల్వకు గోడౌన్లు సరిపోవు. గిడ్డంగుల సామర్థ్యమే సమస్య.. 2019–20లో ఎఫ్‌సీఐకి 20.47 లక్షల మెట్రిక్ టన్నుల గిడ్డంగుల కెపాసిటీ ఉండగా, 2020–21 నాటికి 23 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి గిడ్డంగుల కెపాసిటీ పెరిగింది. అయితే రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న బియ్యం, గిడ్డంగుల కెపాసిటీకి మధ్య చాలా తేడా ఉంది. గత సంవత్సరం ఖరీఫ్, రబీలో కలిపి 1.41 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించి, సీఎంఆర్ కోసం మిల్లులకు పంపింది. దీని మిల్లింగ్ ద్వారా దాదాపు 95.66 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వచ్చింది. గత వానాకాలం బియ్యం సెంట్రల్ పూలింగ్ విధానంలో ఎఫ్‌సీఐ ద్వారా పీడీఎస్, ఇతర అవసరాలకు పంపిణీ కాగా మిగిలినది గోడౌన్లకు చేరింది. ఇక యాసంగిలో సీఎంఆర్ ద్వారా రావలసిన 62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని నిల్వ చేయాలి. ఇందులో ఇప్పటి వరకు దాదాపు 50% సీఎంఆర్ ద్వారా గోడౌన్లకు చేరింది. మిగతా బియ్యం మిల్లుల నుంచి రావలసి ఉంది. ఈ పరిస్థితుల్లో బియ్యం నిల్వ చేయడానికి గోడౌన్లు లేక వేరే రాష్ట్రాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. 8.13 కోట్ల మెట్రిక్ టన్నుల స్టోరేజీ.. ఎఫ్‌సీఐ, ఇతర గోడౌన్లు కలిపి దేశవ్యాప్తంగా 2,223 ఉన్నాయి. వీటి కెపాసిటీ 8.18 కోట్ల మెట్రిక్ టన్ను లు. ఈ గిడ్డంగుల్లో బియ్యంతో పాటు గోదుమలు, ఇతర ఆహార పదార్థాలను నిల్వ చేయాలి. దీంతో బియ్యం నిల్వలకు సమస్య ఎదురవుతోంది. ఏ రాష్ట్రంలో సీఎంఆర్ ద్వారా సేకరించిన బియ్యాన్ని దాదాపుగా అదే రాష్ట్రంలో నిల్వ చేస్తుండటంతో తెలంగాణలో సమస్య వస్తోంది. తెలంగాణలోని 72 గోడౌన్లలో 23 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ చేసే సామర్థ్యం ఉండగా, ఇప్పటికే 15 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. తాజాగా యాసంగి బియ్యం వస్తుండటంతో ఎఫ్‌సీఐ చేతులెత్తేసింది. ఇందులో భాగంగానే వానాకాలం పంటను మిల్లులకు పంపించకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు అడ్డుకుంటున్నారనే విమర్శలున్నాయి. బాసుమతికే ఎగుమతుల్లో డిమాండ్ అధిక బియ్యం సమస్యను పరిష్కరించాలంటే రెండే మార్గాలు. ఒకటి నిల్వ సామర్థ్యం పెంచుకోవడం. రెండోది విదేశాలకు ఎగుమతి. బాసుమతి బియ్యం, నాణ్యమైన సన్న బియ్యాన్ని మాత్రమే ఆ దేశాలు తీసుకుంటుండటంతో సమస్య వస్తోంది. నాలుగేళ్లకు సరిపడా ఉప్పుడు బియ్యం... రెండుమూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఉప్పు డు బియ్యం సుమారు 50 లక్షల టన్నుల వరకు రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ గోడౌన్లలో పేరుకుపోయినట్లు ఎఫ్‌సీఐ వర్గాల సమాచారం. అందు కే ఆ బియ్యం కొనబోమని కేంద్రం చెబుతోంది. ఉప్పుడు బియ్యం ఎగుమతులు తగ్గడం, దేశంలో ఈ బియ్యం తినే ప్రజలున్న రాష్ట్రాల్లోనూ బాయిల్డ్ మిల్లులు తెరవడంతో గోడౌన్లు ఖాళీ కావడం లేదు. ఈ విషయాన్ని ఇటీవల కేంద్రం చెప్పి, నిల్వ బియ్యం నాలుగేళ్లకు సరిపోతాయని పేర్కొంది. 6 కోట్ల మెట్రిక్ టన్నుల సేకరణ.. 2020–21 ఖరీఫ్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రం సెంట్రల్ పూల్‌కు సేకరించిన బియ్యం 6 కోట్ల మెట్రిక్ టన్నులు. ఇందులో నుంచి 1.20 కోట్ల మెట్రిక్ టన్నులను కరువు కాటకాలు, యుద్ధాలు వచ్చినప్పుడు ప్రజలు, సైనికులు, కార్మికుల కోసం నిల్వచేస్తారు. ప్రతి ఏటా ఈ నిల్వలను ఖాళీ చేసి కొత్త స్టాక్‌ను ఉంచుతారు. మరో 1.20 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అవుతుంది. మిగతా 3.6 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం ఆయా రాష్ట్రాలకు సరఫరా చేస్తారు. -
ధాన్యం కొనుగోలు.. రెండ్రోజుల్లో ప్రకటన: కేంద్ర మంత్రి
సాక్షి, ఢిల్లీ: వరి ధాన్యం కొనుగోలుపై ఇంకా స్పష్టత రాలేదు. సుమారు గంట 23 నిమిషాలపాటు సాగిన భేటీ ఎటూ తేల్చలేదు. మంగళవారం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ సరఫరా శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రి కేటీఆర్ బృందం భేటీ ముగిసింది. ఖరీఫ్, యాసంగి సీజన్లలో 150 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని కేటీఆర్ బృందం వినతిపత్రం ఇచ్చింది. కొంతమేర అధికంగా కొనుగోలు చేసేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇక సమావేశం మధ్యలోనే ధాన్యం పంట విస్తీర్ణంపై వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో కేంద్రమంత్రి గోయల్ సంభాషించారు. రెండు రోజుల తర్వాత నిర్దిష్టంగా ఎంత కొనుగోలు చేసే అంశాన్ని చెబుతామని కేంద్రం తెలిపింది. 26వ తేదీన మరోసారి కలవాలని కేంద్ర మంత్రి కోరారు. ఉప్పుడు బియ్యం కొనమని కేంద్ర ప్రకటన చేయాలని తెలంగాణ బృందం విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత తామే రైతులను ఒప్పిస్తామని తెలంగాణ మంత్రులు వెల్లడించారు. భేటీ అనంతరం తెలంగాణ మంత్రుల బృందాన్ని వెంటబెట్టుకొని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో కేంద్ర మంత్రి గోయల్ కలిపించారు. -
పాలమూరు ధాన్యం.. పక్క రాష్ట్రాల్లో విక్రయం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎప్పుడైనా కర్ణాటక నుంచే రైతులు తాము పండించిన ధాన్యాన్ని పాలమూరుకు తీసుకొచ్చి విక్రయించే వారు. ఇది గతేడాది వానాకాలం, ఎండాకాలం సీజన్లలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారా యణపేట, జోగుళాంబ గద్వాలలో స్పష్టమైంది. ఇక్కడ స్థానికంగా ఉంటున్న వారి బంధువులు, స్నేహితుల పేర్లతో అమ్మేవారు. సరిహద్దులో ఉండటం.. అక్కడి కంటే ఇక్కడే మద్దతు ధర ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. అయితే ఈ సారి సీన్ రివర్స్ అయింది. ఉమ్మడి మహబూబ్ నగర్లో పలు ప్రాంతాల్లో ఖరీఫ్‌లో పండించిన ధాన్యం సరిహద్దులు దాటి కర్ణాటకకు తరలు తోంది. పంట చేతికొచ్చినా సకాలంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం.. చేసినా కొర్రీలు, కోతలు భరించలేక జిల్లా రైతులు ఆ రాష్ట్రంలోని రాయచూర్‌కు తీసుకెళ్లి విక్రయిస్తు న్నారు. తెలంగాణలో ప్రభుత్వ మద్దతు ధర కంటే అటుఇటుగా రూ.200 తగ్గినా.. అక్కడే అమ్ముకు నేందుకు మొగ్గుచూపుతున్నారు. పూర్తిగా అందుబాటులోకి రాని కేంద్రాలు.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారా యణపేట జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 7,10,993 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. దీనికను గుణంగా 822 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టు కోగా.. ఇప్పటివరకు 442 కేంద్రాలే అందుబాటు లోకి వచ్చాయి. పలు ప్రాంతాల్లో పంట చేతి కొచ్చినా కేంద్రాలు ప్రారంభం కాక.. ప్రారంభిం చినా కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు వాహనాలు లేక, గన్నీ బ్యాగులు, హమాలీల కొర తతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దాదా పుగా అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. కల్లాల్లో ఆర బోసిన తర్వాత నిల్వ చేసే అవకాశం లేక.. తుపాన్ సూచనలతో జిల్లా రైతులు దళారులను ఆశ్రయిస్తు న్నారు. ఈ క్రమంలో రాష్ట్ర సరిహద్దు నారాయణ పేట జిల్లాలోని కృష్ణ, మాగనూర్, జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు, ధరూర్, కేటీదొడ్డి మండ లాలకు చెందిన అన్నదాతలు కర్ణాటకలోని రాయ చూర్‌కు ధాన్యాన్ని తరలించి విక్రయిస్తున్నారు. అక్కడ క్వింటాల్‌కు రూ.1,740 నుంచి రూ.1,800 వరకు ధర చెల్లిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. వనపర్తి, నాగర్‌కర్నూల్‌లో దళారుల దోపిడీ.. ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకున్న దళారులు దోపిడీకి తెగబడినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతుల శ్రమను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ రకం క్వింటాల్‌కు రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 కాగా.. దళారులు రూ.1,050 నుంచి రూ.1,400 లోపే కొనుగోలు చేస్తున్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టిన కల్లాల వద్దకే వెళ్లి మాయమాటలతో వారిని మోసం చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని సేకరించిన తర్వాత వారు లారీల్లో రాయచూర్‌కు తరలించి విక్రయిస్తు న్నట్లు సమాచారం. కొందరు బడా ప్రైవేట్ వ్యాపారులు మాత్రం తాము కొన్న ధాన్యాన్ని నిల్వ చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో అందు బాటులోకి వచ్చి.. క్రయవిక్రయాలు ముమ్మరమైన తర్వాత వాటిని ప్రభుత్వ ధరకు అమ్మి సొమ్ముచేసుకునేలా వారు ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. రాయచూర్‌లో రూ.1,740 ధర వచ్చింది నేను 35 ఎకరాల్లో వరి సాగు చేశా. 10 ఎకరాలు కోసి వారం రోజులైంది. 2రోజుల్లో మిగతా పొలం కోస్తా. కొనుగోలు కేం ద్రా ల్లో ఇంకా ధాన్యం కొంట లేరు. మంగళ వారం మండలానికి 7,500 గన్నీ బ్యాగులు వస్తే బడాబాబులు ఇద్దరికే ఇచ్చారు. మరో పక్క కొనుగోలు కేంద్రంలో 40 కేజీల బ్యాగుకు 3 నుంచి 6 కిలోల తరుగు తీస్తరు. దీంతో రాయచూరు మార్కెట్లో విక్రయించాం. క్వింటాల్‌కు రూ.1,740 ధర పలికింది. ఇక్కడి కంటే రూ.200 ధర తగ్గినా ట్రాన్స్‌పోర్టు, హమాలీలు అనే అవస్థ లేదు.– సంతోష్, రైతు, గూడెబల్లూర్, కృష్ణ, నారాయణపేట పరిస్థితి వేరేలా ఉండటంతో.. నేను వానాకాలంలో ఎకరంన్నర సాగు చేస్తే 32 బస్తాల ధాన్యం వచ్చింది. కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. నిల్వ చేసుకునే సౌకర్యం లేదు. మరోపక్క నాయకులు ఖరీఫ్‌ను పక్కనబెట్టి యాసంగి గురించే మాట్లాడు తున్నారు. దీంతో కర్ణాటకలోని రాయ చూరు మార్కెట్‌కు వడ్లను తరలించి అమ్ము కున్నాం. క్వింటాల్‌కు రూ.1,870 ధర వచ్చింది. – మహదేవ్, గట్టు, జోగుళాంబ గద్వాల -
Three Farm Laws: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
PM Modi Announced Withdraws Three Farm Laws: రైతుల ఆందోళనలతో కేంద్రం దిగొచ్చింది. వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ మేరకు ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ నెలాఖరులో చట్టాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించి జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు. మనస్ఫూర్తిగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ‘రైతులు ఆందోళన విరమించాలి. మూడు వ్యవసాయ సాగు చట్టాలు పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాం. శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటాం. వ్యవసాయ బడ్జెట్‌ను ఐదురెట్టు పెంచాం.తక్కువ ధరకే విత్తనాలు అందేలా కృషి చేస్తాం. ఫసల్ బీమా యోజనను మరింత బలోపేతం చేస్తాం. రైతులను ఇబ్బందిపెట్టి ఉంటే క్షమించాలి. 2014లో నేను తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచీ మా ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించింది. మనదేశంలో 80 శాతం సన్నకారు రైతులే అనే విషయం చాలా మందికి తెలియదు. 10 కోట్ల మందికి పైగా రైతులకు 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉంది. రైతుల కష్టాలను దగ్గరుండి చూశాను. 22 కోట్ల భూసార పరీక్ష కార్డులను పంపిణీ చేయనున్నాం’ అని మోదీ తెలిపారు. 2020లో మూడు రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం. తీసుకొచ్చింది. ఇవి వివాదాస్పదంగా ఉండటంతో రైతులు రోడ్డెక్కారు. వెంటనే రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా రైతులు గుడారాలు ఏర్పాటు చేసుకొని నిరసన వ్యక్తం చేశారు. సుదీర్ఘంగా పోరాటం చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. అదే సమయంలో ఈ చట్టాలు రైతులను కార్పొరెట్లకు బానిసలను చేస్తాయంటూ ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు రాస్తారోకోలు చేశాయి. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో దిగివచ్చిన కేంద్రం.. రైతు చట్టాలను రద్దు చేసింది. ఈ మేరకు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు. -
హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్
-
హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్
-
హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: వరి కొనుగోలు వ్యవహరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా.. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై రైతులు మంగళవారం ఉదయం నుంచి రాస్తారోకో చేస్తున్నారు. ఈ క్రమంలో బీబీనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు రైతులు పెద్ద ఎత్తున చేరుకొని ధర్నా చేశారు. జాతీయ రహదారిపై రైతులు ఒడ్లుపోసి తగలబెట్టారు. దీంతో బీబీనగర్-హైదరాబాద్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. (చదవండి: ధాన్యం మద్దతు ధర పొందాలంటే..) ఉదయం నుంచి ట్రాఫిక్ జామ్ కావడంతో అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు, యాసంగి వరిపంట విషయంలో కేంద్రానికి, రాష్ట్రప్రభుత్వాన్ని మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయడం లేదని, రైతులు యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రాష్ట్రప్రభుత్వం చెబుతున్నది. చదవండి: నెగిటివ్ రిపోర్టు వద్దనేసరికి రోడ్లన్నీ జామ్! -
కొనుడుపై కొట్లాట..! టీఆర్ఎస్, బీజేపీ పరస్పర దాడులు
సాక్షి, నల్లగొండ జిల్లా నెట్వర్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పర్యటన రణరంగంగా మారింది. ఆసాంతం టీఆర్ఎస్ కార్యకర్తల అడ్డగింతలు, రాళ్లు, కోడిగుడ్లతో దాడులు.. బీజేపీ శ్రేణుల ప్రతిదాడులతో ఉద్రిక్తత నెలకొంది. పలుచోట్ల ఇరువర్గాలు రాస్తారోకోలకు దిగాయి. కొన్నిచోట్ల పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టాల్సి వచ్చింది. దాడులు, లాఠీచార్జిలో ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు సోమ, మంగళవారాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో పర్యటిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. అయితే సంజయ్ పర్యటనను అడ్డుకుని, నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్న టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.. ఆయా గ్రామాల్లో భారీగా మోహరించారు. ఎక్కడిక్కడ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నల్లజెండాలు, బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. పలుచోట్ల రాళ్లు, కోడిగుడ్లతో దాడికి దిగారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా దీటుగా స్పందించారు. కర్రలు చేతబట్టి టీఆర్ఎస్ కార్యకర్తలపైకి దూసుకెళ్లారు. ఆర్జాలబావి వద్ద తీవ్ర ఘర్షణ బండి సంజయ్ కాన్వాయ్ నేరుగా నల్లగొండ జిల్లా కేంద్రం శివార్లలోని ఆర్జాలబావి దగ్గరున్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరుకుంది. అప్పటికే అక్కడ గుమిగూడిన టీఆర్ఎస్ కార్యకర్తలు ‘సంజయ్ గోబ్యాక్, బీజేపీ నాయకులు గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలకు దిగారు. పోలీసులు రోప్‌పార్టీ సాయంతో సంజయ్‌ను ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి తీసుకెళ్లారు. ఆయన రైతులతో మాట్లాడుతుండగా.. కొనుగోలు కేంద్రంలోకి చొచ్చుకువచ్చేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. పోలీసులు వెంటనే కల్పించుకుని టీఆర్ఎస్ శ్రేణులను చెదరగొట్టారు. తర్వాత బండి సంజయ్ తిరిగి వెళ్లిపోతుండగా.. కాన్వాయ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. వెంటనే బీజేపీ నాయకులు, కార్యకర్తలు వాహనాల నుంచి దిగి కర్రలతో టీఆర్ఎస్ కార్యకర్తల వెంటపడ్డారు. పోలీసులు వారిని అడ్డుకుని.. సంజయ్ కాన్వాయ్‌ను పంపేశారు. అయితే బీజేపీ నాయకులు తమపై దాడి చేశారంటూ టీఆర్ఎస్ నాయకులు అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై రాస్తారోకోకు దిగారు. టీఆర్ఎస్ వాళ్లే తమపై దాడిచేశారంటూ బీజేపీ నాయకులు కూడా రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలను పంపేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలతో వచ్చిన ఎమ్మెల్యే.. బండి సంజయ్ పర్యటనను అడ్డుకునేందుకు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆర్జాలబావి కొనుగోలు కేంద్రానికి వచ్చారు. కానీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుందని భావించిన ఎస్పీ రంగనాథ్ ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించారు. రాళ్లదాడి జరగొచ్చని ముందే ఊహించిన పోలీసులు.. కొనుగోలు కేంద్రం, పరిసరాల్లో ఉన్న రాళ్లను ఏరి దూరంగా పడేశారు. కుక్కడం వద్ద లాఠీచార్జి బండి సంజయ్ మాడుగులపల్లి మండలంలోని కుక్కడం వద్ద కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లగా.. టీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు పరస్పరం ఘర్షణకు దిగారు. వారిని అదుపుచేస్తున్న క్రమంలో ఓ ఎస్సై కిందపడిపోవడంతో.. పోలీసులు లాఠీచార్జి చేసి అందరినీ చెదరగొట్టారు. ఇరువర్గాల ఆందోళనతో నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. శెట్టిపాలెం వద్ద ఆగమాగం వేములపల్లి మండలం శెట్టిపాలెం కొనుగోలు కేంద్రం వద్ద కూడా బండి సంజయ్‌ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ఆయన రైతులతో మాట్లాడి తిరిగి వెళ్తుండగా.. టీఆర్ఎస్ నేతలు విసిరిన కోడిగుడ్లు బండి సంజయ్ వాహనంపై పడ్డాయి. దీనితో బీజేపీ కార్యకర్తలు కూడా ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాలు రాళ్లు, కోడిగుడ్లు విసురుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరస్పర దాడుల్లోఓ ముగ్గురికి గాయాలయ్యాయి. ఓ మీడియా ప్రతినిధి కంటికి దెబ్బతగిలింది. ఇరువర్గాల కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. యాద్గార్పల్లి వద్ద నిరసనలు మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి సమీపంలోని రైస్ మిల్లుల వద్దకు వెళ్లిన బండి సంజయ్‌ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. నినాదాలు చేస్తూ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సంజయ్ కాన్వాయ్‌పై దాడికి ప్రయత్నించారు. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి అందరినీ చెదరగొట్టారు. చిల్లేపల్లి మూసీ వంతెన వద్ద రణరంగం.. బండి సంజయ్ కాన్వాయ్ నల్లగొండ జిల్లా దాటి సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశిస్తుండగా.. నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి మూసీ వంతెన వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాన్వాయ్ రావడానికి ముందే నేరేడుచర్ల, పాలకీడు, గరిడేపల్లి మండలాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని మూసీ వంతెనపై బైఠాయించారు. సంజయ్ కాన్వాయ్ అక్కడికి చేరుకోగానే.. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, రాళ్లు రువ్వారు. దీంతో రెండు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు లాఠీచార్జి చేసి టీఆర్ఎస్ శ్రేణులను చెదరగొట్టారు. బండి సంజయ్ కాన్వాయ్‌ను ముందుకు పంపారు. అయితే కొంత దూరంలో వేచి ఉన్న మరికొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు.. సంజయ్ కాన్వాయ్‌పై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఈ ఘర్షణలతో చిల్లేపల్లి నుంచి నేరేడుచర్ల, మిర్యాలగూడ రహదారిపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయి జనం ఇబ్బందిపడ్డారు. ఇక నేరేడుచర్ల పట్టణంలో కూడా కాన్వాయ్‌పై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. గడ్డిపల్లిలో రాళ్లు రువ్వి.. సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద బండి సంజయ్ కాన్వాయ్‌ను టీఆర్ఎస్ నేతలు అడ్డుకుని రాళ్లు రువ్వారు. ఆందోళకారులు ముందుగానే గ్రామంలో కరెంట్ కట్ చేశారు. గ్రామంలో బీజేపీ దివంగత నేత రామినేని ప్రభాకర్‌రావు విగ్రహానికి బండి సంజయ్ పూలమాల వేస్తున్న సమయంలోనూ రాళ్లు విసిరారు. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. అనంతారంలోనూ.. సూర్యాపేట జిల్లా అనంతారంలో ఆందోళనకారులు కరెంటు కట్‌చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద భారీగా మోహరించారు. దీంతో పోలీసులు బండి సంజయ్‌ను వాహనం నుంచి దిగనివ్వలేదు. ఆయన కాన్వాయ్‌ను అనాజిపురం గ్రామం మీదుగా సూర్యాపేట వైపు మళ్లించారు. ఈ విషయం తెలిసిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అనాజిపురంలో బండి సంజయ్ కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. తాళ్లఖమ్మంపహాడ్‌లో తీవ్ర ఉద్రిక్తత సూర్యాపేట జిల్లా తాళ్లఖమ్మంపహాడ్ గ్రామంలోనూ భారీగా గుమిగూడిన టీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ కాన్వాయ్‌పై రాళ్లు రువ్వాయి. పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. అయితే పోలీసులు తగిన భద్రత కల్పించడం లేదంటూ బీజేపీ కార్యకర్తలు గ్రామంలో రాస్తారోకోకు దిగి నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అక్కడికి చేరుకుని నిరసనకారులను చెదరగొట్టించారు. తర్వాత సంజయ్ కాన్వాయ్ ఇమాంపేటకు చేరుకోగా.. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు రోడ్డుపై ట్రాక్టర్ కేజ్ వీల్స్, కలప దుంగలు అడ్డుపెట్టి, కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. అక్కడి నుంచి బయలుదేరిన బండి సంజయ్.. రాత్రి 9.50 గంటలకు పెన్‌పహాడ్ మండలంలోని జానారెడ్డినగర్‌లో ఉన్న బీజేపీ దివంగత నేత కట్కూరి గన్నారెడ్డి నివాసానికి చేరుకుని.. బసచేశారు. -
కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు: మంత్రి హరీష్‌రావు
సాక్షి, కరీంనగర్: వరిధాన్యం కొనుగోలు విషయంలో.. కేంద్ర బీజేపీ నేతలు, రాష్ట్ర బీజేపీ నేతలు తలోమాట మాట్లడుతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన కేంద్రానికి వ్యతిరేకంగా సిద్ధిపేటలో.. టీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. కేంద్రమంత్రిగా ఉండి కిషన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. బీబీనగర్‌లో ఎయిమ్స్ నిర్మాణానికి స్థలమే కాదు.. బిల్డింగ్ కూడా ఇచ్చామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని హరీష్‌రావు హితవు పలికారు. కేంద్రం.. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలపై కిషన్‌రెడ్డికి ప్రేమ ఉంటే.. ప్రత్యేక నిధులు తేవాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. చదవండి: దంపతుల మధ్య గొడవ.. భర్త ఫోన్ స్వీచ్చాఫ్.. -
కేంద్రం వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ధర్నాలు..
సాక్షి, హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరికి నిరసనగా.. టీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దీనిలో భాగంగానే.. టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇందిరాపార్కు వద్దకు చేరుకున్నాయి. ఇప్పటికైన కేంద్రం.. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు ధర్మాలో పాల్గొన్నారు. అదే విధంగా.. సిరిసిల్లలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు, రాయపర్తి ధర్నాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. -
ధాన్యం మద్దతు ధర పొందాలంటే..
పంటను కంటికి రెప్పలా కాపాడుకుని వరి పండించడం ఒక ఎత్తు. దానికి మద్దతు ధర పొందటం మరో ఎత్తు. ఈ నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తేనే మద్దతు ధర లభిస్తుందని మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండల వ్యవసాయ అధికారి రమేష్ పేర్కొంటున్నారు. మరి అవేంటో చూద్దాం. సాక్షి, శామీర్‌పేట్: రైతులు తాము పండించిన వరి గింజలపై తీసుకునే జాగ్రత్తల మేరకు మద్దతు ధర లభిస్తుంది. రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. సాధారణ ధాన్యం రకం కనీసం మద్దతు ధర క్వింటాకు రూ.1940, ఎ–గ్రేడ్ రకం రూ.1960 రూపాయలుగా ప్రభుత్వం ప్రకటించింది. రైతులు తమ పంట తాలుకు వరి ధాన్యాన్ని దిగువ ఇచ్చిన సలహాలు, సూచనలు పాటించి వాటిని ఆచరిస్తే మద్దతు ధర పొందవచ్చని వ్యవసాయ అధికారి సూచిస్తున్నారు. (చదవండి: ధాన్యం కొనుగోలులో కేంద్రం విఫలం) నాణ్యతాప్రమాణాలు... ► మట్టి, రాళ్లు, ఇసుక వంటి వ్యర్థాలు ఉండకూడదు. ► గడ్డి, చెత్త, తప్ప, కలుపు, విత్తనాలు ఒక్క శాతం మించకూడదు. ► చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యపు గింజలు 5శాతం మించకూడదు. ► వరిపక్వం గాని, ముడుచుకుపోయిన, వంకర తిరిగిన ధాన్యపు గింజలు 3శాతంలోపే ఉండాలి. ► తక్కువ శ్రేణి ధాన్యపు గింజలు లేక కేళీలు ఎ–గ్రేడ్ రకంలో 6శాతం మించకూడదు. ► తేమ లేక నిమ్ము 17 శాతం మించితే కొనుగోలు చేయరు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ► ఒక రకం ధాన్యాన్ని మరోక రకం ధాన్యంతో కలపరాదు. ► పంట కోసిన తర్వాత ఆరబెట్టక పోతే గింజలు రంగుమారి నాణ్యత కోల్పోతాయి. పూర్తిగా ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. ► నూర్చేటప్పుడు ధాన్యంలో రాళ్లు, మట్టి గడ్డలు కలపకుండా నేల మీద పరదాలు లేదా టార్పాలిన్లు వేసి, వాటిపై నూర్పిడి చేయాలి. ► పంటలో తాలు, తప్ప, పొల్లు, చెత్తాచెదారం పోయేటట్టు తూర్పారబట్టాలి. ► ధాన్యం ముక్కిపోయి రంగుమారి నాణ్యత పడిపోకుండా తేమ బాగా తగ్గాకే బస్తాల్లో నింపి లాటు కట్టాలి. ► నిల్వ ఉంచిన ధాన్యాన్ని ఎలుకలు నాశనం చేయకుండా బస్తాల మధ్యన జింకు సల్ఫేట్ మాత్రలు, పురుగు నివారణకు లీటరు నీటికి 5 మిల్లీ లీటర్లు మలాథియాన్ మందును బస్తాలపై పిచికారి చేయాలి. ► రైతులు ధాన్యపు పంట నుంచి సుమారు కిలో ధాన్యం మచ్చు (శాంపిల్) కింద ప్రాథమిక పరిశీలన కోసం కొనుగోలు కేంద్రానికి ముందుగా తీసుకొచ్చి నాణ్యత పరీక్ష అధికారికి చూపించి తగు సలహ పొందాలి. ► ధాన్యం కొనుగోలు కేంద్రంలో శాంపిల్ తీసుకున్న అధికారి ధాన్యం నాణ్యతకు ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే సరుకు కొనుగోలు కేంద్రానికి తెచ్చుకోవాలి. ► మొదట తెచ్చిన ధాన్యం శాంపిల్ మాదిరిగానే మొత్తం సరుకు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ► సదరు ధాన్యం కోనుగోలు కేంద్రాలను ఉచిత నాణ్యత, తేమ పరీక్ష కేంద్రంగా కూడా రైతులకు ఉపయోగపడుతుంది. ► రైతు తనే పంట పండించిన భూమి సర్వే నంబర్ విస్తీర్ణ వివరాలు తెలియజేస్తూ అధికారి నుంచి గుర్తింపు పత్రం తీసుకుని ధాన్యం కోనుగోలు కేంద్రానికి దాఖలు చేయాలి. ► దళారులు, మధ్యవర్తులు, కమీషన్ ఏజెంట్లు చొరబాటు లేకుండా నివారించేందుకు నేరుగా పంట పండించిన రైతులకే ప్రభుత్వం గిట్టుబాటు ధర వర్తింపజేసేందుకే ఈ నిబంధనలు పాటించాలి. ► రైతులకు నాణ్యత ప్రమాణాలపై ఏమైనా సందేహాలుంటే సంబంధిత ఏఓ లేక ఏఈఓలను సంప్రదించాలి. దళారులను నమ్మొద్దు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించే రైతులు ఏమైనా సందేహాలుంటే ఏఈఓలను సంప్రదించండి. అధికారుల సూచనలను పాటిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దళారులు, మధ్యవర్తులు, కమీషన్ ఏజెంట్ల ప్రమేయం నివారించేందుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మాలి. – రమేష్, శామీర్‌పేట వ్యవసాయ అధికారి -
ధాన్యం కొనుగోలులో కేంద్రం విఫలం
సాక్షి, హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రానికి స్పష్టత లేదని, తెలంగాణవాసిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. పంజాబ్ తరహాలో తెలంగాణలోనూ కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో భవిష్యత్‌లో జరిగే పరిణామాలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బాధ్యత వహించాలని హెచ్చరించారు. బాయిల్డ్ రైస్‌ను కేంద్రం ప్రోత్సహించడం వల్లే దేశవ్యాప్తంగా అనేక బాయిల్డ్ రైస్ మిల్లులు ఏర్పడ్డాయన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డబ్బు చెల్లిస్తోందని, కానీ కేంద్రం నుంచి ఆరు నెలల తర్వాత ధాన్యం కొనుగోలు డబ్బు వస్తుండటంతో రాష్ట్రంపై వడ్డీ భారం పడుతోందన్నారు. వడ్డీ భారాన్ని భరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు చలనం లేదని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. దేశంలో బియ్యం నిల్వలు పేరుకుపోయాయని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ చెప్తుం డగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం వరి ధాన్యం పండించాలని చెప్తున్నారని నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి కేటీఆర్‌తో కలిసి తాను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన సంద ర్భంలో ఆయన వెకిలినవ్వుతో సమాధానం ఇచ్చారని మంత్రి గంగుల అన్నారు. -
సబ్సిడీ టార్పాలిన్లు అందేనా?
సాక్షి, హైదరాబాద్: వానాకాలం పంట ఉత్పత్తులు చేతికి వస్తున్న కీలక సమయం ఇది. వరి, పత్తి, మొక్కజొన్న, సోయా సహా అనేక పంటలు కోతలు మొదలవుతున్నాయి. మరోవైపు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అకాల వర్షాలు కల్లాల్లోని, మార్కెట్ యార్డుల్లోని పంట ఉత్పత్తులను నాశనం చేసే పరిస్థితులున్నాయి. గతంలో ఇలా నష్టపోయిన రైతులు లక్షల్లో ఉన్నారు. కానీ వ్యవసాయశాఖ మాత్రం నిర్లక్ష్యానికి మారుపేరుగా మారింది. రైతులకు అవసరమైన సామాగ్రిని సమకూర్చడంలో, టార్పాలిన్లను సబ్సిడీపై అందించడంలో వ్యవసాయశాఖ వైఫల్యం చెందింది. కనీసం సబ్సిడీపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం పంపకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో రైతులు బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. గతంలో 50 శాతం సబ్సిడీ... వర్షాలు, ప్రకృతి విపత్తుల నుంచి పంటలను రక్షించుకోవడానికి వ్యవసాయశాఖ గతంలో సబ్సిడీపై టార్పాలిన్లు అందించేది. కానీ గత రెండు మూడేళ్లుగా సబ్సిడీపై సరఫరాను పక్కన పెట్టింది. ఫలితంగా ఒక్క టార్పాలిన్న్కూడా రైతులకు సబ్సిడీతో అందడం లేదు. వ్యవసాయ శాఖకు ప్రభుత్వం నిధులు కేటాయించక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంతో కంపెనీలు ఒప్పందం చేసుకొని గతంలో టార్పాలిన్లు అందించేవి. మండలాల వారీగా వ్యవసాయాధికారులు ఇచ్చే ఇండెంట్‌ను బట్టి సరఫరా జరిగేది. వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో విరివిగా ప్రచారం చేసేవారు. రైతులు డీడీ, పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు అందించి టార్ఫాలిన్లు కొనుగోలు చేసేవారు. మార్కెట్లో రూ. 2,500కు లభించే టార్పాలిన్లను 50 శాతం సబ్సిడీతో రూ. 1,250కే అందించేలా ఏర్పాట్లు చేశారు. రవాణా చార్జీలతో కలిపి రూ. 1,300 నుంచి రూ. 1,500 వరకు రైతులకు అందించేవారు. స్థానిక వ్యవసాయ అధికారులు రైతుల వివరాలను కంపెనీలకు ఇస్తారు. ఆ సమాచారం ద్వారా 50 శాతం సబ్సిడీ నిధులు కంపెనీలకు సర్కారు చెల్లించేది. ఆ ప్రకారం 2018 వరకు టార్పాలిన్లను అందించారు. ఆ తర్వాత నుంచి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో సరఫరా నిలిచిపోయింది. రూ. 1,500 కోట్లు కేటాయించినా... వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 1,500 కోట్లు కేటాయించింది. టార్పాలిన్లను కూడా వ్యవ సాయ యాంత్రీకరణలో భాగంగా ఇవ్వాల్సి ఉంది. విచిత్రమేంటంటే కనీసం ఇప్పటివరకు వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు చేయలేదు. వానాకాలం సీజన్ ముగిసి, యాసంగి మొదలైనా బడ్జెట్లో కేటాయించిన నిధులను వినియోగించుకునే విషయంలో ప్రతిపాదనలే తయారుకాలేదు. దీంతో రైతులు టార్పాలిన్లు, ఇతర వ్యవసాయ పనిముట్ల కోసం ఎదురుచూస్తున్నారు. కనీసం తైవాన్ స్ప్రేయర్ వంటివి కూడా రైతులకు సబ్సిడీపై ఇచ్చే దిక్కు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణపై దృష్టిసారించింది. అందుకే ఎన్నడూ లేనంతగా బడ్జెట్లో నిధులు కేటాయించింది. 2018 వరకు భారీగా ట్రాక్టర్లు సహా వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు ట్రాక్టర్లు సహా కొన్నింటిపై 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో సరఫరా చేసింది. ఒకేసారి గ్రూపునకు లేదా వ్యక్తిగతంగా కూడా వీటిని ఇచ్చారు. ఉదాహరణకు ఒక్కో ట్రాక్టర్ విలువ మార్కెట్లో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. భారీగా సబ్సిడీ ఉండటంతో గ్రామాల్లో ట్రాక్టర్లను విరివిగా కొనుగోలు చేశారు. దాదాపు 8 వేల వరకు ట్రాక్టర్లను వ్యవసాయశాఖ రైతులకు సబ్సిడీపై అందజేసింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో వ్యవసాయ యాంత్రీకరణ విప్లవం ఏర్పడింది. తెలంగాణ ఏర్పడక ముందు, ఆ తర్వాత రైతులకు యంత్రాల పంపిణీ దాదాపు రెండింతలైంది. దీంతో వ్యవసాయం ఆధునికత సంతరించుకుంది. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు పెరగడం, మరోవైపు యాంత్రీకరణ జరగడంతో పంటల ఉత్పత్తి, ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగింది. కానీ వానల నుంచి పంటలను రక్షించుకునేందుకు కనీసంగా అవసరమైన టార్పాలిన్లను మాత్రం సరఫరా చేసే దుస్థితి లేకుండా పోయిందన్న విమర్శలు వస్తున్నాయి. -
నా ఫాంహౌజ్ దున్నడానికి బండి సంజయ్ ట్రాక్టర్ డ్రైవరా?: సీఎం కేసీఆర్
-
రైతులే కేసీఆర్ తోలు ఒలుస్తారు
భానుపురి/వలిగొండ/బీబీనగర్/నల్లగొండ: ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం వట్టిమాటలను కట్టిపెట్టకపోతే, రైతులు సీఎం కేసీఆర్ తోలు ఒలచడం ఖాయమని ఏఐసీసీ కార్యదర్శి, మాజీమంత్రి జి.చిన్నారెడ్డి హెచ్చరించారు. ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచనల మేరకు చిన్నారెడ్డి, మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలతో కూడిన బృందం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించింది. సూర్యాపేటలో వ్యవసాయ మార్కెట్‌ను సం దర్శించి రైతులతో మాట్లాడింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఎదుల్లగూడెం, బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి, నల్లగొండ మండలం ఆర్జాలబావిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించింది. చిన్నారెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని నెలరోజులుగా కొనకుండా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేస్తుందా అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పి ఇప్పుడు వరి వేయొద్దనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో వరి తప్ప వేరే పంటలు పండించే పరిస్థితి లేదన్నారు. రైతులను లక్షాధికారులుగా చేస్తామని మాటలతో ఉబ్బించి ఇప్పుడు రోడ్డున పడేశారని దుయ్యబట్టారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వమే కొనుగోలు చేసేవరకు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని హామీనిచ్చారు. వరికి కనీస మద్దతుధర రూ.1,960 చెల్లించాలని డిమాండ్ చేశారు. -
ఇది చేతగాని ప్రభుత్వం: ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నల్లగొండ టూటౌన్: వానా కాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని, ఇంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నల్లగొండ పట్టణ సమీపంలోని ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కెట్లో ధాన్యం రాశులను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వానికి ముందుచూపు లేదని, నెల రోజుల కిందటి నుంచే వరి కోతలు మొదలైనా ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యం కొనలేరా? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, వరి వేయొద్దని ప్రభుత్వం, మంత్రులు ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. రైతులకు రుణమాఫీ ఏమైందని నిలదీశారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనేవరకు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, సీఎం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో కూడా రైతులు వరి పండించుకోవాలని, ప్రభుత్వం కొనుగోలు చేసేంతవరకు రైతుల పక్షాన పోరాడుతామని పేర్కొన్నారు. ధాన్యాన్ని విదేశాలకు ఎందుకు ఎగుమతి చేయలేరని ప్రభుత్వాన్ని ప్రశించారు. కాగా, రైతుల సమస్యలను ఆయన ఫోన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. -
ధాన్యాన్ని కేంద్రం కొంటుందా? లేదా?.. కేంద్రంపై కేసీఆర్ ఫైర్
-
సన్నాల కొనుగోళ్లు షురూ : మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట: సన్నాల కొనుగోళ్లు మొదలయ్యాయని, అందరూ ఏకకాలంలో మిల్లుల దగ్గరికిపోతే నష్టపోతారని రాష్ట్ర విద్యుత్ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ వంకతో దళారులు ధర తగ్గించే ప్రమాదం ఉందన్నారు. మిల్లుల సామర్థ్యాన్ని బట్టి టోకెన్లు జారీచేస్తున్నామని వెల్లడించారు. శనివారం సాయంత్రం సూర్యాపేటలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రైతాంగం పండించిన పంటకు టోకెన్ల జారీపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. సజావుగా సాగుతున్న ధాన్యం కొనుగోళ్లపై గందరగోళం సృష్టించేందుకు విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. వర్షాకాలంలో పండిన పంట మొత్తం కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. 2014కు ముందు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పండిన పంట కేవలం రెండు లక్షల మెట్రిక్ టన్నులేనని, ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంట దిగుబడి 46 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి పెరిగిందన్నారు. అందుకు తెలంగాణ సమాజం గర్వపడుతుందన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. -
యాసంగిలో వరి వద్దు.. ప్రభుత్వం కొనదు: నిరంజన్ రెడ్డి
-
యాసంగిలో వరి వద్దు.. ప్రభుత్వం కొనదు: నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో యాసంగిలో వరి వేయవద్దు.. ప్రభుత్వం కొనలేదని బదనాం వద్దు’’ అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. యాసంగి పంటల సాగుపై ప్రభుత్వ వైఖరి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి వరి వడ్లను, బాయిల్డ్ రైస్‌ను భవిష్యత్‌లో ఎఫ్‌సీఐ కొనుగోలు చేయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వ విధానం ప్రకటిస్తున్నాం. యాసంగిలో వరి వేయవద్దు.. దానికి బదులు ఇతర పంటలు వేసుకోవాలి’’ అని తెలిపారు. (చదవండి: కేంద్రం, ఎఫ్‌సీఐ నిర్ణయాన్ని మార్చుకోవాలి) ‘‘విత్తన కంపెనీలతో ఒప్పందం ఉంటే రైతులు యాసంగిలో వరి సాగు చేయవచ్చు. రైస్ మిల్లులతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు వరి వేసుకోవచ్చు. అయితే వీటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అనుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్స్‌పోర్ట్స్ అనుమతులు ఉండవు. రైతుల వద్ద వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రైతులు అర్ధం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి’’ అని నిరంజన్ రెడ్డి తెలిపారు. చదవండి: ‘వరి’ని నిషేధిత జాబితాలో చేర్చారా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు -
‘వరి’ని నిషేధిత జాబితాలో చేర్చారా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో వరి విత్తనాలు అమ్మితే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన మౌఖిక వ్యాఖ్యలపై హైకోర్టు మండిపడింది. వరి విత్తనాలను నిషేధిత జాబితాలో ఏమైనా చేర్చారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. జిల్లా మెజి్రస్టేట్‌గా ఉండి చట్టాన్ని పరిరక్షించాల్సిన అధికారే.. చట్టవిరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించింది. వరిని విక్రయించిన దుకాణాలను తెరవాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా తాను లెక్కచేయనంటూ కలెక్టర్ చేసిన పేర్కొనడం కోర్టుధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు వెంకట్రామిరెడ్డిపై క్రిమినల్ కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్‌కుమార్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. వరి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ సిద్దిపేట జిల్లాకు చెందిన రైతు బత్తుల నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది చిన్నోళ్ల నరేష్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా, వరి విత్తనాలు విక్రయించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదని ఏజీ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ‘జిల్లా మెజి్రస్టేట్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయం. చట్టానికి అతీతులు ఎవరూ కాదు. కోర్టులు ఆదేశించినా లెక్క చేయనని పేర్కొనడం క్రిమినల్ కోర్టుధిక్కరణ కిందకే వస్తుంది. భవిష్యత్తులో కలెక్టర్‌కు ఏదైనా సమస్య వచ్చినా న్యాయస్థానాన్నే ఆశ్రయించాల్సి ఉంటుంది’అని న్యాయమూర్తి గుర్తుచేశారు. కలెక్టర్‌పై తదుపరి చర్యల కోసం ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. (చదవండి: ఈ రోజు లాస్ట్ మీటింగ్.. గాంధీ భవన్లో మాట్లాడాలా వద్దా అనేది తేల్చుకుంటా) -
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు
సాక్షి , హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం మొత్తాన్ని కొంటామని పునరుద్ఘాటించారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించారు. ఈసారి రైతుల నుంచి కోటి టన్నుల మేర ధాన్యాన్ని సేకరించే అవకాశం ఉన్నందున, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కమలాకర్ పేర్కొన్నారు. పంట కోతలు పూర్తయిన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్‌ర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, వర్షం కురిసినా ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాలకు టార్పాలిన్లను పంపిస్తామని చెప్పారు. గన్నీ బ్యాగుల గురించి, కొనుగోలు కేంద్రాల గురించి జరుగుతున్న దుష్ప్రచారాలను పట్టించుకోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన తర్వాత ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడానికి రవాణా సదుపాయాలు కూడా సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. కాగా, కోతల తీరును బట్టి జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు మంత్రికి చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,033 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు. -
కేంద్రం, ఎఫ్‌సీఐ నిర్ణయాన్ని మార్చుకోవాలి
సాక్షి, సిద్దిపేట: దొడ్డురకం ధాన్యాన్ని కొనుగోలు చేయని పక్షంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషి వల్లే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, దిగుబడి పెరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉండగా.. తెలంగాణ ఏర్పడ్డాక 35 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించామన్నారు. ఎంత పంట వచ్చినా కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందడం లేదన్నారు. యాసంగిలో పారా బాయిల్డ్ రైస్ కొనాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ మూడు సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ప్రతిపక్ష నాయకులు ఊరికే నోరు పారేసుకోవడం సరికాదని, కేంద్రాన్ని ఒప్పించి బాయిల్డ్ రైస్ కూడా కొనుగోలు చేసేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవిస్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో ఉండనున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సీజన్లో కోటి మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోళ్లు చేయాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది. ఈ స్థాయిలో సేకరణకు వీలుగా 6,500కుగా పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేలా కసరత్తు చేస్తోంది. ఇప్పుడిప్పుడే కోతలు మొదలైన దృష్ట్యా..అవసరాలు, ప్రాధాన్యాలకు తగ్గట్లుగా కేంద్రాలను తెరవనుంది. వారం, పది రోజుల్లోగా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యం సేకరణ మొదలుకానుంది. గణనీయంగా పెరిగిన సాగు ప్రస్తుత వానాకాలంలో వరి సాధారణ విస్తీర్ణానికి మించి సాగైంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 16.73 లక్షల హెక్టార్లు కాగా, నీటి లభ్యత గణనీయంగా పెరగడంతో ఈసారి ఏకంగా 24.99 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. సాగైన విస్తీర్ణానికి తగ్గట్లుగా కనీసం 1.33 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుం దని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందులో గృహావసరాలకు 14.23 లక్షల మెట్రిక్ టన్ను లు, విత్తన అవసరాలకు 4.86 లక్షల మెట్రిక్ టన్నులు పక్కనపెట్టినా, 1.13 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లోకి వస్తుందని అంచ నా ఉంది. ఇందులో మిల్లర్లు 12.49 లక్షల మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేసినా, మిగ తా ధాన్యం అంటే 1.01 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ లెక్కలేసింది. మౌలిక సదుపాయాల కల్పనకు ఏర్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా కోతలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. మరో 10 రోజుల తర్వాత నుంచి ఉధృతం కానున్నాయి. వాస్తవానికి గత సోమ వారం నుంచే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం భావించినా ఇప్పటివరకు పదుల సంఖ్యలో కూడా కేంద్రాలు తెరవలేదు. గన్నీ బ్యాగులతో పాటు టార్పాలిన్లు, తూకం కొలిచే యంత్రాలు, తేమ కొలిచే మిష న్లు మొదలైన వాటిని సమకూర్చుకునే పనిలో పడ్డాయి. కేంద్రాలు ప్రారంభమైతే ఏ ఒక్క సమస్య ఎదురైనా రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే పరిస్థితులు ఉండటంతో అన్నింటినీ ముం దే సమకూర్చుకోవాలని జిల్లా యంత్రాంగాలు భావిస్తున్నాయి. అవసరమైనవెన్ని.. అందుబాటులో ఉన్నవెన్ని అనే లెక్కలను పౌరసరఫరాల శాఖకు పంపిన జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలను గుర్తించే పనిలో పడ్డారు. యాసంగిలో రికార్డు స్థాయి కొనుగోళ్లు గత ఏడాది యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అయితే గత ఏడాది వానాకాలంలో కేవలం 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగా, ఈ ఏడాది అంతకు రెండింతలకు పైగా ధాన్యం సేకరణ జరగనుంది. జిల్లాల వారీగా చూస్తే అధికంగా నిజామాబాద్ జిల్లాలో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంటుందని లెక్కలు వేయగా, సిద్దిపేట జిల్లాలో 6.86 లక్షలు, జగిత్యాల జిల్లాలో 6.57 లక్షలు, కామారెడ్డి జిల్లాలో 5.80 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరించాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ తేల్చింది. -
తెలంగాణలో వరికి ఉరి
-
పెట్రోల్‌కి ప్రత్యామ్నాయం ఇథనాల్, అడ్డా తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: పెట్రోలుకు ప్రత్యామ్నాయంగా భావిస్తోన్న ఇథనాల్ తయారీకి తెలంగాణ అడ్డా కాబోతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో ఇథనాల్ తయారీ ప్లాంటు స్థాపనకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఉంది. వరితో పాటు మొక్కజొన్న, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడ ఎక్కువే. దీంతో వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ‘ఇంధన గ్రేడ్’ఇథనాల్ తయారీ ప్లాంటును తెలంగాణలో ఏర్పాటు చేయాలని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రతిపాదిస్తోంది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇథనాల్ తయారు చేసే 1జీ (ఫస్ట్ జనరేషన్) ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రూ.1000 కోట్లతో స్థాపించే ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 5 లక్షల లీటర్ల ఇథనాల్ తయారవుతుంది. ప్లాంటు ఏర్పాటుకు వంద ఎకరాల స్థలం అవసరమవుతుందని అంచనా. ఈ ప్లాంటు రోజూవారీ కార్యకలాపాల నిర్వహణకు 4 వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఇథనాల్ తయారీ ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరడంతో పాటు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అధికారులతో సమావేశం తెలంగాణలో ఇథనాల్ తయారీ పరిశ్రమ నెలకొల్పే అంశంపై బీపీసీఎల్ ఎగ్జిక్టూటివ్ డైరెక్టర్ (జీవ ఇంధనాలు) అనురాగ్ సరోగి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో భేటీ అయ్యారు. జయేశ్‌ను కలసిన వారిలో బీపీసీఎల్ ఈడీ (ఇంజనీరింగ్, ప్రాజెక్టులు) ఎల్ఆర్ జైన్, కేహెచ్‌పీఎల్ ప్రాజెక్టు లీడర్ బి.మనోహర్ ఉన్నారు. భవిష్యత్తులో ఇథనాల్ ఇథనాల్ తయారీ పరిశ్రమకు తమ మద్దతు ఉంటుందని కేంద్ర మంతత్రి నితిన్ గడ్కారీ ప్రకటించారు. పెటట్రోలు ఇథనాల్‌తో నడిచేలా ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయాలంటూ వాహన తయారీదారులకు సూచించారు. అంతకు ముందు పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ శాతం పెంచాలంటూ ప్రధాని మోదీ ప్రకటించారు. కేంద్రం నుంచి ఇథనాల్ తయారీకి భారీగా మద్దతు దక్కుతున్న తరుణంలో కొత్త ప్లాంటు ఏర్పాటుకు బీసీసీఎల్ తెలంగాణను ఎంచుకోవడం గమనార్హం -
Photo Feature: వ్యాక్సిన్ వేసుకోండి.. లాటరీ గెలవండి!
కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడుకునేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. టీకా వేసుకునేందుకు ప్రజలను పోత్సహించేందుకు అమెరికాలోని లూసియానా రాష్ట్ర రాజధాని బాటన్ రో సిటీలో లాటరీ ద్వారా నగదు, స్కాలర్షిప్ ఇవ్వనున్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీపంప్‌హౌస్ నుంచి నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఏపీలో రెండు నెలల విరామం అనంతరం మత్స్యకారులు వేటకు రెడీ అయ్యారు. ఇలాంటి మరిన్ని ‘చిత్ర’ విశేషాలు ఇక్కడ చూడండి. -
ధాన్యం తగులబెట్టి.. రోడ్డెక్కిన రైతన్న
మెదక్ రూరల్: ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జాప్యంతో పాటు సేకరించిన ధాన్యాన్ని మిల్లుకు తరలించేందుకు లారీల కొరత ఎదురవడంతో నెలల తరబడి కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తుందని మండిపడ్డారు. దీంతో విసుగుచెంది రైతులు ఆదివారం మెదక్ మండలం రాజ్‌పల్లి వద్ద మెదక్-చేగుంట ప్రధాన రహదారిలో రాస్తారోకో నిర్వహించారు. అలాగే ధాన్యపు రాశులకు నిప్పంటించారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌పల్లి వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో సుమారు 2 వేలకు పైగా ధాన్యం బస్తాలను సేకరించడం జరిగిందన్నారు. కాంటా చేసిన ధాన్యాన్ని మిల్లుకు తరలించడంలో అధికారుల అలసత్వం వహిస్తున్నారని విమర్శించారు. ధాన్యాన్ని లారీల కొరత వల్ల మిల్లుకు తరలించకపోవడంతో రోజుల తరబడి కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ట్రాక్టర్లు కొందరు రైతులు ధాన్యాన్ని తరలిస్తుండగా, ట్రాక్టర్లు లేని చిన్న సన్నకారు రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. టాపర్ల కిరాయిల ఖర్చులు వేలల్లో అవుతున్నాయని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపుచేశారు. మెదక్ రూరల్ ఎస్ఐ కృష్ణారెడ్డి రైతులకు నచ్చజెప్పి తహసీల్దార్‌తో మాట్లాడి సమస్యను వివరించారు. తహసీల్దార్ రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రెండు లారీలను పంపిస్తున్నట్లు హామీ ఇచ్చారు. అధికారుల హామీతో ఆందోళన విరమించారు. చదవండి: భారీ మోసం: రైతులకు నిలువు దోపిడీ -
బండెనక బండి.. ధాన్యం లెండి
జనగామ జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్‌లతో పాటు వ్యవసాయ మార్కెట్ల ద్వారా 195 కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు వాహనాల కొరత ఏర్పడటంతో కొద్దిరోజులుగా భారీగా ధాన్యం పేరుకు పోయింది. పైగా అకాల వర్షాలు పడటంతో ధాన్యం రవాణాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడిపోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు రంగంలోకి దిగిన జిల్లా అధికార యంత్రాంగం మంగళవారం ప్రధాన రహదారిపై వెళ్తున్న ఇసుక లారీలను ఆపి మరీ ధాన్యాన్ని మిల్లుల్లో దింపించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ ఏ.భాస్కరావు పర్యవేక్షణలో తహసీల్దార్ రవీందర్, ఇతర శాఖల అధికారులు ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. – జనగామ చదవండి: పారిపోయిన కొడుకు.. అత్తకు కోడలు అంతిమ సంస్కారాలు ధాన్యం తడిసిందని.. మహిళా రైతు బలవన్మరణం -
అయ్యో! పులి ఎంతపని చేసింది..
పెంచికల్పేట్/దహెగాం (సిర్పూర్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కమ్మర్గాం గ్రామ సమీపంలో మేతకు వెళ్లిన పశువులపై మంగళవారం పులి దాడి చేసింది. ఈ దాడిలో గ్రామానికి చెందిన తలండి పోశయ్యకు చెందిన ఎద్దు మృతి చెందింది. పేదం సురేష్‌కు చెందిన గేదెకు తీవ్ర గాయాలు అయ్యాయి. దహెగాం మండలం దిగిడ గ్రామంలోనూ పశువులపై పులి దాడి చేసింది. రైతు కుర్సింగ వెంకటేష్‌కు చెందిన ఆవు మేతకు వెళ్లి వస్తుండగా సాయంత్రం సమయంలో దాడి చేసి హతమార్చింది. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్.. వీకెండ్ ఫార్మర్!
ఒకవైపు ఉన్నతోద్యోగాలు చేస్తూనే తీరిక సమయంలో మరోవైపు వ్యవసాయంపై మక్కువ చూపుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సేంద్రియ, ప్రకృతి పద్ధతుల్లో సాగు చేసిన పంటలకు మంచి దిగుబడి లభిస్తుండటం, ఆదాయం కూడా అంతేస్థాయిలో ఉంటుండటంతో వ్యవసాయం లాభసాటిగా మారింది. ఒత్తిడితో కూడిన ఉరుకుల పరుగుల సిటీ జీవనం నుంచి ఉపశమనం కోసం కూడా కొంతమంది వ్యవసాయంపై దృష్టి సారిస్తున్నారు. సొంత భూములు ఉన్నవారు ఉద్యోగం చేసుకుంటూనే వీకెండ్స్ (శని, ఆదివారాల)లో సేద్యం చేస్తూ పచ్చటి ప్రకృతితో మమేకమవుతున్నారు. ఇదే వరుసలో చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సండ్ర రవీంద్ర కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం గోవర్ధనగిరికి చెందిన ఈయన వారాంతంలో సొంతూరుకు వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. ఒరాకిల్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రవీంద్రకు గోవర్ధనగిరిలో 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2002 వరకు ఆయన తండ్రి ఈ పొలాన్ని సాగు చేశారు. తండ్రి మరణించాక పొలాన్ని రవీంద్ర వేరే రైతులకు కౌలుకిచ్చారు. అయితే స్నేహితుల సలహా మేరకు 2006 నుంచి తానే సాగు చేపట్టి సుమారు 8 ఏళ్లపాటు సొంతంగా చెరకు పండించినా దక్కిన లాభం పెద్దగా లేదు. ఈ క్రమంలో.. పొరుగు గ్రామమైన రామాపురానికి చెందిన ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ గంగాధరం.. రవీంద్రకు పరిచయమయ్యారు. ఆయన సూచనలు, సలహాలతో రవీంద్రకు ప్రకృతి వ్యవసాయంపై మక్కువ ఏర్పడింది. 1.5 గుంటలతో ప్రారంభం.. అప్పటి వరకు రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల సారం కోల్పోయిన తన భూమిలో రవీంద్ర మొదట 1.5 గుంటల నేలను ప్రకృతి వ్యవసాయానికి ఎంచుకున్నారు. ఆ భూమిలో కానగ ఆకు, వేపాకు, జిల్లేడు ఆకు వేసి మగ్గబెట్టి 5 కిలోల వరి విత్తనాలు చల్లారు. ఇలా పెరిగిన నారును 1.5 గుంటల భూమిలో అలనాటి దేశీ వరి వంగడం క్రిష్ణ (క్రిష్ణ వ్రీహీ) పంట సాగును ప్రారంభించారు. దేశీ ఆవుపేడ, మూత్రం, ఆకులు, పాలు, మజ్జిగ, బెల్లం, పుట్టమట్టి, వివిధ రకాల ధాన్యాల పిండితో పంటకు ఉపయోగపడే ఘన జీవామృతం, బీజామృతం, జీవామృతం తయారు చేశారు. వేప ద్రావణం, పులియబెట్టిన మజ్జిగ, అగ్నాస్త్రము, సప్త ధాన్యంకుర కషాయాలను సిద్ధం చేసుకొని.. అవసరమైనప్పుడు పైరుకు వాడారు. ఎటువంటి తెగుళ్లు లేవు. పంట నాటి 125 రోజులైంది. నాటిన 5 నెలలకు పంట కోతకొస్తుంది. మరో 8 ఎకరాల్లో సాగుకు శ్రీకారం.. 1.5 గుంటల భూమిలో క్రిష్ణ వంగడం పంట చాలా బాగుండటంతో.. ఈ పంట పూర్తి కాకముందే రవీంద్ర మరో 8 ఎకరాలలో కూడా ఈ వంగడాన్ని సాగు చేయనారంభించటం విశేషం. ఈ పంట నాటి 75 రోజులైంది. అనుకున్న దానికన్నా ఏపుగా, చక్కగా పెరిగింది.రసాయనిక ఎరువులు, పురుగు మందులతో సాధారణ పద్ధతిలో కంటే ప్రకతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయటం వల్ల 50 నుంచి 60 శాతం తక్కువ ఖర్చు అయిందని రవీంద్ర ఆనందం వ్యక్తం చేశారు. క్రిష్ణ బియ్యంకు భలే గిరాకీ.. ప్రకృతి పద్ధతిలో సాగు చేసే క్రిష్ణ బియ్యానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ బియ్యం కిలో రూ.300 పలుకుతోంది. దేశంలో క్రిష్ణ బియ్యం పండిస్తున్న రైతులు సంపన్నులుగా మారుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కితాబివ్వడం తెలిసిందే. ప్రాచీన భారత వంగడమైన క్రిష్ణ వ్రీహీని పూర్వం యజ్ఞాలు, పండుగల్లో ఉపయోగించేవారు. 100 గ్రాముల క్రిష్ణ బియ్యంలో 8.8 నుంచి 12.5 గ్రాముల ప్రొటీన్లు, 3.33 గ్రాముల లిపిడ్స్, 2.4 మిల్లీగ్రాముల ఐరన్, 24.06 మిల్లీగ్రాముల కాల్షియం, 58.46 మిల్లీగ్రాముల మెగ్నీషియం, 69 నుంచి 74 మిల్లీగ్రాముల యాంథోసయనిన్స్ తదితరాలు ఉంటాయి. దీనిలో 18 ముఖ్యమైన అమినో ఆమ్లాలు, ఐరన్, జింక్, కాపర్, కెరోటిన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయని చెబుతున్నారు. క్రిష్ణ బియ్యంతో ఉపయోగాలివే.. ∙ఇందులో ఎన్నో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ∙క్యాన్సర్, గుండె జబ్బులను నిరోధిస్తుంది. ∙వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ∙ మధుమేహాన్ని నియంత్రిస్తుంది. – జి. జగన్నాథం, సాక్షి, పిచ్చాటూరు, చిత్తూరు జిల్లా రెట్టింపు ఉత్సాహం.. నా తండ్రి మరణించే వరకు నాకు వ్యవసాయం గురించి కనీస అవగాహన కూడా లేదు. ప్రకృతి వ్యవసాయ నిపుణులు గంగాధరం సూచనలతో దానిపై ఆసక్తి కలిగింది. ఉద్యోగం చేస్తూ సెలవుల్లో వ్యవసాయం చేస్తున్నా. ప్రకృతి సాగు ఫలితాలు నాలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. – సండ్ర రవీంద్ర (93809 42229), వారాంతపు రైతు, సాఫ్ట్వేర్ ఉద్యోగి, గోవర్ధనగిరి, పిచ్చాటూరు మం., చిత్తూరు జిల్లా యజ్ఞంలా చేస్తున్నారు.. రవీంద్ర క్రిష్ణ ధాన్యాన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో యజ్ఞంలా చేస్తున్నారు. సాఫ్ట్వేర్ జాబ్‌లో పని ఒత్తిడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అటువంటి ఉద్యోగం చేస్తూనే వారాంతంలో వ్యవసాయంపై దృష్టి సారించడం విశేషం. రైతులంతా ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి మరల్చాలి. సహాయ సహకారాలు అందించడానికి నా వంటి వాళ్లం సిద్ధంగా ఉన్నాం. – డా. కె.గంగాధరం (98490 59573), ప్రకృతి వ్యవసాయ నిపుణులు, రామాపురం, చిత్తూరు జిల్లా -
రైతులకు సన్నాల సంకటం!
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: సన్న రకాలు సాగు చేసిన రైతులు సంకట స్థితిలో పడ్డారు. ఈ ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నామమాత్రంగా కొనుగోలు జరుగుతున్నాయి. దొడ్డు రకాల కొనుగోళ్లకే ఐకేపీ, పీఏసీఎస్ నిర్వాహకులు ప్రాధాన్యం ఇస్తుండటంతో రైతులు రైస్ మిల్లుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నల్లగొండ జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 3.22 లక్షలు, ఖమ్మం జిల్లాలో 2.32 లక్షలు, నిజామాబాద్ జిల్లాలో 3.80 లక్షలు, కామారెడ్డి జిల్లాలో 2.43 లక్షలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3.98 లక్షల ఎకరాల్లో అత్యధికంగా వరి పంటను సాగు చేశారు. ఈ జిల్లాల్లో సాగైన పంటలో 70 శాతం పైగా సన్నరకాలే. నియంత్రిత సాగు విధానంలో భాగంగా రైతులు సన్న రకాల సాగుకే మొగ్గు చూపారు. కానీ పంట చేతికి వచ్చాక ఈ పంట సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ధాన్యం అమ్మడానికి రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. సన్న రకాలైన ఆర్ఎన్ఆర్, 108 సంపూర్ణ, సిద్ది 44, బీపీటీ, పూజలు, హెచ్ఎంటీ, వరంగల్ 44 రకాలు ఎక్కువగా సాగయ్యాయి. ఈ రకాల వరి కోతలు ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రం వీటిని అంతంత మాత్రంగానే కొనుగోళ్లు చేస్తుండటం గమనార్హం. మిల్లుల బాట ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులు ధాన్యం అమ్మకానికి మిల్లుల బాట పట్టారు. పంట కోసిన వెంటనే మిల్లుల్లో సన్న రకం కొనుగోలు చేస్తున్నారు. పది రోజులుగా ధాన్యం ట్రాక్టర్లతో మిల్లుల వద్ద రద్దీ పెరిగింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టోకెన్ సిస్టం పెట్టారు. తహసీల్దార్ల నుంచి టోకెన్ అందితేనే రైతులు పంట కోసుకొని మరుసటి రోజు మిల్లులకు ధాన్యం తీసుకెళ్లాలి. ఈ పరిస్థితితో టోకెన్ల కోసం కూడా రైతులు క్యూ కడుతున్నారు. మూడు రోజులకోసారి మం డల కార్యాలయాల్లో టోకెన్లు ఇస్తుండటంతో ఇవి దొరకని రైతులు పంట అంతా తూరి పోతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొనుగోలు చేయక తిప్పలు సూర్యాపేట జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ 306 కేంద్రాలకు గాను 148 కేంద్రాలు తెరిచారు. కానీ వీటిలో చాలా కేంద్రాల్లో సన్న రకం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. మిల్లులకు లేదా వ్యవసాయ మార్కెట్లలో ఈ ధాన్యం అమ్మాలని వీటి నిర్వాహకులు రైతులకు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్, వ్యవసాయ మార్కెట్లు కలిపి 441 కేంద్రాలకు 21 కేంద్రాలు తెరిచారు. పాలేరు డివిజన్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలు అక్కడక్కడ ఏర్పాటు చేసినా వీటిల్లో సన్న ధాన్యం కొనుగోళ్లు లేకపోవడంతో ఈ జిల్లా రైతులు ఎక్కువగా మిర్యాలగూడలోని మిల్లులకు ధాన్యం అమ్మకానికి తీసుకెళ్తున్నారు. సన్నరకం కొనుగోలు చేయడం లేదు ఈ రైతు పేరు మట్టపల్లి గురులింగం. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ ఇతని గ్రామం. మూడెకరాల్లో సన్న రకం వరి సాగు చేశాడు. నాలుగు రోజుల క్రితం పంట కోసిన ధాన్యాన్ని గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రానికి తీసుకెళ్లాడు. ఈ ధాన్యం కొనుగోలు చేయడం లేదని మిల్లులకు, లేదా వ్యవసాయ మార్కెట్‌కు తీసుకెళ్తే కొనుగోలు చేస్తారని ఐకేపీ నిర్వాహకులు ఉచిత సలహా ఇచ్చారు. ఎక్కడికి ధాన్యం తీసుకెళ్లాలో తెలియక ఈ కేంద్రంలోనే ధాన్యాన్ని ఆరబెట్టాడు. ప్రభుత్వం చెబితేనే సన్న రకం వేశామని, మరి ప్రభుత్వ కేంద్రాల్లో ఈ ధాన్యం ఎందుకు కొనుగోలు చేయరన్నది గురులింగం ఆవేదన. -
రోడ్డు మీద వరి పండించాడు
సాక్షి, తిరువనంతపురం: రహదారికి ఇరువైపులా అశోకుడు చెట్లు నాటించాడని చదివాం.కాని ఈ ఉద్యోగం లేని బస్ డ్రైవర్ రోడ్డు పక్కన కొద్దిపాటి స్థలంలో తోట పెంచుతున్నాడు. వరిని కూడా పండిస్తున్నాడు. ఈ తోటలోని వస్తువులు ఊరి వారికి ఉచితం. త్రిచూర్‌కు గంట దూరంలోని పెరిన్‌జనమ్ అనే పల్లెలో అనిల్ కుమార్ అనే వ్యక్తి సాధించిన పచ్చదనం ఇది.అనిల్ కుమార్ అంటే ఊళ్లో అందరికీ గౌరవం. అతని గురించి వింటే మనకూ గౌరవం కలుగుతుంది. కేరళలోని త్రిచూర్‌కు దగ్గరగా ఉండే ‘పెరిన్‌జనమ్’ అనే పల్లె అతనిది. ప్రయివేట్ ట్రాన్స్‌పోర్ట్‌లో బస్ డ్రైవర్‌గా పని చేసేవాడు. అతనికి ఊళ్లో వ్యవసాయానికి బెత్తెడు స్థలం కూడా లేదు. అతను సంప్రదాయ రైతు కూడా కాదు. కాని నేలంటే విపరీతమైన ప్రీతి. ఒక మొక్కకు ప్రాణం పోయడం అంటే అమిత ఇష్టం. ఊళ్లో రోడ్డుకు ఇరువైపులా ఒక గజం మేర వెడల్పుతో మట్టి మార్జిన్ ఉంది. ఇలాంటి మార్జిన్ ప్రతి ఊళ్లో ప్రతి రోడ్డుకూ ఉంటుంది. ఆ మార్జిన్ నేల చాలు తనకు అనుకున్నాడు అనిల్ కుమార్. ఆ నేలలో మెల్లగా కూరగాయ మొక్కలు పెంచడం మొదలెట్టాడు. ఊరి పంచాయతీ ఇది గమనించింది. ‘రోడ్డు రాకపోకలకు అంతరాయం కలిగించను. ఈ కాయగూరలు నేను అమ్ముకొని తినను’ అని అన్నాడు. పంచాయతీ అంగీకరించింది. ఇక అనిల్ కుమార్ పని మొదలయ్యింది. డ్యూటీ లేనప్పుడల్లా రోడ్డుకు ఇరువైపులా అన్ని రకాల కాయగూరలూ సాగు చేశాడు. కొన్ని మొక్కలు ప్రభుత్వం వారి నుంచి తెచ్చుకున్నాడు. కొన్నిమొక్కలు గ్రామస్తులే ఇచ్చారు. విత్తనాలు కూడా ఇచ్చారు. చెట్లు ఏపుగా పెరిగాయి. కాయలు కాశాయి. ‘మేం కోసుకోవచ్చా’ అని ఊరివాళ్లు అడిగితే ‘నన్ను అడిగే పనే లేదు’ అని జవాబు చెప్పాడు. ఒక అందమైన తోటే రోడ్డు పక్కన వెలియడం అందరికీ ఆశ్చర్యం. సంతోషం. అనిల్ కుమార్ మీద గౌరవం అలా పెరిగింది. అంతే కాదు... ఆ గజం స్థలంలోనే గ్రామస్తులు వద్దని వారిస్తున్నా, ఓడిపోతావ్ అని హెచ్చరిస్తున్నా వరి వేసి ఆశ్చర్యపరిచాడు. వరి ఆ జానాబెత్తెడు స్థలంలోనే విరగపండింది. లాక్డౌన్ తర్వాత అనిల్ కు ఉద్యోగం పోయింది. అయినా సరే ఈ తోట మీద బతికే పని పెట్టుకోలేదు. ‘ఊరి స్థలం ఇది. దాని మీద వచ్చేది ఊరికే’ అంటాడు. అప్పుడప్పుడు అతడు కొన్ని కాయగూరలను కోసి ఇంటికి తీసుకెళ్లాడు నిజమే కాని ‘అలా కోయకపోతే అవి పాడవుతాయి... మొక్కల్ని పాడు చేస్తాయి’ అని జవాబు చెబుతాడు. ‘ఇలా ప్రతి ఊళ్లో చేయవచ్చు. ఆ సందేశం అందించడానికే ఈ పని చేస్తున్నాను’ అంటాడు అనిల్. కూరగాయల మధ్య మధ్య అతడు పూల మొక్కలను పెంచాడు. పూలు విరబూసి ఆ దారంతా ఎంతో అందంగా ఉంటుంది. అందమైన పనులు చేసే కొందరు మనుషులను చూసి మిగిలిన అందరినీ ఈ ధరిత్రి మోస్తూ ఉంటుంది. -
తెలంగాణ: పంట పండింది
సాక్షి, హైదరాబాద్ : ఈసారి యాసంగిలో రైతన్నను అదృష్టం ‘వరి’ంచింది.. పొలాలన్నీ సిరుల కళ్లాలయ్యాయి. నిన్నటివరకు పచ్చగా కళకళలాడిన వరిపొలాల తెలంగాణ మాగాణి.. నేడు బంగారు వర్ణపు కంకులతో మెరిసిపోతూ రైతింట ‘పంట పండించింది’. నేల ఈనిందా.. బంగారం పండిందా అన్నట్టుగా.. ఎటుచూసినా పొలాల్లో కోతల కోలాహలం.. కళ్లాల్లో నిండారబోసిన ధాన్యపు రాశులు.. ఆనందంతో మురిసిపోతున్న రైతన్న కోతల వేగాన్ని పెంచాడు. కరోనా నేపథ్యంలో రైతుకు ఏ చిన్నకష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వం.. రైతు చెంతనే 7వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు పకడ్బందీ చర్యలు తీసుకుంది. నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తోంది. ఊపిరిలూదిన ప్రాజెక్టులు, చెరువులు రాష్ట్రంలో గతేడాది జూన్‌లో విస్తారంగా వర్షాలు కురవడంతో ఎస్సారెస్పీ, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎల్లంపల్లి నీటితో నిండాయి. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 60 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో సాగునీటి ప్రాజెక్టుల కింద ఏకంగా 40లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఎస్సారెస్పీ మొదటి, రెండో దశల కిందే 12 లక్షల ఎకరాలు సాగు కాగా, నాగార్జునసాగర్ కింద 6.40లక్షల ఎకరాల్లో పూర్తిస్థాయిలో సాగు జరిగింది. ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసి దాదాపు 5వేల చెరువులు నింపారు. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో భూగర్భజల సగటు మట్టం గతేడాది 12 మీటర్ల వరకు ఉండగా, అది ఈ ఏడాది ఏకంగా 7 మీటర్లకు చేరింది. దీంతో బోర్ల కింద సాగు పెరిగింది. ఇందులో ఎక్కువగా వరి పంటే సాగైంది. గతేడాది యాసంగిలో మొత్తంగా 18.57లక్షల ఎకరాలలో వరి సాగవగా, అది ఈ ఏడాది ఏకంగా 40లక్షల ఎకరాలకు పెరిగింది. పంటకు ఎక్కడా నీటి కొరత లేకుండా ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో చివరి తడి వరకు నీటిని అందించడంతో దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఇబ్బడిముబ్బడిగా దిగుబడులు ప్రస్తుతం కరీంనగర్, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో వరికోతలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ ఎకరాకి కొన్నిచోట్ల 30 – 32 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. మిగతాచోట్ల ఎకరాకు 27 – 29 క్వింటాళ్ల ధాన్యం వస్తోంది. ఈ క్రమంలోనే కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కనీసంగా 91లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. గతేడాది యాసంగిలో 37లక్షల మెట్రిక్ టన్నులు, మొన్నటి ఖరీఫ్‌లో 47.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఇప్పుడది రెట్టింపైంది. ‘అన్నపూర్ణ’ జిల్లాలివి.. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత మెరుగ్గా ఉండటం, కాళేశ్వరం జలాలతో నీటి ఎత్తిపోతలు పెరగడంతో గోదావరి పరివాహక జిల్లాలైన ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌తో పాటు కష్ణా పరివాహకంలోని నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో గణనీయంగా పంటలు సాగయ్యాయి. – ఉమ్మడి కరీంగనర్ జిల్లాలో 2018–19 యాసంగిలో వరిసాగు విస్తీర్ణం 3.72లక్షల ఎకరాలు కాగా, అది ఈ ఏడాది 7.92లక్షల ఎకరాలకు పెరిగింది. ధాన్యం దిగుబడి 9.14లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా, అది ఈ ఏడాది 15.95లక్షల వరకు ఉంటుందని అంచనా. – దేవాదుల, ఎస్సారెస్పీ–2 ప్రాజెక్టుల ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ సీజన్లో 4,38,033 ఎకరాల్లో వరి సాగైంది. 9.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఖరీఫ్‌లో 557 కేంద్రాలను ఏర్పాటు చేయగా ప్రస్తుతం 1,031 పెట్టాలని భావిస్తున్నారు. అవసరమైతే వీటి సంఖ్యను పెంచుతారు. – పూర్వ నల్లగొండ జిల్లాలో సాగర్, ఎస్సారెస్పీ–2 కింద నింపిన చెరువుల పరిధిలో ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుత నల్లగొండ జిల్లాలోనే గత సీజన్లో 1.75లక్షల ఎకరాల్లో సాగు జరగ్గా, ప్రస్తుతం 3.75లక్షల ఎకరాలు సాగయ్యాయి. ఈ ఏడాది ఇక్కడ 7.58లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం వస్తుందని అంచనా. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే ముగిసిన ఖరీఫ్‌లో 1.15లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఈ ఏడాది 8.64 లక్షల టన్నుల మేరకు సేకరిస్తారని అంచనా. – ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 14లక్షల మెట్రిక్ టన్నులు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 8.50లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశారు. పది రోజుల్లోనే 3.81లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు.. ఈ నెల మొదటి వారం నుంచి మొదలైన ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కేవలం పది రోజుల్లోనే ఏకంగా 3,516 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.81లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు పుంజుకుంటుండటంతో ఇకపై సేకరణ మరింత ముమ్మరం కానుంది. కొనుగోలు కేంద్రాల్లో పరిమిత దూరం పాటించాలని రైతులకు సూచిస్తున్నారు. ఖరీఫ్‌లో చెల్లించిన మద్దతు ధర మాదిరే ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.1,835, సాధారణ రకానికి రూ.1,815గా చెల్లిస్తున్నారు. ఇప్పటికే రూ.500 కోట్ల మేర చెల్లింపుల ప్రక్రియ పూర్తయింది. ఇక కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లింగ్ కేంద్రాలకు తరలించేలా రవాణా ఏర్పాట్లు చేశారు. (కేస్ స్టడీ) ఈ ఫొటోలోని రైతు పేరు గాదె మహేందర్‌రెడ్డి. రుద్రగూడెం (వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం) గ్రామానికి చెందిన ఈయన నాలుగు ఎకరాల్లో రబీలో వరి సాగు చేశాడు. గత ఖరీఫ్, రబీలో వరి పంటలకు భారీగా తెగుళ్లు ఆశించడంతో అనుకున్న స్థాయిలో దిగుబడి రాలేదు. ప్రస్తుత రబీలో చెరువు, బావి నీటి ఆధారంగా వరి సాగు చేశాడు. అదృష్టవశాత్తూ తెగుళ్లు సోకలేదు. పంట ఆశాజనకంగా ఉంది. మరో వారంలో కోతకు సిద్ధమవుతున్నట్టు ఆనందంగా చెప్పాడు. ఈయనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా పలువురు రైతులు రబీలో వచ్చే దిగుబడులతో అప్పులు సైతం తీర్చుకోవచ్చనే సంతోషంతో ఉన్నారు. కేస్ స్టడీ–2: ఈ రైతు పేరు గంగాధరి రమేష్. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌కు చెందిన ఈయన పాకాల ఆయకట్టు, బావి కింద 12 ఎకరాల్లో వరి సాగు చేశాడు. గత ఖరీఫ్‌లో 35 బస్తాల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం రబీలో 40 – 45 బస్తాల దిగుబడి వస్తుందనే ఆశతో ఉన్నాడు. పాకాల సరస్సులోని నీటి లభ్యత ఆధారంగా వరి.. ఈసారి సిరులు కురిపించనుందని రమేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. నీళ్లకు లోటులేదు.. పంటకు కొదవలేదు ఈసారి చెరువుల నీళ్లు మంచిగున్నయి. గతేడాది కన్నా బోర్లు కూడా మంచిగ పోసినయ్. అందుకే ధాన్యం గింజలు మంచిగెళ్లింది. గతంల 25 క్వింటాళ్లు ఎకరాకు వస్తే ఈ ఏడాది 28 నుంచి 30 క్వింటాళ్లు వస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇప్పుడిప్పుడే ధాన్యం తరలిస్తున్నం. – సురేందర్, మాటూరు, నాగిరెడ్డిపేట, కామారెడ్డి జిల్లా నాలుగు పుట్లు పండినయ్.. గతేడాది ఎకరం నేలలో వరి పంట వేస్తే మూడు పుట్ల వడ్లు పండాయి. తిండికోసం ఇంటికే వాడుకున్నా. ఈ ఏడాది అంతే విస్తీర్ణంలో వరి పంట వేస్తే నాలుగు పుట్ల వడ్లు పండినయ్. పుష్కలంగా నీళ్లుండటంతో పంట దిగుబడి పెరిగింది. – కొర్ర శంకర్. గుండ్రాతిమడుగు పెద్దతండా, కురవి మండలం, వరంగల్ జిల్లా -
ఈసారి ‘పంట’ పండింది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈసారి ‘పంట’ పండింది. అన్ని రకాల పంటలకూ అంచనాలకు మించి దిగుబడులు వచ్చాయి. ప్రస్తుత ఖరీఫ్ (2019–20) సీజన్లో అన్నదాతలకు వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలు ఒకరకంగా ఉపకరిస్తే.. పుష్కలంగా వర్షాలు కురవడం.. సాగు విస్తీర్ణం పెరగడం కూడా దిగుబడులు గణనీయంగా పెరగడానికి కారణమయ్యాయి. ఆర్థిక గణాంక శాఖ రెండో ముందస్తు అంచనా ప్రకారం రాష్ట్రంలో వరి ఉత్పత్తి సుమారు 78.68 లక్షల టన్నులుగా ఉండొచ్చని అంచనా వేసింది. మొదటి అంచనా కన్నా ఇది ఎక్కువ. మిగతా పంటల దిగుబడులు కూడా గతంతో పోలిస్తే పెరిగాయి. రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంటలుగా ఉన్న మిర్చి, పత్తి, వేరుశనగ, కంది దిగుబడులు కూడా చెప్పుకోదగిన రీతిలో పెరిగాయి. గణనీయంగా పెరిగిన దిగుబడులు.. ఏపీలోని ప్రధాన పంటల దిగుబడులన్నీ పెరిగాయి. గతంలో హెక్టార్‌కు 5,029 కిలోలుగా ఉన్న వరి ఈ ఖరీఫ్‌లో 5,166 కిలోలకు చేరింది. జొన్న, సజ్జ, చిరు ధాన్యాల దిగుబడి హెక్టార్‌కు రెండు మూడింతలు పెరిగాయి. 2018–19లో హెక్టార్‌కు 130 కిలోలుగా ఉన్న జొన్న 1,036 కిలోలకు.. సజ్జ 1,013 నుంచి 2,322 కిలోలకు చేరింది. మిర్చి, పత్తి, వేరుశనగ, కంది సాగులోనూ పెరుగుదల ఉంది. మిర్చి హెక్టార్‌కు గతేడాది ఖరీఫ్‌లో 3,142 కిలోలుగా ఉంటే ఈ ఏడాది అది 4,615 కిలోలుగా, పత్తి హెక్టార్‌కు 1,224 నుంచి 1,713 కిలోలకు చేరింది. వేరుశనగ దిగుబడి హెక్టార్‌కు 484 నుంచి 1,035 కిలోలకు.. కంది 180 నుంచి 831 కిలోలకు చేరింది. ఫలితాన్నిచ్చిన రైతు సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా, ఉచిత పంటల బీమా వంటి సంక్షేమ పథకాలతోపాటు సమృద్ధిగా కురిసిన వర్షాలు ఈ ఏడాది ఖరీఫ్‌లో ఉత్పత్తులు పెరగడానికి దోహదపడ్డాయని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఖరీఫ్ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైనా ఆ తర్వాత కురిసిన వర్షాలు పంటలకు కలిసి వచ్చాయి. అలాగే, రిజర్వాయర్లు నిండడంతో నీటి సమస్య లేకుండాపోయింది. చీడపీడల బెడద కూడా ఈ ఏడాది తక్కువగా ఉంది. ఒక్క పత్తికి మాత్రమే కొన్ని ప్రాంతాలలో తెగుళ్లు సోకినట్టు గుర్తించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రస్తుత రబీ సీజన్ నుంచి ఇచ్చిన పెట్టుబడి సాయం రైతులకు ఎంతగానో ఉపకరించినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. -
సగమే రుణం... తప్పని భారం
సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరుకు ఖరీఫ్ ముగియనుంది. ఇప్పటికే కోటి ఎకరాలకు పైగా పంటలు సాగయ్యాయి. సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురవడంతో లక్ష్యానికి మించి వరి నాట్లు పడుతున్నాయి. అయితే బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో సహకరించడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో రైతులకు ప్రైవేటు అప్పులే దిక్కయ్యాయి. ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ.25,496 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.11,400 కోట్లే బ్యాంకులు ఇచ్చాయి. అంటే లక్ష్యంలో సగం కూడా విడుదల చేయలేదు. దీనిపై వ్యవసాయశాఖ వర్గాలు బ్యాంకులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. బ్యాంకులు మాత్రం ధరణి వెబ్సైట్ అందుబాటులోకి రాకపోవడం వల్లే రుణాలు ఇవ్వడంలేదని చెబుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే వ్యవహరిస్తున్నామంటున్నాయి. ప్రభుత్వం పంట రుణాలకు సంబంధించి ఈసారి కొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది. ఈ ఖరీఫ్ నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకం కుదువబెట్టుకోకుండానే రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది. రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ధరణి వెబ్సైట్లో రైతుల సమాచారం సరిచూసుకున్న తర్వాతే పంట రుణాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే ఆచరణలో అది సాధ్యంకాలేదు. దీంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ధరణి వెబ్‌సైట్‌కు, రుణాలకు లంకె పెట్టడంపై విమ ర్శలు వస్తున్నా సర్కారు పట్టించుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. -
స్వామినాధన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి
-
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
-
వరికి కనీస మద్దతు ధర పెరిగింది
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రైతుల మన్ననలు పొందేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్లో పండే 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. బడ్జెట్లో కేటాయింపులకు అనుగుణంగా ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపును కేంద్రం ప్రకటించింది. దీంతో ఖరీఫ్ సీజన్లో ప్రధాన పంట అయిన వరి కనీస మద్దతు ధర 2018-19లో క్వింటాకు 200 రూపాయలు పెరిగి, రూ.1,750గా నిర్ణయమైంది. 2017-18లో ఈ ధర రూ.1,550గా ఉండేది. గ్రేడ్ ఏ రకం వరి కనీస మద్దతు ధర కూడా 160 రూపాయలు పెరిగి రూ.1,750 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. వరికి కనీస మద్దతు ధర పెరగడంతో, 2016-17(అక్టోబర్-సెప్టెంబర్) మార్కెటింగ్ ఏడాది ప్రకారం ఆహార రాయితీ బిల్లు కూడా రూ.11 వేల కోట్ల కంటే ఎక్కువ పెరగనుందని తెలిసింది. వరితో పాటు పత్తి(మిడియం స్టాపుల్) కనీస మద్దతు ధర కూడా రూ.4,020 నుంచి రూ.5,150కు పెరిగింది. అదేవిధంగా పత్తి(లాంగ్ స్టాపుల్) కనీస మద్దతు ధర కూడా క్వింటాకు రూ.4,320 నుంచి రూ.5,450కు పెంచారు. పప్పు ధాన్యాల కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5,450 నుంచి రూ.5,675కు పెంచుతున్నట్టు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సన్ ప్లవర్ ధర క్వింటాకు 1,288 రూపాయలు, పెసర్ల ధర క్వింటాకు 1,400 రూపాయలు, రాగుల ధర క్వింటాకు 997 రూపాయలు పెంచుతున్నట్టు ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను ఉత్పత్తి ఖర్చు కంటే 1.5 రెట్లు ఎక్కువగా పెంచనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్లో ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మంగళవారమే ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్, నీతి ఆయోగ్ ప్లానింగ్ బాడీ అధికారులు సమావేశమయ్యారు. -
వరికి ‘మద్దతు’ రూ.200 పెంపు!
సాక్షి, న్యూఢిల్లీ: వరికి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.200 పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2019 సాధారణ ఎన్నికల నేపథ్యంలో రైతుల ‘మద్దతు’ పొందేందుకు ఈ నిర్ణయం తీసుకోనుంది. ఖరీఫ్ సీజన్లో ప్రధాన పంట అయిన వరికి 2018–19లో 13 శాతం పెంపుతో క్వింటాలుకు రూ.1,750 చెల్లించనుంది. మరో 13 రకాల ఖరీఫ్ పంటల మద్దతు ధరను కూడా స్వల్పంగా పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మద్దతు ధర పెంపుపై కేంద్రం ఈ వారంలోనే నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత ఏడాదిలో వరికి క్వింటాలుకు రూ.1,550 (సాధారణ రకం) కనీస మద్దతు ధరను కేంద్రం చెల్లిస్తోంది. గ్రేడ్–ఏ పంటకు రూ.1,590 చెల్లిస్తోంది. ‘ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర వివరాలను ఇప్పటికే ప్రకటించాల్సి ఉన్నా.. కేంద్రం ఆలస్యం చేసింది. -
దిగుబడి లేదు..గిట్టుబాటు రాదు
కారంచేడు : ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు అన్నదాతలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షాలు లేకపోవడంతో జిల్లాలో రైతన్నలను నిండా ముంచేసింది. ఈ ఏడాది జిల్లాలో సుమారు 1.11 లక్షల ఎకరాల్లో వరి, 2.57 లక్షల ఎకరాల్లో శనగ సాగు చేశారు. వరి, శనగ సాగుల్లో ప్రకాశం జిల్లా రైతులు మంచి మెళకువలు పాటించి ఎక్కువ దిగుబడులు సాధిస్తుంటారు. కానీ వాతావరణం అనుకూలించక పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో కర్షకులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. దిగుబడులు పతనమై, ధరలు దిగజారిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ధాన్యాగారానికి తప్పని నష్టాలు.. జిల్లా ధాన్యాగారంగా పేరొందిన కారంచేడు ప్రాంత రైతన్నలకు ఈ ఏడాది నష్టాలు తప్పడం లేదు. గత ఏడాది వాతావరణం అనుకూలించి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయంటున్న అన్నదాతలు ఈ ఏడాది మాత్రం పంట దిగుబడుల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. గత ఏడాది దిగుబడులు బాగున్నాయి, ధరలు కూడా బాగున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది దిగుబడులు లేకపోగా ధరలు కూడా పతనమవడంతో ఎకరానికి కనీసం రూ.10 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని లబోదిబోమంటున్నారు.జిల్లాలోని 12 సబ్ డివిజన్ల పరిధిలోని గ్రామాల్లో మొత్తం శనగ సాగు 2,56,598 ఎకరాల్లో, వరిసాగు 1,10,513 ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయా«ధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇంత ఘోరమైన దిగుబడులు గతంలో చూడలేదు గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది శనగ సాగు ఘోరంగా ఉంది. వాతావరణం అనుకూలించపోవడంతో కాపు తగ్గిపోయింది. చెట్టు బాగా పెరిగింది. కానీ కాయలు తగ్గిపోయాయి. దీంతో దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఎకరానికి సుమారు రూ.20 వేల వరకు నష్టం వచ్చేలా ఉంది. ఒక్కో రైతు కనీసం 5 ఎకరాల వరకు సాగు చేశారు. – దగ్గుబాటి నాగశ్రీను, రైతు, కారంచేడు వరిలోనూ నష్టపోవాల్సిందే ఈ ఏడాది వరి సాగులో కూడా రైతులు నష్టపోవాల్సిందే. ముదురులో సాగు చేసిన చేలల్లో కనీసం 90 శాతం పంట పడిపోయింది. దీంతో గింజ రాలిపోయింది. వాతావరణం ఈ ఏడాది అన్నదాతలను నిండా ముంచేసింది. గత ఏడాదితో పోల్చుకుంటే కనీసం 10 బస్తాల దిగుబడి తగ్గిపోగా ధరలో బస్తాకు రూ.300 వరకు తగ్గింది. దీంతో రైతులు ఎకరానికి రూ.10 వేల దాకా నష్టపోవాల్సి వస్తుంది. గిట్టుబాటు ధరలు కల్పిస్తే రైతుకు కొంత ఊరటగా ఉంటుంది. – యార్లగడ్డ శ్రీకాంత్, రైతు, కారంచేడు -
కాలిబాట వదిలితేనే పైరు పదిలం
వరి నాట్లలో సమగ్ర యాజమాన్యం తప్పనిసరి ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ సంపత్‌కుమార్ అనంతపురం అగ్రికల్చర్: వరి పంట వేసే రైతులు అధిక దిగుబడుల కోసం సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. సమగ్ర సాగు పద్ధతులు వరి నాట్లు వేయడానికి 15 రోజుల ముందుగానే పొలాన్ని దుమ్మ చేయడం ప్రారంభించి రెండు మూడు దఫాలుగా మురగబెట్టాలి. పొలమంతా సమానంగా చెక్కతోకాని ఇతరత్రా పరికరంతో చదను చేసుకోవాలి. రేగడి భూముల్లో రెండు రోజుల ముందుగా ఈ కార్యక్రమం పూర్తి చేసి నాట్లు వేసుకోవాలి. నారు తీసే సమయంలో మొక్కలు లేత ఆకుపచ్చగా ఉండాలి. నాలుగు నుంచి ఆరు ఆకులున్నపుడు నాటాలి. ముదురు నారు నాటితే దిగుబడులు తగ్గుతాయి. చదరానికి 33 మూనలు (మొక్కలు) ఉండేలా నాటుకోవాలి. ప్రతి రెండు మీటర్ల నాట్లకు 20 సెంటీమీటర్లు (సెం.మీ) కాలిబాటలు తీయడం వల్ల పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి తగ్గుతుంది. అలాగే కలుపు మందులు పిచికారి, ఎరువుల వేయడానికి అనువుగా ఉంటుంది. భూసారం ఎక్కువగా ఉన్న పొలాల్లో తక్కువ కుదుళ్లు, తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్లు ఉండేలా నాటాలి. ముదురు నారు నాటినపుడు కుదుళ్ల సంఖ్య పెంచి, కుదురుకు నాలుగైదు మొక్కలు నాటాలి. అలా నాటినపుడు నత్రజని మామూలుగా వేసేదాని కన్నా 25 శాతం ఎక్కువ వేయాలి. నీరు తక్కువగా పెట్టి నాట్లు వేసుకోవాలి. ఎరువులు, కలుపు నివారణ ఎకరాకు 96 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాష్ అవసరం. నత్రజనిని మూడు భాగాలుగా చేసి దమ్ము, దబ్బు, అంకురం దశలో వేసుకోవాలి. భాస్వరం ఒకేసారి వేసుకోవాలి. పొటాష్ ఎరువును రేగడి నేలల్లో ఒకేసారి, తేలికపాటి నేలల్లో సగం దమ్ము సమయంలోనూ మిగతా సగం అంకురం దశలో వేయాలి. నాటిన మూడు నాలుగు రోజుల్లోగా నీరు పలుచన చేసి ఎకరాకు ఒక లీటర్ బుటాక్లోర్ లేదా అర లీటర్ ప్రెటిటాక్లోర్ లేదా అర లీటర్ అలిలోఫాస్ 10 కిలోల ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లితే కలుపు సమస్య తగ్గుతుంది. నాటిన 15 నుంచి 20 రోజుల సమయంలో ఎకరాకు 50 గ్రాములు ఇథార్స్‌సల్యురాన్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. నాట్లు వేసిన రెండు నుంచి ఆరు వారాల్లో పైరు సరిగా ఎదగక జింకులోపం రావచ్చు. ముదురాకు చివర్లో, మధ్య అనెకు ఇరువైపులా తుప్పు మచ్చలు లేదా ఇటుక రంగు మచ్చలు కనబడుతాయి. దీని నివారణకు 2 గ్రాములు జింక్‌సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకోవాలి. -
జిల్లాలో ఇప్పటికి 31 శాతం వరినాట్లు
-నెలాఖరుకల్లా పూర్తిచేయాలి -వ్యవసాయ శాఖ జేడీ ప్రసాద్ కరప(కాకినాడ రూరల్) : జిల్లాలో ఇంతవరకు 31 శాతం మేర ఖరీఫ్ వరినాట్లు పడ్డాయని వ్యవసాయ సంయుక్త సంచాలకుడు జేవీఎస్ ప్రసాద్ తెలిపారు. కరప మండలం వలసపాకలలో బుధవారం ఆయన డీడీఏ వీటీ రామారావుతో కలిసి వెదజల్లిన పంటపొలాలను, నారుమళ్లను పరిశీలించి, రైతులకు సూచనలుచేశారు. సార్వాలో 2.32 లక్షల హెక్టార్లలో వరిసాగు చేయాల్సి ఉండగా 71,568 హెక్టార్లలో నాట్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. నెలాఖరుకల్లా వరినాట్లు పూర్తిచేసుకోవాలని సూచించారు. ప్రత్తినాట్లు 35 శాతం వేశారన్నారు. వరిలో సూక్ష్మపోషకాల లోపాన్ని అరికట్టేందుకు నూరుశాతం రాయితీపై ఇస్తున్న జిప్సం, జింకు, బోరాన్‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షాలకు జిల్లాలో పెద్దగా నష్టం జరగలేదన్నారు. వెదజల్లిన పొలాలు ముంపునకు గురైతే మళ్లల్లోంచి నీరుపోయేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా గోతుల్లో పడిన విత్తనాల మొలకశాతం దెబ్బతింటే మళ్లీ జల్లుకుంటే సరిపోతుందని చెప్పారు. పల్లపు ప్రాంతాల్లో వరినాట్లు వేసిన పొలాలు ముంపుకు గురైతే నీరుతీసేసి, బూస్టర్ డోస్‌గా 10 కిలోల యూరియా, 15 కిలోలు పొటాష్ వేయాలన్నారు. శిలీంధ్ర, కీటకనాశిని మందులు హెక్సాకొనజోల్, కార్బండిజమ్, క్లోరిఫైరిపాస్, మోనోక్రోటోపాస్ మందులలో ఏదో ఒకటి పిచికారీ చేస్తే పంటతెగుళ్లు అదుపుచేయవచ్చన్నారు. కౌలు రైతులకు రూ.101 కోట్ల రుణాలు జిల్లాలో 1,34,777 కౌలురైతులు ఉండగా 81,820 మందికి రుణఅర్హత కార్డులు ఇచ్చి, వివిధ బ్యాంకుల ద్వారా రూ 101.73 కోట్లు పంటరుణాలు అందజేశామని ప్రసాద్ తెలిపారు. 59,600 మంది సాగురైతులకు సీఓసీ కార్డులు ఇవ్వగా రూ.58 కోట్లు రుణాలు ఇచ్చారన్నారు. రుణాలు తీసుకునే రైతులు ప్రధానమంత్రి ఫసలీ బీమా పథకం ప్రీమియం ఆగష్టు 21లోగా చెల్లించాలని, రుణాలు తీసుకోని రైతులు ఎకరానికి రూ.587 లు ప్రీమియంగా ఈనెలాఖరులోగా చెల్లించాలని సూచించారు. రైతురథంలో 680 ట్రాక్టర్లు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రాయితీపై ట్రాక్టర్లు ఇచ్చేందుకు రైతురథం పథకంలో జిల్లాకు 680 ట్రాక్టర్లు మంజూరయ్యాయని జేడీ తెలిపారు. నియోజకవర్గాల వారీగా కేటాయించిన ట్రాక్టర్ల కోసం జిల్లాఇన్‌చార్జ్ మంత్రి ఆమోదంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంఏఓ ఎ.అచ్యుతరావు, ఏఈఓలు ఎస్.సత్యనారాయణస్వామి, ఐ.శ్రీనివాస్‌గౌడ్, ఎంపీఈఓలు కె.దివ్య, కె.సాయిశరణ్య, సొసైటీ అధ్యక్షుడు నక్కా వీరభద్రరావు, సర్పంచ్ వాసంశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
ఇక ‘పునర్వసు’లోనే..
- మృగశిర కార్తెలో అందని నీరు - డెల్టాలో వరిసాగు.. జాగు - ‘ఆరుద్ర’ రాకతో నారుమళ్లలో మరింత జాప్యం - అదును దాటుతున్న ఖరీఫ్ - రబీకి తప్పని ఆలస్యం - మూడో పంట ప్రశ్నార్థకం అమలాపురం : డెల్టాలో ఏరువాకకు ఆరుద్ర కార్తె పెద్ద గుదిబండ. ఈ కాలంలో నారుమడులు వేస్తే.. తుపాన్ల సమయంలో పంట చేతికి వచ్చే అవకాశముంటుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఇప్పుడు నారు వేయడమంటే గాలిలో దీపం పెట్టడమే. ఈ పరిస్థితుల్లో కుదిరితే మృగశిర.. లేదా తుపాన్లు దాటిన తరువాత పంట చేతికి వచ్చేలా పునర్వసు కార్తెలో నారుమడులు వేయడం ఖరీఫ్ సాగు చేసే డెల్టా రైతులకు పరిపాటి. అయితే, ఈ ఏడాది కూడా మృగశిర కార్తెలో నీరందించకపోవడంతో ఎప్పటిలానే ‘పునర్వసు’లో నారు వేసేందుకు ఖరీఫ్ రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ ఏడాది కూడా గోదావరి డెల్టాలో ఖరీఫ్ సాగు ఆలస్యం కానుంది. ముందస్తు ఖరీఫ్‌కు షెడ్యూలుకంటే ముందే నీరంటూ రైతులను ఊరించిన ప్రభుత్వ పెద్దలు.. ఎప్పటిలానే పొలాలకు సాగునీరు ఆలస్యంగా విడుదల చేశారు. ఫలితంగా ఖరీఫ్ వరి సాగులో జాప్యం జరుగుతోంది. జూన్ ఒకటిన సాగునీరు విడుదల చేసినా.. ఆధునికీకరణ, నీరు - చెట్టు అంటూ కాలువలకు అడ్డుకట్ట వేస్తూ 20వ తేదీ వరకూ పొలాలకు నీరందకుండా చేశారు. ఈ కారణంగా డెల్టాలో నారుమడులు ఆలస్యమవుతున్నాయి. తూర్పు, మధ్య డెల్టాల్లో 4.80 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందన్నది అధికారుల లెక్కలు కాగా, ఇప్పటివరకు 70 శాతం పొలాల్లో కూడా నారుమడులు వేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మృగశిర కార్తె గత నెల 21 వరకూ ఉన్నా ఆ సమయంలో నీరందకపోవడంతో రైతులు నారుమడులు వేయలేకపోయారు. 22 నుంచి ఆరుద్ర కార్తె మొదలైంది. ఈ నెల ఏడు వరకూ ఇది ఉంటుంది. అయితే, ఐదు నెలల పంటకాలం కావడంవల్ల.. ఈ సమయంలో నారుమడులు వేస్తే అక్టోబరు నెలాఖరు నుంచి నవంబరు 15 మధ్యన పంట చేతికి వచ్చే అవకాశముంది. కానీ, ఆ సమయంలోనే ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. తుపాన్లు వస్తుంటాయి. ఫలితంగా ఆ సమయంలో పంట నష్టపోవడం డెల్టాలోని శివారు రైతులకు పరిపాటిగా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకుని పునర్వసు మొదలైన తరువాత అంటే ఈ నెల రెండో వారం తరువాతే రైతులు నారుమడులు వేయనున్నారు. అదే కనుక జరిగితే జూలై నెలాఖరు, ఆగస్టు మొదటి వారంలో కూడా ఖరీఫ్ నాట్లు పడే అవకాశముంటుంది. దీనివల్ల ఎప్పటిలాగానే రబీ సాగు ఆలస్యం కానుంది. దీంతో షరా మామూలుగానే మూడో పంట అపరాలు సాగు చేసే అవకాశం రైతులకు లేకుండా పోనుంది. శివారులో మరింత ఆలస్యం - తూర్పు డెల్టా పరిధిలోని రామచంద్రపురం నియోజకవర్గంలో సాధారణ సాగు విస్తీర్ణం 58 వేల ఎకరాలు కాగా, 20 శాతం మాత్రమే నారుమడులు వేశారు. ఇక్కడ జూలై నెలాఖరు, ఆగస్టులో నాట్లు పడే అవకాశముంది. - సామర్లకోట గోదావరి కాలువ మీద సామర్లకోట మండలంలో 20 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, 20 శాతం మాత్రమే నారుమడులు వేశారు. - కరప, కాకినాడ రూరల్ మండలాల్లో 28,700 ఎకరాల ఆయకట్టు ఉండగా, సుమారు 40 శాతం ఆయకట్టులో మాత్రమే నారుమడులు వేశారు. - మధ్య డెల్టాలో వ్యవసాయ సబ్ డివిజన్లవారీగా చూస్తే పి.గన్నవరంలో 14,900 ఎకరాలకుగాను 70 శాతం, అమలాపురం 42 వేల ఎకరాలకుగాను 30 శాతం, ముమ్మిడివరం 23,500 ఎకరాలకుగాను 25 శాతం, రాజోలు 17 వేల ఎకరాలకుగాను 10 శాతం కూడా నారుమడులు పడలేదు. రాజోలు సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తారనే నమ్మకం కలగడం లేదు. దీనికితోడు నారుమడులు వేసిన శివారు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నారు నీట మునిగిన విషయం తెలిసిందే. ముంపునీరు దిగే అవకాశం లేదని ఇక్కడ రైతులు పంట విరామానికి మొగ్గు చూపుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఈ ఏడాది డెల్టాలో ఖరీఫ్ సాగు ఆరంభంలోనే ఒడుదొడుకులకు లోనవుతోంది. ఎగువన కొంతవేగం - తూర్పు డెల్టాలోని అనపర్తి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో 48 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇప్పుడిప్పుడే నాట్లు ఆరంభించారు. అది కూడా మొత్తం ఆయకట్టులో 10 శాతమే. ఇక్కడ సుమారు 80 శాతం నారుమడులు పడ్డాయి. బోర్ల కింద నారు వేసిన రైతులు మాత్రమే నాట్లు వేస్తున్నారు. - ఆలమూరు సబ్ డివిజన్ పరిధిలో 38 వేల ఎకరాలు కాగా, ఇక్కడ కూడా 80 శాతం నారుమడులు పడ్డాయి. నాట్లు 15 శాతం మాత్రమే అయ్యాయి. - మధ్య డెల్టాలోని కొత్తపేట సబ్ డివిజన్లో సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇక్కడ ఆత్రేయపురం మండలంలో మాత్రమే కొంతవరకూ నాట్లు పడుతున్నాయి. మొత్తం నియోజకవర్గంలో ఐదు శాతం నాట్లు కూడా పడలేదన్నది అంచనా. నారుమడులు కూడా 40 శాతం మాత్రమే పడ్డాయి. -
నారు.. కన్నీరు..
- నీరివ్వడంలో జాప్యం - ఆలస్యమైన నారుమళ్లు - ఇప్పుడు వర్షాలతో శివారున నీట మునక - రోజుల తరబడి ముంపులోనే.. - పంట విరామానికి సిద్ధమవుతున్న రైతులు అమలాపురం / అల్లవరం (అమలాపురం) : అనుకున్నంతా అయ్యింది. ముందుగా సాగునీరు ఇస్తున్నామని.. కోట్ల రూపాయలతో ముంపునీరు దిగేందుకు ఆధునికీకరణ పనులు చేశామని ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రచారమంతా డొల్లేనని తేలిపోయింది. కొద్దిపాటి వర్షం పడిందో లేదో.. శివారు పొలాల్లో నారుమళ్లు నీట మునగడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. నారుమళ్ల నుంచి రోజుల తరబడి ముంపునీరు దిగకపోవడం చూసి కోనసీమ శివారు రైతుల గుండె చెరువవుతోంది. దీంతో మరోసారి ఖరీఫ్ పంట విరామానికి సిద్ధమవుతున్నారు. గడచిన రెండు రోజులుగా కురిసిన వర్షాలకు అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలోని కాట్రేనికోన, ఐ.పోలవరం, ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల్లో వరి నారుమళ్లు నీట మునిగాయి. అసలే ఇక్కడ సాగు ఆలస్యమైందని, కొద్దిమంది రైతులు మాత్రమే నారుమడులు వేశారు. అవి కూడా నీట మునగడం చూసి వారు దిగులు చెందుతున్నారు. ఈ ఐదు మండలాల్లో సుమారు 6 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో రెండు వేల ఎకరాల్లో నారుమడులు పడ్డాయని అంచనా. దీనిలో సగం నారుమళ్లు వర్షాలకు నీట మునిగాయి. ఉప్పలగుప్తం, అల్లవరం, కాట్రేనికోన మండలాల్లోని నారుమళ్లు రోజుల తరబడి ముంపులోనే ఉన్నాయి. నారును కాపాడుకొనేందుకు రైతులు మోటార్లు, నత్తగుల్లలతో నీరు తోడుతున్నా.. మళ్లీ వర్షం కురవడం, ముంపు బారిన పడడం జరుగుతోంది. ఇటీవల ఈ మండలాల పరిధిలో ఉన్న డ్రైన్లలో ఆధునికీకరణ, నీరు-చెట్టు పనుల ద్వారా పూడిక తీశారు. అయితే ప్రధాన డ్రైన్లలో పూడికలు తొలగించకపోవడం, మీడియం, రెవెన్యూ డ్రైన్లలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆక్రమణలు తొలగించకపోవడంతో ముంపు నీరు దిగడం లేదు. దీంతో విసుగు చెందుతున్న రైతులు ఖరీఫ్ సాగుకు దూరంగా ఉంటే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. అల్లవరం సొసైటీ కార్యాలయంలో రైతు నాయకుడు బొక్కా శ్రీనివాస్ ఆధ్వర్యాన శనివారం సమావేశమైన పలు గ్రామాల రైతులు ఖరీఫ్‌కు పంట విరామం ప్రకటించాలని నిర్ణయించారు. పలువురు రైతులు మాట్లాడుతూ, కాలువలకు సాగునీరు ఆలస్యం కావడంతో నారుమళ్లు వేయలేకపోయామని, పోసిన నారు వర్షాలకు నీట మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన మండలాలకు చెందిన రైతులు సహితం పంట విరామం ప్రకటించే యోచనలో ఉన్నారు. ఇప్పటికే తీరప్రాంత మండలాల్లో ముంపునకు భయపడి సుమారు మూడు వేల ఎకరాల్లో రైతులు ఏటా ఖరీఫ్ సాగు చేయడం లేదు. ఖరీఫ్ సాగంటేనే తీరప్రాంత రైతులు భయపడుతున్న తరుణంలో.. ఆరంభంలోనే ఆకుమడులు మునిగిపోవడం చూసి మరింతమంది సాగుకు దూరంగా ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది. -
చేలు మాయం.. చెరువుల మయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : డెల్టాలో వరి చేలు మాయమవుతున్నాయి. సాగు భూములు ఆక్వా చెరువులుగా మారుతున్నాయి. అనధికారికంగా తవ్వుతున్న చెరువుల కారణంగా డెల్టా ప్రమాదంలో పడింది. నాలుగేళ్లుగా వరి సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. గతంలో జిల్లాలో 7 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేది. ఆక్వా చెరువుల కారణంగా 5.30 లక్షల ఎకరాలకు తగ్గిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ.. ప్రస్తుతం వరి విస్తీర్ణం 4 లక్షల ఎకరాల లోపే ఉన్నట్టు సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే డెల్టాలో పొలాలు పూర్తిగా కనుమరుగవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఖరీఫ్ సీజన్లో వరిసాగు విస్తీర్ణం 5.30 లక్షల ఎకరాలు కాగా, రబీలో 4.60 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నట్టు అధికారిక గణాం కాలు వెల్లడిస్తున్నాయి. అయితే జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో చేపల, రొయ్యల చెరువులు ఉన్నట్టు మత్స్య శాఖ అధికారులే చెబుతున్నారు. అనధికారికంగా మరో లక్ష ఎకరాల వరకూ చెరువులుగా మారినట్టు అంచనా. అనుమతి లేనివే అధికం ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, పెంటపాడు, గణపవరం, నిడమర్రు, యలమంచిలి, పాలకొల్లు మండలా ల్లోని అత్యధిక విస్తీర్ణంలో చేపల చెరువులు తవ్వారు. ఇందులో అనుమతి లేనివే అధికం. తాజాగా ఇరగవరం, పెనుమంట్ర, ఆచంట, పెరవలి, అత్తి లి మండలాల్లోనూ చెరువుల తవ్వకాలు ప్రారంభమయ్యాయి. డెల్టా మండలాల్లో ఏటా రెండు పంటలు కలిపి 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. ఇటీవల కాలంలో కొత్త వంగడాలు సాగు చేయడం, ప్రకృతి వైపరీత్యాలు లేకపోవడం, తెగుళ్లు తప్పడంతో దిగుబడి బాగా పెరిగింది. గతంలో రెండు పంటలకు 60 నుంచి 65 బస్తాల వరకూ దిగుబడి వస్తే.. ఇప్పుడు సగటున 80 బస్తాల వరకూ పెరిగింది. అయితే, సాగు భూములు మాత్రం తగ్గిపోయాయి. ఆక్వా జోన్లుగా ప్రకటించడంతో.. ప్రభుత్వం ఆక్వా సాగును ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా డెల్టాలోని కొన్ని మండలాల్లో అక్వా జోన్లను ప్రకటించింది. దీంతో ధనిక రైతులు వ్యవసాయం నుంచి అక్వా వైపు మళ్లుతున్నారు. సముద్ర తీర ప్రాంతంలో తప్ప ఎక్కడా రొయ్యల చెరువులకు అనుమతి లేదు. ఇటీవల కాలంలో రొయ్యల చెరువులు డెల్టాలోనూ విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో గ్రామాల్లోని భూములన్నీ ఉప్పునీటి కయ్యలుగా మారుతున్నాయి. ఉప్పునీటి బోర్లకు అనుమతి లేకపోయినా ఇష్టారాజ్యంగా తవ్వేస్తు్తన్నారు. సెలనిటి చాలకపోతే చెరువుల్లో నేరుగా బస్తాలకొద్దీ ఉప్పు కలుపుతున్నారు. రొయ్యల సాగు కోసం యాంటీబయోటిక్స్ సైతం అధికంగా వాడుతున్నారు. ఈ నీటిని పంట కాలువల్లోకి వదులుతున్నారు. దీనినే చాలా గ్రామాల్లో తాగునీటికి ఉపయోగించాల్సిన దుస్థితి దాపురించింది. పని దినాలు తగ్గిపోయాయి ఆక్వా చెరువుల కారణంగా కూలీలకు పని దినాలు తగ్గిపోయాయి. ఆ భూముల్లో వరి సాగైన సమయంలో కూలీలకు సగటున 50 పని దినాలు ఉంటే అక్వా వచ్చిన తర్వాత పదికి తగ్గిపోయాయి. దీంతో కూలీలకు ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. రొయ్యల చెరువులున్న గ్రామాల్లోని వ్యవసాయ భూముల్లో ఉప్పు నీటి కారణంగా పంటలు పండటం లేదు. దీనివల్ల రైతులు, కౌలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. డెల్టాలో వ్యవసాయ భూములు తగ్గిపోతుండటంతో కౌలు రేట్లు పెంచేశారు. గతంలో ఎకరానికి 24 బస్తాలు (రెండు పంటలకు కలిపి) ఉండే కౌలు ఇప్పుడు 32 నుంచి 34 బస్తాలకు పెరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు ఎక్కడా అధికారిక గణాం కాల్లో తగ్గిన విస్తీర్ణం చూపించడం లేదు. గతంలో ఎంత ధాన్యం దిగుబడి వచ్చిందో ఇప్పుడూ అంతే చూపిస్తున్నారు. వాస్తవానికి దిగుబడి పెరిగిన నేపథ్యంలో పంట ఉత్పత్తి కూడా పెరగాలి. అయితే, తగ్గిన విస్తీర్ణాన్ని చూపించకుండా అధికారులు పాత లెక్కలతోనే సరిపెడతున్నారు. డెల్టా పరిరక్షణకు నడుం కట్టాలి ఏటా పెరుగుతున్న అక్రమ చెరువుల కారణంగా డెల్టాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. దీనివల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ కార్మికులకు పని దొరకడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో తిండి గింజలు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. – కె.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, కౌలు రైతు సంఘం -
ధాన్యం అధరహో
తాడేపల్లిగూడెం : బొండాలు రకం «ధాన్యం నిల్వచేసిన రైతుల దశ తిరిగింది. 75 కిలోల బస్తా ధర రూ.1,200 నుంచి అమాంతం రూ.1,450కి చేరింది. కేరళకు ఎగుమతులు ఊపందుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఇతర రకాల ధాన్యం ధరలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. బస్తా రూ.1,100 వరకు పలికిన ఇతర రకాల ధర రూ.75 నుంచి రూ.100 వరకు పెరిగింది. మూడేళ్ల తరువాత డిమాండ్ బొండాలు ధాన్యం ధరలు మూడేళ్ల క్రితం వరకు ఒక ఊపు ఊపాయి. ఈ ధాన్యం కేరళ రాష్ట్రానికి అ«ధికంగా ఎగుమతి అవుతుంది. అక్కడి వ్యాపారులు ఇక్కడి ఎగుమతిదారులకు కోట్లాది రూపాయలు బకాయి పడటంతో ఆ తరువాత ఎగుమతులు నిలిచిపోయాయి. అక్కడి వ్యాపారులతో జరిపిన చర్చల నేపథ్యంలో తిరిగి ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఉప్పుడు బియ్యాన్ని అధికంగా వినియోగించే కేరళలో బొండాలు ధాన్యానికి డిమాండ్ ఎక్కువ. ఎగుమతులు ఊపందుకోవడం ధరల పెరుగుదలకు దోహదం చేసింది. ఏ గ్రామంలో అయినా రైతు వద్ద ఈ ధాన్యం ఉందని తెలిస్తే వ్యాపారులు ఎగరేసుకుపోతున్నారు. దీంతో కేవలం రెండు వారాల వ్యవధిలో 75 కిలోల బస్తాకు ఏకంగా రూ.250 ధర పెరిగింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా. మన జిల్లాలో బొండాలు రకం ధాన్యాన్ని 10 శాతం విస్తీర్ణంలో మాత్రమే పండిస్తుండగా.. తూర్పు గోదావరి జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. జిల్లాలోని నిడదవోలు పరిసర ప్రాంతాలతోపాటు పెంటపాడు మండలంలోని పడమర విప్పర్రు వంటి గ్రామాల్లో ఎక్కువ మంది రైతులు దీనిని సాగు చేస్తున్నారు. ఇతర రకాల ధరలు ఇలా మిగిలిన ధాన్యం ధరలు కూడా పెరుగుతున్నాయి. కొత్తగా సంకరపర్చిన రకాలకు డిమాండ్ బాగానే ఉంది. 1010 రకం ధాన్యం 75 కిలోల బస్తా రూ.1,210, 1121 రకం బస్తా రూ.1,180, 1156 రకం రూ.1,180 చొప్పున పలుకుతున్నాయి. 1010 రకం ధాన్యాన్ని తూర్పుగోదావరి జిల్లా వ్యాపారులు పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. కాకినాడ నుంచి బియ్యం ఎగుమతులకు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తున్నా ధాన్యం ధర ఆకాశంలో ఉండటంతో బియ్యం ఎగుమతులకు వ్యాపారులు, మిల్లర్లు ఆసక్తి కనపర్చడం లేదు. ధాన్యంపైనా దృష్టి సారించారు. ధాన్యం ఉప ఉత్పత్తుల ధరలు సైతం ఆశాజనకంగా ఉన్నాయి. తవుడు క్వింటాల్ రూ.1,580, నూకలు రూ.1,700 పలుకుతున్నాయి. -
దిగొస్తున్నారు.. ధర పెంచుతున్నారు
- రూ. 1400లకు పెరిగిన బొండాలు ధర - మొదట్లో రూ. 1,150లు మాత్రమే - గత సీజన్లో రూ.1800లు వరకు కొనుగోళ్లు - రైతులకు అండగా నిల్చిన వైఎస్సార్ సీపీ నేతలు - రూ.1500 వరకు పెంచాలని డిమాండ్ - ధర పెరుగుదల కోసం రైతులు ఎదురుచూపులు - కేరళ ఎగుమతులు పెరగడంతో ధర పెంచుతున్న మిల్లర్లు - కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లపై అనుమానాలు మండపేట : మొదట్లో 75 కిలోల బొండాలు బస్తా రూ.1,150లు మించి కొనుగోలు చేయని మిల్లర్లు ముందెన్నడూ లేనివిధంగా సీజన్ ఆరంభంలోనే ధర పెంచుతున్నారు. ఊహించని విధంగా ఇప్పటికే రూ.1400లు వరకు పెరగ్గా కేరళ డిమాండ్ మేరకు ఈ ధర మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఏడాది ఆరంభంలోనే అమ్మకాలు చేసి తీవ్రంగా నష్టపోయిన రైతాంగం ఈ సీజన్లో ఆచీతూచీ అడుగేస్తున్నారు. ధాన్యం అమ్మకాలు మందకొడిగా సాగుతుండగా ప్రస్తుత మిల్లింగ్, భవిష్యత్తు స్టాకుల కోసం మిల్లర్లు ధర పెంచక తప్పడం లేదని తెలుస్తోంది. జిల్లాలోని తూర్పు, మధ్య డెల్టాలతోపాటు మెట్టలోని మొత్తం 4.2 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరిగింది. 80 శాతం మేర బొండాలు రకాన్నే సాగుచేశారు. వాతావరణం అనుకూలించడడంతో ఈ సీజన్ ఆశాజనకంగా సాగింది. ఎకరానికి కొన్నిచోట్ల 47 బస్తాల నుంచి 50 బస్తాలకు పైబడి దిగుబడి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 13.77 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి లక్ష్యం కాగా దానిని అధిగమించి రైతులు దిగుబడులు సాధించారు. మాసూళ్లు మొదలుకావడంతో ధాన్యం మార్కెట్‌ను ముంచెత్తుతాయని భావించిన మిల్లర్లకు ఈసారి చుక్కెదురైంది. సాగు కోసం చేసిన అప్పులు, ఎరువుల దుకాణాల బాకాయిలు చెల్లించేందుకు సాధారణంగా సన్నచిన్నకారు రైతులు దళారులకు కళ్లాల్లోనే ధాన్యాని అమ్మేస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని సీజన్ ఆరంభంలో ధర తగ్గించేసి రైతుల వద్ద ధాన్యం అయిపోయిన తర్వాత మిల్లర్లు, దళారులు ధర పెంచడం పరిపాటి. ఈ క్రమంలో మిల్లర్లు, స్టాకులు పెట్టుకున్న దళారులు భారీగా లాభపడుతున్నారు. గత ఏడాది ఇదే పరిస్థితి ఎదురైంది. కేరళలో డిమాండ్ లేదంటూ మొదట్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రాని మిల్లర్లు కొనుగోళ్లు సీజన్ ముగిసిన అనంతరం ధర పెంచడం ప్రారంభించారు. 75 కేజీల బస్తా ధర క్రమంగా పెంచుతూ రూ.1800లు వరకు పెంపుదల చేశారు. రబీ సీజన్ మాసూళ్లు దగ్గరపడే వరకు రూ.1800లుండగా మార్కెట్లోని ధాన్యం రావడం ప్రారంభించే సరికి ఒక్కసారిగా ధరను రూ.1,150లకు తగ్గించేశారు. గత ఏడాది ఇదే తరహాలో మొదట్లో ధరను తగ్గించేయడం, తమవద్ద ఉన్న ధాన్యం అయిపోయిన తర్వాత మిల్లర్లు ధరను పెంచడంతో మోసపోయిన రైతాంగం ఈసారి అమ్మకాలు చేసేందుకు ఆచితూచీ అడుగేస్తున్నారు. పెంచకుంటే ఉద్యమిస్తాం : వైఎస్సార్ సీపీ కేరళలో ఉన్న డిమాండ్ మేరకు 75 కేజీల బస్తా రూ.1500లు వరకు కొనుగోలు చేసే వీలుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాసూళ్ల ఆరంభంలోనే పేర్కొన్నారు. ఈ మేరకు కంగారు పడి అమ్మకాలు చేయరాదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ కోరారు. రూ.1500 కొనుగోళ్లు చేయకుంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని, అందుకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. రూ. 1500లకు కొనుగోలు చేయాలి ప్రస్తుతం కేరళ మార్కెట్ దృష్ట్యా బస్తా రూ. 1500లు వరకు కొనుగోలు చేసే వీలుంది. ఆ దిశగా కొనుగోళ్లు జరపడం ద్వారా రైతులకు మేలు చేయాలి. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వారి పక్షాన ఉద్యమిస్తాం. వేగుళ్ల లీలాకృష్ణ, వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్. -
వర్షంతో దెబ్బతిన్న వరి
రుద్రవరం: అకాల వర్షంతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. రుద్రవరం మండలంలో గురువారం రాత్రి గంటకు పైగానే గాలివాన బీభత్సం సృష్టించింది. రుద్రవరం, ఆలమూరు, ముత్తలూరు, టి. లింగందిన్నె, తదితర గ్రామాలలో కోత దశలో ఉన్న 500 ఎకరాల్లో వరి నేల కొరిగింది. అలాగే మామిడి కాయలు నేలరాలి రైతులకు నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబోసిన పసుపు తడిసి ముద్దయింది. -
చివరికి పెరిగింది
భీమవరం/పెరవలి : ధాన్యం ధర అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం మిల్లర్లు ఏ–గ్రేడ్ ధాన్యం 75 కేజీల బస్తాకు రూ.1,200 పైగా చెల్లిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు బస్తా రూ.950 మాత్రమే పలికిన ధర అమాంతం పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 5.60 లక్షల ఎకరాల్లో వరి వేశారు. సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైనప్పటికీ.. పంట చేతికి వస్తున్న తరుణంలో వాతావరణం అనుకూలించింది. దిగుబడులు పెరగటం.. ఇప్పుడు ధాన్యం ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఎంతోకొంత కోలుకునే పరిస్థితి కనిపిస్తోంది. దాళ్వాలో ఎంటీయూ–1010, ఎంటీయూ–1156, ఎంటీయూ–1121 రకాలను సాగు చేశారు. వీటిలో ఎంటీయూ–1165 రకం దిగుబడి బాగా వస్తోంది. ఎకరానికి 50 నుంచి 60 బస్తాల వరకు పండిందని రైతులు చెబుతున్నారు. మెట్ట ప్రాంతంలో ఇప్పటికే వరి కోతలు పూర్తికాగా.. డెల్టాలో మాసూళ్లు ఊపందుకున్నాయి. మాసూళ్లు ప్రారంభ సమయంలో యంత్రం సాయంతో కోసిన ధాన్యానికి బస్తాకు రూ.950 మాత్రమే చెల్లించారు. అప్పట్లో ధాన్యం విక్రయించిన రైతులు నష్టపోయారు. పెరిగిన ధరలు ఇలా మిల్లర్లు 75 కిలోల ఏ గ్రేడ్ ధాన్యానికి చేరా రూ.1,200 నుంచి రూ.1,220 వరకు చెల్లిస్తున్నారు. వరి కోత యంత్రంతో మాసూళ్లు చేసిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో బస్తాకు రూ.1,100 ఇస్తున్నారు. సార్వా సీజన్లో ఆరుదల ధాన్యాన్ని కేవలం రూ.1,050కి కొనుగోలు చేయగా.. దాళ్వాలో ప్రస్తుతం రూ.150కి పైగా అదనంగా చెల్లిస్తున్నారు. దళారుల మాయాజాలం ఇప్పటికే సగం మంది రైతుల నుంచి బస్తా రూ.950 చొప్పున దళారులు ధాన్యం కొనుగోలు చేశారు. దానిని నిల్వచేసి ఇప్పుడు మిల్లర్లకు పెరిగిన ధరకు విక్రయిస్తున్నారు. సీజన్ మొదట్లో ధాన్యాన్ని అమ్ముకున్న రైతులు నష్టపోయారు. ఇప్పుడు మిల్లర్లు ధర పెంచినా.. దళారులు మాత్రం రూ.1,050కి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. నేరుగా మిల్లర్లకు ధాన్యం అమ్ముకునే అలవాటు లేని రైతులు దళారుల చేతిలో మోసపోతుండగా.. మిల్లులకు తీసుకెళ్లి విక్రయించే రైతులకు మాత్రం మంచి ధర లభిస్తోంది. వీడని నల్లమచ్చ సమస్య ఎంటీయూ–1156 రకం ధాన్యాన్ని పండించిన రైతులు దిక్కుతోచని స్థితిలోనే రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ రకం ధాన్యం తల భాగంలో చిన్నపాటి నల్లమచ్చ వస్తోందని చెబుతున్నారు. ఈ బియ్యాన్ని ఎఫ్‌సీఐ నిరాకరిస్తున్నందు వల్ల కొనేది లేదని మిల్లర్లు తెగేసి చెబుతున్నారు. డెల్టా ఆయకట్టులోని 56 వేల హెక్టార్లలో 1156 వరి సాగు చేయగా.. ఎకరాకు 50 నుంచి 60 బస్తాల వరకు దిగుబడులు వస్తున్నాయి. ఈ ధాన్యాన్ని కొనేవారు లేకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఐకేపీ కేంద్రాలైనా కొనుగోలు చేస్తాయనుకుంటే.. వాటికి లింకింగ్ వ్యవస్థగా రైస్‌మిల్లర్లే వ్యవహరిస్తున్నారు. రైస్‌మిల్లర్లు ఆ ధాన్యాన్ని వద్దంటే తాము చేయగలిగిందేమీ లేదని ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు సైతం మొహం చాటేస్తున్నారని రైతులు వాపోతున్నారు. -
పసిడి కంకులు పండినా.. కురవని సిరుల వాన
దగాపడిన అన్నదాత రబీ వరి దిగుబడి ఘనం.. ధర చూస్తే దైన్యం ఆరుగాలం శ్రమించినా రైతుకు దక్కని లాభం బస్తా ధాన్యం రూ.900 నుంచి రూ.950కి కొంటున్న దళారులు అంతంతమాత్రంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రకృతి కరుణించి.. నేలతల్లి ఒడిలో పసిడి కంకులు పండించిన వేళ.. సిరుల రాశులు పొంగిపొరలుతాయనుకున్న అన్నదాత.. షరా మామూలుగానే మరోసారి దగా పడ్డాడు. అవసరమైన సమయంలో ప్రభుత్వం తగినన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం.. ఇదే అదునుగా అటు దళారులు, ఇటు ధాన్యం వ్యాపారులు ధర తగ్గించేయడంతో రేయింబవళ్లు కష్టపడి పంట పండించిన రైతులు నష్టపోతున్నారు. దీంతో అమ్మబోతే అడవి అన్నతీరుగా రైతు పరిస్థితి మారింది. అమలాపురం : అనావృష్టిని అధిగమించి.. ఆరుగాలం శ్రమించి.. డెల్టా రైతులు రబీ వరి సాగు చేశారు. మంచి ధరకు అమ్ముకుంటే లాభాలు కళ్లజూడవచ్చనుకున్నారు. ఏలేరు పరిధిలో నీటి ఎద్దడి వల్ల పోయిన పంట పోగా దక్కిన నాలుగు గింజలతో కనీసం పెట్టుబడులైనా పొందాలని ఆశించారు. కానీ వారి ఆశలను అటు ప్రభుత్వం.. ఇటు దళారులు, ధాన్యం వ్యాపారులు వమ్ము చేశారు. కనీస మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయకపోవడంతో.. లాభాల మాట దేవుడెరుగు.. రైతులు నష్టాలు చవిచూడాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో సుమారు 4.75 లక్షల ఎకరాల్లో రబీ వరిసాగు జరిగింది. ఇందులో గోదావరి డెల్టా పరిధిలో 4 లక్షల ఎకరాలు కాగా, ఏలేరు ప్రాజెక్టు పరిధిలో 75 వేల ఎకరాల్లో సాగు చేసినట్టు అంచనా. రెండుచోట్లా కలిపి సుమారు 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు లెక్కలు వేశారు. ఏలేరులో నీటి ఎద్దడి వల్ల సుమారు 20 వేల ఎకరాల్లో పంట దెబ్బ తినడంతో రైతులు రూ.17 కోట్ల మేర నష్టపోయారు. డెల్టాలో ఎకరాకు సగటున 48 బస్తాల దిగుబడి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో 55 నుంచి 60 బస్తాల దిగుబడి కూడా రావడంతో లాభాలు పొందవచ్చని రైతులు ఆశించారు. కానీ ధాన్యం అమ్మకాల వద్దకు వచ్చేసరికి వారు నిలువునా మోసపోతున్నారు. ధాన్యం కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాల్‌కు రూ.1,470 కాగా, 75 కేజీల బస్తా రూ.1,102 చొప్పున, గ్రేడ్-ఎ రకం బస్తా రూ.1,132 చేసి కొనుగోలు చేయాలి. కానీ ఏలేరు, డెల్టాల్లోని పలుచోట్ల సాధారణ రకం బస్తా ధాన్యాన్ని వ్యాపారులు కేవలం రూ.900 నుంచి రూ.950 చేసి మాత్రమే కొంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రూ.వెయ్యి చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కనీస మద్దతు ధర కూడా దక్కకపోవడంతో రైతులు బస్తాకు రూ.200 నుంచి రూ.250 చొప్పున ఎకరాకు రూ.9 వేల వరకూ నష్టపోయే దుస్థితి నెలకొంది. దీంతో కొంతమంది రైతులు అమ్మకాలు నిలిపి కళ్లాల్లోనే ధాన్యం నిల్వ ఉంచేశారు. ధాన్యం వ్యాపారులు, దళారుల వద్ద ముందస్తు అప్పులు చేసిన రైతులు మాత్రం.. వారు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. యంత్రాల ద్వారా కోత కారణంగా ధాన్యంలో తేమ (నెమ్ము) 25 శాతం పైబడి ఉందని వంక పెడుతూ మద్దతు ధరకు కోత పెడుతున్నారు. అక్కరకు రాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లాలో 285 ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకూ మూడో వంతు కేంద్రాలు కూడా తెరుచుకోలేదు. పైగా 17 శాతం తేమ వంటి నిబంధనల కారణంగా తెరిచిన ఆ కొద్దిపాటి కేంద్రాలవైపు రైతులు కన్నెత్తి కూడా చూడడం లేదు. పెట్టుబడికి సరిపోతుంది పండిన పంట పెట్టుబడికి సరిపోతుంది. పెదపూడి గ్రామంలో రెండెకరాల్లో కౌలుకు సాగు చేశాను. ఎకరానికి 40 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. 50 బస్తాలు వస్తుందనుకుంటే చివరిలో దోమ సోకి ఎకరాకు పది బస్తాల దిగుబడి తగ్గింది. యంత్రంతో కోసిన పంట 75 కేజీలు బొండాలు రకానికి రూ.1000, సన్నాలకు రూ.900 చొప్పున ధాన్యం కమిషన్ వ్యాపారులు ఇస్తున్నారు. దీనివల్ల మరింత నష్టపోయేలా ఉన్నాను. - వీవీ రమణ, కౌలురైతు, పెదపూడి -
ప్రా‘ధాన్యం’ ఏదీ
అధికారిక లెక్కల ప్రకారం క్వింటాల్ ధాన్యం ఉత్పత్తికి రూ.1,791 ఖర్చవుతోంది. ప్రభుత్వం మాత్రం ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,510, కామన్ వెరైటీ ధాన్యానికి రూ.1,470 మాత్రమే మద్దతు ధర ప్రకటించింది. ఈ లెక్కన చూస్తే రైతులు ఏ గ్రేడ్ ధాన్యం విషయంలో క్వింటాల్‌కు రూ.281, కామన్ వెరైటీ ధాన్యమైతే రూ.321 చొప్పున కేవలం మద్దతు ధర విషయంలోనే రైతు నష్టపోతున్నారు. ఇదిలావుంటే.. ప్రస్తుత సీజన్లో ధాన్యం కొనే నాథుడు లేకపోవడంతో ధరలు అమాంతం పడిపోయాయి. క్వింటాల్‌కు రూ.258 చొప్పున 75 కేజీల బస్తాకు రూ.200 తగ్గిపోయింది. కనీస మద్దతు ధర లభించకపోవడంతో ఎకరానికి సుమారు రూ.10 వేల వరకు నష్టం వాటిల్లుతోంది. ఉత్పత్తి ధరతో పోలిస్తే ఎకరానికి నష్టపోతున్న మొత్తం రూ.20 వేలకు పైనే ఉంటోంది. ఈ పరిస్థితుల్లో వరి సాగు చేయలేక అన్నదాతలు కాడి వదిలేసే ప్రమాదం ముంచుకొస్తోంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ధాన్యం ధరలు పతనం అవుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే 75 కేజీల బస్తాకు రూ.200 వరకు ధర పడిపోయింది. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర ఏ మాత్రం సరిపోవడం లేదని రైతులు వాపోతున్న తరుణంలో గోరుచుట్టుపై రోకలి పోటులా మద్దతు ధర కూడా దక్కకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాది రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎకరానికి 40 నుంచి 50 బస్తాల వరకూ దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లాలో 234 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించినా ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ఇప్పటికే జిల్లాలో 30 నుంచి 40 శాతం వరకూ మాసూళ్లు జరిగాయి. మిగిలిన చోట్ల వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. మద్దతు ధర కూడా దక్కడం లేదు గ్రేడ్ ధాన్యం 75 కేజీల బస్తా రూ.1132.50 (క్వింటాల్ రూ.1,510), కామన్ రకం ధాన్యం బస్తాకు రూ.1102.50 (క్వింటాల్ రూ.1,470) చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిం చింది. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన తొలి రోజుల్లో బస్తాకు రూ.1,050 చొప్పున చెల్లించగా.. ఆ ధర ఇప్పుడు రూ.900కి పడిపోయింది. దీంతో బస్తాకు రూ.200 చొప్పున ఎకరానికి రూ.10 వేల వరకూ రైతు నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు మిల్లర్లు, కమీషన్ వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. కొనుగోలు కేంద్రాలు పూర్తిగా తెరుచుకోకపోవడంతో రైతు అయినకాడికి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాడు. మిల్లర్లు ఇప్పటివరకూ లారీల సమ్మెను సాకుగా చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు నగదు బదలాయింపు విషయంలో బ్యాంకులు షరతులు విధించాయంటూ కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు. ఆదుకునే వారేరి! ధాన్యానికి కనీస మద్దతు ధర లభించనప్పుడు రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దీని కోసం ఇప్పటికీ ఒక్క పైసా కూడా బడ్జెట్లో కేటా యించలేదు. మద్దతు ధర ప్రకటించేది కేంద్రమే అయినా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉంది. అయినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ధాన్యం ఉత్పత్తి ఖర్చు కంటే కనీస మద్దతు ధర తక్కువగా ఉంది. క్వింటాల్ ధాన్యం ఉత్పత్తికి సరాసరి ఖర్చు రూ.1791గా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మద్దతు ధర కేవలం రూ.50 మాత్రమే పెంచి చేతులు దులుపుకుంది. దీనివల్ల 75 కేజీల ధాన్యం ఉత్పత్తి వాస్తవ ఖర్చుకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.200 వరకూ తక్కువగా ఉంది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ప్రకటిం చాయి. ఈ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉత్పత్తి ఖర్చు క్వింటాల్‌కు రూ.1,791 ఉండగా.. దానికి 50 శాతం కలిపితే క్వింటాల్ ధాన్యానికి రూ.2,686 వరకూ చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వాలు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీనివల్ల రైతు నష్టపోతున్నాడు. బస్తాకు రూ.1,500 చెల్లించాలి ప్రభుత్వం బస్తా ధాన్యాన్ని రూ.1,500 చొప్పున కొనుగోలు చేయాలి. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇవ్వాలి. ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయిన ప్రస్తుత తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరిపించాలి. యుద్ధప్రాతిపదికన రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలి. తేమ శాతం నిబంధనలు సవరించాలి. – కె.శ్రీనివాస్, కార్యదర్శి, కౌలు రైతు సంఘం -
చెక్కుల చిక్కులు
తాడేపల్లిగూడెం : సాగునీటి కష్టాలకు ఎదురీది వరి పండించిన రైతులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. నగదు లావాదేవీలకు ప్రభుత్వం చెక్ పెట్టడంతో.. ధాన్యం అమ్మిన రైతులకు చెక్కుల రూపంలోనే సొమ్ము చెల్లించాలని బ్యాంకులు మెలిక పెడుతున్నాయి. రైతుల పేరిట ఖాతాలు రాసి.. మిల్లర్ల పేరిట ధాన్యం కమీషన్ వ్యాపారుల ఖాతాల్లోకి సొమ్ములు బదలాయించే విధానానికీ మంగళం పలి కాయి. మరోవైపు ధాన్యం రవాణాకు సంబంధించిన వే బిల్లులను ఆన్ లైన్ విధానంలోజారీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నిబంధనలన్నీ రైతుల పాలిట శాపంగా పరిణవిుంచాయి. ఇకపై ధాన్యం విక్రయించే రైతులు ముందుగా ఐకేపీ కేంద్రాలకు వెళ్లి ఫొటో తీయించుకుని, వేలిముద్ర వేయాలి. అప్పుడే రైతు తీసుకెళ్లిన ధాన్యం రికార్డుల్లో నమోదవుతుంది. ధాన్యం అమ్మిన సొమ్ము సదరు రైతు పేరిట బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఈ తతంగమంతా రైతులను అయోమయంలోకి నెడుతోంది. కొనుగోళ్లకు దూరంగా మిల్లర్లు సార్వా సీజన్ కు సంబంధించి జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబం«ధించి బకాయిలు ఇంకా చెల్లిం చలేదు. దాళ్వాలో పండిన ధాన్యం ఐకేపీ కేంద్రాల్లో విక్రయించే విష యంలో కొత్త నిబంధనలు రూపొం దించారు. ధాన్యం అమ్మడానికి ముందే రైతులు విధిగా ఐకేపీ కేంద్రాలకు వెళ్లాలి. అక్కడ ఫొటో తీయించుకుని వేలిముద్రలు వేయాలి. ధాన్యం కొనుగోలులో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టినా క్షేత్రస్థాయిలో ఆచరణ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో దాళ్వా ధాన్యం కొనుగోళ్లలో అయోమయం నెలకొంది. మిల్లర్లు గత సీజన్ లో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి బకాయిల చిక్కుముడి వీడకపోవడంతో వారు కొనుగోళ్ల విష యంలో పట్టు బిగించారు. అప్రకటితంగా ధాన్యం కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. ఈ చర్యలు రైతులకు కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. మిల్లర్ల ఖాతాల అనుసంధానం ఐకేపీ కేంద్రాలకు రైస్ మిల్లర్ల బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసే ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జిల్లాలో 234 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాచరణ రూపొందిం చింది. దీనిపై అవగాహన కల్పించే బాధ్యత తీసుకోవాలని దిగువ స్థాయి అధికారులకు అదేశాలు అందాయి. 17 శాతం తేమ, ఒక శాతం మట్టి, తాలుతప్ప ఉన్న ధాన్యాన్ని గ్రేడ్–ఏ రకంగా గుర్తించి క్వింటాల్ రూ.1,510, కామన్ రకం క్వింటాల్‌కు రూ.1,470 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. రైతులు ధాన్యం తూర్పారబట్టి, తేమ శాతం నిబంధనల మేరకు ఉండేలా ఐకేపీ కేంద్రాలకు తీసుకురావాలని సూచించింది. ధాన్యం కొనుగోలులో గత నిబంధనలే ఉంటాయని జిల్లా పౌర సరఫరాల అధికారి పి.వెంకట కొండయ్య చెబుతున్నారు. సార్వాలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబం ధించి బకాయిలను ఇబ్బంది లేకుండా చెల్లింపులు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కన్నెత్తి చూడని కమీషన్ వ్యాపారులు ప్రభుత్వం మాన్యువల్ వే బిల్లులకు చెక్ పెట్టింది. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆన్ లైన్ వే బిల్లులు జారీ చేయాలని నిబంధనలు విధించారు. తద్వారా చెక్ పోస్టుల కళ్లుగప్పి ధాన్యాన్ని తరలించడాన్ని నిరోధించవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. ఆన్ లైన్ వే బిల్లుల ద్వారా వ్యవహారాలు నిర్వహిస్తే ఆదాయ పన్నుశాఖ కళ్లల్లో పడతామనే భయం ధాన్యం కమీషన్ ఏజెంట్లకు పట్టుకుంది. దీంతో వారు ధాన్యం కొనేందుకు వెనుకాడుతున్నారు. ఇదిలావుంటే.. రైతులు ఐకేపీ కేంద్రాలకు ధాన్యం తోలినా, మిల్లర్లకు విక్రయించినా, కమీషన్ దారులకు అమ్మినా సొమ్ములు నగదు రూపంలో పొందలేకపోతున్నారు. ఆర్టీజీఎస్ లేదా ఆన్ లైన్లో నగదు బదలాయించే ప్రక్రియ సాగుతోంది. ఇలా ధాన్యం కొనుగోలు విషయంలో కొత్త నిబంధనలు పెట్టడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఖాతాల్లో సొమ్ములున్నా చేతికందక.. రైతుల ఖాతాల్లో సొమ్ములున్నా.. విత్ డ్రా చేసుకునే విషయంలో బ్యాంకులు నిబంధనలు విధించాయి. వరి కోతలు, ధాన్యం మాసూళ్ల కోసం వచ్చిన కూలీలకు సైతం రైతులు చెక్కు రూపంలోనే చెల్లింపులు చేయాలి. బంటాకు సొమ్ములు ఇవ్వాలన్నా ఇదే పద్ధతి. దీంతో రైతుల ఖాతాల్లో సొమ్ములున్నా కూలీలకు చెల్లించలేని పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎంటీయూ–1156 రకం పండించిన రైతులకు కష్టాలు జిల్లాలో కొత్తగా సాగులోకి వచ్చిన సంకర రకం ఎంటీయూ–1156 ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మిల్లర్లు, ఎఫ్‌సీఐ ఆసక్తి చూపించడం లేదు. వాస్తవానికి ఈ రకాన్ని సూపర్ ఫైన్ గా కొనుగోలు చేయాలి. ఇందులో పిండి శాతం ఎక్కువగా ఉండటంతోపాటు బ్లాక్ స్పాట్ (గింజ తలపై నల్లటి మచ్చ) వస్తోందంటూ ఎఫ్‌సీఐ నిరాకరిస్తోంది. దీంతో మిల్లర్లు సైతం ఈ ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదు. జిల్లాలోని మొత్తం వరి సాగు విస్తీర్ణంలో 18.2 శాతం (31 వేల హెక్టార్లు) ఎంటీయూ–1156 రకాన్ని రైతులు సాగుచేస్తున్నారు. సుమారు మూడు లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో కొన్నిచోట్ల పిండి గింజలు మాదిరిగా, కొన్ని ప్రాంతాల్లో అవి లేకుండా ఈ రకం ధాన్యం ఉంది. పూర్తిస్థాయి మాసూళ్లు జరిగితే కాని ఎలాంటి నిర్ధారణకు రాలేమని సివిల్ సప్లైస్ వర్గాలు చెబుతున్నాయి. -
లక్షల ఎకరాల్లో వరి ఎండుతోంది: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండున్నర లక్షల ఎకరాల్లో వరి ఎండిపోతోందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఆయా శాఖల్లో చేపడుతున్న కార్యక్రమాలపై దత్తాత్రేయ శనివారం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గతేడాది మిరప క్వింటాలుకు రూ.14 వేలు ధర పలికితే, ఇప్పుడు కేవలం రూ.4 వేలకే రైతు అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. మిరపను రూ.7–8 వేలకు కొనుగోలు చేసేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలసి చర్చిస్తానన్నారు. అలాగే, మిరప రైతులను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరారు. పంట రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, బ్యాంకులకు మధ్య సయోధ్య లేదని విమర్శించారు. గొర్రెల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సహకారాభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి రూ. 4 వేల కోట్లు కోరిందని, ఇది కేంద్రం పరిశీలనలో ఉందని తెలిపారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పసుపు రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. దీనిపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు దత్తాత్రేయ తెలిపారు. 10 కోల్డ్‌స్టోరేజీలు మంజూరుచేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కోరినట్లు ఆయన చెప్పారు. వరంగల్ జిల్లా పర్వతగిరి ప్రాంతంలోని రూ.180 కోట్ల పుర ప్రాజెక్టును పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. -
అన్నదాత ఆక్రోశం
పెనుగొండ: సాగు నీటి ఎద్దడితో పంట చేలు ఎండిపోతున్నాయంటూ రైతులు రోడ్డెక్కారు. వంతుల వారీ విధానంలోనూ నీటిని అందించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందంటూ వందలాది మంది రైతులు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో పెనుగొండ మండలంలోని రామన్నపాలెం వద్ద రాస్తారోకోకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాదాపు రెండు గంటలకుపైగా రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. ప్రతి ఎకరాకు నీరందిస్తామంటూ అధికారులు దాళ్వా ప్రారంభంలో నమ్మించి నిండా ముంచేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగు మధ్యలో నీరు అందకపోవడంతో దిక్కుతోచని స్థిలిలో ఉన్నామన్నారు. ఆచంట కాలువ పరిధిలోని వడలి, రామన్నపాలెం, తామరాడ ప్రాంతాల్లో సుమారు మూడు వేల ఎకరాలు ఎండిపోతున్నాయన్నారు. ఎండిన వరి దుబ్బులను నెత్తిన పెట్టుకుని నిరసన తెలిపారు. పత్తాలేని నీటి సంఘం నాయకులు రైతులు మూకుమ్మడిగా రోడ్డెక్కి నిరసన తెలిపినా నీటి సంఘాల నాయకులు, నీటి పారుదల శాఖ ఇంజినీర్లు పత్తా లేకుండాపోయారు. కనీస సమాధానం చెప్పడానికి కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వచ్చేంత వరకూ కదిలేది లేదని భీష్మించారు. కొద్దిసేపటికి నీటిపారుదల శాఖ సూపర్వైజర్ అబ్బులు రావడంతో ఏఎస్సై బి.నాగిరెడ్డి సమక్షంలో కౌలు రైతు సంఘ నాయకడు గుర్రాల సత్యనారాయణ చర్చలు జరిపారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాగు నీరందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. రైతులు యర్రంశెట్టి భాస్కరరావు, ముద్రౌతు త్రిమూర్తులు, పేరాబత్తుల సత్యనారాయణ, పేరాబత్తుల రామలింగేశ్వరరావు, చిట్యాల వీరన్న, జక్కం కృష్ణారావు తదితరులు నాయకత్వం వహించారు. శాశ్వత ఎత్తిపోతల పథకం ప్రారంభించాలి సార్వా, దాళ్వా సాగులకు నీటి ఎద్దడి రాకుండా దొంగరావిపాలెం వద్ద శాశ్వత ఎత్తిపోతల పథకం ప్రారంభించాలని సీపీఎం మండల కార్యదర్శి సూర్నిడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. వంతుల వారీ విధానంతో రైతులను దగా చేస్తున్నారని విమర్శించారు. -
యాంత్రీకరణతో సాగు బాగు
- మార్టేరు వరిపరిశోధనా స్థానం డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ కరప (కాకినాడరూరల్): సాగు ఖర్చు తగ్గించి, అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉందని మార్టేరు వరి పరిశోధనా కేంద్రం డైరెక్టర్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. కరప మండలం నడకుదురులోని ఏరువాక కేంద్రంలో సోమవారం జరిగిన జిల్లా సమన్వయ సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. ఉభయగోదావరి జిల్లాల్లోని రైతులకు కొత్త వరి వంగడాలు అందించేందుకు మార్టేరు వరి పరిశోధనా కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారని తెలిపారు. యాంత్రీకరణతో, వెదజల్లులోని యాజమాన్య పద్ధతులు అనుసరించడం ద్వారా ఖర్చు తగ్గి, దిగుబడులు పెరుగుతాయని ఏరువాక కేంద్రం ప్రదర్శనా క్షేత్రాల ద్వారా రైతులకు తెలియచెప్పాలని సూచించారు. కోత, నాటే యంత్రాల వినియోగాన్ని కూడా రైతులు అలవాటు చేసుకోవాలని చెప్పారు. లాభసాటికాని పంటలను గుర్తించి వాటికి ప్రత్యామ్నాయంగా ఏమిచేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందో మార్టేరు శాస్త్రవేత్తలతో చర్చించి, కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. వివిధ పంటల సాగులో అనుసరిస్తున్న పద్ధతులు రైతులను అడిగితెలుసుకుని, ఏమి చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న దానిపై సమీక్షించారు. ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పీఎల్ఆర్జే ప్రవీణ, గతయేడాది అమలు చేసిన వివిధ పథకాలు, పరిశోధనలు, వచ్చేయేడాది అమలుచేసే కార్యాచరణపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గతయేడాది ఉత్తమ ఏరువాక కేంద్రం అవార్డు వచ్చినందుకు డాక్టర్ ప్రవీణను డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ అభినందించారు. వి«విధ శాఖల అధికారులు మాట్లాడుతూ రైతులు ప్రయోజనం పొందాలంటే తమ శాఖల ద్వారా అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. నాబార్డు ఏజీఎం డాక్టర్ కేవీఎస్ ప్రసాద్, జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు కేవీఎస్ ప్రసాద్, ఉద్యాన శాఖ ఏడీ కె.గోపికుమార్, ఏపీఎంఐపీ పీడీ టీవీ సుబ్బారావు, వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ వీటీ రామారావు, మార్టేరు వరి పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు డాక్టర్ జే కృష్ణప్రసాద్ (తెగుళ్ల విభాగం), డాక్టర్ ఎన్.చాముండేశ్వరి(బ్రీడింగ్), డాక్టర్ పి.ఆనంద్‌కుమార్(సస్యరక్షణ), డాక్టర్ ఎం.శ్రీనివాస్(ఆగ్రానమీ), ఏరువాక కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.నందకిశోర్, డాక్టర్ సి.వెంకటరెడ్డి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహాసంఘం సభ్యుడు చుండ్రు వీరవెంకట వరప్రసాద్ పాల్గొన్నారు. -
దైన్యాగారం
ధాన్యాగారంగా పేరొందిన పశ్చిమడెల్టా దైన్యాగారంగా మారుతోంది. వరి విస్తీర్ణం రోజురోజుకూ కుచించుకుపోతోంది. చేపలు, రొయ్యల చెరువుల విస్తీర్ణం చాపకింద నీరులా పెరుగుతోంది. ఫలితంగా జిల్లాలో ఆహారభద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచిఉంది. చెరువుల జోరుకు ఇప్పుడే కళ్లెం వేయకపోతే భవిష్యత్తులో వరిసాగు కనుమరుగైపోయే పెనుప్రమాదం పొంచి ఉంది. కొవ్వూరు : పశ్చిమడెల్టా ఆయకట్టు మొత్తం 5, 29, 962 ఎకరాలు. దీనిలో ఇప్పటికే సుమారు లక్ష ఎకరాలు చెరువులుగా మారిపోయాయి. గత పదేళ్లుగా చెరువులపై మోజు విపరీతంగా పెరిగింది. ఈ ఏడాది కొత్తగా 11వేల ఎకరాలు చెరువులుగా మారినట్టు అధికారిక అంచనా. ఈ లెక్క వాస్తవానికి ఇంకా ఎక్కువే ఉంటుంది. కొందరు అధిక లాభాల ఆశచూపి రైతుల చేత చెరువులు తవ్వించేస్తున్నారు. దీనివల్ల పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయని, ఆహార భద్రత కొరవడడంతోపాటు కాలుష్యం ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో చేపలు, రొయ్యల చెరువులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. దీనివల్ల ఆ ప్రాంతాల్లో భూగర్భజలాలూ కలుషితమైపోయాయి. పాలకొల్లు, నరసాపురం, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లోనూ రొయ్యల చెరువులు విస్తరిస్తున్నాయి. సాగునీటి దోపిడీ చేపల చెరువులు ఇబ్బడిముబ్బడిగా పెరగడం వల్ల సాగునీటి దోపిడీ కూడా పెరిగింది. పశ్చిమడెల్టా కాలువల నుంచి ప్రధానంగా సాగు, తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాత చేపల చెరువులకు నీరు తోడుకోవచ్చు. కానీ చేపల చెరువుల యజమానులు విచ్చలవిడిగా నీటి దోపిడీకి పాల్పడుతున్నారు. పంట కాలువల నుంచి యథేచ్ఛగా నీటిని తోడేసుకుంటున్నారు. పెను నీటి ఎద్దడి దీనివల్ల వరి సాగుకు, తాగునీటికి తీవ్ర ఎద్దడి నెలకొంది. ఈ ఏడాది సాగునీటి ఎద్దడితోపాటు మంచినీటి చెరువులనూ నింపుకోలేని దుస్థితి నెలకొంది. దీంతో వరిచేలు బీటలు వారుతున్నాయి. మంచినీటి చెరువులు వెలవెలబోతున్నాయి. ఫలితంగా గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు అర్రులుచాస్తున్నారు. నిబంధనలకు తూట్లు.. కాలుష్యపు కాట్లు చేపల చెరువుల తవ్వకంలో యజమానులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. వాస్తవానికి చేపల చెరువులు తవ్వాలంటే పంట కాలువలకు మూడు మీటర్లు దూరం పాటించాలి. విధిగా ఇన్లెట్, అవుట్లెట్ సౌకర్యం ఉండేలా చూసుకోవాలి. కానీ యజమానులు ఈ నిబంధనలు పాటించడం లేదు. పంటకాలువల గట్లను ఆనుకుని చెరువులను తవ్వేస్తున్నారు. ఇ¯Œలెట్, అవుట్లెట్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. పంట కాలువల నుంచి నీటిని యథేచ్ఛగా తోడుకుంటూ చెరువుల్లోని వ్యర్థ ఉప్పనీటిని పంటకాలువల్లోకి వదిలేస్తున్నారు. దీనివల్ల కాలువలు కలుషితమవుతున్నాయి. ఈ నీరు పొలాల్లోకి చేరడంతో చేలు చౌడుబారుతున్నాయి. ఫలితంగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం భీమవరం : చేపలు, రొయ్యల చెరువుల తవ్వకానికి ప్రజాప్రతినిధులే ప్రోత్సాహం అదిస్తున్నారు. చెరువుల యజమానుల నుంచి ముడుపులు తీసుకుని అనుమతులు ఇప్పిస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భీమవరం, ఉండి, ఉంగుటూరు నియోజకవర్గాలో ఈ పరిస్థితి నెలకొన్నట్టు తరచూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులే కాక వారి అనుచరులు, సహాయకులు కూడా చెరువుల తవ్వకం పేరిట భారీగా లాభపడుతున్నట్టు విమర్శలొస్తున్నాయి. ఇటీవల ఓ ఎమ్మెల్యే చెరువులకు అనుమతులు ఇప్పించి లాభపడడాన్ని దగ్గరుండి చూసిన అతని సహాయకుడూ అదే బాట పట్టాడు. అతను చెరువులకు అనుమతులు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద నుంచి రూ.రెండుకోట్ల మేర వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల డెల్టాలో చెరువుల తవ్వకాన్ని ఉన్నతాధికారులు కట్టుదిట్టం చేయడం ఆ సహాయకునికి వరంగా మారింది. చెరువుల తవ్వకానికి ప్రాంతాన్ని బట్టి ఎకరాకు రూ.40వేల వరకు వసూలు చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యే సిఫార్సు పేరుతో అనుమతులివ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం ఎట్టకేలకు ఎమ్మెల్యే చెవిన పడడంతో ఆ సహాయకుడిని ఆయన విధుల నుంచి తప్పించినట్టు ప్రచారం జరగుతోంది. నిబంధనల సడలింపు వల్లే.. చెరువులకు అనుమతుల విషయంలో నిబంధనల సడలించడం వల్ల తవ్వకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గతంలో చెరువు తవ్వాలంటే రెవెన్యూ, నీటిపారుదలశాఖ, మత్స్యశాఖ తదితర 13 శాఖల నుంచి అనుమతులు పొందాల్సి ఉండేది. దీంతో పంటభూములు చెరువులుగా మారాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. అయితే 2014లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెరువుల తవ్వకానికి అనుమతులను సరళతరం చేసింది. దీంతో చెరువుల తవ్వకానికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. వాస్తవానికి జిల్లాలో ఎక్కడా రొయ్యల సాగుకు అనుమతి లేదు. అయినా అక్రమార్కులు అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుని యథేచ్ఛగా రొయ్యల సాగు చేపట్టేస్తున్నారు. చేపల చెరువులకు అనుమతి తీసుకుని రొయ్యల సాగు చేపడుతున్నారు. చేపల చెరువుల కంటే రొయ్యల చెరువుల సాగు వల్లే జల కాలుష్యం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టా స్వరూపం ఇదీ.. జిల్లాలో పశ్చిమడెల్టా 29 మండలాల్లో విస్తరించి ఉంది. దీనిపరిధిలో డెల్టా ప్రధాన కాలువతో కలిపి 357 కిలోమీటర్ల పొడవున 11 కాలువలు ఉన్నాయి. పంపిణీ కాలువలు 1,766 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. నాలుగు సబ్డివిజన్లలో 19 సెక్షన్ల పరిధిలో ఆయకట్టు ఉంది. నీటి పారుదల కోసం ప్రాజెక్టు కమిటీతోపాటు 20 పంపిణీ కమిటీలు, 131 నీటి వినియోగదారుల సంఘాలు ఉన్నాయి. -
బీపీటీ–2 వరి రకాన్ని అమ్మడం నేరం
నంద్యాల అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు లేని బీపీటీ–2 అనే వరి రకాన్ని అమ్మడం చట్టరీత్యా నేరమని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ సంచాలకులు డాక్టర్ గోపాల్‌రెడ్డి తెలిపారు. స్థానిక కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన వరి రకం కాదన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా నంద్యాల పరిసర ప్రాంతాల్లోని రైతులు కొందరు ఈ రకాన్ని సాగు చేస్తున్నారని చెప్పారు. పంట సాగు వలన వచ్చే సమస్యలకు వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖలు బాధ్యత వహించబోవన్నారు. విశ్వవిద్యాలయం రూపొందించిన బీపీటీ–5204 సాగుచేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. విత్తనం కొనేటప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలన్నారు. పంట కాలం పూర్తయ్యేవరకు రసీదు ఉంచుకోవాలని సూచించారు. -
నకిలీ ట్రక్ షీట్ల మాయాజాలం
చింతలపూడి(ప.గో) : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలతో రైతులకు మద్దతు ధర అందకుండా పోతోంది. మిల్లర్లు, ఐకేపీ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, కమీషన్ ఏజెంట్లు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం రవాణా చేసే ట్రక్షీట్ల ముసుగులో దళారులకు ప్రభుత్వ సబ్సిడీని దోచిపెడుతున్నారు. తాజాగా చింతలపూడిలో ఇటువంటి సంఘటన బయటపడిం ది. ఫాతిమాపురం ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం రవాణా అవుతున్న ఏపీ 05వై 9478 నంబర్ లారీని తనిఖీ చేయగా నకిలీ ట్రక్‌షీట్ బయటపడింది. ప్రగడవరం పంచాయతీ కార్యదర్శి మానుకొండ బ్లెస్సింగ్ మోజెస్ పేరు తో 170 క్వింటాళ్ల ధాన్యం లోడు పట్టుబడింది. వాస్తవానికి మోజెస్ రైతు కాదు ప్రభుత్వ ఉద్యో గి. విషయం తెలుసుకున్న మోజెస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐకేపీ అధికారుల ఫిర్యాదుతో ధాన్యం లోడును చింతలపూడి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై సైదానాయక్ చెప్పారు. నిర్వాహకుల చేతివాటం ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం లోడు చేసే సమయంలో ఐకేపీ, రెవెన్యూ, పౌరసరఫరాల సిబ్బంది ట్రక్ షీట్ రాసి ఏ మిల్లుకు సరఫరా చేయాలో తెలియజేస్తారు. మిల్లు యజ మాని ట్రక్ షీట్ చూసి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలి. ఇక్కడే కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చేతివాటం చూపిస్తున్నారు. వ్యాపారులు రైతుల వద్ద కొన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్నట్టు చూపుతూ మిల్లులకు తరలిస్తున్నారు. ఇందుకు కొనుగోలు కేంద్రం ని ర్వాహకులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమీషన్ వ్యాపారులు లారీకి ఇంతని కమీషన్ ముట్టచెబుతున్నారనే విమర్శ లు ఉన్నాయి. దీంతో రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మిల్లర్ల జేబుల్లోకి చేరుతోంది. నకిలీ ట్రక్ షీట్లు వాస్తవమే ఫాతిమాపురం ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి నకిలీ ట్రక్‌షీట్లతో ధాన్యం రవాణా చేస్తున్న విషయం నిజమే. చెక్‌పోస్ట్ సిబ్బంది సమాచారంతో లారీని పట్టుకుని పోలీసులకు అప్పగించాం. గ్రామ సంఘంతో ఫిర్యాదు చేయించాం. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని డీఆర్డీఏ పీడీ చెప్పారు. – పి.భానుమతి, ఐకేపీ ఏపీఎం -
నిర్లక్ష్యపు తుప్పు
అక్కరకు రాని ధాన్యం ఆరబోత యంత్రాలు జిల్లాలో నిరుపయోగంగా 12 డ్రయ్యర్లు రూ.1.92 కోట్ల నిధులు నిరుపయోగం ‘రైతే దేశానికి వెన్నెముక’.. రైతు రాజ్యం రావాలి.. రైతు అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయం.. అంటూ ఊదరగొట్టే నాయకుల మాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. వాస్తవంలోకి వచ్చే సరికి రైతు పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఆరుగాలం శ్రమించి.. స్వేదాన్ని పసిడి రూపంలోకి మార్చే అన్నదాతలు పంటను అమ్ముకోవడానికి నానా తిప్పలు పడాల్సి వస్తోంది. రైతుల ప్రయోజనం అంటూ వ్యవసాయశాఖ ద్వారా అందజేసిన ధాన్యం ఆర బోత యంత్రాలు (డ్రయ్యర్లు) ప్రస్తుతం నిరుపయోగంగా పడి ఉన్నాయి. జిల్లాలో పంపిణీ చేసిన 12 ఆరబోత యంత్రాలకు నిర్లక్ష్యపు తుప్పు పట్టడంతో రూ.1.92 కోట్లు నిరుపయోగం అయ్యే పరిస్థితి తలెత్తింది. – రాయవరం ఏటా ఖరీఫ్‌లో పంట చేతికంది వచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబరు, నవంబరు నెలల్లో వచ్చే తుపాన్లు కారణంగా పంట వర్షార్పణం అవుతుంది. ఆ సమయంలో వరి పనలు తడవడం, తడిసిన ధాన్యం ఆరబోసుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన ధాన్యం సరిగ్గా ఆరక పోవడంతో సరైన ధర దక్కక అన్నదాత నష్టపోతున్నాడు. దీంతో రైతులను ఆదుకునేందుకు వ్యవసాయశాఖ ఆరబోత యంత్రాలను సబ్సిడీపై ఇవ్వాలని నిర్ణయించింది. ఇవి రైతులకు ఆశాకిరణంగా నిలుస్తాయనుకుంటే నిరాశకు గురిచేశాయి. నాణ్యతాలోపం..రైతుల అవసరాలకు తగినట్లుగా లేకపోవడంతో అక్కరకు రాకుండా పోయాయి. ఫలితంగా వాటికి నిర్లక్ష్యపు తుప్పు పట్టి పాడైపోయే పరిస్థితికి చేరుకుంటున్నాయి. అప్పట్లో ఏమన్నారంటే.. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యానికి మద్దతు ధర లభించాలంటే తేమ 17 శాతం ఉండాలి. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మిల్లర్లు కూడా తేమశాతం ఆధారంగానే ధర నిర్ణయిస్తారు. ఈ పరిస్థితుల్లో 17 శాతం ఆరుదలకు ఆరబోత యంత్రాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని.. గంటసేపు యంత్రం పనిచేస్తే ఐదు టన్నుల ధాన్యం ఆరబోస్తుందని గతంలో వ్యవసాయశాఖ చెప్పిన మాట. అయితే దీనికి విరుద్ధంగా ఇది పనిచేయడంతో రైతులు విముఖత వ్యక్తం చేశారు. ఆరబోత యంత్రం గంటకు రెండు లీటర్ల డీజిల్ అవసరమవుతున్నా..కనీసం ఐదు బస్తాల ధాన్యం కూడా ఆరబెట్టడం లేదు. ఒక బస్తా ధాన్యం ఆరబోతకు రూ.70లు ఖర్చవుతుంది. దీంతో సొసైటీలు ఈ యంత్రాలను మూలనబెట్టాయి. భారీ యంత్రాలను భద్రపర్చేందుకు కూడా వీలు కాక ఆరుబయటే వదిలివేయడంతో తుప్పుపట్టిపోతున్నాయి. రూ.1.92 కోట్లు నిరుపయోగం.. జిల్లాలో ఏటా 2.20 లక్షల హెక్టార్లలో వరిసాగు జరుగుతుంది. తద్వారా ఏటా 10 నుంచి 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. తడిసిన ధాన్యం ఆరబోసుకునేందుకు 2014 రబీలో ధాన్యం ఆరబోత యంత్రాలను వ్యవసాయశాఖ ద్వారా కొనుగోలు చేశారు. జిల్లాలో సోమేశ్వరం, కరప, కాజులూరు, దుగ్గుదూరు, కొంకుదురు, కొమరిపాలెం, చోడవరం, దేవగుప్తం, జెడ్.మేడపాడు, సామర్లకోట, భీమనపల్లి, జి.మేడపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వీటిని రాయితీపై అందించారు. ఒక్కో ఆరబోత యంత్రం విలువ రూ.16 లక్షలు. ఇందులో సహకార సంఘం రూ.4 లక్షలు చెల్లిస్తే..మిగిలిన రూ.12 లక్షల సొమ్మును రాయితీగా వ్యవసాయశాఖ ద్వారా ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఒక్క యంత్రం కూడా పనిచేయలేదు. ఫలితంగా రూ.1.92 కోట్ల సొమ్ము నిరుపయోగమైందనే విమర్శలు విన్పిస్తున్నాయి. -
కష్టాలకు చెక్
తాడేపల్లిగూడెం/ఏలూరు (మెట్రో) : పెద్ద నోట్ల రద్దు అనంతరం కష్టాల్లో కూరుకుపోయిన రైతులకు కొంత ఊరట లభించింది. రైతులు వారి ఖాతాల నుంచి రూ.25 వేల వరకు నగదు తీసుకునే వెసులుబాటు కల్పించడంతో ఇటు జిల్లా అధికారులు.. అటు కమీష¯ŒS వ్యాపారులు ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతుల ఖాతాలకు వీలైనంత త్వరగా నగదు జమ చేసేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు కమీష¯ŒS వ్యాపారులు రైతులకు బ్యాంక్ చెక్కులిచ్చి మరీ ధాన్యం కొంటున్నారు. దీంతో శుక్రవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఇప్పటివరకూ కళ్లాలు, రోడ్ల వెంబడి రాశులుగా పోసి ఉంచిన ధాన్యం నిల్వలు ఐకేపీ కేంద్రాలు, మిల్లుల వైపు వేగంగా కదులుతున్నాయి. జిల్లాలోని ఐకేపీ కేంద్రాల్లో శుక్రవారం ఒక్కరోజే 3,985 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కమీష¯ŒS దారులు, మిల్లర్లు సైతం పెద్దఎత్తున ధాన్యం కొన్నారు. ఒక్క తాడేపల్లిగూడెం ప్రాంతం నుంచే సుమారు 300 లారీల ధాన్యం మిల్లులకు తరలిం దని అంచనా. కమీష¯ŒSదారులు గతంలో ధాన్యం తీసుకెళ్లిన నాలుగైదు రోజుల అనంతరం రైతులకు నగదు చెల్లించేవారు. ఇప్పుడు చిల్లర నోట్లు, కొత్త నోట్లు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం కొన్న మొత్తానికి బ్యాంకు చెక్కు ఇస్తున్నారు. వాటిని రైతులు వారి బ్యాంక్ ఖాతాల్లో వేసుకోవడం ద్వారా నగదు పొందే అవకాశం ఏర్పడటంతో అమ్మకాలు ఒక్కసారిగా వేగం పుంజుకున్నాయి. ధర ఫర్వాలేదు ఈసారి ధర విషయంలో రైతులకు కొంత బాగానే ఉంది. కమీష¯ŒSదారులు ఆరబెట్టిన ధాన్యం బస్తా (75 కేజీలు)కు రూ.1,120 చెల్లిస్తున్నారు. యంత్రంతో కోసిన ఆరుదల లేని ధాన్యానికి రూ.980 ఇస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర కంటే బస్తాకు రూ.18 వరకు అదనంగా రైతులకు లభిస్తోంది. కేరళ నుంచి ఉప్పుడు బియ్యానికి డిమాండ్ ఉండటంతో మిల్లర్లు, కమీష¯ŒSదారులు అనుకూలమైన ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఫలితమిస్తున్న ఉపశమన చర్యలు రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం గురువారం ఉపశమన చర్యలు ప్రకటించింది. పంట రుణం పొందిన లేదా కిసా¯ŒS క్రెడిట్ కార్డు ఉన్న రైతు తన ఖాతా నుంచి వారానికి రూ.25 వేల నగదు తీసుకోవచ్చు. పంట అమ్మగా వచ్చిన సొమ్ము ఆర్టీజీఎస్ లేదా చెక్కు ద్వారా రైతు ఖాతాలోకి వచ్చి ఉంటే, వారానికి అదనంగా మరో రూ.25 వేలు తీసుకోవచ్చు. అంటే ఇలాంటి సందర్భాల్లో రైతు గరిష్టంగా వారానికి రూ.50 వేలు తీసుకునే అవకాశం ఉంది. వరి కోతలు ముమ్మరంగా సాగుతుండటం, రబీ సీజ¯ŒS సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ఈ ఉపశమన చర్యలు రైతులకు ఊరట ఇస్తున్నాయి. అయితే, సహకార సంఘాల్లో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోవడంతో వాటిలో ఖాతాలున్న రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. సొమ్ము చెల్లింపుల్ని వేగవంతం చేశాం ఐకేపీ కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ప్రతి గింజనూ కొనేలా ఏర్పాట్లు చేశాం. చెల్లింపులను వేగవంతం చేశాం. గడచిన 10 రోజుల్లో 14,241 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, శుక్రవారం ఒక్కరోజే 3,985 మెట్రిక్ టన్నులు కొన్నాం. 1,286 మంది రైతులకు రూ.20.93 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.11.70 కోట్లు చెల్లించాం. రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన చర్యలు వారికి ఉపశమనం కల్పించాయి. – ఎం.గణపతి, జిల్లా మేనేజర్, పౌర సరఫరాల శాఖ -
ఏపీలో 16 లక్షల హెక్టార్లలో వరి సాగు
శాస్త్రవేత్త డాక్టర్ సూర్యనారాయణ, వరి వంగడాలు, పరిశీలన గుడ్లవల్లేరు : ఏపీలో 16 లక్షల హెక్టార్లలో వరి సాగవుతోందని నెల్లూరు వరి విత్తన పరిశోధన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వై.సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన గుడ్లవల్లేరు, పెంజెండ్ర, చిత్రంలో వల్లభనేని నరసింహారావు, జూపూడి పూర్ణచంద్రరావు సాగు చేసిన (4001, 3513 రకాల నూతన వరి వంగడాలు) చేలను పరిశీలించారు. ఏపీలో దాళ్వా కింద ఎనిమిది లక్షల హెక్టార్లలో వరి సాగు కానుందని చెప్పారు. తమ పరిశోధన కేంద్రం నుంచి వచ్చిన 4001, 3513 నూతన వరి రకాలను రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సాగు చేశారని, సానుకూల ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. తక్కువ ఎరువుల ఖర్చు, తొలకరికి అనువు, గాలులకు పడిపోవు, చీడపీడలు తట్టుకోవటం, దోమ సోకని రకాలుగా రైతులు చెబుతున్నారన్నారు. రైతులు స్వీయ విత్తనాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. విత్తనాల కోసం ప్రైవేట్ కంపెనీలు, దళారులపై ఆధారపడటాన్ని వ్యతిరేకించారు. అవి షుగర్ లెస్సేనా? షుగర్ లెస్ విత్తనాలుగా తెలంగాణ నుంచి దిగుమతి అవుతున్న వరి విత్తనాలపై స్థానిక రైతులు మండిపడ్డారు. ఏ బియ్యంలో అయినా కార్బోహైడ్రేడ్స్ ఉండవా? అని శాస్త్రవేత్తలను అడిగారు. దానికి శాస్త్రవేత్తల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కార్యక్రమంలో ఏరువాక కేంద్ర జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ వి.మహేశ్వరప్రసాద్, రైతులు వల్లభనేని నరసింహారావు, జూపూడి పూర్ణచంద్రరావు, బొర్రా నాగేశ్వరరావు, రామ నాగేశ్వరరావు, వెంకట్రామయ్య, ఏసు, కృపానందం పాల్గొన్నారు. -
దక్కేది అంతంత.. కొంటారా అంతా
ఏలూరు (మెట్రో) : ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,550, సాధారణ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,470గా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. అదికూడా నిర్దేశించిన స్థాయిలో తేమ శాతం ఉంటేనే చెల్లిస్తారు. లేదంటే మద్దతు ధరలోనూ కోత తప్పని పరిస్థితి. ఇప్పటికే జిల్లాలో వరి కోతలు ఊపందుకున్నాయి. ప్రభుత్వం నేటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు మాసూలు చేసిన ధాన్యాన్ని అయినకాడికి అమ్ముకుంటున్నారు. తీరిగ్గా మేల్కొన్న అధికారులు జిల్లా వ్యాప్తంగా 260 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈనెల 7వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ నెల రెండో వారం నాటికి గాని ఆ కేంద్రాలు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. రైతులకు చెల్లించే మద్దతు ధర అంతంత మాత్రంగానే ఉన్నా.. రైతులందరి నుంచి ధాన్యం కొనే పరిస్థితి ఐకేపీ కేంద్రాల్లో లేకపోవడంతో ధాన్యాన్ని దళారులు తన్నుపోతున్నారు. తేమ శాతాన్ని బట్టి ధర చెల్లింపు ధాన్యంలో 17శాతానికి మించి తేమ ఉండకూడదు. అంతకుమించి తేమ ఉంటే రైతులకు చెల్లించే ధర తగ్గిస్తారు. 17 శాతం తేమ ఉండే గ్రేడ్ ఏ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,550, 75 కేజీల బస్తాకు రూ.1,132.50 చెల్లిస్తారు. సాధారణ రకం క్వింటాల్‌కు రూ.1,470, 75 కేజీల బస్తాకు రూ.1,102.50 చెల్లిస్తారు. తేమ శాతం పెరిగితే.. ఆ శాతానికి అనుగుణంగా ధర తగ్గిపోతుంది. వెబ్‌ల్యాండ్.. ఈ క్రాప్ ఆధారంగా కొనుగోళ్లు ప్రస్తుత ఖరీఫ్ సీజ¯ŒS నుంచి ధాన్యం కొనుగోళ్లలో నూతన విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఈ క్రాప్, వెబ్‌ల్యాండ్ విధానం ఆధారంగా కొనుగోళ్లు జరుపుతారు. జిల్లా వ్యాప్తంగా 260 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వీటిలో 160 కేంద్రాలు ఇందిరా క్రాంతిపథం (ఐకేపీ) ఆధ్వర్యంలోను, 100 కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సొసైటీలు) ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి రావచ్చని అంచనా వేస్తున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు ధాన్యం కొనుగోళ్లకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. రైతుకు న్యాయం జరిగేలా, దళారులను అడ్డుకునేలా అన్నిశాఖల అధికారుల ఈసారి ధాన్యం కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించి కిందిస్థాయి నుంచి తనిఖీలు జరిపిస్తాం. రైతు నుంచి ధాన్యం మిల్లరుకు చేరిన తరువాత ట్రక్‌షీట్‌ను కూడా పరిశీలించి అసలైన రైతు ధాన్యం మాత్రమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – పి.కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ మద్దతు ధర బాధ్యత రాష్ట్రానిదే భారత రాజ్యాంగాన్ని బట్టి చూస్తే వ్యవసాయం రాష్ట్ర జాబితాలోనే ఉంది. మద్దతు ధరలు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ కేంద్రం ఇచ్చే బోనస్‌తోనే సరిపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాలం గడిపేస్తోంది. పెట్టుబడికి అదనంగా మద్దతు ధర ప్రకటించి రైతులను రాష్ట్ర ప్రభుత్వమే విధిగా ఆదుకోవాలి. – నాగబోయిన రంగారావు, అధ్యక్షుడు, రాష్ట్ర కౌలు రైతుల సంఘం -
వరిగేదేమిటి?
షాబాద్: వ్యవసాయం రోజురోజుకూ భారమవుతున్నా... ఇవ్వాళ కాకపోతే రేపైనా తమకు మంచి రోజులు రాకపోతాయా అనే ఆశతో రైతులు ముందుకు ‘సాగు’తున్నారు. ఈసారైనా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచకపోతుందా...అన్న ఆశతో ఎదురుచూస్తున్న వారికి చేదు అనుభవమే ఎదురైంది. మళ్లీ అదే పరిస్థితి ఉత్పన్నం కావడంతో తమకు దిక్కెవరంటూ అన్నదాతలు వాపోతున్నారు. వరితో సహా ఇతర ప్రధాన పంటలకు మద్దతు ధర లేక... అల్లాడుతున్నారు. జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఏటా ప్రకృతి విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవేళ అన్నీ అనుకూలించి... పంటలు పండినా దళారులు, వ్యాపారుల దగాతో మద్దతు ధర పొందలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు చూసి అవాక్కవుతున్నారు. పేరుకే సిఫారసులు ధాన్యానికి కనీస మద్దతు ధర నిర్ణయించే అధికారం రాష్ట్రానికి లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా పంట ఉత్పత్తి వ్యయాన్ని అంచనా వేసి.. కనీస మద్దతు ధరను నిర్ణయించి... కేంద్రానికి సిఫారసు చేస్తుంది. ఈ సిఫారసులు యధావిధిగా ఆమోదిస్తే కొంతవరకు మేలు కలుగుతుంది. కానీ ఇవి అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా అన్నదాతకు కష్టం తప్పడం లేదు. కంటితుడుపుగా ధరలు... జిల్లాలోని 26 మండలాల్లో లక్ష హెక్టార్లకు పైగా వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, వరి, కంది పంటలు సాగు చేస్తారు. ఈసారి వాతావరణం అనుకూలించకపోవడంతో గత ఎడాది కంటే సాగు వీస్తీర్ణం కొంత తగ్గిందనే చెప్పాలి. దాదాపుగా 25వేల హెక్టార్లలో పత్తి, 30 వేల హెక్టార్లలో కంది, 25 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 15 వేల హెక్టార్లలో వరి సాగు చేస్తారు. తాజాగా ఏ గ్రేడ్ ధాన్యం ధర రూ.1450 నుంచి రూ.1510కి పెరిగింది. సాధారణ రకం రూ.1410 నుంచి రూ.1470కి పెరిగింది. పత్తి రూ.4100 నుంచి రూ.4160కి... మొక్క జొన్న రూ.1375 నుంచి రూ.1410కి పెరిగింది. నామ మాత్రపు పెరుగుదల వల్ల తమకు ఒరిగేది ఏమీ ఉండదని రైతులు పెదవి విరుస్తున్నారు. మరోవైపు వ్యాపారులు, దళారులు సిండికేటుగా మారి రైతులను దోచుకుంటున్నారు. ఈ దోపిడీని అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలి : జేసీ
కాకినాడ సిటీ : ధాన్యం కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత కేంద్రాల ఇన్ చార్జిలదేనని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్‌భవన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి పౌరసరఫారాల సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లించడానికి కేంద్రాల ఇన్ చార్జిలు బాధ్యతతో పనిచేయాలన్నారు. కేంద్రాల్లో రిజిస్టర్లు నిర్వహించాలని చెప్పారు. ధాన్యం సాధరణ రకం 75కిలోలు రూ.1102.50పైసలు, వంద కిలోలు రూ.1470, గ్రేడ్–ఎ రకం 75కిలోలు రూ.1132.50పైసలు, వంద కిలోలు రూ.1510 మద్దతు ధరగా ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా 251 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నటు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆర్డీఓలు అంబేడ్కర్, సుబ్బారావు, గణేష్‌కుమార్, విశ్వేశ్వరరావు, పౌరసరఫరాల సంస్థ డీఎం కె.కృష్ణారావు, డీఎస్ఓ ఉమామహేశ్వరరావు, మార్కెటింగ్ శాఖ ఏడీ కేవీఆర్ఎన్ కిషోర్, డీసీఓ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురంలో పత్తి కొనుగోలు కేంద్రం కాకినాడ సిటీ: కాట¯ŒS కార్పొరేష¯ŒS ఆఫ్ ఇండియా(గుంటూరు) ఆధ్వర్యంలో పిఠాపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. కనీస మద్దతు ధర, ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల రెండోవారంలో పిఠాపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారని ఇందుకు మార్కెటింగ్‌శాఖ సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కనీస మద్దతు ధర రూ.4160 ఉందన్నారు. అలాగే ఏలేరు ఆధునికీకరణ, ఏడీబీ రోడ్, కెనాల్‌రోడ్ భూసేకరణ పనులపై ఆయా శాఖల అధికారులతో ఆయన కలెక్టరేట్లో సమీక్షించారు. రాజానగరం– సామర్లకోట ఏడీబీరోడ్డు భూసేకరణకు సర్వే పూర్తయిందని, వారం రోజుల్లో ప్రిలిమినరీ నోటిఫికేష¯ŒS జారీ చేయాలని పెద్దాపురం ఆర్డీఓను ఆదేశించారు. -
రైతన్న వెన్ను విరిచారు..
* వరిలోనూ నకిలీ విత్తనాలు * 1500 ఎకరాల పైరులో కేళీలు * సగం దిగుబడి కూడా రాదంటున్న అన్నదాతలు * నంద్యాల వ్యాపారిపై జేడీకి ఫిర్యాదు సాక్షి, అమరావతి బ్యూరో: మొన్న పత్తి.. నిన్న మిర్చి.. నేడు వరి... ప్రతి పంటలోనూ నకిలీ విత్తనాలు అన్నదాతలను కలవరపెడుతున్నాయి. జిల్లాలో రోజూ ఎక్కడో ఓ చోట నకిలీల బండారం బయటపడుతూనే ఉంది. కోట్లాది రూపాయల పెట్టుబడులు మట్టిపాలవుతున్నాయి. పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో నకిలీ వరి విత్తనాల బారినపడి 1500 ఎకరాల్లో రైతులు నిండా మునిగారు. పంటలో కేళీలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పొట్ట నుంచి వెన్ను రావడం లేదని, కొన్ని కర్రలకు ముందే వస్తోందని, దీంతో పంట ఎగుడుదిగుడులుగా ఉందని రైతులు వాపోతున్నారు. ముందుగా వచ్చిన గింజలను పిట్టలు తినిపోతున్నాయని పేర్కొంటున్నారు. నానా జాతి విత్తనాలతో మోసపోయామని గగ్గోలుపెడుతున్నారు. ఎకరాలకు 40 బస్తాల దిగుబడి రావాల్సిఉండగా, సగం కూడా వచ్చే పరిస్థితులు లేవని అంటున్నారు. విత్తనాలను నంద్యాలలో తియ్యకూర గోపాలరెడ్డి అనే వ్యాపారి వద్ద బస్తా (30 కేజీలు) రూ. 1000కి కోనుగోలు చేసినట్లు చెబుతున్నారు. పంటలో కేళీలు ఉన్నాయని వ్యాపారికి చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు. ఎకరాకు రూ. 20 వేల పెట్టుబడి పెట్టామని వాపోతున్నారు. స్థానిక వ్యవసాయాధికారికి 15 రోజుల ముందే ఫిర్యాదు చేస్తే చర్య తీసుకోలేదని, ఏఈఓకు చెప్పి చేతులు దులుపుకొన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేడీకి ఫిర్యాదు... వరి పంట వేసి నష్టపోయిన రైతులు సోమవారం గుంటూరులోని వ్యవసాయ సంయుక్త కార్యాలయంలో జేడీ కృపాదాస్కు ఫిర్యాదు చేశారు. నకిలీ విత్తనాలతో మోసపోయామంటూ వివరించారు. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని కన్నీటి పర్యంతమయ్యారు. న్యాయం చేయాలని కోరారు. న్యాయం చేస్తాం.. వరి పంటలో కేళీలు, పొట్టనుంచి వెన్ను రావడం లేదని నంబూరు నుంచి రైతులు వచ్చి ఫిర్యాదు చేశారు. వారు ఎక్కడ విత్తనాలు కొన్నదీ, విత్తన బిల్లులను పరిశీలించి వ్యాపారికి ఫోన్ చేశాను. ఆయన వస్తానని చెప్పారు. రైతులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాను. – కృపాదాస్, జాయింట్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ -
వరి పరిశోధన సంస్థను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం
మార్టేరు (పోడూరు) : మార్టేరులోని భారతీయ వరిపరిశోధన సంస్థ వాతావరణ మార్పులకు అనుగుణంగా నిర్వహిస్తున్న ప్రయోగాలు రైతుల మన్ననలు అందుకుంటున్నాయని హైదరాబాద్‌లోని భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ప్రశంసించారు. ఆ శాస్త్రవేత్తల బృందం గురువారం మార్టేరులోని వరి పరిశోధన సంస్థలో నిర్వహిస్తున్న ప్రయోగాలను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆ బృందంలోని పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఇక్కడి పరిశోధనలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయన్నారు. ఇక్కడ రూపొందుతున్న వివిధ రకాల వంగడాలు మంచి ఫలితాలనిస్తున్నాయన్నారు. సంస్థ డైరెక్టర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ ఇక్కడ గతంలో నిర్వహించిన, ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రయోగాల గురించి, ఇక్కడ రూపొందించిన వంగడాల గురించి హైదరాబాద్ శాస్త్రవేత్తల బృందానికి వివరించారు. వరి రకాల రూపకల్పన విభాగం, చీడపీడల విభాగం, మృత్తికా శాస్త్ర విభాగం, వృక్ష శరీర ధర్మ శాస్త్ర విభాగాల్లో జరుగుతున్న ప్రయోగాలను బృందం పరిశీలించింది. ప్లాంట్ బ్రీడింగ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.పద్మావతి, సాయిల్‌సైన్స్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.బి.ప్రసాద్‌బాబు, డాక్టర్ ఎన్.సోమశేఖర్(నెమటాలజీ), డాక్టర్ సంజీవరావు(బయోకెమిస్ట్రీ), డాక్టర్ కె.కళ్యాణి(బయోటెక్నాలజీ),డాక్టర్ ఎం.గిరిజారాణి(ప్లాంట్ బ్రీడింగ్) వరిపరిశోధన సంస్థలో నిర్వహిస్తున్న ప్రయోగాలను సందర్శించిన వారిలో ఉన్నారు. -
284 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ అమలాపురం : ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లాలో 284 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ వెల్లడించారు. డిమాండ్‌ను బట్టి అవసరమైతే ప్రజాప్రతిని««దlుల సూచనల మేరకు కేంద్రాల సంఖ్య పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో డివిజన్లోని తహసీల్దార్లతో బుధవారం జరిగిన సమీక్షా సమావేశానికి జేసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్డీవో జి.గణేష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జేసీ సత్యనారాయణ నీటి తీరువా వసూలు, ఖరీఫ్ ధాన్యం కొనుగోలు, రుణ అర్హత కార్డులు, పౌ ర సరఫరా, ఈ–పాస్ పుస్తకాలు తది తర అంశాలపై సమీక్షించారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి కేంద్రాల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని తెలిపారు. పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఎ.కృష్ణారావు మాట్లాడుతూ ఖరీఫ్ ధాన్యానికి పెంచిన కనీస మద్దతు ధరపైన... ధాన్యం కొనగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసింది వంటి వివారాలపై గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం చేయాలని తహసీల్దార్లకు సూచించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అన్ని పారామీటర్ల ప్రకారం జిల్లా రెవెన్యూ శాఖ రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది ఈ సమయంలోనే అంకిత భావంతో పనిచేస్తే ప్రథమ స్థానానికి వెళ్తామన్నారు. నీటి తీరువా పన్ను వసూళ్లలో కూడా రెండో స్థానంలో ఉందని చెప్పారు. నవంబర్ 15 నాటికి నీటి తీరువా నూరు శాతం వసూలు చేయాలని జేసీ ఆదేశించారు. రుణ అర్హత కార్డులపై జిల్లాలో ఇప్పటి వరకూ రూ.97 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. ఈ విషయంలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. రెవెన్యూ సేవల పరంగా జిల్లాను రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలోనూ... కొన్ని అంశాల్లో ప్రథమ స్థానంలోనూ ఉన్నందుకు ఆర్డీవో గణేష్‌కుమార్, తహసీల్దార్లను జేసీ సత్యనారాయణ అభినందించారు. -
శ్రీ వరి సాగులో నీటియాజమాన్యమే కీలకం
శ్రీరంగాపురం(నడిగూడెం): శ్రీ వరి సాగులో నీటియాజమాన్యమే కీలకమని మండల వ్యవసాయాధికారి ఎండి.జానిమియా తెలిపారు. నాగార్జున్ సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ పనుల్లో భాగంగా శ్రీరంగాపురంలో యంత్రంతో నాటు పెట్టిన శ్రీ వరి ప్రదర్శనా క్షేత్రాలను సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడతూ ఈ పద్దతిలో తక్కువ నీరు అవసరం పడుతుందన్నారు. ఒక ఎకరాకు పెట్టే నీటితో ఈ శ్రీవరి విధానంలో రెండున్నర ఎకరాలకు సాగు నీరు పెట్టవచ్చని తెలిపారు. వరి నీటి మొక్క కాదని, ఆరుతడి ద్వారా సాగుచేయవచ్చన్నారు. ఈ ప్రదర్శనా క్షేత్రాలకు పంపిణీ చేసిన సోడోమోనాస్ జీవశీలీంద్రనాశినిని పిచికారి చేస్తే అగ్గితెగులు, వేప నూనె పిచికారితో కాండం తొలుచు, ఆకుచుట్టు పురుగులు నివారణ జరుగుతాయన్నారు. కలుపును మాత్రం కోనోవీడర్‌తో నాటు పెట్టిన 40 రోజుల్లోపు ప్రతి 10 రోజులకు ఒక సారి నాలుగుసార్లు కలుపును తొలగిస్తే ఆ కలుపు మొక్కలే ప్రధాన పంటకు పచ్చిరొట్ట ఎరువు అవుతుందన్నారు. దీంతో పిలకలు దుబ్బులు అధికంగా రావడంతో పంట దిగబడి కూడా అధికంగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సర్పంచ్ కొల్లు రామారావు, ఉపసర్పంచ్ బండారు గుర్వయ్య, మండల ప్రమోటర్ ఎం.గోపి, రైతులు కొల్లు రాజేందర్ చౌదరి, సూరమ్మ, రంగా, తదితరులు పాల్గొన్నారు. -
విరుగుడు లేదు విషమే!
– వరిపై సింథటిక్ పైరిత్రాయిడ్ విచ్చలవిడి వినియోగం – దోమపోటు నివారణ మందుల పేరుతో అమ్మకాలు – జిల్లాలో రూ.200 కోట్లకుపైగా వ్యాపారం – అక్రమార్కులతో అంటగాగుతున్న అధికారులు కర్నూలు(అగ్రికల్చర్): వరిలో దోమ పోటు నివారణ పేరుతో నకిలీ మందులు, బయోలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నా వ్యవసాయశాఖకు ఎంతమాత్రం పట్టడం లేదు. నిషేధిత సింతటిక్ పైరిత్రాయిడ్‌తో విషపూరిత రసాయనాలు మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతున్నా నియంత్రణ చర్యలు లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నియంత్రణకు చర్యలు తీసుకోకపోగా ఉన్నతాధికారుల తనిఖీల విషయాలను సైతం ముందుగానే తెలియజేసి జాగ్రత్త పడేలా చూస్తుండడం మరింత విస్తుగొలుపుతున్న అంశం. ఇటీవలే అంతర్ జిల్లా వ్యవసాయాధికారుల బందం జిల్లా పర్యటన విషయాన్ని ఓ వ్యవసాయాధికారి ముందుగానే డీలర్లకు తెలియజేసి అలర్ట్ అయ్యేలా చూసినట్లు ఆరోపణలున్నాయి. ఇలా అక్రమార్కులతో అంటకాగే వ్యవసాయాధికారులు దోమ పోటు నివారణ మందుల పేరుతో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతున్నా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కేసీ కెనాల్, ఎల్ఎల్సీ, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ ఆయకట్టు పరిధిలో 60వేల ఎకరాల్లో వరి సాగైంది. ప్రస్తుతం దోమపోటు బెడద ఉండడంతో అక్రమార్కులు నకిలీ మందులు, దొంగ బయోలను ఇప్పటికే గ్రామాలకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యాపారం రూ. 200 కోట్లకుపైగా ఉన్నట్లు సమాచారం. కొన్నేళ్ల క్రితమే నిషేధించినా.. పంట ఏదైనా ముఖ్యంగా వరికి సంబంధించి సింథటిక్ పైరిత్రాయిడ్స్ 60 రోజుల దశ వరకు వాడరాదు. ఈ మేరకు కొన్నేళ్ల క్రితమే నిషేధం విధించారు. అయితే వీటిని పురుగు మందులు, బయో పెస్టిసైడ్స్ పేరుతో దోమ నివారణ కోసమంటూ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. కర్నూలు, ఎమ్మిగనూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు,ఆత్మకూరు, ఆదోని ప్రాంతాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉంది. నకిలీ పురుగు మందులకు ఎమ్మిగనూరు కేంద్ర బిందువుగా మారినట్లు ఆరోపణలున్నాయి. సింతటిక్ పైరిత్రాయిడ్స్వాడకంతో దోమ తగ్గకపోగా మరింత శక్తిని పుంజుకుని వద్ధి చెందుతోందని, ఇది కొనసాగితే మున్ముందు కష్టమని కీటక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పైగా పంటలకు మేలు చేసే కీటకాలు అంతరిస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. పంట దిగుబడుల్లో వీటి విషపూరిత రసాయనాల అవశేషాలుండడంతో మనిషి ఆరోగ్యంపై కూడా తీవ్రప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. నకిలీ పురుగుమందుల అడ్డా.. కర్నూలు బైపాస్ రోడ్డు సమీపంలోని కన్యకా పరమేశ్వరీ అలయం వద్దనున్న ఓ గోదాములో నకిలీ పురుగు మందులు, దొంగ బయోలు పెద్ద ఎత్తున నిల్వ చేసి అక్కడి నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ నుంచి ఇవి ఇక్కడకు రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా నకిలీలను మార్కెట్లోకి తరలిస్తున్నట్లు సమాచారం. జాతీయ రహదారి పక్కనే భారీ ఎత్తున నకిలీల వెల్లువ కొనసాగుతున్నా చర్యలు లేకపోవడాన్ని బట్టి మన వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది వారితో ఏ స్థాయిలో అంటగాగుతున్నారో ఇట్టే తెలిసిపోతోంది. నిషేధిత మందుల నియంత్రణకు చర్యలు – జేడీఏ ఉమామహేశ్వరమ్మ కర్నూలు సింథటిక్ పైరిత్రాయిడ్స్ కాంబినేషన్ మందులను వరిలో 60 రోజుల వరకు వాడరాదు. ఆహార పంట కావడంతో ఈ మేరకు ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వీటి అమ్మకాలపై ప్రత్యేకంగా దష్టి సారించాం. అయితే వీటిని కూరగాయలు, ఇతర పంటల్లో వాడవచ్చు. వరిలో అయితే 60 రోజుల తర్వాత వాడినప్పటికి పరిమితంగా వాడాలి. వీటి అమ్మకాలు, వరిలో వినియోగంపై దష్టి సారించాలని ఏఓ, ఏడీఏలకు ఆదేశాలు ఇచ్చాం. -
1.30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
జేసీ డి.దివ్య ఖమ్మం జెడ్పీసెంటర్: ఖరీఫ్ సీజన్లో 1.30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డి. దివ్య పేర్కొన్నారు. శనివారం పౌరసరఫరా శాఖ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో వరి సాధారణ సాగు 1,25,990 హెక్టార్లకు గాను ప్రస్తుతం 69,185 హెక్టార్లలో వరి నాట్లు వేసినట్లు వ్యవసాయశాఖ లెక్కలు ఉన్నట్లు చెప్పారు. వరి విస్తీర్ణం ఆధారంగా 3,59,762 మెట్రిక్ టన్నుల రావచ్చునని అంచనాలు వేసినట్లు తెలిపారు. ఇందులో 1.30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో 199 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. 32 లక్షల గన్నీ సంచులు అవసరమవుతాయని, 15 లక్షల సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. అక్టోబర్‌లో ఐకేపీ 20, పీఏసీఎస్ 95, జీసీసీ 37, ఐటీడీఏ 47 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సత్యవాణి, డీఎస్ఓ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. -
1.30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
జేసీ డి.దివ్య ఖమ్మం జెడ్పీసెంటర్: ఖరీఫ్ సీజన్లో 1.30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డి. దివ్య పేర్కొన్నారు. శనివారం పౌరసరఫరా శాఖ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో వరి సాధారణ సాగు 1,25,990 హెక్టార్లకు గాను ప్రస్తుతం 69,185 హెక్టార్లలో వరి నాట్లు వేసినట్లు వ్యవసాయశాఖ లెక్కలు ఉన్నట్లు చెప్పారు. వరి విస్తీర్ణం ఆధారంగా 3,59,762 మెట్రిక్ టన్నుల రావచ్చునని అంచనాలు వేసినట్లు తెలిపారు. ఇందులో 1.30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో 199 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. 32 లక్షల గన్నీ సంచులు అవసరమవుతాయని, 15 లక్షల సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. అక్టోబర్‌లో ఐకేపీ 20, పీఏసీఎస్ 95, జీసీసీ 37, ఐటీడీఏ 47 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సత్యవాణి, డీఎస్ఓ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఫోటోరైటప్286: మాట్లాడుతున్న జేసీ దివ్య -
కేసీ కింద వరి సాగు వద్దు
నంద్యాలరూరల్: కర్నూలు–కడప ప్రధాన కాల్వ కింద ఆయకట్టు రైతులు వరి సాగు చేయవద్దని, ఆరుతడి పంటలు వేసుకోవాలని కేసీ కెనాల్ సబ్ డివిజనల్ అధికారి ఎంజే రాజశేఖర్ కోరారు. బుధవారం నంద్యాల కేసీ కెనాల్ డీఈ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర నదికి ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వరద నీరు రాలేదని, దీంతో సుంకేసుల ఆనకట్ట ద్వారా కేసీ కెనాల్‌కు పూర్తి స్థాయిలో నీరు సరఫరా చేయడం కష్ట సాధ్యమన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తుంగభద్ర బోర్డు ద్వారా మూడు టీఎంసీల నీరు కేసీకి విడుదల చేస్తామని, ఆ నీరు తుంగభద్ర డ్యాం నుంచి సుంకేసులకు చేరుకునేందుకు రెండు రోజులు పడుతుందన్నారు. అక్కడి నుండి కేసీ కెనాల్‌కు వచ్చేందుకు మరో మూడు రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. -
ముంపు ముప్పులో వరి
పనిచేయని లింగన్నకోడు అవుట్‌ఫాల్ షట్టర్లు కిందికి వెళ్లేదారి లేక పొలాలను ముంచెత్తుతున్న వర్షపునీరు కోడూరు : వరిపంటను ముంపు బారి నుంచి రక్షించి కాపాడాల్సిన అవుట్‌ఫాల్ స్లూయిస్ షట్టర్లు పని చేయకపోవడంతో మురుగు దిగువకు పారక, సమీప పంటపొలాల్లో వేసిన నారుమళ్లు వర్షం ప్రభావంతో ముంపుబారిన పడుతున్నాయి. మండలంలోని ఉల్లిపాలెం సమీపంలోని లింగన్నకోడు మురుగు డ్రెయిన్‌కు కృష్ణాకరకట్టపై 1977 దివిసీమ ఉప్పెన అనంతరం నిర్మించిన అవుట్‌ఫాల్ స్లూయిస్ శి«థిలావస్థకు చేరింది. దీంతో మూడు సంవత్సరాల క్రితం డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా శిథిలమైన స్లూయిస్ పక్కనే మళ్లీ డ్రెయిన్‌పై నాలుగు షట్టర్లతో కూడిన నూతన అవుట్‌పాల్ స్లూయిస్‌ను నిర్మించారు. నిర్మాణ సమయంలో అధికారులు ఈ ప్రాంత స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని, కృష్ణానది వైపు స్లూయిస్‌కు ఆటోమెటిక్ షట్టర్లు అమర్చారు. ఈ షట్టర్ల వల్ల సముద్రం నీరు పోటు సమయంలో డ్రెయిన్‌లోకి రాకుండా, మురుగు ఎక్కువైతే షట్టర్లు దానంతట అవే తెరుచుకుని నదిలోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. దీంతో విశ్వనాథపల్లి, నరసింహాపురం, ఉల్లిపాలెం, జయపురం, తదితర గ్రామాల్లోని రైతులకు చెందిన సుమారు మూ డు వేల ఎకరాల్లో పంట మునకబారిన పడకుండా ఏటా వరిసాగు చేస్తున్నారు. లింగన్నకోడుకు ఎగువ భూముల్లోని కొందరు రైతులు కాలువ వెంట వచ్చే కొద్దిపాటి నీటిని నిలువరించేందుకు అవుట్‌పాల్ స్లూయిస్‌కు మళ్లీ రెండో వైపు మ్యాన్యువల్ షట్టర్లను ఏర్పాటు చేశారు. వీటి సహకారంతో ఆయిల్ ఇం జన్ల ద్వారా ఎగువ రైతులు నారుమళ్లు కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో మ్యాన్యువల్ షట్టర్లు పూర్తిగా బిగుసుకుపోయి, మురుగును కిందకు వెళ్లనివ్వడం లేదు. పట్టించుకోని అధికారులు వర్షం నీరు కిందకు వెళ్లేందుకు దారి లేక పంటపొలాల్లోకి నీళ్లు వచ్చేశాయి. దీంతో ఉల్లిపాలెం, నరసింహపురం, విశ్వనాథపల్లి, జయపురం గ్రామాల్లోని రెండు వేల ఎకరాలు ముంపుబారిన పడ్డాయని రైతులు వాపోతున్నారు. ్రyð యినేజీ అధికారులు సైతం వచ్చి షట్టర్లు చూసి వెళ్లారే తప్ప, వాటిని తొలగించే ప్రయత్నం చేయలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అవుట్‌పాల్ స్లూయిస్‌కు ఏర్పాటు చేసిన మ్యాన్యువల్ షట్టర్లు తొలగించని పక్షంలో ఈ ఏడాది వరిపంట సాగు చేసే పరిస్థితి లేదని, వీటిపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. -
మూసీ పరీవాహకంలో పెరిగిన వరిసాగు
భూదాన్ పోచంపల్లి మూసీ పరీవాహక ప్రాంతమైన పోచంపల్లి మండలంలో ఈ ఖరీఫ్‌లో వరిసాగు గణనీయంగా పెరిగింది. పిలాయిపల్లి కాలువ మరమ్మతులను పూర్తి చేసి ఇటీవల సాగునీటిని విడుదల చేశారు. ఫలితంగా కాలువ ద్వారా సాగునీరు వస్తుండడంతో మూసీ పరీవాహక గ్రామాల్లోని రైతులు బీడు భూములను సాగులోకి తీసుకువస్తున్నారు. నెల పదిహేను రోజులుగా సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే వరినాట్లు పూర్తవగా మరికొన్ని గ్రామాలోల వరిలో కలుపు తీస్తున్నారు. 25వేల ఎకరాల్లో... మండలంలో వరి సాగు క్రమంగా పెరుగుతూ వస్తుంది. రెండు, మూడేళ్ల క్రితం 12 నుంచి 15వేల వరకు వరిసాగు అయ్యేది. అధికారికంగా గత ఏడాది 16వేలు ఉండగా, ఈ ఏడాది 18వేల ఎకరాల వరిసాగువుందని అధికారులు పేర్కొంటున్నారు. కాని అనధికారికంగా మాత్రం 25వేల ఎకరాల పైగా వరి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పిలాయిపల్లి, పెద్దగూడెం, జూలూరు, కప్రాయిపల్లి, పెద్దరావులపల్లి, ఇంద్రియాల, శివారెడ్డిగూడెం, రేవనపల్లి, గౌస్‌కొండ, పోచంపల్లి, భీమనపల్లి, కనుముకుల, దంతూర్, వంకమామిడి, జలాల్పురం, జగత్పల్లి తదితర గ్రామాల్లో రైతులంతా వరిసాగు చేస్తున్నారు. లె గుళ్లను తట్టుకొనే రకాలు.. స్థానిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా ఈ సీజన్లో 900 క్వింటాళ్ల విత్తనాలు, 300 వందల మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ చేశారు. ముఖ్యంగా మూసీ నీటి వల్ల వచ్చే తెగుళ్లను తట్టుకొనే 1010, ఐఆర్ 64, తెలంగాణ సోన, బీపీటీ రకాలను రైతులు సాగు చేశారు. మూసీ నీటిలో యూరియా అధికంగా ఉండడం వల్ల వరిఏపుగా పెరిగి ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా సాగునీటి వనరులు లేని జిబ్లక్‌పల్లి, దోతిగూడెం, అంతమ్మగూడెం, హైదర్‌పూర్, బుర్రోనిబావి తదితర గ్రామాల్లో 250 ఎకరాల్లో కంది, 1000 ఎకరాల్లో పత్తి, 200 ఎకరాల్లో కూరగాయలను పండిస్తున్నారు. ఐదు ఎకరాలు వరి సాగు చేశా – నేదురు మల్లారెడ్డి, రైతు, జగత్పల్లి గతంలో మూసీ పరీవాహకంలో క్రాప్ హాలిడే ప్రకటించడంతో 3 ఎకరాలు పడావు పెట్టాను. కాని ఈ ఖరీఫ్ సీజన్లో పిలాయిపల్లి కాలువ ద్వారా నీటిని విడుదల చేయడంతో ఐదు ఎకరాలు వరిసాగు చేశాను. పిలాయిపల్లి కాలువ గ్రామం సమీపం నుంచి వెళ్తుండడంతో గతంలో కంటే ఈసారి వరిసాగు పెరిగింది. కాలువ ద్వారా సరిపోను నీళ్లు వస్తున్నాయి. వరిసాగు పెరిగింది – ఏజాజ్ అలీఖాన్, వ్యవసాయాధికారి, పోచంపల్లి మండలంలో వరిసాగు క్రమంగా పెరుగుతుంది. రైతులు 70శాతం పిలాయిపల్లి కాలువ ద్వారా, 30శాతం పంపుసెట్ల ద్వారా వరిసాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో 18వేల ఎకరాలు వరిసాగు చేశారని అంచనా వేస్తున్నాం. ఇప్పటికే ఎరువులు పంపిణీ చేశాం. రైతు చైతన్య యాత్రల ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన పెంపొందించాం. -
రైస్ మిల్లులపై డీఎస్ఓ దాడులు
కావలి: రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సిన లెవీ ఇవ్వకుండా బయట మార్కెట్లో అక్రమంగా అమ్ముకుంటున్నారన్న సమాచారంతో బుధవారం రెండు రైస్‌మిల్లులపై డీఎస్ఓ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. మద్దూరుపాడు పారిశ్రామిక వాడలో ఉన్న శ్రీమారుతి మోడరన్ రైస్ ఇండస్ట్రీస్, మండలంలోని కొత్తసత్రంలో ఉన్న మరో రైస్‌మిల్లులో డీఎస్ఓ బృందం తనిఖీలు చేపట్టింది. 5 నెలలుగా ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుంచి రైతులకు చెందిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు ప్రభుత్వం సరఫరా చేసింది. అయితే మిల్లర్లు అక్రమంగా బయట మార్కెట్లో అమ్ముకుంటున్నారని సమాచారం. ఇందులోని ఒక మిల్లరు గత సీజన్‌లోని ఇలాంటి అక్రమాలకు పాల్పడటంతో ఆ మిల్లు సేల్స్ ట్యాక్స్, ఆర్సీ, ట్రేడర్స్‌ను అధికారులు బ్యాంకులో ఉంచినట్లు తెలిసింది. దీంతో ఈ సీజన్‌కు అదే ప్రాంగణంలో మరో పేరుతో ఆర్సీ అధికారులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొత్త ట్రేడర్స్ పేరుతో ఉన్న ఆర్సీని అడ్డం పెట్టుకుని రైతుల నుంచి స్వీకరించిన బియ్యాన్ని ప్రభుత్వం ద్వారా మిల్లులకు తెప్పించుకుని బియ్యం బహిరంగ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు డీఎస్ఓకు సమాచారం అందడంతో ఆయన ఆధ్వర్యంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. మిల్లు ప్రాంగణంలో ఉన్న ధాన్యపు నట్టులను టెక్నికల్ సిబ్బంది ద్వారా కొలతలు జరుపుతున్నామని తెలిపారు. ఈ కొలతలు గురువారం కూడా జరుగుతాయని తర్వాత∙పూర్తి వివరాలు తెలియజేస్తామని ధర్మారెడ్డి చెప్పారు. డీఎస్‌ఓతో పాటు ఏఎస్ఓలు లక్ష్మీనారాయణ రెడ్డి, పుల్లయ్య, డీటీలు సురేంద్ర, హరినాథ్, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు. -
వరి నాటేందుకు డ్రమ్‌సీడర్ వాడండి
మెదక్ రూరల్: తక్కువ సమయంలో చేతికందే వరి పంటలను మాత్రమే రైతులు సాగు చేసుకోవాలని మెదక్ ఏడీఏ మనోహర తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని శమ్నాపూర్ గ్రామంలో రైతు శి„ýక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో గురువారం 8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని, ఈ ఏడు కురిసిన వర్షాల్లో ఇదే అత్యధికం అన్నారు. కాగా, వరిపంట సాగు కోసం ప్రస్తుతం నారుమళ్లు పోసుకోవద్దని, తప్పనిసరి అయితే డ్రమ్‌సీడర్ ద్వారా విత్తుకోవాలని చెప్పారు. నారుమళ్లు పోసి అధిక సమయం అయినందున నాట్లు వేసేటప్పుడు తప్పనిసరిగా వరినారు కొనలు తుంచాలని సూచించారు. లేనిపక్షంలో తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సాగు చేసేటప్పుడు పంటపై సూర్యరశ్మి పడేలా నాటును దూరంగా వేయాలన్నారు. పొలంగట్లపై ఎప్పటికప్పుడు గడ్డిని తొలగించాలని, దీనివల్ల గాలి వెలుతురు ఆడుతుందన్నారు. తుగుళ్లు సోకితే వ్యవసాయ అధికారుల సూచనలు పాటించానలన్నారు. కార్యక్రమంలో అధికారులు శైలజ, శ్రీకాంత్, సంపత్, సర్పంచ్ లింగం తదితరులున్నారు. -
కరెంట్ వైర్లు తెగి పదెకరాల్లో పంట నష్టం
స్టేషన్ ఘన్పూర్ : వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం మీడికొండ గ్రామంలో శనివారం రాత్రి వీచిన భారీ గాలులకు అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ వైర్లు తెగిపడడంతో మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకునే సరికి.... స్థానిక రైతులకు చెందిన సుమారు పది ఎకరాల్లో వరి పంట దగ్ధమైంది. అలాగే, గ్రామంలోని మామిడి తోటలకు కూడా కొంత నష్టం వాటిల్లింది. -
గంగాకావేరి నిండా ముంచింది
► ఆదుకోవాలని బాధిత రైతుల విన్నపం ► తక్కువ దిగుబడిపై ఆందోళన ► కంపెనీపై చర్య తీసుకోవాలని డిమాండ్ ఎకరాకు 18 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎకరాకు దాదాపు రూ.లక్ష వరకు ఆదాయం పొందవచ్చు అనే కంపెనీ ఏజెంట్ల మాయమాటలు నమ్మి మండలంలోని రైతులు మోసపోయూరు. గంగాకావేరి సీడ్ సాగుచేసిన రైతులు నట్టేట మునిగారు. కనీసం ఎకరాకు 3 క్వింటాళ్లు కూడా వచ్చేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి కూడా మీద పడేలా ఉందని లబోదిబోమంటున్నారు. - సైదాపూర్‌రూరల్ మండలంలోని వెన్నంపల్లి, సోమారం, ఎక్లాస్పూర్ గ్రామాల్లోని దాదాపు 30 మంది వరకు రైతులు 40 ఎకరాల్లో గంగాకావేరి సీడ్ వరివిత్తనం సాగు చేశారు. కంపెనీ ఏజెంట్లు చెప్పిన మాటలతో ఒప్పందం చేసుకున్నారు. ఎకరాలకు రూ.లక్ష వరకు ఆ దాయం వస్తుందనే ఆశతో చాలా మంది రైతులు సా గుకు ముందుకొచ్చారు. అరుుతే తీర కోత సమయూనికి వచ్చే సరికి వరి వంగడం ఎదుగలేదు. పంట చూస్తే బా గానే ఉన్న ఎకరాకు 3 క్వింటాళ్లు కూడా వచ్చేల లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.30 వేల వరకుపెట్టుబడి పెట్టినట్లు రైతులు తెలిపారు. అధికారులు స్పందించి గంగాకావేరి యూజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అన్నీ తామై.. గంగాకావేరి సీడ్ బ్రాంచ్ ఒకటి శంకరపట్నం మండలం మొలంగూర్‌లో ఉంది. సమీప గ్రామాల్లో కంపెనీ ఏజెంట్లు రైతులతో ఒప్పందాలు చేసుకుని విత్తన సాగును ప్రోత్సహిస్తున్నారు. విత్తనాల నుంచి మొదలుకుని మందులు చల్లడం, కోత వరకు అన్నీ కంపెనీ ఆధ్వర్యంలోనే చేస్తారు. క్వింటాల్‌కు రూ.5వేలు చెల్లించేలా మండలంలోని రైతులతో కంపెనీ ఏజెంట్ ఒప్పందం చేసుకుని ఆడ, మగ విత్తనాలు ఇచ్చాడు. ఆడ విత్తనాలను కంపెనీ తీసుకుంటుండగా, మగ విత్తనాలను రైతులే బయట మార్కెట్లో విక్రరుుంచుకోవాలి. ఒప్పంద సమయంలో ఎక్కువ దిగుబడి వస్తుందని నమ్మబలికన ఏజెంట్ తీర పంట పరిస్థితి అధ్వానంగా ఉండగా.. రైతులు నిలదీయడంతో తనకేమి తెలియదని తప్పించుకున్నాడు. కంపెనీ ఇచ్చిన విత్తనాలే తెచ్చానని తనకేమి సంబంధం లేదంటున్నాడని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు చేసిన రెక్కలకట్టంతోపాటు పెట్టుబడి కూడా మీద పడేలా ఉందని వారు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి సదరు కం పెనీపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయూలని కోరుతున్నారు. గంగాకావేరి సీడ్స ప్రొడక్షన్ ఇన్చార్జి సంపత్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. వాతావరణం అనుకూలించాలన్నారు. దిగుబడి ఎంత వస్తుందనేది వరికోత ముగిసిన తర్వాతే చెప్పవచ్చని తెలిపారు. రూ.లక్ష అప్పుతెచ్చిన రెండెకరాల్లో ఆడమగ గంగాకావేరి సీడ్ సాగు చేసిన. పెట్టుబడి రూ.50వేల వరకు అరుు్యంది. చేతికందే దశలో బావిలో నీళ్లు తగ్గడంతో రూ.70వేలు అప్పుచేసి రెండు గజాల లోతు తవ్వించి పొలం కాపాడుకున్న. ఇప్పుడు గొలుసుకు మూడు, నాలుగు గింజలు కూడా లేవు. రెండెకరాలు కోస్తే ఐదు క్వింటాళ్లు కూడా అచ్చేలా లేవు. అప్పులు తీర్చే మార్గం లేదు. ఏమి చేయాలో అర్థమైతలేదు. - మ్యాకల రాజిరెడ్డి, వెన్నంపల్లి మోసం చేసిండ్రు గంగాకావేరి సీడ్ యజమానులు, సూపర్వైజర్లు అంతా కలిసి మమ్ములను మోసం చేసిండ్రు. ఎకరానికి 20 క్వింటాళ్ల దాకా దిగుబడి అత్తదన్నరు. కానీ మూడు క్వింటాళ్లు కూడా అచ్చేలా లేదు. అప్పులు చేసి పంటల సాగు చేస్తే దిగుబడి రాక అప్పలే మిగిలేల ఉన్నారుు. అధికారులు సీడ్ యజమానులపై చర్యలు తీసుకోవాలి - పెసరి తిరుపతి, లస్మన్నపల్లి -
సన్నగిల్లిన సాగు
1167 హెక్టార్లకే పరిమితం అయిన వరి ఆశించిన స్థాయిలో కురవని వర్షాలు దిక్కుతోచని స్థితిలో రైతులు విజయనగరంఫోర్ట్: రబీలో వరి సాగు జిల్లాలో ప్రశ్నార్థకంగా మారింది. సాధారణ విస్తీర్ణంలో సగం కూడా వరి సాగు అవలేదు.గత ఏడాది కంటే ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. వేరుశెనగ,నువ్వులు పంటలదీ అదే పరిస్థితి. రైతులు ఖరీఫ్‌లో వరి పంటను ఎక్కువగా సాగు చేస్తారు. గత మూడేళ్లుగా రబీలో కూడా వరి సాగుకు ఆశక్తి చూపుతున్నారు. బోర్లు, బావులు ఉన్న ప్రాంతంలో వరి పంటను వేస్తారు. అదేవిధంగా పెద్ద పెద్ద చెరువుల్లో నీరు పుష్కలంగా ఉంటే రబీలో వరి పంటను వేస్తారు. కానీ గత ఏడాది సెప్టెంబర్ నెల తర్వాత జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో చెరువులు, గుంతలు అడుగంటాయి. 1167 హెక్టార్లకే పరిమితమైన వరి పంట వరి సాధారణ విస్తీర్ణం 5577 హెక్టార్లు కాగా 1167 హెక్టార్లకే పరిమితం అయింది. సాధారణ విస్తీర్ణంలో సగం కూడా సాగవలేదు.గత ఏడాది రబీలో వరి సాధారణ విస్తీర్ణం 5242 హెక్టార్లు కాగా 5357 హెక్టార్లలో సాగైంది. రాలనిచినుకు గత ఏడాది సెప్టెంబర్ నెల సన్నగిల్లిన సాగు తర్వాత జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు, దీంతో చెరువులు, గుంతల్లో నీరు అడుగుంటింది. నీరు లేకపోవడంతో రైతులు వరిపంటను సాగు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఆక్టోబర్ నెల సాధారణ వర్షపాతం 167.9మీ.మీ కాగా 51.5 మి.మీ నమోదైంది. నవంబర్ నెల సాధారణ వర్షపాతం73.3 మి.మీ కాగా 43.7 మి.మీ నమోదైంది. డిసెంబర్ నెల సాధారణ వర్షపాతం 4.6 మీ.మీ కాగా 3.9 మీ.మీ నమోదైంది. జనవరి నెల సాధారణ వర్షపాతం 9.9 మి.మీ కాగా 0.6 మి.మీ నమోదైంది. ఎండుతున్న పంటలుచెరువుల్లో నీరు లేకపోవడంవల్ల ఇప్పటికే సాగులో ఉన్న కూరగాయలు, నువ్వు, చోడి, వేరుశెనగ వంటి పంటలు ఎండుతు న్నాయి. దీంతో పంటలను ఏవిధంగా కాపాడుకోవాలో తెలియక రైతులు మధనపడుతున్నారు. మిరప, టమాటో, బెండ, చోడి పంటలను కాపాడుకోవడానికి రైతులు ట్యాంకర్లు, కావిళ్లతో నీటిని తెచ్చితడుపుతున్నారు. బావుల్లో కూడా నీరు తక్కువగా ఉండడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. పంటలు వేయడం మానుకున్నాను. గత ఏడాది చెరువులో నీరు ఉండడం వల్ల చోడి పంటను వేశాను. ఈఏడాది వేయాలనుకున్నాను. కానీ చెరువులో నీరు లేకపోవడంతో వేయలేదు. 10 సెంట్లలో మిరప పంట వేశాను. పూత రాకముందే చెరువు అడుగంటడంతో దూర ప్రాంతం నుంచి నీటిని కావిడితో తెచ్చి తడుపుతున్నాను.ఎస్.రామునాయుడు, రైతు, పెదవేమలి -
నాణ్యత పేరుతో దోపిడీ!
- వరి ధాన్యానికి దక్కని ‘మద్దతు’ - క్వింటాలుకు సగటు ధర రూ.1,250 - తాండూరు మార్కెట్లో వ్యాపారుల మాయ! తాండూరు: సాధారణ రకం వరి ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతుకు ప్రభుత్వ మద్దతు ధర లభించడం లేదు. నాణ్యతాప్రమాణాల పేరుతో అన్నదాతలను వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ‘మద్దతు’ లభించక పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కమిటీ అధికారుల ఊదాసీన వైఖరితో యార్డులో కొందరు కమీషన్ ఏజెంట్లు ఇష్టానుసారంగా పంటకు ధర నిర్ణయించడం వల్ల రైతాంగానికి మేలు జరగడం లేదు. ఈనెల మొదటి వారం నుంచి మార్కెట్ యార్డులో రబీ ధాన్యం కొనుగోళ్లు ఆరంభమయ్యాయి. తాండూరు నియోజకవర్గం పరిధిలోని యాలాల, బషీరాబాద్, తాండూరు,పెద్దేముల్ మండలాలతోపాటు సరిహద్దులోని మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రైతులు వరి ధాన్యాన్ని విక్రయించేందుకు తాండూరు మార్కెట్‌కు తరలిస్తున్నారు. పట్టణంలోని పౌరసరఫరాల గోదాంలో డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా డబ్బుల చెల్లింపులో జాప్యం జరుగుతుందనే కారణంతో చాలా మంది రైతులు మార్కెట్ యార్డుకే ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. సాధారణ వరి ధాన్యానికి మద్దతు ధర రూ.1,360 చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఇప్పటివరకు యార్డులో వివిధ గ్రామాల రైతుల నుంచి కమీషన్ ఏజెంట్లు సుమారు 13,463 క్వింటాళ్ల ధాన్యాన్ని కొన్నారు. క్వింటాలుకు గరిష్టంగా రూ.1,300, కనిష్టంగా రూ.1,200, సగటు ధర రూ.1,250 మాత్రమే పలికింది. ఈ మూడు ధరలను పరిశీలించినా కనీస మద్ధతు ధర రైతులకు లభించలేదని స్పష్టమవుతోంది. ఈ ధరల ప్రకారం రైతులు క్వింటాలుకు రూ.60 నుంచి రూ.160 వరకు నష్టపోయారు. నాణ్యతాప్రమాణాలు లేనందుకే మద్దతు ధర పలకడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నాణ్యత పేరుతో రైతన్నల శ్రమ దోపిడీకి గురవుతున్నా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం గమనార్హం. -
వరికి కనీస మద్దతు ధర పెంచాలి: దత్తాత్రేయ
ప్రస్తుతం రూ.1400 గా ఉన్న వరి కనీస మద్దతు ధరను రూ.1800కు పెంచాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. బుధవారం కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్ఆన్ ను కలిసిన ఆయన ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని అందించారు. మద్దతు ధరలేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, పెంపుపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని రాజకీయాలకు అతీతంగా అంతమొందించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందని విస్మయం వ్యక్తం చేశారు. -
టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చూపించారు
-
వరి.. సరి..
రాష్ట్రంలో రబీలో తగ్గిన సాగు సాక్షి, హైదరాబాద్: ఈ సారి రబీలో రైతులు వరి వైపు చూడలేదు. రబీలో సహజంగా 6.5 లక్షల హెక్టార్లలో వరి సాగు జరుగుతుంది. ఈ సారి ఇప్పటివరకు 45 వేల హెక్టార్లలోనే వరి సాగు చేశారు. నీటి వనరులు ఉన్నచోటే వరి సాగు జరి గింది. ఎక్కువగా జొన్న పంట వేశారు. ఆరుతడి పంటలే వేయాలని వ్యవసాయ శాఖ చేసిన ప్ర చారం ఫలితాన్నిచ్చింది. రబీలో 61 వేల హెక్టార్లలో జొన్న సాగు చేయాల్సి ఉండగా 48 వేల హెక్టార్లలో సాగు చేశారు. మొక్కజొన్న 1.52 లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా 99 వేల హెక్టార్లలో సాగు చేశారు. ఆహారధాన్యాలు 10.41 లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండ గా 2.98 లక్షల హెక్టార్లలోనే సాగయింది. తీవ్ర నీటి ఎద్దడి కారణంగా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇదిలావుండగా వర్షపాత లోటు తీవ్రంగా ఉండడంతో కరువుఛాయలు కనిపిస్తున్నాయి. గత అక్టోబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు రబీ సీజన్లో (బుధవారం నాటికి) 61 శాతం వర్షపాత లోటు నమోదైంది. అంటే తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరువు ఛాయలు రాష్ట్రాన్ని కమ్మేశాయని వ్యవసాయశాఖ నివేదిక లో స్పష్టంచేసింది. -
కొనుగోళ్లలో లక్ష్యం చేరేనా?
* నీరసించిన ఖరీఫ్ ధాన్యం సేకరణ సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం జరుపుతున్న ధాన్యం కొనుగోళ్లు నిర్దిష్ట లక్ష్యాలను చేరేలా కనిపించడం లేదు. కొనుగోళ్లు ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు 9 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు మాత్రమే జరిగాయి. ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ ఆరంభమైన నేపథ్యంలో ఇంకా దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు కష్టమేనని తెలుస్తోంది. రాష్ట్రంలో బియ్యం లెవీని 75 శాతం నుంచి 25 శాతానికి తగ్గించిన దృష్ట్యా మిల్లర్లు కొనుగోళ్లను తగ్గించే అవకాశం ఉందని గుర్తించిన ప్రభుత్వం తానే స్వయంగా కొనుగోళ్లు చేసేందుకు సంకల్పించింది. 14.87 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న పౌర సరఫరాల శాఖ ఇందుకోసం 2,130 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు విస్తీర్ణమే 25శాతం తగ్గగా... విద్యుత్ కోతలు, నీటి నిల్వలు అడుగంటడంతో ధాన్యం ఉత్పత్తీ ఆశించినమేర రాలేదు. ఇదిలాఉండగా, బియ్యం లెవీని తగ్గించినా మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులు ప్రభుత్వంతో పోటీపడి బహిరంగ మార్కెట్లో కొనుగోళ్లు జరిపారు. ప్రభుత్వ రంగ సంస్థల మాదిరే మద్దతు ధర చెల్లించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా 9 లక్షల మెట్రిక్ టన్నుల మేర కొనుగోళ్లు జరపగా, మిల్లర్లు సైతం మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరిపినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లో ఆన్లైన్లో మద్దతు ధర చెల్లించడంలో ప్రభుత్వం చేసిన జాప్యం సైతం రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించేందుకు కారణంగా చెబుతున్నారు. ఇక వరిసాగు ఆశించిన మేర జరగని ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు పూర్తిగా నీరసించిపోయాయి. రెండు జిల్లాల్లో మొత్తం కొనుగోళ్లను కలుపుకున్నా 50 వేల మెట్రిక్ టన్నులకు మించలేదు. ఖరీఫ్ ఆలస్యంగా మొదలైన చోట ప్రభుత్వం మరిన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని అంచనా వేసినా అది లక్ష మెట్రిక్ టన్నులను మించి ఉండడం సాధ్యం కాదని పౌర సరఫరాల శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కొనుగోళ్లు పూర్తిగా ముగిసిన అనంతరం కారణాలపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. -
‘జైశ్రీరాం’ వరికి పెరుగుతున్న డిమాండ్
మోర్తాడ్: సన్నరకంలో మరింత సన్నగా ఉండే జై శ్రీరాం రకం వరికి డిమాండ్ పెరుగుతోంది. ప్రైవేటు విత్తన కంపెనీలు ఐదేళ్ల కింద జై శ్రీరాం రకం వరి విత్తనాలను ఉత్పత్తి చేశాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూ ర్ సబ్ డివిజన్లోని రైతులు దీనిని ఎక్కువగా సాగు చేశారు. సాధారణంగా సన్న రకాల్లో బీపీటీ, హెచ్ఎంటీ రకాలకు భారీగా డిమాండ్ ఉంటుంది. జై శ్రీరాం రకం బీపీటీ, హెచ్‌ఎంటీల కంటే సన్నగా ఉండటంతో ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. బీపీటీ, హెచ్ఎంటీ ల ధర అంతంతమాత్రమే. జై శ్రీరాం రకానికి మాత్రం పెరుగుతోంది. మార్కెట్ ఆరంభమైన మొదట్లో క్వింటాలుకు రూ.1,600 నుంచి రూ.1,750 పలికిన ధర ఇప్పుడు రూ. 2,200కు చేరింది. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సన్న రకాలను దాదాపు 70 వేల హెక్టార్ల వరకు సాగు చేశారు. జై శ్రీరాం రకాన్ని ఎనిమిది వేల ఎకరాల వరకు పండించారు. బీపీటీ, హెచ్‌ఎంటీలు ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి లభిస్తే జై శ్రీరాం రకం 15 నుంచి 25 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వస్తుంది. జై శ్రీరాం క్వింటాల్ ధర రూ. 2,300 ఉంది. ఈ రకం బియ్యం క్వింటాల్‌కు రూ. 5,200కు పైగా ఉంది. -
మెలకువలు పాటిస్తే.. నాణ్యమైన ధాన్యం
పాటించాల్సిన సూచనలు వరి గింజలన్నీ బంగారు రంగులోకి వచ్చిన తర్వాతే కోతలు ప్రారంభించాలి. వరి కోతకు ముందు పొలంలో ఉన్న కల్తీ మొక్కలను తీసివేయాలి. కోతకు 15 రోజుల ముందే నీటి తడులు ఆపివేయాలి. 1010 వంటి రకం వరి బంగారం వర్ణంలోకి వచ్చే వరకు ఆగితే గింజలన్నీ రాలిపోతాయి. ఈ ఒక్క రకాన్ని మాత్రం గోధుమ రంగులోకి రాగానే కోయాలి. కోసిన వరి మొదలును నాలుగు రోజుల పాటు ఎండనివ్వాలి. అనంతరం ఒక్కో రకం వరికి వేరు వేరు కల్లాలు చేసి, వాటిపై పరదాలు వేసి వరి మొదలు పెట్టి ట్రాక్టర్‌తో తొక్కించాలి. ఒక రకానికి చెందిన వరి ధాన్యాన్ని మరొక రకం వరి ధాన్యంతో కలుపరాదు. పొలం వద్దే సరైన గ్రేడింగ్ చేయాలి. గడ్డిని తీసివేసి గింజలన్నీ కుప్పగా పోసి గాలి పంకల సహాయంతో తాలు లేకుండా శుభ్రంగా తూర్పార పట్టాలి. 13 శాతం తేమ ఉండే వరకు ఆరబెట్టి గోనె సంచుల్లో పోయాలి. హార్వెస్టర్‌తో కోస్తే మొదటిసారి పోసే డబ్బాను వేరుగా పోయాలి. ఆ తరువాత కోసినవన్నీ ఒకచోట పోయాలి. ఇలా చేయడం ద్వారా కల్తీ ప్రమాదం తప్పుతుంది. వరి గింజలన్నీ సిమెంటు కల్లాలపై లేదా టార్పాలిన్ షీట్లపై ఆరబెట్టా లి. రోజుకు మూడుసార్లు బాగా ఎండేలా కాళ్లతో కలియదున్నాలి. పంట కోశాక సరిగా ఆరబెట్టకపోతే గింజలకు తెగుళ్లు సోకి, రంగుమారి, పంట నాణ్యత తగ్గే ప్రమాదం ఉంది. పంటను ఆరబెట్టే సమయంలో రాళ్లు, మట్టిపెళ్లలు, చెత్త, చెదారం వంటి వ్యర్థ పదార్థాలు చేరకుండా జాగ్రత్త వహించాలి. నిల్వ చేసే పక్షంలో గోనె సంచులను కింద వేయకుండా బల్లలు పరిచి వాటిపై బస్తాలు నెట్టుగా వేయాలి. పురుగులు ఆశించకుండా లీటరు నీటిని 5 మిల్లీలీటర్ల మలాథియన్ మందును కలిపి బస్తాలపై పిచికారి చేయాలి. ఎలుకల నుంచి రక్షించుకోవడానికి బస్తాల నెట్టుల మధ్య జింక్పాస్ఫైట్ ట్యాబ్లెట్లు ఉంచాలి. ఒకరోజు తలుపులు పూర్తిగా మూసివేసి గాలి చొరబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేయడంతో ఎలుకలు లేకుండాపోతాయి. మరుసటి రోజు నుంచి తలుపులు తీయవచ్చు. -
పత్తి, వరిలో...తెగుళ్ల నివారణ ఇలా..
కందుకూరు: జిల్లా పరిధిలో సాగులో ఉన్న పత్తి, వరి పైర్లలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో తెగుళ్లు ఆశించి రైతులు సతమతమవుతు న్నారు. ఆ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల్ని గురించి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు ఎన్.ప్రవీణ్, సీహెచ్.చిరంజీవి, పి.అమ్మాజీ రైతులకు సూచనలు, సలహాలు అందించారు. పత్తిలో.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి పంటలో నల్లమచ్చ తెగులు ఆశించినట్లు గుర్తించడమైంది. ఈ తెగులు ఆశిస్తే కోణాకారంలో నూనె రంగు మచ్చలు ఏర్పడి తర్వాత మూడవ దశలో ఆకుల ఈనెల ద్వారా తెగులు వ్యాపించి నల్లగా మారుతుంది. దీనిని బ్లాక్ ఆర్మ్ అని పిలుస్తారు. ఉద్ధృతిని బట్టి 3, 4 పర్యాయాలు 15 రోజుల వ్యవధిలో 10 లీటర్ల నీటికి 1 గ్రా. పౌషామైసిన్ లేదా ప్లాంటోమైసిన్ మరియు కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. పలు చోట్ల పత్తిలో బూడిద తెగులు ఆశించింది. ఆకుల మీద కోణాకారపు మచ్చలు ఏర్పడి బూడిద తెగులు బీజాలు ఆకుల అడుగు భాగాన ఏర్పడతాయి. క్రమేపీ ఆకుల పై భాగాలకు కూడా వ్యాపించి ఆకులు పసుపు రంగులోకి మారి పండు బారి రాలిపోతాయి. దీని నివారణకు లీటర్ నీటికి నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేదా 1 గ్రా. కార్బండిజం కలిపి పిచికారీ చేయాలి. పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు 1 గ్రా. ఎసిఫెట్ లేదా 2 మి.లీ. ప్రిఫోనిల్ మందును కలిపి పిచికారీ చేయాలి. వరిలో... చాలా ప్రాంతాల్లో వరిలో కంకినల్లి మరియు గింజమచ్చ తెగులు ఆశించింది. నివారణ చర్యలు చేపట్టకపోతే గింజ పట్టే దశలో ఉన్న పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీని నివారణకు 2 మి.లీ ప్రొఫినోఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.4 మి.లీ. క్లోరాజోన్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సుడి దోమ బాగా ఆశిస్తోంది. నివారణకు పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి. ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ. కాలి బాటలు వదలాలి. ముందుగా పొలంలో నీటిని తీసి వేసి మొదలు తడిచే విధంగా ఇథోపెన్ ప్రాక్ట్ 1.5 మి.లీ. లేదా ఎసిఫెట్ 1.5 గ్రా. మరియు డైక్లోరోవాస్ 1.0 మి.లీ. లేదా బుప్రొజిన్ 1.6 మి.లీ. లీటర్ నీటికి కలిపి అవసరం మేరకు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. -
బ్రహ్మదేవరచేనులో ఏనుగుల బీభత్సం
చిత్తూరు : చిత్తూరు జిల్లా ప్రజలకు ఏనుగుల బెడద తప్పటం లేదు. తాజాగా రామకుప్పం మండలం బ్రహ్మదేవరచేను గ్రామ శివారులోని పంట పొలాలపై ఏనుగులు గత అర్థరాత్రి దాడి చేశాయి. పంటలను పూర్తిగా నాశనం చేశాయి. ఏనుగుల దాడిలో వరి పంటతో పాటు అరటి, చెరకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పు చేసి సాగు చేసిన పంటలను ఏనుగులు పొట్టనపెట్టుకుంటున్నాయని, అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. సోలార్ కంచె ఏర్పాటు చేసినా ఏనుగులు లెక్కచేయటం లేదని, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏనుగుల దాడితో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. -
పంటలు నీటి పాలు.. ఇళ్లు మట్టిపాలు
సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాను అన్నదాతలను నిట్టనిలువునా ముంచేసింది. వరి, చెరకు తదితర పంటలు నీటిపాలు కాగా కొబ్బరి, జీడిమామిడి, మామిడి చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టం రోజురోజుకూ పెరుగుతుండటం విపత్తు తీవ్రతకు నిదర్శనం. శుక్రవారం మధ్యాహ్నానికి రాష్ట్ర ప్రభుత్వానికి అందిన గణాంకాల ప్రకారమే 6.06 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. దీనివల్ల 13.51 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ దిగుబడులు పడిపోనున్నాయి. 7.24 లక్షల కొబ్బరి, మామిడి, జీడిమామిడి తదితర చెట్లు పడిపోవడం వల్ల తగ్గే దిగుబడి దీనికి అదనం. ఇది ప్రాథమిక అధికారిక అంచనా మాత్రమే. వాస్తవ నష్టం దీనికి రెట్టింపు మించి ఉంటుందని, క్షేత్రస్థాయిలో నష్టాల మదింపు తర్వాత అసలు నష్టం వెల్లడవుతుందని అధికారులంటున్నారు. తుపాను ధాటికి పూరి గుడిసెలతో కలిపి అధికారిక లెక్కల ప్రకారమే 43,531 ఇళ్లు నేలమట్టమయ్యాయి. క్షేత్రస్థాయి ఎన్యూమరేషన్ పూర్తయ్యే సరికి కూలిన ఇళ్ల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఇక 2.41 లక్షల కోళ్లు, బాతులు తుపానువల్ల మృత్యువాత పడ్డాయి. 2,612 కి.మీ.పొడవునా రోడ్లు కొట్టుకుపోయాయి. 73 గ్రామాలకు రవాణా సౌకర్యం దెబ్బతింది. 86 నీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయి. అధికారిక లెక్కల ప్రకా రం గురువారానికి 35గా ఉన్న తుపాను మరణాల సంఖ్య శుక్రవారానికి 38కి పెరిగింది.