భారతదేశ విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఇంటరర్వ్యూ ప్రసారం చేసినందుకు ఆస్ట్రేలియా టుడే మీడియా సంస్థపై ఇటీవల కెనడా నిషేధం విధించింది. అయితే.. వ్యవహారంపై తాజాగా ఆ మీడియా సంస్థ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్ జితార్థ్ జై భరద్వాజ్ స్పందించారు. ప్రతికాస్వేచ్ఛను హత్య చేయటమేనని జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై మండిపడ్డారు. గుళ్లపై పదేపదే దాడులు జరుగుతున్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నిచారు.
‘‘ కెనడా చర్య.. పత్రికా స్వేచ్ఛను హతమార్చటం అవుతుంది. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉంది. విభిన్న అభిప్రాయాలన్నింటినీ చర్చించడానికి, అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికే పత్రికలు ఉన్నాయి. గురుపత్వంత్ సింగ్ పన్నూ మమ్మల్ని బెదిరించాడు.
...ఇతర వేర్పాటువాదుల నుంచి కూడా బెదిరింపులు వచ్చాయి. అమెరికా, కెనడాలో కవరేజీ చేసినందుకు మా చిత్రాలను పన్నూ ఆన్‌లైన్‌లో పెట్టారు. అనేక రకాలుగా హాని తలపెట్టమని ఆయన మద్దతుదారులను ఉసిగొల్పారు. అయినా.. మేం భయపడకుండా నిరంతరం రిపోర్టింగ్ చేస్తున్నాం’’అని అన్నారు.
చదవండి: కెనడాలో ‘ఆస్ట్రేలియా టుడే’పై నిషేధం
Comments
Please login to add a commentAdd a comment