284 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు | 284 rice paddy purchase shops | Sakshi
Sakshi News home page

284 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

Published Wed, Oct 5 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

284 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

284 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

జాయింట్‌ కలెక్టర్‌ సత్యనారాయణ 
అమలాపురం : ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లాలో 284 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ వెల్లడించారు. డిమాండ్‌ను బట్టి అవసరమైతే ప్రజాప్రతిని««దlుల సూచనల మేరకు కేంద్రాల సంఖ్య పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో డివిజన్‌లోని తహసీల్దార్లతో బుధవారం జరిగిన సమీక్షా సమావేశానికి జేసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్డీవో జి.గణేష్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జేసీ సత్యనారాయణ నీటి తీరువా వసూలు, ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు, రుణ అర్హత కార్డులు, పౌ ర సరఫరా, ఈ–పాస్‌ పుస్తకాలు తది తర అంశాలపై సమీక్షించారు. నవంబర్‌ ఒకటో తేదీ నుంచి కేంద్రాల్లో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని తెలిపారు. పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ ఎ.కృష్ణారావు మాట్లాడుతూ ఖరీఫ్‌ ధాన్యానికి పెంచిన కనీస మద్దతు ధరపైన... ధాన్యం కొనగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసింది వంటి వివారాలపై గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం చేయాలని తహసీల్దార్లకు సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని పారామీటర్ల ప్రకారం జిల్లా రెవెన్యూ శాఖ రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని తెలిపారు.  రెవెన్యూ సిబ్బంది ఈ సమయంలోనే అంకిత భావంతో పనిచేస్తే ప్రథమ స్థానానికి వెళ్తామన్నారు. నీటి తీరువా పన్ను వసూళ్లలో కూడా రెండో స్థానంలో ఉందని చెప్పారు. నవంబర్‌ 15 నాటికి నీటి తీరువా నూరు శాతం వసూలు చేయాలని జేసీ ఆదేశించారు. రుణ అర్హత కార్డులపై జిల్లాలో ఇప్పటి వరకూ రూ.97 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. ఈ విషయంలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. రెవెన్యూ సేవల పరంగా జిల్లాను రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలోనూ... కొన్ని అంశాల్లో ప్రథమ స్థానంలోనూ ఉన్నందుకు ఆర్డీవో గణేష్‌కుమార్, తహసీల్దార్లను జేసీ సత్యనారాయణ అభినందించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement