అణు సరఫరాదారుల గ్రూప్ (ఎన్ఎస్జీ)లో భారత స్వభ్యత్వం విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
న్యూఢిల్లీ: అణు సరఫరాదారుల గ్రూప్ (ఎన్ఎస్జీ)లో భారత స్వభ్యత్వం విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. తరచూ విదేశీ పర్యటనలు చేపడుతున్నా.. ఎన్ఎస్జీలో భారత్ స్వభ్యత్వం విషయంలో ఎందుకంత ఘోరంగా విఫలమయ్యారో ఆదివారం ప్రధాని మోదీ దేశ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో దేశ ప్రజలతో ముచ్చటించనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ‘మన్ కీ బాత్’ వేదికగా ఎన్ఎస్జీలో మనకు స్వభ్యత్వం రాకపోవడానికి కారణాలను దేశ ప్రజలకు చెప్పాలని కేజ్రీవాల్ కోరారు.