NightMare
-
ఇల్లు పూర్తయినా.. ఈ అనుభవం మీకూ ఎదురైందా?
తన సొంతింటికి సంబంధించిన చేదు అనుభవాన్ని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పంచుకున్నారు. తన ఇంటి నిర్మాణం పూర్తయినా ప్రాజెక్ట్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అందుకోని కారణంగా సొంతిట్లోకి ప్రవేశించలేకపోయానని పేర్కొన్నారు.సిడ్నీలో జరిగిన క్రెడాయ్-నాట్కాన్ ఈవెంట్లో పీయూష్ గోయల్ మాట్లాడారు. "2012 చివరి నాటికి నా ఇల్లు సిద్ధమైనప్పటికీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేని కారణంగా దాదాపు ఐదారు సంవత్సరాల వరకు ఆ ఇంట్లోకి ప్రవేశించలేకపోయాను" అన్నారు. కేంద్రమంత్రికి ఎదురైన ఈ అనుభవాన్ని చాలా మంది గృహ కొనుగోలుదారులు ఎదుర్కొనే ఉంటారు. ఈ అనిశ్చితి దేశ రియల్ ఎస్టేట్ రంగంలో ఒకప్పుడు సర్వసాధారణంగా ఉండేది. డెవలపర్ల తప్పుల కారణంగా కొనుగోలుదారులు ఇబ్బందులు పడేవారు.అప్పట్లో ఇళ్ల కొనుగోలుదారులు పడే ఇబ్బందులు అలా ఉండేవని, అయితే 2016లో రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) చట్టం (రెరా) ప్రవేశపెట్టడంతో పరిస్థితి గణనీయంగా మారిపోయిందని పీయూష్ గోయల్ వివరించారు. ఇది అవసరమైన పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకువచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. -
Christmas Celebrations: హిమాచల్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
సిమ్లా: క్రిస్మస్ వేడుకల సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్, స్పితికి భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మనాలి-రోహ్తంగ్ హైవేపై అటల్ టన్నెల్ వైపు వెళ్లే మార్గాలు కార్లతో నిండిపోయాయి. పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో పోలీసులు డ్రోన్‌తో నిఘా పెట్టారు. సరిపడా పార్కింగ్ సౌకర్యాలు లేకపోవటం, వాహనాల రద్దీకి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో చాలా మంది పర్యాటకులు పార్కింగ్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. అధికారులు తాత్కాలిక ఏర్పాట్లతో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నదిలో ప్రయాణం.. ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడటానికి ఓ వ్యక్తి లాహౌల్‌లో రోడ్డు మార్గం కాకుండా నది గుండా కారులో ప్రయాణించాడు. ఇలాంటి ప్రమాదకర ప్రయాణం చేయరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. Video of tourist driving car in Chandra river in #Lahaul, Himachal goes viral, please do not expose yourself by doing such useless act. pic.twitter.com/kgLsbvnp3s — Nikhil Choudhary (@NikhilCh_) December 25, 2023 సిమ్లా నగరంలోని హోటళ్లు కిక్కిరిసిపోయాయని ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ పాల్ తెలిపారు. శనివారం నుండి సోమవారం వరకు సెలవులు రావడంతో ఈ ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి పెరిగింది. ధర్మశాల, సిమ్లా, నర్కండ, మనాలి, డల్హౌసీ తదితర ప్రాంతాలతో పాటు హిమాచల్‌లో క్రిస్మస్ వేడుకలు చేసుకునేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సిమ్లా పోలీసులు నగరంలో వాహనాల ప్రవేశ డేటాను విడుదల చేశారు దీని ప్రకారం గత 72 గంటల్లో సిమ్లాకు 55,345 వాహనాలు వచ్చాయి. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇదీ చదవండి: యేసుక్రీస్తు బోధనలు దేశాభివృద్ధికి మార్గనిర్దేశం: ప్రధాని మోదీ -
వెయిటర్‌కి కోట్లలో జాక్‌పాట్ తగిలింది! అదే ఆమె జీవితాన్ని..
కోట్లల్లో లాటరీ తగిలితే వాట్ ఏ జాక్‌పాట్ అని ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఒక్క క్షణంలో జీవితమే మారిపోయింది అని సంబరపడిపోతాం. అది కూడా ఓ సాధారణ వెయిటర్‌లా పనిచేస్తున్న వ్యక్తికి ఇలాంటి అదృష్టం దక్కితే అతడి సంతోషానికి అవధులే ఉండవు. కానీ అతడికి ఆ లాటరీ టికెట్ శాపమైపోయింది. ఎందుకు తగిలిందిరా బాబు అని జుట్టు పీక్కునేలా చుక్కలు చూపించింది. ఇందేంటి అనుకుంటున్నారా..!ఇంకెందుకు ఆలస్యం అలా ఎలా అయ్యిందో త్వరగా చదివేయండి మరీ..! ఫోరిడాలోని అలబామాలోని వాఫిల్ హౌస్ హోటల్‌కి ఎడ్వర్డ్ సెవార్డ్ అనే కస్టమర్ వచ్చాడు. అతడు వెళ్లిపోతూ వెయిటర్ టోండా డికర్సన్ అనే మహిళకి తాను ఫ్లోరిడాలో కొనుగోలు చేసిన లాటరీని టిప్‌గా ఇచ్చాడు. ఈ ఘటన మార్చి 6, 1999లో చోటు చేసుకుంది. అనూహ్యంగా ఆ మరుసటి రోజే ఆ లాటరీ టికెటే విజేతగా ప్రకటించబడింది. దీంతో డికర్సన్‌కి ఆ లాటరీలో ఏకంగా రూ. 73 కోట్లకు పైగా సోమ్ము వచ్చింది. అంతే ఇక తన జీవితం మారబోతుందన్న ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయింది డికర్సన్. అంతేగాదు ఆ వాఫిల్ హౌస్‌లోని మిగతా ఉద్యోగులు కూడా డికర్సన్‌కి లాటరీ తగలిందని సంతోషంగా ఉన్నారు. అక్కడ ఆ హోటల్లో తమ ఉద్యోగులు ఎవరైనా జాక్‌పాట్ కొట్టినట్లయితే ఆ వచ్చిన మొత్తాన్ని అందరూ షేర్ చేసుకుంటామని ఒప్పదం చేసుకున్నారు. ఇప్పడు డికర్సన్ ఇప్పుడు అందుకు ఇష్టపడటం లేదు. దీంతో సహోద్యోగులు కోపంతో ఆమెపై కేసు పెట్టారు. అయితే కోర్టు ఆ ఒప్పదం నోటిమాటే గానీ అధికారికంగా ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని వెల్లడించింది. అలబామా చట్టం ఇలాంటి ఒప్పందాలు చట్టం విరుద్ధం కాదని చెబుతుండటంతో కోర్టు ఆ కేసుని కొట్టేసింది. అలాగే డికర్సన్ గెలుచుకున్న మొత్తాన్ని తన వద్ద ఉంచుకోవచ్చని తీర్పు ఇచ్చేసింది. ఇలా డికర్సన్ తన సహోద్యోగులతో పంచుకోలేదన్న విషయం లాటరీ టికెట్ ఇచ్చిన ఎడ్వర్ సెవార్డ్కి తెలుస్తుంది. దీంతో అతను కూడా డికర్సన్పై కేసు పెట్టాడు. తన సహోద్యుగులకు డికర్సన్ వాటా ఇవ్వాల్సిందే అని కోర్టుని ఆశ్రయించాడు. ఐతే కోర్టు అతడి కేసుని కూడా కొట్టేసింది. అయితే డికర్సన్‌కి ఆ కోర్టు కష్టాలు అక్కడితో ఆగలేదు. హమ్మయ్యా!.. అని అన్ని అడ్డంకులు దాటుకుని తన స్నేహితుడితో కలిసి ఎస్ కార్పోరేషన్ అనే కంపెనీని పెట్టింది. అయితే ఆ కంపెనీ ట్యాక్స్‌లు పెద్ద మొత్తంలో ఎగ్గొట్టినట్టు ఆరోపణలు వచ్చి.. మళ్లీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్(ఐఆర్స్) ఎదుర్కొంటోంది. డికర్సన్ తన కుటుంబానికి రూ. 20 కోట్లు బహుమతిగా ఇచ్చిందన్న అంశం తెరపైకి వచ్చి రాద్ధాంతంగా మారింది. ఆమె గెలుచుకున్న మొత్తంలో సుమారు 51% గిఫ్ట్‌గా ఇచ్చినట్లు ఐఆర్ఎస్ చెబుతోంది. ఐతే డికర్సన్ అది గిఫ్ట్ కాదని తమ కుటుంబంలో ఎవరైన పెద్ద మొత్తంలో గెలుచుకుంటే అది అందరం షేర్ చేసుకోవడం జరుగుతుందని, అదికూడా ఒకరి బాగోగులు చూసుకోవడంలో భాగంగానే అని వివరణ ఇచ్చుకుంది. ఇలా ఆమెను 12 ఏళ్ల పాటు ఇన్కమ్ ట్యాక్స్ కష్టాలు వెంటాడాయి. ఆ విధంగా ఆమె ఉదారంగా గెలుచుకున్న సొమ్ములో దాదాపు రూ. 9 కోట్ల వరకు పన్నుల రూపంలో చెల్లించాలని 2012లో కోర్టు ఆమెను ఆదేశించింది. కోట్లలో డబ్బు గెలుచుకుందన్నమాటే గానీ ట్యాక్స్‌లు సహోద్యోగుల రూపంలో కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కోట్లాధికారిగా మారానన్న సంతోషాన్ని మాత్రం ఇవ్వలేదు సరికదా!. ఆ లాటరీ తగిలాక ప్రతి నిమిషం ఓ టెన్షన్.. టెన్షన్..అన్నట్లుగా మారిపోయింది జీవితం. టైం బ్యాడ్‌గా ఉంటే అదృష్టం కూడా దురదృష్టంలా ఏడిపించేస్తుందేమో. బహుశా ఊరికే వచ్చిన సొమ్ము లేదా నడిమంత్రపు సిరి ఎక్కువ కాలంనిలవదు అంటే ఇదేనేమో కదా..!. In 1999, waitress Tonda Dickerson was tipped a lottery ticket and won $10,000,000. Her colleagues then sued her for their share. Then she was sued by the man who tipped her the ticket. Later, she was kidnapped by her ex-husband and had to shoot him in the chest. Finally, she… pic.twitter.com/KpDR4lhN4I — Fascinating (@fasc1nate) December 11, 2023 (చదవండి: 24 గంటలూ ఓపెన్... సిబ్బంది మాత్రం నిల్!) -
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఆ సంఘనటతో హనీమూన్ క్యాన్సిల్
చాలామంది నిద్రలో గట్టిగా అరవడం, కేకలు వేయడం చేస్తుంటారు. ఏదో కలలో అలా చేసి ఉండొచ్చు అని అనుకోవద్దు. ఎందుకంటే ఇదంత చిన్న విషయమేమీ కాదు. నిద్రల్లో లేచి బిగ్గరగా ఏడవడం, భయంతో వణికిపోవడం వంటివి తరచూ చేస్తూ అది నిజంగా జబ్బే. ఈ పరిస్థితిని నైట్ టెర్రర్ లేదా స్లీప్ టెర్రర్ అని అంటారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? పెద్దవారిలోనూ ఈ సమస్య వస్తుందా? అన్నది ఇప్పుడు చూద్దాం. మాధురి, మాధవ్ అందమైన జంట. ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హనీమూన్ కోసం కేరళ వెళ్లినప్పుడు నిద్రలో మాధురి గట్టిగా అరుస్తోంది. మాధవ్ లేచి చూసేసరికి భయపడి వణికిపోతోంది. ఆమెను పట్టుకుని కుదిపాడు. అయినా మాధురి నార్మల్ స్టేజ్‌కు రాలేదు. ఆమె అరుపులకు హోటల్ స్టాఫ్ కూడా వచ్చారు. పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. హనీమూన్ కేన్సిల్ చేసుకుని వచ్చేశారు. ఆ రాత్రి ఎందుకలా అరిచావని మాధురిని అడిగితే... ఏదో పీడకల వచ్చిందని చెప్పింది. కానీ ఆ తర్వాత కూడా అప్పుడప్పుడూ అలాగే జరుగుతోంది. కారణమేంటని అడిగితే, చిన్నప్పటినుంచి తాను అప్పుడప్పుడూ అలా అరుస్తానని, కారణం తనకూ తెలియదని చెప్పింది. జీవితాంతం దీన్ని భరించాల్సిందేనా అని ఆందోళన చెందాడు. గూగుల్ చేసి అదో స్లీప్ డిజార్డర్ అని అర్థం చేసుకుని కౌన్సెలింగ్ కు తీసుకువచ్చాడు. స్లీప్ టెర్రర్స్... మాధురి సమస్యను స్లీప్ టెర్రర్స్ లేదా నైట్ టెర్రర్స్ అంటారు. నిద్రలో జరిగే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలను పారాసోమ్నియాగా పరిగణిస్తారు. నిద్రలో ఉన్నప్పుడు అరుపులు, తీవ్రమైన భయం దీని ప్రాథమిక లక్షణాలు. ఇది సాధారణంగా సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువసేపు ఉండవచ్చు. ఇది 40 శాతం మంది పిల్లల్లో కనిపిస్తుంది, సాధారణంగా యుక్తవయసులో దాన్ని అధిగమిస్తారు. కానీ తక్కువశాతం పెద్దల్లో కూడా స్లీప్ టెర్రర్స్ కనిపిస్తుంటాయి. అందులో మాధురి కూడా ఒకరు. స్లీప్ టెర్రర్స్, పీడకలలు ఒకటి కాదు. స్లీప్ టెర్రర్ లక్షణాలు యుక్త వయసు తర్వాత కూడా స్లీప్ టెర్రర్స్ వస్తున్నా, దీనివల్ల పగలు అధికంగా నిద్ర వచ్చి వర్క్ ప్లేస్‌లో సమస్యలు ఎదురవుతున్నా వెంటనే సైకాలజిస్ట్‌ను కలవాల్సిన అవసరం ఉంది. శారీరక, మానసిక పరీక్షల అనంతరం మీ సమస్యను నిర్ధారిస్తారు. అవసరమైతే పాలిసోమ్నోగ్రఫీకి (నిద్ర అధ్యయనం) సిఫారసు చేస్తారు. లక్షణాలు ఇలా ఉంటాయి ... · నిద్రలో భయపెట్టే అరుపులు · కళ్లు పెద్దవి చేసి చూడటం · మంచం మీద కూర్చొని భయంగా కనిపించడం · గట్టిగా ఊపిరి పీల్చుకోవడం, మొహం ఎర్రగా మారడం · మేల్కొలపడానికి ప్రయత్నిస్తే తన్నడం, కొట్టడం · మర్నాడు ఉదయం దాని గురించి జ్ఞాపకం లేకపోవడం పిల్లల్లో, మహిళల్లో ఎక్కువ... స్లీప్ టెర్రర్స్ అనేవి నిద్రలో సంభవిస్తాయి. కుటుంబ సభ్యులకు స్లీప్ టెర్రర్స్ లేదా స్లీప్ వాకింగ్ చరిత్ర ఉంటే స్లీప్ టెర్రర్స్ సర్వసాధారణం. పిల్లల్లో, ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది. · నిద్ర లేమి, విపరీతమైన అలసట · మానసిక ఒత్తిడి · నిద్ర షెడ్యూల్‌కు అంతరాయాలు లేదా నిద్రలో అంతరాయాలు · తరచూ ప్రయాణాలు · జ్వరం · నిద్రలో ఉన్నప్పుడు శ్వాస సంబంధమైన సమస్యలు · రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్, డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలు, · మద్యం వినియోగం ప్రశాంతత ముఖ్యం... మీకు లేదా మీ పిల్లలకు స్లీప్ టెర్రర్స్ ఉంటే దాన్నుంచి తప్పించుకోవడానికి కొన్ని వ్యూహాలు ఉన్నాయి. · మీకు నిద్ర లేమి ఉంటే, ముందుగా నిద్రపోయే సమయాన్ని షెడ్యూల్ చేసుకోండి. నిద్రకు ఆటంకం కలిగించే మొబైల్ ఫోన్, అలారం లాంటి వాటిని దూరంగా పెట్టండి. · అలసట, ఆందోళన స్లీప్ టెర్రర్స్కు దోహదం చేస్తాయి. అందువల్ల నిద్రవేళకు ముందు ప్రశాతంగా ఉండేలా చూసుకోండి. · స్లీప్ టెర్రర్స్ వల్ల గాయపడే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ బెడ్ రూమ్‌ను సురక్షితంగా మార్చండి. తలుపులు మూసివేయండి. పదునుగా ఉండే వస్తువులను అందుబాటులో ఉంచుకోవద్దు. · నిద్రపోయే ముందు పుస్తకాలు చదవడం, పజిల్స్ చేయడం లేదా వెచ్చని నీళ్లతో స్నానం చేయడం లాంటివి మంచి నిద్రకు సహాయపడతాయి. ధ్యానం లేదా రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కూడా సహాయపడవచ్చు. · మీ పిల్లలకు స్లీప్ టెర్రర్ ఉంటే, వాళ్లు నిద్రపోయాక ఎంత సమయానికి ఆ ఎపిసోడ్ వస్తుందో గమనించండి. దానికి పది నిమిషాల ముందు నిద్రలేపితే సరి. · మీ పిల్లలకు స్లీప్ టెర్రర్ ఎపిసోడ్ వస్తే, కదిలించడం లేదా అరవడం వల్ల పరిస్థితి మరింత దిగజారవచ్చు. అందుకే బిడ్డను కౌగిలించుకుని శాంతింపచేయండి. ప్రశాతంగా మాట్లాడండి. దానంతట అందే ఆగిపోతుంది. · ఈ పనులన్నీ చేసినా ఫలితం లేకపోతే సైకాలజిస్ట్‌లను కలవడం తప్పనిసరి. భద్రతను ప్రోత్సహించడం, ట్రిగ్గర్లను తొలగించడంపై వారు దృష్టి పెడతారు. · కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, హిప్నాసిస్, బయోఫీడ్‌బ్యాక్ లేదా రిలాక్సేషన్ థెరపీ ద్వారా మీకు సహాయపడతారు. -సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
కత్తిమీద సాములా భయపెట్టిస్తున్నా.. కర్తవ్యంగా స్వీకరిస్తున్నా! రిషి సునాక్
బ్రిటన్ ప్రధానిగా అత్యున్నత పదవిని అలంకరించిన రిషి సునాక్ తన ప్రధాని పదవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉద్యోగం తనకు కత్తిమీద సాములాంటిదే అయినా దీన్ని తన కర్తవ్యంగా భావించి సమర్ధవంతంగా చేస్తానని చెప్పారు. ఈ మేరకు మీడియా సమావేశంలో భారత సంతతి వ్యక్తిగా ఈ పదవిని చేపట్టి సరిగ్గా వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా రిషి సునాక్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఈ బాధ్యతలను చాలా వైవిధ్యంగా పూర్తి చేయగలనని చెప్పారు. హిందూమతంలో ఉన్న 'ధర్మం' అనే భావన తనకు ప్రేరణ అని, అదే ఈ పదవిని తన కర్తవ్యంగా మారుస్తుందని చెప్పుకొచ్చారు. అదే తనకు ప్రజలు ఆశించిన విధంగా పనిచేసేందుకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. అలాగే తాను సేవను ప్రగాఢంగా విశ్వశిస్తునని తెలిపారు. అందుకే ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులు గురించి తెలిసినా..ముందుకు వచ్చానని చెప్పారు. తన భార్య అక్షతామూర్తి గురించి కూడా ప్రస్తావించారు. ఆమెకు తాను ఎలా ప్రపోజ్ చేసింది, ఆమె తనకిస్తున్న సపోర్టు గురించి కూడా మాట్లాడారు. అలాగే ఆయన ఆదాయ వివరాలు గురించి ప్రశ్నించగా.. ఎప్పటిలానే మౌనం వహించారు. అదే సమయలో పన్ను రిటర్న్‌లకు సంబంధించిన విషయాలు, ఆర్థిక విషయాలను పారదర్శకంగా ఉంచడానికి సిద్ధంగానే ఉన్నట్లు తెలిపారు. వేతనం విషయమై ప్రభుత్వ రంగ ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకత గురించి ప్రస్తావించగా..తాను నర్సులకు భారీ వేతనం పెంచేందుకు ఇష్టపడతానని చెప్పారు. కానీ అలా చేస్తే ద్రవ్యోల్బణం పెరుతుందని అందువల్ల తాను చేయలేనని కూడా చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనాదరణ పొందకపోయినా పర్వాలేదు గానీ ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా దేశానికి దిశా నిర్దేశం చేయడమే కీలమైన చర్య అని సునాక్ చెప్పారు. (చదవండి: చైనా నిఘా బెలూన్ వ్యవహారం: అంతలోనే అక్కడ మరొకటి!) -
మాటిమాటికీ పీడకలలు వస్తుంటే.. ఇలా చేశారంటే!
పీడకలలు రావడం ఏదో ఒక సమయంలో అందరి అనుభవంలోకి వచ్చే విషయమే. అయితే... తీవ్రమైన మానసిక ఒత్తిడి గురైనవారితో పాటు అత్యంత ఆవేదనభరితమైన పరిస్థితుల్లో బాధపడుతూ ఉండేవారికి తరచూ పీడకలలు వచ్చే అవకాశం ఉంది. ఇంకొందరిలో సుదీర్ఘ విమాన ప్రయాణం తర్వాతి జెట్లాగ్ తర్వాతా పీడకలలు రావచ్చు. నిజానికి జీవితంలోని ఏదో ఒక సమయంలో పీడకలలు రానివారంటూ ఉండరు. అయితే... కొందరిలో రోజూ అలాంటి కలలే వస్తూ ఉండటం... వాటి ప్రభావం అన్ని విధాలా వారి రోజువారీ జీవితంపైనా, సామాజికంగా, వృత్తిపరంగా, ఆర్థికంగా పడటం, దాంతో వారు ఇతరత్రా తమ పనులేవీ చేసుకోలేనంతగా ఒత్తిడికీ, ఆందోళనకూ, వేదనకూ గురికావచ్చు. అలా మాటిమాటికీ పీడకలలు వచ్చే కండిషన్‌ను ‘నైట్మేర్ డిజార్డర్’గా చెబుతారు. గతంలో ఈ మానసిక సమస్యను ‘డ్రీమ్ యాంగ్జైటీ డిజార్డర్’ అనే వారు. అయితే ఇప్పుడు ఈ సమస్యను ‘నైట్మేర్ డిజార్డర్’ లేదా ‘రిపీటెడ్ నైటమేర్స్’ అంటున్నారు. చాలా సందర్భాల్లో ‘నైట్మేర్ డిజార్డర్’ సమస్యకు మందుల అవసరం ఉండకపోవచ్చు. ఇలాంటి బాధితులకు సాంత్వన కలిగించడం, ధైర్య వచనాలు చెప్పడం, తనకు యాంగ్జైటీ, ఒత్తిడి కలిగించే అంశాల విషయంలో కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా ఈ సమస్యను చాలావరకు పరిష్కరించవచ్చు. అయితే కొంతమందిలో ఈ తరహా కలలు రావడానికి ఏదో అంతర్గత కారణం ఉండి ఉంటుంది. అలాంటి అండర్ లైయింగ్ మెడికల్ సమస్యలకు తగిన మందులు ఇవ్వడం ద్వారా కూడా ఇలాంటి కలలు రాకుండా చూడవచ్చు. మానసిక వైద్యనిపుణుల పర్యవేక్షణలో స్ట్రెస్ రెడ్యూసింగ్ టెక్నిక్‌లతో బాధితుల్లో ఒత్తిడి తగ్గించడం వల్ల కూడా ఇవి తగ్గిపోవచ్చు. ఇక చాలా భయంకరమైన యుద్ధం, కుటుంబంపై దాడి, ఏవైనా కారణాలతో కుటుంబమంతా అల్లకల్లోలం కావడం వంటి అత్యంత తీవ్రమైన వేదన కలిగించే దుర్ఘటన తర్వాత కలిగే... ‘పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్’కు లోనైనవారిలో ‘ఇమేజరీ రిహార్సల్ థెరపీ’ అనే చికిత్సను అందిస్తారు. ఇందులో బాధితుల్లో వచ్చే పీడకల చివర్లో అంతా సుఖాతమైనట్లుగా అతడి మనసులో నాటుకుపోయేలా చేస్తారు. దాంతో పీడకలలు క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంది. -
Real Life Horror Story: 8 వారాలుగా శవంతోనే.. అసలు విషయమే తెలియదట!
గత ఏడాది మేలో కరోనా ఉదృతి పెరిగినప్పుడు అమెరికాలో చాలామంది ఇళ్లకే పరిమితమయిన విషయం తెలిసిందే. ఆ టైంలో అమెరికాకు చెందిన ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. కరోనా కేసులు అధికంగా ఉన్న రోజుల్లో ఆమె కేవలం మూడే అడుగుల దూరంలో 8 వారాలపాటు శవంతో గడిపింది. ఐతే ఆమెకు ఆవిషయమే తెలియదట. అసలేంజరిగిందంటే.. అమెరికాలో లాస్ ఏంజెల్స్‌లోని ఓ అపార్ట్మెంట్లో రిగాన్ బెల్లీ అనే మహిళ ఒంటరిగా ఉంటోంది. ఒక రోజు హఠాత్తుగా తన అపార్ట్మెంట్లో దుర్వాసన రావడం ప్రారంభించింది. ఆ వాసనకి తలనొప్పి, రాత్రుల్లు నిద్రపట్టక ఆరోగ్యంకూడా బాగా పాడైపోయిందట. అంతేకాకుండా పురుగులు, సాలెపురుగులు విపరీతంగా పెరిగిపోయాయట. దీంతో ఆమె అపార్ట్మెంట్ మేనేజర్‌కి కంప్లైంట్ చేసింది. తనకు చనిపోయిన చేప వాసన వస్తోందని, కానీ దరిదాపుల్లో ఎక్కడా చెరువు లేకపోవడంతో, పక్కింటి కుక్క చచ్చిపోయిందేమోననే అనుమానం వ్యక్తం చేసింది. ఐతే వారిని అడిగితే కంగారు పడతారేమోనని మేనేజర్ చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! కొన్ని రోజుల తర్వాత ఆ దుర్వాసన భరించలేక మేనేజర్ని రప్పించి అపార్ట్మెంట్ బ్లాక్‌ను పరిశీలించడానికి ఒక వ్యక్తిని పురమాయించారు. ఐతే పక్క అపార్ట్మెంట్ నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో మెట్లు కూడా ఎక్కలేకపోయాడు సదరు వ్యక్తి. మాస్టర్ కీతో ఆ ఇంటి తలుపు తీయడంతో అస్థిపంజరంగా మారిన శవం కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఆమె రూం మరణించిన వ్యక్తి ప్లాట్‌కి కేవలం 3 అడుగుల దూరంలో మాత్రమే ఉంది. కొద్ది రోజుల క్రితం ఆమె ఆ రూంలో పడుకుంది కూడా. ఐతే ఆమెకు అసలు అక్కడ శవం ఉందనే విషయమే తెలియదట. ఆమె పక్క అపార్ట్మెంట్లో ఉండే వ్యక్తి మరణించి రెండు నెలలౌతున్నా అసలెవ్వరూ గమనించకపోవడం కొసమెరుపు. కాగా రిగాన్ బెల్లీ టిక్‌టాక్ ద్వారా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని తాజాగా వెల్లడించింది. చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! -
పాపం రోహిత్ శర్మ!
హామిల్టన్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు మధుర జ్ఞాపకంగా మిగులుతుందనుకున్న మ్యాచ్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. 200 వన్డేలు ఆడిన 14వ భారత ఆటగాడిగా ఖ్యాతికెక్కిన అతడికి ‘స్పెషల్ మ్యాచ్’ పీడకలగా మారింది. న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన వన్డే రోహిత్ శర్మకు 200వ మ్యాచ్. ఇది తనకెంతో ప్రత్యేకమైన మ్యాచ్ అని చెప్పిన కొద్ది నిమిషాలకే ఊహించనివిధంగా అతడికి షాక్ తగిలింది. కోహ్లి స్థానంలో నాయకత్వ బాధ్యతలు కూడా చేపట్టి జట్టును నడిపించిన రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ ఘోర పరాభవాన్ని మిగిల్చింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ దిగిన భారత జట్టు వడివడిగా వికెట్లు చేజార్చుకుంది. 35 పరుగులకే టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో టీమిండియా కోలుకోలేపోయింది. కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ పదునైన బంతులకు భారత బ్యాట్స్మన్ల దగ్గర సమాధానం లేకపోయింది. స్పెషల్ మ్యాచ్‌లో సత్తా చాటుతాడుకున్న రోహిత్ సహా అందరూ చేవ చూపకపోవడంతో టీమిండియా ఘోర పరాజయాన్ని నమోదు చేసింది. 23 బంతులు ఎదుర్కొన్న రోహిత్ కేవలం 7 పరుగులే చేసి నిరాశపరిచాడు. తర్వాత అందరూ అతడి దారిలోనే పయనించారు. వరుసగా మూడు వన్డేల్లో కివీస్‌ను చిత్తు చేసిన జట్టు కేవలం ఇద్దరు ఆటగాళ్లు లేకపోవడం వల్ల ఇంత పేలవ ప్రదర్శన చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. క్రీడా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తాను ఈ స్థాయికి వచ్చానని మ్యాచ్‌కు ముందు రోహిత్ చెప్పాడు. ఆటలోనూ గెలుపోటములు సహజమే కానీ ఇంత దారుణంగా ఓడిపోవడమే టీమిండియా అభిమానులకు మింగుడుపడటం లేదు. చివరి వన్డేలో ఏం చేస్తారో చూడాలి. (చిత్తుగా ఓడిన టీమిండియా) -
ఆ మ్యాచ్ చీర్ లీడర్లకు పీడకల..
ఆటలోని మజా రెట్టింపయ్యేలా అద్భుత నృత్యాలు చేస్తూ ప్రేక్షకులను రంజింపజేసే చీర్ లీడర్లు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. తమవైపు దూసుకువస్తోన్న వికృత రూపాలను చూసి వణికిపోయారు. ఆ మ్యాచ్ వారికి పీడకల. అవునుమరి, పచ్చినెత్తురు తాగే పిశాచాలు గ్రౌండ్ లోకి చొరబడితే ఎవరికైనా గుండె ఝల్లుమనదా! జపాన్ లో జరిగిన ఓ బేస్ బాల్ మ్యాచ్ లో సడాకో, కయాకో అనే దెయ్యాలు కాసేపు అందరినీ భయభ్రాతులకు గురిచేశాయి. మన దగ్గర కామినీ పిశాచి, శాకిని, ఢాకినీ, మోహినీ, కొరివి.. లాంటి దయ్యాలున్నట్లే జపాన్ లో సడాకో, కయాకో దయ్యాలు ఫేమస్. పచ్చి మనిషి నెత్తురు మాత్రమే సేవించే ఆ దయ్యాలు కాసేపు బ్యాట్, బాల్ పట్టుకుని హల్ చల్ చేశాయి. నిప్పొన్ హ్యామ్ ఫైటర్స్, యాకుల్ట్ స్వాలో జట్ల మధ్య జరగాల్సిన అసలు మ్యాచ్ కు ముందు ఈ దయ్యాల క్యారెక్టర్లు ఆడిన ఈ ఆట తాలూకు వీడియోకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభిస్తోంది. -
స్కూలు... ఆ చిన్నారులకో పీడ కల
జార్ఖండ్‌లో ఇద్దరు చిన్నారులకు పాఠశాల అనేది ఒక పీడకలగా మిగిలిపోయింది! ఆడుతూపాడుతూ స్కూలుకు వెళ్లాల్సిన వారు బిక్కుబిక్కుమంటూ అడుగులేస్తున్నారు. ఎప్పుడు ఎవరు అవమానిస్తారో అన్న భయంతో ఆ పసి హృదయాలు వణుకుతూ కనిపిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం ప్రొగేరియా. అవును. అత్యంత అరుదుగా వచ్చే ఈ వ్యాధి పాపం ఆ చిన్నారులకు వచ్చింది. వారిలో అంజలి అనే ఆ పాపకు ఎనిమిదేళ్లు. కేశవ్ అనే బాబుకు రెండేళ్లు. కానీ అప్పుడే వారి వయసుకన్నా ఐదు రెట్లు పెద్దవారిగా కనిపిస్తున్నారు. (‘పా’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఈ వ్యాధితో బాధపడుతున్నట్లుగా నటించారు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు). ముఖం వాడిపోయింది. పెద్దవారికి వచ్చినట్లుగా ఒళ్లు నొప్పులు సరే సరి. ఇక స్కూలులో అడుగుపెట్టీ పెట్టగానే తోటి పిల్లలు ముసలివారు.. ముసలివారు అంటూ గేలి చేస్తున్నారు. పాఠాలు వినడం కంటే వారిని అవమానిస్తున్న పిల్లలపై టీచర్లకు ఫిర్యాదుచేయడమే వారికి పెద్ద పనిగా, తల నొప్పిగా మారిపోయింది. వీరి తల్లిదండ్రులు బట్టలు ఉతుకుతూ జీవనం గడుపుతున్నారు. నెల సంపాదన నెలకు రూ.4,500 మాత్రమే.