సాక్షి, మధుర (ఉత్తర ప్రదేశ్): పోలీసులకు, దొంగల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో అభంశుభం తెలియన ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మోహన్‌పుర ప్రాంతంలో కొందరు దొంగలు భారీ దొంగతనానికి పాల్పడ్డారు. స్థానికులు అందించిన సమాచారంతో దొంగలను పట్టుకునేందుకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసుల రాక గుర్తించి.. అక్కడనుంచి పారిపోయేందుకు దొంగలు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు, దొంగలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ సమయంలో అదే ప్రాంతంలో ఆడుకుంటున్న ఎనిమదేళ్ల మాధవ్ అనే బాలుడికి తూటాలు నేరుగా తాకాయి. దీంతో బాలుడు అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. బాలుడు గురించి జనాలు గట్టిగా కేకలు వేయడంతో ఇటు పోలీసులు, అటు దొంగలు అక్కడనుంచి పారిపోయారు.
ఈ ఘటనకు సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ స్వప్నిల్ మాంగి బాధ్యత వహించాలని మాధవ్ బంధువులు చెబుతున్నారు. దొంగలను పట్టుకోవాలన్న ఆతృతతో పరిసరాలను పోలీసులు ఏ మాత్రం పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. మాధవ్ మృతిపట్ల చింతిస్తున్నామని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందాల్సివుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment