
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్. చైనాలోని గువాంగ్‌డాంగ్ ప్రావిన్స్ డోంగువాన్ నగరంలో ఉన్న ఈ మాల్ పేరు ‘న్యూ సౌత్ చైనా మాల్’. దీనిని 2005లో ప్రారంభించారు. మొత్తం 96 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. దీనిలోని దుకాణాల విస్తీర్ణమే 71 లక్షల చదరపు అడుగులు. తొలి పదేళ్లు ఈ మాల్ దాదాపు 99 శాతం ఖాళీగానే ఉండేది.
నిర్మాణంలో మార్పులు చేపట్టాక 2018 నుంచి దీని పరిస్థితి కొంత మెరుగుపడింది. ఇందులో ఐమాక్స్ థియేటర్లు, విశాలమైన పిల్లల ఆటస్థలం చూడటానికే ఎక్కువమంది వస్తుంటారు. ఈ మాల్‌లోని ఏడు జోన్‌లను ప్రపంచంలోని ఏడు అంతర్జాతీయ ప్రాంతాల శైలిలో నిర్మించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment