Encounter.
-
హిడ్మా చనిపోలేదు.. సేఫ్‌గా ఉన్నాడు
బస్తర్: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఎన్కౌంటర్లో పోలీసుల ప్రకటనపై ట్విస్ట్ చోటు చేసుకుంది. బుధవారం జరిగిన కాల్పులపై మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఒక లేఖ రిలీజ్ చేసింది. మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) మొదటి బెటాలియన్ కమాండర్ మాడ్వి హిడ్మా చనిపోయాడన్న వార్తల్లో వాస్తవం లేదంటూ ప్రకటించింది. బుధవారం జరిగిన కాల్పుల్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మరణించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే.. తాజాగా మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటి కార్యదర్శి పేరుతో లేఖ విడుదల అయ్యింది. అందులో ‘‘కేంద్ర కమిటీ సభ్యుడిగా హిడ్మా చనిపోలేదు. చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. హిడ్మా సేఫ్ గా ఉన్నాడు.దక్షిణ బస్తర్ జంగిల్ కొండలపై పోలీసులు, సీఆర్పీఎఫ్లు సంయుక్తంగా డ్రోన్లు, హెలికాప్టర్ ద్వారా దాడులు చేశాయి. గత ఏడాది ఏప్రిల్ లో కూడా వైమానిక బాంబు దాడి చేశారు. మావోయిస్ట్ పార్టీ నాయకత్వంను దెబ్బతియాలని వందల సంఖ్యలో బాంబులు పేల్చారు. రాత్రి, పగలు లేకుండా గగనతలం ద్వారా నిఘా పెట్టారు. వచ్చే ఎన్నికల్లోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. అందులో భాగంగానే మావోయిస్టులపై ఈ దాడులు, ప్రకటనలు. ఈ భీకర దాడుల కారణంగా ప్రజలు పొలాలకు వెళ్లలేకపోతున్నారు. ప్రపంచంలోనే అన్ని ప్రగతిశీల కూటములు ఏకం కావాలని, యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడాల’’ని లేఖ ద్వారా మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం స్థానికుడయిన హిడ్మా అక్కడి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. దండకారణ్యంలో దాక్కున్న ఈ మావోయిస్టు అగ్రనేతను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున్న సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గతంలోనూ హిడ్మా చనిపోయాడంటూ అనేకసార్లు ప్రచారం జరిగింది. హిడ్మా: చిక్కడు దొరకడు.. కేంద్ర కమిటీ వల్లే దెబ్బ తిన్నాడా? -
జమ్మూ కశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని సిధ్రాలో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భారత జవాన్లు మట్టుబెట్టారు. సంజ్తీర్థి- సిధ్రా రహదారిపై వెళ్తున్న ట్రక్కులో ఉగ్రవాదులు దాక్కున్నారని జమ్మూకశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు భద్రతా బలగాలను రంగంలోకి దింపాయి. ట్రక్కను అడ్డుకొని తనిఖీలు చేస్తుండగా డ్రైవర్ పారిపోగా.. అందులో దాక్కున్న ఉగ్రవాదులు సిబ్బందిపై కాల్పులు జరిపారు. J&K | Encounter underway in Sidhra area of Jammu, firing going on, two terrorists likely on the spot: Jammu and Kashmir police pic.twitter.com/R4JCATGM65 — ANI (@ANI) December 28, 2022 వెంటనే సైనిక బలగాలు టెర్రరిస్టులపై ఎదురుకాల్పులు జరిపాయి. ఉదయం 7.30 గంటలకు కాల్పులు జరిగాయని, ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. ఎన్ కౌంటర్ స్థలంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన ఒక కోడెడ్ షీట్, ఒక లెటర్ ప్యాడ్ పేజీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా జమ్మూ కాశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో 15 కిలోల ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌ను(ఐఈడీ)బలగాలు పసిగట్టి నిర్వీర్యం చేసిన తర్వాత ఎన్కౌంటర్ జరిగింది. చదవండి: చేదు మిగిల్చిన షుగర్ వ్యాధి.. వేదన చూడలేక కుటుంబమంతా.. -
దిశ ఎన్కౌంటర్: హైకోర్టుకు చేరిన సిర్పూర్కర్ కమిషన్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దిశ ఎన్కౌంటర్ కేసు హైకోర్టుకు చేరింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్‌కు సంబంధించి సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక హైకోర్టుకు చేరింది. దిశ కేసులో ఎమికస్ క్యూరీగా దేశాయ్ ప్రకాష్ రెడ్డిని హైకోర్టు నియమించింది. దిశ కేసు నిందితులది బూటకపు ఎన్కౌంటర్ అంటూ కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసును హైకోర్టు విచారిస్తుందంటూ సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. త్వరగా ఈ కేసు విచారణను పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కాగా 287 పేజీల కమిషన్ నివేదికకు సంబంధించి 57 మంది సాక్షులను, 10 మంది పోలీసులను విచారించారు. 2019 నవంబర్ 27న సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిన యువవైద్యురాలు దిశ కనిపించకుండా పోయింది. మరుసటి రోజు ఉదయం చటాన్‌పల్లి వద్ద జాతీయ రహదారి పైవంతెన కింద కాలుతూ ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మృతురాలిని దిశగా తేల్చారు. 2019 డిసెంబర్ 6వ తేదీన దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగింది. షాద్ నగర్‌కు సమీపంలోని చటాన్ పల్లి అండర్ పాస్ వద్ద ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. -
Jammu and Kashmir: 100 నాటౌట్
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది ఇప్పటికే 100 మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. వీరిలో పాకిస్తాన్‌కు చెందిన ముష్కరులు 30 మంది ఉన్నారు. జూన్ 12న పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హతమైన ముగ్గురు లష్కరే తోయిబా సభ్యులతో కలుపుకుని, ఈ ఏడాది ఇప్పటిదాకా పలు ఆపరేషన్లలో 100 మంది ముష్కరులను ఏరివేసినట్లు భద్రతాధికారులు పేర్కొన్నారు. సరిహద్దుల ఆవల నుంచి చొరబాట్లు, రిక్రూట్మెంట్లు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇటీవలి కాలంలో సరిహద్దులకు సమీపంలో పాక్ ఆర్మీ 12కు పైగా ఉగ్ర శిక్షణ శిబిరాలను తిరిగి ప్రారంభించిందన్నారు. దీంతో కశ్మీర్‌వ్యాప్తంగా గాలింపు చర్యలను ఉధృతం చేశామన్నారు. ‘కశ్మీర్లో ఇంకా 158 మంది వరకు ఉగ్రవాదులు పనిచేస్తున్నట్లు సమాచారముంది. వీరిలో 83 మంది వరకు లష్కరేకు చెందిన వారే. 30 మంది జైషే మొహమ్మద్, 38 మంది హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల వారున్నారు. అమర్నాథ్ యాత్రను భగ్నం చేసేందుకు ఉడి, కశ్మీర్‌లోయలోని ఆరు చోట్ల ఐఎస్ఐ ఉగ్ర శిబిరాలను నిర్వహిస్తోంది. ఇందుకోసం స్టికీ బాంబులను వాడొచ్చు’’ అని వెల్లడించారు. ‘‘బాల్టాల్ మార్గంలో కంగన్ వద్ద, పంథా చౌక్ మీదుగా వెళ్లే యాత్రికులపైనా ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. వీటిని తిప్పికొట్టేందుకు పూర్తిస్థాయిలో నిఘా చేపట్టాం’ అని భద్రతాధికారులు తెలిపారు. -
భద్రతాదళాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు
జమ్మూ కశ్మీర్: భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య షోపియాన్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. షోపియాన్ జిల్లాలోని హరిపోరా ప్రాంతంలో భద్రతా దళాలకు ఉగ్రవాదులు తారస పడటంతో ఒక్కసారిగా వారి మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన ఏ సమయంలో చోటు చేసుకుంది అనేది స్పష్టంగా తెలియలేదు. -
డ్రగ్స్ విక్రేతలను ఎన్కౌంటర్ చేయాలి
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ నుంచి రాష్ట్ర యువతను కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కఠిన చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్ విక్రయించే వారిని ఎన్కౌంటర్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ నియంత్రణకోసం తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పబ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై ఆదివారం ఆయన వీడియో సందేశం ద్వారా స్పందించారు. హైదరాబాద్‌ను డ్రగ్స్ అడ్డాగా మారుస్తున్నారని, అమ్మేవారిని, కొనేవారిని కఠిన శిక్షించకపోతే ఇది మరింత ముదిరే ప్రమాదముందని రాజాసింగ్ హెచ్చరించారు. డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేవైఎం యత్నం.. రాష్ట్రంలో యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా అవుతుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, పోలీస్ శాఖ చూసీచూడనట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ యువమోర్చా విభాగం ఆదివారం డీజీపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించింది. బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో అధికారపార్టీ నాయకుల కుటుంబీకులు, వీఐపీల పిల్లలు, ఇతర ప్రముఖులున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని వారిని వెంటనే అరెస్ట్ చేసి విచారణ జరపాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఎన్ఐఏతో విచారణ జరిపించాలని, డ్రగ్స్ ఎవరి నేతృత్వంలో వస్తున్నాయో తేల్చాలని డిమాండ్ చేశారు. -
సరిహద్దులో పేలిన తూటా
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: ఇంకా చీకట్లు తొలగిపోలేదు.. చలితో మన్యం వణుకుతోంది.. ప్రశాంతంగా ఉన్న అడవిలో ఒక్కసారిగా కాల్పుల శబ్దం. అరగంటకు పైగా భీకర పోరు. సోమవారం ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో తెలంగాణ గ్రేహౌండ్స్, ఛత్తీస్‌గఢ్ సీఆర్పీఎఫ్ జవాన్లు.. మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో నలుగురు మహిళలు కాగా, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతదేహాలను ఘటనా స్థలం నుంచి భారీ పోలీసు బందోబస్తు నడుమ ఎర్రంపాడు, చెన్నాపురం, తిప్పాపురం గ్రామాల మీదుగా ట్రాక్టర్లపై ఆంజనేయపురం వరకు తరలించి, అక్కడి నుంచి రెండు అంబులెన్సుల ద్వారా భద్రాచలం మీదుగా తిరిగి ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు. చనిపోయిన మావోయిస్టుల వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. అరగంట సేపు హోరాహోరీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ల పరిధిలోని పెసర్లపాడు అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణలోని ములుగు, భద్రాద్రి జిల్లా చర్లతో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుకుమా జిల్లాల అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో తెలంగాణ గ్రేహౌండ్స్, సుకుమా జిల్లాకు చెందిన డీఆర్జీ, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ బలగాలు.. భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్‌దత్ నేతృత్వంలో సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్‌కు బయలుదేరాయి. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. అర్ధగంట పాటు సాగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా ప్రాంతంలో రెండు 303 రైఫిళ్లు, మూడు డీబీబీఎల్ తుపాకులతో పాటు నాలుగు రాకెట్ లాంచర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చర్ల మండలం చెన్నాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సీఆర్పీఎఫ్ క్యాంపును తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి పరిశీలించిన పది రోజులకే భారీ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. కాగా క్రమంగా విస్తరిస్తున్న మావోయిస్టుల ఏరివేతపై జిల్లా పోలీసు యంత్రాంగానికి డీజీపీ దిశానిర్దేశం చేశారనే చర్చ జరుగుతోంది. చర్ల టు సుకుమా..! మృతదేహాలకు పోస్టుమార్టం చేసే విషయంలో ఇరు రాష్ట్రాల పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. ముందు ములుగు జిల్లాకు తరలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత భారీ భద్రత నడుమ అటవీ ప్రాంతం నుంచి చర్ల వరకు మృతదేహాలను తీసుకొచ్చారు. దీంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరుగుతుందని అందరూ భావించారు. కానీ భద్రాచలం మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమాకు తరలించారు. మృతదేహాలను తరలించే సమయంలో సరిహద్దు గ్రామాలకు చెందిన ఆదివాసీలు వాహనాలను అడ్డుకునే అవకాశం ఉందని భావించిన పోలీసు బలగాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. కాగా చనిపోయిన మావోయిస్టుల వివరాలు తెలుసుకునే యత్నం చేస్తు న్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ తెలిపారు. చర్ల–కిష్టారం పోలీస్స్టేషన్ల పరిధిలో మావోయిస్టులు పెద్ద ఎత్తున గుమిగూడి పోలీసులపై దాడికి వ్యూహరచన చేస్తున్నట్టుగా పక్కా సమాచారం అందిందని చెప్పారు. దీంతో ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టగా ఎదురుకాల్పులు జరిగాయని వివరించారు. చనిపోయిన వారంతా మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం – తూర్పుగోదావరి (బీకే–టీజీ) జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ అంగరక్షకులనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న రాకెట్ లాంచర్లు, తుపాకులు ఆపరేషన్ ఆజాద్ ఫలించలేదా..? ఈ ఎన్కౌంటర్ నుంచి ఆజాద్ తప్పించుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఉంటూ తెలంగాణలో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఆజాద్‌ను లక్ష్యంగా చేసుకుని పోలీసు బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో మృతి చెందిన వారిలో మణుగూరు ఏరియా కమిటీ కమాండర్, ఆజాద్ ప్రొటెక్షన్ టీం సభ్యుడు మంతు ఉన్నట్లుగా తెలుస్తుండడం ఈ అనుమానాలకు తావిస్తోంది. -
దిశ ఎన్కౌంటర్ ప్రదేశాన్ని పరిశీలించిన సిర్పూర్కర్ కమిషన్
సాక్షి, హైదరాబాద్/ షాద్‌నగర్/ శంషాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’హత్యాచా రం కేసులో సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ హైదరాబాద్‌కు వచ్చింది. కమిషన్ చైర్మన్, సుప్రీంకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్, సభ్యులు బాంబే హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ రేఖా బాల్దోటా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాజీ చీఫ్ బి.కార్తికేయన్లు ఆదివారం చటాన్‌పల్లిలోని దిశ ఎన్కౌంటర్ జరిగిన సంఘటనా స్థలాన్ని సందర్శించారు. త్రిసభ్య కమిటీతో పాటు ‘దిశ’హత్యాచారంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) చైర్మన్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, విచారణాధికారి (ఐఓ) జె.సురేందర్‌రెడ్డి, శంషాబా ద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, కమిషన్ తరుఫు న్యాయవాదు లు, కమిషన్ సెక్రటరీ కూడా ‘దిశ’సంఘటనా స్థలికి సంబంధించిన ప్రైవేట్ గెస్ట్‌హౌస్, తొండుపల్లి గేటు, చటాన్‌పల్లి ప్రాంతాలను సుమారు 6 గంటలపాటు సందర్శించారు. తొలుత నలుగురు నిందితులను దర్యాప్తు నిమిత్తం ఉంచిన ప్రైవేట్ గెస్ట్ హౌస్‌ను బృందం సందర్శించింది. ఆ తర్వాత ‘దిశ’ఘటనకు కారణమైన తొండుపల్లి గేటును పరిశీలించింది. దిశ స్కూటర్‌ను ఎక్కడ పార్క్ చేసింది? నిందితులు లారీని ఎక్కడ నిలిపి ఉంచారు? వంటి వివరాలపై డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రహరీలోకి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సుమారు 20 నిమిషాల పాటు బృందం అక్కడే గడిపింది. కాగా, తొండుపల్లి గేటు సమీపంలో దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి త్రిసభ్య కమిటీని కలిశారు. తమకు కూడా ఒకరోజు సమయమివ్వాలని శ్రీధర్‌రెడ్డి కోరగా.. ‘మీ సమస్యలన్నీ మాకు తెలుసని.. మీకు న్యాయం జరుగుతుంది’అని కమిషన్ హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. నిందితుల తరఫున విచారణ వద్దు... సిర్పుర్కర్ కమిషన్ షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ సంద ర్శించి, రికార్డులను క్షుణ్నంగా పరిశీలించింది. ‘దిశ’కేసు సమయం లో స్టేషన్లో రికార్డ్ల నిర్వహణ, విలేకరుల సమావేశం నిర్వహించిన సమావేశం గది, స్టేషన్‌లోని ఇతరత్రా ప్రాంతాలను పర్యవేక్షించింది. ఇదిలా ఉండగా.. దిశను అత్యంత దారుణంగా హతమార్చిన వ్యవహారంలో సిర్పుర్కర్ కమిటీ ప్రజలకు ఏ విధమైన సంకేతాలు ఇస్తుందని, నిందితుల తరుఫున విచారణ చేయడమేంటని ప్రశ్నిస్తూ షాద్‌నగర్ పీఎస్ ఎదుట ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ‘కమిషన్ గో బ్యాక్’అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నేతలు స్టేషన్ ముందు బైఠాయించారు. చటాన్‌పల్లిలో ప్రతీ అంశం పరిశీలన.. షాద్‌నగర్ పీఎస్ నుంచి కమిటీ నేరుగా చటాన్‌పల్లికి చేరుకుంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సుమారు గంటసేపు క్షుణ్నంగా పరిశీలించింది. సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం నిందితులను తీసుకొచ్చిన బస్ ఎక్కడ నిలిపారు? దిశ వస్తువులను ఎక్కడ పాతి పె ట్టారు? నిందితులు ఎటువైపు పారిపోయే ప్రయత్నం చేశారు? ఆ సమయంలో పోలీసులు నిల్చున్న చోటు, ఎదురు కాల్పుల్లో నిందితుల మృతదేహాలు పడి ఉన్న దూరం.. వంటి ప్రతీ అంశంలోనూ కమిషన్ క్షుణ్నంగా వివరాలు సేకరించింది. ‘దిశ’ను దహనం చేసిన ప్రాంతాన్ని సాధ్యమైనంత దగ్గరికి వెళ్లి పరిశీలించింది. కాగా, ‘దిశ’నిందితుల ఎన్కౌంటర్ జరిగి డిసెంబర్ 6తో రెండేళ్లు పూర్తయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2లోపు సుప్రీంకోర్ట్‌కు కమిషన్ నివేదికను సమర్పించే అవకాశముంది. -
హైదర్‌పురా కాల్పులపై న్యాయ విచారణ
శ్రీనగర్: కశ్మీర్‌లోని హైదర్‌పురాలో సోమవారం జరిగిన కాల్పుల ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా న్యాయ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా శ్రీనగర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఖుర్షీద్ అహ్మద్ షాను నియమించారు. హైదర్‌పురాలో ఓ ఇంట్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక పాక్ ఉగ్రవాది, అతడి సహాయకుడు మహ్మద్ అమీర్ మాగ్రే, ఇంటి యజమాని మహ్మద్ అల్తాఫ్ భట్, అందులో అద్దెకు ఉండే ముదాసిర్ గుల్ మృతిచెందారు. మాగ్రే, అల్తాఫ్ భట్, ముదాసిర్ గుల్కు ఉగ్రవాదులతో సంబంధం లేదని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతదేహాలను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, నాలుగు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని పోలీసులు చెప్పారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్‌లో ధర్నా చేశారు. బాధిత కుటుంబాలకు మద్దతుగా హురియత్ కాన్ఫరెన్స్ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. అల్లర్లు జరుగుతాయన్న అనుమానంతో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధినేత మహబూబా ముఫ్తీని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులను అరెస్టు చేశారు. మహ్మద్ భట్, గుల్ మృతదేహాలను వెలికితీసి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) కమాండర్ అఫాక్ సికందర్ ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. కుల్గాం జిల్లా పాంబే, గోపాల్‌పొరాలో బుధవారం భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో మొత్తం ఐదుగురు ముష్కరులు మరణించారు. గోపాల్‌పొరాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా వారు భద్రతా అధికారులపై కాల్పులు జరిపారని, ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్ ఐజీ విజయ్ ట్వీట్ చేశారు. వారిలో ఒకరు నిషేధిత టీఆర్ఎఫ్కు చెందిన కమాండర్ సికందర్‌గా గుర్తించినట్టు పేర్కొన్నారు. ఇక పాంబే ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. చదవండి: CJ Sanjib Banerjee: నన్ను క్షమించండి..! -
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్
సాక్షిప్రతినిధి, వరంగల్/మంచిర్యాల/చర్ల: మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. శనివారం మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దు గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుకా గ్యారబట్టి అడవుల్లో తుపాకులు గర్జించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఎదురు కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. పోలీస్ కమాండోలు నలుగురు గాయపడ్డారు.మృతి చెందిన మావోయిస్టుల్లో కీలక నేత మిలింద్ తేల్‌తుమ్డే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతుండగా ఆదివారం ఉదయం వరకు మృతుల పూర్తి వివరాలు తెలుస్తాయని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ పేర్కొన్నారు. గాయపడిన పోలీసులను చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో నాగ్‌పూర్‌కు తరలించారు. సుదీర్ఘ పోరు గడ్చిరోలి డివిజనల్ కమిటీ సభ్యుడి నేతృత్వంలో కోర్చి దళం సంచరిస్తోందని పక్కా సమాచారం రావడంతో అడిషనల్ ఎస్పీ సౌమ్య ముండే నేతృత్వంలో సి–60 కమాండోల బృందం కూంబింగ్ ప్రారంభించింది. వంద మందికి పైగా బలగాలు ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ధనోరా గ్యారబట్టి అటవీ ప్రాంతంలోని కోర్చి గ్రామ సమీపంలో తారసపడిన మావోయిస్టులు కమాండో బృందంపైకి కాల్పులకు తెగబడ్డారు. వెంటనే బలగాలు దీటుగా బదులిచ్చాయి. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అడవులు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. ఘటనలో నలుగురు కమాండోలు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలం నుంచి రాత్రి 7 గంటల వరకు 26 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అంకిత్ గోయెల్ తెలిపారు. ఘటనాస్థలి నుంచి 18 ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులైన పోలీసులను చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో నాగ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సాంకేతిక విభాగంలో పని చేస్తున్న రవి అలియాస్ జైలాల్ చనిపోయినట్లు భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. గతేడాది జూన్ 25న బాణం బాంబులు పరీక్షిస్తున్న సమయంలో తీవ్రంగా గాయపడినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. సాంకేతికతలో దిట్ట అయిన రవి మరణవార్తను చాలా ఆలస్యంగా పార్టీ బహిర్గతం చేసింది. మృతుల్లో మిలింద్ తేల్‌తుమ్డే? ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్‌తుమ్డే అలియాస్ దీపక్, అలియాస్ ప్రవీణ్ కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతుల్లో పలువురు డివిజన్, ఏరియా కమిటీ కార్యదర్శులు, సభ్యులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మృతుల వివరాలపై ఆదివారం వరకు స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఎల్గార్ పరిషత్–భీమా కోరెగావ్ కేసులో నిందితుడిగా ఉన్న మిలింద్ పుణె పోలీసుల మోస్ట్ వాటెండ్ జాబితాలో ఉన్నాడు. ‘మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఇది పోలీసు బలగాలకు లభించిన ఘన విజయం’అని ఎస్పీ గోయెల్ పేర్కొన్నారు. మిలింద్కు గన్‌మెన్‌గా పని చేసిన రాకేశ్ కొద్ది రోజుల క్రితమే పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. దెబ్బ మీద దెబ్బ... నిత్యం డ్రోన్లతో జల్లెడ పడుతూ, దండకారణ్యంలో కూంబింగ్‌లతో సాగుతున్న ఆపరేషన్ ప్రహార్‌తో ఏడాది కాలంగా మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. 2018లో ఏప్రిల్ 23న గడ్చిరోలి జిల్లా అహెరి, ఏటపల్లి తాలూకాల్లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో 40మంది మావోయిస్టులు మృత్యవాత పడ్డారు. ఈ ఏడాదిలో భారీ ఎన్కౌంటర్లు మే 21న పయిడి, కోట్మి అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 13మంది మావోయిస్టులు చనిపోయారు. అక్టోబర్ 11న కోస్మి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. -
జైషేకు ఝలక్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. రోజుకొక ఎన్కౌంటర్ జరుగుతోంది. బుధవారం పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ హతమయ్యాడు. అతనిని షామ్ సోఫిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. పుల్వామా జిల్లా అవంతిపోరాలోని తిల్వాని మొహల్లా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ గ్రామాన్ని చుట్టుముట్టి వారిని అదుపులోనికి తీసుకోవడానికి ప్రయత్నించాయి. అయితే మిలిటెంట్లు భద్రతా బలగాలపై హఠాత్తుగా కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచి్చందని పోలీసులు వెల్లడించారు. ఈ ఎదురు కాల్పుల్లో ఒకరు మరణించారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని చూసి జైషే మహమ్మద్ టాప్ కమాండర్ షామ్ సోఫిగా గుర్తించినట్టు కశీ్మర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విటర్ ఖాతాలో కూడా వెల్లడించారు. -
ఎన్కౌంటర్లో మావోయిస్టుల సామగ్రి స్వాధీనం
పాడేరు: ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని మథిలి పోలీసుస్టేషన్ పరిధిలోని తుల్సి పహద్ అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులకు చెందిన భారీ సామగ్రి, తుపాకీలను పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దండకారణ్యంలో ఎస్‌వోజీ, జీవీ ఎఫ్ పార్టీలు, ఇతర పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహించగా ఎదురు కాల్పుల ఘటనలో ముగ్గురు కీలక మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మల్కన్‌గిరి జిల్లా సుదాకొండ గ్రామానికి చెందిన అనిల్ అలియాస్ కిషోర్ అలియాస్ ముఖసొడి (ఏసీఎస్ క్యాడర్, రూ.5 లక్షల రివార్డు) ఆంధ్రా, ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీలోని గుమ్మ బ్లాక్‌లో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అలాగే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళా మావోయిస్టు సోని ఏసీఎం క్యాడర్లో మావోయిస్టు కీలకనేత ఉదయ్‌కు ప్రొటెక్షన్ టీంలో పనిచేస్తున్నారు. ఆమెపైనా రూ.4 లక్షల రివార్డు ఉంది. ఆంధ్రాకు చెందిన విశాఖ ఏజెన్సీలోని పెదబయలు మండలానికి చెందిన చిన్నారావు మావోయిస్టు సభ్యుడిగా, మావోయిస్టు మహిళ నేత అరుణ ప్రొటెక్షన్ టీంలో పనిచేస్తున్నారు. ఆయనపై రూ.లక్ష రివార్డు ఉంది. ఈ ముగ్గురు కీలక మావోయిస్టులు మృతి చెందడంతో మావోయిస్టు పార్టీకి దండకారణ్యంలో గట్టిదెబ్బ తగిలింది. -
ఎన్కౌంటర్లతో దద్దరిల్లిన కశ్మీర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ వరస ఎన్కౌంటర్లతో దద్దరిల్లుతోంది. సొఫియాన్ జిల్లాలో మంగళవారం జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవల శ్రీనగర్, బందిపొరా కాల్పులతో ప్రమేయమున్న ఇద్దరు ఉగ్రవాదులు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్టుగా పోలీసులు తెలిపారు. ‘సొఫియాన్, తుల్రాన్, ఫీరిపొరా గ్రామాల్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని 24 గంటల్లో అందిన ప్రాథమిక సమాచారం మేరకు వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. ఉగ్రవాదులు పోలీసు బృందాలపై కాల్పులకు దిగారు. ఎదురు కాల్పుల్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు. శ్రీనగర్‌లోని లాల్బజార్లో స్థానికేతరుడిని చంపేసిన ఉగ్రవాది ముక్తార్ షా ఈ ఎన్కౌంటర్లో మరణించాడు’అని కశ్మీర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఒక ఎన్కౌంటర్లో ముగ్గురు మరణిస్తే, మరో ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరణించిన ఉగ్రవాదులందరూ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారే. వీరంతా ఇటీవల కాలంలో పౌరులే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతూ కశ్మీర్‌లోయలో బీభత్సం సృష్టించినట్టు ఆ అధికారి వివరించారు. చదవండి: (ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభం?) పాక్ జాతీయుడు అరెస్ట్ న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఐఎస్ఐతో లింకులున్నట్లు అనుమానిస్తున్న పాకిస్తాన్ జాతీయుడ్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో దాడులకు కుట్ర పన్నిన అతనిని లక్ష్మీ నగర్లో అదుపులోనికి తీసుకొని, ఏకే 47 గన్స్, ఇతర మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కి చెందిన మొహమ్మద్ అష్రాఫ్ అలియాస్ అలీ(40) బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి చొరబడ్డాడు. పదేళ్లుగా ఇక్కడే ఉంటున్నాడని అధికారులు తెలిపారు. -
దిశ ఎన్‌కౌంటర్‌పై నేడు విచారణ
సాక్షి, హైదరాబాద్/మక్తల్: సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ నేడు విచారించనుంది. గురువారమే విచారణ జరగాల్సి ఉండగా అనివార్యకారణాల వల్ల శుక్రవారానికి వాయిదా పడింది. కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని నిందితుల కుటుంబసభ్యులకు సమన్లు జారీ చేశారు. త్రిసభ్య కమిటీ 18 మంది సాకులను విచారించనుంది. ఇదిలాఉండగా..తమకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని నిందితుల కుటుంబసభ్యులు బుధవారం కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో వారికి రక్షణ కల్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్లో మృతి చెందిన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్‌కు చెందిన అరీఫ్, గుడిగండ్ల గ్రామానికి చెందిన చెన్నకేశవులు, జొల్లు నవీన్‌కుమార్, శివల కుటుంబసభ్యుల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో.. ఎన్కౌంటర్లో మృతిచెందిన ఆరీఫ్ తండ్రి హుస్సేన్, నవీన్‌కుమార్ తల్లి లక్ష్మి, జొల్లు శివ తండ్రి రా జప్ప, చెన్నకేశవులు తల్లి జయమ్మ, భార్య రేణు కలు బుధవారమే ఇళ్ల నుంచి వెళ్లిపోయారని.. రెం డురోజుల నుంచి హైదరాబాద్‌లో ఒకే ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు తెలిసింది. అయితే వీరిని విచారణకు హాజరుకావొద్దని పోలీసులు బెదిరిస్తున్నారని జొళ్లు రాజప్ప ‘సాక్షి’కి తెలిపారు. ఈనెల 21న ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు దేవరకద్ర రోడ్ వద్ద బస్సుకోసం నిలబడగా..నంబరుప్లేటు లేని ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు వేగంగా వచ్చి ఢీకొట్టేందుకు ప్రయత్నించగా..రోడ్డు కిందికి దిగిపోవటంతో దగ్గరకొచ్చి బెదిరించారని తెలిపారు. కేసువాపసు తీసుకోకపోతే చింతకుంట కుర్మప్ప (చెన్నకేశవులు తండ్రి)కు పట్టిన గతే నీకూ పడుతుందని బెదిరించారని ఆరోపించారు. -
జమ్ముకశ్మీర్ ఎన్కౌంటర్లో అమరుడైన ఆర్మీ జేసీఓ
శ్రీనగర్:జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో గురువారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) అమరుడైనట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. రాజౌరీలోని తనమండి బెల్ట్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే ఉగ్రవాదుల కోసం వెతుకుతుండగా.. ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు కాల్పులు తిప్పికొట్టాయని పోలీసు అధికారులు తెలిపారు. జమ్మూ డిఫెన్స్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ మాట్లాడుతూ...ఉగ్రవాదుల కాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) తీవ్రంగా గాయపడ్డారని, ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, అయినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఆయన అమరుడయ్యారని తెలిపారు. -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు శుక్రవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కుల్గాం జిల్లాలో బీఎస్‌ఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు బద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పలు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టగా. .మరో ఉగ్రవాది తప్పించుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్‌ఫ్ అధికారులకు, మరో ఇద్దరు స్థానిక పౌరులకు గాయాలయ్యాయి. -
జమ్మూకశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ముగ్గురు నిషేధిత లష్కరే తోయిబా(ఎల్ఈటీ)కి చెందినవారు. అధికారుల సమాచారం ప్రకారం.. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఐదో వర్థంతి సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో పలు ప్రాంతాల్లో జనం బంద్ పాటించారు. ఈ నేపథ్యంలో పుల్వామా జిల్లాలోని పుచాల్ ప్రాంతంలో ముష్కరుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. వీరి రాకను గమనించిన ముష్కరులు వెంటనే కాల్పులు ప్రారంభించారు. ఆత్మరక్షణ కోసం భద్రతా సిబ్బంది సైతం ఎదురు కాల్పులు జరిపాల్సి వచ్చింది. కొంతసేపటి తర్వాత ఉగ్రవాదుల వైపునుంచి కాల్పులు ఆగిపోయాయి. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా, రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు లష్కరే తోయిబాకు చెందిన కిఫాయత్ రంజాన్ సోఫీ, అల్ బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇనాయత్ అహ్మద్ దార్గా గుర్తించారు. ఇక కుల్గామ్ జిల్లాలో జాతీయ రహదారిపై ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నారన్న సమాచారంతో అధికారులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ వాహనాన్ని ఆపగా, అందులోని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా సిబ్బంది సైతం ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఉద్దరు ఉగ్రవాదులు మరణించారు. మృతులు లష్కరే తోయిబాకు చెందిన నాసిర్ అహ్మద్ పండిత్, షాబాజ్ అహ్మద్ షాగా గుర్తించారు. జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు జవాన్ల వీరమరణం జమ్మూ: పాకిస్తాన్ ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత భద్రతా సిబ్బంది విజయవంతంగా తిప్పికొట్టారు. కశ్మీర్లో రాజౌరీ జిల్లా సుందర్బనీ ప్రాంతంలో ఉన్న దాదల్ అటవీ ప్రాంతంలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు పాకిస్తాన్ ముష్కరులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందడంతో గురువారం భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. వారిపై చొరబాటుదారులు కాల్పులు జరిపారు. సైన్యం దీటుగా బదులిచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే భారత సైన్యానికి జవాన్లు శ్రీజిత్.ఎం, మరుప్రోలు జశ్వంత్‌రెడ్డి వీరమరణం పొందారని సైనిక ఉన్నతాధికారులు ప్రకటించారు. -
విశాఖ ఎన్కౌంటర్: పెద్దపల్లి జిల్లాలో విషాదం
సాక్షి, పెద్దపల్లి: విశాఖ ఏజెన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో పెద్దపల్లి జిల్లాలో విషాదం అలుముకుంది. ఈ కాల్పుల్లో ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన మావోయిస్టు కీలక నేత సందె గంగయ్య మృతి చెందారు.కాగా విశాఖపట్నం జిల్లాలోని కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. అందులో మావోయిస్టు పార్టీ డీసీఎంగా కొనసాగుతున్న అశోక్ అలియాస్ సందె గంగయ్య కూడా ఉన్నాడు. ఇతనికి తల్లి, నలుగురు సోదరులు ఉన్నారు. గంగయ్య సోదరుడు రాజయ్య సైతం 1996లో ఎన్కౌంటర్లో మరణించాడు. ఇక 1999లో నక్సల్ ఉద్యమంలో చేరిన గంగయ్య మావోయిస్ట్ డీసీఎం కమాండర్‌గా ఎదిగాడు. ఓదెల మండలంలోనే 7వ తరగతి వరకు చదువుకున్నాడు. తన కొడుకు గంగయ్య ఎన్కౌంటర్లో మృతిచెందాడన్న సమాచారం తల్లి అమృతమ్మకు తెలియడంతో ఆమె బోరున విలపించారు. ఇది వరకు రెండు మూడు సార్లు ఎన్కౌంటర్ అయినట్లు సమాచారం వచ్చినప్పటికీ నమ్మలేదని, ప్రస్తుతం పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఎన్కౌంటర్లో అమరుడైనట్లు భావిస్తున్నామని సోదరుడు తెలిపారు. మృతదేహాన్ని తీసుకురావడానికి వైజాగ్ వెళ్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: విశాఖలో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి మృతులను గుర్తించిన పోలీసులు కాగా తీగలమెట్ట అటవీప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతులను పోలీసులు గుర్తించారు. వీరిలో ముగ్గురు మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు. డిప్యూటీ కమాండర్ సందే గంగయ్య కూడా మృతుల్లో ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. మరో డీసీఎం రణ దేవ్, పైకే, లలితలను గుర్తించారు. మరో మహిళ మావోయిస్ట్‌ను గుర్తించాల్సి ఉంది. -
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్
చర్ల: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో శుక్రవారం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఏడుగురు మహిళలున్నారని అధికారులు తెలిపారు. ఇటీవలే హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దిలీప్ వాల్సే పాటిల్ తన మొట్టమొదటి పర్యటనలో భాగంగా శుక్రవారం గడ్చిరోలికి వచ్చిన సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈటపల్లి తహశీల్‌లోని పైడి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సమావేశం జరుగుతోందన్న సమాచారం మేరకు ఆ ప్రాంతంలో జిల్లా పోలీసు విభాగానికి చెందిన సీ–60 కమాండోలు గాలింపు చేపట్టారు. వారిని గమనించిన మావోయిస్టులు యథేచ్ఛగా కాల్పులు ప్రారంభించారు. లొంగిపోవాలన్న హెచ్చరికలను పట్టించుకోకుండా కాల్పులు కొనసాగించారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో 13 మంది మావోయిస్టులు చనిపోయారు. ఉదయం 6 నుంచి 7.30 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుందని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయెల్ తెలిపారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ఏడుగురు మహిళలున్నారనీ, వీరంతా కసన్సూర్ దళానికి చెందిన వారనీ ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతంలో తునికాకు సేకరణ జరుగుతుండటంతో వసూళ్ల విషయమై చర్చించేందుకే వీరంతా సమావేశమైనట్లు తెలుస్తోందన్నారు. ఈ ఘటనలో మరికొందరు మావోయిస్టులు కూడా గాయపడి ఉంటారనీ, ఘటనా స్థలి నుంచి తప్పించుకున్న వారికోసం కూంబింగ్ ముమ్మరం చేశామన్నారు. మృతుల్లో చాట్గాన్ లోకల్ గెరిల్లా స్క్వాడ్ ఇన్చార్జ్, డీవీసీఎం మహేష్ గోఠా ఉన్నాడు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది. ఘటనాస్థలి నుంచి ఒక ఏకే–47, ఒక ఎస్ఎల్ఆర్, ఒక కార్బయిన్, ఒక .303 రైఫిల్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లాలో 2020 సెప్టెంబర్ నుంచి జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 27 మంది వరకు మావోయిస్టులు మృతి చెందారని ఎస్పీ గోయెల్ వివరించారు. -
అర్ధరాత్రి రౌడీ షీటర్ హల్చల్.. పోలీసుల ఎన్కౌంటర్
బనశంకరి: పరారీలో ఉన్న రౌడీ షీటర్‌ను పట్టుకోవడానికి వెళ్లగా పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. పదునైన ఆయుధంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సమయంలో ఓ కానిస్టేబుల్‌పై చాకుతో గాయపరచడంతో పోలీసులు గన్‌కు పని బెట్టారు. నిందితుడిని అదుపులోకి చేసేందుకు పోలీసులు కాలిపై కాల్పులు జరపడంతో రౌడీ షీటర్ కిందపడిపోయాడు. కిందపడిన అతడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన కర్నాటకలోని బనశంకరి ప్రాంతంలో జరిగింది. రామమూర్తినగరకు చెందిన సూర్య అలియాస్ జెట్టి రెండు హత్యలు, హత్యాయత్నం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. రౌడీ షీటర్‌గా గుర్తింపు పొందాడు. ఇతడి ముఠా ఈ నెల 4వ తేదీన రఘురామ్ అనే వ్యక్తిపై దాడి చేసి పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అతడు ఒకచోట ఉన్నాడని తెలుసుకుని వెళ్లగా పోలీసులపై ఎదురుదాడికి దిగాడు. ఏసీపీ పరమేశ్వర్ నేతృత్వంలో మంగళవారం అర్ధరాత్రి హెచ్బీఆర్ లేఔట్ రెండోక్రాస్లోని ఓ ఇంటిపై దాడి చేశాడు. అతడిని పట్టుకోబోగా చీకట్లో పారిపోయాడు. సమీపంలో కానిస్టేబుల్ హనుమేశ్, సూర్యలపై చాకుతో దాడి చేశాడు. దాడికి దిగడంతో విధిలేక ఏసీపీ పరమేశ్వర్ కాల్పులు జరిపాడు. జెట్టి కాలికి కాల్పులు చేయడంతో గాయమై కిందపడిపోయాడు. వెంటనే పోలీసులు ఆ రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని బౌరింగ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే రౌడీ షీటర్ చేతిలో గాయపడిన పోలీసులను కూడా ఆస్పత్రికి తరలించారు. చదవండి: కరోనా ఫండ్‌తో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా చదవండి: మృత్యుఘోష: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా -
గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్: ఇద్దరు నక్సల్ మృతి
చర్ల: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఎటపల్లి తహశీల్ పరిధిలోని జాంబియా గాటా పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌజాగట్టా అటవీ ప్రాంతంలో బుధవారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలి జిల్లా ఎస్పీ అంకిత్ గోయల్ తెలిపారు. మృతులు వినయ్ లాలూ, వినయ్ నరోట్‌గా గుర్తించారు. వీరిపై రూ.4 లక్షల రూపాయలు రివార్డ్ ఉందని ఎస్పీ తెలిపారు. మృతుల నుంచి 4 ఎంఎం ఫిస్టల్, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మావోయిస్టుల వ్యతిరేక నిర్మూలన కార్యక్రమంలో కూంబింగ్ చేస్తున్న సమయంలో పోలీసులను చూసి మావోయిస్టులు కాల్పులు జరిపారని ఎస్పీ అంకిత్ గోయల్ తెలిపారు. వెంటనే పోలీసులు కాల్పులు జరపగా ఇద్దరు మృతి చెందారని చెప్పారు. ఇటీవల పామ్కెగహ పోలీసు శిబిరంపై కాల్పులు జరిపారని, మృతిచెందిన నక్సల్స్‌పై అనేక కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి హెలికాప్టర్లో మృతదేహాలను జిల్లా కేంద్రం గడ్చిరోలికి తరలించారు. కాల్పుల్లో మరణించిన మావోయిస్టులు -
గాలం వేసి కాపుకాచి.. భద్రత దళాలకు భారీదెబ్బ!
హైదరాబాద్: మావోయిస్టులు భద్రతా బలగాలను మరోసారి భారీ దెబ్బకొట్టారు. బలిమెల దాడుల తరహాలో దాదాపు పదమూడేళ్ల తర్వాత భారీ స్థాయిలో ప్రతీకార దాడికి దిగారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ దాడిలో చనిపోయిన జవాన్ల సంఖ్య శనివారం నాడు ఐదుగురుగా ఉండగా.. ఆదివారం 23కు చేరింది. గతంలో 2008లో బలిమెల రిజర్వాయర్‌లో కూంబింగ్ కోసం వెళ్లిన గ్రేహౌండ్స్ పోలీసులను, 2010 వేసవిలో రెండు ఘటనల్లో 100 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని, 2013లో బస్తర్ జిల్లాలో కాంగ్రెస్ నేతలను చంపేసిన మావోయిస్టులు.. ఆ తర్వాత చేసిన అతి పెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. దండ కారణ్యంలో తమకు ఇంకా పట్టు మిగిలే ఉందని చాటేందుకే అధునాతన ఆయుధాలతో అంబుష్ (ఎరవేసి చుట్టుముట్టి దాడి చేయడం) దాడికి పాల్పడ్డారని, అందుకే మృతుల సంఖ్య భారీగా ఉందని ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. కొంతకాలంగా దండకారణ్యంలో జరుగుతున్న పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో.. సీఆర్పీఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులు కలిసి కూంబింగ్ పెంచారు. ఈ క్రమంలోనే పీఎల్జీఏ కమాండర్ హిడ్మా ఉన్నాడంటూ కావాలని ఉప్పందించిన మావోలు.. వారు ముందుగానే సిద్ధంగా ఉన్న ప్రాంతానికి భద్రతా బలగాలు రావడంతో ఒక్కసారిగా చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారు. బీజాపూర్‌లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ ఆఫీసు నుంచి స్వస్థలాలకు మృతదేహాలను తరలిస్తున్న జవాన్లు ఇంతగా ప్రాణనష్టం ఎందుకు? తెర్రం దాడి ఘటనలో పోలీసుల వైపు ఇంత భారీగా ప్రాణనష్టం ఎందుకు జరిగిందన్న దానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు భారీ సంఖ్యలో ఒకేసారి వెళ్లడం, అప్పటికే మావోయిస్టులు ఎత్తుగా ఉన్న గుట్టలపై అప్పటికే పొంచి ఉండటం, ఆకస్మికంగా దాడి చేయడం, అత్యాధునిక ఆయుధాలు వాడటం వంటివి ప్రధాన కారణమని కొందరు పోలీసులు చెప్తున్నారు. ఎత్తులో ఉన్న వారికి ప్రత్యర్థులు అడవిలో చెట్లు, రాళ్ల మధ్య దాక్కున్న సులువుగా గుర్తించే వీలు చిక్కుతుందని.. అందుకే మావోలు నేరుగా పోలీసులను గురిపెట్టి కాల్చారని అంటున్నారు. మావోయిస్టులు ఆధునిక రాకెట్ లాంచర్లు వాడటంతో నేరుగా సిబ్బందిని తాకాయని.. క్షణాల్లో జరిగిన అంబుష్‌లో తప్పించుకునే వీల్లేక ఎక్కువ మంది పోలీసులు బలయ్యారని చెప్తున్నారు. అచ్చంగా 2008లో బలిమెల తరహాలోనే ఎత్తైన ప్రాంతం నుంచి కాల్పులు జరపడంతో మృతుల సంఖ్య పెరిగింది. 2వేల మంది ఒక్కసారిగా వెళ్లడం వైఫల్యమే.. తెర్రం దాడిలో భద్రతా దళాల నిర్లక్ష్యం, రక్షణ చర్యలను విస్మరించడం కూడా అత్యధిక ప్రాణనష్టానికి దారితీశాయని తెలంగాణకు చెందిన పలువురు రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. మార్చి 24న మావోయిస్టు కమాండర్ హిడ్మా ఉన్నాడంటూ మావోయిస్టులే.. చత్తీస్ఘడ్ భద్రతా దళాలకు వ్యూహాత్మకంగా సమాచారమిచ్చి రప్పించారని ఇప్పుడు పోలీసులకు అర్థమైంది. ఆ సమాచారం ఆధారంగానే.. 2వేల మందికిపైగా భద్రతా దళాలతో పదిరోజులుగా అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. సరిగ్గా ఇక్కడే తెలంగాణ పోలీసులకు– చత్తీస్‌గఢ్ పోలీసులకు స్పష్టమైన తేడా కనిపించింది. మామూలుగా ఎవరైనా మావోయిస్టు లీడర్ ఉన్నాడంటూ సమాచారం వస్తే.. తెలంగాణ పోలీసులు ముందుగా కొందరు సభ్యులతో ఓ టీమును పంపుతారు. వారు ఇచ్చిన సమాచారంతో తర్వాతి టీం బయల్దేరుతుంది. ఒకవేళ ముందు వెళ్లిన టీం ఆపదలో చిక్కుకున్నా.. తర్వాతి టీం ఆగమాగంగా వెళ్లదు. ఎందుకంటే మావోయిస్టులు దాడి చేసినప్పుడు కొందరిని చంపకుండా వదిలేయడం, వారిని కాపాడేందుకు వచ్చిన ఇతర దళాలపై దాడి చేయడం వంటి వ్యూహాలు అమలు చేస్తారు. అందుకే తెలంగాణ పోలీసులు అదనపు బలగాల్ని పంపాల్సి వస్తే.. మొదటి దళం వెళ్లిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళతారు. ఘటనాస్థలాన్ని మూడు వైపులా చుట్టుముడతారు. అయితే ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో 2113 మందికిపైగా సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసులు హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో హిడ్మాను వెదుకుతూ వెళ్లారు. తాము ఉచ్చులో పడ్డామన్న సంగతి దాడి మొదలయ్యేంత వరకూ గ్రహించలేకపోయారు. ఇక బుల్లెట్ గాయాల వల్ల తీవ్రంగా రక్తస్రావం కావడం, మండుతున్న ఎండ కారణంగా డీహైడ్రేషన్, వడదెబ్బతో పోలీసుల మరణాలు పెరిగాయని వైద్యులు చెప్పారు. పొగలు చూసి వెళ్లారా? తెర్రం ప్రాంత గుట్టలపై బాగా పట్టున్న మావోలు.. హిడ్మా అక్కడే ఉన్నాడని పోలీసులు నమ్మేలా చేశారు. డ్రోన్లతో వెళ్లిన పోలీసు లకు.. దూరంగా ఎత్తయిన ప్రాంతానికి సమీ పంలో పొగలు కనిపించాయి. హిడ్మా అక్కడే దళం తో ఉన్నాడని, అక్కడ వంటలు చేసుకుంటున్నారని పొరబడి వెళ్లి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చుట్టూ కొండలు, ఒక పక్కన పలుచగా అడవి, కొంత మైదానం లా ఉన్న ప్రాంతానికి భద్రతాదళాలు వచ్చేలా చేయడంలో మావోలు సఫలీకృతమయ్యారు. గతంలో జరిగిన భారీ దాడులు! 2008 జూన్ 29: బలిమెల ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని బలిమెల రిజర్వాయర్‌లో పడవల్లో కూంబింగ్‌కు వెళ్తున్న గ్రేహౌండ్స్ పోలీసులపై.. గుట్టలపై నక్కి ఉన్న మావోయిస్టులు దాడి చేశారు. పడవల్లో ఉన్న 60 మంది పోలీసులు రిజర్వాయర్‌లో దూకి ఒడ్డుకు వచ్చేందుకు యత్నించారు. ఈ క్రమంలో మావోయిస్టులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఊచకోతలో మొత్తం 38 మంది పోలీసులు చనిపోయారు. 2010 ఏప్రిల్ 6: చింతల్నార్ ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా చింతల్నార్ అటవీ ప్రాంతంలో 200 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయాణిస్తోన్న కాన్వాయ్‌పై.. దాదాపు 300 మందికిపైగా మావోయిస్టులు అకస్మాత్తు దాడికి దిగారు. ఆ దాడిలో 75 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే మరణించారు. బాంబులు విసురుతూ, కాల్పులు జరిపిన మావోయిస్టులు.. గాయపడ్డ వారిని కత్తులతో పొడిచారు. ఒక సీఆర్పీఎఫ్ జవాను శరీరంపై 78 కత్తిపోట్లు ఉన్నాయని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఇక సీఆర్పీఎఫ్ జరిపిన ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. 2010 మే 17: బస్సుపై దాడి 75 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపిన నెలన్నర రోజుల్లోనే మావోయిస్టులు.. మరోసారి పాశవిక దాడికి దిగారు. మావోయిస్టులకు చిక్కకూడదన్న ఉద్దేశంతో సీఆర్పీఎఫ్, ఎస్పీవో (స్పెషల్ పోలీస్ ఆఫీసర్)లు బస్సులో సాధారణ ప్రజలతో కలిసి ప్రయాణిస్తుండగా.. మావోయిస్టులు ఆ బస్సును పేల్చివేశారు. బస్సులో ఉన్నవారిలో 44 మంది చనిపోగా.. ఆరుగురే బతికారు. మృతుల్లో 18 మంది ఎస్పీవోలు కాగా, మిగిలినవారిలో సీఆర్పీఎఫ్ జవాన్లు, సాధారణ మహిళలు, చిన్నారులు ఉండటం కలచివేసింది. 2013 మే 25: సుక్మా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో జరిగిన రాజకీయ ర్యాలీలో పాల్గొని తిరిగి వెళ్తున్న కాంగ్రెస్ నేతలపై మావోయిస్టులు దాడికి దిగారు. బస్తర్ జిల్లా దర్బాఘాట్ వద్ద చెట్లు నరికి కాన్వాయ్ ను ఆపారు. మొదట ల్యాండ్ మైన్ పేల్చి, తర్వాత ఆపకుండా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మావోయిస్టులపై పోరుకు గిరిజనులతో ‘సల్వాజుడుం’ అనే ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ, ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ చీఫ్ నందకుమార్ పటేల్, విద్యాచరణ్ శుక్లా, భద్రతా సిబ్బందితో కలిపి మొత్తం 32 మంది చనిపోయారు. -
సుడిగుండంలో ‘మహా’ సర్కారు
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపాన బాంబులతో దొరికిన కారు అనేకానేక మలుపులతో ఉత్కంఠ రేపుతోంది. మొదట్లో ఉగ్రవాదుల పనిగా అందరూ అనుమానించిన ఉదంతం కాస్తా ముంబై పోలీసుల మెడకు చుట్టుకోవటమే వింత అయితే...అది మళ్లీ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వైపు మళ్లి, శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాదీ ప్రభుత్వాన్ని చుట్టుముట్టింది. తాజాగా అది సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కింది. ఈ ఎపిసోడ్లో నగర పోలీస్ కమిషనర్ పదవి కోల్పోయిన పరంవీర్ సింగ్ హోంమంత్రి అనిల్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాయటమేకాక, సుప్రీంకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేశారు. తన బదిలీ చెల్లదని ప్రకటించాలని కూడా కోరారు. పోలీసు వ్యవస్థను అధికారంలో వున్నవారు తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్న ఆరోపణలు చాలా పాతవి. ప్రత్యేకించి ముంబై పోలీసులకు ఆ విషయంలో మొదటినుంచీ అంత మంచి పేరు లేదు. ఒకప్పుడు ఆ మహానగరాన్ని మాఫియా డాన్లు తమ అడ్డాగా మార్చుకుని వ్యాపారులనూ, పారిశ్రామికవేత్తలనూ, సినీ నటుల్ని బెదిరించి డబ్బు దండుకోవటం, యధేచ్ఛగా కిడ్నాప్‌లకు పాల్పడటం, దాడులు చేయటం సాగిస్తున్నప్పుడు ముంబై పోలీసులు వాటిని సరిగా అరికట్టలేకపోయారు. వారిలో కొందరు మాఫియాలతో కుమ్మక్కు కావటమే అందుకు కారణమన్న ఆరోపణలుండేవి. ఆ వంకన బూటకపు ఎన్కౌంటర్లు జోరందుకున్నాయి. అమాయకుల్ని సైతం ఆ ముసుగులో హతమారుస్తున్నారన్న ఆరోపణలొచ్చాయి. 2008 నవంబర్ 26న ముంబైపై ఉగ్రవాదులు చేసిన దాడి, అంతక్రితం జరిగిన బాంబు పేలుళ్లు ముంబై పోలీసుల పనితీరును ప్రశ్నార్థకం చేశాయి. ఉగ్రవాదులు విరుచుకుపడినప్పుడు ప్రాణాలు కోల్పోయిన 173మందిలో పోలీసు ఉన్నతాధికారులు హేమంత్ కర్కరే, అశోక్ కామ్టే, ఇతర సిబ్బంది కూడా వున్నారు. కానీ పటిష్టమైన ముందస్తు నిఘా వుంచటంలో ముంబై పోలీసుల వైఫల్యం క్షమార్హం కాదు. ఇదంతా తెలిసి కూడా పోలీసు వ్యవస్థను సమర్థవంతంగా, వివాదరహితంగా తీర్చిదిద్దటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా వున్న అధికారి సచిన్ వాజేను హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సర్వీసులోకి తీసుకోవటమేకాక, ఆయనకు కీలకమైన కేసుల దర్యాప్తు బాధ్యతను అప్పగించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా అపకీర్తి గడించిన వాజే, ఒక హత్య కేసులో జైలుకెళ్లి వచ్చాడు. మధ్యలో శివసేనలో చేరాడు. అలాంటి వ్యక్తికి హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా పదవి కట్టబెట్టటంలోని ఔచిత్యమేమిటి? ఇందుకు కారణం పరంవీర్ సింగేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అంటున్నారు. మరి రాజకీయ నాయకత్వం వుండి ఏం చేసినట్టు? అనిల్ దేశ్‌ముఖ్‌ఎందుకు అభ్యంతరం చెప్పలేకపోయారు? తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కేంద్రం ఈ తతంగాన్నంతా నడిపిస్తోందంటున్న పవార్ దీనికేం చెబుతారు? ప్రభుత్వాలు నిర్వర్తించే కర్తవ్యాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కీలకమైనది. సురక్షితంగా, భద్రంగా వున్నామన్న భావన పౌరులకు కలగాలంటే పటిష్టమైన, చురుకైన పోలీసు వ్యవస్థ వుండాలి. అదే సమయంలో అది కర్తవ్య నిష్టతో పనిచేసేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుంటుంది. కానీ మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ప్రభుత్వానికి దానిపై అదుపాజ్ఞలు వున్న దాఖలా కనబడదు. పోలీస్ కమిషనర్ పదవినుంచి తనను తప్పించగానే పరంవీర్ సింగ్ తీవ్రమైన ఆరోపణలే చేశారు. నెలకు వంద కోట్లు వసూలు చేసి ఇవ్వాలని వాజేకు అనిల్ దేశ్‌ముఖ్ నిర్దేశించారని ఆయనంటున్నారు. మరి అలాంటి వ్యక్తికి కీలక కేసుల దర్యాప్తు బాధ్యతను పరంవీర్ ఎలా అప్పగించారు? కనీసం తన బదిలీకి ముందు ఈ ఆరోపణ చేసివుంటే ఆయన నిజాయితీ వెల్లడయ్యేది. పదవినుంచి తప్పించారన్న అక్కసుతోనే ఇలా అంటున్నారన్న అభిప్రాయం అందరిలో ఏర్పడే పరిస్థితి వుండేది కాదు. తాను చాన్నాళ్లక్రితమే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే దృష్టికి ఈ సంగతి తీసుకొచ్చానని పరంవీర్ అంటున్నారు. అదే జరిగుంటే పరంవీర్‌ను ఇన్నాళ్లు పదవిలో కొనసాగించేవారా అన్న సంశయం కలుగుతుంది. వాజే వ్యవహారంలో తన ప్రమేయాన్ని తుడిచేసుకోవటానికే పరంవీర్ ఇలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. హోంమంత్రి, పోలీసు విభాగం ఇలా ఆరోపణల్లో చిక్కుకోవటం మహారాష్ట్రలో ఇది మొదటిసారేమీ కాదు. 2003లో అప్పటి హోంమంత్రి ఛగన్ భుజ్‌బల్‌పై అవినీతి ఆరోపణలు రావటంతో తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన అబ్దుల్ కరీం తెల్గీ స్టాంపు పేపర్ల కుంభకోణంలో కూడా ఇరుక్కున్నారు. ఎన్కౌంటర్ స్పెషలిస్టులుగా పేరుమోసి, అమాయకుల్ని హతమార్చారన్న ఆరోపణలున్నవారిని నెత్తినపెట్టుకోవటం వాజేతోనే మొదలుకాలేదు. నకిలీ ఎన్కౌంటర్ల కేసులో శిక్షపడిన 11మంది పోలీసులను 2015లో విడుదల చేసిన ఘనత అప్పటి బీజేపీ–శివసేన సర్కారుది. దీన్ని బొంబాయి హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టి అడ్డుకుంది. తాజా వ్యవహారంలో సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్న సంగతలా వుంచితే ఆరోపణలొచ్చిన విలాస్ దేశ్ముఖ్తో రాజీనామా చేయించటం, వాజే పునరాగమనంలో నిజంగా పరంవీర్ పాత్ర వుంటే నిగ్గు తేల్చి, తగిన చర్యలు తీసుకోవటం రాజకీయంగా మహారాష్ట్ర ప్రభుత్వానికే మంచిది. -
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నదీమ్ అరెస్ట్
ఢిల్లీ: ఘాజిపూర్ ఎన్కౌంటర్ అనంతరం మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ నదీమ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటి కమిషనర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం గాజిపూర్ ముర్గా సమీపంలో నదీమ్‌ను అదుపులోకి తీసుకుంది. అయితే పోలీసులను చూసి నదీమ్ కాల్పులకు తెగబడటంతో ఇరువర్గాల మధ్య కాల్పుల కలకలం రేగింది. ఈ ఏడాది జులైలో సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) పై కూడా ఆయన కాల్పులు జరిపి నదీమ్ పరారైనట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు కూడా హత్యాయత్నం సహా పలు క్రిమినల్ కేసుల్లో నదీమ్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు. -
వీరుడొకడు అమరుడయ్యాడు
‘అమరుడు’ అనిపించుకునే అదృష్టం అందరి నుదుటునా రాసి ఉండదు. కోట్ల జనులు శాల్యూట్ చేసే ఘనత అందరికీ దొరకదు. చరిత్ర పుటల్లో సగర్వంగా తలుచుకునే పేరుగా నిలవడం అందరి వశం కాదు. ప్రవీణ్ కుమార్ వంటి సైనికుడికే ఆ గౌరవం సాధ్యం. దేశ సరిహద్దులో ఉగ్రవాదుల పోరులో చిత్తూరు జిల్లా పరాక్రమవంతుడు ప్రవీణ్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. వారితో సీమ పులిలా పోరాడి ప్రాణాలర్పించాడు. తెలుగుజాతితో పాటు దేశ ప్రజలూ అతణ్ణి గుర్తు పెట్టుకుంటారు. ప్రవీణ్ కుటుంబ నేపథ్యం.... చిత్తూరు జిల్లా ఐరాలమండలంలోని రెడ్డివారిపల్లెకు చెందిన చీకల ప్రతాప్‌రెడ్డి, సుగుణమ్మ దంపతుల ఏకైక కుమారుడు చీకల ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (37). మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రవీణ్ 2009లో అదే మండలంలోని ఐలవారిపల్లి గ్రామానికి చెందిన దగ్గరి బంధువు రామచంద్రారెడ్డి (రిటైర్ట్ఆర్మీ) కుమార్తె రజితతో పెళ్లి జరిగింది. వీరికి రోహిత, లీలేష్లు కుమార్తె కుమారుడు. కుమార్తె రోహిత రెండవ తరగతి. దేశ సేవచేస్తానని పట్టుబట్టి పద్దెనిమిదవ ఏటే మిలటరీలో చేరాడు. దేశం కోసం ప్రాణాలు విడిచి పెట్టడానికి కూడా వెనకాడేదిలేదని చెప్పేవాడు. చివరికి మాట నిలబెట్టుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు. ప్రాణాలు కోల్పోయాడని బాధగా ఉన్నా దేశం కోసం అశువులు బాసినందుకు గర్వంగా ఉంది. నాలుగు రోజుల క్రితమే ఫోన్ చేశాడు. ‘నాన్నా.. అమ్మ జాగ్రత్త. కరోనా వ్యాప్తి చెందుతోంది. ఇంట్లో ఎవరూ బయటకు వెళ్లొద్దు. సంక్రాంతికి వస్తున్నా. అందరం కలుద్దాం’ అని చెప్పాడు. తను చెప్పినట్టే సంక్రాంతికి వస్తున్నాడు కదా అని సంబరపడ్డాను. దేశంలో ఎక్కడ ఉన్నా సంక్రాంతికి మాత్రం గుమ్మం ముందు ఉండేవాడు...’’ దుఃఖంతో పూడుకుపోయింది ఆ తండ్రి గొంతు. జమ్ము కాశ్మీర్‌లోని కుష్వారా సెక్టార్‌లోని మాచెల్ నాలా పోస్టు వద్ద ఆదివారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి తండ్రి సాక్షికి చెప్పిన మాటలివి. తన కుమారుడి గురించి ఆయన మాటల్లో... ‘నా కొడుకు ప్రవీణ్‌కుమార్ రెడ్డికి చిన్నతనం నుంచి పట్టుదల ఎక్కువ. రెడ్డివారిపల్లెలో బడికి పోయేటప్పుడు ఎవ్వరినీ ఏమీ అనేవాడు కాడు. ఐరాలలో ఇంటర్ వరకు చదివాడు. ఆ తరువాత నాకు చేదోడు వాదోడుగా సేద్యం పనులు చేసేవాడు. మిలటరీలో పనిచేస్తున్న బంధువులను చూసి దేశానికి సేవచేయాలని పట్టుబట్టాడు. ఆర్మీలో చేరేందుకు కబురొచ్చింది. 2002 ఊటీలో జరిగిన ఆర్మీ సెలక్షన్స్‌లో పాల్గొన్నాడు. ఊటీలోనే సంవత్సరం పాటు శిక్షణ పూర్తి చేసుకున్నాడు. డిగ్రీ కూడా పూర్తి చేశాడు. ఆ తరువాత జమ్మూ కాశ్మీర్‌లోని కప్పూర్తలాలో విధుల్లో చేరాడు. రెండేళ్లు పని చేశాక అస్సాంకు వెళ్లాడు. ఆ సమయంలో కర్ణాటకలోని బెల్గామ్‌లో ఆరు నెలలపాటు కమాండెంట్‌గా శిక్షణ పొందాడు. 2012–2016 వరకు ఢిల్లీలోని నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్(ఎన్ఎస్ఎఫ్)లో విధులు నిర్వహించాడు. అక్కడినుంచి మళ్లీ 2017–18వరకు జమ్మూలోని మీరాన్ సాహెబ్ ప్రదేశంలో పనిచేశాడు. 2019 సంవత్సరంలో పాకిస్థాన్ సరిహద్దులో అడుగుపెట్టి ఒక సైనికుడు చేరవలసిన అసలైన చోటుకు చేరానని గర్వపడ్డాడు. దేశ సరిహద్దు ఎప్పుడూ మంచు దుప్పటితో కప్పబడి ఉండటంతో శత్రువుకు అవకాశం ఇవ్వకూడదని కేవలం నాలుగు గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకునేవారట. కంటిపై రెప్ప వాలనివ్వకుండా దేశరక్షణకు కాపలా కాశానని చెప్పేవాడు. చివరకు జమ్మూకాశ్మీర్‌లోని కుష్వారా సెక్టార్‌లోని మాచెల్ నాలా పోస్టు వద్ద ఆదివారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడని సమాచారం అందటంతో ముందు మాకు నోటమాట రాలేదు. ఎంత దిగమింగుదామనుకున్నా కన్నీళ్లు ఆగడం లేదు. అమర సైనికుడికి కడసారి వీడ్కోలు పలకటం కోసం కుటుంబ సభ్యులమైన మేము, గ్రామస్తులు, అతడి స్నేహితులు కన్నీటితో ఎదురు చూస్తున్నాం’ అన్నాడాయన. – బాలసుందరం, సాక్షి చిత్తూరు రూరల్ -
'చర్ల ఎన్కౌంటర్..రీ పోస్టుమార్టం జరిపించండి'
సాక్షి, హైదరాబాద్ : చర్ల ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు మృతదేహాలను ఫ్రీజ్ చేయాలని పిటీషనర్ తరపు న్యాయవాది రగునాథ్ హైకోర్టును కోరారు. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని తెలిపారు. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం, ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలన్నారు. అదే విధంగా మృత దేహాలకు ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టు మార్టం చేపించాలని హైకోర్టును కోరారు. (ముగ్గురు మావోల ఎన్కౌంటర్ ) అయితే ఇప్పటికే మూడు మృతదేహాలను పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించామని ప్రభుత్వం బదులిచ్చింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం కుటుంబ సభ్యుల నుండి మృతదేహాలను తీసుకుని భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్రీజ్ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అంతేకాకుండా ఎంజీఎం ఫోరెన్సిక్ నిపుణులతో రీ పోస్టుమార్టం చేపించాలని ఆదేశించింది. పోస్టుమార్టం మొత్తం వీడియో గ్రఫీ చేపించి రీపోర్ట్ షీల్డ్ కవర్లో సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 5 కు వాయిదావేసింది. (చర్ల ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి) -
ముగ్గురు మావోల ఎన్కౌంటర్
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ మేరకు ఎస్పీ సునీల్‌దత్ బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. చెన్నాపురం అటవీ ప్రాంతంలో గల గుట్టల వద్ద రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మావోయిస్టులు.. పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా.. సంఘటనా ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు, మిలీషియన్ కమాండర్ సోడి జోగయ్య మృతదేహం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాల వద్ద ఒక 8 ఎంఎం రైఫిల్, పేలుడుకు ఉపయోగించే సామగ్రి, ఒక కిట్ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు తప్పించుకోగా.. వారి కోసం కూంబింగ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఇరవై రోజుల వ్యవధిలో జరిగిన మూడు ఎన్కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడంతో రాష్ట్రంలో ఇటీవల జరిగిన వరుస ఎన్కౌంటర్లలో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 8కి చేరింది. కిన్నెరసాని అడవుల్లో ఎదురుకాల్పులు పాల్వంచ రూరల్: పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అయితే.. మావోయిస్టులు త్రుటిలో తప్పించుకున్నారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని అభయారణ్యం పరిధిలోని ఉల్వనూరు శివారు పాములదున్న గుట్ట అటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుపడిన పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరుపుతూ రెండు వర్గాలుగా విడిపోయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే పోలీసులకు తారసపడింది ఏ దళానికి చెందిన సభ్యులు అనేది తెలియరాలేదు. సంఘటనా స్థలంలో ఒక తుపాకీ, కిట్ బ్యాగులు, సోలార్ ప్లేట్, వంట సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కేఆర్కే ప్రసాదరావు తెలిపారు. ఎస్పీ సునీల్‌దత్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. డ్రోన్ ద్వారా మావోల కదలికలపై నిఘా మహాముత్తారం: మావోయిస్టుల కదలికలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారు. డ్రోన్ కెమెరాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు గ్రామాలు, అడవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టిన కోటగా ఈ ప్రాంతం ఉండేది. తర్వాత కాలంలో పోలీసులు నియంత్రించినా, ఇటీవల సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ ప్రాంతంలోకి మావోలు వచ్చారని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇటీవల ఓ ప్రభుత్వ ఉద్యోగిని కాల్చి చంపిన నేపథ్యంలో.. మావోల కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మహాముత్తారం మండలంలోని సరిహద్దు ప్రాంతాలైన కనుకునూర్, రెడ్డిపల్లి, సింగంపల్లి, సింగారంతోపాటు పలిమెల మండలం ముకునూర్, నీలంపల్లి, ఇచ్చంపల్లి అటవీ ప్రాంతాల్లోని నీటి స్థ్ధావరాలను కనుగొనేందుకు డ్రోన్ కెమెరాతో పర్యవేక్షిస్తున్నారు. -
కొనసాగుతున్న కూంబింగ్
సాక్షి, మంచిర్యాల: ఆసిఫాబాద్‌లోని కదంబా అడవుల్లో శనివారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన ఇద్దరిని పోలీసులు గుర్తించారు. ఇందులో ఒకరు ఛత్తీస్‌గఢ్‌లోని పామి డి ప్రాంతానికి చెందిన చుక్కాలు, మరొకరు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం అద్దాలతిమ్మాపూర్‌కు చెందిన జుగ్నాక బాది రావుగా గుర్తించారు. చుక్కాలు యాక్షన్ టీం సభ్యుడిగా ఉండగా, బాదిరావు 3 నెలల క్రితమే కేబీఎం (కుమురంభీం–మంచిర్యాల) దళంలో చేరాడు. మృతదేహాల వద్ద 9ఎంఎం కార్బన్ ఆటోమేటిక్, 12 బోర్ ఆయుధాలు, రెండు కిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యం, కేం ద్ర కమిటీ లేఖలు, రామజన్మభూమి ప్రతు లు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలకు ఆ దివారం సిర్పూర్(టి) ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బాదిరావు కు టుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. ఘ టన స్థలానికి జిల్లా ఇన్చార్జి ఎస్పీ, రామగుం డం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, ఓ ఎస్డీ, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కు మార్రెడ్డి, ఏఎస్పీ సుధీంద్ర, డీఎస్పీ అచ్చేశ్వర్రావు, కాగజ్‌నగర్ రూరల్ సీఐ సురేందర్ చేరుకున్నారు. అడెళ్లు కోసం గాలింపు ఎన్కౌంటర్ మృతుల్లో మైలవరపు అడెళ్లుకు ప్రధాన అనుచరుడిగా ఉన్న వర్గీస్‌తో పాటు మరో మహిళ ఉన్నట్లు తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే వారిద్దరు కాదని ఐడీ కార్డుల ద్వారా తేల్చారు. కదంబా అటవీ ప్రాంతంలోనే మరికొందరు దళ సభ్యులు ఉ న్నారనే సమాచారంతో 14 గ్రేహౌండ్స్ బృం దాలు, ఉమ్మడి జిల్లాకు చెందిన 6 స్పెషల్ పా ర్టీ బలగాలతో ప్రాణహిత తీరం నుంచి కౌటా ల, బెజ్జూరు, దహెగాం, నీల్వాయి, చెన్నూరు గోదావరి తీరం వరకు కూంబింగ్ ముమ్మరం గా సాగుతోంది. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు, కేఎంబీ దళ నేత అయిన అడెళ్లు అలియాస్ భాస్కర్ కోసం గాలింపు విస్తృతం చేశారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగా 15 మంది దళంలో చేరినట్లు సమాచారం రావడంతో వారి కోసం గాలిస్తున్నారు. అనుమానితుల ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 2 గంటల పాటు కాల్పులు: ఇన్చార్జి ఎస్పీ కదంబా అడవుల్లో పోలీసులకు, దళ సభ్యులకు మధ్య 2 గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయని జిల్లా ఇన్చార్జి ఎస్పీ వి.సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఘటన స్థలంలో ఆయన విలేకరులతో మా ట్లాడారు. ‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భాస్కర్ దళం సంచరిస్తుందనే సమాచారంతో కూంబింగ్ విస్తృతం చేశాం. 5 రోజుల్లో సిర్పూర్(యూ) మండలం కాకరబుద్ది, తిర్యాణి, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో మూడు సార్లు తప్పించుకున్నారు. దీంతో వారి కదలికలను గుర్తించి ముమ్మరంగా కూంబింగ్ చేయగా కాగజ్‌నగర్ మండలం కదంబా అడవుల్లో దళ సభ్యులు తారసపడ్డారు. ఆయుధాలతో ఉన్న వారిని చూసి లొంగిపోవాలని పోలీసులు అంటుండగానే దళ సభ్యులు విచè క్షణారహితంగా కాల్పులు జరిపారు. పోలీసు లు వెంటనే పొజిషన్ తీసుకుని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పోలీసులకు ఎవరికీ గాయాలు కాలేదు. తప్పించుకున్న కీలక సభ్యులు ఇక్కడే కిలోమీటరున్నర పరిధిలోనే ఉన్నారు. వారి కోసం బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి’అని తెలిపారు. పట్టుకుని కాల్చి చంపారు: మావోలు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వచ్చి న కామ్రేడ్లను పోలీసులు నిర్దాక్షిణ్యంగా పట్టుకుని కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఆదివారం సాయంత్రం కేబీఎం కమిటీ కార్యదర్శి భాస్కర్ పేరుతో ఓ లేఖ విడుదలైంది. ‘ఈ ఎన్కౌంటర్ బూటకం. కామ్రేడ్లు చుక్కాలు, బాదిరావులు తమ ప్రాణ త్యాగంతో మరోసారి ఉమ్మడి జిల్లాలో విప్లవ కేతనం ఎగరేశారు. భారత దోపిడీ పాలకులు 2022 నాటికి విప్లవోద్యమాన్ని నిర్మూలించేందుకు ఆపరేషన్ సమాధాన్‌తో తెలంగాణలోనూ అణచివేత తీవ్రతరం చేశారు. కార్డన్ సెర్చ్ పేరుతో గ్రామాల్లో సోదాలు, అక్రమ అరెస్టులు చేసి కోర్టులో ప్రవేశపెట్టకుండా చిత్రహింసలు చేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలకు శిక్షలు తప్పవు’ అని లేఖలో హెచ్చరించారు. -
ఆసిఫాబాద్‌లో ఎన్కౌంటర్
సాక్షి, మంచిర్యాల : పచ్చటి అడవి కాల్పులతో దద్ద రిల్లింది. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కుమురంభీం– ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కదంబా అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయి స్టులకు మధ్య ఎదురు కాల్పులు జరి గాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయి నట్లు తెలుస్తోంది. దట్టమైన అడవిలో, పులులకు ఆవాసంగా ఉన్న ఈ ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకోవడం గమనార్హం. రాత్రివేళ కావడం, భారీ వర్షం కురుస్తుం డటంతో మృతదేహాల గుర్తింపు ఆలస్యమవు తోంది. మృతుల్లో వర్గీస్ ఉన్నట్లు ప్రాథమి కంగా నిర్ధారణ అవుతోంది. చనిపోయిన మరొ కరు మహిళా మావోయిస్టు అని సమా చారం. మరో ఇద్దరు కూడా మరణించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటన స్థలంలో ఏకే 47 స్వాధీన పర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో మావో యిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలరపు అడెల్లు అలియాస్ భాస్కర్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా గాలింపు చర్యలు కొనసాగు తున్నాయి. 25 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న భాస్కర్ తలపై రూ. 20 లక్షల రివార్డు ఉంది. కుమురం భీం జిల్లా ఇన్చార్జి ఎస్పీ, రామగుండం పోలీసు కమిషనర్ వి.సత్యనారా యణ, ఏఎస్పీ సుధీంద్ర సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మొత్తం ఎనిమిది గ్రేహౌండ్స్ బృందాలు, ఆరు స్పెషల్ పార్టీలు పాల్గొన్నాయి. ఇంకా కుంబింగ్ కొనసాగుతుండంతో మరో ఇద్దరు మావోయిస్టులు పోలీసుల దగ్గరగా వెళ్లినట్లు తెలుస్తోంది. ఐదుగురు దళ సభ్యులను చట్టుముట్టి మూడు అంచెల్లో దిగ్బంధం చేసినట్లు సమాచారం. మృతి చెందిన వర్గీస్ ఇటీవలి నియామకాల్లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ఏరియా కమిటీ సారథిగా నియమితులయ్యారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఈయనపై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉంది. పక్కా సమాచారంతో దాడి మావోల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పక్క సమాచారంతో దాడి చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ సమీప అటవీ ప్రాంతాల్లో బలగాలు కూంబింగ్‌ను విస్తృతం చేశాయి. శుక్రవారం ఆసిఫాబాద్ మండలం చిలాటిగూడలో సంచరించినట్లు సమాచారం రావడంతో గాలింపు మరింత ముమ్మరం చేశారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, కేబీఎం (కుమురం భీం మంచిర్యాల) డివిజన్ కార్యదర్శి మైలరపు అడెల్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలోని ఐదుగురు దళ సభ్యులు ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం నుంచి మహారాష్ట్ర నుంచి ప్రాణహిత మీదుగా కొన్నాళ్ల కిందట ఆసిఫాబాద్‌లో ప్రవేశించారు. వారి కదలికలు గుర్తించిన పోలీసులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. గత నెలలో తిర్యాణి మండలం టొక్కిగూడ అడవుల్లో కాల్పులు జరగగా మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నారు. అప్పటి నుంచి మరింత ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ నెల 2న ఆసిఫాబాద్ చేరుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి ఐదురోజుల పాటు ఇక్కడే మకాం వేశారు. మావోయిస్టుల ఆపరేషన్‌పై స్థానిక పోలీసులకు పలు సూచనలు చేశారు. తిరిగివెళ్లిపోతున్నారా? మావోయిస్టుల ఉనికిని ఎప్పటికప్పుడు పోలీసులు పసిగడుతుండటంతో తిరిగి దండకారణ్యంలోకి వెళ్లే క్రమంలోనే ఈ ఎన్కౌంటర్ జరిగిందా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం మహారాష్ట్రకు వెళ్లే దారిలో ఉండటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఇన్నాళ్లు కొమురంభీం, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలైన తిర్యాణి, జన్నారం, ఊట్నూరు, నేరడిగొండ ప్రాంతాల్లో పలుమార్లు దళ సభ్యుల కదలికలను పోలీసులు గుర్తించారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ అటవీ ప్రాంతంలో దళ సభ్యులు సంచరిస్తున్నట్లు గుర్తించగా... తాజాగా ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయే క్రమంలోనే ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. -
జమ్మూలో ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూ శివార్లలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగిన ఎదురుకాల్పుల్లో కశ్మీర్ పోలీస్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(ఏఎస్సై) ఒకరు నేలకొరిగారు. కశ్మీపోర్‌లీసులు, సీఆర్పీఎఫ్ కలిసి జమ్మూ శివార్లలోని పంథాచౌక్ ప్రాంతంలో శనివారం రాత్రి నాకా బందీ చేపట్టాయి. అర్ధరాత్రి సమయంలో ముగ్గురు ఆగంతకులు బైక్‌పై వచ్చి, బలగాలపైకి కాల్పులు జరిపారు. వారి వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరుపుతూ వారి ప్రయత్నాలను తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా ఎదురు కాల్పుల్లో ఏఎస్సై బాబూరామ్ నేలకొరగ్గా, ఒక దుండగుడు హతమయ్యాడు. మిగతా వారు కాల్పులు జరుపుతూ బైక్ వదిలి పరారయ్యారు. వెంబడించిన బలగాలు..దుండగులు దాగున్న ధోబీ మొహల్లా ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. లొంగిపోవాలని పదేపదే హెచ్చరికలు చేశాయి. పాంపోర్ ప్రాంతానికి వారి సంబంధీకులను అక్కడికి తీసుకువచ్చి, వారి ద్వారా లొంగిపోవాలని కోరినా వినలేదు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తెల్లవారే దాకా కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో మిగతా ఇద్దరు దుండగులు చనిపోయారు. మృతులను లష్కరే తోయిబాకు చెందిన సకీబ్ బషీర్ ఖాన్‌దే, ఉమర్ తారిఖ్ భట్, జుబైర్ అహ్మద్ షేక్‌గా గుర్తించారు. ముగ్గురిదీ పాంపోర్ జిల్లా ద్రంగ్‌బల్ ప్రాంతమే. వీరిలో ఖాన్‌దే ఏడాదిన్నర నుంచి కమాండర్‌గా ఉంటూ అనేక నేరాలకు పాల్పడినట్లు డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. ఎల్వోసీ వెంట పాక్ కాల్పులు అసువులు బాసిన జేసీవో జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి అమరుడయ్యారు. ఎలాంటి కవ్వింపులేకుండా జరిపిన ఈ కాల్పులకు భారత్ బలగాలు దీటుగా స్పందించాయి. పాక్ వైపు భారీగా నష్టం వాటిల్లిందని సైన్యం తెలిపింది. పాక్ కాల్పుల్లో నాయిబ్ సుబేదార్ రజ్వీందర్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆయన ఆస్పత్రిలో కన్నుమూశారని సైనిక వర్గాలు తెలిపాయి. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన రజ్వీందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రజ్వీందర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారంతోపాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. -
కుల్గాంలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
కశ్మీర్: కుల్గాంలోని నాగ్నధ్-చిమ్మర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం కాగా, ఇద్దరు జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్ పోలీసులతో పాటు, 9 మంది పీఆర్, సీఆర్పీఎఫ్ జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నాగ్నద్-చిమ్మర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు ఆయన వెల్లడించారు. భద్రతా బలగాలు అక్కడకు చేరుకోగానే నక్కి ఉన్న ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. దీంతో పోలీసులు, జవాన్లు ఎదురు కాల్పులకు దిగడంతో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. చదవండి: కశ్మీర్లో కలకలం.. బీజేపీ కార్యకర్త కిడ్నాప్ #KulgamEncounterUpdate: Another #unidentified #terrorist killed (total 03). #Incriminating materials including #arms & #ammunition recovered. Search going on. Further details shall follow. @JmuKmrPolice https://t.co/L74a825FBw — Kashmir Zone Police (@KashmirPolice) July 17, 2020 -
పుల్వామాలో ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామాలోని గుసూ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో పోలీసు, ఓ ఆర్మీ సైనికుడు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, ఆర్మీ సంయుక్త బృందంతో గుస్సా ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. అయితే అప్పటికే అక్కడ మాటువేసిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. ఇరు పక్షాలకు జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఓ పోలీసు, ఆర్మీ సైనికుడు గాయపడినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి ధ్రువీకరించారు. ఈ ఘటనలో ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. (తెలంగాణ సైనికుడి వీరమరణం ) -
పుల్వామాలో ఎన్కౌంటర్; ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మరోసారి ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్‌లోని చేవా ఉల్లార్ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం ప్రారంభమైన ఈ కాల్పులు శుక్రవారం ఉదయం వరకు కొనసాగాయి. త్రాల్ సెక్టార్లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు నిఘా వర్గాల నుంచి పోలీసులకు, సీఆర్పీఎఫ్ బృందాలకు సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సైనిక దళాల కదలికలలను గుర్తించిన ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు.దీంతో ఉగ్రవాదులపై బలగాల ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గరు ఉగ్రవాదులు మరణించారు. (కశ్మీర్లో ఎన్కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు మృతి) ఈ కాల్పులపై పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఎన్కౌంటర్లో భారత సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టు బెట్టినట్లు తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు సాయుధ దళాల సిబ్బందికి కూడా గాయాలయ్యాని వెల్లడించారు. కాగా కాల్పుల్లో మరణించిన ముగ్గురు ఉగ్రవారులు స్థానికి ట్రాల్ ప్రాంతానికి చెందిన వారని, ఆయుధాలతో ఉగ్రవాదంలో చేరినట్లు స్పష్టం చేశారు. ఇక ఈ నెలలో ఇది దక్షిణ కశ్మీర్లో జరిగిన 12వ ఎన్కౌంటర్. ఇప్పటి వరకు 33 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. (భారత్‌లో ఒక్క రోజే 17,296 కరోనా కేసులు) -
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు
చర్ల: తెలంగాణ సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఎస్సై నేలకొరగగా నలుగురు కీలక మావోయిస్టులు మృతి చెందారు. మన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్దోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మాటు వేసి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్సై శ్యాంకిశోర్ శర్మను ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయారు. మృతి చెందిన మావోయిస్టులను కాంకేర్ డివిజినల్ కమిటీ సభ్యుడు అశోక్ రైను, ఏరియా కమిటీ సభ్యుడు కృష్ణ నరేటి, ఎల్ఓఎస్ సభ్యులు సవితా సలామే, పర్మిలలుగా గుర్తించారు. వీరిలో అశోక్‌పై రూ.8 లక్షల రివార్డు, కృష్ణపై రూ.5 లక్షలు, మిగతా ఇద్దరిపై రూ. లక్ష చొప్పన రివార్డు ఉన్నట్లు రాజ్‌నంద్‌గావ్ ఏఎస్పీ తెలిపారు. వీరికి మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన పలు ఘటనలతో సంబంధముందన్నారు. ఏకే–47 రైఫిల్, ఒక ఎస్ఎల్ఆర్, రెండు 12–బోర్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. -
‘రియాజ్..ఇక నరకంలో హాయిగా నిద్రపో’
న్యూఢిల్లీ : ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజహిదీన్ చీఫ్ రియాజ్ నైకూను మట్టుబెట్టిన భారత సైన్యంపై మాజీ క్రికెటర్, బీజేపీ నేత గౌతం గంభీర్ ప్రశంసలు గుప్పించారు. ‘రియాజ్ ఇక నరకంలో హాయిగా నిద్రపో..భారత సైన్యాన్ని ఎప్పుడూ రెచ్చగొట్టవద్ద’ని గంభీర్ ట్వీట్ చేశారు. కాగా జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా బేగ్‌పురా గ్రామంలో కరుడుగట్టిన ఉగ్రవాది, హిజ్బుల్ ముజహిదీన్ చీఫ్ రియాజ్ నైకూను భారీ ఆపరేషన్‌లో భద్రతా దళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. రంజాన్ సందర్భంగా తల్లితండ్రులను చూసేందుకు రియాజ్ గ్రామానికి వచ్చాడనే సమాచారంతో అతడి ఇంటిని చుట్టుముట్టిన భద్రతా దళాలు సుదీర్ఘంగా సాగిన ఎన్కౌంటర్లో రియాజ్‌ను హతమార్చాయి.భారత సైన్యం సేవలను నిరంతరం కొనియాడే గౌతం గంభీర్ ఈ ఘటనను సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ఉగ్రవాదులకు గట్టి సందేశం పంపారు. భారత సైన్యంతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. చదవండి : ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యత: గంభీర్ Sleep well in hell #RiyazNaikoo! Never provoke #IndianArmy! — Gautam Gambhir (@GautamGambhir) May 6, 2020 -
హిజ్బుల్ చీఫ్ రియాజ్ నైకూ హతం
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో బుధవారం సుదీర్ఘంగా సాగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజహిదీన్ ఆపరేషనల్ కమాండర్ రియాజ్ నైకూ మరణించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ చీఫ్ రియాజ్ నైకూ ఎనిమిదేళ్లుగా భద్రతా దళాల కన్నుగప్పి తిరుగుతున్నాడు. రంజాన్ సందర్భంగా తల్లితండ్రులను పరామర్శించేందుకు గ్రామానికి వచ్చాడన్న సమాచారం అందుకున్నభద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి రియాజ్‌ను మట్టుబెట్టాయి. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా మంగళవారం రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టి బీగ్‌బోరా గ్రామాన్ని జల్లెడపడుతుండగా ఎన్కౌంటర్ జరిగిందని ఇది బుధవారం మధ్యాహ్నం వరకూ కొనసాగిందని భద్రతా దళాలు పేర్కొన్నాయి. బేగ్‌పురాలోని తన ఇంటిలో రియాజ్ నైకూ ఉన్నాడనే సమాచారంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు 40 కిలోల ఐఈడీతో ఇంటిని పేల్చివేశాయి. కశ్మీర్లో మిలిటెన్సీ పోస్టర్ బాయ్‌గా పేరొందని బుర్హాన్ వనీ మరణానంతరం హిజ్బుల్ పగ్గాలను రియాజ్ నైకూ చేపట్టారు. కాగా, పుల్వామాలో నైకూను మట్టుబెట్టిన అనంతరం జిల్లాలోని మరో గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు. ఇక హంద్వారాలో కొద్దిరోజుల కిందట ఉగ్రమూకల దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. చదవండి : భీకర పోరు : ఐదుగురు జవాన్ల మరణం -
తుది వీడ్కోలు: తండోప తండాలుగా జనం
లక్నో: అమరవీరుడికి తుది వీడ్కోలు పలికేందుకు లాక్‌డౌన్‌ను సైత్యం లెక్కచేయకుండా జనం తండోప తండాలు తరలివచ్చారు. దేశం రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుడిని కడసారి చూసేందుకు ప్రజలు వెల్లువలా వచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని సీఆర్పీఎఫ్ కార్యాలయానికి బుధవారం భారీ సంఖ్యలో జనం పోటెత్తారు. ఉగ్రవాదుల దాడిలో అమరుడైన సీఆర్పీఎఫ్ జవాను అశ్వినికుమార్ యాదవ్‌కు అంతిమ వీడ్కోలు పలికేందుకు ప్రజలంతా సీఆర్పీఎఫ్ కార్యాలయం ముందు గుమిగూడారు. పెద్ద చప్పట్లు చరుస్తూ, నినాదాలు చేస్తూ అతడిని అంజలి ఘటించారు. అశ్వినికుమార్ అంత్యక్రియలు అతడి సొంతూరైన ఘాజిపూర్లో ఈరోజు నిర్వహించనున్నారు. (కరోనా: అతడిని ప్రశ్నించిన పోలీసులు) జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో సోమవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సైనికులు అమరులయ్యారు. అశ్వినికుమార్‌తో పాటు సంతోష్‌కుమార్ మిశ్రా, చంద్రశేఖర్ అనే సైనికులు మరణించారు. ఈ ముగ్గురికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్విటర్ ద్వారా నివాళులు అర్పించారు. దేశం కోసం ఈ ముగ్గురు అమరవీరులు చేసిన త్యాగం సాటిలేనిదని, వీరిని చూసి తామంతా గర్విస్తున్నామని ట్వీట్ చేశారు. కుటుంబ భారాన్ని మోస్తున్న అశ్వినికుమార్ మరణంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. (హిజ్బుల్ టాప్ కమాండర్ దిగ్బంధం) -
ముగ్గురు జవాన్ల వీర మరణం
శ్రీనగర్ : దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో ఉగ్రమూకలు ఇదే అదనుగా రెచ్చిపోతున్నాయి. జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో శనివారం రాత్రి ఉగ్రవాదులతో పోరాడుతూ ఐదుగురు జవాన్లు మరణించిన ఘటన మరువకముందే అదే ప్రాంతంలో మరో విషాదం చోటుచేసుకుంది. హంద్వారా ప్రాంతంలోని క్వాజిబాద్ సమీపంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు నేలకొరిగారు. మరో జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. మిలిటెంట్లను వేటాడే ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కాగా, శనివారం సాయంత్రం ఉగ్రమూకతో జవాన్ల వీరోచిత పోరాటంలో ఐదుగురు జవాన్లు మరణించిన ఘటన కలకలం రేపింది. చదవండి : పాకిస్తాన్‌కు సరైన బుద్ది చెబుతాం.. -
‘వారికి దేవుడే శిక్ష విధించాడు’
సాక్షి, విజయవాడ: ‘దిశ’ కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడం పట్ల డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి హర్షం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ..మహిళలపై దారుణాలకు పాల్పడే వారికి దేవుడే శిక్ష విధిస్తాడని..ఈ ఎన్కౌంటర్ ద్వారా న్యాయం జరిగిందన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల రక్షణకు చర్యలు చేపట్టారని వెల్లడించారు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ‘ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ క్రైమ్’ అనే కార్యక్రమం చేపట్టామని, దేశంలో ఎక్కడా లేని ప్రయోగం ఏపీలోనే జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో ఒక మహిళా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. మద్యానికి బానిసై కర్కశంగా నలుగురు నిందితులు.. ‘దిశ’పై ఘాతుకానికి పాల్పడ్డారన్నారు. ఇలాంటి దారుణాలను నియంత్రించడానికి విడతల వారీగా మద్యపాన నిషేధానికి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థినిలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేవిధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరమని పుష్ఫ శ్రీవాణి సూచించారు. చట్టాలను కఠినతరం చేయాలి.. మహిళల రక్షణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళల రక్షణ, భద్రతకు నూతన చట్టం తెచ్చేలా సీఎం జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. చట్టాలను కఠినతరం చేయాలని కోరారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త చట్టం తీసుకువచ్చే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. (చదవండి: మహిళలపై దాడులు.. కేంద్రం కీలక ఆదేశాలు) -
చట్టాల్లో మార్పులు రావాలి:విష్ణుకుమార్ రాజు
సాక్షి, విశాఖపట్నం: ‘దిశ’ కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడం పట్ల బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు హర్షం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. చట్టాల్లో మార్పులు రావాలని, మహిళలపై దారుణాలకు పాల్పడే వారిని పబ్లిక్‌గ్గా ఉరితీసే చట్టంతో పాటు, పబ్లిక్‌గా షూట్ చేసే చట్టం కూడా రావాలన్నారు. రెండు నెలల్లో ఇలాంటి కేసులను క్లోజ్ చేసేలా చట్టం రూపొందించాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు, డే టూడే గానో కాలపరిమితి విధించి రెండు నెలల్లో నిందితులను ఉరితీసే విధంగా చట్టం చేయాలని విష్ణుకుమార్ రాజు కోరారు. (చదవండి: నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలి: చిరంజీవి) -
‘పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగింది’
సాక్షి, తణుకు: ‘దిశ’ కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడంతో పోలీస్ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందని తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల గుండెలను శాంతింప చేసిన పోలీసులకు హేట్సాఫ్ తెలిపారు. దేశ ప్రజలంతా నిందితులకు ఉరి వేయాలని కోరుకున్నారన్నారు. కాలయాపన లేకుండా దేవుడే ఎన్కౌంటర్ రూపంలో న్యాయం చేయించాడన్నారు. రెండు బెత్తం దెబ్బలు కాకుండా ప్రజలు కోరుకున్న విధంగానే జరిగిందని వ్యాఖ్యానించారు. దిశ కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడం పట్ల పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు: ‘దిశ’ కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడం సరైనదేనని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు,ఉద్యోగినులకు తెలంగాణ పోలీసులు భరోసా కల్పించారని తెలిపారు. విశాఖ: దిశ కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడంతో విశాఖపట్నంలో మహిళలు సంబరాలు జరుపుకున్నారు. మద్దిలపాలెం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరీ ఆధ్వర్యంలో మహిళలు స్వీట్లు పంచుకున్నారు. -
చట్టం తన పని చేసింది, అంతా 5-10 నిమిషాల్లో
సాక్షి, హైదరాబాద్ : దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఘటన పూర్వాపరాలను మీడియాకు వివరించారు. దిశకు సంబంధించిన సెల్‌ఫోన్, పవర్‌బ్యాంకు, వాచ్ తదితర వస్తువులను సేకరించేందుకు నలుగురు నిందితులతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లామని, ఈ సందర్భంగా తమ పోలీసు అధికారుల వద్ద ఉన్న తుపాకీలను లాక్కుని ఆరిఫ్, చెన్నకేశవులు ఎదురు దాడికి దిగారని చెప్పారు. మిగతా నిందితులు రాళ్లతో పోలీసులపై దాడి చేశారని తెలిపారు. లొంగి పొమ్మని చెప్పినా వినకపోవడంతో వారిని ఎన్కౌంటర్ చేసినట్టు స్పష్టం చేశారు. ప్రధానంగా ఈ కేసులో ఏ1 మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు తమ ఆయుధాలను లాక్కొని కాల్పులు జరిపారని చెప్పారు. దీంతో తప్పని పరిస్థితుల్లో తమ పోలీసులు కాల్పులు జరిపారన్నారు. బుల్లెట్ గాయాలతోనే నిందితులు హతమైనట్టుగా తెలిపారు. మిగిలిన వివరాలు పోస్ట్‌మార్టం నివేదిక అనంతరం తెలుస్తుందన్నారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో 10 మంది పోలీసు అధికారులు పాల్గొన్నారనీ, అంతా అయిదు పది నిమిషాల్లో ముగిసిపోయిందని ఆయన వివరించారు. ఎన్నిరౌండ్ల ఫైరింగ్ జరిగింనేది విచారణలో తేలుతుందన్నారు. మరోవైపు తెలంగాణాలో చోటు చేసుకున్న ఈ ఘటనను జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సుమోటాగా తీసుకుంది. అత్యవసర దర్యాప్తునకు ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌ను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. దీనిపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ చట్టం తన పని తాను చేసుకుపోయిందని సజ్జనార్ వ్యాఖ్యానించారు. అలాగే ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర హోం శాఖకు, ఎన్హెచ్ఆర్సీకి తమనివేదికను అందిస్తామని చెప్పారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్.. మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు దిశ నిందితుల ఎన్కౌంటర్: ఆ బుల్లెట్ దాచుకోవాలని ఉంది దిశ కేసు: చాటింపు వేసి చెప్పండి పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం దిశకు న్యాయం జరిగింది.. మరి నిర్భయ? ‘సాహో సజ్జనార్’ అంటూ ప్రశంసలు.. ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోండి’ పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం ఆ బుల్లెట్ దాచుకోవాలని ఉంది: మనోజ్ -
‘ఆ రెండు ఉంటేనే వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది’
సాక్షి, కాకినాడ: ‘దిశ’ కేసులో ప్రజలు కోరుకున్న తీర్పే వెలువడిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..దేశంలో మహిళల రక్షణ, భద్రత చాలా ప్రధానమైందన్నారు. ఈ అంశంలో చట్టాలు కఠినంగా ఉన్నాయని పేర్కొన్నారు. తీర్పులు, శిక్షలు చాలా కఠినంగా అమలు చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని తెలిపారు. ‘దిశ’ ఘటన దేశాన్నే కుదిపేసిందన్నారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు తప్పకుండా చట్టాలు కఠినంగా వ్యవహరించాలన్నారు. ‘సమాజంలో మహిళల పట్ల భక్తి అయినా ఉండాలి, ప్రభుత్వం మీద భయమైన ఉండాలి. ఈ రెండు ఉంటేనే వ్యవస్థ సక్రమంగా నడుస్తుందని’ అభిప్రాయపడ్డారు. ఏపీలో మహిళల భద్రత చాలా ప్రధాన అంశంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్నారన్నారు. ఎటువంటి ఆపదలోనైనా పోలీస్ టోల్ ఫ్రీ నంబర్లు, మహిళ, సైబర్ మిత్రలకు కాల్ చేయాలని మహిళలకు మంత్రి కన్నబాబు సూచించారు. (చదవండి: నలుగురు మృగాళ్ల కథ ముగిసింది) -
గడ్చిరోలిలో ఇద్దరు మావోల ఎన్కౌంటర్
గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్మడ్ అటవీ ప్రాంతం భామ్రాగఢ్‌లోని ఛత్తీస్‌గఢ్– మహారాష్ట్ర సరిహద్దుల్లో శనివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 2 నుంచి మొదలయ్యే మావోయిస్టు వారోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీస్ కమాండోలు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. -
కశ్మీర్ ఎన్కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదుల మృతి
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లోని బండిపర జిల్లాలో సోమవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరోవైపు ఇదే ప్రాంతంలో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు తలదాచుకుని ఉంటారన్న సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఉగ్ర కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు బండిపర జిల్లాలోని లదౌర ప్రాంతంలో ఉగ్రవాదులను గుర్తించి కాల్పులకు తెరపడ్డాయి. భద్రతా దళాలను చూసి ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడగా, భద్రతా దశాలు ఎదురుకాల్పులకు దిగాయి. భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. కాగా మూడువారాల కిందట అవంతిపురలో భద్రతా దళాల ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే. -
‘నక్సలిజాన్ని రూపుమాపేందుకు ఏం చేస్తున్నారు?
సాక్షి, అమరావతి: నక్సలిజం సమస్యను రూపుమాపేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని హైకోర్టు మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపుల వివరాలను ఓ నివేదిక రూపంలో తమ ముందుంచాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీని ఆదేశించింది. ఈ సమస్యకు ఓ పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పేర్కొంది. ఇటీవల విశాఖ జిల్లా మాదినమల్లు అటవీ ప్రాంతంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడి, కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మావోయిస్టు భవానీని మెరుగైన చికిత్స నిమిత్తం మంచి వైద్య సదుపాయాలున్న ఆసుపత్రికి తరలించాలని హోంశాఖను ఆదేశించింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలను కూడా వివరించాలని సూచించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఎదురు కాల్పుల్లో ఎంతమంది పోలీసులు.. ఎంతమంది నక్సలైట్లు చనిపోయారో తెలియచేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ‘పిల్’గా హెబియస్ కార్పస్ పిటిషన్ మాదినమల్లు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిన తరువాత మావోయిస్టు పార్టీ అగ్రనేత అరుణ, భవానీ, గుమ్మిరేవుల మాజీ సర్పంచి నారాయణరావు ఆచూకీ తెలియడం లేదని, పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోందని, అందువల్ల వారిని కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం నేత చిలుకా చంద్రశేఖర్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ హెబియస్ కార్పస్ వ్యాజ్యాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా(పిల్) మారుస్తున్నామని స్పష్టం చేసింది. -
ఆగని తుపాకుల మోత!
విశాఖ ఏజెన్సీ తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. ఆదివారం పోలీసులు–మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించి 24 గంటలు గడవకముందే మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. జీకే వీధి మండలం మాదిగమళ్లు అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఎదురుకాల్పులు జరిగి ముగ్గురు మావోయిస్టులు చనిపోగా.. సంఘటన స్థలంలో ఐదు తుపాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మృతదేహాలను సోమవారం రాత్రి 8 గంటలకు నర్సీపట్నం తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. అదే సమయంలో మాదిగమళ్లు సమీప పేములమల్లు అటవీ ప్రాంతంలో మళ్లీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మూడు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక ఏకే 47, ఎస్ఎల్ఆర్, నాటు తుపాకీ ఉన్నాయి. సాక్షి, సీలేరు(విశాఖపట్టణం) : ఏజెన్సీలో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టులే లక్ష్యంగా అటవీ ప్రాంతంలో బలగాలు కూంబింగ్ చేపడుతున్నాయి. ఇందులో భాగంగా తమకు మావోయిస్టులు తారసపడడంతో తాజా ఎన్కౌంటర్ చోటు చేసుకుందని పోలీసులు అంటున్నారు. సంఘటన స్థలంలో ఏకే 47 ఉండడంతో మావోయిస్టుల అగ్రనేతలు ఎవరైనా ఉన్నారా అన్నది పోలీసు సందేహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయం కావడంతో మృతులు ఎవరన్నది గుర్తించడం కష్టంగా ఉంది. ప్రస్తుతం రెండు ఎన్కౌంటర్లతో ఈ ప్రాంత మంతటా యుద్ధ వాతావరణం నెలకొంది. గిరిజనులంతా భయంతో వణుకుతున్నారు. ఇళ్లల్లోంచి భయటకు రాని పరిస్థితి నెలకొంది. ప్రతిఘటన తీర్చుకున్న బలగాలు.. విశాఖ ఏజెన్సీ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేస్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమలను మావోయిస్టులు దారికాచి కాల్చి చంపిన సంఘటనకు సోమవారంతో ఏడాది కావచ్చింది. ఈ నేపథ్యంలో బలగాలు ఈ రెండు ఎన్కౌంటర్లతో ప్రతిఘటన తీర్చుకున్నామని ఆనందంలో ఉన్నారు. మావోయిస్టు అగ్రనేత అరుణ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హతమార్చిన సంఘటనలో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో అప్పటి నుంచి ఆమెనే టార్గట్ చేసుకొని బలగాలు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత 20 రోజులుగా అరుణ ఉన్న దళాన్నే టార్గట్ చేసి కూంబింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ రెండుసార్లు ఎన్కౌంటర్లో తప్పించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎలాగైనా పోలీసులు ఆమెను పట్టుకునేటట్లు కూంబింగ్ నిర్వహిస్తూ ఏడాది రోజున ఈ రెండు ఎన్కౌంటర్లలో ఐదుగురు మావోయిస్టులను హతమార్చి ఆ పార్టీకి గట్టి దెబ్బ కొట్టారు. కాగా ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ముగ్గురిని పోలీసులు గుర్తించారు. వీరు ఛత్తీస్‌గఢ్‌కి చెందిన వారిగా అనుమానిస్తున్నారు. చనిపోయిన వారిని బుధ్రి, విమల, అజయ్‌గా గుర్తించారు. -
అబూజ్‌మాడ్‌లో అగ్రనేతలు
పెద్దపల్లి: కాకులు దూరని కారడవులు.. ఎత్తయిన కొండలు.. దట్టమైన దండకారణ్యం. గౌతమి, ఇంద్రావతి, శబరి, లాహిరీ నదుల పరిసరాలను విస్తరించిన అబుజ్‌మాడ్‌పై క్రమంగా పోలీసులు పట్టు సాధిస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో దండకారణ్యంలో జరిగిన నాలుగు ఎన్కౌంటర్ సంఘటనలో రెండు అబూజ్మాడ్ కొండల్లోనే సాగడం ఇందుకు నిదర్శనం. మోస్ట్ వాంటెడ్ నేతలంతా మాడ్ ప్రాంతంలోనే ఉన్నట్లు భావిస్తున్న కేంద్ర బలగాలు.. ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా అబూజ్మాడ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. వందలాది ఎన్కౌంటర్లతో నష్టపోతున్న మావోయిస్టు పార్టీకి ఇప్పటికీ అబూజ్మాడ్ ప్రాంతంలో పటిష్టమైన నాయకత్వంతో జనతన సర్కార్‌ను నడుపుత్నునారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర ప్రాంతాలను ఆనుకుని ఉన్న నారాయణపూర్ ఖాంకేర్, రాజ్‌నంద్‌గామ్, జిల్లాల్లో విస్తరించిన అబూజ్మాడ్ ప్రాంతంలోని కొండలను స్థావరాలుగా ఏర్పాటు చేసుకున్న మావోయిస్టు పార్టీ 38 ఏళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లో పోటీ ప్రభుత్వాన్ని నడుపుతోంది. వేల మైళ్ల అడవులతోపాటు నైబేరడీ గౌతమినదీ, పర్లకోటనదీ, ఇంద్రావతి, శబరి, లాహిరీ లాంటి నదులు పార్టీ దళాలకు దారి చూపే మార్గాలుగా ఉన్నాయి. తెలంగాణ, జార్ఖండ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్ట పోయినా ఇంకా 14 రాష్ట్రాల్లో ప్రాబల్యం ఉంది. అయితే అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆ పార్టీకి అబూజ్మాడ్ ప్రాంతం గుండెకాయలాంటింది. ఆయుధాల తయారీ సహా పార్టీకి చెందిన దళాలకు రాజకీయ శిక్షణ, సైనిక శిక్షణ అంతా అబూజ్‌మాడ్‌లోనే జరుగుతున్నాయి. అబూజ్‌మాడ్‌ను గుర్తించడానికి వందలసార్లు హెలీకాప్టర్లతో సర్వేలు నిర్వహించిన పోలీసు బలగాలు క్రమంగా చొచ్చుకెళ్తున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన కమెండోలు, కోబ్రా దళాలు, ఆక్వా ఫోర్స్, ఆదివాసీలకు చెందిన స్పెషల్ ఆఫీసర్ (ఎస్పీఓ)లు మావో దళాల కోసం నిత్యం అబూజ్మాడ్ ప్రాంతాన్ని గాలిస్తూ, తమ ఆ«దీనంలో తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే దశబ్దా కాలంగా పోలీసులు అబూజ్‌మాడ్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నించి వడ్స, బాంమ్రాఘడ్, చింతల్‌నాల్ లాంటి ప్రాంతాల్లో సైన్యం దెబ్బతిన్నది. చింతల్‌నాల్, మస్పూర్, ఖాంకేర్‌లలో మూడు సంఘటనలోనే వంద మందికిపైగా పోలీసులు మరణించారు. రాష్ట్రాల్లోని మావోయిస్టు కమిటీలలో మాడ్ డివిజన్ కమిటీ కీలకమైంది. ఆ కమిటీ అదీనంలోనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కీలక నేతలు ఉంటారని ప్రచారం. మోస్ట్ వాంటెడ్ మావోల స్థావరంగా అబూజ్‌మాడ్‌ను గుర్తించారు. -
పుల్వామాలో ఇద్దరు టెర్రరిస్టులు హతం
కశ్మీర్: జమ్ము- కశ్మీర్లో మారోసారి కాల్పుల మోత మోగింది. పుల్వామా జిల్లాలో శుక్రవారం ఎన్కౌంటర్ జరిపిన భద్రతా బలగాలు.. ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టారు. ఇంటలిజెన్స్ సమాచారం మేరకు దక్షిణ కశ్మీర్‌లోని అవంతీపురా జిల్లాలో భద్రతా బలగాలు కార్డన్‌సర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడటంతో.. ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో వారి వద్ద లభించిన మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే వీరు ఏ సంస్థకు చెందినవారో గుర్తించేందుకు విచారణ చేపట్టామన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అవంతీపురా జిల్లా పరిధిలోని రైలు, ఇంటర్నెట్ సర్వీస్‌లను నిలిపివేసినట్లు వెల్లడించారు. -
ఆరుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా, సోఫియాన్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాదులతో జరిగిన పోరులో ఓ ఆర్మీ జవాను, ఓ పౌరుడు కూడా మరణించారు. పుల్వామాలో ముగ్గురు, సోపియాన్‌లోనూ మరో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా దెలిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం తెల్లవారుజామున పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఓ ఇంట్లోని వారందరినీ పోలీసులు బయటకు తరలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సిపాయి సందీప్ వీరమరణం పొందగా, రయీస్ దార్ అనే పౌరుడు మరణించారు. అనంతరం భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వారిని పుల్వామా జిల్లా కరీమాబాద్‌కు చెందిన నసీర్ పండిత్, సోఫియాన్‌కు చెందిన ఉమర్ మిర్, పాకిస్తాన్‌కు చెందిన ఖలీద్‌లుగా గుర్తించారు. వీరు ముగ్గురూ తీవ్రమైన నేరచరిత్ర గలవారని, పలు ఘటనల్లో వీరి ప్రమేయం ఉందని పోలీసులు వెల్లడించారు. ఇక సోఫియాన్‌లోని హ్యండ్యూ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు చేస్తుండగా, ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో సిపాయి రోహిత్‌కు గాయాలయ్యాయి. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల వివరాలు తెలియలేదు. -
కుల్గామ్‌లో భీకర ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఆదివారం భీకర ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కుల్గామ్ జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతం కాగా, ఓ పోలీస్ డీఎస్పీ, మరో జవాన్ ప్రాణాలు కోల్పోయారు. కుల్గామ్ జిల్లాలోని తురిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు పోలీసులకు నిఘావర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో డీఎస్పీ అమన్ ఠాకూర్ నేతృత్వంలోని పోలీస్, ఆర్మీ సంయుక్త బృందం ఘటనాస్థలికి బయలుదేరింది. అయితే తురిగామ్‌ను ఈ బృందం సమీపించగానే ఉగ్రవాదులు వీరిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో డీఎస్పీ అమన్ ఠాకూర్ మెడ భాగంలో బుల్లెట్ దూసుకుపోయింది. వెంటనే భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..అమన్ ఠాకూర్‌తో పాటు హవల్దార్ సోంబీర్‌కు తీవ్రగాయాలు కాగా హుటాహుటిన వాయుమార్గం ద్వారా ఆర్మీ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అయితే, చికిత్స పొందుతూ వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారన్నారు. తురిగామ్‌లో నక్కిన ముగ్గురు జైషే ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ ఆర్మీ మేజర్, ముగ్గురు సైనికులు గాయపడ్డారనీ, వీరి ఆరో గ్యం స్థిరంగా ఉందని పేర్కొన్నారు. అమన్ మృతిపై గవర్నర్ సత్యపాల్ మాలిక్, డీజీపీ దిల్బాగ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రెండు ప్రభుత్వ ఉద్యోగాలను కాదని.. జువాలజీలో మాస్టర్స్ చేసిన అమన్ ఠాకూర్‌కు పోలీస్ శాఖలో పనిచేయాలన్నది చిరకాల స్వప్నం. అందుకే రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ పోలీస్‌శాఖలో చేరారు. దొడా జిల్లాకు చెందిన అమన్‌కు తొలుత జమ్మూకశ్మీర్ సాంఘిక సంక్షేమ శాఖలో అధికారిగా ఉద్యోగం వచ్చింది. అనంతరం స్థానిక ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్‌గానూ ఉద్యోగం దక్కింది. అయితే పోలీస్ ఉద్యోగంపై ఉన్న మక్కువతో అమన్ తన ప్రయత్నాలు కొనసాగించారు. చివరికి జమ్మూకశ్మీర్ పోలీస్ సర్వీస్‌కు 2011లో ఎంపికయ్యారు. ఏడాదిన్నర క్రితం కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల విభాగానికి చీఫ్‌గా అమన్ నియమితులయ్యారు. అప్పట్నుంచి అమన్ బృందం చాలామంది కరుడుగట్టిన ఉగ్రవాదులను మట్టుబెట్టింది. కాగా, విధినిర్వహణలో చూపిన ధైర్య సాహసాలకు గానూ అమన్ డీజీపీ ప్రశంసా మెడల్–సర్టిఫికెట్, షేర్–ఏ–కశ్మీర్ మెడల్‌ను అందుకున్నారు. అమన్‌కు తల్లిదండ్రులతో పాటు భార్య సరళా దేవి, కుమారుడు ఆర్య(6) ఉన్నారు. -
ఐదుగురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కుల్గామ్ జిల్లాలోని కెల్లెమ్ గ్రామంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాబలగాలు ఐదుగురు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో భద్రతాబలగాలు కెల్లెమ్‌ను చుట్టుముట్టి గాలింపును ప్రారంభించాయి. బలగాల కదలికల్ని గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించారు. ఈ సందర్భంగా భద్రతాబలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాతో పాటు హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన వసీమ్ అహ్మద్, అకీజ్ నజీర్ మీర్, పర్వేజ్ అహ్మద్‌భట్, ఇద్రీస్ అహ్మద్, జహీద్ అనే ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఓ జవాన్‌తోపాటు పౌరుడిని హత్యచేసిన కేసులో వీరంతా నిందితులని తెలిపారు. అనంతనాగ్, కుల్గామ్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, భద్రతాసంస్థలపై వీరు గ్రనేడ్ దాడులకు పాల్పడ్డారని వెల్లడించారు. ఎన్కౌంటర్ అనంతరం ఘటనాస్థలం నుంచి తుపాకులతో పాటు భారీఎత్తున మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. -
ఇన్ఫార్మర్ నెపంతో ఊచకోత
కాళేశ్వరం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బాంబ్రాగాడ్ తాలూకాలోని తాడ్‌గావ్ పోలీస్‌స్టేషన్ దగ్గర్లో మావోయిస్టులు ముగ్గురిని హత్య చేశారు. బాంబ్రాగాడ్ తాలూకా కసన్సూర్ గ్రామానికి చెందిన ఆరుగురిని పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో శుక్రవారం మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌కు గురైన వారిలో ముగ్గురిని సోమవారం అర్ధరాత్రి దారుణంగా చంపి నడిరోడ్డుపై పడేశారు. ఘటనాస్థలిలో ఎర్రరంగు బ్యానర్లతోపాటు మావోల పేరుతో లేఖలను వదిలేశారు. గత ఏడాది ఏప్రిల్ 22న బాంబ్రాగాడ్ తాలూకా పరిధి బోరియా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 40 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తాము చంపేసిన ఆ ముగ్గురు ఇన్ఫార్మర్ల కారణంగానే గత ఏప్రిల్‌లో మావోల జాడ పోలీసులకు తెలిసిందని, మావోల మరణానికి ఈ ముగ్గురు ఇన్ఫార్మర్లే కారణమని బ్యానర్లు, లేఖలో మావోలు పేర్కొన్నారు. కిడ్నాప్‌కు గురైన మిగతా ముగ్గురు ఇంకా వారి చెరలోనే ఉన్నట్లు తెలుస్తోంది. హత్యల నేపథ్యంలో కసన్సూర్ గ్రామంలో భయానకవాతావరణం నెలకొంది. -
భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదుల హతం
జమ్ము కశ్మీర్ : జమ్ము కశ్మీర్లో భద్రతాదళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు తీవ్రవాదులు హతం అయ్యారు. బుద్గామ్, సోఫియాన్‌లలో చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ముగ్గురు తీవ్రవాదులను భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. దాడి జరిగిన ప్రాంతంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మృతులు షంసుల్ హక్ మేంగ్నూ, అమీర్ సోహైల్ భట్, సోహైబ్ అహ్మద్ షాలుగా గుర్తించారు. పోలీసుల రికార్డుల ప్రకారం వీరందరూ తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన వారుగా తెలుస్తోంది. -
లైవ్ ఎన్కౌంటర్.. మీడియాకు ఆహ్వానం
అలీఘర్ : ఉత్తర్ ప్రదేశ్‌లో మీడియా సాక్షిగా ఇద్దరు హంతకులను పోలీసులు హతమార్చడం సంచలనంగా మారింది. హర్దూగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచువా గ్రామంలో గురువారం నేరగాళ్లు సంచరిస్తున్నారన్న సమాచారాన్ని స్థానిక పోలీసులు తెలుసుకున్నారు. బైక్‌పై వెళుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ముస్తకిమ్, నౌషద్‌లను అడ్డుకోవాలని ప్రయత్నించారు. కానీ, పోలీసుల కళ్లుగప్పి సమీపంలోని ఓ పాత బిల్డింగ్‌లో వారు తలదాచుకున్నారు. పెద్దమొత్తంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకోవాడానికి ప్రయత్నించగా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో మరి కాసేపట్లో లైవ్ ఎన్కౌంటర్ ఉంది..మీడియా వచ్చి కవర్ చేయండి అంటూ పోలీసుల నుంచి మీడియాకు ఆహ్వానం వచ్చింది. స్థానిక, జాతీయ మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకుని ఎన్కౌంటర్ని చిత్రీకరించారు. ఎన్కౌంటర్ గురించి పారదర్శకంగా వ్యవహరించడానికే మీడియాకు ఆహ్వానించామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్కౌంటర్లో ఇద్దరు క్రిమినల్స్ మృతిచెందగా, ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. నెల రోజుల వ్యవధిలోనే జరిగిన 6 హత్య కేసుల్లో ముస్తకిమ్, నౌషద్‌లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరికి 10కి పైగా దొంగతనం కేసుల్లో కూడా సంబంధం ఉండటంతో పోలీసులు ఒక్కొక్కరిపై రూ.25 వేల రివార్డు కూడా ప్రకటించారు. -
ఛత్తీస్‌లో నలుగురు మావోల ఎన్కౌంటర్
పర్ణశాల(భద్రాచలం): తెలంగాణ సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు మహిళా దళ కమాండర్‌తో పాటు ముగ్గురు సభ్యులు మృతి చెందారు. జిల్లా ఎస్పీ జితేంద్ర శుక్లా కథనం ప్రకారం.. కుకడాంజోర్ పోలీస్‌స్టేషన్ పరిధి గుమియాబెడా ఆడవుల్లో కూంబింగ్ జరుపుతున్న జవాన్లకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా సుమారు గంటపాటు ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పులు జరుపుతూనే మావోయిస్టులు సమీపంలోని దట్టమైన అడవిలోకి పారిపోయారు. అనంతరం ఘటన స్థలంలో నలుగురు మావోయిస్టుల మృతదేహాలతో పాటు నాలుగు తుపాకులు, డిటొనేటర్లు, విద్యుత్ తీగలు, బ్యాటరీలు, నిత్యావసర వస్తువులు, పేలుడు పదార్థాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో దళ కమాండర్ రత్త జార, దళ సభ్యుడు సోములను గుర్తించగా మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. వీరిద్దరి తలలపై రూ.5లక్షల వరకు రివార్డు ఉందని ఎస్పీ చెప్పారు. కాంకేర్ జిల్లాలో ఇద్దరిని చంపిన మావోయిస్టులు: కాంకేర్ జిల్లా బందె పోలీస్‌స్టేషన్ పరిధిలో తాడంవెలి గ్రామం నుంచి మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గట్ట ప్రాంతంలోని తాడ్గూడ రోడ్డులో కనిపించాయి. ఆగస్టు 26వ తేదీన సోను పధా(35), సోమ్జీ పధా(40)తోపాటు పాండురాం అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారు. పాండురాం తప్పించుకోగా సోను, సోమ్జీలను మావోయిస్టులు గొంతుకోసి చంపారు. ఇన్ఫార్మర్ల నెపంతోనే వారిని చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఆయుధాలతో స్వతంత్రం రాదు: ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ : కశ్మీరు యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులవ్వడం ఆందోళనకరమని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. ఈ సందర్భంగా రావత్.. ‘ఆయుధాలతో స్వతంత్రం సిద్దించదు. ఉగ్రవాదులు సైన్యంతో పోరాడలేరు’ అనే బలమైన సందేశాన్ని ఇచ్చారు. భద్రతా దళాలు గత ఆదివారం జరిపిన కాల్పుల్లో కశ్మీరుకు చెందిన అధ్యాపకుడు మహ్మద్ రఫి భట్ మరణించిన సంగతి తెలిసిందే. రఫి మరణం తర్వాత బిపిన్ రావత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘కశ్మీర్ యువతకు నేను చెప్పదల్చుకున్నది ఒక్కటే. మీరు అనుకునే ఆజాది(స్వతంత్రం) ఎప్పటికి సిద్దించదు. మీరంతా ఆయుధాలు చేతపట్టినంత మాత్రాన జరిగేదేమీ ఉండదు. ఆజాదీ పేరుతో అరాచకం సృష్టించాలనుకుంటే మేము(సైన్యం) చూస్తూ ఉండం.. మీరు కోరుకునే స్వతంత్రం ఎప్పటికి రాదు’ అని బిపిన్ రావత్ తెలిపారు. కొన్ని దేశవిద్రోహక శక్తులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ఫలితంగా వారు హింసా మార్గాన్ని ఎన్నుకుని ఆయుధాలను చేపడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం 11 మంది యువకులు తుపాకులు చేతబట్టి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడం... భద్రతాబలగాలు ఆ ఫొటోలో ఉన్న 10 మందిని వేర్వేరు ఎన్కౌంటర్లలో మట్టుపెట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం జమ్ముకశ్మీర్‌లోని షోఫియాన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో బుర్హాన్ వనీ గ్యాంగ్ చివరి సభ్యుడు సద్దాం పద్దేర్ కూడా హతమయ్యాడు. దీని గురించి రావత్ ‘వారు(ఉగ్రవాదులు) కొత్తవారిని చేర్చుకుంటున్నారు.కానీ దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు’ అన్నారు. అంతేకాక ఉగ్రవాదుల దాడల్లో మరణిస్తున్న సైనికుల గురించి మాట్లాడుతూ ఎన్కౌంటర్లో ఎంత మంది సైనికులు మరణించారనే అంశాన్ని నేను పెద్దగా పట్టించుకోను. ఎందుంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ.. ఇది కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. -
ఆరుగంటల్లో.. 5గురు ఉగ్రవాదులు హతం
షోఫియాన్: జమ్మూ-కశ్మీర్‌లోని షోఫియాన్ జిల్లా బడిగాం వద్ద ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు ఐదుమంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బడిగాంలోని ఇమాన్ సాహిబ్ ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ‘ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కుని వారిపై కాల్పులు జరిపారు. దీనికి భారతసైన్యం ధీటుగా సమాధానమిచ్చింది. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. హతులను హిజ్యుల్ ముజాహిద్దీన్ ముఠాకు చెందిన వారిగా గుర్తించారు. కశ్మీర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ కూడా ఈ కాల్పుల్లో మరణించారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఎదురు కాల్పుల్లో ఐదుగురు పౌరులు కూడా మరణించారు.’ అని ఓ అధికారి తెలిపారు. ఈ ఆపరేషన్ విజవంతం చేసిన దళాలను అభినందిస్తూ జమ్మూ-కశ్మీరు డీజీపీ శేష్ పాల్ వైద్ ట్వీట్ చేశారు. ‘ షోఫియాన్ ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులను అంతం చేశాం. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ-కశ్మీరు పోలీసులు చేసిన కృషికి అభినందనలు’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కానీ, ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందడంతో దక్షిణ కశ్మీర్లో పలు చోట్ల ఘర్షణలు చెలరేగాయి. ముఖ్యంగా షోఫియాన్, పుల్వామా, తదితర దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో పౌరులు ఆందోళన చేపట్టారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. భద్రతా దళాలను నిరోధించేందుకు స్థానికులు రాళ్ళదాడికి పాల్పడ్డారు. దీంతో అదనపు సీఆర్పీఎఫ్ బలగాలను ఈ ప్రాంతానికి తరలించారు. ఈ సందర్భంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
నెత్తురోడుతున్న అరణ్యం
ఎండాకాలం దండకారణ్యంలో మావోయిస్టు దళ సభ్యులు ఎన్కౌంటర్లలో పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రతి సీజన్లో వేసవికాలం అన్నల పాలిట గడ్డుకాలమే. అయితే.. ఈసారి నిర్బంధం మరింత తీవ్రమైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు పోలీసులు, మావోయిస్టుల కాల్పుల ఘటనల్లో మొత్తం 78 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 56 మంది మావోయిస్టులు ఉన్నారు. మిగిలిన వారిని ఇన్ఫార్మర్లుగా భావించి నక్సల్స్ హతమార్చారు. గతంతో పోల్చితే నేలకొరుగుతున్న మావోయిస్టుల సంఖ్య ఈ సారి ఎక్కువగా ఉంది. సాక్షి ప్రతినిధి, వరంగల్ : మావోయిస్టులకు పెట్టని కోట వంటి దండకారణ్యం నెత్తురోడుతుంది. తుపాకీ మోతలతో అడవులు దద్దరిల్లుతున్నాయి. మావోయిస్టులకు ఎంత గానో పట్టున్న ఇంద్రావతి, శబరి నదీ తీరాల్లో వారికి నష్టం జరగడం కలకలం రేపుతోంది. ప్రతి ఏడాది వేసవి కాలంలో అడవులు ఆకురాల్చుతాయి. దట్టమైన అడవిలో సుదూర ప్రాంతాలను పరిశీలిస్తూ ముందు కు సాగేందుకు అవకాశం ఉంటుంది. దీంతో అడవులను జల్లెడ పట్టే కార్యక్రమాన్ని పోలీసు బలగాలు విస్త్రృతంగా చేపడుతున్నాయి. ఈ దాడులను ఎదుర్కొనేందుకు మావోయిస్టులు మార్చి నుంచి జూన్ వరకు ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నారు. ప్రతి వేసవి సీజన్లో పోలీసుల దాడులను ఎదుర్కొనేందుకు వీలుగా టాక్టికల్ కౌంటర్ ఎఫెన్స్ క్యాంపె యిన్ (టీసీఓసీ) పేరిట దళాలు సంఘటితంగా సంచరించడంతోపాటు ప్రతిచర్యలకు దిగుతున్నారు. దీంతో వేసవిలో సైతం మావోయిస్టులను ఎదుర్కోవడం పోలీసులకు సవాల్‌గానే ఉండేది. కూంబింగ్‌కు సంబంధించిన ఆనవాళ్లు చిక్కితే మావోయిస్టులు మందుపాతర్లు ఏర్పాటు చేస్తారనే ఆందోళన పోలీసు వర్గాల్లో ఉండేది. అయితే గతంతో పోల్చితే ఈ ఏడాది పరిస్థితిలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆకురాలే కాలానికి ఆ«ధునిక సాంకేతిక పరిజ్ఞానం తోడవడంతో పోలీసులు పై చేయి సాధిస్తున్నారనే అభిప్రాయం నెలకొంది. మావోయిస్టుల ఏరివేతకు గత దశాబ్దకాలంగా హెలికాప్టర్‌ను పోలీసులు ఉపయోగిస్తున్నారు. ఈ సారి అంతకు మించి శాటిలైట్ చిత్రాలను తీసుకుని వాటిని విశ్లేషించడం, అనంతరం డ్రోన్ కెమెరాలు పంపడం ద్వారా అడవులను అణువణువు జల్లెడ పడుతున్నారు. పోలీసుల గగనతల ఆపరేషన్‌ను ఎదుర్కొని తప్పించుకునేలా వ్యూహం రూపొందించుకోవడంలో మావోయిస్టు దళాలు గందరగోళంలో పడిపోతున్నాయి. దీంతో మావోయిస్టుల వైపు ఎక్కువగా ప్రాణనష్టం జరుగుతోంది. ఈ క్రమంలో భద్రత వ్యవస్థపై మావోయిస్టులు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. నదుల్లో రక్తపుటేరులు గడ్చిరోలి ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాల తరలింపు, బంధువులకు అప్పగింత ప్రహసనంలా మారింది. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి పోలీసులు ఎవ్వరినీ అనుమతించడం లేదు. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలు ఇంద్రావతి నదిలో తేలియాడుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. రెండు రోజులుగా ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. మొత్తం 40 మంది చనిపోయినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు కేవలం 12 మృతదేహాలను గుర్తించారు. మిగిలిన మృతదేహాలు ఎవరివనే విషయాన్ని గుర్తించలేదు. నదిలో ఉన్న మృతదేహలు ఎలా ఉన్నాయనేది తెలియరాలేదు. మృతదేహాల కోసం మావోయిస్టుల కుటుంబ సభ్యులు గడ్చిరోలి , అహెరీ ఆస్పత్రుల వద్ద రోజుల తరబడి కన్నీళ్లతో పడిగాపులు కాస్తున్నారు. ఆ ఎనిమిది మంది ఎక్కడ.. 40 మంది చనిపోయిన గడ్చిరోలి–బొరియా ఎన్కౌంటర్లో మృతదేహాల జాడ తెలియని పరిస్థితి ఉండగా.. మరో ఎనిమిది మంది యువకులు ఏమయ్యారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్కౌంటర్ జరగడానికి ఒక రోజు ముందు ఆ గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులను మావోయిస్టులు తీసుకెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే మరుసటే రోజు భారీ ఎన్కౌంటర్ జరిగింది. 40 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల ఘటన నేపథ్యంలో ఆ యువకులు అడవుల్లోకి పారిపోయారా.. ఎన్కౌంటర్లో మరణించారా.. పోలీసుల అదుపులో ఉన్నారా అనేది తెలియడం లేదు. వారి ఆచూకీ చెప్పాలంటూ గడ్చిరోలీ ఎస్పీ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం నిరసన తెలిపారు. ఎన్కౌంటర్లో చనిపోయిన 40 మందిలో ఓ ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నట్లు సమాచారం. -
భద్రతాబలగాల కాల్పుల్లో ఉగ్రవాది మృతి
జమ్మూకశ్మీర్: భద్రతాబలగాల కాల్పుల్లో ఆదివారం తెల్లవారుజామున ఓ ఉగ్రవాది మరణించాడు. ఈ సంఘటన బుద్గాం జిల్లాలోని అరిజాల్ గ్రామంలో చోటుచేసుకుంది. అనంత్‌నాగ్ జిల్లాలోని దూరు ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు మృతిచెందిన సంగతి తెల్సిందే. శుక్రవారం రాత్రి ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్ ఆదివారం వరకు కొనసాగింది. ఎలాంటి నష్టం జరగకుండా ఉగ్రవాదుల ఏరివేత ముగిసింది. -
బూటకపు ఎన్కౌంటర్లకు అధికార పార్టీదే బాధ్యత
కోనరావుపేట(వేములవాడ): ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దులోని వెంకటాపురం వద్ద ఈ నెల 10న జరిగిన ఎన్కౌంటర్ బూటకమని, నిద్రిస్తున్న వారిపై ఒక్కసారిగా పోలీసులు కాల్పులు జరిపారని సీపీఐ (ఎంఎల్) జనశక్తి రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథ్ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ హత్యలు చేయించిందని మండిపడ్డారు. తెలంగాణ సాధనకు విప్లవ పార్టీలు ఎంతగానో కష్టపడ్డాయని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సాక్షి కార్యాలయానికి ఒక లేఖ పంపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఇందుకోసం విద్యార్థులు బలిదానాలు చేశారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో దొరలు రాజ్యమేలుతున్నారని విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దొరలు పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. వెంకటాపురం సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌కు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. జనశక్తి వ్యవస్థాపకుడు కూర రాజన్న అనారోగ్యంతో బాధ పడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని ధ్వజమెత్తారు. -
పరిణత విప్లవకారుడు ప్రభాకర్
సందర్భం రెండు దశాబ్దాల క్రితం బీఎడ్ పూర్తి చేసి డీఎస్సీ పరీక్షకు అర్హుడైన ప్రభాకర్ తాజాగా తెలంగాణ డీఎస్సీ పరీక్ష సమయంలోనే ఎన్‌కౌంటర్‌కు గురై తన అంతిమ యాత్రలో ఊరేగవలసిరావడం కాకతాళీయమూ, విషాదం కూడా. రాజ్యం దృష్టిలో సంచలనాత్మక నాయకుడిగా నమోదు కాలేదు గానీ ప్రజల హృదయాల్లో ఇంచుమించు రెండు దశాబ్దాలుగా ప్రభాకరుడిగా వెలుగొందుతున్న దడబోయిన స్వామి విప్లవోద్యమం ఎదుర్కొనే తీవ్రమైన కష్టనష్టాల దృష్ట్యా జీవితంలోని పశ్చిమార్థంలోకి ప్రవేశిస్తున్నట్లే. తాను, తనతోపాటు క్యాంపులో ఉండిపోయిన ఆదివాసీ మహిళ రత్న.. తెలంగాణ గ్రేహౌండ్స్ దాడిచేసిన మార్చ్ 2వ తేదీ ఉదయం తీవ్ర అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్నారు. అయినా మొదట తనను గురిచూసి కాల్చిన గ్రేహౌండ్స్‌ను ప్రతిఘటించడానికే ప్రయత్నించాడు ప్రభాకర్. గ్రేహౌండ్స్‌లో మరణించిన సుశీల్‌కుమార్ శరీరంలో వెళ్లిన బుల్లెట్ ఎదురుగా వచ్చి తాకింది కాదు. వెనుకనించి దూసుకువచ్చిందని పోస్ట్‌మార్టమ్ రిపోర్టు. శవపరీక్ష చేసినవాళ్లు నిజాలు చెప్పవచ్చు చెప్పకపోవచ్చు గానీ శవాలు అబద్ధం చెప్పవు కదా. దడబోయిన స్వామి ఏబైమూడేళ్లకు పూర్వం అప్పటి అవిభక్త వరంగల్ జిల్లాలో కడిపికొండ శివారుగ్రామంగా ఉన్న రాంపేట గ్రామంలో ఇద్దరన్నల తర్వాత మూడోవాడుగా ఒక పేద గొల్లకుటుంబంలో పుట్టాడు. నగర శివారు ప్రాంతంలో రాజకీయ, విద్యాచైతన్యం ఉండటం వల్ల పట్టుదలగా చదువుకున్నాడు. ఐదోతరగతి వరకు ఊర్లో, ఇంటర్‌వరకు కాజీపేటలో, డిగ్రీ కాకతీయ యూనివర్సిటీలో చేసి హనుమకొండ బీఎడ్ కాలేజీలో బీఎడ్ చేశాడు, తర్వాత ఎంఎస్సీ కూడా పూర్తి చేసి కడిపికొండ పరిసర గ్రామాల్లో విద్యావలంటీర్‌గా పనిచేసాడు. స్వామికి బుద్ధి తెలిసేనాటికే కడిపికొండ, భట్టుపల్లి, కాజీపేట డీజల్‌కాలనీ, రోడ్డు దాటితే సోమిడి మొదలైన అన్ని గ్రామాల్లో విప్లవోద్యమం, రాడికల్ విద్యార్థి, యువజనోద్యమాలే గ్రామీణ వరంగల్ జిల్లాలో ప్రాధామ్యంలో ఉన్నవి. తనకంటే ముందు సీకేఎం కాలేజీ విద్యార్థి అయిన క్రాంతి రణదేవ్, తన ఊరివాడే అనదగిన శ్యాంసుందరరెడ్డి ఆయనకు నవయవ్వనం నాటికే వేలుపట్టుకొని నడిపించే రాడికల్ విద్యార్థి, యువజనోద్యమ నాయకులయ్యారు. సూరపనేని జనార్దన్, జన్నుచిన్నాలు నాయకత్వ వారసత్వాన్ని స్వీకరించి కాకతీయ యునివర్సిటీలో రాడికల్ విద్యార్థి ఉద్యమం మొదలు, జిల్లాలో విప్లవోద్యమం విస్తృతంగా నిర్మాణం చేసిన పులి అంజయ్య (సాగర్) కు పైన పేర్కొన్న గ్రామాలు పెట్టని కోటలు. ఈ వాతావరణంలో విద్యార్థిగానైనా, ఉపాధ్యాయునిగానైనా మసలుకున్న స్వామి 1985 నుంచే ప్రజలమధ్య వివిధ రకాల విప్లవ కార్యకలాపాల్లో పాల్గొంటూనే ఉన్నాడు. విద్యావలంటీర్‌గా పనిచేసే అవకాశం ఉపయోగించుకొని తన ఊరి పరిసర గ్రామాల్లో స్టడీసర్కిల్స్ ఏర్పాటుచేసి విప్లవ రాజకీయ అధ్యయనం, అధ్యాపనలను ప్రోత్సహించాడు. ఆయన పనిచేసిన తీరుకు ఒక ఉదాహరణ చెప్పాలంటే తీవ్ర నిర్బంధం అమలవుతున్న 1999లో రాజ్యం దృష్టిలో పడిన తన సీనియర్ ఒకరు శత్రువు దృష్టి మళ్లించడానికి ఖమ్మంలో కాంగ్రెస్ సేవాదళ్ శిబిరంలో పాల్గొనడానికి వెళ్తే తాను కూడ వెంట వెళ్లాడు. కానీ మళ్లీ అతనితో తిరిగి రాలేదు. పోలీసులకేమి ఉప్పు అందిందో కానీ వచ్చి ఇల్లంతా సోదా చేసారు. ఇంటి అటక పైన గెరిల్లా యూనిఫాం కని పించింది. ఇంటివాళ్లను వేధించి, బెదిరించి స్వామి వెనక్కిరాగానే ఎస్పీ ఆఫీసుకు తీసుకురమ్మని పురమాయించి పోయారు. స్వామి ఇంటికివచ్చి పోలీసులు వచ్చి పోయారని ఇంటివాళ్లు చెప్పగానే అటక ఎక్కి చూసి ఇంక అదే పోకడగా వెళ్లిపోయాడు. అలా 2001లో అజ్ఞాత జీవితాన్ని ఎంచుకున్న స్వామి ఏడేళ్లపాటు వరంగల్, జనగామ ఏరియాలో పనిచేసి కమాండర్ స్థాయికి ఎదిగాడు. 1993కన్నా ముందు సాగర్‌కు కొరియర్‌గా కూడ పనిచేసాడు. ఇంత సుదీర్ఘకాలపు పట్టణ, గ్రామీణ విద్యార్థులు, యువకులు, ప్రజలమధ్యన వివిధ రంగాలలో పనిచేసిన అనుభవంతో ఒక స్థిమితమైన పరిణతితో ఆయన 2008లో దండకారణ్యానికి వెళ్లి అక్కడ అప్పటినుంచీ స్థిరంగా సీపీఐ మావోయిస్టు సెంట్రల్ రీజినల్ బ్యూరోలో ప్రెస్‌వర్క్‌లో ఉన్నాడు. నాయకత్వానికి శ్రేణులకు అనుసంధానంగా పత్రిక, ప్రచురణలు వెలువరించడంలో నిరంతరం కృషిచేస్తూ నేర్చుకుంటూనే నేర్పుతూ దండకారణ్య స్పెషల్ జోనల్‌కమిటీ డివిజన్ కమిటీ నాయకత్వ స్థాయికి ఎదిగాడు. అంత కీలకమైన స్థానంలో ఇంత సుదీర్ఘకాలంగా ఉంటూ శత్రువు దృష్టి పడకుండా ఆయన వ్యవహరించిన తీరు ఆదర్శప్రాయమైనది. రాంపేట గ్రామ ఉమ్మడి అవసరాల కోసం ఉపయోగించే ఏ అగ్రిమెంట్ కాగితంలోనైనా, యాదవ సంగం రికార్డుల్లో, స్థల కొనుగోలు కాగితాల్లో, స్మశాన వాటిక కాగితాల్లో, ప్రభుత్వ ఫిర్యాదుల్లో ప్రభాకర్ రాతే ఉంది. అలాంటి వ్యక్తి మార్చి 2న ఎన్కౌంటర్లో చనిపోయినప్పుడు వార్తల్లోనూ, బ్యానర్లలోనూ, మావోయిస్టు పార్టీ కేంద్ర రీజనల్ బ్యూరో ప్రెస్ ఇన్చార్జిగా ఉన్నాడని వచ్చిన వార్త రాంపేటకే ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఊళ్లో కాగితాలపై రాసిన పని అతడిని దక్షిణభారత దేశం దాకా తీసుకుపోయింది. 1998లో గ్రామంలోనే తొలి వ్యక్తిగా బీఎడ్ పూర్తి చేసి డీఎస్సీ పరీక్షకు అర్హుడైన ప్రభాకర్ 2018 మార్చి 2వ తేదీ తాజాగా తెలంగాణ డీఎస్సీ పరీక్ష జరిగిన సమయంలోనే తన అంతిమ యాత్రలో ఊరేగవలసిరావడం కాకతాళీయమూ, విషాదం కూడా. (మార్చి 2న పూజారి కాంకేర్ అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో నేలకొరిగిన దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్ స్మృతిలో) - వరవరరావు వ్యాసకర్త విరసం సంస్థాపక సభ్యులు -
కౌంటర్ అటాక్
సాక్షి, కొత్తగూడెం : తెలంగాణలో తమ కార్యకలాపాలను తిరిగి ముమ్మరం చేయాలనుకున్న మావోయిస్టులు.. తాజా ఎన్కౌంటర్ నేపథ్యంలో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. దీంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో అలజడి నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ మొదలైంది. ఇందుకు తగినట్టుగానే సోమవారం అర్ధరాత్రి ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా డోర్నపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విధ్వంసం సృష్టించారు. హైదరాబాద్–2 డిపోకు చెందిన రెండు బస్సులు, ఒడిశా రాష్ట్రానికి చెందిన మరో ప్రైవేటు బస్సు, మూడు లారీలు, ఒక ట్రాక్టరును దహనం చేశారు. ఒక వ్యక్తిని హతమార్చారు. ఈ క్రమంలోనే మరిన్ని విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఈనెల 2వ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ పోలీసులదే కీలక పాత్ర కావడం, టీఆర్ఎస్ నేతలే లక్ష్యమని మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ప్రకటించడంతో అధికార పార్టీ నాయకుల్లో భయం నెలకొంది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని టీఆర్ఎస్ నాయకులు టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం పర్యటన రద్దయింది. కింది స్థాయి నాయకులు సైతం బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సరిహద్దు మండలాలైన చర్ల, దుమ్ముగూడెం, భధ్రాచలం, గోదావరి పరీవాహక ప్రాంతంలోని బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, భూపాలపల్లి జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, మంగపేట మండలాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులపై మావోయిస్టులు నజర్ పెట్టారు.దీంతో ఆయా నాయకులు మైదాన ప్రాంతాలకు తరలివెళుతున్నారు. తాజా ఎన్కౌంటర్ బూటకమని, సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరపాలని, దోషులను శిక్షించాలని అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులను మావోయిస్టులు టార్గెట్ చేసుకున్న నేపథ్యంలో తమకు చెప్పకుండా ఎలాంటి కార్యక్రమాలకు హాజరు కావద్దని పోలీసులు మూడు జిల్లాల నాయకులకు సూచించారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ విభాగం సైతం హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో పర్యటించాలంటే తమకు ముందస్తు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ, భయాందోళనలు నెలకొన్నాయి. సరిహద్దు మండలాల్లోని ప్రజల్లోనూ టెన్షన్ నెలకొంది. రవాణా వ్యవస్థపైనా ప్రభావం... ప్రతీకారేచ్ఛతో ఉన్న మావోయిస్టులు విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో మొదట ఈ ప్రభావం రవాణా వ్యవస్థపై పడింది. గత అర్ధరాత్రి హైదరాబాద్ డిపోకు చెందిన బస్సులను, మూడు లారీలను, ఒక ట్రాక్టరు, ఒడిశాకు చెందిన మరో ప్రైవేటు బస్సును తగులబెట్టడంతో అంతర్రాష్ట్ర రవాణాపై పూర్తిగా ప్రభావం పడింది. టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను పరిమితం చేసింది. రాత్రి సర్వీసులు రద్దు చేశాం ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు విధ్వంసక చర్యల్లో భాగంగా హైదరాబాద్ డిపో బస్సులను తగులబెట్టారు. ఈ నెల 9న బంద్‌కు పిలుపునిచ్చినట్లు సమాచారం వచ్చింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బస్సు సర్వీసులను పరిమితం చేశాం. అంతర్రాష్ట్ర సర్వీసులను రద్దు చేశాం. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్, బైలడిల్ల వెళ్లే బస్సులను కుంట వరకే నడుపుతున్నాం. పోలీసుల సూచనల మేరకు కొన్ని సర్వీసులను పరిమితం చేయడంతో పాటు, రాత్రి వేళల్లో తిప్పే సర్వీసులను రద్దు చేశాం. ఏటూరునాగారం, వెంకటాపురం రూట్లలో వెళ్లే రాత్రి సర్వీసులు రద్దు చేయడంతో పాటు ఉదయం నడిచే బస్సులకు అవసరాన్ని బట్టి భద్రత తీసుకుంటున్నాం. – నామ నరసింహ, ఆర్టీసీ భద్రాచలం డిపో మేనేజర్ -
నేతల్లో దడ!
సాక్షి, కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దాటి వచ్చి రాష్ట్రంలో గత మూడు నెలలుగా కార్యకలాపాలు ముమ్మరం చేస్తున్న మావోయిస్టులకు తాజా ఎన్‌కౌంటర్‌తో భారీ దెబ్బ తగిలింది. వారి కార్యకలాపాలను ఆదిలోనే అడ్డుకునేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం దండకారణ్యాన్ని జల్లెడ పడుతోంది. అయినా మావోయిస్టులు గోదావరి పరీవాహక ప్రాంతం ద్వారా మరిన్ని జిల్లాల్లోకి విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కూంబింగ్ వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో మావోయిస్టులను నిలువరించేందుకు పోలీసులు మరింత వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అయితే ప్రస్తుత ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన ప్రకటనతో మరింత టెన్షన్ నెలకొంది. దీంతో సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ రాజ్యమేలుతోంది. గిరిజన గూడేలతోపాటు ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దులో ఉన్న భద్రాచలం, పినపాక, ములుగు నియోజకవర్గాల పరిధిలోని టీఆర్ఎస్ నాయకులు హడలిపోతున్నారు. అధికార పార్టీ నేతలే టార్గెట్ అని జగన్ ప్రకటించడంతో వారిలో అలజడి రేకెత్తుతోంది. మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా పోలీసులు.. మూడేళ్లుగా తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు నామమాత్రమే. ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలోకి చొచ్చుకొచ్చేందుకు మావోయిస్టు అగ్రనేతలే నేరుగా భద్రాద్రి, భూపాలపల్లి జిల్లాల సరిహద్దులోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల్లోని దండకారణ్యాన్ని షెల్టర్‌జోన్‌గా చేసుకుని తెలంగాణ ప్రాంతంలో కార్యకలాపాలు విస్తరిస్తున్నట్లు తెలిసింది. భద్రాచలం, పినపాక, ఏటూరు నాగారం ఏజెన్సీల్లో రిక్రూట్మెంట్లు సైతం భారీగా చేసుకుంటున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ పోలీసులతో కలిసి భారీగా కూంబింగ్ ఆపరేషన్లు చేపడుతున్నారు. మావోయిస్టు పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తున్న అగ్రనేతలే లక్ష్యంగా పోలీస్ బలగాలు ముందుకు కదులుతున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు రెండు రాష్ట్రాల్లో పలు విధ్వంసక చర్యలకు పాల్పడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్‌లపై దాడులకు పాల్పడడంతో అనేకసార్లు మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఛత్తీస్‌గఢ్‌తో పాటు చర్ల, వెంకటాపురం, పినపాక మండలాల్లో పలువురు పౌరులను హత్యచేశారు. రెండు రాష్ట్రాల్లో పలు విధ్వంసాలకు పాల్పడ్డారు. వారిని అడ్డుకునే యత్నాల్లో భాగంగా తాజా ఎన్కౌంటర్ చోటు చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఆపరేషన్ మొత్తం భద్రాచలం నుంచి జరగడంతోపాటు తెలంగాణ పోలీసులు కీలకపాత్ర పోషించడంతో మావోయిస్టు పార్టీ నేరుగా ప్రకటన చేసింది. ఇకపై అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారపార్టీ నాయకులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిహద్దులో మరింత ఉద్రిక్తం... బీజాపూర్ జిల్లాలో తడపలగుట్ట అడవుల్లో మావోయిస్టులు పెద్దఎత్తున సమావేశమైనట్లు పక్కా సమాచారం అందడంతో పోలీస్ బలగాలు వేగంగా ముందుకు కదిలాయి. ఆ ప్రాంతంలో 150 నుంచి 200 మంది వరకు మావోయిస్టులు ఉన్నారని, అందులో అగ్రనేతలు ఉంటారనే లక్ష్యంతో గ్రేహౌండ్స్ బలగాలు చుట్టుముట్టడంతో ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. మిగిలిన మావోయిస్టు సభ్యులు, అగ్రనేతలు ఆ ప్రాంతాల్లోనే ఉన్నట్లు పోలీసులు ఇప్పటికీ భావిస్తూ అదనపు బలగాలను దింపి దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. దీంతో సరిహద్దు జిల్లాల్లో ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. ఏజెన్సీ ప్రాంత నేతల్లో మరింత దడ... మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ప్రకటన నేపథ్యంలో వారు ప్రతీకార చర్యలకు దిగడం ఖాయమని భావిస్తున్న టీఆర్ఎస్ నేతల్లో మరింత దడ నెలకొంది. ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు, పినపాక నియోజకవర్గంలోని పినపాక, కరకగూడెం, అశ్వాపురం మండలాల నాయకులు భయంతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. -
కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ఎన్కౌంటర్లో మృతి
ఛండీగడ్: కరడుగట్టిన పంజాబ్ గ్యాంగ్‌స్టర్ విక్కీ గౌండర్, అతని సహచరుడు ప్రేమ్ లాహోరియాలు పంజాబ్-రాజస్థాన్ సరిహద్దులో పోలీస్ ఎన్కౌంటర్లో మృతిచెందారు. గౌండర్ నవంబర్, 2016 నుంచి పరారీలో ఉన్నాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న పంజాబ్‌లోని నాభా సెంట్రల్ జైలు నుంచి గౌండర్‌తో పాటు మరో ఐదుగురు 2016లో తప్పించుకున్నారు. వీరిలో ఇద్దరు ఉగ్రవాదులు కూడా ఉన్నారు. తప్పించుకున్న కొద్ది నెలల్లోనే మిగతా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు కానీ గౌండర్ మాత్రం పట్టుబడలేదు. విక్కీ గౌండర్ అసలు పేరు హర్జీందర్ భుల్లార్. విక్కీ గౌండర్ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాధల్ స్వస్థలమైన లాంబిలోని సారావాన్ బోడ్లా గ్రామవాసి. మరో కరడుగట్టి నేరస్తుడు సుఖా కహ్లావాన్‌ను ఓ కేసు విషయమై పోలీసులు కోర్టుకు తీసుకువెళ్తుండగా ఆయనపై 2015లో దాడి చేసిన వారిలో ప్రధాన నిందితుడిగా విక్కీగౌండర్‌ను పోలీసులు అనుమానిస్తున్నారు. విక్కీ గౌండర్, ఆయన అనుచరులు జైలు నుంచే దందాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
అయ్యయ్యో... బాలుడు అన్యాయంగా!!
సాక్షి, మధుర (ఉత్తర ప్రదేశ్): పోలీసులకు, దొంగల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో అభంశుభం తెలియన ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మోహన్‌పుర ప్రాంతంలో కొందరు దొంగలు భారీ దొంగతనానికి పాల్పడ్డారు. స్థానికులు అందించిన సమాచారంతో దొంగలను పట్టుకునేందుకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసుల రాక గుర్తించి.. అక్కడనుంచి పారిపోయేందుకు దొంగలు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు, దొంగలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో అదే ప్రాంతంలో ఆడుకుంటున్న ఎనిమదేళ్ల మాధవ్ అనే బాలుడికి తూటాలు నేరుగా తాకాయి. దీంతో బాలుడు అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. బాలుడు గురించి జనాలు గట్టిగా కేకలు వేయడంతో ఇటు పోలీసులు, అటు దొంగలు అక్కడనుంచి పారిపోయారు. ఈ ఘటనకు సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ స్వప్నిల్ మాంగి బాధ్యత వహించాలని మాధవ్ బంధువులు చెబుతున్నారు. దొంగలను పట్టుకోవాలన్న ఆతృతతో పరిసరాలను పోలీసులు ఏ మాత్రం పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. మాధవ్ మృతిపట్ల చింతిస్తున్నామని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందాల్సివుందన్నారు. -
పాక్ బద్ధ శత్రువు.. ఒప్పందాలు ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : యూరీ ఘటనకు ప్రతీకారంగా భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ అంశాన్ని మళ్లీ కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చి ఆరోపణలు గుప్పించింది. అదంతా ఓ పెద్ద డ్రామాగా అభివర్ణిస్తోంది. పుల్వామా ఎన్కౌంటర్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘విజయవంతంగా సర్జికల్ స్ట్రైక్స్ చేశామని ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ, ఇప్పుడు జరిగిన పుల్వామా ఎన్కౌంటర్ అదంతా డ్రామాగా తేల్చేసింది. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ కట్టిడి చేసేందుకు ఈ ప్రభుత్వం చేపడుతున్న చర్యలేవీ సత్ఫలితాలను ఇవ్వటం లేదు. పైగా పాకిస్థాన్ బద్ధ శత్రువంటూ ఓ వైపు ప్రకటనలు ఇస్తూ.. మరోవైపు వారితో చర్చలు, ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకు? బీజేపీ హయాంలో దేశ రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు’’ అంటూ దీక్షిత్ పేర్కొన్నారు. కాగా, అవంతిపూర్ సెంటర్ ట్రైనింగ్ వద్ద శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు అమరులు కాగా, ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు దాగున్నారేమోనన్న అనుమానంతో తనిఖీలు చేపట్టినట్లు సీఆర్పీఎఫ్ స్పెషల్ డీజీ ఎస్ఎన్ శ్రీవాస్తవ తెలిపారు. -
ఎన్కౌంటర్ల పేరిట చంపుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీలను పోలీసులు చిత్రహింసలకు గురిచేసి బూటకపు ఎన్కౌంటర్లలో చంపుతున్నారని పలువురు వక్తలు ఆరోపించారు. 37, 38, 39 అధికరణల ప్రకారం సంక్రమించిన సమానహక్కులను కూడా హరిస్తున్నారని విమర్శించారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం(ఎస్వీకే)లో ‘రాజ్యహింస – ప్రతిఘటన’ అనే అంశంపై సదస్సు జరిగింది. వివిధ ఎన్కౌంటర్లలో చనిపోయిన బాధిత కుటుంబసభ్యులు సదస్సులో విలపించారు. టీఆర్ఎస్ పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని, మేకతోలు కప్పుకున్నవారిలాగా పాలకులున్నారని, వారిపట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దానిపై న్యాయవిచారణ జరిపించాలని పేర్కొన్నారు. టేకులపల్లి ఎన్కౌంటర్ ప్రభుత్వ హత్యేనని, దళసభ్యుల్ని ముందే పట్టుకుని, చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని విరసం నేత వరవరరావు ఆరోపించారు. పోలీసుల అదుపులో ఇంకా ముగ్గురున్నారని, వారికి ప్రాణహాని ఉన్నందున వెంటనే కోర్టులో హాజరుపర్చాలని అన్నారు. పాలకులుగా ఎవరున్నా హింస ఆగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం వస్తే మావోయిస్టుల ఎజెండానే తమ ఎజెండా అని ప్రకటించిన సీఎం కేసీఆర్ తెలంగాణలో రక్తపుటేరులు పారిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. బూటకపు ఎన్కౌంటర్లలో చనిపోయినవారిలో 95 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలేనని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. టేకులపల్లి ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. సభలు, సమావేశాలకు అనుమతివ్వకుండా ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, విమలక్క, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, జి.ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. సభలో గందరగోళం... సభాప్రాంగణంలో సీపీబాట పేరుతో కరపత్రాలను పంచిపెట్టడం వివాదాస్పదమైంది. వాటిలో న్యూడెమోక్రసీపై విమర్శలుండటంతో ఆ పార్టీ రాష్ట్ర నేత పోటు రంగారావు అభ్యంతరం తెలిపారు. సభకు మద్దతు తెలపడానికి వచ్చిన తమ పార్టీకి వ్యతిరేకంగా కరపత్రాలు పంచడం ఏంటని ప్రశ్నించడంతో కాసేపు గందరగోళం నెలకొంది. -
జైషే టాప్ కమాండర్ హతం
శ్రీనగర్: ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్(జేఈఎం)కు గట్టిదెబ్బ తగిలింది. కశ్మీర్లో ఆ సంస్థ పుంజుకోవడంలో కీలక పాత్ర పోషించిన టాప్ కమాండర్ నూర్ మహమ్మద్ తంత్రయ్(47)ను భద్రతా బలగాలు హతమార్చాయి. పుల్వామా జిల్లాలోని సాంబూరాలో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఎన్కౌంటర్లో తంత్రయ్ మృతి చెందినట్లు కశ్మీర్ పోలీసులు చెప్పారు. అతని అనుచరులుగా భావిస్తున్న మరో ఇద్దరు విదేశీ ఉగ్రవాదులు పారిపోయారు. ఘటనా స్థలం నుంచి తంత్రయ్ మృతదేహంతో పాటు ఒక ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ చెప్పారు. భద్రతా బలగాల వాహనశ్రేణిపై దాడిచేయడానికి కొందరు ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నారన్న సమాచారం అందడంతో అప్రమత్తమయ్యామని తెలిపారు. సాంబూరాలో అనుమానిత ఇళ్లనన్నింటిని తనిఖీచేస్తుండగా ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుందని తెలిపారు. శ్రీనగర్‌లో బీఎస్ఎఫ్ క్యాంప్‌పై దాడి తదితర ఘటనల్లో తంత్రయ్ హస్తముందని వైద్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నమే తంత్రయ్ మృతదేహాన్ని అతని సొంత గ్రామం త్రాల్లో ఖననం చేశారు. 2001లో పార్లమెంట్‌పై జరిగిన దాడిలో సూత్రధారి ఘాజి బాబాకు అత్యంత సన్నిహితుడైన తంత్రయ్ 2003లో ఓ కేసులో దోషిగా తేలడంతో శ్రీనగర్‌లో జైలు శిక్ష అనుభవించాడు. 2015లో పెరోల్‌పై బయటికొచ్చాడు. అప్పటి నుంచి సొంతూరు త్రాల్లోనే ఉంటూ జైషే మహమ్మద్ విస్తరణకు కృషిచేశాడు. ఈ ఏడాది జూలైలో ఆరిపాల్ ఎన్కౌంటర్లో ముగ్గురు జేఈఎం ఉగ్రవాదులు హతమైన తరువాత అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జమ్మూ కశ్మీర్ పోలీసులు తంత్రయ్ కోసం నిఘా పెంచారు. పొట్టివాడేగానీ... అతని ఎత్తు కేవలం నాలుగు అడుగుల 2 అంగుళాలు. కాలు సరిగా పనిచేయదు. కర్ర లేకుండా నడవలేడు. ఇన్నాళ్లూ తన తెలివితేటలతో తప్పించుకున్నాడు. కశ్మీర్లో పలు ఉగ్ర దాడుల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాలుపంచుకుని భద్రతా బలగాలకు కొరకరాని కొయ్యగా మారాడు తంత్రయ్. అక్టోబర్ 3న శ్రీనగర్ విమానాశ్రయం బయట బీఎస్ఎఫ్ శిబిరంపై, సెప్టెంబర్ 21న కశ్మీర్ మంత్రి నయీమ్ కాన్వాయ్‌పై జరిగిన దాడుల సూత్రధారి ఇతనే అని భావిస్తున్నారు. ‘గతంలో పలుమార్లు తంత్రయ్ త్రుటిలో తప్పించుకున్నాడు. పొట్టిగా ఉండటం వల్లే ఏదో ఒకరోజు తప్పకుండా చిక్కుతాడనుకున్నాం’ అని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. భద్రతా బలగాల నుంచి తప్పించుకోవడానికి ఉగ్రవాదులు జనంలో కలసిపోతారు. తంత్రయ్కు ఆ చాన్స్ లేదు. ప్రజల్లో కలసిపోయినా తన ఎత్తు, అంగవైకల్యం కారణంగా సులువుగా దొరికిపోతాడని పోలీసులు భావించారు. 25వతేదీ రాత్రి అతను దాక్కున్న ఇంటిని భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో అక్కడి నుంచి పారిపోలేకపోయాడు. -
భద్రాద్రిలో భారీ ఎన్కౌంటర్
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. జిల్లాలోని టేకులపల్లి మండలం చింతోనిచెలక–మేళ్లమడుగు గ్రామా ల శివార్లలోని కోడెవాగు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో 8 మంది మావోయి స్టులు మృతిచెందారు. వీరిని సీపీఐ(ఎంఎల్) చండ్ర పుల్లారెడ్డి బాట దళానికి చెందినవారిగా గుర్తించారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇది భారీ ఎన్కౌంటర్ కావడం గమనార్హం. పక్కా సమాచారంతో.. టేకులపల్లి మండలంలోని కోడెవాగు వద్ద 16 మంది సాయుధ మావోయిస్టులు సంచరిస్తు న్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. దాంతో బోడు ఎస్సై అనిల్ గురు వారం తెల్లవారుజామున తన బృందంతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఎన్‌కౌం టర్ జరిగింది. గాలింపు సందర్భంగా మావో యిస్టులు కనబడటంతో లొంగిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించారని.. కానీ మావో యిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారని భద్రాద్రి కొత్త గూడెం ఎస్పీ అంబర్‌కిషోర్ ఝా చెప్పారు. దీంతో 8 మంది మావోయిస్టులు మృతి చెందా రని, మరికొందరు తప్పించుకుని ఉంటారని తెలిపారు. ఘటనా స్థలంలో ఒక ఎస్ఎల్ఆర్ తుపాకీ, మూడు 8 ఎంఎం రైఫిల్స్, రెండు ఎస్బీబీఎల్ తుపాకులతో పాటు కిట్ బ్యాగు లు, టార్పాలిన్లు, వాటర్ జర్కిన్లు, విప్లవ సాహిత్యం లభించినట్లు వెల్లడించారు. దళం ఏర్పాటై ఐదు నెలలే.. సీపీఐ (ఎంఎల్) చండ్ర పుల్లారెడ్డి బాట (సీపీ బాట) వామపక్ష దళం ఈ ఏడాది జూలై 24వ తేదీనే ఏర్పాటైంది. వివిధ వామపక్ష తీవ్రవాద పార్టీల్లో పనిచేసినవారు కలసి దీన్ని స్థాపిం చారు. ఈ దళంలో 18 నుంచి 20 మంది వరకు సభ్యులున్నట్లు తెలుస్తోంది. వీరు బెదిరిం పులు, వసూళ్లకు పాల్పడుతుండడంతో పోలీ సులు గట్టి నిఘా పెట్టినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో దళానికి చెందిన షేర్ మధుతో పాటు ముగ్గురు సభ్యులు లొంగిపోయారు. మరో సభ్యుడిని పాల్వంచ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఎనిమిది మంది మృతి చెందగా.. ఇంకా 6 నుంచి 8 మంది వరకు సభ్యులున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అంతా 35 ఏళ్లలోపు వారే.. గురువారం ఎన్కౌంటర్లో మృతి చెందిన ïసీపీఐ(ఎంఎల్) చండ్ర పుల్లారెడ్డి బాట దళ సభ్యులంతా 35 ఏళ్లలోపువారే. వీరిలో ఏడు గురిని గుర్తించారు. వారి వివరాలివీ... ♦ సీపీ బాట దళ కమాండర్‌గా వ్యవహరించిన ఎట్టి కుమార్ (35) అలియాస్ శ్రీను అలియాస్ రాఖీ భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మర్రిగూడేనికి చెందినవారు. గతంలో సీపీఐలో పనిచేసి వార్డు సభ్యుడిగా చేశాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు న్నారు. ఆరేళ్ల కింద ఇల్లు వదిలి వెళ్లిపోయిన కుమార్‌పై నాలుగు కేసులున్నాయి. ♦మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ధర్మారావుపేటకు చెందిన జక్కటి ప్రవీణ్‌కుమార్ (24) అలియాస్ ఆజాద్ 20 రోజుల కిందే ఈ దళంలో చేరాడు. ఆయన భూపాలపల్లి జిల్లా మంగపేట ఏరియా బాధ్యతలు చూస్తున్నట్లు తెలుస్తోంది. ♦భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన నూనావత్ అర్జున్ (22) అలియాస్ నవీన్ ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. కొంతకాలం అశ్వాపురం మండలం గొందిగూడెంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేశాడు. మూడు నెలల కింద సీపీబాట దళంలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ♦ మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామానికి చెందిన బోయిన ఓంప్రకాశ్ (22) అలియాస్ గణేశ్ ఆర్ఎంపీగా పనిచేసేవాడు. ఆయన సోదరుడు ఐలయ్య గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయారు. ఓంప్రకాశ్ కూడా గతంలో పీడీఎస్‌యూలో పనిచేశాడు. ఆరునెలల కింద సీపీ బాట దళంలో చేరాడు. ♦భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కొడవటంచ గ్రామానికి చెందిన ఈసం నరేశ్ (30) అలియాస్ సుదర్శన్ ప్రముఖ ఎన్డీ నేత బాటన్న మనవడు. 2004లో జనశక్తి నుంచి విడిపోయిన సీపీయూఎస్ఐలో పనిచేశాడు. తర్వాత సీపీఐ అనుబంధ ఏఐఎస్ఎఫ్లో పని చేశాడు. ఈ క్రమంలో పలువురి నుంచి వసూళ్లకు పాల్పడుతూ అరెస్టయ్యాడు. సీపీ బాట దళంలో వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నాడు. ♦భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుం డాల మండల కేంద్రానికి చెందిన తిరుకుల్లూరి మధు (35) గతంలో సీపీయూఎస్ఐలో పనిచేశాడు. 2006లో బయటకు వచ్చేశాడు. గుండాలలో వెల్డింగ్ షాపు నడుపుతూ కాలం వెల్లదీశాడు. సీపీ బాట దళం ఆవిర్భావ సమయంలో అందులో చేరాడు. ♦ టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామా నికి చెందిన గాడిదల శ్రీను. (ఈయనను బంధువులు గుర్తించారు. పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు). మరో దళ సభ్యుడికి సంబంధించిన వివరాలు తెలియలేదు. ఎన్కౌంటర్ బూటకం తెలంగాణ ఉద్యమ సమయంలో నక్సలైట్ల ఎజెండానే తన ఎజెండా అని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రజా గాయకుడు గద్దర్ విమర్శించారు. కోడెవాగు ఎన్కౌంటర్ బూటకమని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు గుమ్మడి నర్సయ్య, ఇల్లెందు జెడ్పీటీసీ చండ్ర అరుణ పేర్కొన్నారు. ఏజెన్సీలోని ఖనిజ సంపదను దోచుకునేందుకు ప్రభుత్వం ప్రజలను ఈ విధంగా భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. – గద్దర్, గుమ్మడి నర్సయ్య -
మసూద్ సోదరుడి కొడుకు హతం
శ్రీనగర్/న్యూఢిల్లీ: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజర్‌కు సోదరుడి కొడుకు తల్లా రషీద్ కశ్మీర్లో ఎన్కౌంటర్లో హతమయ్యాడు. 1999లో ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లడం తెలిసిందే. ఈ హైజాక్ కుట్రకు సూత్రధారిగా వ్యవహరించిన అబ్దుల్ రౌఫ్ కొడుకే తల్లా రషీద్. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఎన్కౌంటర్లో తల్లా రషీద్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. అమెరికా తయారు చేసిన, పాకిస్తానీ ప్రత్యేక దళాలు ఉపయోగించే ఎం4 రైఫిల్, రెండు ఏకే–47 తుపాకులను ఎన్కౌంటర్ స్థలం నుంచి భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఆర్మీకి చెందిన ఓ సైనికుడు కూడా మరణించాడు. హతమైన ముగ్గురు ఉగ్రవాదులను మహ్మూద్ భాయ్ (దక్షిణ కశ్మీర్లో జైషే కమాండర్), వసీం అహ్మద్, తల్లా రషీద్‌గా గుర్తించామని అధికారులు చెప్పారు. వీరిలో మహ్మూద్ భాయ్, తల్లా రషీద్‌లు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు. మసూద్ అజర్ సోదరుడి కొడుకు తల్లా రషీద్ ఎన్కౌంటర్లో మరణించాడంటూ జైషే అధికార ప్రతినిధి స్థానిక వార్తా సంస్థలకు ప్రకటనలు పంపాడు. రషీద్‌ను తమ వాడిగా చెప్పుకున్నందుకు జైషేకు ధన్యవాదాలు తెలియజేసిన ఐజీ మునీర్ ఖాన్...ఉగ్రవాదుల మృతదేహాలను తీసుకెళ్లాల్సిందిగా పాకిస్తాన్‌కు సందేశం పంపుతామని చెప్పారు. ఎం4 రైఫిళ్లను పాకిస్తాన్ ప్రత్యేక బలగాలు ఉపయోగిస్తాయనీ, వారే వీటిని జైషే ఉగ్రవాదులకు ఇచ్చి ఉంటారని హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి చెప్పారు. రూ.36.5 కోట్ల పాత నోట్ల జప్తు ఉగ్రవాదులకు నిధుల చేరవేత కేసుకు సంబంధించి జరుపుతున్న విచారణలో భాగంగా రూ.36.5 కోట్ల విలువైన పాత రూ.500, రూ.వెయ్యి కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం వెల్లడించింది. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌కు దగ్గర్లోని ఓ ప్రదేశంలో సోమవారం ఈ నోట్లు దొరికినట్లు అధికారులు చెప్పారు. -
సంబూర ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్ల మృతి
శ్రీనగర్ : సరిహద్దులో మరోసారి ఉగ్రవాదులు చెలరేగిపోయారు. పుల్వామా జిల్లాలోని సంబూర గ్రామంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. ఘటనలో ఓ ఉగ్రవాది కూడా హతం అయ్యాడు. ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నారని పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు గురువారం సాయంత్రం గ్రామానికి చేరుకున్న భద్రతా దళాలు వారి కోసం గాలించాయి. వారిని గమనించిన ముష్కరలు కాల్పులు మొదలుపెట్టాయి. దీంతో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఎదురు దాడి ప్రారంభించిన సైనికులు ఓ ఉగ్రవాదిని కాల్చి చంపాయి. చికిత్స పొందుతూ జవాన్లు ప్రాణాలు విడిచినట్లు అధికారులు వెల్లడించారు. చనిపోయిన ఉగ్రవాదిని జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన బాబర్‌గా గుర్తించారు. చీకట్లో మరో ఇద్దరు ఉగ్రవాదులు పరారైనట్లు భావించిన పోలీసులు.. వారి కోసం తనీఖీలు చేపట్టారు. చివరకు వారు దొరక్కపోవటంతో నేటి ఉదయం ఆపరేషన్ ముగిసినట్లు ప్రకటించారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు మావోల ఎన్కౌంటర్
రాజ్‌నంద్‌గావ్: ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇండో–టిబెటన్ సరిహద్దు పోలీస్ (ఐటీబీపీ), జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పక్కా సమాచారం ప్రకారం ఖద్‌గావ్ గ్రామ శివార్లలో కూంబింగ్ జరుపుతుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో పల్లెమాడి స్థానిక కార్యక్రమాల బృందం (ఎల్వోఎస్) కమాండర్ రాకేశ్ దుగ్గ, డిప్యూటీ కమాండర్ రంజిత్ నురేటితోపాటు మరో మావోయిస్టు మహేశ్ పోతావి హతమైనట్లు పోలీసులు తెలిపారు. 2009లో 29 మంది సీఆర్పీఎఫ్ పోలీసులను చంపిన కేసులో రాకేశ్, రంజిత్ కీలకంగా వ్యవహరించారని భావిస్తున్నారు. ఘటనాస్థలం నుంచి భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఆత్మరక్షణలో బాబు సర్కారు
శేషాచలం ‘ఎన్కౌంటర్’పై అధికారుల మల్లగుల్లాలు మృతుల గత చరిత్ర తెలుసుకోవడానికి ప్రాధాన్యం నేడు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్న డీజీపీ ఎన్‌కౌంటర్‌పై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష పరిహారం అవసరం లేదన్న హోంమంత్రి చినరాజప్ప సాక్షి, హైదరాబాద్: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది!. ఒకపక్క తమిళనాడు ప్రభుత్వం, మరోపక్క మానవ హక్కుల సంఘాల నుంచి ఎదురవుతున్న నిరసనల నేపథ్యంలో వీటిని ఎదుర్కోవడంపై చంద్రబాబు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. తమిళనాడులో నిరసనలు ముదురుతుండడంతో నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. ఎన్కౌంటర్ అంశానికి సంబంధించి శుక్రవారం హైకోర్టులో డీజీపీ కౌంటర్ దాఖలు చేయాలి. దీంతో పోలీసు ఉన్నతాధికారులతో పాటు న్యాయనిపుణులు, సలహాదారులతో గురువారం ఇక్కడ సమావేశం నిర్వహించారు. ఎన్‌కౌంటర్‌పై తమిళనాడులో వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం 8 మంది ఉన్నతాధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ అంశంపై పోలీసులు, విచారణ అధికారులు రూపొందించే రికార్డులన్నీ పక్కాగా ఉండాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. మరోపక్క ఎన్కౌంటర్ మృతుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కావడంతో వారిలో ఎవరైనా గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో నిందితులుగా ఉండటం, అరెస్టు కావడం జరిగిందా? అనే విషయాలను కూడా ఆరా తీస్తున్నారు. హైకోర్టులో కౌంటర్ దాఖలు సమయంలోనే ఎర్రచందనానికి విదేశాల్లో ఉన్న డిమాండ్, శేషాచలం కేంద్రంగా జరుగుతున్న అక్రమ రవాణా, దీని కట్టడికి పోలీసు, అటవీశాఖ అధికారులు తీసుకున్న చర్యలు, స్మగ్లర్లు, కూలీల దాడులు, మరణించిన, క్షతగాత్రులైన అటవీ శాఖ సిబ్బంది తదితర వివరాలనూ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. శేషాచలం ఎన్కౌంటర్ తదనంతర పరిణామాలు, హైకోర్టులో దాఖలు చేయాల్సిన కౌంటర్ అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని సీఎం ఆదేశించారు. తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం రాసిన లేఖకు శుక్రవారం సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదంతంపై నిష్పాక్షికంగా మెజిస్టీరియల్ విచారణ జరుపుతున్నామని ఈ లేఖలో పేర్కొనే అవకాశం ఉంది. సమీక్ష సమావేశంలో పాల్గొన్న అటవీ శాఖ అధికారులు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉన్న అటవీ చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, దీనిపై కేంద్రానికి లేఖ రాశామని సీఎంకి వివరించినట్టు తెలిసింది. డీజీపీ రాముడు గురువారం సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనూ విడివిడిగా భేటీ అయ్యారు. తమిళనాడుకు ప్రత్యేక బృందాలు ఎన్కౌంటర్లో చనిపోయిన 20 మంది నేర చరిత్రపై దర్యాప్తు చేస్తున్నట్టు డీజీపీ రాముడు పేర్కొన్నారు. దీనికోసం తమిళనాడులోని ధర్మపురి, సేలం, తిరువణ్నామలై జిల్లాలకు పోలీ సు బృందాలను పంపినట్టు తెలిపారు. మృతు ల్లో ఒకడైన తిరువణ్నామలై జిల్లా మేళకుప్సనూరుకు చెందిన జి.రాజేంద్రన్‌పై 2013లో ఎర్రచందనం అక్రమ రవాణా కేసు నమోదైనట్టు వెలుగులోకి వచ్చిం దన్నారు. పరిహారం అవసరం లేదు: చినరాజప్ప సీఎం సమీక్ష అనంతరం హోం శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. ఎన్కౌంటర్లో మృతిచెందింది తమిళనాడు వారు కాబట్టి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం రాసిన లేఖకు త్వరలోనే సమాధానం ఇస్తామన్నారు.