
సాక్షి, విజయవాడ: దేశ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టిన బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ.. సీపీఎం నాయకులు నిరసనకు దిగారు. దానిలో భాగంగా సోమవారం విజయవాడ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద బీజేపీకి వ్యతిరేంకగా నినాదాలు చేస్తూ... నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు బాబురావు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ.. వారి బ్యాంక్ రుణాలు మాఫీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్‌లకు వరాలు ఇస్తూ.. సామాన్యులపై భారం మోపుతున్నారని మండి పడ్డారు.
కొత్త మోటారు వాహన చట్టంతో అధిక మొత్తంలో చలానాలు వసూలు చేస్తూ.. కార్మికులు నడ్డి విరుస్తున్నారని బాబురావు ఆరోపించారు. విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మొండిచేయి చూపారని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తోందని.. ఇందుకు నిరసనగా ఈ నెల 16వ తేదీన రాస్తారోకో చేపట్టబోతున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment