ప్రతీకాత్మక చిత్రం
గత ఏడాది మేలో కరోనా ఉదృతి పెరిగినప్పుడు అమెరికాలో చాలామంది ఇళ్లకే పరిమితమయిన విషయం తెలిసిందే. ఆ టైంలో అమెరికాకు చెందిన ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. కరోనా కేసులు అధికంగా ఉన్న రోజుల్లో ఆమె కేవలం మూడే అడుగుల దూరంలో 8 వారాలపాటు శవంతో గడిపింది. ఐతే ఆమెకు ఆవిషయమే తెలియదట. అసలేంజరిగిందంటే..
అమెరికాలో లాస్ ఏంజెల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో రిగాన్ బెల్లీ అనే మహిళ ఒంటరిగా ఉంటోంది. ఒక రోజు హఠాత్తుగా తన అపార్ట్‌మెంట్‌లో దుర్వాసన రావడం ప్రారంభించింది. ఆ వాసనకి తలనొప్పి, రాత్రుల్లు నిద్రపట్టక ఆరోగ్యంకూడా బాగా పాడైపోయిందట. అంతేకాకుండా పురుగులు, సాలెపురుగులు విపరీతంగా పెరిగిపోయాయట. దీంతో ఆమె అపార్ట్‌మెంట్ మేనేజర్‌కి కంప్లైంట్ చేసింది. తనకు చనిపోయిన చేప వాసన వస్తోందని, కానీ దరిదాపుల్లో ఎక్కడా చెరువు లేకపోవడంతో, పక్కింటి కుక్క చచ్చిపోయిందేమోననే అనుమానం వ్యక్తం చేసింది. ఐతే వారిని అడిగితే కంగారు పడతారేమోనని మేనేజర్ చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు.
చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !!
కొన్ని రోజుల తర్వాత ఆ దుర్వాసన భరించలేక మేనేజర్‌ని రప్పించి అపార్ట్‌మెంట్ బ్లాక్‌ను పరిశీలించడానికి ఒక వ్యక్తిని పురమాయించారు. ఐతే పక్క అపార్ట్‌మెంట్ నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో మెట్లు కూడా ఎక్కలేకపోయాడు సదరు వ్యక్తి. మాస్టర్ కీతో ఆ ఇంటి తలుపు తీయడంతో అస్థిపంజరంగా మారిన శవం కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఆమె రూం మరణించిన వ్యక్తి ప్లాట్‌కి కేవలం 3 అడుగుల దూరంలో మాత్రమే ఉంది. కొద్ది రోజుల క్రితం ఆమె ఆ రూంలో పడుకుంది కూడా. ఐతే ఆమెకు అసలు అక్కడ శవం ఉందనే విషయమే తెలియదట. ఆమె పక్క అపార్ట్‌మెంట్‌లో ఉండే వ్యక్తి మరణించి రెండు నెలలౌతున్నా అసలెవ్వరూ గమనించకపోవడం కొసమెరుపు.
కాగా రిగాన్ బెల్లీ టిక్‌టాక్ ద్వారా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని తాజాగా వెల్లడించింది.
చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు!
Comments
Please login to add a commentAdd a comment