Meerat
-
మార్కులు చూసి మూర్చబోయిన విద్యార్థి.. ఐసీయూలో చేరిక
మీరట్: పదో తరగతి పరీక్షల్లో తనకు వచ్చిన మార్కులు చూసి మూర్చపోయి ఐసీయూలో చేరాడో విద్యార్థి. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థి తనకు బోర్డు పరీక్షల్లో చెప్పుకోదగ్గ 93.5 శాతం మార్కులు రావడంతో ఉప్పొంగిపోయాడు. రిజల్ట్స్ చూసి కుప్పకూలిపోవడంతో ఐసీయూలో చేర్చవలసి వచ్చింది.ఉత్తర ప్రదేశ్ బోర్డ్ హైస్కూల్ లేదా 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఫలితాలను శనివారం ప్రకటించింది. 10వ తరగతి విద్యార్థులు 89.55 శాతం ఉత్తీర్ణత సాధించగా, 12వ తరగతి విద్యార్థులు 82.60 శాతం ఉత్తీర్ణత సాధించారు.మీరట్‌లోని మోడిపురం మహర్షి దయానంద్ ఇంటర్ కాలేజ్‌కు చెందిన అన్షుల్ కుమార్ తన పరీక్షలలో 93.5 శాతం మార్కులు సాధించాడు. అయితే, ఫలితాలను చూడగానే అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు అన్షుల్ తండ్రి, పోస్టాఫీసులో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేసే సునీల్ కుమార్ తెలిపారు. కాగా అన్షుల్ పరిస్థితి ప్రస్తుతం కుదటపడినట్లు తెలిసింది. -
దసరా జరుపుకోని ఏకైక గ్రామం! కారణం తెలిస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్!
దసరా సంబరాలు. ఊరు, వాడ, పల్లే, పట్టణం అనే తారతమ్యం లేకుండా అంబరాన్నంటాయి. భారత్‌లోని నలుమూల ప్రాంతాలు దసరా ఉత్సవాలతో మునిగితేలుతుంటే ఓ గ్రామం మాత్రం దసరా వేడుకలకు దూరంగా ఉంటుంది. ఇది ఈ ఏడాది వ్యవహారమూ కాదండోయ్. వందేళ్లుగా దసరా వేడుకలు జరగడం లేదీ గ్రామంలో. పైగా గ్రామ ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటారు ఎక్కడకి వెళ్లరు. ఎందుకిలా? అనుకుంటున్నారా? మంచి కారణమే ఉంది. తెలిస్తే మీరూ బాధపడే అవకాశమూ ఉంది. ఆ గ్రామ ప్రజల మనసెంత గొప్పదో కదా అనుకోకుండానూ ఉండలేరు. ఆ గ్రామం పేరు గగోల్. ఉండేది ఉత్తర ప్రదేశ్‌లో. మీరట్ నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోనిదీ పల్లె. ఇక్కడ దసరా రోజున ప్రజలు ఇంటిగడప దాటరు. నోరూ మెదపరు. మౌనంగా బాధను అనుభవిస్తున్నట్లు ఉంటారు. ఈ వింత పోకడలన్నీ ఎందుకంటే....ఎప్పుడో... 156 సంవత్సరాల క్రితం ఆ గ్రామానికి చెందిన తొమ్మిది మందిని బ్రిటిష్ పాలకులు ఉరితీసిన విషయాన్ని గుర్తుపెట్టుకుని... ఇప్పటికీ పండుగ జరుపుకోకపోవడం విశేషం. వివరాలేమిటంటే.... భారతదేశ చరిత్ర ఓ ముఖ్యమైన సంఘటన 1857 సిపాయిల తిరుగుబాటు. బ్రిటీష్ వలసవాద విధానాలను వ్యతిరేకిస్తూ జరిగిన తొలి వలసవాద వ్యతిరేక ఉద్యమం. ఈ ఉద్యమాన్ని బ్రిటీష్ వాళ్లు చాలా క్రూరంగా అణిచివేసినప్పటికీ ఎందరికో స్వాతంత్ర నినాదాన్ని ఇచ్చేలా చైతన్యపరిచింది. వారిలోని దేశభక్తిని మేల్కొల్పి స్వాతంత్య్ర కాంక్షను రగిల్చిన గొప్ప ఘటం అది. ఐతే ఈ 1857 సిపాయిల తిరుగుబాటును స్ఫూర్తిగా తీసుకుని భారత్‌లో పలు చోట్ల బ్రిటీషర్ల ఆగడాలను వ్యతిరేకిస్తూ తిరుగుబాట్లు జరిగాయి. వీరిలో గగోల్ ప్రాంతవాసులు కూడా ఉన్నారు. ఆ గగోల్ గ్రామం చుట్టపక్కల గ్రామాలైన మురాద్‌నగర్, నూర్‌నగర్, ప్రాంతవాసులు ఝండాసింగ్ సారథ్యంలో తమ గ్రామాలకు సమీపంలో ఉన్న ఆంగ్లేయుల శిబిరాన్ని ధ్వంసం చేశారు. దీంతో బ్రిటీష్ వాళ్లు ఆ గ్రామస్తులపై దాడికి దిగేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం మీరట్ నగరానికి చెందిన కొత్వాల్ బిషన్ సింగ్ సాయం తీసుకున్నారు. అతను ఆంగ్లేయులను పక్కదారి పట్టించి వారి పన్నాగాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. ఫలితం... ఆ గ్రామాల ప్రజలు సులభంగా తప్పించుకోగలిగారు. కానీ గ్రామాలను ధ్వంసమైపోయాయి. దీంతో ఝుండా సింగ్ పారిపోక తప్పలేదు. ఆ తర్వాత కొద్దిరోజులకు అతడు బ్రిటిష్ వారి చేతిలోనే హతమయ్యాడు. కానీ హింస అక్కడితో ఆగలేదు. ఝండాసింగ్ నేతృత్వంలో దాడులకు దిగిన సుమారు తొమ్మిది మందిని బ్రిటిష్ వారు అరెస్ట్ చేయడమే కాకుండా.. వారికి మరణదండన కూడా విధించారు. 1857 దసరా రోజున ఆ తొమ్మిది మందిని ఉరితీశారు. ఆ వీరుల పేర్లు రామ్ సహాయ్, ఘసితా సింగ్, రమణ్ సింగ్, హర్జాస్ సింగ్, హిమ్మత్ సింగ్, కధేరా సింగ్, శిబ్బా సింగ్, బైరామ్, దర్బాసింగ్ తదితరులు. ఈ తొమ్మిదిమంది జ్ఞాపకార్థం వారిని ఉరితీసిన మర్రి చెట్టు కింద సమాధులు నిర్మించారు గ్రామస్తులు. ఏటా దసరా రోజున ప్రజలు వారికి నివాళులర్పించి వారి స్మృత్యార్థం వేడుకలు జరుపుకోవడం మానేశారు. ఈ సంప్రదాయాన్ని ఆ గ్రామస్తులు దాదాపు 156 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. స్వాతంత్రం కోసం పాటుపడి, ఆ పోరులో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం ఉత్సవాలు జరుపుకోకుండా ఇంట్లోనే ఉంటూ మౌనం పాటిస్తున్న ఆ గ్రామ ప్రజలు నిజంగా వందనీయులు. ఆ గ్రామ ప్రజలకు దేశం పట్ల, స్వతంత్రం కోసం ప్రాణాలొదిలిని అమరవీరుల యందు కనబరుస్తున్న గౌరవానికి, ప్రేమకు ఫిదా కావల్సిందే కదూ. (చదవండి: ఆ దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదట! శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..) -
బీజేపీ నేత హత్య కేసులో ట్విస్ట్.. ఆయన భార్య అరెస్ట్
లక్నో: బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాంపై బుల్లెట్ గాయాలుండటం పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆయన భార్యను అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మృతుడు నిశాంత్ గార్గ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ బీజేపీ యువమోర్చా సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, నిశాంత్ హత్యకు గురికావడంతో ఆయన డెడ్‌బాడీని ఆదివారం మీరట్ పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మృతదేహాంపై బుల్లెట్ గాయాలు కనిపించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఆయన భార్య సోనియాను అరెస్ట్ చేసినట్టు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ సింగ్ సాజ్వాన్ తెలిపారు. ఈ సందర్బంగా రోహిత్ సింగ్ మాట్లాడుతూ.. సోనియాపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మృతుడి సోదరుడు గౌరవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కుట్రపూరిత హత్య కేసును నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ క్రమంలో ఆమెను విచారించగా నిశాంత్ తనను తానే తుపాకీతో కాల్చుకునే ప్రయత్నం చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో ఒక రౌండ్ తుపాకీ పేల్చడంతో తూటా ఆయన బాడీలోకి వెళ్లినట్టు సోనియా చెప్పారని స్పష్టం చేశారు. ఇదే సమయంలో శనివారం ఉదయం తన భర్త ఆత్మహత్యకు కూడా యత్నించాడని తెలిపారని అన్నారు. శుక్రవారం రాత్రి విపరీతంగా తాగి తనను కొట్టాడని చెప్పినట్టు స్పష్టం చేశారు. ఘటనా స్థలంలో మొదట తుపాకీ కనిపించలేదని దాని గురించి విచారణలో సోనియాను ప్రశ్నించగా ఆమె గన్‌తో పాటు గార్గ్ మొబైల్‌ను కూడా తీసుకొచ్చి ఇచ్చిందని చెప్పారు. తర్వాత, ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీని విధించిందని తెలిపారు. ఇది కూడా చదవండి: పాపం వంశిక.. మోడల్ ప్రాణం తీసిన ర్యాంప్ వాక్ -
లాక్డౌన్: పేదోడిపై పోలీసుల ప్రతాపం
లక్నో : లాక్డౌన్ కారణంగా పేద ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తిండిదొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. దొరికినవాటితో సరిపెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ పోలీసులు చేసిన నిర్వాకం తీవ్ర విమర్శల పాలు చేస్తోంది. విధుల్లో భాగంగా మీరట్ వీదుల్లో గాస్తీగాస్తున్న పోలీసులు.. రోడ్డుపక్కన ఉన్న కూరగాయలను నేలపాలు చేశారు. తోపుడుబండిపై కూరగాయలు అమ్ముకుంటూ ఓ వ్యక్తి గల్లీలో నిలిచుని ఉన్నాడు. అదే సమయంలో అటువైపుగా వచ్చిన పోలీసులు గుంపు బండిపై ఉన్న కూరగాయలను నేలపై పారబోసి వెల్లిపోయారు. వీరిలో ఓ ఉన్నతాధికారి కూడా ఉండటం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను గుర్తుతెలియని వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పోలీసుల దుశ్చర్య వెలుగులోకి వచ్చింది. వీడియోకాస్తా నెట్టింట వైరల్‌గా మారడంతో రాష్ట్ర పోలీస్ శాఖ ఘటనపై స్పందించింది. వెంటనే విచారణకు ఆదేశిస్తున్నట్లు మీరట్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ అఖిలేష్ నారాయన్ సింగ్ తెలిపారు. ఘటనకు పాల్పడిన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలావుండగా ఈ ఆ ఘటనపై స్పందించిన ఓ అధికారి హాట్‌స్పాట్ ఏరియాలో ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనిలో భాగంగానే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఆ చర్యకు పాల్పడి ఉండొచ్చని వివరించారు. కాగా మీరట్‌తో పాటు మరో ఐదు జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. హాట్‌స్పాట్ ప్రకటించిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీచేసింది. మొత్తం 72 జిల్లాలో 300 హాట్‌స్పాట్ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గుర్తించింది. వీటిలో ఎలాంటి కార్యాకలాపాలకు అనుమతులను ఇవ్వడం లేదు. (24 గంటల్లో 4,213 పాజిటివ్ కేసులు) -
ఎస్పీ మాటల్లో తప్పేముంది? : డిప్యూటీ సీఎం
లక్నో : భారత్‌లో ఉండడం ఇష్టం లేకపోతే పాకిస్తాన్ వెళ్లిపోండి అని అన్న మీరట్ ఎస్పీ మాటల్లో తప్పేముందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తిరిగి ప్రశ్నించారు. ఆ మాటలు మొత్తం ముస్లిం సమాజానికి వర్తించవని, కేవలం పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన వారికే వర్తిస్తాయని, విమర్శించేవారు ఇది గమనించాలని కోరారు. మౌర్య ఆదివారం ఓ మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో కొందరు పోలీసులపై రాళ్లు విసురుతూ పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. వారినుద్దేశించి మాత్రమే ఎస్పీ ఆ మాటలన్నారు. ఇందులో తప్పేముందో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. కాగా, ఇంతకు ముందు కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పందిస్తూ ఎస్పీ వ్యాఖ్యలు నిజమైతే ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. చదవండి : వాళ్లను పాకిస్తాన్ వెళ్లిపొమ్మని చెప్పండి : మీరట్ ఎస్పీ -
కూతుర్ని అవమానిస్తున్నాడని ప్రియుడిని..
మీరట్ : కన్న కూతుర్ని హేళనచేస్తూ.. అవమానకరంగా మాట్లాడుతున్నాడన్న కోపంతో ప్రియుడిని గొంతునులిమి చంపేసిందో మహిళ. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మీరట్‌లోని ఔరంగ్‌షాపూర్‌కు చెందిన షమీమ్ అనే మహిళ భర్త చనిపోవటంతో కూతురితో కలిసి మీరట్ ఉంటోంది. ఇద్దరు మీరట్‌లోని ఓ ఫామ్‌లో కలిసి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో షమీమ్‌కు రాజీవ్ అలియాస్ రాజు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే అదే ఫామ్‌లో పనిచేసే ముసాహిద్ అనే యువకుడికి షమీమ్ కూతురితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. షమీమ్ కూతురు ముసాహిద్‌తో కలిసి తిరగటం ఇష్టంలేని రాజీవ్ ఆ యువతిని అవమానకరంగా మాట్లాడేవాడు. ఈ విషమై ముసాహిద్‌కి రాజీవ్‌కు మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. తన కూతుర్ని, తనను సైతం అందరి ముందు అవమానిస్తున్నాడని తట్టుకోలేకపోయింది షమీమ్. ఎలాగైనా అతడి అడ్డుతొలగించుకోవాలని భావించి, ముసాహిద్‌తో కలిసి హత్యకు కుట్ర పన్నింది. ఏప్రిల్ 22వ తేది రాత్రి అతడికి ఫుల్లుగా మధ్యం తాగించి గొంతు నులిమి చంపారు. పోలీసు దర్యాప్తులో షమీమ్, ముసాహిద్‌లే హత్య చేశారని తేలటంతో వారిని అరెస్ట్ చేశారు. -
ఆ ఆదివారం
మే 10, 1857- ఆ రోజు ఆదివారం. మీరట్ కంటోన్మెంట్లో ఈస్టిండియా కంపెనీ అధికారులు తీరికగా ఉన్నారు. సెలవని కొందరు ఇళ్లలో ఉన్నారు. కణకణ మండే ఆ ఎండలో ‘మారో ఫిరంగీ కో’ అని నినదిస్తూ కాల్బలానికి చెందిన మూడు దళాలు ఒక్కసారి తుపాకులు ఎక్కుపెట్టాయి. దాదాపు యాభై మంది ఆంగ్లేయులను మట్టుపెట్టాయి. జైలు నుంచి 85 మందిని, వివిధ నిర్బంధాల నుంచి మరో 800 మందిని విడుదల చేశాయి. మూడో దళానికి చెందిన కొందరు సభ్యులు వెంటనే ఢిల్లీ బయలుదేరి, మరునాడే చివరి మొగల్ చక్రవర్తి బహదూర్షా జాఫర్‌ను తిరుగుబాటుకు నాయకునిగా ప్రకటించారు. మార్చి 29, 1857న మంగళ్‌పాండే బ్యారక్‌పూర్ (బెంగాల్) లో పేల్చిన తుపాకీ తూటా ఇలా ప్రతిధ్వనించింది. ఈ ఉద్యమం విఫలమైంది. కానీ కంపెనీ పాలన నుంచి దేశానికి విముక్తి కలిగింది. అందుకే అది భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం. -
అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవదహనం
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లో ఆదివారం ఉదయం ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియరాలేదు. ఎవరైనా కావాలనే చేశారా ? లేక ఆకస్మికంగా ఈ ప్రమాదం సంభవించిందా ? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే లోపే ఆరుగురూ సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. -
అయామ్ శక్తి
అతివ తెగువ ఇవి సెల్‌ఫోన్‌తో తీసిన వీడియో చిత్రాల ిస్టిల్స్. అందుకే స్పష్టంగా కనిపించడం లేదు. కానీ ఈ చిత్రాలలో కనిపిస్తున్న అమ్మాయిలోని ధైర్య సాహసాలు మాత్రం స్పష్టంగా వ్యక్తమౌతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటి? మీరట్ (ఉత్తరప్రదేశ్)లో రద్దీగా ఉండే రహదారిలో ఇటీవల ఈ అమ్మాయి, ఆమె తండ్రి మోటర్ బైక్ మీద విక్టోరియా ప్రాంతానికి వెళుతున్నారు. తండ్రి డ్రైవ్ చేస్తున్నారు. అమ్మాయి వెనక కూర్చుంది. వీరి వెనకే కారులో వస్తున్న ఐదుగురు యువకులు తండ్రీ కూతుళ్లను ఆటపట్టించడం, అల్లరి చేయడం మొదలు పెట్టారు. చివరికి కారుతో బైక్‌ని డీకొట్టారు. అమ్మాయి, అమ్మాయి తండ్రి బైక్‌తో పాటు కిందకు పడిపోయారు. ‘‘ఏమిటీ న్యూసెన్’’ అని తండ్రి గట్టిగా అరవడంతో ఐదుగురు యువకులూ ఆయనపై కలియబడ్డారు. వారిలో ఇద్దరైతే ఆయనపై చెయ్యి కూడా చేసుకున్నారు! అది చూసిన కూతురిలో కోపం కట్టలు తెంచుకుంది. ఒకడి కాలర్ పట్టుకుని చెంపలు వాయించింది. ఇంకొకడి గూబ మీద లాగిపెట్టి కొట్టింది. తండ్రి మీద మళ్లీ చేయి వేయబోతున్న మరొకడిని దూరంగా నెట్టేసింది. మీదికి రాబోయిన మరో ఇద్దరిని కాలితో ఒక్క తోపు తోసింది. విశేషం ఏమిటంటే ఒక ఆడపిల్ల ఒంటరిగా పోరాడుతున్నా దారిన పోతున్న వారిలో ఒక్కరూ ఆగి అమ్మాయికి సాయంగా రాలేదు! ఆ యువకుల్ని ఒక్క మాటా అనలేదు. కొందరు ఆగారు. కానీ యువకుల్ని అదుపు చెయ్యడానికి కాదు. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించడానికి!! దేశంలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు మితిమీరుతున్న నేపథ్యంలో ఒక అమ్మాయి తెగించి తన తండ్రిని కాపాడుకోవడం కోసం ఆగంతకులను ఇలా ఎదుర్కొవడం ఆదర్శప్రాయం మాత్రమే కాదు, మహిళా లోకానికి స్ఫూర్తిదాయకం కూడా. ఇటీవల ముంబైలో ‘అయామ్ శక్తి’ అనే ప్రచారోద్యమాన్ని ప్రారంభించిన ప్రముఖ బాలీవుడ్ నటి రాణీముఖర్జీ మహిళలు అన్ని విధాలా శక్తిమంతులు కావాలని పిలుపునిచ్చారు. అబ్బాయిలే అమ్మాయిలకు రాఖీ కట్టే రోజు రావాలని ఉత్తేజ పరిచారు. స్త్రీలు శక్తిమంతులైతే మొత్తం సమాజంలోనే పరివర్తన వస్తుందని అన్నారు. తన తాజా చిత్రం‘మర్దానీ’లో సీనియర్ ఇన్స్పెక్టర్గా నటించిన రాణీ ముఖర్జీ... అమ్మాయిల ధైర్యమే వారిని, వారి పక్కవారినీ కాపాడుతుందని అన్నారు. ఈ మాటకు ఒక చక్కటి నిదర్శనంగా మీరట్ సంఘటనను చెప్పుకోవచ్చు. -
మరో బాలికపై సామూహిక అత్యాచారం
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ పక్క యువతిపై సామూహిక అత్యాచారం, ఇస్లాంమత మార్పిడి ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మరో పక్క మీరట్లోనే మరో బాలికపై పొరుగున్న ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటపై బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీరట్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి మహావీర్ సింగ్ కథన ప్రకారం కాంకర్ కేడా గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలిక ఆదివారం మార్కెట్‌కు వెళ్లింది. తన ఇంటికి సమీపంలో ఉండే ఇద్దరు యువకులు వశీం, ఇంద్రీష్లు ఆ బాలికను తీసుకువెళ్లారు. జనసంచారం లేని ప్రదేశానికి ఎత్తుకువెళ్లి ఆ ఇద్దరూ బాలికపై అత్యాచారం చేశారు. అంతేకాకుండా తనను కొట్టినట్లు బాలిక తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే ఊరుకునేదిలేదని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పృహలేని పరిస్థితులలో తనను రైల్వేట్రాక్ పడవేసినట్లు బాధితురాలు తెలిపింది. ఫిర్యాదు ఆధారంగా బాధితురాలిని వైద్యచికిత్సల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశారు. -
నగ్మాను పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్న ఎమ్మెల్యే !
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నియోజకవర్గంలో నామినేషన్ కార్యక్రమంలో సినీతార నగ్మాతో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ శర్మ అనుచితంగా ప్రవర్తించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థని తెలిసి కూడా పబ్లిక్ గా నగ్మాను గిరిరాజ్ శర్మ ముద్దు పెట్టుకోవడం వివాదస్పదంగా మారింది. ఎమ్మెల్యే శర్మ తీరుతో నగ్మాతోపాటు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు షాక్ గురయ్యారు. ఎమ్మెల్యే గిరిరాజ్ శర్మపై స్థానికులు, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధి అనే హోదాను మరిచి సాటి నేతతో అనుచితం ప్రవర్తించిన శర్మకు ఈ ఎన్నికల్లో గట్టిగానే బుద్ది చెబుతారని కార్యకర్తలు అంటున్నారు. మీరట్ లో నగ్మా నామినేషన్ కార్యక్రమానికి భారీ ఎత్తున్న అభిమానుల, కార్యకర్తలు హాజరయ్యారు. నగ్మాను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అదుపు చేయలేక పోలీసులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది.