'ఎన్‌ఎస్‌జీలో భారత్‌కు కచ్చితంగా సభ్యత్వం'
ఢిల్లీ: ఎన్‌ఎస్‌జీ లో భారత్‌కు కచ్చితంగా సభ్యత్వం వస్తుందని ఆశిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. రెండేళ్ల ఎన్‌డీఏ ప్రభుత్వం పాలనపై ఆదివారం మంత్రి సుష్మా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలతో 43 శాతం ఎఫ్‌డీఐలు పెరిగాయని అన్నారు.
ఈ ఏడాదిలోపు అన్ని దేశాలతో భారత్‌కు సత్సంబంధాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దాడులు, చర్చలు ఏక కాలంలో సాధ్యం కావని సుష్మా అభిప్రాయపడ్డారు.