
కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడుకునేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. టీకా వేసుకునేందుకు ప్రజలను పోత్సహించేందుకు అమెరికాలోని లూసియానా రాష్ట్ర రాజధాని బాటన్ రో సిటీలో లాటరీ ద్వారా నగదు, స్కాలర్‌షిప్ ఇవ్వనున్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీపంప్‌హౌస్ నుంచి నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఏపీలో రెండు నెలల విరామం అనంతరం మత్స్యకారులు వేటకు రెడీ అయ్యారు. ఇలాంటి మరిన్ని ‘చిత్ర’ విశేషాలు ఇక్కడ చూడండి.

కొండ కోనల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగించే గిరిపుత్రులు సాగు కోసం పచ్చని గుట్టల నడుమ ఇలా భూమిని చదును చేసుకున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం సాలెగూడకు చెందిన అడవి బిడ్డలు వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో విత్తనాలు విత్తుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. – చింతల అరుణ్‌రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్

రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రం సమీపంలోని సర్ధాపూర్ వ్యవసాయ మార్కెట్‌లోని గోదాంలకు ధాన్యంతో వచ్చిన లారీలు వచ్చినట్టే నిలిచిపోయాయి. ధాన్యం లోడ్‌తో వచ్చి నాలుగైదు రోజులు గడుస్తున్నా, అన్‌లోడింగ్ కాకపోవడంతో శుక్రవారం ఇలా దాదాపు డెబ్భై లారీల వరకు నిలిచిపోయాయి. – వంకాయల శ్రీకాంత్, సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్న సిరిసిల్ల జిల్లా

గత కొన్ని రోజులుగా వర్షాలు పలకరిస్తుండటంతో... రైతన్నలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రానికి సమీపంలో రైతులు కాడెడ్లతో దున్నుతూ మొక్కజొన్న, పత్తి విత్తనాలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. – ఫొటోలు: కె.సతీష్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లిలోని కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీపంప్‌హౌస్ నుంచి నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఆరు మోటార్లతో ఎత్తిపోయగా.. మూడు రోజుల్లో అన్నారం (సరస్వతీ) బ్యారేజీకి 1.5 టీఎంసీలు తరలిపోయినట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.

కడలి అలలను దాటుకుని చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు లేక బోసిపోయిన తీరంలో సందడి మొదలైంది. రెండు నెలల విరామం అనంతరం మత్స్యకారులు వేటకు సిద్ధమయ్యారు. సంద్రంలోకి సామగ్రితో వెళ్లి వేట సాగించారు. వలల నిండా చేపలతో తిరిగొచ్చారు. అమ్మకాలు అనంతరం ఆనందంగా ఇంటిబాట పట్టారు. కళింగపట్నం, బందరువానిపేట తీరాలు ఇలా మత్స్యకారులతో సందడిగా కనిపించాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం

విజయవాడ స్టేషన్ నుంచి రోజూ లక్షల సంఖ్యలో ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో హరిత స్టేషన్‌గా మలిచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించే విధంగా సౌర విద్యుత్‌ను కొన్ని ప్లాట్‌ఫామ్‌లకు వినియోగిస్తున్నారు. ప్లాట్‌ఫామ్ టాప్‌లపై సోలార్ ప్యానళ్లను అమర్చి సూర్యరశ్మి ద్వారా విద్యుత్ తయారు చేసి, ప్లాట్‌ఫామ్ అవసరాలకు వినియోగిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

ముంబైలో శుక్రవారం అరేబియా సముద్రంలోకి డైవ్ చేస్తున్న చిన్నారులు

లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో శుక్రవారం ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద పర్యాటకుల సందడి

ముంబైలోని విలే పార్లే తూర్పు ప్రాంతంలోని బాబాసాహెబ్ గాడే ఆస్పత్రిలో కోవిడ్ టీకా వేస్తున్న దృశ్యం

కోవిడ్ ఆంక్షలను క్రమంగా ఎత్తేస్తున్న నేపథ్యంలో న్యూయార్క్‌లోని ప్రఖ్యాత ఎడ్జ్ అబ్జర్వేషన్ డెక్ మీద యోగా అభ్యసిస్తున్న ఔత్సాహికులు. ఈ డెక్ పశ్చిమార్ధగోళంలోనే అత్యంత ఎత్తయిన(1,141 అడుగుల ఎత్తులో ఉన్న) ఔట్‌డోర్ స్కై డెక్.

కోవిడ్ టీకాలు తీసుకున్న వారికి లాటరీలో పాల్గొనే అవకాశమిస్తామంటూ అమెరికాలోని లూసియానా రాష్ట్ర రాజధాని బాటన్ రో సిటీలో భారీ చెక్‌ను ఆవిష్కరిస్తున్న గవర్నర్ జాన్ తదితరులు. లాటరీలో గెలిచిన వారికి నగదు బహుమతితోపాటు స్థానికులకు స్కాలర్‌షిప్‌లను అందజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment