భారత్‌కు ప్రధాన అడ్డంకిగా మారిన చైనా!
సియోల్: అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వం విషయంలో భారత్కు చైనా ప్రధాన అడ్డంకిగా మారింది. 48 దేశాల అణుసరఫరాదారుల బృందంలో ఒకటి రెండు దేశాలు మినహా మిగతా దేశాలన్ని భారత్కు అనుకూలంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసిట్లు సమాచారం. అయితే చైనా మాత్రం నాన్-ప్రొలిఫరేషన్ ట్రిటీ(ఎన్పీటీ)పై సంతకాలు చేసిన దేశాలకు మాత్రమే ఎన్ఎస్జీలో సభ్యత్వం కలిపించాలనే వాదనను వినిపిస్తూ భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఇకపోతే ఎన్పీటీపై సంతకం చేయని మరో దేశం పాకిస్తాన్కు ఎన్ఎస్జీలో సభ్యత్వానికి చైనా సపోర్ట్ చేస్తుండటం విశేషం.
ఎన్పీటీపై సంతకం చేయని పాక్కు కూడా ఎన్ఎస్జీలో సభ్యంత్వం కల్పించాలన్న చైనా వాదనను మెజారిటీ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. గతంలో భారత సభ్యత్వానికి అనుకూలం అని తెలిపిన స్విట్జర్లాండ్ కూడా శుక్రవారం..ఎన్పీటీపై సంతకం చేసిన దేశాలకే సభ్యత్వం కల్పించాలనే వాదనను వినిపిస్తుండటం కొంత ప్రతికూల అంశం.