
మీరట్: ప్రియుడి మోజులో పడి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ వెలుగుచూసింది. భర్త హత్య అనంతరం.. ప్రియుడితో కలిసి ఆమె విహారయాత్రకు వెళ్లింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ కేసులో మృతుడి కూతురు చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ హత్యను ఆమె చూసి ఉండవచ్చని తెలుస్తోంది.
మీరట్‌కు చెందిన మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్యకు సంబంధించి తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యను మృతుడి ఆరేళ్ల కుమార్తె చూసి ఉంటుందని సమాచారం. తన తండ్రి డ్రమ్ములో ఉన్నాడని ఆ పాప చుట్టుపక్కల వారికి చెప్పినట్లు తెలిసింది. ఈ మేరకు మృతుడి తల్లి ఈ విషయాలను వెల్లడించారు. ‘నాన్న డ్రమ్ములో ఉన్నాడు’ అని ఆ చిన్నారి పొరుగింటి వారికి పదే పదే చెప్పడం గమనించిన ముస్కాన్ బాలికను వేరే చోటుకు పంపించేసింది’ అని సౌరభ్ తల్లి రేణు దేవీ ఆవేదన వ్యక్తంచేశారు.
సౌరభ్ తల్లి రేణు దేవీ మీడియాతో మాట్లాడుతూ.. నా కుమారుడు సౌరభ్‌ను అతడి భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు కలిసి హత్య చేశారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ట్రిప్‌కు వెళ్లారు. తిరిగొచ్చిన తర్వాత మరమ్మతుల కోసం వారు ఉంటున్న ఇంటి యజమాని కూలీలను తీసుకొచ్చారు. ఇంట్లో ఉన్న డ్రమ్మును వారు పైకి ఎత్తలేకపోయారు. దీంతో, లోపల ఏముందని అడిగితే చెత్తాచెదారం అని ముస్కాన్ చెప్పిందట. అనుమానం వచ్చి మూత తీయగా లోపల నుంచి దుర్వాసన వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు.
#WATCH | Meerut, UP | Saurabh Rajput Murder case | Mother of deceased Saurabh Rajput says, "They (Muskan and her partner Sahil) murdered my son, and after that she went for a trip...She locked the body in the room...the owner of the house had asked them (Saurabh and Muskan) to… https://t.co/QyeUSKIwcu pic.twitter.com/hgs3tLfMsk
— ANI (@ANI) March 19, 2025
అయితే, పోలీసులు వచ్చేలోపే మా కోడలు అక్కడి నుంచి తన పుట్టింటికి వెళ్లిపోయింది. మా ఆరేళ్ల మనవరాలికి కూడా హత్య విషయం తెలిసే ఉంటుంది. చిన్న పాప పదే పదే.. ‘నాన్న డ్రమ్ములో ఉన్నాడు’ పొరుగింటి వారికి చెప్పింది. అది గమనించిన ముస్కాన్.. పాపను వేరే చోటకు పంపించేసింది’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
డ్రమ్ములో మృతదేహం..
సౌరభ్ రాజ్‌పుత్(29), ముస్కాన్(27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సౌరభ్ మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత ముస్కాన్‌కు సాహిల్(25)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. సౌరభ్ ఉద్యోగం మానేసి లండన్‌కు వెళ్లి ఓ బేకరీలో పనిచేసేవాడు. గత నెల కుమార్తె పుట్టిన రోజు కోసం అతడు ఇండియాకు వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్.. ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికారు. శరీర భాగాలను ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో దాచిపెట్టి పైన సిమెంటుతో కప్పిపెట్టారు.
మా కుమార్తెను ఉరితీయండి..!
నిందితులు ముస్కాన్, సాహిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా చేసిన దారుణాన్ని వారు అంగీకరించారు. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. కాగా, భర్తను హత్య చేసిన తమ కుమార్తెకు ఉరిశిక్ష విధించాలని ముస్కాన్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కోటీశ్వరుడైన సౌరభ్ తమ కుమార్తెను ఎంతగానో ప్రేమించాడని, అతడిని తల్లిదండ్రులకు దూరం చేసిన ముస్కాన్‌ను కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు.

Comments
Please login to add a commentAdd a comment