వాషింగ్టన్: కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ మృతి, దానికి సంబంధించిన రగడపై అమెరికాతో లోతుగా చర్చించినట్టు విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన గురువారం ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో భేటీ అయ్యారు. హత్యపై కెనడా జరుపుతున్న దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని బ్లింకెన్ ఈ సందర్భంగా సూచించినట్టు విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం పేర్కొన్నారు.
అనంతరం దీనిపై జై శంకర్ స్పందించారు. భారత్ లక్ష్యంగా వేర్పాటువాదం, హింస, వ్యవస్థీకృత నేరాలు, మనుషుల అక్రమ రవాణా వంటివాటికి కెనడా కొన్నేళ్లుగా అడ్డాగా మారుతోందని మండిపడ్డారు. ‘పైగా అక్కడి ప్రభుత్వం కూడా కొన్నేళ్లుగా అలాంటి వాటిని అనుమతిస్తున్న ధోరణి కనబరుస్తోంది. ట్రూడో సర్కారు రాజకీయ అనివార్యతలే ఇందుకు కారణం‘ అని ఆరోపించారు. ‘కెనడాలో భారత దౌత్యవేత్తలను బాహాటంగా బెదిరించే దుస్థితి నెలకొంది! కార్యాలయాలకు వెళ్లడం కూడా రిసు్కగా మారింది. అందుకే ఆ దేశానికి వీసా సేవలను కూడా ఆపేయాల్సి వచి్చంది‘ అని జైశంకర్ వివరించారు.
బ్లింకెన్‌తో జైశంకర్
Comments
Please login to add a commentAdd a comment