పఠాన్ కోట్ లో మరో ఉగ్రవాది హతం | One of the terrorists holed up in the Pathankot air base killed | Sakshi
Sakshi News home page

పఠాన్ కోట్ లో మరో ఉగ్రవాది హతం

Published Mon, Jan 4 2016 4:32 PM | Last Updated on Sun, Sep 3 2017 3:05 PM

పఠాన్ కోట్ లో మరో ఉగ్రవాది హతం

పఠాన్ కోట్ లో మరో ఉగ్రవాది హతం

పఠాన్ కోట్: పంజాబ్ లోని పఠాన్ కోట్ లో చొరబడ్డ ఉగ్రవాదుల్లో మరొకరిని సైనిక బలగాలు మట్టుబెట్టాయి. రెండతస్తుల భవనంలో నక్కిన ఉగ్రవాదిని కమెండోలు హతమార్చాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆపరేషన్ లో ఇప్పటివరకు హతమార్చిన ఉగ్రవాదుల సంఖ్య ఆరుకు చేరింది. కూంబింగ్ కొనసాగుతోంది. వైమానిక దళంలోకి చొరబడిన ముష్కరులను మట్టుమెట్టేందుకు వరుసగా మూడో రోజు సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది.

శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. వీరిని తుదముట్టించే క్రమంలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది గాయపడ్డారు. అయితే ఎంతమంది ఉగ్రవాదులు చొరబడ్డారనే దానిపై స్పష్టత లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement