జైశంకర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ప్రసారం చేయడమే కారణం
న్యూఢిల్లీ: భారతదేశం పట్ల వ్యతిరేకతను కెనడా ప్రభుత్వం బహిరంగంగా ప్రదర్శిస్తోంది. ఇరుదేశాల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నా లెక్కచేయడంలేదు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ప్రసారం చేసినందుకు ఆస్ట్రేలియా మీడియా సంస్థ అయిన ‘ఆస్ట్రేలియా టుడే’పై కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కెనడాలో ఆ సంస్థ ప్రసారాలు, వార్తలు ప్రజలకు అందకుండా బ్లాక్ చేసింది. అలాగే మరికొన్ని సోషల్ మీడియా ఖాతాలపైనా నిషేధం విధించింది.
తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన జైశంకర్ మీడియా సమావేశాన్ని ప్రసారం చేయడమే ఇందుకు కారణం. కెనడా చర్యపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కెనడాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మీడియా స్వేచ్ఛను గౌరవిస్తున్నామని సుద్దులు చెప్పే కెనడా ప్రభుత్వం ఆచరణలో ఆందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. భారత్‌పై కెనడా చేస్తున్న అసంబద్ధ ఆరోపణలను ఆస్ట్రేలియా గడ్డపై జైశంకర్ ఎండగట్టడాన్ని కెనడా ప్రభుత్వం సహించలేకపోతోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment