dead body
-
పరువుకు భయపడి దారుణం.. పది నెలల తర్వాత?
దేశంలో పలు గ్రామాల్లో నేటికీ అప్పుడప్పుడూ పరువు హత్యలు చోటుచేసుకుంటున్నాయి. సమాజంలో పరువును కాపాడుకునే ప్రయత్నంలో కొందరు పెద్దలు దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా అటువంటి ఉదంతం హర్యానాలో వెలుగు చూసింది.ఫరీదాబాద్‌లోని దౌజ్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక ఇంటిలో 10 నెలల క్రితం ఒక యువతి మృతదేహాన్ని పాతిపెట్టారు. అయితే మృతురాలి తండ్రి ఫిర్యాదుతో ఆ యువతి అస్తిపంజరాన్ని పోలీసులు వెలికి తీసి, స్వాధీనం చేసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సౌదీ అరేబియాలో నివసిస్తున్న బాలిక తండ్రి మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు ఆ యువతి తల్లిని విచారించగా అసలు విషయం బయటపడింది.10 నెలల క్రితం తన కుమార్తె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నదని మృతురాలి తల్లి పోలీసులకు తెలిపింది. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపెట్టింది. తమ కుమార్తె వేరే కులానికి చెందిన యువకునితో వెళ్లిపోయి, తరువాత ఇంటికి వచ్చిందని, అయితే చుట్టుపక్కలవారి మాటలు విని, అవమానంగా భావించి ఉరివేసుకున్నదని తెలిపింది. అయితే ఈ విషయం బయటకు తెలిస్తే, పరువుపోతుందని భావించి, తన సోదరుని సాయంతో కుమార్తె మృతదేహాన్ని ఇంటిలోనే పాతిపెట్టామని తల్లి పోలీసులకు వివరించింది.విషయమంతా తెలియడంతో పోలీసులు పోలీసులు తహసీల్దార్, ఏసీపీ సమక్షంలో మృతురాలి అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రిపోర్టు వచ్చిన వచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా మృతురాలి తండ్రి తాహిర్ గత పదేళ్లుగా సౌదీ అరేబియాలో నివసిస్తున్నాడు. అతని ఎనిమిదిమంది సంతానం తల్లి దగ్గర ఫరీదాబాద్‌లో ఉంటున్నారు. తన కుమార్తె హత్యకు గురై ఉండవచ్చునని తాహిర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తలకోన జలపాతం: విహారయాత్రలో విషాదం.. సుమన్ మృతి
సాక్షి, తిరుపతి: తలకోన జలపాతం వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. విహారం కోసం వెళ్లిన యాత్ర.. విషాదకరంగా ముగిసింది. జలపాతం వద్ద ఈత కొడుతూ ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయ చెన్నైకి చెందిన సుమన్(23) మృతిచెందాడు. దీంతో, వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల ప్రకారం.. స్నేహితుడితో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లి సుమన్ మృత్యువాతపడ్డాడు. జలపాతం వద్ద ఈత కొడుతూ ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన సుమన్ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. కాగా, చెన్నైలో ఎమ్మెస్సీ చదువుతోన్న సుమంత్ తిరుపతికి చెందిన సహ విద్యార్ధితో కలిసి తలకోనకు వచ్చి ప్రమాదానికి గురయ్యాడు. జలపాతంపై నుంచి దూకుతూ వీడియో తీయమని స్నేహితుడిని కోరాడు. ఈ క్రమంలో పై నుంచి తలకిందులుగా నీళ్లలోకి దూకిన సుమంత్ కనిపించకపోకవడంతో స్నేహితుడు ఆందోళన చెందాడు. సుమంత్ తలభాగం బండరాళ్లతో చిక్కుకుపోయిన విషయం తెలుసుకున్న స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎర్రవారిపాలెం పోలీసులు శుక్రవారం రాత్రి వరకు సుమంత్‌ను బయటికి తీయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చీకటిపడటంతో శనివారం ఉదయం వెలికితీస్తామన్నారు. ఈ రోజు ఉదయం పోలీసులు సుమంత్ మృతదేహాన్ని వెలికితీశారు. కాగా తలకోనలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ ముగ్గురు యువకులు జలపాతంలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: ప్లాట్‌ఫామ్‌పై పిచ్చి చేష్టలు.. లోకల్ ట్రైన్ ఢీకొనడంతో గాల్లోకి ఎగిరి.. -
బస్సులో చనిపోయిన ప్రయాణికుడు.. టీఎస్ఆర్టీసీ మానవత్వం..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ఆర్టీసీ)కు ప్రయాణీకులు దైవంతో సమానమని, టిక్కెట్ తీసుకుని ప్రయాణిస్తున్నవారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని సంస్థ వీసీ అండ్ ఎండీ శ్రీ వి.సి.సజ్జనర్, ఐ.పి.ఎస్ గారు అన్నారు. విధి నిర్వహణలో ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడమే కాదు వారిపట్ల మానవత్వంతో వ్యవహరించడంలోనూ సిబ్బంది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుండటం శుభపరిణామమని ఆయన కొనియాడారు. బస్సులో గుండెపోటుతో మరణించిన ఓ ప్రయాణికుడి మృతదేహాన్ని మానవతా దృక్ఫథంతో వ్యవహరించి అదే బస్సులో ఇంటికి చేర్చిన మహబూబాబాద్ డిపో కండక్టర్ కె.నాగయ్య, డ్రైవర్ డి.కొమురయ్యలను శనివారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో అయన అభినందించారు. ప్రత్యేకించి ఆ సమయంలో చొరవ తీసుకున్న మహబూబాబాద్ డిపో మేనేజర్ విజయ్ ను కూడా ప్రశంసించి శాలువా, ప్రశంసా పత్రంతో పాటు ప్రత్యేక బహుమతి అందించి వారి సేవలు ప్రశంసనీయమన్నారు. బస్సులో మృతదేహాన్ని తరలించడంలో పెద్దమనసుతో సహకరించిన ప్రయాణికులకు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్పందించే గుణం సిబ్బందిలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వివరాల్లోకి వెళితే, మహబుబాబాద్ డిపోకు చెందిన బస్సు ఈ నెల 14న సాయంత్రం ఖమ్మం నుంచి మహబుబాబాద్‌కు 52 మంది ప్రయాణికులతో బయలుదేరింది. కురవి మండలం మోదుగులగూడెనికి చెందిన కె.హుస్సేన్(57), బస్సు మైసమ్మ గుడి దగ్గరికి రాగానే నిద్రలోనే గుండెపోటుకు గురయ్యారు. విషయం తెలుసుకున్న బస్సు కండక్టర్ కె.నాగయ్య, డ్రైవర్ కొమురయ్యలు సమయస్పూర్తితో వ్యవహారించారు. తోటి ప్రయాణికుల సాయంతో సీపీఆర్ నిర్వహించారు. లాభం లేకపోవడంతో 108కి సమాచారం అందించారు. అప్పటికే హుస్సేన్ మృతి చెందినట్లు వారు ధృవీకరించారు. మృతదేహాన్ని బాధితుడి స్వగ్రామానికి తీసుకెళ్లడానికి 108 సిబ్బంది నిరాకరించారు. దీంతో కండక్టర్, డ్రైవర్ ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి.. బస్సులోనే 30 కిలోమీటర్లు మృతదేహాన్ని జాగ్రత్తగా ఇంటికి చేర్చారు. కండక్టర్, డ్రైవర్ల చొరవ అభినందనీయమని, సంస్థ వారిని చూసి ఎంతో గర్విస్తోందని సంస్థ ఎండీ సజ్జనర్ చెప్పారు. టిఎస్ఆర్టీసీ సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరించడం ద్వారా ప్రజలకు సంస్థపై విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సేవా భావంతో వ్యవహరిస్తున్న సిబ్బందికి సంస్థలో తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. -
బీజేపీ నేత హత్య కేసులో ట్విస్ట్.. ఆయన భార్య అరెస్ట్
లక్నో: బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాంపై బుల్లెట్ గాయాలుండటం పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆయన భార్యను అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మృతుడు నిశాంత్ గార్గ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ బీజేపీ యువమోర్చా సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, నిశాంత్ హత్యకు గురికావడంతో ఆయన డెడ్‌బాడీని ఆదివారం మీరట్ పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మృతదేహాంపై బుల్లెట్ గాయాలు కనిపించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఆయన భార్య సోనియాను అరెస్ట్ చేసినట్టు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ సింగ్ సాజ్వాన్ తెలిపారు. ఈ సందర్బంగా రోహిత్ సింగ్ మాట్లాడుతూ.. సోనియాపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మృతుడి సోదరుడు గౌరవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కుట్రపూరిత హత్య కేసును నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ క్రమంలో ఆమెను విచారించగా నిశాంత్ తనను తానే తుపాకీతో కాల్చుకునే ప్రయత్నం చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో ఒక రౌండ్ తుపాకీ పేల్చడంతో తూటా ఆయన బాడీలోకి వెళ్లినట్టు సోనియా చెప్పారని స్పష్టం చేశారు. ఇదే సమయంలో శనివారం ఉదయం తన భర్త ఆత్మహత్యకు కూడా యత్నించాడని తెలిపారని అన్నారు. శుక్రవారం రాత్రి విపరీతంగా తాగి తనను కొట్టాడని చెప్పినట్టు స్పష్టం చేశారు. ఘటనా స్థలంలో మొదట తుపాకీ కనిపించలేదని దాని గురించి విచారణలో సోనియాను ప్రశ్నించగా ఆమె గన్‌తో పాటు గార్గ్ మొబైల్‌ను కూడా తీసుకొచ్చి ఇచ్చిందని చెప్పారు. తర్వాత, ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీని విధించిందని తెలిపారు. ఇది కూడా చదవండి: పాపం వంశిక.. మోడల్ ప్రాణం తీసిన ర్యాంప్ వాక్ -
అనాథ మృతదేహాలను రైల్వేశాఖ ఏం చేస్తుందంటే..
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందగా వెయ్యిమందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఇప్పటివరకూ 202 మృతదేహాలకు శవ పంచనామా పూర్తికాగా, 86 మృతదేహాలకు శవపంచనామా ఇంతవరకూ పూర్తికాలేదు. ఆసుపత్రులలో మృతదేహాలను ఉంచేందుకు స్థలం లేకపోవడంతో వాటిని స్కూళ్లు, కోల్డ్ స్టోరేజీలలో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనాథ మృతదేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్‌కు తరలించారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం మృతదేహం ఏడు రోజులు దాటిపోతే అత్యంత వేగంగా కుళ్లిపోతుంది. అటువంటప్పుడు గుర్తింపునకు నోచుకోని మృతదేహాలను రైల్వేశాఖ ఏమి చేస్తుందనే ప్రశ్న అందిరి మదిలోనూ మెదులుతుంది. దీనిగురించి రైల్వేశాఖ అధికార ప్రతినిధి అమితాభ్ శర్మ మాట్లాడుతూ రైలు ప్రమాదాలు సంభవించినప్పుడు మృతదేహాలను సంరక్షించడం, అనాథ మృతదేహాలుగా ప్రకటించడం, అంతిమ సంస్కారాలు చేయడం రైల్వేశాఖ పరిధిలోకి రాదని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమని అన్నారు. అనాథ మృతదేహాలను ఏం చేయాలనే దానిపై ఆయా రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా అనాథ మృతదేహాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. వాటి ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పోలీసులు ఎటువంటి అనాథ మృతదేహన్ని గుర్తించినా ముందుగా ఈ విషయమై జిల్లా ఎస్పీకి తెలియజేయాలి. తరువాత మృతదేహానికి సంబంధించిన రిపోర్టు తయారుచేసి, ఆ మృతదేహాన్ని గుర్తించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి. ఇందుకోసం ఆ మృతదేహానికి సంబంధించిన ఫొటోను రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లు, ఆసుపత్రులకు పంపాల్సి ఉంటుంది. దీని తరువాతనే ఆ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలా లేదా అనేది అధికారులు నిర్ణయిస్తారు. పోలీసులు అనాథ మృతదేహం ఎవరిదో గుర్తించేందుకు అనేక పద్ధతులను అనుసరిస్తారు. మృతదేహంపై పుట్టుమచ్చలు, టాటూలు మొదలైనవి ఏమైనా ఉన్నాయేమో గుర్తిస్తారు. అనాథ మృతదేహాలను అత్యధికంగా ఏడు రోజుల పాటు ఎవరైనా గుర్తించేందుకు ఉంచుతారు. ఆ తరువాత కూడా ఎవరూ మృతదేహం కోసం రాకపోయిన పక్షంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అనాథ మృతదేహాల వద్ద ఏదైనా సామాను దొరికితే పోలీసులు వాటిని భద్రపరుస్తారు. చదవండి: 6 రోజులు దాటినా కానరాని అయినవారి మృతదేహాలు -
అయినవారి మృతదేహాల కోసం...
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగి 6 రోజులు గడిచింది. బాధితులు ఇంకా తమవారి మృతదేహాల కోసం వెదుకులాట సాగిస్తూనే ఉన్నారు. ఇంకా 100 మృతదేహాలకు శవ పంచనామా పూర్తికాలేదు. దీంతో బాధితులు భువనేశ్వర్ ఎయిమ్స్ వద్ద పడరాని పాట్లు పడుతున్నారు. పలు మృతదేహాలను గుర్తించడంలో ఇబ్బందులు తలెత్తుతుండటంతో అధికారులు వాటికి డీఎన్ఏ పరీక్షలు చేయించాల్సివస్తోంది. ఇందుకోసం డీఎన్ఏ శాంపిల్స్‌ను భువనేశ్వర్ ఎయిమ్స్ వద్ద సేకరిస్తున్నారు. ఎయిమ్స్‌తోపాటు మరో ఐదు కేంద్రాలలోనూ డీఎన్ఏ శాంపిల్స్ సేకరణ జరుగుతోంది. మీడియాతో ఒక బాధితుడు మాట్లాడుతూ తన కుమారుని మృతదేహాన్ని గుర్తుపట్టినప్పటికీ తమకు దానిని అప్పటించడం లేదని ఆరోపించారు. డీఎన్ఏ రిపోర్టు వచ్చాకనే ఇస్తామంటున్నారని తెలిపారు. తన దగ్గర ప్రస్తుతం తిండికి కూడా ఖర్చులు లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు చాలామంది బాధితులు తమ వారి డీఎన్ఏ రిపోర్టులు వచ్చాకనే మృతదేహాలను తీసుకు వెళుతున్నారు. మరికొందరైతే ఇక్కడి పరిస్థితులను చూసి, తమవారి మృతదేహాలు దొరుకుతాయనే ఆశను కూడా వదులుకున్నారు. మీడియాతో మాట్లాడిన ఒక బాధితుడు ఇప్పటివరకూ తన సోదరుని మృతదేహం లభ్యం కాలేదని, ఇక ఆశ వదులుకొని తిరిగి ఇంటికి వెళ్లిపోదామని అనుకుంటున్నానన్నాడు. ఇక్కడ వెదుకులాట సాగిస్తూ మూడు రోజులయ్యింది. అధికారులు డీఎన్ఏ ఇచ్చి వెళ్లిపొమ్మంటున్నారని తెలిపాడు. కాగా ఇప్పటి వరకూ 30 డీఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. ఈ శాంపిల్స్‌ను ప్రభుత్వం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు పంపించాలనే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మృతదేహాలను కోల్డ్ రూమ్‌లలో ఉంచారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ ప్రమాదంలో మొత్తం 288 మంది మృతి చెందారు. 193 మృతదేహాలను, భువనేశ్వర్ తరలించారు. 94 మృతదేహాలను బాలాసోర్‌లో ఉంచారు. ఒక బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. భువనేశ్వర్ తరలించిన 193 మృతదేహాలలో 110 మృతదేహాలకు శవ పంచనామా పూర్తయ్యింది. ఇంకా 83 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. 200 మంది బాధితులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనలో దాదాపు 1000 మంది గాయపడ్డారు. చదవండి: పశ్చిమ బెంగాల్ యువకుని మృతదేహం బీహార్‌కు.. -
ఒడిశా రైలు ప్రమాదం: పశ్చిమ బెంగాల్ యువకుని మృతదేహం బీహార్‌కు..
ఒడిశాలోని బాలాసోర్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఇక్కడ ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుని, వందలాదిమంది మృతి చెందారు. ఈ నేపధ్యంలో పలు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. పలువురు అనాథలుగా మారారు. రైలు ప్రమాదంలో మృతిచెందిన కుమారుని మృతదేహం తీసుకువచ్చేందుకు ఒడిశా వచ్చిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక వ్యక్తి తన కుమారుని మృతదేహం మాయమయ్యిందని ఆరోపిస్తున్నాడు. తన కుమారుని మృతదేహాన్ని ఎవరో తమవారిదేనని చెప్పడంతో అధికారులు ఆ మృతదేహాన్ని బీహార్ తరలించారన్నారు. శివనాథ్ కుమారుడు విపుల్ రాయ్ ఒడిశా రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ దుర్ఘటనలో 288 మంది మృత్యువాతపడగా, వెయ్యిమందికి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. శివనాథ్ మాట్లాడుతూ తన కుమారుడు పశ్చిమ బెంగాల్‌లోని తమ ఇంటికి వస్తుండగా, ఈ రైలు ప్రమాదంలో బలయ్యాడని తెలిపారు. ప్రయాణ సమయంలో తన కుమారుడు తల్లితో.. కొద్దిసేపట్లో హౌరా వస్తున్నానని చెప్పాడన్నారు. అయితే ఇప్పుడు అతను తరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్నారు. టీవీలో కుమారుని మృతదేహాన్ని గుర్తించి, దానిని తీసుకువెళ్లేందుకు భువనేశ్వర్ వచ్చానని తెలిపారు. కళింగ ఇన్స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్‌లో తన కుమారుని మృతదేహం ఉందని తెలిసి అక్కడకు వెళ్లగా, అక్కడి హెల్ప్ డెస్క్ బృందం తన కుమారుని మృతదేహం వేరెవరో తమవారిదేనని చెప్పడంతో వారితో పాటు బీహార్ పంపించామన్నారు. తన పరిస్థితి గురించి అధికారులకు చెప్పగా ఆ మృతదేహానికి డీఎన్ఏ టెస్టు నిర్వహించి, ఎవరిదో తెలుసుకుని రిపోర్టు అందజేస్తామని, దీనికి ఏడు రోజులు పడుతుందని తెలిపారన్నారు. తాను టీవీలో కుమారుని మృతదేహం చూడగానే వెంటనే ఇక్కడకు వచ్చానని, ఇంతలోనే మృతదేహం ఇలా మాయం అవుతుందని అనుకోలేదన్నారు. చదవండి: బాడీ నంబరు 151, 156, 174.. -
ఒడిశా రైలు ప్రమాదం: ఇంకా గుర్తించని 81 మృతదేహాలు
ఒడిశాలోని బాలాసోర్‌లో జూన్ 2న జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగి 110 గంటలు గడిచినప్పటికీ ఇంకా 81 మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. 205 మృతదేహాలను మాత్రమే గుర్తించారు. మిగిలిన మృతదేహాలను గుర్తించేందుకు భారతీయ రైల్వే వార్తాపత్రికలలో ప్రకటనల ద్వారా ప్రజల సహాయాన్ని కోరుతోంది. రైల్వే విభాగం ఒక వెబ్సైట్ లింకును ప్రకటిస్తూ దానిలో మృతదేహాల ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సమాచారం వీలైనంతమందికి చేరితే మృతుల కుటుంబాలకు ఈ విషయం తెలుస్తుందని రైల్వేశాఖ భావిస్తోంది. భారతీయ రైల్వే www.srcodisha.nic.in వెబ్సైట్లో మృతుల ఫొటోలను ఉంచింది. ఈ మృతదేహాలను బాడీ నంబరు 1, 2, 3... 151, 152... 288లుగా పేర్కొంది. కాగా ఈ ఫొటోలలో ఘటన తాలూకా భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని మృతదేహాలు చిధ్రమైపోయిన స్థితిలో ఉన్నాయి. రైల్వే విభాగం వార్తా పత్రికలలో ప్రకటనలు ఇవ్వడంలో పాటు హెల్ప్‌లైన్ నంబర్లు(139, 1929, 1800-3450061) కూడా ఇచ్చింది. దీనితోపాటు ప్రమాదానికి సంబంధించిన అన్ని వివరాలను www.osdma.org అనే వెబ్సైట్లో ఉంచింది. గాయపడినవారి వివరాలను www.bmc.gov.in వెబ్సైట్లో తెలియజేసింది. ఈ ప్రమాదంలో 1100 మంది గాయపడగా, వారిలో 900 మంది చికిత్స పొందిన అనంతరం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 200 మంది బాధిత ప్రయాణికులు ఇంకా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. చదవండి: శవాల కుప్పలోంచి కుమారుని శరీరాన్ని బయటకు లాగి... -
గుట్టలు గుట్టలుగా శవాలు.. ఎక్కడా ఖాళీ లేదు
ఒడిశా: గోరుచుట్టు మీద రోకలిపోటులా రైలు ప్రమాదం నుంచి తేరుకునేలోపే ఒడిశా ప్రభుత్వానికి మరో సమస్య వచ్చి పడింది. ప్రమాదంలో మృతి చెందినవారి మృతదేహాలను సంరక్షించడంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కుంటోంది ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం. మృతదేహాలను సంరక్షించడానికి తగిన సదుపాయాలు లేక ఇప్పటికే 187 మృతదేహాలను జిల్లా కేంద్రమైన బాలాసోర్ నుండి భువనేశ్వర్ కు తరలించారు. అక్కడ కూడా అదే సమస్య తలెత్తడంతో ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించింది. శవాల నుండి దుర్వాసన... ఒడిశా రైలు ప్రమాదం మొత్తం దేశాన్నే కుదిపేసింది. చాలా తక్కువ వ్యవధిలో కోరమండల్ ఎక్స్ ప్రెస్, బెంగుళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రమాదానికి గురికావడంతో మృతుల సంఖ్య పెరుగుతూ పోయింది. దీంతో చనిపోయినవారిని వారి బంధువులు గుర్తించే వరకు మృతదేహాలను సంరక్షించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే సంఘటన జరిగి రెండు రోజులు కావడంతోపాటు విపరీతంగా ఉన్న ఎండలకు శవాలు పాడైపోకుండా చూడటం శవాగార నిర్వాహకులకు కష్టసాధ్యంగా మారింది. భువనేశ్వర్ కు మృతదేహాలు తరలింపు... బాలాసోర్ శవాగారంలో తగినంత చోటు లేకపోవడంతో 187 మృతదేహాలను బాలాసోర్ నుండి భువనేశ్వర్ తరలించారు. భువనేశ్వర్‌లో కూడా శవాలను ఉంచడానికి తగినంత చోటు లేకపోవడంతో 110 మృతదేహాలను మాత్రమే అక్కడి ఎయిమ్స్ హాస్పిటల్లో ఉంచి మిగిలిన వాటిని క్యాపిటల్ హాస్పిటల్, అమ్రి హాస్పిటల్, సమ్ హాస్పిటల్, మరికొన్ని ప్రయివేటు హాస్పిటల్స్ కు తరలించారు. భువనేశ్వర్ ఎయిమ్స్ లో కూడా అక్కడ 40 మృతదేహాలు ఉంచే సౌకర్యం మాత్రమే ఉంది. మిగతావాటి నిర్వహణ వారికి కష్టంగానే ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అండగా సోను సూద్ -
Jammu Kashmir: క్రూజర్ వాహనం బోల్తా..ఆరుగురు మృతి
జమ్మూ కశ్మీర్‌లోని కిష్ట్వార్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులతో వెళ్తున్న క్రూజర్ వాహనం అదుపు తప్పి లోయలో బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చెప్పట్లినట్లు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలోని కేరి సెక్టార్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింగ తెగ వైరల్ అవుతోంది వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించనున్న విపక్షాలు!) -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
దుమ్ముగూడెం(తెలంగాణ): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కేర్లపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సిరిసెట్టి సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. సిమెల్, గోగుండా కొండలపై పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, డీఆర్జీ బలగాలు గాలింపు చేపట్టాయి. గురువారం రాత్రి భద్రతా బలగాలు కూంబింగ్ ముగించుకుని వస్తుండగా కోడెల్పరా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాడి చేశారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపగా, మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే పారిపోయారు. అనంతరం ఘటనాస్థలంలో ఓ మావోయిస్టు మృతదేహంతో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభ్యమయ్యా యని, మరో ఐదుగురు మావోయిస్టులకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. -
‘నాకేమీ వద్దు ప్లీజ్ లే నాన్నా.. నువ్వెందుకు లేవడం లేదు..’
దాల్పట్: ‘‘నాన్నా.. నువ్వెందుకు లేవడం లేదు? నాకేమీ వద్దు. ప్లీజ్.. లే నాన్నా!’’ అంటూ ఓ చిన్నారి.. జవాన్ తండ్రి కోసం కంటతడి పెట్టుకుంది. ఆమె కన్నీరు చూసి అక్కడున్న వారంతా ఆవేదన చెందారు. కాగా, జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో ఉగ్రదాడుల్లో మృతిచెందిన పారాట్రూపర్ నీలంసింగ్ ముఖాన్ని చేతితో తాకుతూ పదేళ్ల చిన్నారి పావన రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. వివరాల ప్రకారం.. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో శుక్రవారం టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మరణించారు. మృతిచెందిన వారిలో హవిల్దార్ నీలంసింగ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో నీలంసింగ్ శవపేటిక శనివారం స్వగ్రామం చేరుకుంది. దీంతో, స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నీలంసింగ్కు నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. ఇక, నీలంసింగ్ పార్థివ దేహాన్ని చూసి ఆయన కుమార్తె పవనా చిబ్(10).. ‘‘నాన్నా.. నువ్వెందుకు లేవడం లేదు? నాకేమీ వద్దు. ప్లీజ్.. లే నాన్నా!’’ అంటూ కన్నీరుపెట్టింది. పక్కనే నిలుచున్న నీలంసింగ్ భార్య వందన.. భర్త ముఖాన్ని రెండు చేతులతో పట్టుకొని కన్నీరుమున్నీరు అయ్యారు. ఏడేళ్ల కుమారుడు అంకిత్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కాగా, వేల మంది సమక్షంలో దలపత్ గ్రామంలో శనివారం నీలంసింగ్ అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు.. రాజౌరీ సెక్టార్ పరిధిలోని కాండి అడవిలో కొంతమంది ఉగ్రవాదులు దాగివున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు బుధవారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో అడవిలోని ఓ గుహలో ఉగ్రవాదులు దాగివుండటాన్ని జవాన్లు శుక్రవారం ఉదయం గుర్తించారు. దీంతో సైనికులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. జవాన్లపై ఉగ్రవాదులు పేలుడు పదార్థం విసరడంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉదంపూర్ దవాఖానకు తరలించారు. తీవ్ర గాయాలతో మరో ముగ్గురు దవాఖానలో మరణించారని ఆర్మీ పేర్కొన్నది. Papa aap ku nhai bol rahe, Papa Aap Ku Humain Chor ker jaa rahey hain, 😢😢 Last rites of Martyr Havildar Neelam Singh at his native village in Akhnoor. This bloodshed must stop now. How will this daughter live without her father now? I request the governments of India and… pic.twitter.com/dpLawcSr3Q — Mohammed Hussain (@hussain_hrw) May 7, 2023 ఇది కూడా చదవండి: హింసాకాండలో 54 మంది మృతి.. మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత -
ఫిలిప్పీన్స్‌లో మణికాంత్‌రెడ్డి మృతి.. పోస్టుమార్టం రిపోర్టు ఇదే..
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం రాంలింగంపల్లి గ్రామానికి చెందిన వైద్య విద్యార్థి గూడూరు మణికాంత్‌రెడ్డి (21) మృతికి కార్డియాక్ అరెస్టే (గుండె ఆగిపోవడం) కారణమని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. మణి కాంత్‌రెడ్డి వైద్య విద్యను అభ్యసించడానికి ఫిలి ప్పీన్స్‌కి వెళ్లి అక్కడ ఈ నెల 23న ఉదయం అను మానాస్పదస్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. మణికాంత్ మృతదేహానికి అక్కడి వైద్యులు బుధవారం పోస్టుమార్టం నిర్వహించగా కార్డియాక్ అరెస్ట్‌తోనే మృతిచెందినట్టు తేలిందని, ఈ మేరకు అక్కడి అధికారుల నుంచి సమాచారం వచి్చందని మృతుడి బంధువులు తెలిపారు. మణికాంత్‌రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు అ«ధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతదేహం హైదరాబాద్‌కు రానుందని తెలిసింది. ఇది కూడా చదవండి: ప్రేమ విఫలమైందని సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న జవాన్! -
మంచిర్యాల ప్రమాదంపై షాకింగ్ నిజాలు.. కారణం అదేనా?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: శుక్రవారం అర్ధరాత్రి.. అంతా గాఢనిద్రలో ఉన్నారు.. ఇంట్లో ఒక్కసారిగా మంటలు మొదలయ్యాయి.. కొద్దిసేపట్లోనే ఇల్లంతా వ్యాపించాయి. పొగ, ఊపిరాడని పరిస్థితి.. ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు సజీవదహనం అయ్యారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామక్రిష్ణాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ ఎమ్మెల్యే కాలనీలో ఈ ఘటన జరిగింది. పెంకుటింట్లో నిద్రిస్తున్న మాసు శివయ్య (47), ఆయన భార్య రాజ్యలక్ష్మి అలియాస్ పద్మ (42), సింగరేణి కారి్మకుడు శనిగరపు శాంతయ్య అలియాస్ సత్తయ్య (54), నెమలికొండ మౌనిక (30), ఆమె కుమార్తెలు ప్రశాంతి (3), హిమబిందు (13నెలలు) మంటల్లో కాలిపోయారు. వీరంతా దళితులు కావడం, ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టినట్టుగా ఆధారాలు ఉండటంతో కలకలం రేగింది. వివాహేతర/సహజీవన సంబంధం నేపథ్యంలోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అర్ధరాత్రి నిద్ర లేపిన పొగ శుక్రవారం అర్ధరాత్రి దట్టమైన పొగ, కాలిన వాసన రావడంతో మాసు శివయ్య ఇంటి పక్కనే ఉన్న పొన్నాల ముకుందం లేచి బయటికి వచ్చాడు. అప్పటికే శివయ్య ఇల్లు కాలిపోతోంది. వెంటనే తన భార్యాపిల్లలను నిద్రలేపి బయటికి తీసుకెళ్లాడు. వాళ్లు బిగ్గరగా కేకలు వేస్తూ చుట్టుపక్కల వారిని నిద్రలేపారు. వెంటనే అంతా కలిసి బిందెలు, బకెట్లతో నీటిని చల్లుతూ.. బాధిత కుటుంబీకులు, బంధువులు, పోలీసు, అగి్నమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రాత్రి 1.26 గంటలకు బెల్లంపల్లి అగి్నమాపక కేంద్రానికి సమాచారం చేరింది. రాత్రి 2 గంటల సమయంలో ఫైరింజన్ ఘటనా స్థలానికి చేరుకుంది. సుమారు గంటపాటు శ్రమించి మంటలను ఆర్పారు. సిమెంటు ఇటుకలతో నిర్మించిన గోడలతో పైన కలప దుంగల ఆధారంగా కట్టిన పెంకుటిల్లు అది. మంటలకు దుంగలు కాలిపోయి.. పైకప్పు కూలిపోయింది. ఇంట్లో మొత్తం మూడు గదులు ఉండగా.. ఒక గదిలో ముగ్గురి, మధ్యలో గదిలో ఒకరి, మూడో గదిలో మరో ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. ఇంట్లో ఉన్న ఇనుప బీరువా, గ్యాస్ సిలిండర్, వంట సామగ్రి, వ్రస్తాలు అన్నీ పూర్తిగా దహనమైపోయాయి. పెట్రోల్ క్యాన్లు.. కారంపొడి దళిత కుటుంబం సజీవ దహనం విషయం తెలియడంతో.. డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ తిరుపతిరెడ్డి, మందమర్రి, బెల్లంపల్లి టౌన్ సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు ఘటనా స్థలానికి వచ్చారు. ఫోరెన్సిక్, క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేయగా.. ఇంటి వెనుకాల ఉన్న రోడ్డు నుంచి జైపూర్ మండలం రసూల్‌పల్లి వైపు పరుగెత్తింది. అయితే ఆటోలో కారంపోడి, ఇంటి వెనకాల చెట్టు కింద రెండు పెట్రోల్ క్యాన్లు కనిపించడంతో.. ఎవరో ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. శివయ్య కుమారుడు సందీప్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. మృతదేహాలకు ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం పూర్తిచేశారు. ఐదుగురి మృతదేహాలను బంధువులకు అప్పగించగా.. శుక్రవారం సాయంత్రం గ్రామశివార్లలోనే అంత్యక్రియలు నిర్వహించారు. శాంతయ్య మృతదేహం కోసం కుటుంబ సభ్యులెవరూ రాకపోవడంతో ప్రభుత్వ మార్చురీకి తరలించారు. కాగా.. బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పరామర్శించి ఓదార్చారు. తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చుట్టపు చూపుగా వచ్చి ప్రాణాలు పోయి.. మాసు శివయ్య, రాజ్యలక్ష్మి భార్యాభర్తలుకాగా.. శాంతయ్య సింగరేణి ఆర్కే5 గనిలో కారి్మకుడు. అతను కొంతకాలం నుంచి శివయ్య కుటుంబంతోనే నివసిస్తున్నట్టు బంధువులు చెప్తున్నారు. ఇక రాజ్యలక్ష్మి అక్క కుమార్తె మౌనిక, ఆమె ఇద్దరు పిల్లలు చుట్టపు చూపుగా మూడు రోజుల క్రితం వచ్చారు. మౌనిక భర్త రెండేళ్ల కిందే చనిపోయాడు. కోటపల్లి మండలం కొండంపేటలోని తల్లిగారింట్లో ఉంటూ కూలిపనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. ఈ ఘటనలో ఆమె, పిల్లలు కూడా బలయ్యారు. అయితే శుక్రవారం సాయంత్రం రాజ్యలక్ష్మి తల్లిదండ్రులు బత్తుల లింగయ్య, కమల కూడా వెంకటాపూర్‌లోని ఇంటికి వచ్చారు. అయితే లింగయ్యకు మద్యం, పొగాకు అలవాటు ఉండటంతో.. ఆ వాసన పడదని, తెలిసినవారి ఇంట్లో నిద్రపోవాలని రాజ్యలక్ష్మి చెప్పింది. వారు వేరేవాళ్ల ఇంట్లో నిద్రపోవడంతో దుర్ఘటన నుంచి బయటపడ్డారు. వచ్చే సరికే దారుణం జరిగిపోయింది ఇల్లు ఎలా కాలిపోయిందో తెలియడం లేదని.. నస్పూర్‌లో ఉండే తనకు రాత్రి ఒంటి గంటకు ఫోన్ చేస్తే వెంకటాపూర్‌కు వచ్చానని శివయ్య కుమారుడు సందీప్ కన్నీళ్లు పెట్టాడు. ‘‘మాకు రాత్రి ఒంటి గంట సమయంలో ఇల్లు కాలిపోతోందని తెలిసింది. వెంటనే పరిగెత్తుకు వచ్చాం. నీళ్లు పోస్తూ మంటలు ఆర్పాం. కానీ అందరినీ కోల్పోయాం.’’ అని శివయ్య పెద్ద కుమార్తె భర్త నారమల్ల శ్రీనివాస్ వాపోయాడు. మేం వచ్చే సరికి ఇల్లు కూలిపోయింది ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడం మొదలుపెట్టాం. కానీ అప్పటికే మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఇంటి పైకప్పు కూలిపోయి ఉంది. – కె.రవీందర్, బెల్లంపల్లి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ (17ఎంసీఎల్321) లేచి చూసే సరికే భారీగా మంటలు మా ఇంట్లోకి పొగలు, వాసన రావడంతో నిద్రలేచి చూశాను. అప్పటికే శివయ్య ఇల్లు మంటల్లో కాలిపోతోంది. చుట్టుపక్కల వారిని నిద్రలేపి.. అంతా కలిసి నీళ్లు చల్లడం మొదలుపెట్టాం. కానీ అప్పటికే లోపల ఉన్నవారు కాలిపోయి ఉంటారు. – పొన్నాల ముకుందం, ప్రత్యక్ష సాక్షి (17ఎంసీఎల్322) అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం ఇల్లు దహనమై ఆరుగురు మృతిచెందడంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. సాంకేతిక, వైద్య, ఫోరెన్సిక్‌తో ఆధారాలు సేకరిస్తున్నాం. ప్రమాదమా? కుట్ర కోణమేమైనా ఉందా? అనేది విచారణ చేస్తున్నాం. – అఖిల్ మహాజన్, డీసీపీ, మంచిర్యాల (17ఎంసీఎల్324). వివాహేతర సంబంధమే కారణమా? సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా వెంకటాపూర్‌లో ఆరుగురి సజీవదహనం వెనుక వివాహేతర సంబంధమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనలో మృతి చెందిన శాంతయ్య భార్య, బంధువులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. నస్పూర్, వెంకటాపూర్‌లో స్థానికులు చెప్తున్న వివరాల మేరకు.. వెంకటాపూర్‌కు చెందిన మాసు శివయ్య ఆ గ్రామ వీఆర్ఏ, అతడి భార్య రాజ్యలక్ష్మి (పద్మ) గృహిణి. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. కుమారుడు సందీప్ నస్పూర్‌లో ఉంటున్నాడు. ఇక లక్సెట్టిపేట మండలం ఊత్కూరుకు చెందిన సింగరేణి కార్మికుడు శనిగరపు శాంతయ్య నస్పూర్‌లో నివాసం ఉంటూ ఆర్కే5 బొగ్గు గనిలో పనిచేస్తున్నాడు. వెంకటాపూర్‌కు సమీపంలోనే బొగ్గుగని ఉండగా.. కూలిపనులకు వెళ్లే క్రమంలో రాజ్యలక్ష్మి దంపతులకు శాంతయ్యతో పరిచయం ఏర్పడింది. ఈ సాన్నిహిత్యం పెరిగి శాంతయ్య వారి ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టాడు. రాజ్యలక్ష్మితో శాంతయ్య వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. తనను, పిల్లలను పట్టించుకోవడం లేదని అతడి భార్య సృజన పంచాయితీ పెట్టింది. శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆ కుటుంబాలకు పలుమార్లు కౌన్సెలింగ్ కూడా జరిగింది. డబ్బు రేపిన చిచ్చుతో.. శాంతయ్య–సృజన దంపతులకు ఒక కుమార్తు, ఇద్దరు కుమారులు ఉన్నారు. శాంతయ్య సింగరేణి ఉద్యోగి కావడంతోపాటు సొంతూరులో భూములు ఉన్నాయి. ఇటీవల కొంత భూమి విషయంలో వాటాగా రూ.12 లక్షలు వచ్చాయి. అందులో కుమార్తె పేరిట రూ. 5లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి, మిగతా సొమ్ము తన వద్దే పెట్టుకున్నాడు. తనకు, కుమారులకు డబ్బులు ఇవ్వకుండా.. రాజ్యలక్షి్మతో ఉంటూ వారికి డబ్బులు ఇస్తున్నాడని సృజన గొడవపడింది. దీనికితోడు నాలుగు నెలలుగా శాంతయ్య వెంకటాపూర్‌లోనే ఉండిపోవడం, డ్యూటీకి సరిగా వెళ్లకపోవడంతో కక్షపెంచుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే శాంతయ్యను, శివయ్య కుటుంబాన్ని అంతం చేయాలని కొందరు బంధువులతో కలిసి ప్లాన్ చేసినట్టు సమాచారం. శుక్రవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ఓ బంకు నుంచి పెట్రోల్ తీసుకొచ్చి ఇంటిపై చల్లి నిప్పుపెట్టారని.. ఈ మేరకు పెట్రోల్ తీసుకొస్తున్నవారి సీసీ కెమెరా పుటేజీ దొరికిందని తెలిసింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. అయితే పోలీసులు అధికారికంగా ఈ వివరాలను ధ్రువీకరించలేదు. ఆధారాలు సేకరించాక వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. -
వార్డెన్ నిర్వాకం.. విద్యార్థి మృతితో విషాదంలో పేరెంట్స్
సాక్షి, కరీంనగర్: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ ఆదేశాల మేరకు హాస్టల్ ఆవరణలో ఉన్న బావిలోని చెత్తను తీస్తూ విద్యార్థి మృతిచెందాడు. దీంతో, విద్యార్థి పేరెంట్స్ కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ సెయింట్ ఆంటోని స్కూల్ 8వ తరగతి చదువుతున్న శ్రీకర్ బావిలో పడి మృతిచెందాడు. అయితే, ఆదివారం కావడంతో బావిలోని చెత్తను క్లీన్ చేయమని వార్డెన్ విద్యార్థులకు చెప్పాడు. దీంతో, బావిలోకి నలుగురు విద్యార్థులు దిగి క్లీన్ చేశారు. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థులకు ఈత రావడం, శ్రీకర్‌కు ఈత రాకపోవడంతో అతడు బావిలో పడి చనిపోయాడు. మిగతా ముగ్గురు విద్యార్థులు వెంటనే ఈ విషయం వార్డెన్‌కు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, రెస్క్యూ టీమ్ సాయంతో శ్రీకర్ మృతదేహాన్ని బయటకు తీశారు. విద్యార్థి మృతిచెందిన విషయం అతడి పేరెంట్స్‌కు తెలియడంతో హుటాహుటిన హాస్టల్‌కు చేరుకున్నారు. తమ కుమారుడికి మృతికి కారణమైన వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో.. !?
భారతదేశంలో మరణానికి ముందు వెనుకల కూడా సనాతనమైన, అమానవీయమైన సాంప్రదాయాలు మనిషిని వెంటాడుతున్నాయి. ఆ సంప్రదాయాల్లో పడి గంజిలో పడ్డ ఈగల్లా బయ టకు రాలేక, అందులో పడి చావలేకా... కొట్టుమిట్టాడుతున్నాం. అద్దె ఇంట్లో ఆత్మీయులు, కుటుంబ సభ్యులు మరణిస్తే కనీసం అక్కడ ఉండి కర్మకాండలు నిర్వహించుకోవడానికి వీలులేని దయనీయ సామాజిక వ్యవస్థలో మనం బతుకుతున్నాం. అందుకే అద్దె ఇంట్లో ఉండేవారు అంతిమ దశలో తమకంటూ సొంత గుడిసె అయినా ఉండాలని కోరుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ తల్లి తన కుమారుణ్ణి ఊరు చివర చిన్న గుడిసె అయినా పరవాలేదు, సొంత ఇల్లు కట్టమని వేడుకుంది. దీంతో ఆమె కుమారుడు లోన్ తీసుకుని సొంతిల్లు కట్టి తల్లి భయాన్ని పోగొట్టాడు. కరీంనగర్ పట్టణంలో బస్వరాజు కనకయ్య, భార తమ్మ అనే రజక దంపతులు ఎన్నో ఏళ్ళుగా తమ చేతనైన పనిచేసుకొని బతుకుతున్నారు. వాళ్లకు ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి స్వప్న దివ్యాంగురాలు. ఒక కాలు పని చేయదు. రెండో అమ్మాయి సరితకు పెళ్ళయ్యింది. నిజానికి బసవయ్యకు పెళ్లయిన ఒక కుమారుడు ఉన్నా అతడు తొమ్మిదేళ్ల క్రితం గుండె పోటుతో చనిపోయాడు. అప్పుడు కూడా అప్పటి అద్దె ఇంటి యజమాని ఇంటికి రానివ్వలేదు. ఇపుడు బసవరాజు కనకయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడి మరణించాడు. ఆసుపత్రి యాజమాన్యం ఆయన బతికే అవకాశం లేదని, ఇంటికి తీసుకుపోతే బాగుంటుందని చెప్పింది. ఆ స్థితిలో ఉన్న కనకయ్యను ఇంటికి తీసుకుపోతే, ఇంటి యజమానులు రానీయలేదు. గత్యంతరం లేక కరీంనగర్ పట్టణంలోని శ్మశానంలోకి తీసుకెళ్ళారు. ప్రాణం ఉండగానే కనకయ్యను శ్మశానంలోకి తీసుకెళ్ళిన కుటుంబం ఆయన చావుకోసం ఎదురు చూసింది. ఒక రోజు తర్వాత కనకయ్య కన్నుమూశాడు. మరణానంతరం జరగాల్సిన కర్మకాండ అంతా ముగించుకొని మాత్రమే తిరిగిరావాలని ఇంటి యజమాని చెప్పడంతో ఇద్దరు ఆడపిల్లలతో మృతుని భార్య 14 రోజులు శ్మశానంలోనే గడిపింది. హైదరాబాద్‌లోని అపార్ట్మెంట్లలో ఎవరైనా అద్దెకు ఉండి, అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే, ఆ కాంపౌండ్ నుంచి శవాన్ని తీసివేయాలి. ఒకవేళ ఆసుపత్రిలో మరణిస్తే అటునుంచి అటే సొంత ఊరికైనా తీసుకెళ్ళాలి. లేదా నేరుగా శ్మశానానికి తీసుకెళ్ళాలి. కొన్ని గ్రామాల్లో మరొక వింత సాంప్రదాయం ఉంది. ఎవరైనా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళి, చికిత్స పొందుతూ మరణిస్తే, ఆ వ్యక్తి మృతదేహాన్ని రానివ్వని గ్రామాలు కూడా ఉన్నాయి. పది సంవత్సరాల క్రితం మంథని దగ్గర్లోని ఒక ఊరి ప్రజలు ఇట్లాగే ప్రవర్తిస్తే, పోలీసుల సహకారంతో ఆ మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్ళి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. దీనికి నేనే ప్రత్యక్ష సాక్షిని. అదేవిధంగా తిరుపతి పట్టణంలో, దాని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినట్టు, జరుగుతున్నట్టు పాత్రికేయ మిత్రుల ద్వారా తెలిసింది. విశాఖతో పాటు అనేక చోట్ల ఇంటి అద్దె కోసం వచ్చిన వాళ్ళను కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు ఉంటే ఇంటి యజమానులు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. మనిషికి మరణం తథ్యమనీ, అది ఎప్పుడైనా, ఎవరికైనా రావొచ్చనీ తెలిసి కూడా మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారనేది అర్థం కాని ప్రశ్న. దీనికి గాను నేను ఎవ్వరినీ నిందించడం లేదు. కానీ దీని గురించి ఆలో చించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కొందరు పుట్టించిన సాంప్రదాయాలు కారణమవుతున్నాయని భావించక తప్పదు. ఇంట్లో ఒక మరణం జరిగితే, కొందరు పురోహి తుడిని సంప్రదిస్తుంటారు. ఇటీవల ఇటువంటి వారి సంఖ్య మరింత పెరిగింది. ఆ పురోహితుడు... వ్యక్తి ఏ ముహూర్తంలో చనిపోయాడో నిర్ణయించి దుర్ముహూర్తమైతే, దానికి శాంతి ఉపాయాలు సూచించి, కొన్నిసార్లు కొన్ని నెలల పాటు మరణించిన ఇంటిని విడిచి పెట్టాలని సూచిస్తున్నారు. దీనిని చూసి ఇంటి యజమానులలో... తమ ఇంట్లో వేరే వాళ్ళ మరణం జరగరాదని, మృతదేహాన్ని ఇక్కడపెట్టరాదనే ఛాందస భావనలు కూడా బాగా పెరుగుతున్నాయి. తమ ఇంట్లో పెళ్లి జరగబోతున్న వారు సొంత బంధువుల అంత్యక్రియలకూ హాజరు కావడానికి ఇష్టపడటం లేదు. ఇట్లా మరణం చుట్టూ అల్లుకున్న ఈ ప్రవర్తన మన సమాజం డొల్లతనాన్ని చూపెడుతున్నది. నిజానికి మన రచనలలో, ప్రసంగాల్లో మృత దేహాన్ని పార్థివ దేహం అంటారు. అంటే పంచభూతాలతో నిండిన శరీరం జీవం పోవడం వల్ల... వాయువును, అగ్నిని, నీటిని, తన సహజ స్వభావాన్ని కోల్పోయి కేవలం మట్టిగా మిగిలిందని చెబుతారు. మట్టి మట్టిలో కలుస్తుంది. పంచ భూతాలతో నిండిన శరీరంలో మట్టి మిగిలినందున ఎంతో పవిత్రమైందిగా చూడాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుండడం వింత సాంప్రదాయంగా భావించొచ్చు. కానీ చావును ఒక భయంకరమైన ఘటనగా చూపించి, దాని చుట్టూ ఒక మూఢనమ్మకాన్ని సృష్టించి, ఆ అంధ విశ్వాసాన్ని సమాజం అంతటా వ్యాప్తి చేస్తున్నారు. ఇటువంటి మూఢ నమ్మకాలను తొలగించకుండా, సమాజంలో మానవత్వాన్ని నింపలేం. ఈ మూఢ నమ్మకాలను ప్రేరేపిస్తున్న వారే ముందుకు వచ్చి, ఇవి సరైనవి కావని చెప్పాలి. లేదా అవి శాస్త్రీయమైనవైతే వాటిని ఆధారాలను, శాస్త్రాలను బయటపెట్టాలి. ఒకవేళ వాళ్ళు ఆ పని చేయలేకపోతే, మానవత్వమున్న ప్రతి ఒక్కరం దీని మీద ఒక కార్యాచరణకు పూనుకోవాలి. అదే విధంగా ప్రభుత్వం వైపు నుంచి రెంట్ కంట్రోల్ యాక్ట్‌లో కొన్ని మార్పులు చేయాలి. ఇంటి యజమానులు ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడితే, శిక్షించడానికి వీలుగా ఆ చట్టంలో సవరణలు చేసి, వాళ్ళను శిక్షార్హులుగా చేయాలి. దీని గురించి న్యాయనిపుణులు, ప్రజా ప్రతినిధులు ఆలోచిం చాలి. మన దేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న పట్టణీకరణ, అద్దె ఇండ్ల సమస్యలను పెంచుతున్నది. కావున ఇది కోట్ల మంది సమస్య. రాజకీయ పార్టీలు, సంఘాలు మానవత్వంతో తమ పాత్రను నిర్వహించాల్సి ఉంది. (క్లిక్ చేయండి: 66 ఏళ్లుగా సర్వసాధారణం.. ఇప్పుడెందుకు వివాదం!) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
డిగ్రీ విద్యార్థిని మృతిపై అనుమానాలు.. అసలు ఏం జరిగింది?
బి.కోడూరు/ సిద్దవటం(వైఎస్సార్ జిల్లా): మూడు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థిని శవమై తేలింది. దీంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బద్వేలు నియోజకవర్గం బి.కోడూరు మండలంలోని మరాటిపల్లె గ్రామానికి చెందిన అల్లంపాటి అనూష (20) బద్వేలులోని శ్రీ చైతన్య కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండేది. ఈమె మూడు రోజుల క్రితం అదృశ్యమైనట్లు బి.కోడూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. బి.కోడూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో రాజంపేట నియోజకవర్గం సిద్దవటం మండలంలోని జంగాపల్లె గ్రామం పెన్నా నది ఒడ్డున ఆదివారం మృతదేహం లభ్యమైంది. చదవండి: ప్రేమ పెళ్లి.. సైకో భర్త.. పెళ్లయిన ఆరు నెలలకే భార్య షాకింగ్ నిర్ణయం మృతి చెందడానికి గల కారణాలపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో పెన్నా నదిలోనే పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని బాధిత కుటుంబీకులకు అప్పజెప్పారు. బి.కోడూరు మండలం మరాటిపల్లె గ్రామానికి చెందిన అల్లంపాటి రామిరెడ్డి, రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్నకుమార్తె అనూష. కుటుంబానికి ఆసరాగా ఉంటుందని తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని.. కూలీ పనులు చేస్తూ చదివించే వారు. తిరిగి వస్తుందని రేయింబవళ్లు పోలీసుస్టేషన్ల వద్ద పరిసరాల ప్రాంతాల్లో ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. దీంతో వారు గుండెలవిసేలా రోదించారు. బంధువులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగారు. మృతిరాలి తండ్రి రామిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
భర్తే ఆమె పాలిట సైకో కిల్లర్.. భార్యను చంపి డెడ్‌బాడీని సూట్‌కేసులో..
సాక్షి, తిరుపతి: నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ సైకో భర్త.. భార్యను దారుణంగా హత్య చేసి సూట్‌కేసులో మృతదేహాన్ని దాచిపెట్టి చెరువులో పడేసిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. సాఫ్ట్వేర్ ఉద్యోగి వేణుగోపాల్‌కు, తిరుపతిలోని కొర్లగుంటకు చెందిన పద్మతో 2019లో కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు. కాగా, వివాహమైన నాలుగు నెలలకే పద్మను భర్త చిత్ర హింసలకు గురిచేశాడు. ఆమెపై తన శాడిజాన్ని చూపించాడు. వేణుగోపాల్ వేధింపులు భరించలేక.. పద్మ తన పుట్టింటికి వెళ్లిపోయి భర్త నుంచి విడాకులు కోరింది. ఈ క్రమంలో కుటుంబ పెద్దలు అందరూ కలిసి.. భార్య, భర్తను కలిపేందుకు ప్రయత్నించారు. రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. భర్త వేధింపులను గుర్తుకు తెచ్చుకున్న పద్మ.. తన కుటుంబ సభ్యులు ఎంత సర్ధిచెప్పినా వినిపించుకోలేదు. వేణుగోపాల్‌తో కలిసే బ్రతికే ప్రసక్తేలేదని తెగేసి చెప్పింది. ఈ క్రమంలో భార్యపై కోపం పెంచుకున్న శాడిస్ట్ భర్త.. పద్మను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఒక సూట్ కేసులో పెట్టి రేణిగుంట మండల పరిధిలోని వెంకటాపురం పంచాయతీ చేపల చెరువులో పడేశాడు. అనంతరం.. పెద్ద ప్లాన్ వేశాడు. తన భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని, కనిపించడం లేదంటూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలియడంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సహాయంతో పద్మ మృతదేహాన్ని వెలికితీశారు. ఇది కూడా చదవండి: ములుగు జిల్లాలో తీవ్ర విషాదం -
విమానంలో డెడ్ బాడీకి ఎక్కువ ప్లేస్ కావాలి.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూరు: ఉక్రెయిన్‌లో ఆ దేశ సైనికులకు, రష్యా బలగాలకు మధ్య భీకరపోరు నడుస్తోంది. ఈ దాడుల్లో రెండు దేశాల సైనికులు, సామాన్య పౌరులు సైతం మృత్యువాత పడుతున్నారు. ఈ దాడుల్లో ఇటీవల కర్నాటకకు చెందిన నవీన్ శేఖరప్ప చనిపోయిన విషయం తెలిసిందే. కాగా, నవీన్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవీన్ కుటుంబ సభ్యులు అతడి డెడ్ బాడీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కొడుకును కడసారి చూడాలని పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ నేపథ్యంలో కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్సద వ్యాఖ్యలు చేశారు. విమానంలో మృతదేహాన్ని తరలిస్తే ఎక్కువ చోటు ఆక్రమిస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. హుబ్లీ-ధార్వాడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ మాట్లాడుతూ.. నవీన్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు పయత్నాలు జరుగుతున్నాయన్నారు. అయితే, యుద్దం జరుగుతున్న ప్రాంతం నుంచి బతికున్న వారిని తీసుకువచ్చేందుకే పరిస్థితులు ఎంతో సవాల్‌తో కూడుకున్నాయని.. అలాంటిది చనిపోయిన వారిని తీసుకురావడం ఎంతో కష్టంతో కూడుకున్నదని వెల్లడించారు. ఈ క్రమంలోనే విమానంలో మృతదేహం ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దానికి బదులుగా ఆ ప్లేసులో 8-10 మంది కూర్చోవచ్చు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. నవీన్ డెడ్ బాడీని రెండు రోజుల్లో ఇంటికి తీసువస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు నవీన్ తండ్రి జ్ఞానగౌడ్ తెలిపారు. తన కుమారుడి మృతదేహాన్నిఇంటికి తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా తాను ప్రధాని మోదీని, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని అభ్యర్థించినట్లు ఆయన చెప్పారు. -
సస్పెన్స్ వీడిన వాటర్ ట్యాంక్ డెడ్‌బాడీ.. కిషోర్‌గా గుర్తింపు
సాక్షి, ముషీరాబాద్: చిలకలగూడ జలమండలి సబ్ డివిజన్ పరిధిలోని ఎన్ఆర్కె నగర్‌లోని వాటర్ ఓవర్‌హెడ్ ట్యాంకులో డెడ్‌బాడీపై బుధవారం సస్పెన్స్ వీడింది. ట్యాంక్‌లో పడి కుళ్లిన శవాన్ని కిషోర్‌గా.. అతని సోదరి డెడ్‌బాడీని గుర్తించింది. సంఘటనా స్థలంలో చెప్పుల ఆధారంగా గుర్తించారు. స్థానికంగా కిషోర్ పేయింటింగ్ వర్క్స్ చేస్తూ ఉండేవాడని, మద్యానికి బానిసైనట్లు తెలిపారు. 20 రోజుల క్రీతం చిక్కడపల్లి పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. మరోవైపు కొద్ది రోజులుగా ఈ ట్యాంకు నుంచి సరఫరా అయిన నీటిని తాగిన రిసాలగడ్డ అంబేడ్కర్‌నగర్, హరినగర్, కృష్ణనగర్, శివస్థాన్‌పూర్, బాకారం ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కృష్ణా పైప్‌లైన్ మరమ్మతుల నేపథ్యంలో ఈనెల 8, 9వ తేదీలలో నగరంలోని నీటి సరఫరా నిలిపివేస్తుందని జలమండలి ప్రకటించింది. ఈ నేపథ్యంలో ట్యాంకును శుభ్రం చేసేందుకు వెళ్లిన వారికి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సాయంత్రం 6గంటల సమయంలో డీఆర్ఎఫ్ సిబ్బంది మృతదేహాన్ని బయటకుతీశారు. బయటకు తీసిన మృతదేహం కుళ్లిపోయి ఉంది. వెంటనే ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించిన విషయం తెలిసిందే. -
Real Life Horror Story: 8 వారాలుగా శవంతోనే.. అసలు విషయమే తెలియదట!
గత ఏడాది మేలో కరోనా ఉదృతి పెరిగినప్పుడు అమెరికాలో చాలామంది ఇళ్లకే పరిమితమయిన విషయం తెలిసిందే. ఆ టైంలో అమెరికాకు చెందిన ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. కరోనా కేసులు అధికంగా ఉన్న రోజుల్లో ఆమె కేవలం మూడే అడుగుల దూరంలో 8 వారాలపాటు శవంతో గడిపింది. ఐతే ఆమెకు ఆవిషయమే తెలియదట. అసలేంజరిగిందంటే.. అమెరికాలో లాస్ ఏంజెల్స్‌లోని ఓ అపార్ట్మెంట్లో రిగాన్ బెల్లీ అనే మహిళ ఒంటరిగా ఉంటోంది. ఒక రోజు హఠాత్తుగా తన అపార్ట్మెంట్లో దుర్వాసన రావడం ప్రారంభించింది. ఆ వాసనకి తలనొప్పి, రాత్రుల్లు నిద్రపట్టక ఆరోగ్యంకూడా బాగా పాడైపోయిందట. అంతేకాకుండా పురుగులు, సాలెపురుగులు విపరీతంగా పెరిగిపోయాయట. దీంతో ఆమె అపార్ట్మెంట్ మేనేజర్‌కి కంప్లైంట్ చేసింది. తనకు చనిపోయిన చేప వాసన వస్తోందని, కానీ దరిదాపుల్లో ఎక్కడా చెరువు లేకపోవడంతో, పక్కింటి కుక్క చచ్చిపోయిందేమోననే అనుమానం వ్యక్తం చేసింది. ఐతే వారిని అడిగితే కంగారు పడతారేమోనని మేనేజర్ చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! కొన్ని రోజుల తర్వాత ఆ దుర్వాసన భరించలేక మేనేజర్ని రప్పించి అపార్ట్మెంట్ బ్లాక్‌ను పరిశీలించడానికి ఒక వ్యక్తిని పురమాయించారు. ఐతే పక్క అపార్ట్మెంట్ నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో మెట్లు కూడా ఎక్కలేకపోయాడు సదరు వ్యక్తి. మాస్టర్ కీతో ఆ ఇంటి తలుపు తీయడంతో అస్థిపంజరంగా మారిన శవం కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఆమె రూం మరణించిన వ్యక్తి ప్లాట్‌కి కేవలం 3 అడుగుల దూరంలో మాత్రమే ఉంది. కొద్ది రోజుల క్రితం ఆమె ఆ రూంలో పడుకుంది కూడా. ఐతే ఆమెకు అసలు అక్కడ శవం ఉందనే విషయమే తెలియదట. ఆమె పక్క అపార్ట్మెంట్లో ఉండే వ్యక్తి మరణించి రెండు నెలలౌతున్నా అసలెవ్వరూ గమనించకపోవడం కొసమెరుపు. కాగా రిగాన్ బెల్లీ టిక్‌టాక్ ద్వారా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని తాజాగా వెల్లడించింది. చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! -
కులాంతర వివాహం చేసుకున్నాడని..
శ్రీశైలంప్రాజెక్ట్: కుమారుడు కులాంతర వివాహం చేసుకున్నాడని 15 సంవత్సరాలుగా బాంధవ్యాలను తెంపుకున్నాడు ఓ తండ్రి. చివరకు కుమారుడి మృతదేహాన్ని కూడా చూడడానికి తల్లిదండ్రులు నిరాకరించి ఇంటికి తాళం వేసి వెళ్లారు. వివరాలు.. సున్నిపెంటలో వ్యాపారం చేసుకుంటున్న మాలపాటి బసిరెడ్డికి నలుగురు సంతానం. రెండో కుమారుడైన రామకృష్ణారెడ్డి 15 ఏళ్ల క్రితం దళిత కులానికి చెందిన బెజవాడ వీరమ్మను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అది సహించలేని తండ్రి కుమారునితో తెగదెంపులు చేసుకున్నాడు. కృష్ణారెడ్డి ప్రైవేట్ జీప్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత శుక్రవారం రాత్రి ప్రకాశం జిల్లా పుచ్చకాయల పల్లికి సమీపంలో జీపులో వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. చికిత్స నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి్పంచగా కోలుకోలేక శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువస్తారని భావించిన తల్లిదండ్రులు శనివారం ఉదయం నుంచే ఇంటికి తాళాలు వేసి ఎటో వెళ్లిపోయారు. కృష్ణారెడ్డి మృతదేహాన్ని భార్య వీరమ్మ, కుమార్తెలు మానస, కవిత.. తన తాత బసిరెడ్డి ఇంటికి తీసుకురాగా తాళాలు వేసి ఉండడంతో ఇంటి ముందే కొద్ది సేపు మృతదేహాన్ని ఉంచి అంత్యక్రియలకు తరలించారు. ప్రైవేట్ జీప్ ఓనర్లు, డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణారెడ్డి కుటుంబానికి వారు రూ.15 వేల ఆరి్ధక సహాయాన్ని అందించారు. చదవండి: అర్ధరాత్రి కారు చీకటి.. ఆ ఫోన్ కాల్ కాపాడింది బాలిక కిడ్నాప్ కేసు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. -
చనిపోయాడని తెలియక.. రాత్రంతా మృతదేహంపై నిద్ర..!
జగదేవ్‌పూర్ (గజ్వేల్): ప్రమాదంలో బాబాయ్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలియని ఆ పసివాడు.. అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ ఏడు గంటలపాటు మృతదేహంపైనే నిద్రపోయాడు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. మర్కూక్ మండలం నర్సన్నపేటకి చెందిన ఎక్కలదేవి ఐలయ్య(28) శనివారం రాత్రి పది గంటల సమయంలో జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్‌లోని తన బావ వద్దకు అన్న కొడుకు మోక్షిత్ (4)ను బైక్‌పై ఎక్కించుకొని వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాంనగర్ సమీపంలోకి రాగానే రోడ్డుపై ధాన్యం కుప్పలు రాశులుగా కవరు కప్పి ఉన్నాయి. చీకట్లో ధాన్యం కుప్పలు కనిపించకపోవడంతో ఓ కుప్పను ఢీకొట్టి ఎగిరి ఇద్దరూ రోడ్డు కింద పడిపోయారు. ఐలయ్య తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. రాత్రి సమయం కావడంతో అటువైపు ఎవరూ రాలేదు. గాయాలతో షాక్‌కు గురైన బాలుడు ఏడుస్తూ బాబాయ్ మృతదేహంపైనే తల ఆనించి పడుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున వ్యవసాయ పనుల కోసం వెళ్తున్న ఓ రైతు గమనించి గ్రామస్తులకు చెప్పాడు. గ్రామస్తులు వచ్చి చూసేసరికి బాలుడు బాబాయ్ మృతదేహంపై తలపెట్టి పడుకుని ఉన్నాడు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన సర్పంచ్ భానుప్రకాశ్‌రావు బాలుడిని గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. -
వందరోజుల తరువాత.. పూడ్చేసిన మృతదేహాన్ని వెలికితీసి...
మోర్తాడ్ (బాల్కొండ): సౌదీ అరేబియాలో తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా ఖననం చేసిన తన భర్త మృత దేహాన్ని తెప్పించాలని ఢిల్లీ హైకోర్టు ద్వారా న్యాయపోరాటం చేసిన ఓ మహిళ విజయం సాధించింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన సంజీవ్‌కుమార్ (49) దాదాపు 23 ఏళ్ల నుంచి సౌదీలో పనిచేస్తున్నాడు. జనవరి 24న అతనికి గుండెపోటు రావడంతో సౌదీ బీష్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించాడు. జెద్దా భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న ట్రాన్స్‌లేటర్ చేసిన తప్పిదంతో సంజీవ్‌కుమార్‌ను ముస్లింగా భావించి ఆ మత సంప్రదాయాల ప్రకారం సౌదీలోనే ఖననం చేశారు. దీంతో సంజీవ్‌కుమార్ భార్య అంజూశర్మ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. తెలంగాణ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం సహకారంతో ఢిల్లీ హైకోర్టులో పిల్‌ను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అనంతరం సంజీవ్‌కుమార్ మృతదేహాన్ని అంజూశర్మకు స్వాధీన పరచాలని ప్రధాన న్యాయమూర్తి తీర్పు చెప్పారు. హైకోర్టు ఆదేశాలతో పూడ్చి పెట్టిన మృతదేహాన్ని తవ్వితీసి కార్గో విమానంలో బుధవారం ఢిల్లీకి తరలించారు. ఎయిర్‌పోర్టులోనే మృతదేహాన్ని అంజూశర్మకు విదేశాంగ శాఖ అధికారులు అప్పగించారు. -
ఎస్పీ బాలు భౌతికకాయం తరలింపు
సాక్షి, చెన్నై: ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. చెన్నైలోని ఆయన స్వగృహం నుంచి తామరైపాక్కంలోని ఫాంహౌస్‌కు బాలు భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లారు. రేపు (శనివారం) ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తమిళనాడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని శుక్రవారం రాత్రే వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. అంతకుముందు ఆయన నివాసంలో గాన గంధర్వుడిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ‘స్వరస్మారనీయుడి’కి అశ్రు నయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. భారీగా జనం వస్తూనే ఉండటంతో బాలు భౌతికకాయాన్ని ఫాంహౌస్‌కు తరలించారు. రేపు ఉదయం 7.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభవుతుంది. గాన గంధ్వరుడి ప్రతిమ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో శిల్పి రాజకుమార్ వడయార్ శిల్పశాలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రూపుదిద్దుకుంటోంది. గాన గంధ్వరుడిని చిరకాలం స్మరించుకునేలా ఈ ప్రతిమకు ప్రాణం పోశారు. రాజకుమార్ వడయార్ ఇప్పటికే ఎంతో మంది ప్రముఖుల కాంస్య విగ్రహాలను తయారు చేసి పేరు సంపాదించారు. ఎంజీఆర్, జయలలిత తదితర ప్రముఖుల విగ్రహాలను తయారు చేశారు. ఇలా జరగడం బాధ కలిగించింది: కైకాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం సినీపరిశ్రమకు తీరని లోటని సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. ఎస్పీ బాలు నేపథ్య గాయకుడు మాత్రమే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆరోగ్యం కుదుటపడుతుందనుకున్న సమయంలో ఇలా జరగడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. బాలు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.