Vijayawada railway station
-
విజయవాడ రైల్వేస్టేషన్లో దారుణ హత్య
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ రైల్వే స్టేషన్లో దారుణ హత్య జరిగింది. విధుల్లో ఉన్న లోకో పైలట్‌ను ఓ ఆగంతకుడు ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. షంటింగ్ లోకో పైలట్‌గా పని చేస్తున్న డి.ఎబినేజర్ (52) గురువారం తెల్లవారుజామున విధుల్లో భాగంగా నైజాంగేటు సమీపంలోని ఏటీఎల్‌సీ కార్యాలయం నుంచి ఎఫ్–క్యాబిన్ వద్దకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అతని వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. రాడ్‌తో పలుమార్లు కొట్టడంతో తీవ్ర గాయాలైన ఎబినేజర్ అపస్మారక స్ధితిలో రైలు ట్రాక్‌పై పడిపోయాడు. దూరం నుంచి దీనిని గమనించిన మరో లోకో పైలట్ వృధ్వీరాజ్ పరుగున అక్కడికి వచ్చారు. సమీపంలో ఉన్న వారితో కలిసి ఎబినేజర్‌ను రైల్వే హాస్పటల్‌కు తరలించారు. పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఒక ప్రైవేటు హాస్పటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయవాడ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదు బృందాలతో నిందితుని కోసం గాలింపు చర్యలు చేçపట్టారు. రైల్వే స్టేషన్ పరిసరాలలోని సీసీ టీవీ ఫుటేజ్‌ల ద్వారా దాడికి పాల్పడిన నిందితుడిని గుర్తించారు. ఆ వ్యక్తే నైజాంగేటు సెంటర్లో ఆటోలో నిద్రిస్తున్న వ్యక్తిపై కూడా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతను గంజాయి మత్తులో ఈ దాడులకు పాల్పడుతుండవచ్చని చెబుతున్నారు. -
విజయవాడ రైల్వేస్టేషన్‌కు ఎన్ఎస్జీ–1 హోదా
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే స్టేషన్ భారతీయ రైల్వేలోనే ఎంతో ప్రతిష్టాత్మక ఎన్ఎస్జీ–1 (నాన్ సబర్బన్ గ్రూప్) హోదా సాధించి దేశంలోనే టాప్ 28 స్టేషన్లలో ఒకటిగానూ, దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ తరువాత రెండో స్టేషన్‌గా అరుదైన ఘనత సాధించింది. రైల్వేబోర్డు 2017–18 సంవత్సరం నుంచి ప్రతి ఐదేళ్లకోసారి స్టేషన్ల కేటగిరీ ఎంపిక విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానంలో రూ.500 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం లేదా 20 మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న స్టేషన్లకు ఎన్ఎస్జీ–1 హోదా వస్తుంది. అప్పట్లో విజయవాడ స్టేషన్ రెండు ప్రమాణాలలో తక్కువగా ఉండటంతో ఎస్ఎస్జీ–2 హోదాతో సరిపెట్టుకుంది. ఐదేళ్ల తరువాత 2023–24లో రైల్వేబోర్డు తాజా సమీక్షలో విజయవాడ స్టేషన్ అత్యధికంగా రూ. 528 కోట్ల వార్షిక ఆదాయం, 16.84 మిలియన్ల ప్రయాణికులను కలిగి ఉండడంతో రైల్వేశాఖ ఎన్ఎస్జీ–1 హోదా ప్రకటించింది. డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ మాట్లాడుతూ విజయవాడ డివిజన్‌కు ప్రతిష్టాత్మక ఎన్ఎస్జీ–1 హోదా రావటం గర్వకారణమన్నారు. వ్యాపార, వాణిజ్య పరంగా డివిజన్ ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రయాణికుల అవసరాల మేరకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. -
విజయవాడ నుంచి ఢిల్లీకి ‘అమృత్ కలశ్’ ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): నా భూమి.. నా దేశం ప్రచారంలో భాగంగా శనివారం విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి అమృత్ కలశ్యాత్ర ప్రత్యేక రైలు బయలు దేరింది. పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ జెండా ఊపి రైలును సాగనంపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు నిర్వహిస్తున్న అజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ‘నా భూమి.. నా దేశం’ పేరుతో అక్టోబర్ 30, 31 తేదీలలో దేశ రాజధాని ఢిల్లీలో ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 1,100 మంది వలంటీర్లు 824 కలశాలతో రైలులో బయలు దేరారు. ఈ సందర్భంగా 750 మంది విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 1.5. కి.మీ. పొడవు జాతీయ జెండాతో భారత్ మాతాకు జై.. అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. -
పట్టాలెక్కిన విజయవాడ–చెన్నై వందేభారత్ రైలు
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ–చెన్నై, కాచిగూడ–యశ్వంతపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆదివారం పట్టాలు ఎక్కాయి. దేశవ్యాప్తంగా 9 వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ పాల్గొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపైకి చేరుకున్న వందేభారత్ రైలుకు 1,500 మందికిపైగా విద్యార్థులతో కలసి రైల్వే అధికారులు హర్షాతిరేకాలతో స్వాగతం పలికారు. కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ మాట్లాడుతూ..మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భార్ భారత్, ఇండియా ఫస్ట్ ఇనీషియేటివ్స్ ఆఫ్ ది నేషన్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో సొంత సాంకేతిక పరిజ్ఞానంతో వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలును తయారు చేయడం దేశం సాధిస్తోన్న ప్రగతికి నిదర్శనమన్నారు. 9 నెలల్లోనే ఏపీకి 3 వందేభారత్ రైళ్లను కేంద్రం కేటాయించిందని చెప్పారు. రైల్వే చరిత్రలో 2023 గొప్ప మేలి మలుపుగా నిలిచిపోతుందన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు జెండాలు ఊపి రైలుకు వీడ్కోలు పలికారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఎ.పాటిల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో కాచిగూడ– యశ్వంతపూర్ వందేభారత్ రైలును ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ రైలు ఏపీలోని కర్నూలు, అనంతపురం రైల్వే స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు విజయవాడ–చెన్నై సెంట్రల్‌కు మొట్టమొదటి వందే భారత్ రైలును చూసేందుకు నగరవాసులు, పలు పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో స్టేషన్ సందడిగా మారింది. రైల్వేశాఖ ఆధ్వర్యంలో ప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పలువురు పాఠశాల విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలతో ప్రదర్శించిన పలు నాటకాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.విద్యార్థులు వందే భారత్ రైలుతో సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా గడిపారు. -
పట్టాలెక్కిన వందే భారత్
విజయవాడ రైల్వేస్టేషన్లో ఆదివారం చైన్నె వెళ్లే వందే భారత్ రైలు ప్రారంభోత్సవం జరిగింది. దీన్ని ఢిల్లీలో వర్చువల్‌గా ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. మధ్యాహ్నం 12.30గంటలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ జెండా ఊపి రైలును పంపారు. ఈ రైలు వద్ద ప్రయాణికులు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
భారత్ బంద్ ఎఫెక్ట్: విజయవాడలో స్పెషల్ రోబో టీమ్స్ ఏర్పాటు
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అభ్యర్థులకు మద్దతుగా రాజకీయ పార్టీలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో నేడు దేశవ్యాప్తంగా ప్రశాంతంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. విజయవాడలో పాక్షికంగా భారత్ బంద్ ప్రభావం కనిపిస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా రోబో టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. స్టేషన్‌కు వెళ్లే ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. భారత్ బంద్ నేపథ్యంలో తిరుపతి రైల్వే స్టేషన్లోనూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలర్ట్ అయ్యారు. ఇది కూడా చదవండి: భారత్ బంద్ ఎఫెక్ట్: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు -
లోకం తెలియని చిన్నారులు.. రోజూ నరకమే.. అందుకే వచ్చేశాం..
సాక్షి, అమరావతి బ్యూరో: లోకం తెలియని చిన్నారులు వాళ్లు. తాగుబోతు నాన్న పెట్టే బాధలు భరించలేకపోయారు. రోజూ తాగి వచ్చి అమ్మను, తమను కొట్టడాన్ని తట్టుకోలేకపోయారు. ఇంకా అక్కడ ఉంటే తమకు రోజూ నరకమేనన్న భావనకొచ్చారు. ఎలాగోలా అక్కడ నుంచి బయట పడాలనుకున్నారు. ఏదో రైలెక్కి విజయవాడ వచ్చేశారు. రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై దీనంగా ఉన్న వీరిని క్లీనింగ్ సిబ్బంది చూసి చైల్డ్‌లైన్ ప్రతినిధులకు అప్పగించారు. చదవండి: ఇలా చేశావేంటి అలెగ్జాండర్.. యువతిని నమ్మించి.. మోసగించి.. మరో మహిళతో.. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని వేంకటేశ్వరస్వామి గుడి ప్రాంతానికి చెందిన వీరు తమ పేర్లు మస్తానీ (9), మౌలాలీ (7) గా చెబుతున్నారు. తండ్రి ఎల్లప్ప కూలింగ్ నీళ్లు అమ్మే పని చేస్తుంటాడని, తల్లి శ్యామల కుర్చీలకు వైర్లు అల్లుతుందని అంటున్నారు. ‘నాన్న ఇంట్లో డబ్బులివ్వడు. ఇవ్వకపోగా రోజూ మందు (మద్యం) తాగడానికి అమ్మను డబ్బుల కోసం సతాయిస్తుంటాడు. ఇవ్వకపోతే కొడతాడు. ఇచ్చాక తాగి వచ్చాక అమ్మను, మమ్మల్ని కొడుతూ ఉంటాడు. అందుకే తమ్ముడు, నేను, ఇల్లు వదిలి నాన్నకు దూరంగా వచ్చేశాం. ఇక మార్కాపురం నాన్న దగ్గరకు వెళ్లం.’ అని మస్తానీ చెబుతోంది. పోలీసులకు సమాచారం ఇచ్చాం ఈ చిన్నారులు గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో విజయవాడ రైల్వేస్టేషన్లో ఉండగా అక్కడ క్లీనింగ్ సిబ్బంది మాకు అప్పగించారు. వెంటనే మైక్‌లో అనౌన్స్మెంట్ చేయించాం. వారి కోసం ఎవరూ రాలేదు. తదుపరి సంరక్షణ కోసం జీఆర్పీ స్టేషన్లో హాజరు పరిచాం. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలతో బాలుడిని విజయవాడ ఎస్కేసీవీ చి్రల్డన్ ట్రస్టు వసతి గృహంలోను, బాలికను ప్రజ్వల బాలికల వసతి గృహంలోనూ తాత్కాలికంగా ఉంచాం. పిల్లలు చెప్పిన వివరాలతో ప్రకాశం జిల్లా మార్కాపురం టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చాం. – కళ్లేపల్లి శ్రీకాంత్, కో–ఆర్డినేటర్, రైల్వే చైల్డ్‌లైన్, విజయవాడ -
రైతుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/అనకాపల్లి టౌన్/యలమంచిలి రూరల్/సత్తెనపల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల హక్కులను కాలరాస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. రైతులను వాహనాలతో తొక్కించి చంపిన వాళ్లను రక్షిస్తూ ప్రధాని మోదీ మానవ హక్కుల గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందని చెప్పారు. సోమవారం సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. విజయవాడ, సత్తెనపల్లి, అనకాపల్లి, యలమంచిలి రైల్వేస్టేషన్ల వద్ద రైలురోకో నిర్వహించారు. విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పాల్గొన్న రాఘవులు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. రైతుసంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డేశోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రైతులను చంపిన బీజేపీ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలన్నారు. అనకాపల్లిలో రైలురోకో నిర్వహిస్తున్న 16 మందిని ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యక్తిగత పూచీపై విడుదల చేశారు. -
Photo Feature: వ్యాక్సిన్ వేసుకోండి.. లాటరీ గెలవండి!
కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడుకునేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. టీకా వేసుకునేందుకు ప్రజలను పోత్సహించేందుకు అమెరికాలోని లూసియానా రాష్ట్ర రాజధాని బాటన్ రో సిటీలో లాటరీ ద్వారా నగదు, స్కాలర్షిప్ ఇవ్వనున్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీపంప్‌హౌస్ నుంచి నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఏపీలో రెండు నెలల విరామం అనంతరం మత్స్యకారులు వేటకు రెడీ అయ్యారు. ఇలాంటి మరిన్ని ‘చిత్ర’ విశేషాలు ఇక్కడ చూడండి. -
Vijayawada: బేరానికి బెజవాడ రైల్వేస్టేషన్!
సాక్షి, విజయవాడ: విజయవాడ రైల్వేస్టేషన్‌ను ప్రైవేటీకరించేందుకు రైల్వే బోర్డు రంగం సిద్ధం చేస్తోంది. రీ డెవలప్మెంట్ పేరిట 99 ఏళ్లు పాటు ప్రైవేటుకు ఇచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. అయితే దక్షిణ మధ్య రైల్వేలో ప్రాధాన్యం కల్గిన ఈ స్టేషన్‌ను లీజుకు ఇవ్వనుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనే నిర్ణయం.. విజయవాడ రైల్వే స్టేషన్‌ను కమర్షియల్‌గా హంగులతో ఆధునికీకరించేందుకు ప్రైవేటు బిడ్డర్లను పిలవాలని గతంలోనే రైల్వే బోర్డు నిర్ణయించింది. బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను కూడా కోరింది. అప్పట్లో బిడ్డర్లు ముందుకు వచ్చినా రైల్వే నిబంధనల కారణంగా వెనకడుగు వేశారు. అప్పట్లో 30 ఏళ్లు లీజు కాలంగా ప్రతిపాదించడంతో ఉపయోగం ఉండదని బిడ్డర్లు భావించారు. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలకు గుత్తగా రైల్వేస్టేషన్‌ను దీర్ఘకాలం అప్పగిస్తే మంచిదని బోర్డు నిర్ణయించిన నేపథ్యంలో కొన్ని ఏ1 రైల్వే స్టేషన్లను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు ఎంపిక చేశారు. అందులో విజయవాడ రైల్వేస్టేషన్‌ను కూడా చేర్చారు. దీనిపై రైల్వే కార్మిక సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రాధాన్యం ఉన్న స్టేషన్.. విజయవాడ రైల్వేస్టేషన్ 1888లో ప్రారంభమైంది. మొత్తం 30 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం 10 ప్లాట్ ఫారాలు ఉన్నాయి. ఈ స్టేషన్ గుండా కరోనాకు ముందు ప్రతి రోజు 250, ప్రస్తుతం 150 రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ గతంలో రోజుకు రెండు లక్షలు కాగా ప్రస్తుతం లక్ష వరకు ఉంటోంది. అన్ని సదుపాయాలూ ఉన్నా.. ఇక ఈ స్టేషన్లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. పది ప్లాట్ ఫారాలు అనుసంధానం చేస్తూ మూడు ఫుట్ ఓవర్‌బ్రిడ్జిలు ఉన్నాయి. వీటిలో ఒకటి పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఆరు మీటర్లు వెడల్పు 185 మీటర్లు పొడవుతో ఉంటుంది. రైల్వేస్టేషన్లో రిటైరింగ్ రూమ్‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్ల సదుపాయాలూ ఉన్నాయి. జనరల్, నాన్ ఏసీ, ఏసీ రెస్ట్ రూమ్‌లు ఉన్నాయి. పే అండ్ యూజ్ టాయిలెట్స్‌తో పాటు ప్రయాణికులకు డిస్ప్లే సిస్టమ్, ఆధునికీకరించిన ప్లాట్‌ఫారాలు, స్టాండర్స్ ఎక్విప్మెంట్ల వినియోగం, క్లీన్ అండ్ గ్రీన్ వంటి సదుపాయాలతో నేషనల్ గ్రీన్బిల్డింగ్ కౌన్సిల్ గోల్డెన్ అవార్డును సాధించింది. ఐఎస్ఓ హోదాను కల్గి ఉంది. ఆదాయం ఫుల్ అయినా.. విజయవాడ డివిజన్ నుంచి రైల్వేస్‌కు గణనీయమైన ఆదాయం వస్తోంది. నంబర్‌వన్ స్థానానికి పోటీ పడుతోంది. ఇటువంటప్పుడు ఈ రైల్వే స్టేషన్‌ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేకంటే బ్యాంకుల నుంచి రుణం తీసుకునైనా రైల్వేనే సొంతంగా రీ డెవలప్మెంట్ వంటి వాటితో పాటు కమర్షియల్‌గా అభివృద్ధి చేయవచ్చు. అలా కాకుండా ప్రైవేటు పరం చేసి 99 ఏళ్ల పాటు లీజుకు ఇస్తే ఆదాయం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది. ప్రయాణికులపైనా యూజర్‌చార్జీల భారం పడే అవకాశం ఉందని కార్మికులతో పాటు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. స్టేషన్ రీ డెవలప్మెంట్ కోసమే.. స్టేషన్‌ను రీడెవలప్మెంట్ చేయడానికి రైల్వేశాఖ ప్రయత్నిస్తోంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్టు కింద తీసుకుని డెవలప్మెంట్ చేసేవారికి అప్పగిస్తారు. ఇప్పటికే గుజరాత్‌లోనూ, భోపాల్ వద్ద స్టేషన్లను ఈ విధంగా అభివృద్ధి చేశారు. డెవలప్మెంట్ చేసిన వాళ్లు యూజర్ చార్జీలు వసూలు చేసుకుంటారు. – పి.శ్రీనివాస్, డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రైవేటీకరణ తగదు రైల్వే స్టేషన్ ప్రైవేటీకరించాలనే ఆలోచన తగదు. ప్రైవేటు సంస్థలు ప్రయాణికులపై ఆర్థిక భారంమోపుతాయి. ముఖ్యంగా యూజర్ చార్జీల పేరుతో ఎక్కువ సొమ్ము వసూలు చేస్తాయి. ప్రస్తుతం స్టేషన్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంకా అవసరమైతే మెరుగైన సౌకర్యాలు రైల్వేశాఖే కల్పించాలి. – వడ్లమూడి రవి, ప్రయాణికుడు లీజుకు ఇవ్వడం సరికాదు.. దక్షిణ మధ్య రైల్వేలోనే మన స్టేషన్‌కు మంచి ఆదాయం వస్తుంది. అటువంటి స్టేషన్‌ను 99 ఏళ్లకు లీజుకు ఇవ్వాలనుకోవడం సరియైన నిర్ణయం కాదు. అవకాశం ఉన్నంత వరకూ రైల్వే శాఖే స్టేషన్ల అభివృద్ధిని చేపట్టాలి. తద్వారా ప్రజలకు, ఉద్యోగులకు, కార్మికులకు మేలు జరుగుతుంది. – శ్రీనివాస్, రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకుడు -
విజయవాడ రైల్వే స్టేషన్ లో కూలీలా అవస్థలు
-
ప్రజలలో అవగాహన బాగా పెరిగింది : డాక్టర్ సమరం
సాక్షి, విజయవాడ : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ర్యాలీ ప్రారంభించారు. సమాజ భాగస్వామ్యం ఎయిడ్స్ వ్యాధి నివారణ పేరుతో వందలాది మంది విద్యార్థులతో తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ఈ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో 23 వేల మంది ఎయిడ్స్ రోగులున్నట్టు కలెక్టర్ తెలిపారు. వీరంతా 4ఏ ఆర్టీ సెంటర్స్ ద్వారా చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రముఖ సెక్సాలజిస్టు డాక్టర్ సమరం మాట్లాడుతూ.. 2030 నాటికి ఎయిడ్స్ పూర్తిస్థాయిలో తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎయిడ్స్ తగ్గుముఖం పట్టడంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు బావున్నాయనీ, వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన బాగా పెరిగిందని వ్యాఖ్యానించారు. -
కార్పొరేట్లకు వరాలు.. సామాన్యులపై భారం
సాక్షి, విజయవాడ: దేశ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టిన బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ.. సీపీఎం నాయకులు నిరసనకు దిగారు. దానిలో భాగంగా సోమవారం విజయవాడ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద బీజేపీకి వ్యతిరేంకగా నినాదాలు చేస్తూ... నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు బాబురావు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ.. వారి బ్యాంక్ రుణాలు మాఫీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు వరాలు ఇస్తూ.. సామాన్యులపై భారం మోపుతున్నారని మండి పడ్డారు. కొత్త మోటారు వాహన చట్టంతో అధిక మొత్తంలో చలానాలు వసూలు చేస్తూ.. కార్మికులు నడ్డి విరుస్తున్నారని బాబురావు ఆరోపించారు. విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మొండిచేయి చూపారని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తోందని.. ఇందుకు నిరసనగా ఈ నెల 16వ తేదీన రాస్తారోకో చేపట్టబోతున్నట్లు తెలిపారు. -
‘ప్లాట్‌ఫాం’పై ప్రయాణికుల కొత్త ఎత్తుగడ!
సాక్షి, విజయవాడ: రైల్వే శాఖ ఇటీవల రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి రూ.30కు పెంచింది. పెరిగిన ధరలు దసరా పండుగ సందర్భంగా పదిరోజులపాటు అమలులో ఉంటాయని ప్రకటించింది. రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ల ధరను భారీగా పెంచడంతో ప్రయాణీకులు ఈ భారం నుంచి తప్పించుకోవడానికి తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ రైల్వే స్టేషన్లో ఫ్లాట్‌ఫామ్ టికెట్ల కన్నా.. గుంటూరు ప్యాసింజర్ రైలు టికెట్లు పెద్దమొత్తంలో అమ్ముడుపోతున్నాయి. కారణం ఏంటని ఆరా తీసిన రైల్వే అధికారులు.. ప్రయాణికుల వ్యూహంతో బిత్తరపోతున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో తమ బంధువులకు స్వాగతం పలికేందుకు, లేదా వీడ్కోలు పలికేందుకు వస్తున్న వారు.. ఫ్లాట్ ఫామ్ టికెట్‌కు బదులు పది రూపాయలు పెట్టి.. గుంటూరు పాసింజర్ టికెట్లు కొంటున్నారు. దీంతో వారికి రూ. 20 ఆదా కావడమే కాకుండా రైల్వే స్టేషన్లోకి వెళ్లేందుకు అనుమతి లభిస్తోంది. దీంతో చాలామంది తెలివిగా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. దీంతో ప్లాట్‌ఫామ్ టికెట్ల కన్నా గుంటూరు ప్యాసింజర్ టికెట్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే అధికారులు తాజాగా ప్రయాణికులను ఉద్దేశించి ఓ ప్రకటన చేశారు. ప్రయాణికుల భద్రత కోసమే పెంచాం ప్లాట్‌ఫామ్ టికెట్ ధర పెంచడం వల్ల రైల్వే శాఖకు వచ్చే ఆదాయం అతి స్వల్పమని, ప్రయాణికుల భద్రత కోసమే పెంచామని విజయవాడ రైల్వే ఏడీఆర్ఎం సుమన తెలిపారు. రైల్వే స్టేషన్లో కొన్నిచోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండకపోతే ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని పేర్కొన్నారు. ప్రమాదాలను తగ్గించడానికే ధరలు పెంచామని తెలిపారు. 'ఫ్లాట్‌ఫామ్ టికెట్లు మాత్రమే కొనండి, తక్కువ ధర అని గుంటూరు ప్యాసింజరు రైలు టికెట్లు కొనకండి' అని ఆమె ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. -
మన స్టేషన్లు అంతంతే
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ రైల్వేస్టేషన్ల విషయంలో తెలంగాణ ఈసారి బాగా వెనకబడింది. గత రెండేళ్లుగా రాష్ట్రంలోని పలు రైల్వేస్టేషన్లు పరిశుభ్రమైన జాబితాలో మెరుగైన స్థానం దక్కించుకోగా ఈసారి మాత్రం బాగా వెనకబడిపోయాయి. ప్రస్తుత జాబితాలో హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్ 17వ స్థానం, సికింద్రాబాద్ 42, వరంగల్ 51, రామగుండం 52, కాజీపేట 67, కాచిగూడ 69, ఖమ్మం 80 స్థానాలు దక్కించుకున్నాయి. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్ బుధవారం ర్యాంకుల జాబితాను విడుదల చేశారు. విజయవాడకు 7వ ర్యాంకు స్వచ్ఛత విషయంలో విజయవాడ రైల్వేస్టేషన్ దేశంలోనే టాప్–10 జాబితాలో స్థానం దక్కించుకుంది. జైపూర్, జోధ్‌పూర్, దుర్గాపుర స్టేషన్లు తొలి 3 ర్యాంకులు దక్కించుకోగా, ఏపీ నుంచి విజయవాడ రైల్వేస్టేషన్ 7, సామర్లకోట 45, తిరుపతి 70, నెల్లూరు 81, విశాఖ 84, పలాస 92, అనంతపురం 105, ఏలూరు 107వ ర్యాంకులను దక్కించుకున్నాయి. -
దారుణం : 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం
సాక్షి, విజయవాడ : నగరంలోని రైల్వేస్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం చేశారు గుర్తుతెలియని దుండగులు. రైల్వే ట్రాక్‌పై రక్తపు మడుగులో వివస్త్రగా పడి ఉన్న వృద్దురాలిని పారిశుద్ధ్య కార్మికులు గమనించి 108లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. నగరంలోని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వృద్ధురాలిపై అత్యాచారం జరిగిందా లేదా, డబ్బుల కోసం దాడికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పట్టాలపై పడిఉన్న వృద్ధిరాలి బట్టలు, ఎండు చేపల బుట్టని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఘటనాస్థలిలో దొరికిన వస్తువులను బట్టి బాధితురాలు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినదిగా గుర్తించారు. -
అమ్మో.. రైల్వే ఆహారమా !
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమం): విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నాసిరకం ఆహార పదార్ధాలు విక్రయిస్తూ ప్రయాణికులను ఆహార పదా ర్థాల విక్రేతలు నిలువునా దోచుకుంటున్నారు. ముఖ్యంగా దేశంలోనే అత్యంత కీలక జంక్షన్లో ఒకటైన విజయవాడ జంక్షన్ మీదుగా నిత్యం 350కి పైగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. అన్‌సీజన్‌లో నిత్యం లక్షమంది, సీజన్ లక్షన్నర మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. ఇటువంటి కీలక జం క్షన్ నాసిరకం ఆహారపదార్థాలు విక్రయాలతో విక్రేతదారులు ప్రయాణికుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఆహారపదార్థాల త యారీ రైల్వేస్టేషన్లో జరగాల్సి ఉన్నా 90 శాతం ఆహార పదార్థాలు బయటినుంచి తయారై స్టేషన్లో విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం పదార్థా ల తయారీ మొత్తం రైల్వేస్టేషన్లో జరగాల్సి ఉ న్నా అలా జరగటం లేదు. ప్రస్తుతం రైల్వేస్టేషన్లో చాలావరకు క్యాంటీన్లు ఐఆర్సీటీసీ పరిధి లో ఉన్నాయి. సంబంధిత అధికారులు పదా ర్థాల నాణ్యతను పరిశీలించి విక్రయాలకు అనుమతి ఇవ్వాల్సి ఉన్నా అమలు కావడంలేదు. దీని కి కొంతమంది అధికారులకు నెలవారీ మామూ ళ్లు అందడమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ‘జనఆహార్’ ఎత్తివేత ప్రయాణికులకు అతి తక్కువ ధరకు ఆహార పదార్థాలను విక్రయించేందుకు జన ఆహార్ క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. గత్యంలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే 6వ నెంబరు ప్లాట్‌ఫాంపై ఉండేది. కొంతమంది కాంట్రాక్టర్ల ఒత్తిడి మేరకు దానిని ఎత్తివేశారు. విజయవాడ రైల్వే పరిధిలో జన్ ఆహార్ క్యాంటిన్లను విస్తరించాల్సింది పోయి ఉన్నవాటిని ఎత్తివేశారు. అధిక ధరల దోపిడీ స్టేషన్లో వాటర్ బాటిళ్లను రూ.15కు విక్రయించాల్సి ఉండగా రూ.20 నుంచి రూ. 25 దాకా విక్రయిస్తున్నారు. అదేవిధంగా 600 ఎంఎల్ కూల్‌డ్రింక్ బాటిళ్లను రూ.40కు విక్రయించాల్సి ఉండగా రూ.50 వసూలు చేస్తున్నారు. నాసిరకం ఆహార పదార్థాలు అదేవిధంగా ప్రయాణికులకు విక్రయిస్తున్న బిర్యానీ సైతం నాసిరకం బియ్యంతో తయారు చేయడంతో పాటు ఎటువంటి నాణ్యత పాటించడంలేదు. అదేవిధంగా ఉదయం తయారీ చేసిన బిర్యానీని సాయంత్రం పూట, సాయంత్రం తయారు చేసిన బిర్యానీని ఉదయం విక్రయిస్తున్నారు. ఇవితిన్న ప్రయాణికులు అనారోగ్యం పాలైన సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. అదేవిధంగా నాసిరకం టీని ప్రయాణికులకు సరఫరా చేస్తున్నారు. గతంలో నాసిరకం టీని తీసుకోవడం ద్వారా ప్రయాణికుడు వాంతులు చేసుకొని అస్వస్థతకు గురైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రాత్రిళ్లు నాసిరకం ఆహారపదార్ధాలను అధిక ధరలకు విక్రయిస్తూ ప్రయాణికులను అందిన కాడికి దోచుకుంటున్నారు. ఐస్‌క్రీముల్లో నాణ్యత డొల్ల స్టేషన్లో ఐస్‌క్రీమ్ విక్రయాలకు అనుమతి లేకపోయినా పెద్దఎత్తున బయటి నుంచి నాసిరకం ఐస్‌క్రీములను స్టేషన్లో విక్రయిస్తున్నారు. ఇటీవలి నగరంలో విజిలెన్స్ అధికారులు పెద్దఎత్తున నాసిరకం ఐస్‌క్రీం తయారీదారులపై దాడులు నిర్వహించారు. ఇటువంటి నాసిరకం ఐస్క్రీంలనే విజయవాడ రైల్వేస్టేషన్లో విక్రయిస్తున్నారు. కొంతమంది అధికారులకు క్యాంటీన్ నిర్వాహుకులు నెలవారీ మాముళ్ల అందుతుండటంతోనే వీటిపై ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు బలంగా వినపిస్తున్నాయి. అదే విధంగా పదార్థాల విక్రేతల(హాకర్లు)కు ఎప్పటికప్పుడు రైల్వే ఆసుపత్రిలో మెడికల్ పరీక్షలు నిర్వహించి గుర్తింపు కార్డులు జారీ చేయాల్సి ఉన్నా అటువంటి ఏవి అమలు కావడంలేదు. కొంతమంది హాకర్లు నిత్యం మద్యం మత్తులో విక్రయిస్తూ, ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా స్టేషన్లో కొంతమందికి మాత్రమే పదార్ధాల విక్రయించడానికి అనుమతి ఉన్నా సంబంధిత కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున నకిలీ కార్డుల ద్వారా పదార్థాల విక్రయాలు జరుపుతున్నారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. రైళ్లలో దూరప్రయాణాలు చేసేవారు రైల్వేవారు అందిస్తున్న ఆహారమంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. నాణ్యత, శుచిశుభ్రం లేని పదార్థాలు పెడుతుండడం, ఎమ్మార్పీతో సంబంధం లేకుండా అధిక ధరలు వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కొనుగోలు చేయాల్సివస్తోంది.. విక్రేతల దోపిడీ తెలిసినా మామూళ్ల మత్తులోనే రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. నాసిరకం పదార్థాలు విక్రయిస్తున్నారు విజయవాడ రైల్వేస్టేషన్లో వాటర్ బాటిల్ ధరలు అధికంగా వసూలు చేస్తున్నారు వాటర్ బాటిల్‌ను రూ.20కి విక్రయిస్తున్నారు. అదేవిధంగా స్టేషన్లో విక్రయిస్తున్న బిర్యానీ నాణ్యత ఉండటం లేదు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.– ఆర్.శ్రీనివాస్, ప్రయాణికుడు -
రైల్వే స్టేషన్లో జరిమానాల దందా.!
విజయవాడ రైల్వే స్టేషన్లో జరిమానాల దందా యథేచ్ఛగా సాగుతోంది. నో పార్కింగ్ జోన్లో వాహనాలు పెట్టిన వారి నుంచి అక్కడి ప్రీమియం స్టాండ్ కాంట్రాక్టర్ ముక్కు పిండి జరిమానాలు వసూలు చేస్తున్నారు. ఈ ఫైన్‌కు ఒక లెక్కా పత్రం ఉండదు.. రశీదు ఇవ్వరు.. దీంతో వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆదివారం ఇదే విధంగా కాంట్రాక్టర్‌కు, వాహనయజమానులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. సాక్షి, విజయవాడ: విజయవాడ రైల్వే స్టేషన్ సౌత్ టెర్మినల్ వద్ద వాహనాల పార్కింగ్ కాంట్రాక్టర్, పోర్టర్ల హవా నడుస్తోంది. సౌత్ టెర్మినల్‌కు సమీపంలోని ఫ్లాట్‌ఫారాలపైకి పార్సిళ్లను తీసుకువెళ్లేందుకు ఒక ప్రత్యేక గేటు ఉంది. ఈ గేటులోంచి ఫ్లాట్‌ఫారాలపై వెళ్లడం సులభంగా ఉండటంతో ఎక్కువ మంది ప్రయాణికులు ఈ గేటులోంచి లోపలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. అయితే కేవలం ట్రాలీలతో పార్సిళ్లు, సరుకు తీసుకువెళ్లేందుకు మాత్రమే ఈ గేటు ఉందని, ప్రయాణికులు వెళ్లేందుకు వీలు లేదంటూ పోర్టర్లు అడ్డుకుంటున్నారు. నో పార్కింగ్ జోన్.. ఈ గేటు ప్రక్కనే ఒక టూ వీలర్ ప్రీమియం స్టాండ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడ వాహనాన్ని పార్క్ చేస్తే గంటకు రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో టెర్మినల్ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశాన్ని అధికారులు నో–పార్కింగ్ జోన్‌గా ప్రకటించారు. అయితే సౌత్ టెర్మినల్ వైపు తమ బంధువుల్ని రైలు ఎక్కించేందుకు వచ్చే వారు హడావుడిగా నో పార్కింగ్ బోర్డును చూసుకోకుండా అక్కడ తమ ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం ఆరు గంటలకు నగరం నుంచి బయలుదేరే రత్నాచల్, శాతవాహన, పినాకిని రైళ్లు ఎక్కించేందుకు వచ్చే వారు హడావుడిగా ఇక్కడే వాహనాలను ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు. కాంట్రాక్టర్ ‘ప్రత్యేక జరిమానా’ వాస్తవంగా ఇక్కడ వాహనాన్ని పార్కింగ్ చేస్తే రూ.500 జరిమానా వేస్తామని అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిని ఇక్కడి కాంట్రాక్టర్ అదునుగా చేసుకుని దందాకు తెరలేపారు. హడావుడిగా వచ్చి ఇక్కడ వాహనం పార్కింగ్ చేయగానే వాహనాలన్నింటిని కలిపి చైన్ వేస్తున్నారు. చైన్ తీయడానికి ఒక్కొక్క వాహనానికి రూ.100 నుంచి రూ.150 వరకూ వసూలు చేస్తున్నారు. ఈ వసూలుకు ఏ విధమైన రశీదు ఇవ్వడం లేదు. అదేమని ప్రశ్నిస్తే రూ.500 బోర్డు చూపించి అది ఇస్తే రశీదు ఇస్తామని చెబుతుండటం గమనార్హం. వాగ్వివాదం.. ఆదివారం ఉదయం తమ వాహనాలకు చైన్ వేయడంపై కొంతమంది వాహన యజమానులు కాంట్రాక్టర్‌తో తీవ్రంగా ఘర్షణ పడ్డారు. అయితే జరిమానా చెల్లించాల్సిందేనని కచ్చితంగా చెప్పడంతో కొంతమంది గత్యంతరం లేక జరిమానా చెల్లించి వాహనాలను తీసుకున్నారు. రూ.150 చెల్లించా.. మా బంధువులను రైలు ఎక్కించేందుకు వచ్చా. రైలు వెళ్లిపోతుందేమోనన్న హడావుడిలో నో పార్కింగ్ బోర్డు చూసుకోకుండా స్కూటర్ పార్క్ చేసి వెళ్లాను. తిరిగి ఐదు నిమిషాల్లో వచ్చాను. అయినా నా వద్ద రూ.150 వసూలు చేశారు.– రామాంజనేయులు, వాహనదారుడు -
బెజవాడ రైల్వేస్టేషన్లో మరో రెండు ఫ్లాట్‌ఫామ్స్
సాక్షి,విజయవాడ: విజయవాడ రైల్వేస్టేషన్లో మరో రెండు ఫ్లాట్‌ఫామ్స్ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం 6,7 ప్లాట్‌ఫారాల మధ్య ఉన్న భవనాలను తొలగించి వాటి స్థానంలో కొత్త ప్లాట్ ఫారాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్త ప్లాట్‌ఫారాల ఏర్పాటుకు రూ.12 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు వేశారు. దీనికి రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ సుముఖంగా వున్నట్టు రైల్వే వర్గాల్లో చర్చ జరుగుతోంది. విజయవాడ రైల్వే స్టేషన్ నిత్యం రద్దీ విజయవాడ రైల్వేస్టేషన్ మీదుగా నిత్యం 250 పాసింజర్ రైళ్లు, మరో 150 గూడ్స్ రైళ్లు వెళుతున్నాయి.నిత్యం 2లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. రైల్వేస్టేషన్లో ప్రస్తుతం పది ప్రయాణికుల రైళ్లు ఆగే ప్లాట్‌ఫారాలు ఉండగా అదనంగా మరో 12 గూడ్స్ రైళ్ల ట్రాక్‌లు ఉన్నాయి. అయినప్పటికీ పెరుగుతున్న అవసరాలకు తగినట్టుగా ప్లాట్‌ఫారాలు సరిపోవడం లేదు దీంతో కొత్త ప్లాట్‌ఫారాల ఏర్పాటుపై అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఒన్‌టౌన్ తారాపేట వైపు కొండ అడ్డంగా ఉండడం, తూర్పువైపు రైల్వే భవనం ఉండడంతో దీన్ని విస్తరించడం సాధ్యపడడం లేదు. శిథిలమైన పాత భవనాలు 6,7 నంబర్ ప్లాట్‌ఫారాలపై నిర్మించిన భవనాలు వంద సంవత్సరాలు దాటిపోయాయి. గతంలో ఏడవ ఫ్లాట్‌ఫారం వరకు మాత్రమే ఉండేది అందువల్ల అక్కడ భవనాలు నిర్మించారు. ఆ భవనాల్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసుస్టేషన్లు, క్రూ ఆఫీసు, సీటీఐ కార్యాలయం, ఆర్ఎంఎస్ కార్యాలయం తదితర కార్యాలయాలను నడుపుతున్నారు. 2004లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని పశ్చిమం వైపు 8,9,10 ప్లాట్‌ఫారాలను ఏర్పాటు చేశారు. అయినా ప్రస్తుతం ట్రాఫిక్‌కు తగినట్టుగా ప్లాట్‌ఫారాలు సరిపోకపోవడంతో రాబోయే రోజుల్లో రాజధానికి వచ్చే వారి సంఖ్య పెరిగితే మరిన్ని ఇబ్బందులు వస్తాయి. ఈ నేపథ్యంలో వందేళ్ల నాటి భవనాలను తొలగించి అక్కడ మరొక రెండు ట్రాక్‌లు ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుందని విజయవాడ డివిజన్ అధికారులు నిర్ణయించారు. ఇటీవల రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ వచ్చినప్పుడు ఇదే విషయం చర్చించగా, ఆయన స్టేషన్‌ను పరిశీలించారు. ఫ్లాట్‌ఫారంపై ఉన్న భవనాలు ఏ నిముషంలోనైనా కూలిపోవచ్చని, అదే జరిగితే ప్రాణనష్టం జరుగుతుందని భావించిన అధికారులు వాటిని తొలగించాలని నిర్ణయించారు. అక్కడ తిరిగి కొత్త భవనాలు నిర్మించే కంటే మరో రెండు ప్లాట్‌ఫారాలు నిర్మిస్తే సరిపోతుందని ఒక నిర్ణయానికి వచ్చారు. కార్యాలయాలు సర్దుబాటు 6,7 నంబర్ ప్లాట్‌ఫారాలను పదవ నంబరు లేదా ఒకటవ నంబర్ ప్లాట్ఫారానికి సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. స్టేషన్లో ఉండాల్సిన అవసరం లేని కార్యాలయాలను డీఆర్ఎం కార్యాలయంలో కాని మరొక చోట కాని సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల తూర్పు వైపు ఒక భవనం, పశ్చిమం వైపు పదవ నంబర్ ఫ్లాట్‌ఫారంపై మరొక భవనం మాత్రమే ఉంటుంది. ఫ్లాట్‌ఫారాలు పెరగడం వల్ల ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుందని నిర్ణయించారు. -
13 కేజీల బంగారం పట్టివేత
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా విజయవాడ రైల్వేస్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న 13 కేజీల బంగారాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. హౌరా-తిరుచ్చినాపల్లి ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం మొత్తం ఆభరణాల రూపంలో ఉంది. తాము స్వాధీనం చేసుకున్న బంగారం దాదాపు 13 కేజీల వరకు ఉండటంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. బంగారంతో వెళ్తున్న వ్యక్తి వద్ద ఎటువంటి రసీదులు లేకపోవడం, కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా గుడ్డ సంచీలో ఆభరణాలు తరలించడంపై రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. -
13 కేజీల బంగారం పట్టివేత
-
అరాచకం..!
⇒ హెచ్చుమీరుతున్న అసాంఘిక సంస్కృతి ⇒ గ్యాంగ్‌ల ఆగడాలతో ప్రజల బెంబేలు ⇒ టీడీపీ ప్రజాప్రతినిధుల కుమారుల ఇష్టారాజ్యం ⇒ వారికి పెద్దల దన్ను... ఆపై పోలీసుల వత్తాసు ⇒ విజయవాడలో ఇదీ చిత్రం సాక్షి, అమరావతిబ్యూరో : విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువతి లేవలేని స్థితిలో పడి ఉంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి విచారణ చేపట్టారు. ఆమెను బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లో తలదాచుకుంటున్న కుటుంబాలకు చెందిన యువతిగా గుర్తించారు. ఉపాధి చూపిస్తామని చెప్పి కొందరు యువకులు ఆమెను విజయవాడకు తీసుకొచ్చి కొన్ని రోజులపాటు లైంగికదాడులకు పాల్పడి ఇలా రోడ్డుపక్కన పడేసి వెళ్లారని గుర్తించారు. ఆ యువకులపై ఆరా తీసిన పోలీసులు అంతలోనే మిన్నుకుండిపోయారు. గుట్టుచప్పుడు కాకుండా ఆమెను పశ్చిమ బెంగాల్ పంపించి వేశారు. ఎందుకంటే ఆ యువతిపై లైంగిక దాడులకు పాల్పడిన బృందానికి నాయకుడు ఓ టీడీపీ ప్రజాప్రతినిధి కుమారుడు మరి. విజయవాడలో విలయతాండవం చేస్తున్న విశృంఖలత్వానికి ఇది ఓ మచ్చుతునక మాత్రమే. గ్యాంగ్లదే ఇష్టారాజ్యం ఆకతాయితనం... ఆగడాలు...దాడులు... విశృంఖతత్వం... ఇదీ విజయవాడలోని గ్యాంగ్‌లకు నిత్యకృత్యం. టీడీపీ ప్రజాప్రతినిధుల కుమారులు, పెద్దల కుమారులే ఈ గ్యాంగ్‌లకు నేతృత్వం వహిస్తుండటం గమనార్హం. నగరంలో వివాదాస్పదుడైన ఓ ప్రజాప్రతినిధి కుమారుడి గ్యాంగ్ ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. వ్యాపారుల నుంచి బలవంతపు వసూళ్లు చేస్తూ విచ్చలవిడిగా జల్సాలకు పాల్పడుతున్నారు. అవసరమైతే దాడులకు కూడా తెగబడుతున్నారు. మరో కీలక నేత కుమారుడి అనుచరగణం కూడా మరో ప్రాంతంలో ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. విశృంఖలత్వానికి పరాకాష్ట ప్రజాప్రతినిధుల సుపుత్రులు, వారి గ్యాంగ్‌లు తమ ధన బలం, రాజకీయ బలంతో అసాంఘిక కార్యకలాపాలకు నగరాన్ని అడ్డాగా మార్చేస్తున్నాయి. ఏజెంట్లను నియమించుకుని మరీ ఇతర రాష్ట్రాల నుంచి యువతులను నగరానికి తెప్పిస్తున్నారు. కొందరు యువతులను ఉపాధి అవకాశాల పేరుతో రప్పించి మోసం చేస్తుండగా... మరికొందరిని ఎక్కువ డబ్బు ఇస్తామని చెప్పి వ్యభిచార వృత్తి కోసమే తెప్పిస్తున్నారు. నగర శివారు ప్రాంతాలు, కొన్ని హోటళ్లు కేంద్రంగా చేసుకుని విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ ఉన్మాదంతో చెలరేగిపోతున్నారు. ఆ గ్యాంగ్‌ల విపరీతపోకడలకు కొన్ని నిదర్శనాలు ఇవీ... ► బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా వచ్చిన అక్రమచొరబాటుదారుల కుటుంబాల్లోని యువతులను కొంతకాలంగా నగరానికి రప్పిస్తున్నారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నమ్మించి యువతులను రప్పిస్తున్నారు. వారిని నిర్బంధించి ఆ గ్యాంగ్ సభ్యులు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. కేవలం తిండి మాత్రమే పెట్టి కొన్ని రోజులపాటు వేధింపులకు గురిచేస్తున్నారు. తమను విడిచిపెట్టాలని ఆ యువతులు ప్రాధేయపడుతున్నా కనికరించడంలేదని తెలుస్తోంది. వారం రోజుల అనంతరం కొందరి చేతులో కొంత డబ్బు పెట్టి పంపిస్తున్నారు. నడవలేక నిస్సహాయస్థితిలో ఉన్నవారిని నిర్ధాక్షిణ్యంగా రైల్వే స్టేషన్ సమీపంలో పడేసి పోతున్నారు. ► తాజాగా ఓ హోటల్లో వ్యభిచారం చేస్తుండగా పోలీసులు దాడి చేశారు. కొందరు యువతులు, యువకులను అదుపులోకి తీసుకున్నారు. కాసేపటికే వారిలో టీడీపీ నేతల కుమారులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా కీలక నేత కుమారుడు, ఆయన గ్యాంగ్ సభ్యులను పోలీసులు బయటకు పంపించేశారు. ఒక్క యువతిపై మాత్రమే కేసు పెట్టి మిగిలినవారిని కూడా విడిచిపెట్టేశారు. తనపై మాత్రమే కేసు పెట్టడాన్ని ఆమె ప్రశ్నించింది. దీంతో ప్రజాప్రతినిధి కుమారుడు ఆమెకు రూ.లక్ష ఇస్తామని, కేసును వెంటనే పరిష్కరించి ఆమెను స్వస్థలానికి పంపిస్తానని నమ్మించారు. ఆ తరువాత ఆయన పత్తాలేకుండాపోయాడు. దీనిపై ఆమె పోలీసులను గట్టిగా నిలదీసినట్లు సమాచారం. దీంతో ఆ కేసును త్వరగా క్లోజ్ చేసి పంపిచేయాలని పోలీసులు భావిస్తున్నారు. పెద్దల దన్ను... పోలీసుల వత్తాసు ప్రజాప్రతినిధులు కూడా తమ కుమారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఏమాత్రం భావించకపోవడం విడ్డూరంగా మారింది. పుత్రరత్నాల గ్యాంగ్‌ల ఆగడాలు తమ రాజకీయ ఆధిపత్యానికి చిహ్నంగా భావిస్తున్నారు. మరోవైపు మరికొందరు పోలీసు అధికారులు ఆ గ్యాంగ్‌లతో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు వచ్చినా సరే తీసుకోవడం లేదు. దీంతో ఆ గ్యాంగ్‌లు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నాయి. -
కార్పొరేట్ చేతికి రైల్వేస్టేషన్
స్విస్ చాలెంజ్ పద్ధతిలో డెవలపర్ ఎంపిక ప్రపంచస్థాయి స్టేషన్‌గా అభివృద్ధి అంటూ ప్రచారం స్టేషన్లోనే మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్స్ నిర్మాణం కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ అంటున్న కార్మిక సంఘాలు 8న సికింద్రాబాద్‌లో ప్రీ–టెండర్ బిడ్‌కు సన్నాహాలు ? సాక్షి, విజయవాడ: విజయవాడ రైల్వే స్టేషన్‌ను కొర్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఆధునికీకరణ పేరుతో దేశంలోని 27 రైల్వేస్టేషన్లను ఎంపిక చేసి వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో ప్రతి రోజు 250 రైళ్ల రాకపోకలతో రూ.70 లక్షల ఆదాయం వచ్చే విజయవాడ రైల్వేస్టేషన్‌ను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు సిద్ధం చేస్తున్నారు. విజయవాడతోపాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. వీటికి సంబంధించి ఈనెల 8న ప్రీ–టెండర్ బిడ్‌ను సికింద్రాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రైవేటు సంస్థకు అప్పగింత... రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయడానికి స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఒక డెవలపర్‌ను ఎంపిక చేస్తారు. రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాం, సర్క్యులేటింగ్ ఏరియాతోపాటు, స్టేషన్ దగ్గరలోని తారాపేట వైపు ఉన్న కార్ పార్కింగ్ ఏరియా, తూర్పు ద్వారం వైపు ఉన్న పార్కింగ్ ప్రదేశాలు, సత్యనారాయణపురంలో ఉన్న రైల్వేస్థలాలను ఆ డెవలపర్‌కు అప్పగిస్తారు. ఈ స్థలాల్లో మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, హోటళ్లు నిర్మిస్తారు. ఇందులో భాగంగానే అంతర్జాతీయ రైల్వేస్టేషన్లో ఉండే అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులకు కావాల్సిన అత్యాధునిక సౌకర్యాలన్నింటిని అక్కడ ఏర్పాటు చేస్తారు. మిగిలిన స్థలాల్లో డెవలపర్స్భవనాలు నిర్మించుకుని అద్దెలకు ఇచ్చుకుంటారు. రైల్వే భూములు ఆ శాఖ ఆధీనంలో ఉన్నప్పటికీ డెవలపర్ పెట్టుబడితో పాటు లాభాలు సంపాదించుకునేందుకు 45 ఏళ్లు పాటు స్టేషన్, రైల్వేస్థలాల్లో నిర్మించిన భవనాలు వారి ఆధీనంలోనే ఉంచుతారు. డెవలపర్ ఎంపిక.. స్టేషన్ అభివృద్ధికి డెవలపర్స్‌ను ఎంపిక చేసేందుకు టెండర్లు పిలిచి వారి చేత టెక్నికల్, ఫైనాన్షియల్ ప్రాజెక్టు రిపోర్టులను తెప్పిస్తారు. ఈ విధంగా వచ్చిన ప్రాజెక్టు రిపోర్టులను రైల్వే మంత్రిత్వ శాఖ పరిశీలించిన తరువాత డెవలపర్‌ను ఎంపిక చేస్తారని చెబుతున్నారు. కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ .... కార్పొరేట్ సంస్థలకు నగరాల్లో విలువైన భూములు లభించడం లేదు. ఈ నేపథ్యంలో రైల్వే భూములపై కన్నేసినట్లు తెలిసింది. కార్పొరేట్‌కు 45 ఏళ్ల పాటు స్థలాలు అప్పగిస్తే... ఆ తరువాత కార్పొరేట్ సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే మరికొంతకాలం స్టేషన్లు, విలువైన రైల్వే భూములు వారి చేతిలోనే ఉంటాయి. ఇది ఒక రకంగా రైల్వే శాఖకు చెందిన విలువైన భూముల్ని కార్పొరేట్లకు అప్పగించడమేనని రైల్వే కార్మిక Sసంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రయాణికులకు అత్యాధునిక షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లు అవసరమా అని రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజనల్ కార్యదర్శి శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు. కేవలం ప్రైవేటు సంస్థలకు రైల్వే ఆస్తుల్ని కట్టబెట్టడంలో భాగంగానే స్విస్‌చాలెంజ్ పద్ధతిని తెరపైకి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. -
ప్రయాణికులకు విజయవాడ కష్టాలు
బోసిపోయిన విశాఖ రైల్వే స్టేషన్ పలు రైళ్లు రద్దు... మరికొన్ని దారి మళ్లింపు అరగంట ముందు వస్తేనే పూర్తి చార్జి చెల్లింపు... లేకుంటే 15 రోజుల తర్వాతే నేడు, రేపు రత్నాచల్ రద్దు ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ బస్సులు వాటిపై ఆసక్తి చూపని ప్రయాణికులు విశాఖపట్నం : విజయవాడ రైల్వేస్టేషన్లో సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ విశాఖ నుంచి బయల్దేరే ప్రయాణికులకు శాపంగా మారిందనే చెప్పుకోవాలి. బుధవారం నుంచి పలురైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయడం.. ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించడంతో ప్రయాణికుల కష్టాలు రెట్టింపయ్యాయి. ఏకంగా తొమ్మిది రోజుల పాటు ఈ కష్టాలు ఉండే పరిస్థితులు తలెత్తడంతో సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు ఈ పరిస్థితి ఉంటుందని రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించారు. విజయవాడ వైపు వెళ్లే మెజార్టీ రైళ్లన్నీ రద్దుకావడం.. మరికొన్ని రైళ్లు దారి మళ్లించడంతో విశాఖ రైల్వే స్టేషన్ గురువారం బోసిపోయింది. దారి మళ్లించిన రైళ్లతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ ఏ సమయానికి చేరుకుంటాయో కూడా రైల్వే అధికారులు చెప్పలేని పరిస్థితి నెలకొనడంతో ప్రయాణికుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. పరిస్థితి ఇలా ఉంటుందని నిన్న స్టేషన్‌కు చేరుకున్న వారంతా రిజర్వేషన్లను రద్దు చేసుకుని అందుబాటులో ఉన్న రైళ్లలోనే రాకపోకలు సాగించారు. కాగా గురువారం మాత్రం పరిస్థితి పూర్తిగా అవగతం కావడంతో ప్రయాణికులంతా ఆన్లైన్లో కొంతమంది.. నేరుగా కొంతమంది తమ రిజర్వేషన్లను రద్దు చేసుకుని తిరుగుముఖం పట్టారు. దీంతో ప్లాట్‌ఫారమ్స్ ఖాళీగా దర్శన మిచ్చాయి. రైల్వే స్టేషన్లో బంద్ వాతావరణం కనిపించింది. రద్దయిన రైళ్లకు పూర్తి చార్జి చెల్లింపు పూర్తిగా.. పాక్షికంగా రద్దయిన రైళ్లకు రిజర్వేషన్ చేయించుకున్న వారికి ట్రైన్ బయల్దేరే అరగంట ముందు వస్తే పూర్తి సొమ్ము చెల్లిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. ట్రైన్ షెడ్యూల్ టైం తర్వాత రద్దు చేసుకుంటే నగదు చెల్లించడానికి కనీసం 15 నుంచి నెల రోజుల సమయం పడుతుందని స్పష్టం చేసింది. దారి మళ్లించిన రైళ్లకు మాత్రం ఇది వర్తించదని ప్రకటించింది. విజయవాడ వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి ట్రైన్‌కు గుణదల, రాయన్నపాడు స్టేషన్లలో దిగేందుకు ప్రత్యేకంగా స్పెషల్ హాల్ట్ ఇస్తున్నారు. ఇక్కడ దిగిపోతే విజయవాడ సిటీలోకి ఫ్రీగా తీసుకెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. కాగా రేపు బయల్దేరనున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు హైదరాబాద్ నుంచి వచ్చే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లను కూడా పూర్తిగా రద్దు చేసినట్టు చెప్పారు. బస్సులపై ఆసక్తి చూపని ప్రయాణికులు రైల్వేస్టేషన్లో విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికుల కోసం ఈ రోజు 12 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అయితే మెజార్టీ ప్రయాణికులు బస్సుల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో నాలుగు బస్సులకు సరిపడా ప్రయాణికులు మాత్రమే ఎక్కడంతో వాటిని విజయవాడ పంపారు. మిగిలిన బస్సులు తిరిగి డిపోకు వచ్చేశాయి. రేపటి నుంచి ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి అదనంగా ఒకటి రెండు బస్సులు నడిపే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఎక్కువ రద్దీ ఉండే రత్నాచల్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్లకు మాత్రం ప్రత్యామ్నాయంగా బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే ఏ సూపర్‌ఫాస్ట్ ట్రైన్‌కైనా విశాఖ నుంచి విజయవాడకు వెళ్లేందుకు రూ.160లకు మించి ఖర్చు అవదు. అదే ఆర్టీసీ బస్సు ఎక్కితే నాలుగింతలు వదిలిపోతుంది. సూపర్ లగ్జరీకైతే రూ.500, అల్ట్రా డీలక్స్కైతే రూ.400, ఇంద్రకైతే రూ.600లకు పైగానే చార్జీ వసూలు చేస్తారు. ఇంత భారీ ఎత్తున జేబులకు చిల్లులుపడే పరిస్థితి నెలకొనడంతో అత్యవసరమైతే తప్ప ఈ వారం రోజులు విజయవాడ వైపు వెళ్లకపోవడమే మంచిదన్న భావనలో మెజార్టీ ప్రయాణికులున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు ప్రైవేటు ట్రావలర్స కూడా డిమాండ్‌ను బట్టి రూ.500 నుంచి రూ.800ల వరకు విజయవాడ వెళ్లేందుకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా రానున్న వారం రోజులు విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు. -
విజయవాడ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల ఆందోళన
విజయవాడ: విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల ఆందోళనకు దిగారు. విజయవాడ నుంచి ధర్మవరం కు కొత్తగా ప్రారంభించిన రైలుకు సాధారణ టికెట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే రేజర్వేషన్ లేని వారిని రైల్వే పోలీస్ లు కిందకు దించివేశారు. ఈ రైలులో 5 ఏ.సీ, 8 స్లీపర్ భోగీలు మాత్రమే ఉన్నాయి. సాధారణ భోగీలు లేవని సాకుతో ప్రయాణికులను అనుమతిచలేదు. దాంతో రైల్వే అధికారుల తీరు పై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని నుంచి రాయలసీమ కు రైలు వేశామని గొప్పగా చెప్పిన వారు అందులో సామాన్యులకు ప్రవేశం కల్పించలేదని ఆక్రోశం వెలిబుచ్చారు. కొత్త రైలు ఈ నెల 12 న లాంఛనంగా ప్రారంభమైనా ప్రయాణికులకు మాత్రం శనివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. మొదటి రోజే ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
విజయవాడ రైల్వేస్టేషన్లో బాంబు కలకలం
విజయవాడ (రైల్వేస్టేషన్) : రైల్వేస్టేషన్లో బాంబు ఉందంటూ బుధవారం ఫోన్ రావడంతో పోలీసు అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఒక ఆగంతకుడు సెల్ నుంచి ఫోన్‌చేసి, రైల్వే స్టేషన్లో బాంబు ఉందని చెప్పాడు. అప్రమత్తమైన పోలీసు అధికారులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపి స్టేషన్‌లోని పలు ప్లాట్‌ఫారాలు, పార్శిల్ కార్యాలయంతో పాటు స్టేషన్‌లోని అణువణువూ తనిఖీచేశారు. పలు రైళ్లలో సైతం తనిఖీలు నిర్వహించారు. రైల్వే ఎస్పీ షిమోషి బాజ్‌పాయ్ నేతృత్వంలో 60 మంది సిబ్బంది స్టేషన్లో విస్తృతంగా తనిఖీ చేశారు. రెండు గంటలసేపు గాలించినా బాంబు ఆనవాళ్లు లభించకపోవడంతో వచ్చిన ఫోన్‌కాల్ ఆకతాయిగా నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ నంబరు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
రైల్వే విశ్రాంతి గదులు.. ఇక స్వర్గధామాలు
అత్యాధునిక వాష్ రూమ్స్, ఛేంజింగ్ రూమ్స్, వైఫై, ఇంటర్ నెట్, లైవ్ టీవీ, మ్యూజిక్ ఛానెల్స్, బఫెట్ సర్వీస్, న్యూస్ పేపర్లే, పుస్తకాలు, లగేజ్ ర్యాక్స్, షూ షైనర్, ట్రైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, పిలిస్తే పలికే ద్వారపాలకుడు.. ఇన్నాళ్లూ ఎయిర్ పోర్టుల్లో మాత్రమే పరిమితమైన ఉన్న ఈ తరహా అత్యున్నత శ్రేణి విశ్రాంతి గదులు ఇప్పుడు రైల్వే స్టేషన్లలోనూ అందుబాటులోకి రానున్నాయి. దక్షిణమధ్య రైల్వే పరిధిలోకి వచ్చే విజయవాడ, విశాఖపట్టణం స్టేషన్లు సహా దేశంలోని 19 ప్రముఖ రైల్వే స్టేషన్లలో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ల నిర్మాణానికి ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) సన్నాహాలు మొదలుపెట్టింది. వచ్చే ఏడాది జనవరి నాటికి రైలు ప్రయాణికులకు అత్యున్నత సేవలు అందుబాటులోకి వస్తాయని ఐఆర్సీటీసీ తెలిపింది. విజయవాడ, విశాఖతోపాటు ఈ ప్రాజెక్టుకు ఎంపికైన రైల్వే స్టేషన్లలో జైపూర్, ఆగ్రా, న్యూ ఢిల్లీ, కథ్‌గోదామ్, పాట్నా, సీల్దా, హౌరా, భువనేశ్వర్, అమ్మదాబాద్, పూరి, నాగ్‌పూర్, మథురై, బెంగళూరు, లూథియానా, అమృత్సర్, లక్నో, గోరఖ్ పూర్ స్టేషన్లు కూడా ఉన్నాయి. -
వామ్మో...అనాథ శవమా!
హడలిపోతున్న రైల్వే పోలీసులు ఖననానికి స్థలం లేదు ఖర్చులకు నగదు చాలదు రైల్వేస్టేషన్ : ట్రాక్ పక్కన అనాథ శవం ఉందని సమాచారం అందితే చాలు రైల్వే పోలీసులు హడలిపోతున్నారు. ఖననం చేయడానికి స్థలం లేక, రైల్వే శాఖ ఇచ్చే మొత్తం చాలక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ రైల్వే జంక్షన్ మీదుగా నిత్యం మూడు వందలకు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. విజయవాడ రైల్వే పోలీసుల పరిధిలో అటు తెలంగాణ సరిహద్దు ఖమ్మం వరకు, గుడివాడ వైపు, కృష్ణా కెనాల్, గన్నవరం వైపు వివిధ రైళ్లు వస్తుంటాయి. రైలు కింద పడి ఆత్మహత్య, రైలు ఢీకొన్న ఘటనలు, రైలు నుంచి జారిపడి మృత్యువాత పడిన కేసులు నెలలో సుమారు పది నుంచి పదిహేను వస్తుంటాయి. వీటిలో అత్యధిక శాతం మంది వద్ద ఎలాంటి ఆధారాలు ఉండవు. దీంతో మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఖననం చేయాలి. మృతదేహాన్ని ఘటనా స్థలం నుంచి తరలించినప్పటి నుంచి పోస్టుమార్టం అయ్యేవరకూ సుమారు రూ.4 వేల ఖర్చవుతోంది. ఘటన జరిగినట్లుగా రైల్వే సిబ్బంది నుంచి సమాచారం వస్తేనే షౌటెడ్ చార్జిల కింద వెయ్యి రూపాయలు రైల్వే శాఖ నుంచి పోలీసులకు అందుతుంది. 108 ద్వారా వెళ్లినా, హాస్పిటల్ నుంచి సమాచారం వచ్చినా వారికి ఆ వెయ్యి రూపాయలు కూడా రావు. మిగిలిన ఖర్చులు పోలీసులే భరించాలి. దీంతో అనాథ శవాలు వచ్చాయంటే పోలీసులు ఆమడ దూరం పరిగెడుతున్నారు. షౌటెడ్ చార్జిలను పెంచాలంటే సికింద్రాబాద్‌లోని జీఎం కార్యాలయం నుంచి అనుమతి పొందాల్సి ఉంది. ఎవరూ పట్టించుకోకపోవడంతో కొన్నేళ్లుగా అదే వెయ్యి రూపాయలతో సిబ్బంది నెట్టుకొస్తున్నారు. ఖననం చేసేందుకు స్థలం కొరత మృతదేహాలను ఖననం చేసేందుకు స్థలం లేక పోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో కుమ్మరిపాలెం నీలిమా థియేటర్ సమీపంలో ఉన్న శ్మశానవాటికలో మృత దేహాలను ఖననం చేసేవారు. స్థానిక కార్పొరేటర్ బయట ప్రాంత శవాలను ఇక్కడ ఖననం చేయడానికి వీలులేదని కౌన్సిల్లో ప్రతిపాదన పెట్టడంతో ప్రస్తుతం ఈ అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో రైల్వే పోలీసులు సింగ్‌నగర్ వాంబేకాలనీలో ఉన్న శ్మశానవాటికలో ఖననం చేస్తున్నారు. రైల్వేకి సంబంధిం చిన మృతదేహం కావడంతో పాతి పెట్టాలంటే బయటవారితో గొయ్యి తీయించుకోవాలని సిబ్బంది చెబుతున్నారు. గొయ్యి తీయడానికి రూ.2,500 తీసుకుంటున్నారు. మృతదేహాన్ని తరలించేందుకు, పోస్టుమార్టం, ఇతర ఖర్చులు కలిపి మరో రూ.1,500 అవుతున్నాయని పోలీ సులు చెబుతున్నారు. కొన్ని రోజుల తర్వాత పేపర్లో పడిన ఫొటోలను చూసి మృతుల బంధువులు వస్తారని దీంతో మృతదేహాలను తిరిగి బయటకు తీయాల్సి వస్తుందని ఈ కారణంతోనే పూడ్చిపెడుతున్నామని పోలీసులు చెబుతున్నారు. లేకుంటే కృష్ణలంకలో ఉన్న కరెంటు మిషన్‌ను ఉపయోగించుకొనే వారమని చెబుతున్నారు. ఈ విషయమై నగరపాలక సంస్థ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రైల్వే బోర్డు కూడా ఈ షౌటెడ్ చార్జీలు పెంచాలని కోరుతున్నారు. -
సూపర్ ఫాస్ట్‌గా..
విజయవాడ రైల్వేస్టేషన్ రాజధాని హంగులను సమకూర్చుకుంటోంది. రూ.4.5 కోట్లతో చేపట్టిన ఆధునికీకరణ పనులు పూర్తికావస్తున్నాయి. క్లోక్‌రూమ్, ఏసీ వెయిటింగ్ హాళ్లను విస్తరించనున్నారు. తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు మరో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. మూడు ప్లాట్‌ఫాంలపైనా మరిన్ని సౌకర్యాలు కల్పిచేందుకు రైల్వే అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. విజయవాడ : విజయవాడ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు వేగవంతమయ్యూరుు. నవ్యాంధ్ర రాజధానిగా తుళ్లూరును ప్రకటించిన నేపథ్యంలో మార్చి నాటికి పనులు పూర్తిచేసేందుకు చూస్తున్నారు. నవ్యాంధ్రలో విజయవాడ రైల్వేస్టేషన్ కీలకం కావడంతో ఏడాది కిందటే అభివృద్ధి పనులు ప్రారంభించారు. ముఖ్యంగా స్టేషన్ ముందుభాగాన్ని అందంగా రాచనగరిని తలపించేలా తీర్చిదిద్దడంతో పాటు ప్రయాణికులకు ఉపయోగపడేలా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ పనులన్నింటినీ వచ్చే మార్చి నాటికి పూర్తిచేసిన తరువాత మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిసారించే అవకాశం ఉంది. దాహార్తి తీర్చేందుకు రిజర్వాయర్లు ఇటీవల కాలంలో రైల్వేస్టేషన్లో నీటి అవసరాలు బాగా పెరిగాయి. సకాలంలో నీరు అందుబాటులో లేకపోవడం వల్ల దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలో నీటిని నింపడం సాధ్యపడటం లేదు. రైల్వేస్టేషన్, పరిసరాల్లో ఉన్న రైల్వే క్వార్టర్స్, ఎలక్ట్రికల్ లోకోషెడ్ అన్నింటికీ కలిపి రోజుకు 1.25 కోట్ల లీటర్ల నీరు అవసరమవుతోంది. ఇప్పటికే 10 వరకు రిజర్వాయర్లు ఉండగా, తాజాగా తారాపేట వైపు ఐదు లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. ఈ రెండు రిజర్వాయర్ల నీరు స్టేషన్‌కు ఉపయోగిస్తారు. దీంతో నీటి కొరత తీర్చేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. రూ.4.5 కోట్లతో అభివృద్ధి పనులు రైల్వేస్టేషన్లో ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై రూ.4.5 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా స్టేషన్ ముందు భాగాన్ని బాగా విస్తరిస్తున్నారు. గతంలో స్టేషన్ ముందు భాగం కేవలం 50 మీటర్లే ఉండేది. ఇప్పుడు దీన్ని మరో 150 మీటర్లు పెంచి 200 మీటర్ల పొడవనా రాజప్రాకారం తరహాలో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇక ప్రయూణికుల రద్దీ ఎక్కువగా ఉండే రెండో ప్రవేశ ద్వారం వద్ద అంతా కూర్చునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి ప్లాట్‌ఫాంపైనే సాధారణ ప్రయాణికుల కోసం జనరల్ వెయిటింగ్ హాల్ నిర్మిస్తున్నారు. సుమారు 250 మంది విశ్రమించేందుకు వీలుగా వెయిటింగ్ హాల్ నిర్మాణం జరుగుతోంది. ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపైనే 50 మంది కూర్చునేందుకు వీలుగా ఏసీ వెయిటింగ్ హాల్ ఉండేది. ఇటీవల ఏసీ బోగీల్లో ప్రయాణించేవారి సంఖ్య పెరగటంతో ఈ హాల్ చాలడం లేదు. ఇప్పుడు ఉన్న ఏసీ హాలును వందమంది వేచి ఉండేలా విస్తరిస్తున్నారు. సామాన్లు భద్రపరుచుకునే గది (క్లోక్‌రూమ్)కు కూడా అభివృద్ధి పరుస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని రైల్వే అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. 8, 9, 10 ప్లాట్‌ఫాంలపై ప్రత్యేక దృష్టి ప్రస్తుతం ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై చేపట్టిన పనులు పూర్తికావస్తుండటంతో 8, 9, 10వ నంబరు ప్లాట్‌ఫాంలపై చేపట్టాల్సిన పనులపై అధికారులు దృష్టిసారించనున్నారు. ఈ మూడు ప్లాట్‌ఫాంలలో ప్రయాణికులకు అవసరమైన మేర వసతులు లేవు. ప్లాట్‌ఫాంల పొడవునా షెడ్లు లేకపోవడంతో వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ, చలికి వణుకుతూ ప్రయాణికులు రైళ్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. వచ్చే ఏడాది బడ్జెట్లో మూడు ప్లాట్‌ఫాంలకు మూడు కోట్లతో షెడ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. -
బెజవాడ రైల్వేకు ‘ఔటర్’ కష్టాలు
హైదరాబాద్: ప్రత్యేక జోన్ రేసులో ఉన్న బెజవాడ రైల్వే డివిజన్‌కు ‘ఔటర్’ కష్టాలు తప్పడం లేదు. ఉత్తర, దక్షిణ భారతావనిలను కలిపే ప్రధాన జంక్షన్ అయిన విజయవాడ స్టేషన్లో ఫ్లాట్‌ఫాంలు ఖాళీ లేక గంటల తరబడి రైళ్లు శివార్లలో నిలిచి ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. పైగా ఔటర్లో రైళ్లను నిలిపివేయడంతో ప్రయాణికులు అక్కడేదిగి పట్టాల మీద ఎదురుగా వచ్చే రైళ్లు ఢీకొని ప్రమాదాలకు గురై గడిచిన రెండేళ్లలోనే పదుల సంఖ్యలో మృత్యువాత పడిన సంఘటనలున్నాయి. వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్ గుర్తింపు పొందిన విజయవాడకు రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టం(ఆర్ఆర్ఐ) ఏర్పాటు కాకపోవడమే ప్రధాన అవరోధంగా నిలిచింది. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడను కేంద్రంగా చేసుకుని పలు కార్యాలయాలు ఇక్కడ్నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పైగా 13 జిల్లాల నుంచి ఇటీవలి కాలంలో విజయవాడకు రద్దీ పెరిగింది. రైళ్ల ట్రాఫిక్ కూడా ఎక్కువైంది. అయితే స్టేషన్లో ఆర్ఆర్ఐ సిస్టం ఏర్పాటు కాకపోవడంతో చెన్నై, హైదరాబాద్, వైజాగ్ రూట్ల నుంచి వచ్చే రైళ్లను ‘ఔటర్’లోనే గంటల కొద్దీ నిలిపేస్తున్నారు. క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో చెన్నై మార్గంలో కృష్ణాకెనాల్ వద్ద, హైదరాబాద్, వైజాగ్‌ల నుంచి వచ్చే రైళ్లను రాయనపాడు వద్ద గంటల తరబడి నిలుపుతూ ప్రయాణికులకు నరకం చూపిస్తున్నారు. గత కృష్ణా పుష్కరాలకు రూ.7 కోట్ల వ్యయంతో ఆర్ఆర్ఐ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా తారాపేట టెర్మినల్ వైపు నం.8, 9, 10 ప్లాట్‌ఫాంలు నిర్మించారు. వీటిపై ప్రస్తుతం ట్రాఫిక్ వన్‌వే గానే ఉంది. దశాబ్దానికి పైగా ఈ పనులు చేపట్టకపోవడంతో నేటికీ ఆర్ఆర్ఐ పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. అంచనా వ్యయం మాత్రం అంతకంతకు పెరిగి ఇప్పుడు రూ.70 కోట్లకు పైగా చేరింది. విజయవాడ డివిజన్ నుంచి గూడ్సు రవాణా, ప్రయాణికుల రైల్వే చార్జీలు కలిపి వార్షికాదాయం రూ. 3 వేల కోట్లకు పైగా ఉంది. దేశంలోనే ఆదాయంలో విజయవాడ రెండో స్థానంలో ఉన్నా, ఇక్కడ వసతుల కల్పనలో మాత్రం రైల్వే బోర్డు వివక్ష చూపుతూనే ఉంది. ఆర్ఆర్ఐ క్యాబిన్ ఏర్పాటుకు కీలకమైన కృష్ణాకెనాల్ వద్ద ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఓ ‘పాయింట్’ ఏర్పాటుకు రైల్వే బోర్డు నుంచి అనుమతులు రావడం లేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధమవుతోంది. త్వరలో గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు జరగనున్నాయి. ఈ దఫా మహాకుంభ మేళా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ ఊహించని స్థాయిలో ఉంటుంది. ఈలోగానైనా రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తేనే ‘ఔటర్’ కష్టాలు తప్పుతాయి. -
నమ్మించి... మోసం చేశాడు..
మచిలీపట్నం క్రైం : ప్రేమించానన్నాడు... పెళ్లిచేసుకుంటానన్నాడు... మాయమాటలు చెప్పాడు... ఆపై ఆమెను లొంగదీసుకుని ఐదు నెలల గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి విషయానికి వచ్చే సరికి మొహం చాటేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని సదరు యువతి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటనపై మంగళవారం చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మచిలీపట్నం ఎన్టీఆర్ కాలనీకి చెందిన నారగాని శ్రీనివాసరావు రోల్డుగోల్డు పనులు చేస్తుంటాడు. ఇతనికి భార్య ఇరువురు పిల్లలున్నారు. అయితే అదే ప్రాంతానికి చెందిన ఓ 19 ఏళ్ల యువతి శ్రీనివాసరావు వద్ద పని నిమిత్తం చేరింది. ప్రతి రోజూ పని నిమిత్తం అతని ఇంటికి వెళ్లి వస్తుండేది. వారిద్దరి మధ్య చనువు పెరిగి శ్రీనివాసరావు ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. అతని మాయమాటలు నమ్మిన సదరు యువతి శ్రీనివాసరావుకు శారీరకంగా దగ్గరయ్యింది. యువతి తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడంతో వారు పనులకు వెళ్లిపోయేవారు. దీంతో సమయం కుదిరినప్పుడల్లా శ్రీనివాసరావు యువతి ఇంటికి వెళ్లి ఆమెను లొంగదీసుకునే వాడు. దీంతో సదరు యువతి నెలసరి ఆగిపోవడంతో అనుమానం వచ్చిన శ్రీనివాసరావు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు. అయితే వైద్యులు యువతి ఐదు నెలల గర్భవతి అని ధ్రువీకరించారు. దీంతో శ్రీనివాసరావును వివాహం చేసుకోవాలంటూ యువతి ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. అందుకు శ్రీనివాసరావు 12వ తేదీన ఆమెను విజయవాడ రైల్వే స్టేషన్‌కు వస్తే ఇద్దరం వివాహం చేసుకుందామని చెప్పాడు. అతని మాటలు నమ్మిన ఆమె ఇంట్లో తెలియకుండా విజయవాడ వెళ్లి పోయింది. అయితే శ్రీనివాసరావు ఎంతకీ రాకపోవడంతో రైల్వేస్టేషన్లో రోజంతా ఒంటరిగా గడిపింది. యువతి అదృశ్యంతో కంగారుపడిన తల్లిదండ్రులు, బంధువులు ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా విజయవాడ రైల్వేస్టేషన్లో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఆమె బంధువులు అక్కడికి చేరుకుని యువతిని తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన సదరు యువతి శ్రీనివాసరావు తనను నమ్మించి గర్భవతిని చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బెజవాడ రైల్వే స్టేషన్ వద్ద బాంబు గుర్తింపు
చెన్నై రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో గురువారం బాంబు పేలుడు సంభవించిన నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు అప్రమత్తమైయ్యారు. అందులోభాగంగా అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్ట్ లను పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద రైల్వే క్లాక్ టవర్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అక్కడ ఉంచిన కొన్ని బాంబులను పోలీసులు గుర్తించారు. అవి స్థానికంగా తయారైన బాంబులని పోలీసులు వెల్లడించారు. గుంటూరులో మోడీ సభ నేపథ్యంలో... ఆగంతకులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ బాంబులు ఆ అంత శక్తిమంతమైనవి కావని రైల్వే ఎస్పీ తెలిపారు. అయితే విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్నపినాకినీ ఎక్స్‌ప్రెస్‌లో ఓ సూట్ కేసు కలకలం సృష్టించింది. సూట్ కేసును గుర్తించిన ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి సూట్ కేసును తనిఖీ చేస్తుంది. -
గంగోత్రి ఎక్స్‌ప్రెస్ బోగీలో చెలరేగిన మంటలు
విజయవాడ: నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగి రెండు రోజులైనా కాకముందే మరో రైల్లో మంటలు చెలరేగాయి. అయితే సకాలంలో గుర్తించడంతో ప్రమాదం తప్పింది. విజయవాడలో గంగోత్రి ఎక్స్ ప్రెస్ బోగీలో మంటలు చెలరేగాయి. ఆరో నంబర్ ప్లాట్ ఫామ్‌పై ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలను గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలు ఆర్పేశారు. అయితే మీడియాను రైల్వేస్టేషన్‌లోకి అనుమతించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లా కొత్తచెరువు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు మంటలు అంటుకోవడంతో జరిగిన ఘోర ప్రమాదంలో 26మంది సజీవ దహనం కాగా, పలువురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. -
విజయవాడలో కలకలం రేపిన తుపాకి