NSG
-
విజయవాడ రైల్వేస్టేషన్‌కు ఎన్ఎస్జీ–1 హోదా
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే స్టేషన్ భారతీయ రైల్వేలోనే ఎంతో ప్రతిష్టాత్మక ఎన్ఎస్జీ–1 (నాన్ సబర్బన్ గ్రూప్) హోదా సాధించి దేశంలోనే టాప్ 28 స్టేషన్లలో ఒకటిగానూ, దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ తరువాత రెండో స్టేషన్‌గా అరుదైన ఘనత సాధించింది. రైల్వేబోర్డు 2017–18 సంవత్సరం నుంచి ప్రతి ఐదేళ్లకోసారి స్టేషన్ల కేటగిరీ ఎంపిక విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానంలో రూ.500 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం లేదా 20 మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న స్టేషన్లకు ఎన్ఎస్జీ–1 హోదా వస్తుంది. అప్పట్లో విజయవాడ స్టేషన్ రెండు ప్రమాణాలలో తక్కువగా ఉండటంతో ఎస్ఎస్జీ–2 హోదాతో సరిపెట్టుకుంది. ఐదేళ్ల తరువాత 2023–24లో రైల్వేబోర్డు తాజా సమీక్షలో విజయవాడ స్టేషన్ అత్యధికంగా రూ. 528 కోట్ల వార్షిక ఆదాయం, 16.84 మిలియన్ల ప్రయాణికులను కలిగి ఉండడంతో రైల్వేశాఖ ఎన్ఎస్జీ–1 హోదా ప్రకటించింది. డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ మాట్లాడుతూ విజయవాడ డివిజన్‌కు ప్రతిష్టాత్మక ఎన్ఎస్జీ–1 హోదా రావటం గర్వకారణమన్నారు. వ్యాపార, వాణిజ్య పరంగా డివిజన్ ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రయాణికుల అవసరాల మేరకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. -
ఢిల్లీలో బాంబు కలకలం: ఓ ఇంట్లో అనుమానాస్పద బ్యాగ్..!!
-
పేలుడు పదార్ధాల డ్రోన్‌ను నేలకూల్చిన ఎన్ఎస్జీ
జమ్మూ కశ్మీర్ : పేలుడు పదార్థాలు కలిగిన డ్రోన్‌ను భద్రతా దళాలు నేలకూల్చాయి. శుక్రవారం కనాచక్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. డ్రోన్‌లో ఉన్న 5 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై జమ్మూ కశ్మీర్ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘కనాచక్ ఏరియాలో ఓ డ్రోన్‌ను నేలకూల్చాము. దానినుండి పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నాము. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’’ అని తెలిపాడు. కాగా, గత నెలలో జమ్మూ ఏయిర్ బేస్‌లో చోటు చేసుకున్న డ్రోన్ దాడి నేపథ్యంలో ఎన్ఎస్జీ సిటీలో యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఇతర ఏయిర్ బేస్‌లలో డ్రోన్ దాడులు జరగకుండా ఉండేందుకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం సత్వారీ ఏరియాలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ డ్రోన్‌ను గుర్తించారు. జులై 16న జమ్మూ ఏయిర్ బేస్‌లో సంచరిస్తున్న ఓ డ్రోన్‌ను రాడార్లు, యాంటీ డ్రోన్ సిస్టమ్ గుర్తించాయి. దీంతో భద్రతా దళాలు దాన్ని నేల కూల్చాయి. -
పౌరసత్వం ఇచ్చి తీరుతాం..
కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద దేశంలోని శరణార్థులందరికీ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చి తీరుతుందని.. అప్పటివరకు వెనకడుగు వేసేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. సీఏఏ శరణార్థులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించింది మాత్రమేనని.. దీనివల్ల ఏ ఒక్క వ్యక్తి తన పౌరసత్వాన్ని కోల్పోడని ఉద్ఘాటించారు. తృణమూల్ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు సీఏఏపై అసత్య ప్రచారాన్ని చేస్తూ.. మైనారిటీలు, శరణార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. పౌరసత్వం కోసం శరణార్థులు పత్రాలు చూపించాలని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. కోల్‌కతాలో ఆదివారం నిర్వహించిన ఓ పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న అమిత్‌షా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ధ్వజమెత్తారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి.. మమత అల్లర్లకు ఆజ్యం పోస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని దళితులు, వెనుకబడిన మతువా కులాలకు పౌరసత్వం రాకుండా మమత అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దమ్ముంటే పౌరసత్వ చట్ట అమలును ఆపాలని మమతకు సవాల్ విసిరారు. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలని ప్రధాని మోదీ ఆలోచిస్తుంటే మమత సహా ప్రతిపక్షాల నేతలు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. 2021లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో విజయం సాధించి.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఆర్ నోయ్ అన్యాయ్ (ఇక అన్యాయాన్ని సహించం)’అనే ప్రచారాన్ని అమిత్‌షా ప్రారంభించారు. ర్యాలీలో ‘గోలీమారో’నినాదాలు.. షహీద్ మినార్ గ్రౌండ్లో జరిగిన అమిత్‌షా ర్యాలీలో కొందరు బీజేపీ కార్యకర్తలు ‘గోలీమారో’అని నినాదాలు చేశారు. దీనికి సంబంధించి కోల్‌కతా పోలీసులను వివరణ కోరగా.. స్పందించేందుకు నిరాకరించారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. భారత్‌లో మెరుగైన రక్షణ విధానం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో మెరుగైన రక్షణ విధానాన్ని రూపొందించిందని అమిత్‌షా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. 10 వేల ఏళ్ల చరిత్రలో భారత్ ఎలాంటి దాడులూ జరపలేదని.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు. ఎవరైనా తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించినా.. జవాన్లు, ప్రజల మీద దాడులకు యత్నించినా.. భారత్ గట్టిగా బదులిస్తుందని పేర్కొన్నారు. రాజర్హాట్లో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) 29వ స్పెషల్ కంపోసిట్ గ్రూప్ (ఎస్సీజీ) కాంప్లెక్స్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. ఎన్ఎస్జీ అంటే ఉగ్ర వ్యతిరేక దళంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని అన్నారు. -
‘మెరుపు దాడులతో ఆ దేశాల సరసన భారత్’
కోల్‌కతా : దేశాన్ని విభజించి శాంతిని అడ్డుకునే వారి వెన్నులో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) వణుకు పుట్టించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అలాంటి శక్తులతో పోరాడి వాటిని అంతమొందించే బాధ్యత ఎన్‌ఎస్‌జీదేనని అన్నారు. కోల్‌కతాలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం తాము చురుకైన సమర్ధవంతమైన రక్షణ విధానాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. మెరుపు దాడులను విజయవంతంగా చేపట్టడం ద్వారా అమెరికా, ఇజ్రాయిల్ వంటి దేశాల సరసన భారత్ చేరిందని అన్నారు. యావత్ ప్రపంచంలో శాంతిని భారత్ కోరుకుంటుందని, ఏ ఒక్కరిపైనా భారత్ ఎన్నడూ దాడి చేయదని, కానీ మన శాంతిని విచ్ఛిన్నం చేసి మన సైనికుల ప్రాణాలను బలిగొంటే మాత్రం వారికి దీటుగా బదులిస్తుందని స్పష్టం చేశారు. కాగా నిరసనల నడుమ ఆదివారం ఉదయం కోల్‌కతాకు చేరుకున్న అమిత్ షా ఏప్రిల్‌లో జరిగే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కోల్‌కతాలో జరిగే భారీ ర్యాలీతో శ్రీకారం చుట్టనున్నారు. చదవండి : అమిత్ షా రాజీనామా చేయాలి: సోనియా గాంధీ -
ట్రంప్ పర్యటన.. ఎక్కడికక్కడ వైమానిక నిఘా
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బారత్‌కు రానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. ట్రంప్ బస చేయనున్న ఐటీసీ మౌర్య హోటల్, రోడ్‌షో నిర్వహించనున్న మార్గాల్లో ఇప్పటికే పలుమార్లు తనిఖీలు నిర్వహించారు. సర్దార్ పటేల్ మార్గ్, మౌర్య హోటల్ సమీపంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వందల సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని మౌర్య హోటల్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. హోటల్లోని ప్రతి ఫ్లోర్లో ఢిల్లీ పోలీసులు సివిల్ దుస్తుల్లో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. అమెరికాకు చెందిన సీక్రెట్ సర్వీస్ అధికారులు, భారత్‌కు చెందిన జాతీయ భద్రతా సిబ్బంది (ఎన్ఎస్జీ), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు సైతం వీరికి జతకలిశారు. వీరితో పాటు దాదాపు 10 వేల మంది పోలీసులు గుజరాత్‌లోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు. 25 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు, స్టేట్ రిజర్వ్ పోలీసులు, చేతక్ కమాండోలు, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్లు సైతం వీరికి జతకలిశాయి. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొటెరా స్టేడియం వరకు దాదాపు 22 కి.మీ. మేర ట్రంప్, మోదీల రోడ్‌షో జరగనున్న నేపథ్యంలో పరిసరాలను గమనించేందుకు పోలీసులు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. బాంబు పేలుళ్లు వంటివి సంభవించకుండా అధునాతన పరికరాల సాయంతో రోడ్డు మార్గాన్ని పలుమార్లు జల్లెడ పట్టారు. రోడ్‌షో జరిగే మార్గంలో 100 వాహనాలతో రిహార్సల్ నిర్వహించారు. మెలానియాకు సైతం.. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ట్రంప్ పర్యటించనున్న అన్ని మార్గాల్లో డబుల్ బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. ఈ మార్గాలపై వైమానిక నిఘా ఉంచారు. సబర్మతి ఆశ్రమానికి తొలిసారిగా భారత్ పర్యటనకు వస్తున్న ట్రంప్ సోమవారం గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నట్లు సిటీ పోలీసు కమిషనర్ ఆశిష్ భాటియా వెల్లడించారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ రోడ్‌షోలో పాల్గొననున్న ట్రంప్.. మార్గమధ్యంలో సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారని చెప్పారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆయన ఆశ్రమంలో గడపనున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత తిరిగి రోడ్‌షోను కొనసాగిస్తారని వెల్లడించారు. ట్రంప్ ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కూడా సందర్శించనున్నట్లు తెలిపారు. ట్రంప్‌తో పాటు ప్రధాని మోదీ సైతం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ట్రంప్ హృదయ్ కుంజ్‌ను సందర్శించనున్నారని సబర్మతీ ఆశ్రమం సెక్రటరీ అమృత్ మోదీ వెల్లడించారు. ట్రంప్ రాక సందర్భంగా ఆశ్రమంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీక్రెట్ ఏజెన్సీ ఏం చేస్తుంది? అమెరికా అధ్యక్షుడితోపాటు ఆయన కుటుంబం రక్షణ బాధ్యతలను చూసుకునే బాధ్యత అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీదే. ప్రథమ పౌరుడి రక్షణకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఈ విభాగమే పర్యవేక్షిస్తుంటుంది. అధ్యక్షుడు ప్రయాణించే మార్గాన్ని శుభ్రంగా ఉంచటంతోపాటు అనుకోని ఆపద ఎదురైతే తప్పించుకునే మార్గాలు, ప్రణాళికలు సిద్ధంగా ఉంచుతుంది. ప్రమాదం సంభవిస్తే అవసరమైన రక్తాన్ని కూడా సిద్ధంగా ఉంచుతుంది. అధ్యక్షుడిని ఎల్లప్పుడూ అనుసరించి ఉండే వారికీ ఈ విభాగం రక్షణ కల్పిస్తుంది. అధ్యక్షునితో పాటు ఎల్లప్పుడు ఉండేవాటిలో 20 కిలోల బరువుండే జీరో హాలిబర్టన్ నల్లటి బ్రీఫ్‌కేస్ కూడా ఒకటి. ఇందులో అమెరికా అణు క్షిపణుల రహస్య కోడ్ భద్రపరిచి ఉంటుంది. అధ్యక్షుడు విశ్రాంతి తీసుకునే గది వరకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అనుసరిస్తూనే ఉంటాడు. చట్టం ప్రకారం.. తనను ఒంటరిగా వదిలి వేయాలని అధ్యక్షుడు సైతం ఆ అధికారిని ఆదేశించలేడు. 1865లో ఏర్పాటైన ఈ విభాగం 1901 నుంచి అధ్యక్షుడికి రక్షణగా నిలుస్తోంది. సుమారు 7 వేల మందితో కూడిన ఈ విభాగంలో 25% మహిళ లుం టారు. ప్రపంచంలోని ఏ దేశ సైన్యం కంటే కూడా అత్యంత కఠినమైన శిక్షణ వీరికి ఇస్తారు. సీక్రెట్ సర్వీస్ కోసం అందిన ప్రతి 100 దరఖాస్తుల్లో ఒకటి కంటే తక్కువగానే ఎంపిక వుతుంటాయి. వర్జీనియాలో ఉండే ఈ విభాగం లో శిక్షణ పొందిన వారు.. అధ్యక్షుడి కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ హాలీవుడ్ సినిమా ల్లో చూపిస్తున్న విధంగా ప్రమాణ చేయరట! గంటకు 1.02 కోట్లు రష్యా అధ్యక్షుడి మెర్సిడెంజ్ బెంజ్ కారు, చైనా అధ్యక్షుడి హాంగ్‌కి ఎల్5 కారుతో పోల్చుకుంటే అమెరికా అధ్యక్షుడి కారు బీస్ట్ చాలా ఖరీదైంది. అధునాతనమైంది కూడా. అలాగే, అమెరికా అధ్యక్షుడి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం గంట ప్రయాణానికి రూ.1.02 కోట్లు ఖర్చవుతుందట. ఈ విమానంలో పెద్ద ఆఫీసు, కాన్ఫరెన్స్ హాల్, వంద మందికి సరిపడా ఆహారం వండేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. అధ్యక్షుడికి విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన సూట్ ఉంటుంది. మొత్తంగా ఇది ఒక విమానం మాదిరిగా కాకుండా హోటల్‌గా ఉంటుంది. అణ్వస్త్రం, క్షిపణి దాడిని సైతం తట్టుకునేలా ఇందులో ఏర్పాట్లుంటాయి. అమెరికాపై దాడి జరిగినప్పుడు ప్రతిస్పందించేలా ఎయిర్ ఫోర్స్ వన్ సంచార కమాండ్ సెంటర్‌గా పనిచేస్తుంది. వీటితోపాటు అధ్యక్షుడి భారీ కారు లిమోజిన్, వెయ్యి మంది సిబ్బంది, ప్రత్యేక రక్షణ పరికరాలు.. వీటన్నిటికీ సీ5 రకం కార్గో విమానం ఉంటుంది. 2017లో ట్రంప్ జెరుసలేం పర్యటనకు వెళ్లినప్పుడు కింగ్ డేవిడ్ హోటల్లో బస చేశారు. ఆ హోటల్లో ఒక్క రాత్రికి రూ.3.95 లక్షలుండే సూట్లతోపాటు సిబ్బంది కోసం 1,100 రూంలను బుక్ చేయాల్సి వచ్చిందట. -
సాయుధ బలగాల కుదింపు
న్యూఢిల్లీ: పారామిలటరీ బలగాలను కుదించి, పోరాటపటిమను పెంచే వివిధ ప్రతిపాదనలను కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది. ‘ఒకే సరిహద్దు.. ఒకే సైన్యం’విధానంలో భాగంగా సశస్త్రసీమా బల్(ఎస్ఎస్బీ), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) విభాగాలను విలీనం చేయడం వంటి ప్రతిపాదనలున్నాయని అధికారులు వెల్లడించారు. దీనిపై సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను మరో ఆరునెలల్లో అందజేయనుంది. సీఆర్పీఎఫ్తో ఉగ్రవాద వ్యతిరేక కమాండోలు, ఎన్ఎస్జీలను కూడా ఏకం చేసే అంశంపైనా చర్చ జరుగుతోంది. ఉగ్ర వ్యతిరేక పోరు, హైజాక్ ఘటనలు, మావోయిస్టు, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే ఈ రెండు విభాగాలను ఒకే కమాండ్ కిందికి తీసుకువచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. హోం శాఖ నేతృత్వంలో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ)తోపాటు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్బీలున్నాయి. -
ప్రాంక్ కాల్.. ఆపై కటకటాల పాలు..
ముంబై : ప్రధాని నరేంద్ర మోదీపై దాడులు జరుగుతాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ప్రాంక్ కాల్ చేసిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ముంబై పోలీసులు సోమవారం వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన 22 ఏళ్ల కాశీనాథ్ మండల్ ముంబైలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నెంబర్ సేకరించాడు. ఆపై ఎన్ఎస్జీ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ప్రధాని మోదీపై దాడి జరుగుతుందని సమాచారం ఇచ్చాడు. కెమికల్ దాడి జరిగే అవకాశం ఉందని, తన వద్ద సమాచారం ఉందని ఎన్ఎస్జీని నమ్మించాడు. ఫోన్ నెంబర్ ఆధారంగా కాశీనాథ్‌ను సెంట్రల్ ముంబైలోని డీబీ మార్గ్ పోలీసులు జూలై 27న అదుపులోకి తీసుకున్నారు. సూరత్‌కు వెళ్లే రైలులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నరేంద్ర మోదీని కలుసుకోవడమే తన ఉద్దేశమని కాశీనాథ్ విచారణలో వెల్లడించాడు. ఇటీవల జార్ఖండ్‌లో జరిగిన నక్సల్స్ దాడిలో తన స్నేహితుడు చనిపోయాడని.. ఈ విషయంపై ప్రధాని మోదీని కలుసుకుని మాట్లాడాలని భావించినట్లు నిందితుడు పేర్కొన్నాడు. నిందితుడిని నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. -
దేశరక్షణలో ఎన్ఎస్జీ సుదర్శన చక్రం
-
ఎన్ఎస్జీ పేరు వింటే ఉగ్రవాదులకు దడ
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జాతీయ భద్రతా దళాల(ఎన్ఎస్జీ) పేరు వింటే ఉగ్రవాదుల గుండెల్లో గుబులు పుడుతుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. దేశంపై కన్నెత్తి చూసే టెర్రరిస్టులకు ఎన్ఎస్జీ సుదర్శన చక్రంలా కనిపిస్తుందని అన్నారు. అన్ని బలగాల్లోకెల్లా ఎన్ఎస్జీ కమాండోలు అత్యుత్తమమని కొనియాడారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో వాటిపాత్ర చాలా గొప్పదని ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వినోబానగర్‌లో రూ.157.84 కోట్ల వ్యయంతో 200 ఎకరాల్లో నిర్మించిన 28వ స్పెషల్ కంపోజిట్ గ్రూప్(ఎస్సీజీ) భవన సముదాయాన్ని మంగళవారం రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్ సుదీప్ లక్టాకియా, రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఉగ్రవాదం ప్రపంచ నలుమూలలకు పాకిందని, సామాజిక మాధ్యమాల్లోనూ కొత్త సవాళ్లను విసురుతోందని రాజ్‌నాథ్ అన్నారు. ఈ తరహా సవాళ్లను సైతం అధిగమించేందుకు సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. దేశంలో విధ్వంసాలు సృష్టించేందుకు పొరుగు దేశం ప్రయత్నిస్తోందని పాకిస్తాన్‌ను ఉద్దేశించి అన్నారు. 2008లో ముంబైలో టెర్రరిస్టులు చేసిన దాడుల నేపథ్యంలో బలగాలు ప్రతిచర్యకు దిగే సమయాన్ని వీలైనంతగా తగ్గించాలన్న ఉద్దేశంతో ఎస్సీజీ రీజినల్ హబ్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రం భావించిందన్నారు. అందులో భాగంగానే హైదరాబాద్‌తో పాటు ముంబై, చెన్నై, కోల్‌కతాలో స్థాపించినట్లు వివరించారు. ముంబై, అక్షరధామం, పఠాన్‌కోట్ దాడులు తీవ్ర నష్టం కలిగించాయని, అలాంటి ఘటనలను భారతీయులు మర్చిపోలేరని చెప్పారు. ప్రముఖులకు రక్షణ కల్పించడంతోపాటు ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ సదస్సులను విజయవంతంగా నిర్వహించడంలో ఎన్ఎస్జీల పాత్రను అభినందించారు. ఆ దళాలు చేపట్టే ఎటువంటి కార్యక్రమాల్లోనైనా పాల్గొనడాన్ని గౌరవప్రదంగా భావిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎలాంటి భద్రతా బలగాలైనా ఎన్ఎస్జీ తరహాలో ధైర్యసాహసాలు, నైపుణ్యాలను కలిగి ఉండాలన్నారు. వచ్చే సంవత్సరంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్న 16 మంది సభ్యులతో కూడిన ఎన్ఎస్జీ బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. ఉగ్రమూకలను మట్టుబెట్టడంలో ఎన్ఎస్జీలు కీలకంగా పనిచేస్తున్నాయని ఎన్ఎస్జీ డీజీ సుదీప్ లక్టాకియా అన్నారు. ఎన్ఎస్జీలు తన శక్తియుక్తులను ఇనుమడింప చేసుకొనే ప్రయత్నాల్లో భాగంగా ఫ్రాన్స్, యూఎస్ఏలతో కలసి విన్యాసాలను నిర్వహించిందని తెలిపారు. ధైర్యానికి, త్యాగానికి, నైపుణ్యాలకు ఎన్ఎస్జీలు ప్రతీకలని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎస్సీజీ ఏర్పాటవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. అంతకుముందు స్పెషల్ కంపోజిట్ కాంప్లెక్స్‌లో శిక్షణలో భాగంగా నేర్చుకున్న విన్యాసాలను ఎన్ఎస్జీ బ్లాక్‌క్యాట్ కమాండోలు ప్రదర్శించారు. కేంద్ర హోంమంత్రి తదితరులు వీటిని వీక్షించి కమాండోల ధైర్యసాహసాలను ప్రశంసించారు. -
ఎన్ఎస్జీ రెడీ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఉగ్రమూకల పీచమణిచే జాతీయ భద్రతాదళం(ఎన్ఎస్జీ) ప్రాంతీయ శిక్షణా కేంద్రం మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది. 2008 నవంబర్‌లో ముంబై మహానగరంపై ఐఎస్ఐ తీవ్రవాదులు దాడులకు పాల్పడిన అనంతరం ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లో ఎన్ఎస్జీ ప్రాంతీయ శిక్షణా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముష్కరులను హతమార్చిన ఎన్ఎస్జీ కమాండోల పోరాట పటిమకు అప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలందాయి. ఇదే క్రమంలో ఇలాంటి ఘటనలను దీటుగా ఎదుర్కొనేందుకు నలువైపులా ప్రాంతీయ శిక్షణా కేంద్రాలు అవసరమని కేంద్ర సర్కారు భావించింది. అందుకనుగుణంగా దక్షిణాదిన చెన్నైతోపాటు మన రాష్ట్రంలో ఎన్ఎస్జీ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.157.84 కోట్లతో 200 ఎకరాల్లో.. ఇబ్రహీంపట్నం మండలం వినోభానగర్‌లో 200 ఎకరాల విస్తీ ర్ణంలో ప్రతిపాదించిన ఈ కమాండో శిక్షణా కేంద్రం నిర్మాణ పనులకు 2013లో అప్పటి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే శంకుస్థాపన చేశారు. రూ. 157.84 కోట్లతో కేంద్ర ప్రజా పనుల విభాగం నిర్మించిన ఈ కాంప్లెక్స్‌ను మంగళవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించనున్నారు. ఈ ప్రాంగణంలో హెలిపాడ్, ఫైరింగ్ రేంజ్, ఇండోర్ షూటింగ్ రేంజ్, స్విమ్మింగ్ ఫూల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉన్నాయి. కాగా, కేంద్ర హోంమంత్రి పర్యటన నేపథ్యంలో డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం ఎన్ఎస్జీ ప్రాంగణాన్ని పరిశీలించారు. -
పాకిస్తాన్‌కు గట్టి షాకిచ్చిన అమెరికా
వాషింగ్టన్: పాకిస్తాన్‌కు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్( ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం ఆరాటపడుతున్న పాకిస్తాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. అణుసంబంధిత వ్యాపారం చేసే ఏడు సంస్థలపై అమెరికా నిషేదం విధించడంతో ఎన్ఎస్జీలో సభ్యత్వం పొందాలనే పాక్ ఆశలు అడియాశలయ్యాయి. పాక్‌కు చెందిన ఈ సంస్థలు అణు సంబంధిత వ్యాపారం చేస్తూ అమెరికాకు నష్టం చేకూరుస్తాయనే నెపంతో నిషేదం విధించింది. ఉగ్ర కార్యకలాపాలపై నిఘా ఉంచే ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్ ఆశలు ఆదిలోనే ఆవిరయ్యాయి. భారత్‌తో సమానంగా ఎన్ఎస్జీలో సభ్యత్వం కావాలని పాక్ గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే భారత్‌కు ఈ విషయంలో అనేక దేశాల మద్దతు లభించింది. అలాగే క్షిపణి పరిఙ్ఞానం, వాసేనర్ ఒప్పందం, ఆస్ట్రేలియా గ్రూప్‌లో ఇప్పటికే భారత్‌కు సభ్యత్వం ఉంది. సాధారణంగా ఈ సభ్యత్వాలను ఎన్ఎస్జీకి ఎంట్రీగా భావిస్తారు. ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలకు పాక్ సహాయపడిందనే వార్తలు రావడంతో ఎన్ఎస్జీలో చేరాలని భావిస్తోన్న పాకిస్తాన్ ఆకాంక్ష వెనుక సదుద్దేశం లేదని అమెరికా గ్రహించింది. తమ జాతీయ భద్రత, విదేశాంగ విధాన ప్రయోజనాలకు విరుద్ధంగా కార్యకలాపాలు చేపట్టే ఆస్కారం ఉందని బలంగా నమ్ముతూ ఈ ఏడు పాకిస్థాన్ సంస్థలపై నిషేధం విధించామని యూఎస్ బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ పేర్కొంది. ఈ జాబితాలో మొత్తం 23 సంస్థలను చేర్చినట్టు తెలిపింది. అయితే పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకురావడానికే అమెరికా ఈ నిర్ణయాలు తీసుకుంటుందని పాకిస్తాన్‌కి చెందిన ఓ పత్రిక పేర్కొంది. -
లాలు జడ్‌ప్లస్ వెనక్కి
న్యూఢిల్లీ/పట్నా: బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్‌కు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) కల్పిస్తున్న జడ్‌ప్లస్ భద్రతను కేంద్రం ఉపసంహరించింది. ఇకపై ఆయనకు జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తారు. కేంద్రం తీరుపై లాలు, ఆయన ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సామాజిక న్యాయం, మత సామరస్యం కోసం తాను చేస్తున్న పోరాటాన్ని ఆపేసేలా కేంద్రం బెదిరించడానికి కుట్ర పన్నుతోందని లాలు ఆరోపించారు. తనకేమైనా అయితే నితీశ్ కుమార్, మోదీ ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలని అన్నారు. దిగజారుడుతనమే: తేజస్వి తన తండ్రిని హతమార్చడానికి కుట్ర జరుగుతోందని, ఆయనకు ఏమైనా అయితే మోదీ తోలు వలుస్తామని లాలు కొడుకు తేజ్ ప్రతాప్ హెచ్చరించారు. కావాలంటే తాను మాట్లాడింది వెళ్లి మోదీకి చెప్పుకోవచ్చని మీడియాతో అన్నారు. తన తండ్రికి భద్రతను కుదించడం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు అద్దంపడుతోందని లాలు చిన్న కొడుకు తేజస్వి యాదవ్ అన్నారు. ఆర్జేడీ చేస్తున్న ఆరోపణలపై బిహార్ ఉపముఖ్య మంత్రి సుశీల్ మోదీ స్పందిస్తూ...ప్రజలు లాలుకు భయపడుతుంటే ఆయన దేనికి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. -
ఎన్ఎస్జీపై సందిగ్ధం
నవంబర్‌లో మళ్లీ చర్చలు బెర్న్: అణు సరఫరాదారుల బృందం(ఎన్ఎస్జీ)లో తనకు సభ్యత్వం ఇవ్వాలని భారత్ చేసుకున్న దరఖాస్తుపై సంస్థ ప్లీనరీ నిర్ణయం తీసుకోవడంలో విఫలమైంది. స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్‌లో శుక్ర, శనివారాల్లో జరిగిన ప్లీనరీలో.. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ)పై సంతకాలు చేయని దేశాలకు సభ్యత్వ అంశంపై చర్చించారు. ‘ఈ దేశాల సభ్యత్వానికి సంబంధించిన సాంకేతిక, న్యాయ, రాజకీయ అంశాలపై చర్చించారు. చర్చలు కొనసాగనున్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో దీనికోసం అనధికారిక సమావేశం ఉంటుంది’ అని ఎన్ఎస్జీ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌కు సభ్యత్వంపై చైనా వాదన ప్రతిబంధకంగా మారింది. ఎన్పీటీ అమలుకు తాము గట్టిగా మద్దతిస్తామని ప్లీనరీలో పునరుద్ఘాటించిన సభ్య దేశాలు.. ఉత్తర కొరియా అణు పరీక్షలను ఖండించాయి. -
భారత్‌కు ఇక మరింత కష్టం: చైనా
-
భారత్‌కు ఇక మరింత కష్టం: చైనా
బీజింగ్: అణు సరఫరా గ్రూపు(ఎన్ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వం అంశం మరింత కఠినతరం కానుందని చైనా చెప్పింది. అణు సరఫరాయేతర దేశాలన్నింటి విషయంలో ఎలాంటి వివక్ష లేకుండా చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మొత్తం 48 దేశాల సభ్యత్వం కలిగిన ఈ గ్రూపులో భారత్‌కు చాలా దేశాలు మద్దతిస్తున్నప్పటికీ ఒక్క చైనా మాత్రం అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. భారత్‌కు సభ్యత్వం ఇస్తే పాకిస్థాన్‌కు సభ్యత్వం ఇవ్వాలంటూ చైనా మొండికేస్తుంది. అయితే, ఆయుధ వ్యవస్థపై నియంత్రణ లేని పాక్ కూడా ఎన్ఎస్జీలో సభ్యత్వం ఇవ్వడం ఏమాత్రం సరికాదని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చైనా ప్రతిసారి మొకాలడ్డుతోంది. ‘కొత్తగా తీసుకొచ్చిన విధానాల వల్ల ఎన్ఎస్జీలో భారత సభ్యత్వం అనేది గతంలో కంటే మరింత క్లిష్టంగా మారనుంది’ అంటూ చైనా విదేశాంగ వ్యవహారాల సహాయమంత్రి లి హులాయి మీడియాకు చెప్పారు. అయితే, భారత్‌కు క్లిష్టతరంగా మారనున్న అంశాలు ఏమిటనే విషయంపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. -
ఇండియా విషయంలో మేం మారం: చైనా
బీజింగ్:చైనా మరోసారి తన మొండిపట్టును వీడనంది. భారత్ విషయంలో తమ వైఖరి మారబోదని ఆ దేశం స్పష్టం చేసింది.న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్(ఎన్ఎస్జీ)లో భారత్ ప్రవేశం విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకోబోమంటూ మరోసారి తన వ్యతిరేక వైఖరిని తేటతెల్లం చేసింది. ఎన్ఎస్జీలో సభ్యత్వం ఉన్న 48 దేశాల్లో దాదాపు అన్ని దేశాలు భారత్ ప్రవేశానికి ఎలాంటి అడ్డు చెప్పనప్పటికీ చైనా మాత్రం అడ్డుకుంటోంది. వచ్చే నెలలో కూడా దీనికి సంబంధించిన సమావేశం జరగనున్న నేపథ్యంలో మరోసారి చైనా చేసిన ఈ ప్రకటన భారత్ ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. ఎందుకంటే భారత్ ఎంట్రీకి చైనా మద్దతు చాలా అవసరం. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ మీడియాతో మాట్లాడుతూ భారత్ ఈసారి న్యూక్లియర్ క్లబ్బులోకి అడుగుపెడుతుందని అనుకుంటున్నారని అని అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. ఎన్ఎస్జీలో సభ్యత్వానికి భారత్‌తోపాటు పాక్ కూడా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. భారత్‌కు ప్రవేశం కల్పిస్తే పాక్‌కు కూడా కల్పించాల్సిందేననేది చైనా వాదన. ఇటీవల చైనాలో నిర్వహించిన వన్ బెల్ట్ వన్ రోడ్డు సమావేశానికి భారత్ గైర్హాజరవడం, దానిని వ్యతిరేకించడం కూడా భారత్‌కు ఎన్ఎస్జీలో అవకాశం లేకుండా చేయాలని చైనా మరింత మొండిపట్టుతో ఉన్నట్లు తెలుస్తోంది. -
భారత్‌కు ఓటేసినట్టే.. పాక్‌కు వేయకూడదా?: చైనా
న్యూఢిల్లీ: అణుశక్తి సరఫరా బృందం(ఎన్ఎస్జీ)లో భారత్‌కు స్ధానం కల్పిస్తే.. పాకిస్తాన్‌కు కూడా కల్పించాలని చైనాకు చెందిన ఓ కమ్యూనిస్టు పార్టీ అధికారి అన్నారు. 19వ ఆసియా భద్రతా సమావేశాల సందర్భంగా మాట్లాడిన మా గ్జియాంగ్వు సంచలన వ్యాఖ్యలు చేశారు. శక్తి సామర్ధ్యాల్లో ఇరుదేశాలు సమానంగా ఉన్నాయని 48 సభ్య దేశాలు కలిగిన ఎన్ఎస్జీలో చేరేందుకు ఇరువురికి అవకాశం ఇవ్వాలని అన్నారు. ఎన్ఎస్జీలో సభ్వత్వానికి చైనా భారత్‌కు ఓటేసిన చేతితోనే పాకిస్తాన్‌కు ఎందుకు ఓటు వేయకూడదని? ప్రశ్నించారు. పాకిస్తాన్ తమకు మిత్రదేశమని దానికి అవకాశం ఎందుకు ఇవ్వకూడదని అన్నారు. ఒకరికి చాన్స్ ఇచ్చి మరొకరిని వదిలేస్తే వివక్ష చూపినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. అణుశక్తికి సంబంధించిన టెక్నాలజీని అక్రమంగా లిబియాకు విక్రయిస్తూ పాకిస్తాన్ పట్టుబడిందని.. భారత్‌కు అలాంటి బ్యాడ్ ట్రాక్ ఏదీ లేదని చెప్పారు. అయితే చైనాకు ఈ విషయంపై కొన్ని సొంత అభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. -
బహుమతి మాకొద్దు: భారత్
న్యూఢిల్లీ: అణుశక్తి సరఫరా బృందం(ఎన్ఎస్జీ)లో సభ్యత్వాన్ని అమెరికా భారత్‌కు బహుమతిగా ఇవ్వాలని చూస్తోందని చైనా చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ స్పందించింది. బహుమతిగా ఎన్ఎస్జీలో సభ్యత్వాన్ని భారత్ కోరుకోవడం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ పేర్కొన్నారు. గత కొన్నాళ్లుగా ఎన్ఎస్జీలో సభ్యత్వానికి భారత్ యత్నిస్తుండగా.. ఎన్పీటీపై సంతకం చేయకుండా ఎలా సభ్యుడిగా చేర్చుకుంటారని చైనా మోకాలు అడ్డుపెడుతోంది. కాగా, రాయబారి రిచర్డ్ వర్మ మాత్రం ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం చైనా అడ్డంకిని అధిగమించి భారత్ కు ఎన్ఎస్జీలో సభ్యత్వాన్ని కల్పిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ కూడా ఎన్ఎస్జీలో సభ్వత్వాన్ని కోరుతుండటంతో చైనా ఆ దేశంతోనూ సంప్రదింపులు జరుపుతోంది. -
భారత్‌కు స్వభ్యత్వం.. అమెరికాపై చైనా ఫైర్!
అంతర్జాతీయ అణుసరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వం విషయంలో అమెరికాపై చైనా ఘాటుగా విరుచుకుపడింది. ఎన్ఎస్జీలో సభ్యత్వం అనేది దిగిపోయే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌కు ఇచ్చే వీడ్కోలు కానుక కాదని నోరుపారేసుకుంది. అణు సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు మార్గం సుగమం చేసే ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వానికి మోకాలడ్డుతోంది చైనాయేనని అమెరికా విదేశాంగశాఖ అసిస్టెంట్ సెక్రటరీ నిషా దేశాయ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో డ్రాగన్ దేశం ఈవిధంగా స్పందించింది. ఎన్ఎస్జీలో భారత్‌కు సభ్యత్వం ఇచ్చే విషయంలో ఇప్పట్లో తన వైఖరి మార్చుకునే ప్రసక్తి లేదని సంకేతాలు ఇచ్చింది. 'ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వం, ఎన్పీటీ రహిత దేశాల సభ్యత్వం విషయంలో మా వైఖరి ఇదివరకే స్పష్టం చేశాం. దానిని నేను పునరుద్ఘాటించబోను. కానీ, ఎన్ఎస్జీలో సభ్యత్వం అనేది ఒక దేశం మరొక దేశానికి ఇచ్చే వీడ్కోలు కానుక కాదని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను' అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హు చున్యింగ్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. 48 దేశాల ఎన్ఎస్జీలో సభ్యత్వం విషయంలో ఎన్పీటీ (అణునిరాయుధీకర ఒప్పందం)ని బూచిగా చూపెట్టి భారత్‌కు చైనా మోకాలడ్డుతోంది. ఈ ఒప్పందంపై సంతకం చేయని దేశాలను ఎన్ఎస్జీలో తీసుకోవాలంటే.. అందుకు గ్రూప్ విధివిధానాలను సవరించాలని, అందరి ఏకాభిప్రాయం తీసుకోవాలని చైనా మొండిగా వాదిస్తోంది. తన అనుయాయి పాకిస్థాన్ కోసమే చైనా ఇంత రాద్ధాంతం చేస్తున్నదని నిపుణులు భావిస్తున్నారు. -
ఎన్ఎస్జీ వెబ్‌సైట్‌పై హ్యాకర్ల దాడి
న్యూఢిల్లీ: దేశమంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయి ఉండగా, నేరగాళ్లు భద్రతా సంస్థల వెబ్సైట్లను టార్గెట్ చేసుకున్నారు. దేశ అంతర్గత భద్రతలో కీలక పాత్రవహిస్తోన్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) అధికారిక వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు. ఆదివారం ఉదయం నుంచి ఎన్ఎస్జీ సైట్లోకి వెళ్లినవారికి సమాచారం స్థానంలో ఓ అభ్యంతరకర మెసేజ్ దర్శనమిచ్చింది. హ్యాకింగ్‌కు పాల్పడిన గ్రూప్ తనను తాను ‘అలోన్ ఇంజెక్టర్’గా పేర్కొంది. కశ్మీర్లో ప్రభుత్వ, సైనిక హింసాకాండను నిరసిస్తూ హ్యాకర్లు నేరుగా భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ అభ్యంతరకర రాతలు రాశారు. విషయం తెలుసుకున్న వెంటనే స్పందిచిన అధికారులు వెబ్‌సైట్‌ను పునరుద్ధరించేపనిలో పడ్డారు. ఉగ్రదాడుల సమయంలో ప్రజలను కాపాడే బాధ్యతను తలకెత్తుకునే ఎన్ఎస్జీ కమాండోలు.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర వీవీఐపీలకూ అనునిత్యం భద్రత కల్పిస్తూఉంటారు. అంతటి ప్రాముఖ్యం కలిగిన సంస్థ వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురికావడంతో హోంశాఖ వర్గాల్లో కలకలం రేగింది. -
ఆ రెండు అంశాల్లో మా వైఖరి మారదు: చైనా
బీజింగ్: అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వం, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ విషయాల్లో తమ వైఖరిలో మార్పు ఉండబోదని చైనా స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వాన్ని అడ్డుకున్న చైనా.. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న భారత్ తీర్మానాన్ని ఐకరాజ్యసమితిలో రెండుసార్లు వ్యతిరేకించింది. ఇప్పుడు తాజాగా ఈ రెండు అంశాల్లో తమ వైఖరి మారదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షుయాంఘ్ స్పష్టం చేశారు. -
‘ఎన్ఎస్జీ’పై చైనాతో చర్చలు
భారత్, చైనా విదేశాంగ మంత్రుల భేటీలో నిర్ణయం * మసూద్ అంశంపై పునరాలోచించాలన్న భారత్ * జీ 20 సదస్సుపై ప్రధాని మోదీకి వివరించిన చైనా మంత్రి వాంగ్ * సానుకూల వాతావరణంలో చర్చలు: ప్రభుత్వ వర్గాలు న్యూఢిల్లీ: ఎన్ఎస్జీలో భారత సభ్యత్వాన్ని వ్యతిరేకించడం, జైషే చీఫ్ మసూద్ అజహర్‌పై ఐరాస నిషేధాన్ని అడ్డుకోవడంపై శనివారం చైనాకు భారత్ తన ఆందోళనను తెలిపింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో భేటీలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ అంశాలపై చర్చించారు. ఎన్ఎస్జీ(అణు సరఫరా దేశాల కూటమి) అంశంలో నిరాయుధీకరణ విభాగ అధికారులు త్వరలో భేటీ కావాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి వివిధ అంశాలపై విదేశాంగ కార్యదర్శల స్థాయిలో చర్చలకు యంత్రాంగం ఏర్పాటుపైనా అంగీకారానికి వచ్చారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌పై భారత్ తన ఆందోళన తెలిపింది. సరిహద్దు పరిస్థితులపై సమీక్ష.. మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన వాంగ్ శనివారం ఉదయం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అనంతరం సుష్మతో 3 గంటల సేపు చర్చలు జరిపారు. భారత్‌కు ఎన్ఎస్జీ సభ్యత్వంపై భేటీలో సుధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. చైనాకు ఎలాంటి సాంకేతిక అభ్యంతరాలున్నా వాటిపై చర్చించేందుకు సిద్ధమని సుష్మ చెప్పారు. ముంబై, పఠాన్‌కోట్ ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి మసూద్ అజహర్‌పై ఐక్యరాజ్యసమితి నిషేధాన్ని సాంకేతిక కారణాలు సాకుగా అడ్డుకోవడంపై పునరాలోచించాలని భారత్ కోరినట్లు సమాచారం. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని చైనా ప్రకటించిన నేపథ్యంలో సాంకేతిక కారణాలపై సమీక్షించాలని భారత్ కోరినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల సరిహద్దుల వద్ద పరిస్థితులపై సమీక్షతో పాటు శాంతి, ప్రశాంతతను బలోపేతం దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాలని సుష్మ, వాంగ్ నిర్ణయించారు. అంతకుముందు మోదీతో.. వాంగ్ భేటీ అయ్యారు. సెప్టెంబర్‌లో చైనాలో జరిగే జీ20 సదస్సు గురించి వివరించారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు అభినందనలు తెలపాలని ప్రధాని కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య చర్చలు సానుకూల, నిర్మాణాత్మక వాతావరణంలో కొనసాగాయని, ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షతో పాటు, ఇటీవలి కొన్ని అంశాలపై కూడా చర్చించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. పెట్టుబడులు విస్తరించాలన్న అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమవడంతో పాటు, మౌలిక సదుపాయల రంగంలో మరింత సహకారం అవసరముందని ఇరు దేశాలు నిర్ణయించాయి. బ్రెగ్జిట్ ప్రభావం, కొరియా ద్వీపకల్పంలో పరిస్థితి, ఐరాస భద్రతా మండలి, జీ20, తూర్పు ఆసియా, బ్రిక్స్ దేశాల సదస్సులపై సుష్మా, వాంగ్ల మధ్య చర్చలు సాగాయి. అయితే ఇరు నేతల మధ్య దక్షిణ చైనా సముద్రం అంశం చర్చకు రాలేదని తెలుస్తోంది. బ్రిక్స్ సదస్సు ఏర్పాట్లపై వాంగ్ పరిశీలన శుక్రవారమే గోవా చేరుకున్న వాంగ్ యీ బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల సద స్సు జరిగే వేదికను పరిశీలించారు. స్థానిక అధికారులతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్, గవర్నర్ మృదులా సిన్హాతో కలిసి ఏర్పాట్లపై చర్చించారు. బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ హాజరుకానున్నారు. మోదీతో ప్రీతీ పటేల్ భేటీ బ్రిటన్‌కు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి ప్రీతీ పటేల్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నైపుణ్య శిక్షణతో పాటు వివిధ అంశాల్లో సహకారంపై వారిద్దరూ చర్చించారు. బ్రిటన్ ప్రధాని థెరెసా మే కొత్త మంత్రివర్గంలో సహాయ మంత్రి స్థానం పొందినందుకు ప్రీతీ పటేల్‌కు మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా గతేడాది నవంబర్‌లో విజయవంతంగా సాగిన బ్రిటన్ పర్యటనను మోదీ గుర్తు చేసుకున్నారు. ‘అంతర్జాతీయ అభివృద్ధి విభాగం భవిష్యత్తు ప్రణాళికలపై ప్రధానికి పటేల్ వివరించారు’ అని పీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. -
మనసు గెలుచుకుంటారా?
న్యూఢిల్లీ: చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. శుక్రవారం రాత్రి మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన న్యూఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా కీలక అణు సరఫరా బృందం (ఎన్ఎస్ జీ) అంశం చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కూడా ఆయన కలిసి భేటీ అయ్యారు. అనంతరం చైనా అధికార బృందం భారత బృందంతో సమావేశమైంది. ఎన్ఎస్ జీలో స్థానం మిస్ కావడంతో.. చైనా సానుకూలతతోనే ఎన్ఎస్ జీలో స్థానం సంపాదిస్తామని పార్లమెంట్ లో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా ఇంతకుముందు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాంగ్-సుష్మాల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో చైనా, భారత్ లు పరస్పరం విభేదించుకుంటున్న అంశాలతో పాటు ఎన్ఎస్ జీ చర్చకు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వాంగ్ పర్యటన సందర్భంగా ఇండియాకు ఇంకా ఎన్ఎస్ జీ తలుపులు మూసుకుపోలేదని అక్కడి పత్రిక వ్యాఖ్యానించడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై ఇండియా తమ ప్రతినిధిని ఎలాంటి ప్రశ్నలు వేయకూడదని కూడా పత్రిక ఆక్షేపించింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా చేపడుతున్న నిర్మాణాలను విరమించుకోవాలని అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పునిచ్చింది. తీర్పుతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. నిర్మాణాలను కొనసాగిస్తామని చైనా తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. -
ఎన్ఎస్జీ తలుపులు మూసుకోలేదు: చైనా
బీజింగ్: ఎన్ఎస్జీ(అణు సరఫరాదారుల కూటమి)లో సభ్యత్వం కోసం భారత్‌కు తలుపులు పూర్తిగా మూసుకుపోలేదని, నిరాశ చెందాల్సిన అవసరంలేదని చైనాకు చెందిన ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. భారత్‌లో తమ విదేశాంగ మంత్రి వాంగ్ యి పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఎన్ఎస్జీలో భారత్ ప్రవేశాన్ని చైనా అడ్డుకుందంటూ తప్పుగా విమర్శిస్తున్నారని, నాన్-ఎన్పీటీ దేశం ఎన్ఎస్జీలో సభ్యత్వం పొందిన ఉదాహరణలు ఇంతకుముందు ఏవీ లేవని తన కథనంలో తెలిపింది.