నగ్మాను పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్న ఎమ్మెల్యే ! | Congress MLA misbehaved with Nagma in public at Meerat of Uttarpradesh | Sakshi
Sakshi News home page

నగ్మాను పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్న ఎమ్మెల్యే !

Published Sun, Mar 23 2014 11:48 AM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM

నగ్మాను పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్న ఎమ్మెల్యే !

నగ్మాను పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్న ఎమ్మెల్యే !

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నియోజకవర్గంలో నామినేషన్ కార్యక్రమంలో సినీతార నగ్మాతో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ శర్మ అనుచితంగా ప్రవర్తించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థని తెలిసి కూడా పబ్లిక్ గా నగ్మాను గిరిరాజ్ శర్మ ముద్దు పెట్టుకోవడం వివాదస్పదంగా మారింది. 
 
ఎమ్మెల్యే శర్మ తీరుతో నగ్మాతోపాటు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు షాక్ గురయ్యారు. ఎమ్మెల్యే గిరిరాజ్ శర్మపై స్థానికులు, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధి అనే హోదాను మరిచి సాటి నేతతో అనుచితం ప్రవర్తించిన శర్మకు ఈ ఎన్నికల్లో గట్టిగానే బుద్ది చెబుతారని కార్యకర్తలు అంటున్నారు. 
 
మీరట్ లో నగ్మా నామినేషన్ కార్యక్రమానికి భారీ ఎత్తున్న అభిమానుల, కార్యకర్తలు హాజరయ్యారు. నగ్మాను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అదుపు చేయలేక పోలీసులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement