
అందాల భామలకు అదనపు రక్షణ...
ఎన్నికల బరిలోకి దిగిన బాలీవుడ్ అందాల భామలు హేమమాలిని, నగ్మాలకు అదనపు రక్షణ కల్పించాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. వీరిద్దరూ ఉత్తరప్రదేశ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మీరట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నగ్మా ఇటీవల మూడు సందర్భాల్లో ఆకతాయిల వేధింపులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక నిన్నటితరం ‘డ్రీమ్‌గర్ల్’ హేమమాలిని మథుర నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రచారానికి ఎక్కడకు వెళ్లినా జనం ఎగబడుతుండటంతో ఆమెకూ ఇబ్బందులు తప్పడం లేదు.