రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే స్టేషన్ భారతీయ రైల్వేలోనే ఎంతో ప్రతిష్టాత్మక ఎన్‌ఎస్‌జీ–1 (నాన్ సబర్బన్ గ్రూప్) హోదా సాధించి దేశంలోనే టాప్ 28 స్టేషన్లలో ఒకటిగానూ, దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ తరువాత రెండో స్టేషన్‌గా అరుదైన ఘనత సాధించింది. రైల్వేబోర్డు 2017–18 సంవత్సరం నుంచి ప్రతి ఐదేళ్లకోసారి స్టేషన్ల కేటగిరీ ఎంపిక విధానం ప్రవేశపెట్టింది.
ఈ విధానంలో రూ.500 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం లేదా 20 మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న స్టేషన్లకు ఎన్‌ఎస్‌జీ–1 హోదా వస్తుంది. అప్పట్లో విజయవాడ స్టేషన్ రెండు ప్రమాణాలలో తక్కువగా ఉండటంతో ఎస్‌ఎస్‌జీ–2 హోదాతో సరిపెట్టుకుంది.
ఐదేళ్ల తరువాత 2023–24లో రైల్వేబోర్డు తాజా సమీక్షలో విజయవాడ స్టేషన్ అత్యధికంగా రూ. 528 కోట్ల వార్షిక ఆదాయం, 16.84 మిలియన్ల ప్రయాణికులను కలిగి ఉండడంతో రైల్వేశాఖ ఎన్‌ఎస్‌జీ–1 హోదా ప్రకటించింది. డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ మాట్లాడుతూ విజయవాడ డివిజన్‌కు ప్రతిష్టాత్మక ఎన్‌ఎస్‌జీ–1 హోదా రావటం గర్వకారణమన్నారు.
వ్యాపార, వాణిజ్య పరంగా డివిజన్ ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రయాణికుల అవసరాల మేరకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment