
న్యూఢిల్లీ: కెనడాలో బుధవారం రాత్రి జరిగిన గ్యాంగ్‌వార్‌లో మరో ఖలిస్థాన్ ఉగ్రవాది సుఖ్‌దూల్ సింగ్ అలియాస్ సుఖ దునెకె ప్రత్యర్ధులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. ఈ హత్యకు పూర్తి బాధ్యత తమదేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
మాదే బాధ్యత..
కెనడాలో జరిగిన ముఠా కాల్పుల్లో ఖలిస్థా ఉగ్రావది సుఖ దునెకె హత్యకు గురయ్యాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఈ హత్య తామే చేయించామని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గ్యాంగ్‌స్టర్‌లు గుర్‌లాల్ బ్రార్, విక్కీ ముద్దుకేరా హత్యలతో సుఖ దునెకెకు సంబంధముందని వాడు మాదకద్రవ్యాలకు బానిసాయి ఫేక్ వీసా మీద కెనడా పారిపోయాడని వాడు చేసిన తప్పులకు శిక్ష పడిందని మా శత్రువులు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా బ్రతకరని హెచ్చరించారు.
లారెన్స్ పాత్రపై అనుమానాలు..
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసు ఆరోపణల్లో అహ్మదాబాద్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూస్‌వాలా హత్య కేసులో కూడా లారెన్స్ బిష్ణోయ్ నిందితుడిగా ఉన్నాడు. సోషల్ మీడియా పోస్టును బట్టి ఈ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ హస్తంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు భారత్ కెనడా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ హత్య జరగడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని అక్కడి వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అక్కడి వారికి ట్రావెల్ అడ్వైజరీ మార్గదర్శకాలు చేసి వీసా సేవలను నిలిపివేసింది.
చిలికి చిలికి..
భారత్ కెనడా మధ్య సంబంధాలు అంతకంతకు బలహీనపడుతున్నాయి. ఖలిస్థాన్ ఉద్యమం పేరిట ఖలిస్థానీ మద్దతుదారులు ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని ర్యాలీగా నిర్వహించి వివాదానికి తెరతీశాయి. ఆనాడు భారత దేశం ఆ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేసినా తేలిగ్గా తీసుకున్న కెనడా తర్వాత జరిగిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత్ ఏజెంట్లు కారణమంటూ చేసిన వ్యాఖ్యలు తగువుకు ఆజ్యం పోశాయి. ఇంతలోనే మరో ఉగ్రవాది హత్య జరగడంతో కెనడా వీసాలను నిలిపివేసింది.
BIG ⚡️Lawrence Bishnoi gang claims responsibility for K-terrorist Sukhdool Singh's killing in Canada pic.twitter.com/6ZN1T30pb4
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 21, 2023
ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి రేసులో దూసుకెళ్తున్న భారతీయుడు