భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్, కెనడా విదేశాంగమంత్రి మెలానీ అమెరికాలో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బ్రిటన్ వార్తా పత్రిక ఫినాన్షియల్ టైమ్స్ కథనం ప్రచురించింది. భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను పరిష్కరించేందుకు, న్యూఢిల్లీతో దౌత్యపరమైన సంబంధాలను పునురద్ధరించేందుకు కెనడా ప్రభుత్వం ప్రయత్నిన్నట్లు పేర్కొంది.
అయితే ఈ భేటీపై అటు కెనడా కానీ, ఇటు భారత్ కానీ ఏ విధమైన అధికారిక ప్రకటన చేయలేదు. కెనడా దౌత్యవేత్తలు దేశం విడిచి వెళ్లాలంటూ భారత్ గడువు విధించిన నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఖలిస్తానీ సానూభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెన్సీల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. కెనడా ఆరోపలను భారత్ తీవ్రంగా ఖండించింది. అనంతరం రెండు దేశాల దౌత్యపరమైన సంబంధాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించాయి. కెనడాకు వీసా సేవలను భారత్ నిలిపి వేసింది.
చదవండి: పఠాన్‌కోట్ దాడి సూత్రదారి, ఉగ్రవాది లతీఫ్ పాకిస్థాన్‌లో హతం
Comments
Please login to add a commentAdd a comment