స్కూలు... ఆ చిన్నారులకో పీడ కల | For This Old Child In Ranchi, School Is The Biggest Nightmare | Sakshi
Sakshi News home page

స్కూలు... ఆ చిన్నారులకో పీడ కల

Published Sat, May 7 2016 12:35 AM | Last Updated on Thu, Apr 4 2019 4:46 PM

స్కూలు... ఆ చిన్నారులకో పీడ కల - Sakshi

స్కూలు... ఆ చిన్నారులకో పీడ కల

జార్ఖండ్‌లో ఇద్దరు చిన్నారులకు పాఠశాల అనేది ఒక పీడకలగా మిగిలిపోయింది! ఆడుతూపాడుతూ స్కూలుకు వెళ్లాల్సిన వారు బిక్కుబిక్కుమంటూ అడుగులేస్తున్నారు. ఎప్పుడు ఎవరు అవమానిస్తారో అన్న భయంతో ఆ పసి హృదయాలు వణుకుతూ కనిపిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం ప్రొగేరియా. అవును. అత్యంత అరుదుగా వచ్చే ఈ వ్యాధి పాపం ఆ చిన్నారులకు వచ్చింది. వారిలో అంజలి అనే ఆ పాపకు ఎనిమిదేళ్లు. కేశవ్ అనే బాబుకు రెండేళ్లు. కానీ అప్పుడే వారి వయసుకన్నా ఐదు రెట్లు పెద్దవారిగా కనిపిస్తున్నారు. (‘పా’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఈ వ్యాధితో బాధపడుతున్నట్లుగా నటించారు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు).

ముఖం  వాడిపోయింది. పెద్దవారికి వచ్చినట్లుగా ఒళ్లు నొప్పులు సరే సరి. ఇక స్కూలులో అడుగుపెట్టీ పెట్టగానే తోటి పిల్లలు ముసలివారు.. ముసలివారు అంటూ గేలి చేస్తున్నారు. పాఠాలు వినడం కంటే వారిని అవమానిస్తున్న పిల్లలపై టీచర్లకు ఫిర్యాదుచేయడమే వారికి పెద్ద పనిగా, తల నొప్పిగా మారిపోయింది. వీరి తల్లిదండ్రులు బట్టలు ఉతుకుతూ జీవనం గడుపుతున్నారు. నెల సంపాదన నెలకు రూ.4,500 మాత్రమే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement