విజయవాడ రైల్వేస్టేషన్‌లో దారుణ హత్య | Brutal Assassination Of Loco Pilot At Vijayawada Railway Station, Watch Shocking Video Goes Viral | Sakshi
Sakshi News home page

విజయవాడ రైల్వేస్టేషన్‌లో దారుణ హత్య

Published Fri, Oct 11 2024 4:16 AM | Last Updated on Fri, Oct 11 2024 1:31 PM

Brutal assassination at Vijayawada railway station

లోకో పైలట్‌పై ఇనుప రాడ్‌తో దాడి 

చికిత్స పొందుతూ మరణించిన లోకో పైలట్‌ 

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): విజయవాడ రైల్వే స్టేషన్‌లో దారుణ హత్య జరిగింది. విధుల్లో ఉన్న లోకో పైలట్‌ను ఓ ఆగంతకుడు ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. షంటింగ్‌ లోకో పైలట్‌గా పని చేస్తున్న డి.ఎబినేజర్‌ (52) గురువారం తెల్లవారుజామున విధుల్లో భాగంగా నైజాంగేటు సమీపంలోని ఏటీఎల్‌సీ కార్యాలయం నుంచి ఎఫ్‌–క్యాబిన్‌ వద్దకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అతని వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. 

రాడ్‌తో పలుమార్లు కొట్టడంతో తీవ్ర గాయాలైన ఎబినేజర్‌ అపస్మారక స్ధితిలో రైలు ట్రాక్‌పై పడిపోయాడు. దూరం నుంచి దీనిని గమనించిన మరో లోకో పైలట్‌ వృధ్వీరాజ్‌ పరుగున అక్కడికి వచ్చారు. సమీపంలో ఉన్న వారితో కలిసి ఎబినేజర్‌ను రైల్వే హాస్పటల్‌కు తరలించారు. పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఒక ప్రైవేటు హాస్పటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

విజయవాడ జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదు బృందాలతో నిందితుని కోసం గాలింపు చర్యలు చేçపట్టారు. రైల్వే స్టేషన్‌ పరిసరాలలోని సీసీ టీవీ ఫుటేజ్‌ల ద్వారా దాడికి పాల్పడిన నిందితుడిని గుర్తించారు. ఆ వ్యక్తే నైజాంగేటు సెంటర్‌లో ఆటోలో నిద్రిస్తున్న వ్యక్తిపై కూడా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతను గంజాయి మత్తులో ఈ దాడులకు పాల్పడుతుండవచ్చని చెబుతున్నారు. 

	విజయవాడలో కలకలం.. గంజాయి బ్యాచ్ దాడిలో లోకో పైలట్ మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement