BJP Leader Nishant Garg Found Dead In UP's Meerut, Wife Arrested - Sakshi
Sakshi News home page

బీజేపీ నేత హత్య కేసులో ట్విస్ట్‌.. ఆయన భార్య అరెస్ట్‌

Published Mon, Jun 12 2023 5:36 PM | Last Updated on Tue, Jun 13 2023 6:00 AM

BJP Leader Nishant Garg Found Dead In UP Meerut - Sakshi

లక్నో: బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాంపై బుల్లెట్‌ గాయాలుండటం పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆయన భార్యను అరెస్ట్‌ చేశారు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. మృతుడు నిశాంత్‌ గార్గ్‌ పశ్చిమ ఉత్తరప్రదేశ్ బీజేపీ యువమోర్చా సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, నిశాంత్‌ హత్యకు గురికావడంతో ఆయన డెడ్‌బాడీని ఆదివారం మీరట్‌ పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మృతదేహాంపై బుల్లెట్‌ గాయాలు కనిపించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఆయన భార్య సోనియాను అరెస్ట్ చేసినట్టు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ సింగ్ సాజ్వాన్ తెలిపారు. 

ఈ సందర్బంగా రోహిత్ సింగ్ మాట్లాడుతూ.. సోనియాపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మృతుడి సోదరుడు గౌరవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కుట్రపూరిత హత్య కేసును నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ క్రమంలో ఆమెను విచారించగా నిశాంత్‌ తనను తానే తుపాకీతో కాల్చుకునే ప్రయత్నం చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో ఒక రౌండ్‌ తుపాకీ పేల్చడంతో తూటా ఆయన బాడీలోకి వెళ్లినట్టు సోనియా చెప్పారని స్పష్టం చేశారు. 

ఇదే సమయంలో శనివారం ఉదయం తన భర్త ఆత్మహత్యకు కూడా యత్నించాడని తెలిపారని అన్నారు. శుక్రవారం రాత్రి విపరీతంగా తాగి తనను కొట్టాడని చెప్పినట్టు స్పష్టం చేశారు. ఘటనా స్థలంలో మొదట తుపాకీ కనిపించలేదని దాని గురించి విచారణలో సోనియాను ప్రశ్నించగా ఆమె గన్‌తో పాటు గార్గ్ మొబైల్‌ను కూడా తీసుకొచ్చి ఇచ్చిందని చెప్పారు. తర్వాత, ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీని విధించిందని తెలిపారు. 

ఇది కూడా చదవండి: పాపం వంశిక.. మోడల్‌ ప్రాణం తీసిన ర్యాంప్‌ వాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement