
సాక్షి, కూచిపూడి(అమృతలూరు): కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో యజమాని మృతి చెందగా, మిత్రుడు గాయాలపాలైన సంఘటన అమృతలూరు మండలం కూచిపూడి గ్రామం లాకుల సమీపంలోని తెనాలి – చందోలు ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిలో ఆదివారం సాయంత్రం జరిగింది.
సేకరించిన వివరాల ప్రకారం.. కూచిపూడి గ్రామానికి చెందిన దిండిగళ్ల శివన్నారాయణ రాజు (40) చుండూరు మండలం చినపరిమి గ్రామంలో పోస్టుమేన్‌గా పని చేస్తుంటాడు. ఆదివారం కారులో శివన్నారాయణరాజు, మిత్రుడు కోరుతాడిపర్రుకు చెందిన నాగరాజును ఆయన గ్రామంలో దించేందుకు తెనాలి నుంచి కోరుతాడిపర్రు గ్రామానికి వెళుతున్నాడు.
లాకుల సమీపంలో కారు అదుపు తప్పి చెట్టుకు ఢీ కొంది. దీంతో శివన్నారాయణ రాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో తెనాలి వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో శివన్నారాయణరాజు మృతి చెందాడు. తీవ్ర గాయాలతో నాగారాజు చికిత్స పొందుతున్నాడు. మృతుని తల్లి శివకుమారి ఫిర్యాదు మేరకు అమృతలూరు ఎస్‌ఐ జెన్నిపోగు క్రాంతి కిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. మృతదేహాన్ని కోసం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శివన్నారాయణ రాజు వివాహమైంది. భార్య గతంలోనే మృతి చెందింది. సంతానం లేరు.
Comments
Please login to add a commentAdd a comment