సాక్షి, హైదరాబాద్ : దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఘటన పూర్వాపరాలను మీడియాకు వివరించారు. దిశకు సంబంధించిన సెల్‌ఫోన్, పవర్‌బ్యాంకు, వాచ్ తదితర వస్తువులను సేకరించేందుకు నలుగురు నిందితులతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లామని, ఈ సందర్భంగా తమ పోలీసు అధికారుల వద్ద ఉన్న తుపాకీలను లాక్కుని ఆరిఫ్, చెన్నకేశవులు ఎదురు దాడికి దిగారని చెప్పారు. మిగతా నిందితులు రాళ్లతో పోలీసులపై దాడి చేశారని తెలిపారు. లొంగి పొమ్మని చెప్పినా వినకపోవడంతో వారిని ఎన్‌కౌంటర్ చేసినట్టు స్పష్టం చేశారు.
ప్రధానంగా ఈ కేసులో ఏ1 మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు తమ ఆయుధాలను లాక్కొని కాల్పులు జరిపారని చెప్పారు. దీంతో తప్పని పరిస్థితుల్లో తమ పోలీసులు కాల్పులు జరిపారన్నారు. బుల్లెట్ గాయాలతోనే నిందితులు హతమైనట్టుగా తెలిపారు. మిగిలిన వివరాలు పోస్ట్‌మార్టం నివేదిక అనంతరం తెలుస్తుందన్నారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో 10 మంది పోలీసు అధికారులు పాల్గొన్నారనీ, అంతా అయిదు పది నిమిషాల్లో ముగిసిపోయిందని ఆయన వివరించారు. ఎన్నిరౌండ్ల ఫైరింగ్ జరిగింనేది విచారణలో తేలుతుందన్నారు.
మరోవైపు తెలంగాణాలో చోటు చేసుకున్న ఈ ఘటనను జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సుమోటాగా తీసుకుంది. అత్యవసర దర్యాప్తునకు ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌ను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. దీనిపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ చట్టం తన పని తాను చేసుకుపోయిందని సజ్జనార్ వ్యాఖ్యానించారు. అలాగే ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర హోం శాఖకు, ఎన్‌హెచ్‌ఆర్‌సీకి తమనివేదికను అందిస్తామని చెప్పారు.
దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్..
మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు
దిశ నిందితుల ఎన్కౌంటర్: ఆ బుల్లెట్ దాచుకోవాలని ఉంది
దిశ కేసు: చాటింపు వేసి చెప్పండి
పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం
దిశకు న్యాయం జరిగింది.. మరి నిర్భయ?
‘సాహో సజ్జనార్’ అంటూ ప్రశంసలు..
‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోండి’
పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం
ఆ బుల్లెట్ దాచుకోవాలని ఉంది: మనోజ్
Comments
Please login to add a commentAdd a comment