రాంచీ: జార్ఖండ్ సాహెబ్‌గంజ్‌లో అత్యంత పాశవిక ఘటన వెలుగుచూసింది. రెండో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని 50 ముక్కలు చేశాడు. వాటిని తీసుకెళ్లి వివిధ ప్రదేశాల్లో పడేశాడు.
నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనం వెనుక మృతురాలి కాలు దొరకడంతో పోలీసులు శనివారం శునకాలను రంగంలోని దింపి ఆ ప్రాంతమంతా వెతికారు. మొత్తం 18 శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కొన్ని లభించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ హత్య కేసులో భర్తను అదపులోకి తీసుకున్నారు. అతని కుటుంబసభ్యుల ప్రమేయం కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
ఆదివాసి తెగకు చెందిన మృతురాలి పేరు రూబిక పహాడిన్(22). దిల్దార్ అన్సారీ అనే వ్యక్తిని ఇటీవలే వివాహం చేసుకుంది. అయితే అతనికి అప్పటికే పెళ్లి అయింది. అయినా ఇద్దరూ రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. రెండో పెళ్లి విషయం మొదటి భార్యకు తెలియడంతో ఆమె గొడవపెట్టుకుంది. దీంతో రూబికతో వాగ్వాదానికి దిగి ఆమెను హతమార్చాడు అన్సారి. అతని కుటుంబసభ్యుల పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.
రూబిక కన్పించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే శరీర భాగాలు లభ్యం కావడంతో అవి ఆమెవే అని పోలీసులు పేర్కొన్నారు. అయితే హత్య అనంతరం తనపై అనుమానం రాకుండా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు అన్సారీ. తన భార్య కన్పిచడం లేదని ఫిర్యాదు చేశాడు. కానీ చివరకు దొరికిపోయాడు.
చదవండి: విషాదం.. అమెరికాలో భారత వ్యాపారవేత్త మృతి
Comments
Please login to add a commentAdd a comment