press conference
-
కెనడాలో ‘ఆస్ట్రేలియా టుడే’పై నిషేధం
న్యూఢిల్లీ: భారతదేశం పట్ల వ్యతిరేకతను కెనడా ప్రభుత్వం బహిరంగంగా ప్రదర్శిస్తోంది. ఇరుదేశాల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నా లెక్కచేయడంలేదు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ప్రసారం చేసినందుకు ఆస్ట్రేలియా మీడియా సంస్థ అయిన ‘ఆస్ట్రేలియా టుడే’పై కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కెనడాలో ఆ సంస్థ ప్రసారాలు, వార్తలు ప్రజలకు అందకుండా బ్లాక్ చేసింది. అలాగే మరికొన్ని సోషల్ మీడియా ఖాతాలపైనా నిషేధం విధించింది. తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన జైశంకర్ మీడియా సమావేశాన్ని ప్రసారం చేయడమే ఇందుకు కారణం. కెనడా చర్యపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కెనడాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మీడియా స్వేచ్ఛను గౌరవిస్తున్నామని సుద్దులు చెప్పే కెనడా ప్రభుత్వం ఆచరణలో ఆందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. భారత్‌పై కెనడా చేస్తున్న అసంబద్ధ ఆరోపణలను ఆస్ట్రేలియా గడ్డపై జైశంకర్ ఎండగట్టడాన్ని కెనడా ప్రభుత్వం సహించలేకపోతోందని ఆరోపించారు. -
సూర్య ‘కంగువ’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
ఐఫా-2024 ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మెరిసిన సినీతారలు (ఫొటోలు)
-
NATO Summit: బైడెన్.. మళ్లీ తడబడెన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పట్టువీడటం లేదు. అధ్యక్ష బరి నుంచి తప్పుకోవాలంటూ ఇంటా బయటా డిమాండ్లు నానాటికీ పెరిగిపోతున్నా ఆ ప్రసక్తే లేదని మరోసారి కుండబద్ధ్దలు కొట్టారు. 81 ఏళ్ల వయసులోనూ రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించి మరోసారి అధ్యక్షునిగా పని చేసే సామర్థ్యం తనలో పుష్కలంగా ఉందని చెప్పుకొచ్చారు. నాటో శిఖరాగ్రం ముగింపు సందర్భంగా గురువారం బైడెన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తన వయసు, ఫిట్‌నెస్‌పై పెరిగిపోతున్న సందేహాల్లో పస లేదని నిరూపించేందుకు శాయశక్తులా ప్రయతి్నంచారు. అయితే గంటకు పైగా జరిగిన ఈ భేటీలోనూ ఆయన తడబాట్ల పర్వం కొనసాగడం డెమొక్రాట్ల శిబిరంలో ఆందోళనలను మరింత పెంచింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అనబోయి ట్రంప్ అంటూ బైడెన్ తికమకపడ్డారు! అధ్యక్ష రేసు నుంచి మీరు తప్పుకుంటే ట్రంప్‌ను ఓడించే సత్తా హారిస్‌కు ఉందా అని విలేకరులు ప్రశ్నించగా, ‘‘అధ్యక్షునిగా పని చేయగల అర్హత, సత్తా ట్రంప్‌కు ఉన్నాయి. కనుకనే ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నా’’ అన్నారు. దాంతో అంతా అవాక్కయ్యారు. అయినా బైడెన్ తన వ్యాఖ్యలను సరిచేసుకోలేదు. అంతకుముందు నాటో వేదికపై కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని సభ్య దేశాల ప్రతినిధులకు ‘అధ్యక్షుడు పుతిన్’ అంటూ పరిచయం చేశారు!! జెలెన్స్కీ దీన్ని తేలిగ్గా తీసుకుంటూ నవ్వేసినా ప్రతినిధులంతా తెల్లబోయారు. ఈ నేపథ్యంలో బైడెన్ మానసిక ఆరోగ్యంపై నెలకొన్న సందేహాలు మరింత పెరిగాయి. అయితే వైద్యులు సూచిస్తే మానసిక పరీక్షలకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ‘‘అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఇప్పటిదాకా మూడుసార్లు న్యూరో పరీక్షలు చేయించుకున్నా. తాజా పరీక్ష గత ఫ్రిబ్రవరిలో జరిగింది. నేను మానసికంగా ఫిట్‌గా ఉన్నాననేందుకు అధ్యక్షునిగా నేను తీసుకుంటున్న రోజువారీ నిర్ణయాలే రుజువు. కానీ నేనెంత చేసినా ఎవరూ సంతృప్తి చెందడం లేదు’’ అంటూ వాపోయారు! అయితే తన అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల్లో భయాలను దూరం చేయాల్సిన అవసరముందని అంగీకరించారు. బ్రహా్మండంగా పని చేశా అధ్యక్ష ఎన్నికల్లో తలపడేందుకు అత్యంత అర్హున్ని తానేనని బైడెన్ చెప్పుకున్నారు. ‘‘ట్రంప్‌ను ఓసారి ఓడించా. మళ్లీ ఓడించి తీరతా. అప్పుడే ఏమీ అయిపోలేదు. ప్రచారంలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది’’ అన్నారు. నాలుగేళ్లలో అమెరికాను అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేశానంటూ గణాంకాలు ఏకరువు పెట్టారు. ఆర్థిక రంగంలో తన పనితీరు చాలా బాగుందని ఏకంగా 16 మంది నోబెల్ గ్రహీతలైన ఆర్థికవేత్తలు కితాబిచ్చారని చెప్పుకున్నారు. రాత్రి 8 గంటల తర్వాత ప్రచారంతో పాటు ఎలాంటి కార్యక్రమాలూ పెట్టుకునేది లేదని తానన్నట్టు వచి్చన వార్తలను బైడెన్ ఖండించారు. విదేశీ వ్యవహారాలు తదితరాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. గాజా ఆక్రమణ కూడదంటూ ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూను, ఉక్రెయిన్‌పై యుద్ధంలో మద్దతివ్వొద్దంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను హెచ్చరించానని చెప్పుకొచ్చారు. రష్యాతో సాన్నిహిత్యానికి చైనా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. లాడెన్‌ను చంపగానే అఫ్గాన్ నుంచి అమెరికా పూర్తిగా వైదొలగాల్సిందన్నారు.ట్రంప్ విసుర్లు బైడెన్ తనను ఉపాధ్యక్షునిగా పేర్కొనడంపై ట్రంప్ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ‘బిగ్ బోయ్ జో మీడియా భేటీ మొదట్లోనే నన్ను తన ఉపాధ్యక్షునిగా చెప్పుకు న్నారు’’ అని ఎద్దేవా చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.పెరుగుతున్న వ్యతిరేకత తనకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న సొంత పార్టీ నేతలు, ఎంపీల విశ్వాసాన్ని చూరగొనడమే లక్ష్యంగా తాజా మీడియా సమావేశంలో బైడెన్ సర్వశక్తులూ ఒడ్డారు. కానీ ఆ ప్రయత్నంలో ఆయన విఫలమయ్యారని పరిశీలకులు అంటున్నారు. బైడెన్ తప్పుకోవాలని సమావేశం ముగియగానే ముగ్గురు ప్రముఖ డెమొక్రాట్ ఎంపీలు జిమ్ హైమ్స్, స్కాట్ పీటర్స్, ఎరిక్ సొరెన్సన్ పిలుపునిచ్చారు! దాంతో ఆయన వైదొలగాలని డిమాండ్ చేస్తున్న సొంత పార్టీ ఎంపీల సంఖ్య 17కు పెరిగింది. నిజానికి గత నెల సీఎన్ఎన్ చానల్లో జరిగిన తొలి అధ్యక్ష డిబేట్లో ట్రంప్ ముందు బైడెన్ పూర్తిగా తేలిపోవడం తెలిసిందే. దానితో పోలిస్తే తాజా మీడియా భేటీలో ఆయన మెరుగ్గానే మాట్లాడారు. తాను తీరిక లేని షెడ్యూల్‌తో బిజీగా గడుపుతుంటే ట్రంప్ మాత్రం గోల్ఫ్ ఆడుతూ సేదదీరుతున్నారంటూ దుయ్యబట్టారు. ‘‘ట్రంప్ నాలుగేళ్ల పాలనలో అస్తవ్యస్తం చేసిననాటో కూటమిని ఎంతగానో శ్రమించి ఒక్కతాటిపైకి తెచ్చా. నాటో శిఖరాగ్రంలో పాల్గొన్న దేశాధినేతలెవరూ నా ఫిట్నెస్ను, మానసిక ఆరోగ్యాన్ని సందేహించలేదు. పైపెచ్చు ట్రంప్ మళ్లీ రావొద్దని, నేనే గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు’’ అని అన్నారు.ఒబామా, పెలోసీ కూడా... బైడెన్ తప్పుకోవాలంటున్న డెమొక్రాటిక్ పార్టీ నేతల జాబితాలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా చేరుతున్న సూచనలు కని్పస్తున్నాయి. ట్రంప్‌ను ఓడించడం బైడెన్‌కు తలకు మించిన పనేనని వారిద్దరూ తాజాగా ప్రైవేటు సంభాషణలో అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. నాటో శిఖరాగ్రం అనంతరం బైడెన్ మీడియా సమావేశం చూసి వారు మరింతగా పెదవి విరిచినట్టు డెమొక్రటిక్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘బైడెన్ అధ్యక్ష అభ్యరి్థత్వం దాదాపుగా ముగిసిన కథే. ఆయనకు మనస్తాపం కలగకుండా, పార్టీ అవకాశాలు దెబ్బ తినకుండా దీన్ని ప్రకటించడం ఎలాగన్నది మాత్రమే తేలాల్సిలి ఉంది. బహుశా బైడెన్ తనంత తానుగా తప్పుకుంటారని ఒబామా, పెలోసీ భావిస్తున్నారు. లేదంటే ఆయనకు నచ్చజెప్పి తప్పించే బాధ్యత తీసుకోగలిగింది వారిద్దరే’’ అని పేర్కొంటున్నాయి. ఈ విషయమై ఉన్నత స్థాయి డెమొక్రాట్ నేతలు గురువారం ఉదయం పెలోసీతో సమావేశమైనట్టు అమెరికా మీడియా పేర్కొంది. ‘‘ఇక ట్రంప్‌ను ఓడించడం బైడెన్‌కు శక్తికి మించిన పనేనన్న అభిప్రాయంతో పెలోసీ కూడా ఏకీభవించారు. అయితే నాటో శిఖరాగ్రం జరుగుతున్న నేపథ్యంలో దేశాధినేతల ముందు బైడెన్‌ను ఇబ్బంది పెట్టడం సరికాదని, కనీసం ఒక రోజన్నా ఆగాలని సూచించారు. దాంతో బైడెన్‌ను తప్పించేందుకు ఆమె కూడా సుముఖంగానే ఉన్నట్టు తేలిపోయింది. అందుకే భేటీ తర్వాత పలువురు డెమొక్రాట్ ఎంపీలు బైడెన్ తప్పుకోవాలని బాహాటంగా డిమాండ్ చేశారు’’ అంటూ యూఎస్ మీడియాలో జోరుగా కథనాలు వెలువడుతున్నాయి. -
‘ఒంటికి యోగా మంచిదేగా’ మాజీ మిస్ ఇండియా ఆసనాలు (ఫొటోలు)
-
రేపు NDA మిత్రపక్షాల భేటీ
-
కోడ్ ఉల్లంఘిస్తే చర్యలే
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంటోందని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఇప్పటికే పలువురు నేతలపై నిషేధాన్ని విధించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ చెప్పారు. రాష్ట్రంలో సైతం కోడ్ ఉల్లంఘనకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ పట్ల అన్ని పార్టీలకు అవగాహన కల్పించామని, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఈసీ జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చే గడువు గురువారంతో ముగిసిందని, ఆయన మరో వారంపాటు గడువు పొడిగించాలని కోరారన్నారు. కేసీఆర్ విజ్ఞప్తిని ఈసీకి పంపించామని చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఊరేగింపులో ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, ఆ పార్టీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత చేసిన విద్వేషకర ప్రసంగాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. కోడ్ ఉల్లంఘనకి సంబంధించి ఇప్పటి వరకు వివిధ పార్టీల నుంచి 28 ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటివరకు 4099 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామన్నారు. ఓ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడానికి అనుమతించే విషయమై చట్టాలను పరిశీలించాల్సిన అవసరముందని తెలిపారు. సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. ఆన్లైన్లో నామినేషన్ వేయొచ్చు ఆన్లైన్లో సైతం నామినేషన్ దాఖలు చేయొ చ్చని, అయితే ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటల్లోపు అభ్యర్థులు సంతకం చేసిన నామినేషన్ పత్రాల ప్రింట్ కాపీని సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని వికాస్‌రాజ్ తెలిపారు. నామినేషన్ ఫారంతోపాటు అఫిడవిట్‌లోని అన్ని ఖా ళీలను పూరించాలని, తమకు వర్తించని విష యాలను సైతం ‘నాట్ అప్లికేబుల్’అని రా యాల్సి ఉంటుందన్నారు. ఒక్క ఖాళీ పూరించకపోయినా పరిశీలనలో నామినేషన్లు తిరస్కరిస్తారని చెప్పారు. ఎన్నికల ఖర్చుల కోసం అభ్యర్థులు కొత్త బ్యాంక్ ఖాతాను తెరవాల్సి ఉంటుందని, రాష్ట్రంలోని ఏ బ్యాంక్ నుంచైనా ఖాతా తెరవచ్చన్నారు. తొలి రోజు రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో మొత్తం 42 మంది అభ్యర్థులు మొత్తం 48 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారని వికాస్‌రాజ్ వెల్లడించారు. 23లోగా పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకోవాలి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం వికలాంగు లు, 85 ఏళ్లుపైబడిన వయోజనులు, అత్యవసర సేవల ఉద్యోగులు/జర్నలిస్టులు ఈ నెల 23లోగా ఫారం–12డీ దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని సీఈఓ వికాస్‌రాజ్ సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిలో ఇంకా 40వేల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని, తక్షణమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 3 నుంచి 6 వరకు తొలి విడత పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 26 నుంచి ఓటర్లకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ చేస్తామన్నారు. పాత ఓటరు గుర్తింపుకార్డులు కలిగిన 46 లక్షల మంది ఓటర్లకు వారి కొత్త ఓటరు గుర్తింపుకార్డు నంబర్లను తెలియజేస్తూ లేఖలు పంపినట్టు తెలిపారు. పాత నంబర్లతో ఓటు ఉండదని, కొత్త నెంబర్లతోనే ఉంటుందన్నారు. మహిళా ఓటర్లే అధికం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,31,48,527కి చేరిందని వికాస్‌రాజ్ తెలిపారు. 1000 మంది పురుషులకు రాష్ట్రంలో 1010 మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు మొత్తం 1,00,178 దరఖాస్తులొచ్చాయని, వీటిని ఈనెల 25లోగా పరిష్కరిస్తామని చెప్పారు. 2022–24 మధ్యకాలంలో రాష్ట్రంలో 60.6 లక్షల కొత్త ఓటర్ల నమోదు, 32.84 లక్షల ఓటర్ల తొలగింపు, 30.68 లక్షల ఓటర్ల వివరాల సవరణ జరిగిందన్నారు. -
Lok sabha elections 2024: పార్టీని ఆర్థికంగా చిదిమేసే కుట్ర
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ సభలు, ర్యాలీలు, అభ్యర్థుల భారీ ప్రచార కార్యక్రమాలకు ఎంతో ధనం అవసరమైన వేళ ప్రధాని మోదీ వ్యవస్థీకృతంగా కుట్రలు పన్ని కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా చిదిమేసేందుకు బరితెగించారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఢిల్లీలో పత్రికా సమావేశంలో సోనియా, పార్టీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాం«దీలు మాట్లాడారు. పార్టీలో ముగ్గురు అగ్రనేతలు ఒకేసారి మీడియాతో మాట్లాడటం ఇటీవలికాలంలో ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల ప్రచారఖర్చులు, ప్రకటనలకు భారీ మొత్తంలో నగదు అవసరమైన వేళ తమ బ్యాంక్ ఖాతాలను అదునుచూసి స్తంభింపజేయడాన్ని నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ‘కాంగ్రెస్‌కు ప్రజలిచి్చన నగదు విరాళాలను బలవంతంగా లాగేసుకున్నారు. ఇది చాలా తీవ్రమైన అంశం. ఓవైపు ఎలక్టోరల్ బాండ్లపై నిషేధం, మరోవైపు ఖాతాల స్తంభనతో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు. ఇవి నిజంగా అనూహ్యమైన తీవ్ర అవరోధాలు. ఇలా అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటూ కూడా మా శక్తిమేరకు అద్భుతంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను చేపట్టగలుగుతున్నాం. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారన్నది సుస్పష్టం. ప్రధాన ప్రతిపక్షం ఆర్థికమూలాలపై దాడి చేశారు’ అని సోనియా ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఫ్రీజ్ చేస్తేనే ఆరోగ్యకర పోటీ సాధ్యం: ఖర్గే ‘డీఫ్రీజ్ చేయడమే ఎన్నికల్లో ఆరోగ్యకర పోటీకి బాటలుపరుస్తుంది. సాధారణ ప్రజానీకం కాంగ్రెస్‌కు విరాళంగా ఇచి్చన మొత్తాలను ఫ్రీజ్ చేసి, ఐటీ శాఖతో బలవంతంగా రూ.115.32 కోట్లు నగదు విత్‌డ్రా చేయించి మమ్మల్ని బీజేపీ లూటీ చేసింది. స్వేచ్ఛాయుత, పారదర్శకమైన ఎన్నికలు అత్యావశ్యకమైన ఈ తరుణంలో రాజ్యాంగబద్ధ సంస్థలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలను డీఫ్రీజ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అని ఖర్గే కోరారు. ‘బీజేపీ అధికారంలో ఉంది. పైగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ తమ ఖాతాలను వేల కోట్ల రూపాయలతో నింపేసుకుంది. ఎన్నికల్లో దీటైన పోటీకి వీలు లేకుండా మా పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బతీసింది. అధికారంలో ఉన్న వారు ప్రత్యక్షంగాగానీ పరోక్షంగానీ రాజ్యాంగబద్ధ సంస్థలపై నియంత్రణ కల్గి ఉండొద్దు. వనరులపై గుత్తాధిపత్య ధోరణి అస్సలు మంచిది కాదు’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. రూ.2 కూడా చెల్లించలేని పరిస్థితి: రాహుల్ ‘ప్రధాన ప్రతిపక్షం అన్ని అకౌంట్లను ఫ్రీజ్చేయడం అంటే అది కాంగ్రెస్‌పై మాత్రమే ప్రభావం చూపదు దేశ ప్రజాస్వామ్యానికీ అది విఘాతమే. ఎన్నికల్లో పోటీచేసే సామర్థ్యాన్ని దెబ్బతీశారు. మేం ప్రచార కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నాం. ఫ్రీజ్ చేసి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేరపూరిత చర్యకు పాల్పడ్డారు. ఇలాంటి చర్యలతో దేశంలో ప్రజాస్వామ్యం ఉందనడం అబద్ధమే అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థలేవీ ఇక్కడ పని చేయట్లేవు’ అని రాహుల్ అన్నారు. ‘ఖాతాల స్తంభనతో కరెన్సీ కష్టాలు విపరీతంగా పెరిగాయి. మా నేతలు, అభ్యర్థులు విమానాల్లో దేశంలోని ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్లలేని పరిస్థితి. విమానం సంగతి పక్కనబెట్టండి. కనీసం రైలు టికెట్ కొనేందుకు కూడా కష్టపడుతున్నాం. 20 శాతం ఓటుబ్యాంక్ మాకున్నా రూ.2 కూడా చెల్లించలేని పరిస్థితి. అదునుచూసి ఎన్నికలకు రెండు నెలల ముందు మోదీ పన్నిన కుట్ర ఇది. ఇంత జరుగుతున్నా ఈసీ మౌనంవహించడం విచారకరం. ఈ విషయంలో ఈసీ ఇంతవరకు స్పందించలేదు’ అని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై బీజేపీ స్పందించింది. ఓటమి ఖాయం కావడంతో కావాలనే కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు గుప్పిస్తోందని బీజేపీ ప్రతివిమర్శ చేసింది. అసుర శక్తిపైనే పోరాటం: రాహుల్ విద్వేషం నిండిన ఆసుర(రాక్షస) శక్తిపై తమ పార్టీ పోరాటం సాగిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ‘శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం’ అంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్య లు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. రాహుల్ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా బీజేపీ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్వేషం నిండిన అసుర శక్తిపైనే తమ పోరాటం అని రాహుల్ గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో స్పష్టం చేశారు. అసుర శక్తిని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. -
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు
సాక్షి, అమరావతి: ఎటువంటి హింస, రీపోలింగ్ వంటివి లేకుండా స్వేఛ్చాయుత వాతావరణంలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో మే 13న జరిగే ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. ఆయన శనివారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. ఎక్కడైనా అల్లర్లు జరిగితే ఆ జిల్లా ఎస్పీ, రీపోలింగ్ జరిగితే ఆ జిల్లా కలెక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా గతంలోకంటే అధికంగా పోలింగ్, పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 46,156 పోలింగ్ స్టేషన్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల సంఖ్య 1600 దాటితే వాటిని రెండు పోలింగ్ స్టేషన్లుగా విభజిస్తామని, దీనివల్ల 887 కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామన్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించేలా కేవలం మహిళా సిబ్బందితో 179 పోలింగ్ కేంద్రాలు, అదే విధంగా దివ్యాంగులతో 63, యువతతో 50, మోడల్ పోలింగ్ స్టేషన్లు 555 ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు 1 ప్లస్ 5 మంది ఉద్యోగులు ఉంటారన్నారు. గతంలో ఎన్నికల విధుల్లో అంగన్వాడీలు, తాత్కాలిక సిబ్బంది సేవలను కూడా వినియోగించుకున్నారని, ఈ సారి పూర్తిగా రెగ్యులర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులనే నియమిస్తున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బందికి ప్రధాన బాధ్యతలు కాకుండా సిరా వేయడం వంటి విధులను అప్పగిస్తామన్నారు. ఎవరు ఎక్కడ విధుల్లో పాల్గొంటారో ర్యాండమ్‌గా సాఫ్ట్వేర్ ద్వారా ఎంపిక చేస్తామని చెప్పారు. వలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండరన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలింగ్ స్టేషన్‌కు కనీసం ఇద్దరు పోలీసు సిబ్బంది ఉంటారన్నారు. ఇందుకోసం 1,14,950 మంది సివిల్ పోలీసులు, 58 కంపెనీల రాష్ట్ర ఆర్మ్డ్ పోలీసులు, 465 కంపెనీల కేంద్ర బలగాలు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు శనివారం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, కోడ్ ఉల్లంఘిస్తే తనతో సహా ఏ స్థాయి అధికారిపైన అయినా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే ఫిర్యాదులు అందిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నిరంతరం నిఘా కోసం 50 మంది జనరల్ అబ్జర్వర్లు, 115 మంది వ్యయ పరిశీలకులు, 13 మంది పోలీసు అబ్జర్వర్లు ఉంటారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 22 విభాగాలతో తనిఖీలు చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 121 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. వీటికి అదనంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే తనిఖీల ద్వారా రూ.164.35 కోట్లు విలువైన నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రధాన మంత్రి మినహా మిగతా రాజకీయ నేతలందరినీ తనిఖీ చేస్తారని, చేతి బ్యాగులు తప్ప మిగతా వాటిని సోదా చేస్తారని చెప్పారు. విమానాశ్రయాల్లో కాకుండా ప్రైవేటుగా విమానాలు, హెలికాప్టర్లలో దిగిన స్థలాల వద్దకు సంచార స్క్వాడ్స్ వెళ్లి తనిఖీలు చేస్తాయన్నారు. అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలను జిల్లా కలెక్టర్లకు తెలియజేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పెయిడ్ ఆర్టికల్స్, సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలపైనా నిఘా ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎటువంటి మత ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల ఉల్లంఘనలపై 1950 నంబరుకు లేదా సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులకుఇంటి వద్దే ఓటింగ్ 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్ద లేదా పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేయొచ్చని మీనా తెలిపారు. ఇంటి వద్దే ఓటు వేయాలనుకొంటే ముందుగా ఫారం 12 పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి ఇస్తే దాన్ని పరిశీలించి పోస్టల్ బ్యాలెట్‌కు అనుమతిస్తారన్నారు. ఒకసారి పోస్టల్ బ్యాలెట్‌కు అనుమతి లభిస్తే వారు పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేయడానికి కుదరదని స్పష్టం చేశారు. ఇలా పోస్టల్ బ్యాలెట్ కోరిన వారికి ఎన్నికల తేదీకి పది రోజుల ముందే వీడియోగ్రాఫర్‌తో కలిపి ఐదుగురు సిబ్బంది ఇంటికి వచ్చి పోస్టల్ బ్యాలెట్‌కు ఏర్పాట్లు చేస్తారని చెప్పారు. పోలింగ్ బూత్‌లో లానే గోప్యంగా ఓటు హక్కును వినియోగించుకొని ఆ పోస్టల్ బ్యాలెట్‌ను రెండు కవర్లలో పెట్టి పోలింగ్ బాక్స్‌లో వేయాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్‌కు ఇంటికి వస్తున్న సమాచారాన్ని పోటీలో ఉన్న అభ్యర్థులకు ముందుగానే తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు డీజీపీ (లా – ఆర్డర్) శంకబ్రత్ బాగ్చీ, అదనపు సీఈవోలు హరేంధర ప్రసాద్, పి. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 53 రోజుల్లో కొత్తగా 1.30 లక్షల మంది ఓటర్లు ఈ నెల 16 నాటికి 4.09 కోట్లు దాటిన ఓటర్లు జనవరి 22న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాతో పోలిస్తే ఈ నెల 16 నాటికి ఓటర్ల సంఖ్య 1,30,096 పెరిగినట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. జనవరిలో విడుదల చేసిన జాబితాలో ఓటర్ల సంఖ్య 4,08,07,256 మంది ఉండగా ఇప్పడు 4,09,37,352కు చేరినట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూలు వచ్చినందున ఓట్ల తొలిగింపు, చిరునామా మార్పులకు అవకాశం ఉండదని, కొత్త ఓటర్ల నమోదుకు నామినేషన్ల చివరి రోజు వరకు అవకాశం ఉందని చెప్పారు. ఇవి చేయొచ్చు ♦ ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల లబ్ధిదారులకు ప్రయోజనాలను కొనసాగించవచ్చు ♦ చేయూత పథకానికి ఇప్పటికే నిధులిస్తే వాటిని కొనసాగించవచ్చు ♦ ఇప్పటికే చేపట్టిన పనులు కొనసాగించొచ్చు. పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించొచ్చు ♦ ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ వంటి సంస్థలు ఉద్యోగాల నియామకాల ప్రక్రియ కొనసాగించొచ్చు ఇవి చేయకూడదు ♦ పథకాలకు కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేయకూడదు ♦ పథకాలకు కొత్తగా నిధులు విడుదల చేయాల్సి వస్తే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి ♦ పనులు మంజూరైనప్పటికీ, ఇంకా ప్రారంభించని వాటిని ఇప్పుడు చేపట్టకూడదు ♦ కంపెనీలకు, వ్యక్తులకు భూములు కేటాయించకూడదు. అసాధారణ కేసుల్లో సీఎంఆర్ఎఫ్ మంజూరుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలి ♦ మంత్రులు ఫైలెట్ కార్లను వినియోగించకూడదు ♦ ప్రధానమంత్రి తప్ప మిగతా ఏ రాజకీయ నాయకులకు ప్రొటోకాల్ ఉండదు -
నన్ను కొత్తగా చూస్తారు
రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన ΄ాత్రల్లో నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో చెప్పిన విశేషాలు. లారెన్స్ మాట్లాడుతూ – ‘‘జిగర్ తండ’ సినిమాలోని గ్యాంగ్‌స్టర్ ΄ాత్రలో నటించే తొలి అవకాశం నాకే వచ్చింది. కానీ అప్పుడు ఇతర ్ర΄ాజెక్ట్స్తో బిజీగా ఉండటం వల్ల చేయడం కుదర్లేదు. ఆ తర్వాత ‘జిగర్ తండ’కు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. దీంతో ‘జిగర్ తండ’ కు సీక్వెల్ ఉన్నట్లయితే అందులో నేను నటిస్తానని కార్తీక్ సుబ్బరాజుకి చె΄్పాను. ఈ సీక్వెల్ ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’ కథ సిద్ధమైన ఏడాది తర్వాత కార్తీక్ సుబ్బరాజు ఫోన్ చేసి చె΄్పారు. కథ నచ్చడంతో ఈ సినిమాలో నటించాను. ∙ఈ సినిమా విషయంలో దర్శకుడు కార్తీక్ చెప్పినట్లు చేశాను. ప్రేక్షకులు కొత్త రాఘవా లారెన్స్‌ని చూస్తారు. సినిమా ఫస్టాప్‌లో యాక్షన్, సెకండాఫ్‌లో భావోద్వేగాల సన్నివేశాలు ఉంటాయి. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల హృదయం కూడా బరువెక్కుతుంది. ∙త్వరలో ‘కాంచన 4’ స్టార్ట్ చేస్తాను. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్‌గారి కోసమే కాదు.. సూపర్‌స్టార్, మెగాస్టార్ (చిరంజీవిని ఉద్దేశిస్తూ..) కలిసి యాక్ట్ చేసే ఓ మల్టీస్టారర్ స్క్రిప్ట్ నా దగ్గర ఉంది. కానీ వారు యాక్ట్ చేయాలి కదా’’ అన్నారు. నటుడు– దర్శకుడు ఎస్జే సూర్య మాట్లాడుతూ– ‘‘దర్శకత్వం–నటన..ఈ రెండింటిలో నాకు నటన అంటేనే ఇష్టం. అయితే నా కెరీర్ ్ర΄ారంభంలో యాక్టింగ్ అవకాశాల కోసం డైరెక్షన్‌ని వారధిగా వినియోగించుకున్నాను. ఇక ‘జిగర్ తండ: డబుల్ఎక్స్’లో లారెన్స్గారిది గ్యాంగ్‌స్టర్ రోల్. నాదేమో దర్శకుడు కావాలనుకునే ΄ాత్ర. నా ΄ాత్రలో సత్యజిత్ రేగారి సినిమాల రిఫరెన్స్ ఉండటంతో ఇదొక బహుమతిగా భావించి ఈ మూవీ చేశాను. మంచి మాస్ కమర్షియల్ అంశాలు ఉన్న సందేశాత్మక చిత్రం ఇది. ఈ సినిమా షూటింగ్ కోసం ఓ విలేజ్ సెట్ వేయాల్సి వచ్చింది. ఇందులో భాగంగా ఓ రోడ్, బ్రిడ్జ్ వేశాం. అప్పటికే రోడ్, బ్రిడ్జ్ సౌకర్యాలు లేక ఇబ్బందిపడుతున్న ఆ గ్రామస్తులకు ఇవి ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. నేను నటిస్తూ, నా దర్శకత్వంలో ఓ సినిమా రానుంది’’ అని చెప్పుకొచ్చారు. -
నన్ను తీసేశారా అని భయపడ్డాను
‘పలాస’ ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’. అపర్ణా జనార్ధన్, సంకీర్తనా విపిన్ హీరోయిన్లుగా సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వంలో డా. అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రం నవంబరు 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఓ కీ రోల్ చేసిన చరణ్‌రాజ్ బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. ఎనిమిదేళ్లు కష్టపడ్డాను. ఆకలి బాధలు అనుభవించాను. ఫలితంగా సినీ ఇండస్ట్రీలో సుధీర్ఘమైన 40 ఏళ్ల కెరీర్ లభించింది. వివిధ భాషల్లో ఐదు వందలకు పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేశాను. అయితే ‘ప్రతిఘటన, జెంటిల్‌మేన్’ సినిమాలు నన్నొక నటుడిగా తెలుగు ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా చేశాయి. ఇక దర్శకుడు సెబాస్టియన్ నాకు ‘నరకాసుర’ కథ చెప్పినప్పుడు నా పాత్రకు బాగా ఎగ్జయిట్ అయ్యాను. కానీ రెండు నెలలు గడిచినా సెబాస్టియన్గారి నుంచి ఫోన్ రాలేదు. మేం చేస్తే కనెక్ట్ కాలేదు. దీంతో ‘నరకాసుర’లోంచి నన్ను తీసేశారా అనే భయం కలిగింది. కథా రచనలో భాగంగా జబల్పూర్ వెళ్లానని, అందుకే ఫోన్ కలవలేదని, ‘నరకాసుర’లో నాకు చెప్పిన పాత్రను నేనే చేస్తున్నట్లుగా సెబాస్టియన్గారు ఆ తర్వాత చెప్పారు. అప్పుడు రిలాక్స్ అయ్యాను. ఈ సినిమాలో నా పాత్ర మంచికి మంచి, చెడుకు చెడు అన్నట్లుగా ఉంటుంది. నా కెరీర్లో ఇప్పటివరకు చేయని ఓ ప్రత్యేక పాత్రను ఈ సినిమాలో చేశాను. ప్రస్తుతం శ్రీహరిగారి అబ్బాయి మేఘాంశ్ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాను’’ అని అన్నారు. -
నువ్వు నీలా ఉండు అని చెప్పింది
రవితేజ టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహనిర్మాతగా అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో నూపుర్ సనన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఎవర్నైనా ప్రేమిస్తే వారి కోసం ఏదైనా చేయడానికి సాహసించే మార్వాడి అమ్మాయి సారా పాత్రను చేశాను. ఈ చిత్రంలో నా వేషధారణ మోడ్రన్‌గా ఉంటూనే ట్రెడిషనల్‌గా ఉంటుంది. తెలుగులో చేసిన తొలి సినిమా ‘టైగర్ నాగేశ్వర రావు’తోనే నాకు సారాలాంటి చాలెంజింగ్ రోల్ దొరకడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం దాదాపు రెండు వందల మందిని ఆడిషన్ చేశాక, ‘సారా’ పాత్రకు నన్ను ఎంపిక చేశారు వంశీగారు. సెట్స్‌లో ఆయన చెప్పినట్లు నటించాను. ప్రస్తుతం నవాజుద్దిన్ సిద్ధిఖీతో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నేను సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు ‘నువ్వు నీలా ఉండు’ అని అక్క (హీరోయిన్ కృతీ సనన్) సలహా ఇచ్చింది. ‘మిమి’ సినిమాలో అక్క నటన నాకు కన్నీళ్లు తెప్పించింది. మా అక్క తెలుగులో మహేశ్‌బాబు, ప్రభాస్, నాగచైతన్య వంటి స్టార్లతో సినిమాలు చేసింది. ఆ విధంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది’’ అని చెప్పుకొచ్చారు. -
కథ విన్నప్పుడే కన్నీళ్లొచ్చాయి
రవితేజ టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. వంశీ దర్శకత్వంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో గాయత్రీ భరద్వాజ్ మాట్లాడుతూ– ‘‘నా స్వస్థలం ఢిల్లీ. పుణేలో చదువుకున్నాను. మా నాన్నగారు పైలెట్. అమ్మ సైకాలజిస్ట్. నాకు చిన్నప్పట్నుంచే ఫ్యాషన్ వరల్డ్‌లో ఫేమస్ కావాలని ఉండేది. నా ఏడో తరగతిలోనే ఫ్యాషన్ ర్యాంప్ వాక్ చేసి, విజేతగా నిలిచాను. ఆ తర్వాత భరత నాట్యం, క్లాసికల్ సింగింగ్ నేర్చుకున్నాను. హిందీలో అవకాశాలు రావడంతో ఓ సినిమా, మూడు వెబ్ సిరీస్‌లు చేశాను. ‘టైగర్ నాగేశ్వరరావు’ నా తొలి తెలుగు సినిమా. నన్ను ఎంపిక చేయడానికి ముందు దాదాపు 60 మందిని ఆడిషన్ చేశారట. ఈ చిత్రంలో విలేజ్‌లో టామ్‌బాయ్‌లా కనిపించే మణి పాత్ర చేశాను. దర్శకులు వంశీగారు ఈ పాత్ర గురించి దాదాపు మూడు గంటలు వివరించారు. పాత్రలో మంచి ఎమోషన్ ఉంది. కథ వింటున్నప్పుడే కన్నీళ్లొచ్చాయి. ఈ సినిమా విషయంలో నాకు భాషాపరంగా ఏ ఇబ్బంది లేదు. నాకు తెలుగు టీచర్ ఉన్నారు. ఇక రవితేజగారు సెట్స్‌లో చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ప్రస్తుతం ఓ తెలుగు సినిమా చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నార్త్ ఇండస్ట్రీలో కాస్త హరీబరీగా ఉంటుంది. కానీ తెలుగు పరిశ్రమలో చాలా ఓర్పుతో వర్క్ చేస్తున్నారు. లభిస్తున్న గౌరవం కూడా ఎక్కువే. తెలుగు ప్రేక్షకులు కూడా సినిమాను ఎంతో ప్రేమిస్తారు’’ అని చెప్పుకొచ్చారు. -
మీడియా కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్ నేతల రచ్చ
తిరువనంతపురం: కేరళలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనే బహిరంగంగా వాగ్వాదానికి దిగారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సుధాకరన్, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్లు మైక్ ముందే నువ్వా-నేనా అన్నట్లు తగువులాడుకున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగాన్ని ముందు ఎవరు ప్రారంభించాలనే అంశం ఇద్దరి మధ్య వాగ్వాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. పుత్తుపల్లి ఉప ఎన్నికల్లో చాందీ ఊమెన్ అఖండ విజయం సాధించిన తర్వాత సెప్టెంబర్ 8న కొట్టాయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. సతీషన్, సుధారకరన్ పక్కపక్కనే కూర్చున్నారు. ఈ క్రమంలో ముందు ఉన్న మైక్‌లను సుధాకరన్ తనవైపుకు తిప్పుకున్నారు. దీంతో ముందు మీరెలా ప్రసంగం ప్రారంభిస్తారని సతీషన్ ప్రశ్నించారు. దీంతో వివాదం రచ్చకెక్కింది. తాను పార్టీ ప్రెసిడెంట్‌ను అని తెలిపిన సుధాకరన్.. తనకు ఆ హక్కు ఉంటుందని మైక్ ముందే అన్నారు. ఎట్టకేలకు సతీషన్ తగ్గగా.. మైకులను సుధాకరన్ వైపుకు ఉంచారు. ప్రెస్ మీటింగ్‌లో అడిగిన ప్రశ్నలకు అధ్యక్షుడు ఇప్పటికే చెప్పారుగా.. అంటూ సతీషన్ దాటవేశారు. మీడియా ప్రతినిధులు ఇంగ్లీష్‌లో అడిగిన ప్రశ్నలకు సధాకరన్కు సతీషన్ సహాయం చేయడానికి కూడా నిరాకరించారు. ఇద్దరి మధ్య వాగ్వాదానికి సంబంధించిన అంశంపై సతీషన్‌ను ప్రశ్నించగా.. తమ మధ్య వేరే విషయం ఉందని అన్నారు. పుత్తుపల్లి గెలుపు క్రెడిట్ మొత్తం తనకే కేటాయిస్తానని అనడంతో నేను ఆపే ప్రయత్నం చేశానని సతీషన్ చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: Jamili Elections: జమిలి ఎన్నికల ఉన్నతస్థాయి కమిటీ తొలి భేటీ -
నా పూర్వజన్మ సుకృతం ఇది
తెలంగాణ ప్రజా కవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణ రావు జీవితం ఆధారంగా ప్రభాకర్ జైనీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. కాళోజీగా మూల విరాట్ నటించారు. విజయలక్ష్మీ జైనీ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌కు వెళుతోంది. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ– ‘‘కాళోజీలాంటి గొప్ప కవి సినిమా తీయడం సాహసమే అయినప్పటికీ నాకీ అవకాశం రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘త్వరలో విడుదల కాబోతున్న మా సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు విజయలక్ష్మీ జైనీ. ‘‘ఈ సినిమాలో నటించడానికే సినిమా రంగంలోకి వచ్చినట్లుగా భావిస్తున్నా. కాళోజీ ΄ాత్ర చేశాకే నా జీవితానికి సార్థకత లభించిందనే భావన కలుగుతోంది’’ అన్నారు మూల విరాట్. -
అనులో మంచి పాత్ర చేశాను
కార్తీక్ రాజు, ప్రశాంత్ కార్తి, మిస్తీ చక్రవర్తి, ఆమని, దేవీ ప్రసాద్, భీమినేని శ్రీనివాసరావు, ΄ోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అను’. సందీప్ గోపిశెట్టి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరులో విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ఈ సినిమా విలేకర్ల సమావేశంలో ఆమని మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఓ మంచి పాత్ర చేశాను. చక్కని సందేశాత్మక చిత్రం ఇది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలి’’ అన్నారు. ‘‘దర్శకుడిగా నాకు ఇదే తొలి చిత్రం. సెప్టెంబరులో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు సందీప్ గోపిశెట్టి. ‘‘ఈ సినిమాలో విలన్‌గా చేశాను’’ అన్నారు ప్రశాంత్ కార్తి. దేవీ ప్రసాద్, భీమనేని శ్రీనివాసరావు, లైన్ ్ర΄÷డ్యూసర్ కల్యాణ్ చక్రవర్తి ఈ సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు. -
'ఇది ఆరంభం మాత్రమే.. చేయాల్సింది చాలా ఉంది'
''నాకిది ఆరంభం మాత్రమే.. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. భవిష్యత్తులో నేను టీమిండియాకు చాలా చేయాల్సి ఉంది.''.. ఇవీ విండీస్‌తో తొలి టెస్టులో శతకంతో మెరిసిన జైశ్వాల్ చేసిన వ్యాఖ్యలు. టీమిండియా తరపున అరంగేట్రం చేసిన టెస్టులోనే సెంచరీ చేసిన 17వ ఆటగాడిగా.. మూడో ఓపెనర్‌గా యశస్వి జైశ్వాల్ చరిత్రకెక్కాడు. వీటితో పాటు మరిన్ని రికార్డులు బద్దలు కొట్టిన జైశ్వాల్ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆడుతుంది వెస్టిండీస్ లాంటి బి-గ్రేడ్ జట్టుతో కావొచ్చు.. కానీ ఆడుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ఒక ల్యాండ్ మార్క్ ఇన్నింగ్స్‌తో కెరీర్‌ను మొదలుపెట్టడం ఏ క్రికెటర్ కైనా గొప్పగానే కనిపిస్తోంది. అందుకే జైశ్వాల్ రెండోరోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమెషనల్ అయ్యాడు. "నాకు, నా కుటుంబానికి, నాకు అన్ని విధాలుగా మద్దతిచ్చిన అందరికీ ఇది చాలా ఎమోషనల్ మూమెంట్. ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం. నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. దీనికి ఎంతగానో సహకరించిన మా అమ్మానాన్నలకు ఈ సెంచరీ అంకితమిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది" అని యశస్వి అన్నాడు. ఒకప్పుడు క్రికెట్‌ను కెరీర్‌గా మలచుకోవడానికి ముంబై వచ్చి పానీపూరీ అమ్మిన యశస్వి.. ఇప్పుడు ఇండియాతరఫున అరంగేట్రం చేయడమే కాదు తొలి టెస్టులోనే సెంచరీతో చెలరేగాడు. 91 ఏళ్ల రికార్డును కూడా బ్రేక్ చేశాడు. ఐపీఎల్ ద్వారా సెలక్టర్ల దృష్టిలో పడిన యశస్వి.. అంతర్జాతీయ క్రికెట్ ను ఘనంగా మొదలుపెట్టాడు. 2020లో తొలిసారి ఐపీఎల్ ఆడిన యశస్వి.. 2023 సీజన్ ను మరుపురానిదిగా మలచుకున్నాడు. ఈ సీజన్ లో అతడు 14 మ్యాచ్ లలో 625 రన్స్ చేసి రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఒక సెంచరీతోపాటు ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ ప్రదర్శన అతన్ని జాతీయ జట్టులోకి వచ్చేలా చేసింది. సెలెక్టర్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని యశస్వి వమ్ము చేయలేదు. A special dedication after a special start in international cricket! 😊#TeamIndia | #WIvIND | @ybj_19 pic.twitter.com/Dsiwln3rwt — BCCI (@BCCI) July 14, 2023 చదవండి: Yashasvi Jaiswal: చరిత్రకు మరో 57 పరుగుల దూరంలో ICC-BCCI Revenue Share: పేరుకే పెద్దన్న.. బీసీసీఐదే సింహభాగం, మరోసారి నిరూపితం -
మొట్టమొదటిసారి ప్రెస్ కాన్ఫరెన్సులో నరేంద్ర మోదీ?
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా వైట్ హౌస్ లో జరిగే యూఎస్ ప్రెస్ కాన్ఫెరెన్స్ లో ఆయన పాల్గొంటారని, అయితే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రెండే రెండు ప్రశ్నలుంటాయని ఈ ఫార్మాట్ గురించి వివరించారు వైట్ హౌస్ జాతీయ భద్రతాధికారి జాన్ కిర్బీ. భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ ఎప్పుడైనా ఇంటర్వ్యూలలో మాట్లాడటం తప్పిస్తే ఎన్నడూ ప్రెస్ కాన్ఫరెన్సులో పాల్గొంది లేదు. అయితే అమెరికా పర్యటనలో ఉన్న ఆయన చివర్లో మాత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారని ఆ ఫార్మాట్లో కూడా కేవలం రెండే ప్రశ్నలుంటాయని తెలిపారు వైట్ హౌస్ భద్రతాధికారి జాన్ కిర్బీ. "బిగ్ డీల్" దీన్ని "బిగ్ డీల్" గా వర్ణిస్తూ.. భారత్ ప్రధాని ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం సంతోషకరం. ప్రస్తుతం ఇది రెండు దేశాలకు చాలా అవసరమైనదని, మోదీ కూడా ఇది అవసరమని చెప్పినట్లు తెలిపారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్సులో రెండే రెండు ప్రశ్నలుంటాయని.. ఒక ప్రశ్న యూఎస్ ప్రెస్ వారు అడిగితే రెండవది భారత జర్నలిస్టు అడుగుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండు ప్రశ్నల "బిగ్ డీల్" ఇప్పుడు అమెరికా మీడియాలో సంచలనంగా మారింది. ఇవి కూడా అడగండి.. ఇదిలా ఉండగా అమెరికా సెనేటర్లు మాత్రం భారత ప్రధానిని దేశంలోని రాజకీయ అనిశ్చితి గురించి, మత విద్వేషాల గురించి, పౌర సంస్థలపైన, విలేఖరులపైన జరుగుతున్న దాడుల గురించి, పత్రికా స్వేచ్ఛ, అంతర్జాల వినియోగంపై పరిధులు విధించడం వంటి అనేక విషయాల గురించి ప్రశ్నించమని కోరుతూ అధ్యక్షుడు జో బైడెన్ పై ఒత్తిడి చేస్తున్నారు. అయినా కూడా వైట్ హౌస్ వర్గాలు ప్రెస్ కాన్ఫరెన్సును రెండే ప్రశ్నలకు పరిమితం చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు సెనేటర్లు. ఇది కూడా చదవండి: ఇది "సాంకేతిక దశాబ్దం".. అమెరికా పర్యటనలో భారత ప్రధాని -
సీనియర్ నటుడు మురళీమోహన్ కీలక నిర్ణయం!
‘నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1973 మార్చిలో నా సినిమా (‘జగమే మాయ’) షూటింగ్ మొదలైంది. నన్ను హీరోగా పరిచయం చేసిన అట్లూరి పూర్ణచంద్రరావు, పీవీ సుబ్బారావుగార్లకు నా కృతజ్ఞతలు’’ అన్నారు నటుడు మురళీమోహన్. చిత్రపరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మురళీమోహన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘ఓ 15 ఏళ్లు ఇండస్ట్రీలో ఉంటాననుకున్నాను. అందరి సహకారానికి అదృష్టం తోడవ్వడంతో 50 ఏళ్లు ఉండగలిగాను. తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లినందు వల్ల పదేళ్లు సినిమాలకు బ్రేక్ వచ్చింది. ఇక పూర్తిగా సినిమాలకు అంకితమవ్వాలను కుంటున్నాను. నేను అక్కినేని నాగేశ్వరరావుగారి ఫ్యాన్‌ని. చనిపోయేంతవరకు సినిమాల్లో నటిస్తుంటానని, ఆ మాటను నిజం చేశారాయన. ఏయన్నార్‌గారి స్ఫూర్తితో ఇక నటనకే అంకితం అవుతాను’’ అన్నారు. మాతృదినోత్సవం సందర్భంగా ‘మిథునం’ చిత్ర సంగీత దర్శకుడు వీణాపాణి రాసిన ‘అమ్మే దైవం’ పాట వీడియోను రిలీజ్ చేశారు మురళీమోహన్. -
ఆ విషయంలో నేను లక్కీ
‘‘పిల్లలకు చదువుతోపాటు ఆటపాటలు, సంగీతం కూడా చాలా ముఖ్యం. కానీ, ప్రస్తుతం ఎంతోమంది తల్లిదండ్రులు కేవలం చదువు, ర్యాంకులు అంటూ పిల్లలపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పిల్లల్ని చదువుతోపాటు సంగీతం, ఆటపాటల్లోనూప్రోత్సహించాలని చెప్పే చిత్రమే ‘మ్యూజిక్ స్కూల్’’ అన్నారు శ్రియ.పాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. ► శ్రియ, శర్మాన్ జోషి, షాన్ ప్రధానపాత్రల్లో నటించారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో ‘దిల్’ రాజు, హిందీలో ‘పీవీఆర్’ సినిమాస్ ‘మ్యూజిక్ స్కూల్’ని రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో శ్రియ చెప్పిన విశేషాలు. ► ఐఏఎస్‌గా ఉన్నత స్థానంలో ఉన్నపాపారావుగారు సినిమాపై ΄్యాషన్‌తో ఐదారు కథలు సిద్ధం చేసుకున్నారు. వాటిలో ‘మ్యూజిక్ స్కూల్’ ఒకటి. ఈ కథ వినగానే ఎగై్జటింగ్‌గా అనిపించడంతో నటించేందుకు ఓకే చె΄్పాను. ‘సంతోషం’ చిత్రంలో నేను సంగీతం నేర్చుకునే స్టూడెంట్‌గా చేశా. ‘మ్యూజిక్ స్కూల్’లో సంగీతం నేర్పించే టీచర్పాత్ర నాది. ► పిల్లల్లో ఉండే ప్రతిభని తల్లితండ్రులు గుర్తించి,ప్రోత్సహించాలి. ఆ విషయంలో నేను లక్కీ. మా తల్లితండ్రులు ఏ విషయంలోనూ నాకు అడ్డు చెప్పకుండాప్రోత్సహించారు. మా అమ్మాయి రాధను కూడా చదువుతోపాటు సంగీతం, డ్యాన్స్, ఆటల్లో ప్రోత్సహిస్తాను.పాపారావుగారు ఈ మూవీని అద్భుతంగా తీశారు. ఈ సినిమాకి ఇళయరాజాగారి సంగీతం హైలైట్. ∙‘ఇష్టం’ (2001) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. ఇన్నేళ్ల కెరీర్లో ఎంతోమంది దర్శకులతో పనిచేశా.. ఎన్నో వైవిధ్యమైనపాత్రలు చేశా.. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. నేను చేసే ప్రతిపాత్ర డ్రీమ్ రోల్లాంటిదే. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం షూటింగ్లో ఐదురోజులు మాత్రమేపాల్గొన్నాను. నాపాత్ర నిడివి తక్కువే అయినా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌ను సవాలుగా తీసుకుని చేస్తాను. ప్రస్తుతం రెండు కొత్త సినిమాల్లో నటిస్తున్నాను. -
అనర్హత వేటు వేసినా, జైలుకు పంపినా తగ్గేది లేదు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. అనర్హత వేటు తర్వాత రాహుల్ గాంధీ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ధ్వజమెత్తారు. తాను దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడాను.. పోరాడుతానని స్పష్టం చేశారు. తనపై అనర్హత వేటు వేసినా, జైలుకి పంపినా భయపడేది లేదని.. ప్రశ్నిస్తూనే ఉంటానని తేల్చి చెప్పారు. అదానీ , మోదీ స్నేహం గురించి పార్లమెంట్లో మాట్లాడాడని.. వీరిద్దరి బంధం, ఇప్పటిది కాదు ఎప్పటినుంచో ఉందన్నారు. ‘నిబంధనలు మార్చి ఎయిర్‌పోర్ట్‌లు అదానీకి ఇచ్చారు. నేను విదేశీ శక్తుల నుంచి సమాచారం తీసుకున్నానని కేంద్రమంత్రులు పార్లమెంటులో అబద్ధం చెప్పారు. నేను రెండు లేఖలు రాస్తే.. వాటికి జవాబుల లేదు. స్పీకర్‌ను కలిసి మాట్లాడేందుకు సమయం ఇవ్వమంటే నవ్వి వదిలేశారు. నేను ఒకటే ప్రశ్న అడిగాను. అదానీ షెల్ కంపెనీలో 20 వేల కోట్లు ఎవరు పెట్టుబడి పెట్టారని..ఆ డబ్బు ఎవరిదని ప్రశ్నించాను’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. చదవండి: రాహుల్‌పై అనర్హత వేటు.. సెప్టెంబర్‌లో వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక? -
వాయిదాల్లో ఏసీడీ సేకరణ
హనుమకొండ: అదనపు వినియోగాధారిత డిపాజిట్(ఏసీడీ)ను వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఉత్తర విద్యుత్ పంపిణీ మండలి(ఎన్పీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్‌రావు తెలిపారు. మంగళవారం హనుమకొండలోని టీఎస్ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన విద్యుత్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏసీడీ విధింపుపై ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు. విద్యుత్ సర్వీస్ తీసుకున్నప్పటి కంటే అదనంగా లోడ్ పెరిగినప్పుడు ఆ మేరకు ఏసీడీ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏసీడీపై ప్రతి ఏడాది మే నెలలో వడ్డీ చెల్లిస్తూ బిల్లులు సర్దుబాటు చేస్తామని, విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిబంధనల మేరకే ఏసీడీ విధిస్తున్నామన్నారు. ఇది విద్యుత్ పంపిణీ సంస్థలు, పాలకమండలి సొంత నిర్ణయం కాదని స్పష్టం చేశారు. వినియోగదారులు వరుసగా రెండు నెలలు బిల్లు చెల్లించనప్పుడు మూడో నెల నోటీసు ఇచ్చి డిపాజిట్ నుంచి సంస్థకు రావాల్సిన బకాయిలు తీసుకుని సర్వీస్ రద్దు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో వినియోగదారులు వినియోగిస్తున్న యూనిట్లకు ఎంత బిల్లు వస్తుందో ఏడాదికి సగటున లెక్కించి రెండు నెలల బిల్లు మొత్తాన్ని ఏసీడీగా సేకరిస్తున్నామని, ఈ ఏసీడీని ఇంటి యజమాని చెల్లించాలన్నారు. అద్దెదారులు, ఇంటి యజమాని పరస్పర అవగాహనకు వచ్చి ఏడీసీని అద్దెదారులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని, తలసరి వినియోగంలోనూ ముందున్నామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డైరెక్టర్లు బి.వెంకటేశ్వర్రావు, పి.గణపతి, పి.సంధ్యారాణి, వి.తిరుపతిరెడ్డి, సీజీఎం మధుసూదన్ పాల్గొన్నారు. -
'భారీ స్కోర్లు రావడం లేదని తెలుసు.. కచ్చితంగా సెంచరీ కొడతా'
రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు బలహీనంగా కనిపించిన టీమిండియా బౌలింగ్ రెండో వన్డేలో మాత్రం అదిరింది. ముఖ్యంగా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తన పేస్ పదునుతో కివీస్ బ్యాటర్లను వణికించాడు. ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచాడు. ఆ తర్వాత మిగతా పనిని సిరాజ్, పాండ్యా, కుల్దీప్ యాదవ్, సుందర్‌లు పూర్తి చేశారు. మ్యాచ్ విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. భారత బౌలర్ల ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా బౌలింగ్ గాడిన పడడం మాకు కలిసొచ్చే అంశం. ఈ ప్రదర్శన ఇక్కడికే పరిమితం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని రోహిత్ వెల్లడించాడు. రోహిత్ మాట్లాడుతూ.. 'గత ఐదు మ్యాచ్‌ల్లో మా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. మేం అడిగిందల్లా చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక భారత్‌లో ఇలాంటి పేస్ పిచ్‌లను చూసుండరు. విదేశాల్లోనే ఇలాంటి వికెట్లను తరుచూ చూస్తుంటాం. మా బౌలర్లలో అసాధారణమైన ప్రతిభ, నైపుణ్యాలున్నాయి. శుక్రవారం ఇక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు ఫ్లడ్ లైట్స్ కింద బంతి స్వింగ్ అవ్వడం గమనించాం. దాంతో న్యూజిలాండ్ 250 పరుగులు చేసినా పోరాడే లక్ష్యమని భావించాం. ఈ ఆలోచనతోనే చేజింగ్‌కు మొగ్గు చూపాను. గత మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేయడంతో.. ఈ మ్యాచ్‌లో మమ్మల్ని మేం సవాల్ చేసుకోవాలనుకున్నాం. కానీ మేం అనుకున్న కఠిన పరిస్థితులు ఎదురవ్వలేదు. ఇండోర్ వేదికగా జరిగే చివరి వన్డే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. జట్టులో ప్రతీ ఒక్కరి ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. జట్టును ఇలా చూడటం గొప్పగా ఉంది. షమీ, సిరాజ్‌లు లాంగ్ స్పెల్స్ వేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఉందనే విషయాన్ని వారికి నేను గుర్తు చేస్తున్నాను. ఈ సిరీస్ నేపథ్యంలో మేం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను నా ఆటను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. బౌలర్లపై ఎదురుదాడికి దిగడం ముఖ్యమని భావిస్తున్నా. నేను భారీ స్కోర్లు చేయడం లేదనే విషయం తెలుసు. దాని గురించి నేను బాధపడటం లేదు. అతి త్వరలోనే భారీ స్కోర్ సాధిస్తాననే నమ్మకం ఉంది' అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 108 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా 20.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో మెరవగా, గిల్ 40 పరుగులు చేశాడు. చదవండి: రోహిత్ శర్మ.. ఇంత మతిమరుపా! -
'జట్టులో పంత్ ఎందుకు?'.. డీకే అదిరిపోయే రిప్లై
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ ఆరంభిస్తే.. చివర్లో దినేశ్ కార్తిక్ తనదైన ఫినిషింగ్‌తో ముగించాడు. ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సిన దశలో సిక్సర్, ఫోర్ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే కొంతకాలంగా చూసుకుంటే పంత్ జట్టులో ఉంటే కార్తిక్ ఉండకపోవడం.. కార్తిక్ ఉంటే పంత్ మ్యాచ్ ఆడకపోవడం లాంటివి జరుగుతూ వస్తుంది. ఇద్దరు జట్టులో ఉన్న సందర్భాలు చాలా తక్కువ. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో ఇద్దరికి తుది జట్టులో చోటు దక్కింది. ఇక పంత్ వికెట్ కీపర్‌గానే బాధ్యతలు నిర్వహించాడు. అయితే మ్యాచ్ విజయం అనంతరం దినేశ్ కార్తిక్ మీడియాతో మాట్లాడాడు. ఆస్ట్రేలియాతో రెండో టి20లో పంత్ జట్టులో ఎందుకు ఉన్నాడు అంటూ విలేకరులు ప్రశ్నించారు. దానికి డీకే అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ''వర్షం కారణంగా మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. దీంతో కెప్టెన్ రోహిత్‌కు ఐదుగురు బౌలర్ల ఆప్షన్ అవసరం లేకుండా పోయింది. జట్టులో నలుగురు బౌలర్లు ఉంటే చాలు.. అయితే హార్దిక్ రూపంలో ఐదో బౌలర్ ఉండనే ఉన్నాడు. అందుకే ఉమేశ్ యాదవ్ స్థానంలో పంత్ తుది జట్టులోకి వచ్చాడు. ఇంకో విషయమేంటంటే.. ఓవర్లు కుదించినప్పుడు స్పెషలిస్ట్ బ్యాటర్స్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే నాతో పాటు పంత్ కూడా జట్టులో ఉన్నాడు. తర్వాతి మ్యాచ్‌లో ఇలాగే కొనసాగుతుందా అంటే మాత్రం చెప్పలేను'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS 2nd T20: భారత్ గెలుపు మెరుపులు -
రిలీజ్ తర్వాత పాన్ ఇండియా అవుతుంది
‘‘నటన, దర్శకత్వం నాకు రెండు కళ్లు. హీరోగా సక్సెస్ అయి, ఆ తర్వాత ఓ 30 ఏళ్లకు డైరెక్షన్ చేయాలనుకున్నాను. కానీ సరైన అవకాశాలు దొరక్క నా తొలి సినిమా ‘ఫలక్‌నుమా దాస్’కి నా బ్యానర్లో నేనే దర్శకత్వం వహించాల్సి వచ్చింది. దర్శకుడిగా నాకు పూర్తి సంతృప్తి దక్కలేదు. ఎందుకంటే ఇది రీమేక్ చిత్రం. ప్రస్తుతం నేను చేస్తున్న దాస్కా ‘దమ్కీ’ చిత్రం నాలోని దర్శకత్వ ప్రతిభను చూపిస్తుందనే నమ్ముతున్నాను’’ అని విశ్వక్ సేన్ అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘దమ్కీ’. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్. వన్మయీ క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ పతాకాలపై కరాటే రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో వేసిన సెట్లో యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. ఇంకా ఓ సాంగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. శుక్రవారం జరిగిన ఈ సినిమా విలేకరుల సమావేశంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో హోటల్లో వర్క్ చేసే కృష్ణదాస్ అనే పాత్రలో కనిపిస్తాను. యాక్షన్ కొత్తగా ఉంటుంది. బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్–జుజితో అద్భుతమైన క్లయిమాక్స్ సీన్స్‌ను ప్లాన్ చేశాం. ఈ కథలో కలర్స్ మారుతుంటాయి. ఆడియన్స్ నవ్వుతుంటారు.. అలాగే చెమటలు పడతాయి. కథలో అంత బలం ఉంది. అవుట్‌పుట్‌పై నమ్మకం ఉంది. అందుకే ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నాం. రిలీజ్ తర్వాత పాన్ ఇండియా సినిమా అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నవరసాలు ఉంటాయి’’ అన్నారు కరాటే రాజు.