రాంచీ: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను ఓ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం చెందినట్లు సమాచారం. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడి పరిస్థితుల ఆధారంగా.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.
బుధవారం సాయంత్రం జంతారా జిల్లా కళాఝారియా రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అసాన్సోల్-ఝాఝా మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు వీళ్లను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న వైద్య బృందాలు, అంబులెన్స్‌లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
#Jharkhand: Nearly 12 people have lost their lives in a #trainaccident near #KalijhariyaHalt under #Asansol railway division in #Jamtara district. According to sources, these people have been cut off by a passing Express train between #Asansol and #Jhajha. pic.twitter.com/8Zhi2C2zyK
— All India Radio News (@airnewsalerts) February 28, 2024
Comments
Please login to add a commentAdd a comment