Husband killed wife
-
విధి అంటే ఇదేనేమో!.. అటు భార్య.. ఇటు భర్త..
క్రైమ్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బంగారిగూడలో దారుణం జరిగింది. కొత్త కాపురంలో కలహలతో ఓ వ్యక్తి భార్యను చంపేశాడు. ఆపై పారిపోతుండగా లారీ యాక్సిడెంట్ అయ్యి.. అక్కడిక్కడే కన్నుమూశాడు. నాలుగు నెలల కిందట దీప్య, అరుణ్‌ల వివాహం జరిగింది. కారణం తెలియదుగానీ కొంతకాలంగా వీళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అరుణ్.. దీపను హతమార్చాడు. ఆపై బైక్‌పై పారిపోతుండగా ఆగి ఉన్న లారీ ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే భార్యను చంపి లొంగిపోయే క్రమంలోనే అరుణ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని అతని తరపు బంధువులు చెబుతున్నారు. -
రంగారెడ్డి: భార్యకు కరెంట్ షాక్ పెట్టిన తాగుబోతు
క్రైమ్: ప్రేమించి ఆమెను పెండ్లి చేసుకున్నాడు. పదేళ్లు కాపురం కూడా చేసి పిల్లల్ని కన్నాడు. కానీ, మద్యం మత్తులో కుటుంబాన్ని ఆగం చేస్తూ వచ్చాడు. అయితే భర్త, బిడ్డలూ బాగుండాలని మద్యం తాగొద్దని బతిమాలిందామె. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చివరకు కోపంతో ఆమెను కిరాతకంగా హతమార్చాడు భర్త. రంగారెడ్డి షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. మద్యం తాగొద్దని అన్నందుకు కోపంతో నిద్రలో ఉన్న భార్యకు కరెంట్ షాక్ పెట్టాడు ఓ తాగుబోతు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పదేళ్ల కిందట.. కవిత, యాదయ్యలు ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే.. యాదయ్య పోనుపోను మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో ఆ అలవాటు మానుకోవాలని ఆమె కోరింది. పంచాయితీలు జరగ్గా.. పెద్దలు ఆమెకు సర్దిచెప్పి పంపించారు. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకుని కిరాతకంగా చంపాడు. అనంతరం మత్తు దిగడంతో.. భయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కరెంట్ షాక్‌తో చనిపోయిందని అబద్ధపు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు అనుమానంతో తమదైన శైలిలో ప్రశ్నించగా.. నిజం ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై కొండుర్గు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తమ బిడ్డను అన్యాయంగా బలిగొన్నాడంటూ కవిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇదీ చదవండి: తాగనికి పైసల్లేవని ఆ తాత ఏం చేశాడంటే.. -
విడాకులు కావాలన్న భార్య.. కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపిన భర్త..
అమెరికా యుటాలో దారుణం జరిగింది. విడాకులు కావాలని భార్య కోర్టులో దరఖాస్తు చేసిన కొద్ది రోజులకే భర్త కిరాతక చర్యకు పాల్పడ్డాడు. కుటుంబంలోని మొత్తం ఏడుగురిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని మైకేల్ హైట్‌గా గుర్తించారు. హత్యకు గురైన ఏడుగురిలో అతని భార్య, ఐదుగురు పిల్లలతో పాటు అత్త కూడా ఉన్నారు. పిల్లలంతా 4-17ఏళ్ల వారే కావడం గమనార్హం. మరణించిన ఐదుగురు చిన్నారుల్లో 4, 7 ఏళ్ల అబ్బాయిలు, 7,12,17 ఏళ్ల అమ్మాయిలు ఉన్నారు. అయితే మైకేల్‌కు తన భార్యతో రెండేళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే భార్య అతనిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే క్రిస్మస్కు ముందు డిసెంబర్ 21న తన భర్త నుంచి విడాకులు కావాలని ఆమె కోర్టులో పిటిషన్ వేసింది. ఆ తర్వాత కొద్దిరోజులకే భర్త దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబంలో ఎవ్వరినీ వదలకుండా అందరినీ హతమార్చి, తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. చదవండి: రెస్టారెంట్లో కాల్పుల కలకలం.. ర్యాపర్ సహా 10 మందికి గాయాలు -
దారుణం.. టీ పెట్టలేదని భార్యను చపాతీ పీటతో కొట్టి చంపిన భర్త
ఉజ్జయిని: టీ తయారు చేసి ఇవ్వలేదనే కోపంతో దుర్మార్గుడైన ఓ భర్త కట్టుకున్న భార్యను చపాతీ పీటతో కొట్టి కడతేర్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా ఘటియా గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(41) టీ తయారు చేసి ఇవ్వలేదనే కోపంతో భార్య(40)ను చపాతీ పీటతో కొట్టాడు. స్పృహతప్పి పడిపోయిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. విద్యుత్ షాక్‌కు గురైందని వైద్య సిబ్బందితో అబద్ధమాడాడు. కొద్ది సేపటి తర్వాత భార్య చనిపోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. పోస్టుమార్టంలో విషయం బయటపడగా భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: ఫ్రెండ్స్‌తో అడవిలో మందు తాగుతుండగా ఈడ్చుకెళ్లిన పులి.. సగం తిని.. -
దారుణం.. రెండో భార్యను చంపి 50 ముక్కలు చేసిన భర్త!
రాంచీ: జార్ఖండ్ సాహెబ్‌గంజ్‌లో అత్యంత పాశవిక ఘటన వెలుగుచూసింది. రెండో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని 50 ముక్కలు చేశాడు. వాటిని తీసుకెళ్లి వివిధ ప్రదేశాల్లో పడేశాడు. నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనం వెనుక మృతురాలి కాలు దొరకడంతో పోలీసులు శనివారం శునకాలను రంగంలోని దింపి ఆ ప్రాంతమంతా వెతికారు. మొత్తం 18 శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కొన్ని లభించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ హత్య కేసులో భర్తను అదపులోకి తీసుకున్నారు. అతని కుటుంబసభ్యుల ప్రమేయం కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆదివాసి తెగకు చెందిన మృతురాలి పేరు రూబిక పహాడిన్(22). దిల్దార్ అన్సారీ అనే వ్యక్తిని ఇటీవలే వివాహం చేసుకుంది. అయితే అతనికి అప్పటికే పెళ్లి అయింది. అయినా ఇద్దరూ రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. రెండో పెళ్లి విషయం మొదటి భార్యకు తెలియడంతో ఆమె గొడవపెట్టుకుంది. దీంతో రూబికతో వాగ్వాదానికి దిగి ఆమెను హతమార్చాడు అన్సారి. అతని కుటుంబసభ్యుల పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. రూబిక కన్పించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే శరీర భాగాలు లభ్యం కావడంతో అవి ఆమెవే అని పోలీసులు పేర్కొన్నారు. అయితే హత్య అనంతరం తనపై అనుమానం రాకుండా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు అన్సారీ. తన భార్య కన్పిచడం లేదని ఫిర్యాదు చేశాడు. కానీ చివరకు దొరికిపోయాడు. చదవండి: విషాదం.. అమెరికాలో భారత వ్యాపారవేత్త మృతి -
ఎదురింటి వ్యక్తినే ప్రేమించి పెళ్లిచేసుకుంది.. పాపం ఇది ఊహించలేదు
తిరువణ్ణామలై(వేలూరు): వారి సంసారంలో అనుమానమే పెనుభూతమైంది. భార్యపై అనుమానంతో భార్య తాళి దారంతోనే గొంతు బిగించి హత్య చేసి పరారైన భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాల ప్రకారం..తిరువణ్ణామలై జిల్లా సెయ్యారు తాలుకా అన్న పుదూరు గ్రామానికి చెందిన రంజిత్ చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతను తన ఎదురింటికి చెందిన కౌసల్య(23)ను రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కౌసల్య సెయ్యారులోని షూ కంపెనీలో పనిచేస్తోంది. దంపతులకు ఏడాది వయసున్న కుమారుడున్నాడు. ఇదిలా ఉండగా భార్యపై అనుమానంతో రంజిత్ తరచూ ఘర్షణ పడేవాడు. వీటితో పాటు రంజిత్ తండ్రి రాజ, తల్లి శాంతి తరచూ వరకట్నం కోసం వేధించేవారు. గత కొద్ది నెలల క్రితం భార్య భర్తల మధ్య ఘర్షణ ఏర్పడటంతో కౌసల్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరితో చర్చించి ఇంటికి పంపి వేశారు. ఆదివారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో భార్యపై అనుమానంతో రంజిత్ ఘర్షణ పడ్డాడు. ఆ సమయంలో ఆగ్రహించిన రంజిత్ భార్య తాళి దారంతోనే గొంతు బిగించి హత్య చేసి తన కుమారుడిని తీసుకొని ఇంటి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న అనకావూరు పోలీసులు కేసు నమోదు చేసి కౌసల్య మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి రంజిత్ కోసం గాలిస్తున్నారు. -
Crime News: భార్య పేరిట రెండు కోట్ల ఇన్సూరెన్స్.. ఆపై..
శాలూ.. నా కోసం రోజూ ఒంటరిగా హనుమాన్ గుడికి వెళ్లి పూజలు చేస్తావా? అదీ స్కూటీ మీద! పదకొండు రోజులపాటు పూజలు చేయాలి.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. ఇలా గనుక చేస్తే.. మనకు అంతా మంచి జరుగుతుందట. అది పూర్తయితే నిన్ను ఇంటికి తెచ్చేసుకుంటా అంటూ భర్త చెప్పిన మాటలతో సంతోషపడిందా భార్య. రోజూ వేకువ ఝామునే లేచి.. భర్తను తలుచుకుంటూ పూజలు చేసుకుంటూ పోయింది . ఈ క్రమంలో.. ఓరోజు ఆమె తోడుగా తన బంధువు కుర్రాడిని కూడా గుడికి తీసుళ్లింది. మార్గం మధ్యలో పొగమంచు కారణంగా ఆమె ఎదురుగా వస్తున్న ఎయూవీని గుర్తించలేకపోయింది. వాహనం ఢీ కొట్టడంతో శాలూ అక్కడికక్కడే కన్నుమూసింది. రాజు చికిత్స పొందుతూ.. ఆస్పత్రిలో కన్నుమూశాడు. పుట్టింటికి వెళ్లిన భార్య.. రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని తెలియగానే కన్నీరు మున్నీరు అయ్యాడు మహేష్ చాంద్. ఆ కన్నీళ్లకు శాలూ కుటుంబం కూడా మోసపోయింది. అయితే.. యాక్సిడెంట్ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఇన్సూరెన్స్ సొమ్ము కోసమే మహేష్ ఆమెను హత్య చేయించాడని తేలింది. జైపూర్ వెస్ట్ డీసీపీ వందితా రానా తెలిపిన వివరాల ప్రకారం.. శాలూ, మహేష్‌కు 2015లో వివాహం అయ్యింది. ఇద్దరికీ ఓ పాప కూడా ఉంది. అయితే గత రెండేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. 2019లో అతనిపై గృహ హింస కేసు వేసింది కూడా. అప్పటి నుంచి భార్యకు అంటీముట్టనట్లు ఉంటూ వస్తున్నాడు మహేష్. అయితే.. ఈ మధ్య అతనికి ఆమెను వదిలించుకోవాలనే దుర్భుద్ధి పుట్టింది. ఆమె పేరిట భారీగా ఇన్సూరెన్స్ చేయించాడు. సహజంగా చనిపోతే కోటి రూపాయలు, ప్రమాదవశాత్తూ చనిపోతే రెండు కోట్ల దాకా ఇన్సూరెన్స్ సొమ్ము వస్తుంది అతనికి. ఆ సొమ్ము ఎలాగైనా చేజిక్కించుకోవాలనుకున్నాడు. ముకేష్ సింగ్ రాథోడ్ అనే రౌడీ షీటర్‌తో పది లక్షల రూపాయల సుపారీ ఇచ్చి.. భార్యను హత్య చేయమని పురమాయించాడు మహేష్. అయితే ఆ హత్య ఎవరికీ అనుమానం రావొద్దని సూచించాడు. మరోవైపు భార్యకు ఫోన్ చేసి 11 రోజులు వరుసగా హనుమాన్ గుడికి వెళ్లి పూజలు చేయమని, తాను ఇలా చేయమన్నానని చెప్పినట్లు ఎవరితో చెప్పొద్దని బతిమాలాడు. దీంతో భర్త మనసు మారిందేమో అనుకుని ఆమె గుడికి వెళ్లడం ప్రారంభించింది. ఈ క్రమంలో.. రాథోడ్ మనుషులు వాహనంతో వచ్చి ఆమె వెళ్తున్న స్కూటీని ఢీకొట్టి ఆమెను హత్య చేశారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో.. మహేష్‌తో పాటు రాథోడ్‌ను, అతని ఇద్దరి అనుచరుల్ని, యాక్సిడెంట్ చేసిన వాహనం ఓనర్‌తో పాటు అతని సోదరుడిని అరెస్ట్ చేశారు జైపూర్పోలీసులు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. -
గుంటూరులో దారుణం.. బ్యూటీపార్లర్‌లో భార్యను చంపిన భర్త
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. స్థానిక గాంధీనగర్‌లో భార్యను భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. స్వాతి అనే మహిళ బ్యూటీ పార్లర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. అప్పులు తీర్చేందుకు భార్య పేరున ఉన్న స్థలాన్ని అమ్మాలని భర్త కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నాడు. దీనికి స్వాతి అంగీకరించలేదు. ఇవాళ బ్యూటీపార్లర్‌కు వచ్చిన కోటేశ్వరరావు స్థలం విషయంలో మరోసారి భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో స్వాతి తీవ్రగాయాలతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం భర్త వెంకటేశ్వరరావు పూలదండలు తీసుకొచ్చి భార్య మెడలో వేసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అటుతల్లి చనిపోవడం, తండ్రి జైలు పాలవడంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. చదవండి: (మీర్పేట్లో దారుణం.. వివాహితపై ఎస్బీ కానిస్టేబుల్ అత్యాచారం) -
విషమిచ్చి.. ఆపై కత్తెరతో పొడిచి..
చందానగర్: భాగ్యనగరంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య, ఇద్దరు పిల్లలను అత్యంత పాశవికంగా చంపిన భర్త ఆపై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చందానగర్ సీఐ క్యాస్ట్రో కథనం ప్రకారం సంగారెడ్డి జిల్లా కోహీర్కు చెందిన రామలింగస్వామి, శకుంతలమ్మ దంపతుల చిన్న కుమారుడు మడపతి నాగరాజు (42)కు మెదక్ జిల్లా పోల్కంపల్లికి చెందిన సుజాత (36)తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి సిద్ధార్థ్ (10), రమ్యశ్రీ (8) పిల్లలు ఉన్నా రు. నాగరాజు కుటుంబం కొంతకాలం కిందట నగరానికి వలస వచ్చి శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీలో ఉన్న రా జీవ్ గృహకల్పలో నివాసం ఉంటోంది. నాగరాజు కిరాణా షాపులకు మాసాలాలు, ఇతర గృహావసర వస్తువులను సరఫరా చేస్తుండేవాడు. సుజాత ఇంటి దగ్గర టైలరింగ్ చేస్తూ వడ్డీకి డబ్బులు ఇచ్చేది. గత కొన్నాళ్లుగా సుజాతపై అనుమానం పెంచుకున్న నాగరాజు.. ఆమెతో గొడవపడేవాడు. అతను కొన్ని రోజులుగా పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. దీంతో శుక్రవారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్యా, పిల్లలను చంపాలనుకున్న నాగరాజు ముందుగా వారికి విషమిచ్చి ఉంటాడని.. అయినా వారు బతికి ఉండొచ్చన్న అనుమానంతో ఇంట్లో ఉన్న టైలరింగ్ కత్తెరతో భార్యను తల, మెడపై పొడవగా కుమారుడు సిద్ధార్థ్‌ను కడుపులో, కూతురు రమ్యశ్రీని వీపు వెనుక భాగంలో పొడిచాడని పోలీసులు భావిస్తున్నారు. అనంత రం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు కిటికీలోంచి చూడగా ఇద్దరు పిల్లలు రక్తపుమడుగులో నిర్జీ వంగా కనిపించారు. దీంతో వారు వెంటనే చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సుజాత తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నాగరాజు సైకోగా మారి హత్యలు చేశాడా లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనాస్థలిని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్, సీఐ క్యాస్ట్రో పరిశీలించారు. తరచూ గొడవ పడేవారు: స్థానికులు నాగరాజు ఇరుగుపొరుగు వారితో మాట్లాడేవాడు కాదని... కానీ పిల్లలను మంచిగా చూసుకొనే వాడని స్థానికులు తెలిపారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని చెప్పారు. నాగరాజు భార్య సుజాతతో శుక్రవారం మధ్యాహ్నం మాట్లాడినట్లు పొరుగింట్లో ఉండే లక్ష్మి, సుజాత స్నేహితురాలు మంజుల వివరించారు. శనివారం తాను ఉద్యోగానికి వెళ్లే క్రమంలో సుజాత ఇంటికి వెళ్లగా తలుపులు మూసి ఉన్నాయని మంజుల పేర్కొంది. తాను సుజాతకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో ఊరికి వెళ్లి ఉంటారని భావించి తిరిగి వెళ్లిపోయినట్లు చెప్పింది. -
భార్యపై అనుమానం.. మూడు నిండు ప్రాణాలు బలి
సాక్షి, నెల్లూరు: అనుమానం పెనుభూతంగా మారింది. మూడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. భార్యను, 5 నెలల పాపను గొంతు నులిమి చంపి, భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మండలం ఇస్కపల్లిపాళెంలో ఆదివారం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. ఇస్కపల్లిపాళెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు ఆవుల మురళి (25)కి అదే గ్రామానికి చెందిన స్వాతి (22)తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వారి సంసార జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో పాప పుట్టింటి. అప్పటి నుంచి ఆ బిడ్డ తనకు పుట్టినది కాదంటూ భార్య మీద భర్త అనుమానం పెంచుకున్నాడు. దీనికి మురళీ తల్లిదండ్రులు, సోదరి ఆద్యం పోస్తూ వచ్చారు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తొలి కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన స్వాతి గురువారం అత్తారింటికి వచ్చింది. అయితే తాను అత్తింటికి వెళ్లనని భర్త, అత్త, మామ వేధిస్తున్నారని పదేపదే చెప్పినప్పటికి ఆడపడుచు తాను హామీగా ఉంటానని నమ్మించి అత్తారింటికి తీసుకొచ్చారు. ఈ ఆదివారం వేకువ జామున భార్య స్వాతి, పాపను గొంతు నులిమి హత్య చేసిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించాడు. దిక్కుతోచని స్థితిలో భర్త మురళి అదే గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో ఇస్కపల్లిపాళెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మురళి కుటుంబ సభ్యులు స్టేషన్‌కు తరలింపు స్వాతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మురళి తల్లిదండ్రులు ఆవుల బంగారమ్మ, ఆవుల గోవిందయ్య, ఆడపడుచు వెంకటమ్మపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించినట్లు సీఐ ఖాజావలీ తెలిపారు. కావలి ఇన్చార్జి డీఎస్పీ శ్రీనివాసులు, అల్లూరు ఎస్సై శ్రీనివాసులు విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానమే పెనుభూతమై.. భార్యను హత్య చేసి, భర్త ఆత్మహత్య
సాక్షి, హన్మకొండ: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలంలో భార్యను హత్య చేసిన ఓ భర్త.. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవిపేటకు చెందిన పుష్పలీలకు హరీష్‌తో రెండు నెలల కిత్రం వివాహం జరిగింది. అయితే భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని ఆమెపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల కిత్రమే భార్యతో గొడవపడిన హరీష్ క్రిమిసంహారక మందు తాగాడు. హస్పిటల్లో చికిత్స తీసుకొని ఇటీవలే ఇంటికి చేరుకున్నాడు. అయితే మరోసారి భార్యభర్తల మధ్య ఇదే విషయమై వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రోక్తుడైన భర్త హరీష్ సోమవారం అర్థరాత్రి భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: అనుమానమే పెనుభూతమై.. భార్యను హత్య చేసి, భర్త ఆత్మహత్య -
సమాచారం ఇచ్చి మరీ.. స్వాతి మీ చెల్లెను చంపేశాను
నల్గొండ (నకిరేకల్) : అనుమానం పచ్చని కాపురంలో చిచ్చురేపింది. భార్య మరొకరితో సఖ్యతగా మెలుగుతుందని అనుమానించిన భర్త ఆమెను దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం అతడు పురుగుల మందు తాగాడు. నకిరేకల్‌లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన శ్రీకాంత్(29)కు ఇదే మండలం పాలెం గ్రామానికి చెందిన స్వాతి(27)తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కూమార్తె ఉన్నారు. శ్రీకాంత్ ప్లంబర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నకిరేకల్‌లోని పన్నాలగూడెంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఏడాది కాలంగా దంపతుల మధ్య మనస్పర్థలతో గొడవలు జరుగుతున్నాయి. ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లిన తర్వాత దంపతులు గొడవ పడ్డారు. దీంతో ఆగ్రహానికి లోనైన శ్రీకాంత్ భార్య స్వాతి(27)ని గదిలోనే దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఉదయం 9.30 గంటల సమయంలో నకిరేకల్‌లోనే ఉంటున్న స్వాతి అక్క పల్ల స్వప్నకు శ్రీకాంత్ ఫోన్ చేసి మీ చెల్లెను చంపేశానని సమాచారం ఇచ్చి అక్కడినుంచి పరారయ్యాడు. పురుగుల మందు తాగి.. భార్యను హత్య చేసిన తర్వాత ఇంటినుంచి బయటికి వెళ్లిన శ్రీకాంత్ పురుగుల మందు తాగాడు. అనంతరం తానే స్థానిక ఆస్పత్రికి వెళ్లాడు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యులు అతడిని నల్లగొండ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. హత్య స్థలాన్ని నకిరేకల్ సీఐ వెంకటయ్య పరిశీలించారు. స్వాతి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హతురాలి సోదరి స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకటయ్య తెలిపారు. -
భార్య, ప్రియుడి హత్య కేసు: భర్త అరెస్ట్
సాక్షి, బొమ్మనహళ్లి (కర్ణాటక): బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలో కలకలం సృష్టించిన డబుల్ మర్డర్‌లో మిస్టరీ వీడింది. చందాపుర వద్ద భార్యను, ఆమె ప్రియున్ని నరికి చంపిన ఘటనలో భర్తను సూర్య నగర పోలీసులు అరెస్టు చేశారు. గత శనివారం భార్య కావ్య, మాజీ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు నారాయణస్వామి ఇంట్లో ఒకే గదిలో ఉండగా, కావ్య భర్త చిక్కహాగడె ముత్తురాజు కొడవలితో హతమార్చి పరారయ్యాడు. ఈ డబుల్ మర్డల్ తీవ్ర కలకలం రేకెత్తించింది. పోలీసులు గాలించి గురువారం అరెస్టు చేశారు. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నందునే హత్య చేసినట్లు పోలీసుల ముందు చెప్పాడు. హతుడు నారాయణస్వామి గ్రామ పంచాయతీ సభ్యుడుగా ఉన్నాడని, అతనిపైన గతంలో క్రిమినల్ కేసు ఉందని, ఆనేకల్ పరిధిలో రౌడీషీట్ కూడా ఉందని బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్,.పి. కే. వంశీకృష్ణ తెలిపారు. చదవండి: అర్జంటుగా దుస్తులు మార్చుకుంటానని స్నేహితురాలి గదికి వెళ్లి -
కుటుంబ కలహాలు.. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే కోపంతో..
న్యూఢిల్లీ: సాధారణంగా వైవాహిక జీవితంలో కొన్ని ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహలు ఉండటం సహజమే. అయితే, ఈ మధ్యకాలంలో భార్యభర్తలు క్షణికావేశంలో ఒకర్నిమరోకరు హతమార్చుకుంటున్నసంఘటలను తరచుగా వార్తల్లో చూస్తునే ఉంటాం. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అమిత్ కుమార్, మిక్కి ఇద్దరు భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అమిత్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. వీరు సమయ్‌పూర బడ్లీలోని ఒక అపార్ట్మెంట్లో ఉండేవారు. ఇతని సోదరుడు కూడా ఇదే అపార్ట్మెంట్లో ఉండేవాడు. కాగా, అమిత్ కుమార్‌కు.. మిక్కికి మధ్య కలహలు చోటుచేసుకున్నాయి. దీంతో భార్య ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత మూడు రోజులకు తిరిగి వచ్చింది. అప్పటి నుంచి వీరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. దీంతో భర్త.. గత సోమవారం భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను.. కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, సోదరుడు ఈరోజు (మంగళవారం) వెళ్లి సోదరుడికి ఫోన్ చేశాడు. ఎంతసేపటికి కాల్ ఆన్సర్ చేయకపోవడంతో షాక్‌కు గురయ్యారు. ఆతర్వాత.. అతని ఇంటి తలుపుని తట్టారు. ఎంతసేపటికి ఎలాంటి చప్పుడు రాకపోవడంతో.. పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని అమిత్ ఇంటి తలుపును పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ.. అమిత్, మిక్కి, ఇద్దరు పిల్లలు.. విగత జీవులుగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వారిని పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
భార్య మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని ఉరేసి చంపి.. ఏమీ ఎరగనట్లు!
సాక్షి, రంగారెడ్డి: కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. అనుమానంతో భార్యను ఉరేసి చంపాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడు. ఈ సంఘటన మహేశ్వరం మండల పరి ధిలోని మాణిక్యమ్మగూడలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కందుకూరు మండలం చిప్పలపల్లికి చెందిన అల్వాల నర్సింహకు మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడకు చెందిన లక్ష్మమ్మ అలియాస్ మంగమ్మ (30)తో 2005లో వివాహమైంది. పెళ్లయిన కొన్ని రోజులకే నర్సింహ అత్తగారి ఊరికి మకాం మార్చాడు. దంపతులిద్దరూ అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. నర్సింహ మేస్త్రి, డ్రిల్లింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం భార్య ఫోన్‌కు గుర్తు తెలియని కాల్ రావడాన్ని గమనించిన నర్సింహ.. అప్పటి నుంచి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఎవరు ఫోన్ చేస్తున్నారని నిత్యం వేధించేవాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చాడు. ఇదే విషయమై భార్యతో గొడవ పెట్టుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి మరోసారి గొడవకు దిగాడు. కోపోద్రిక్తుడై క్షణికావేశంలో విద్యుత్ వైర్‌తో లక్ష్మమ్మ మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. చదవండి: హైదరాబాద్: క్యాటరింగ్ ఉద్యోగి @ 2 కిలోల బంగారం అనంతరం ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని నమ్మబలికాడు. ఏమీ ఎరగనట్లు చుట్టుపక్కల వారికి తన భార్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. మృతురాలి తల్లికి అనుమానం వచ్చి మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. తమదైనశైలిలో విచారించారు. దీంతో తానే హత్య చేసినట్లు నర్సింహ నేరం అంగీకరించాడు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధుసూదన్ తెలిపారు. చదవండి: అల్వాల్‌లో రియల్టర్ విజయ్ భాస్కర్‌రెడ్డి దారుణ హత్య -
‘మీ అమ్మకు బీపీ డౌన్ అయ్యింది.. మీరు కూడా రండి’
నాగారం: కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన భర్త.. మృతదేహాన్ని టాటా ఏస్ వాహనంలో స్వగ్రామానికి తీసుకొచ్చాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నాగారం మండల పరిధిలోని పస్తాల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పస్తాల గ్రామానికి చెందిన చిత్తలూరి శ్రీనివాస్, సూరాంబ (35) దంపతులు తమ పిల్లలు శ్రావణి, ప్రశాంత్. పదేళ్లుగా హైదరాబాద్‌లోని రామాంతాపూర్‌లో నివసిస్తూ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి శ్రీనివాస్ ఇంట్లో ఇద్దరు పిల్లలను పక్క గదిలో నిద్రించమని చెప్పి భార్యతో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో సూరాంబను విచక్షణారహితంగా కొట్టి, ప్లాస్టిక్ తాడుతో ఆమె మెడకు ఉరివేసి హత్య చేశాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కూరగాయలకు వినియోగించే తన టాటా ఏస్ వాహనంలో ఆమె మృతదేహాన్ని వేసుకొని స్వగ్రామం పస్తాలకు బయల్దేరాడు. మార్గమధ్యలో గురువారం తెల్లవారుజామున పిల్లలకు ఫోన్‌చేసి ‘మీ అమ్మకు బీపీ డౌన్ అయ్యి మృతిచెందింది. పస్తాలకు తీసుకెళ్తున్నా, మీరు కూడా రండి’ అని చెప్పాడు. అనంతరం మృతదేహాన్ని పస్తాలకు తీసుకొచ్చి తన ఇంటిముందు ఉంచాడు. బీపీ డౌన్ అయ్యి మృతిచెందిందని గ్రామస్తులతో చెప్పగా వారు మృతదేహంపై ఉన్న గాయాలను గుర్తించి ఏమైందని నిలదీశారు. దీంతో శ్రీనివాస్ తానే చంపానని అంగీకరించాడు. అయితే గ్రామస్తులు దాడి చేస్తారనే భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా వారు గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి మొగుళ్ల బక్కయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజేశ్ తెలిపారు. -
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని దారుణం..
సాక్షి,కర్నూలు(హొళగుంద): మద్యం వ్యసనం రెండు ప్రాణాలను బలి తీసుకుంది. తాగుడుకు బానిసైన వ్యక్తి మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన మండల కేంద్రమైన హొళగుందలో సోమవారం చోటు చేసుకుంది. ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్, ఆలూరు సీఐ ఈశ్వరయ్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.హొళగుంద ఎస్సీ కాలనీకి చెందిన మల్లప్ప, శంకరమ్మ పెద్ద కుమారుడు మల్లికార్జున (28)కు కర్ణాటక రాష్ట్రం బళ్లారి పట్టణానికి చెందిన ముత్తమ్మ(24)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి గణేశ్, వంశీ ఇద్దరు కుమారులు. మల్లికార్జున తన భార్యా పిల్లలతో పాటు తన తల్లి శంకరమ్మ, ఇద్దరు సోదరులు వీరేశ్, రాజశేఖర్ బెంగళూరుకు వలస వెళ్లి కొన్నేళ్లుగా అక్కడే ఉన్నారు. లాక్డౌన్ కారణంగా ఆరు నెలల క్రితం అందరూ హొళగుందకు చేరుకున్నారు. తాగుడుకు బానిసైన మల్లికార్జున తరచూ మద్యానికి డబ్బులు ఇవ్వాలని భార్య ముత్తమ్మతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా ఆమెతో గొడవ పడ్డాడు. వారుంటున్న గుడిసె చిన్నది కావడంతో గొడవను చూడ లేక మల్లికార్జున తల్లి, ఇద్దరు సోదరులు పిల్లలను తీసుకుని సమీపంలో వేరే వారి ఇంటికి వెళ్లి నిద్ర పోయారు. ఉదయం వారు ఇంటికి తిరిగి వచ్చి చూడగా గుడిసెకు లోపల తాళం వేసి ఉండడంతో అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తలుపు విరగ్గొట్టి లోపలికెళ్లి చూడగా మల్లికార్జున, ముత్తమ్మ ఉరికి వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు. ముత్తమ్మ నుదటిపై గాయముండి నోటిలో రక్తం కారిన దృశ్యాలు ఉన్నాయి. అనాథలుగా మారిన పిల్లలు విషయం తెలుసుకున్న ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్, ఆలూరు సీఐ ఈశ్వరయ్య హొళగుంద ఎస్ఐ విజయ్‌కుమార్‌తో కలిసిసంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తన కుమార్తెను అల్లుడే కొట్టి చంపి ఉరేశాడని, తర్వాత భయపడి తను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, మృతురాలి తండ్రి శివప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు హత్య, ఆత్మహత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయకుమార్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారులను చూసి పలువురు కంటతడి పెట్టారు. -
భార్యకు రెండు పెళ్లిళ్లు.. అనుమానంతో హత్య
సాక్షి, గచ్చిబౌలి: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కత్తితో దాడిచేసి హత్య చేశాడు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ రవిందర్ తెలిపిన మేరకు.. మహరాష్ట్రకు చెందిన పర్హాన ఖురేషీ(25) ఇద్దరు భర్తలను వదిలేసి ఇద్దరు కుమారులు, కూతురుతో నాందేడ్‌లో ఉండేది. రెండు సంవత్సరాల క్రితం బీదర్‌కు చెందిన కిరోసిన్ డీలర్ మహ్మద్ మోసిన్ ఖాన్(31) పరిచయమయ్యాడు. తరువాత ఇద్దరూ సహజీవనం చేశారు. ఐదు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పిల్లలతో కలిసి అంజయ్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండగా మోసిన్‌కు తెలియకుండా పర్హాన బయటకు వెళుతుండేది. దీంతో మోసిన్ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతుండేవి.ఈ క్రమంలో బుధవారం భార్యను నిలదీయగా రూ.10 లక్షలు ఇచ్చి, విడాకులు ఇస్తే తన దారిన తాను వెళతానని పర్హాన భర్తకు తెగేసి చెప్పింది. ఆవేశానికి గురైన మోసిన్ ఖాన్ కూరగాయల కత్తితో కడుపులో రెండు చోట్ల పొడిచి ఆపై గొంతు కోశాడు. గమనించిన స్థానికులు 100కు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాత్ రూమ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్న పర్హనా ఖురేషీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్థ రాత్రి తరువాత మృతి చెందింది. నిందితుడు మహ్మద్ మోసిన్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. -
అనుమానం: భార్యతోపాటు మరో మహిళను..
సాక్షి, నెల్లూరు: అనుమానంతో ఓ భర్త భార్యను, ఆమెకు సహకరిస్తోందనే కారణంగా మరో మహిళను దారుణంగా హత్య చేశాడు. అత్యంత కిరాతకంగా భార్య తల, మొండెం వేరు చేయగా, ఇంకో మహిళను విచక్షణా రహితంగా కత్తితో నరికి చంపాడు. నెల్లూరు రూరల్ మండలంలోని నవలాకులతోట నాల్గో మైలు వద్ద జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగు చూసింది. విడవలూరు మండలం పొన్నపూడి ప్రశాంతిగిరినగర్‌కు చెందిన కొమరి నాగేశ్వరరావు మత్స్యకారుడు. మొదటి భార్య గోవిందమ్మ చనిపోవడంతో ఇందుకూరుపేట మండలం మైపాడుకు చెందిన నిర్మలమ్మ (43)ను 19 ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఒక కుమార్తె ఉంది. నెల్లూరులోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. మొదటి భార్యకు ఇద్దరు కుమార్తెలు కాగా వివాహం చేశాడు. నాగేశ్వరరావు ప్రొక్లెయిన్ వాహనాలను అద్దెకు తీసుకుని నడుపుతుండేవాడు. ఇటీవల ఫైనాన్స్ ద్వారా ప్రొక్లెయిన్‌ను కొనుగోలు చేసి పనులు చేయిస్తున్నాడు. కొంతకాలంగా నాగేశ్వరరావు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ప్రశాంతిగిరినగర్‌కు చెందిన రంగంగారి వెంకటరమణమ్మ (42) తన భార్యకు సహకరిస్తోందని భావించాడు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం ప్రశాంతిగిరినగర్ నుంచి కాపురాన్ని నెల్లూరుకు మార్చాడు. తొలుత కిసాన్‌నగర్‌లో కాపురం పెట్టాడు. రెండు నెలల క్రితం నవలాకులతోటలో ఓ అద్దె ఇంట్లోకి కాపురాన్ని మార్చాడు. అయితే భార్య నిర్మలమ్మ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పురాకపోవడంతో అతిగా మద్యం తాగి తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో భార్యను ఎలాగైనా అంతమొందించాలని భావించాడు. కుమార్తె లేని సమయంలో.. ఇటీవల నిర్మలమ్మ కుమార్తె బంధువుల ఇంటికి వెళ్లింది. ఇదే అదనుగా నాగేశ్వరరావు భార్యను తుదముట్టించేందుకు పథకం వేశాడు. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున 4 గంటల సమయంలో భార్య నిర్మలమ్మతో గొడవ పడ్డాడు. ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగడంతో భార్యపై కత్తి తో విచక్షణా రహితంగా తలను, మొండెంను వేరు చేశాడు. అనంతరం రక్తపు మడుగును శుభ్రం చేసి ఎవరికీ అను మానం రాకుండా నిర్మలమ్మ నిద్రపోతున్నట్లుగా నమ్మించేందుకు మొండెంను పడక గదిలో ఉంచి దుప్పటి కప్పాడు. పొలం విషయం మాట్లాడుదామని.. నిర్మలమ్మను హత్య చేసిన నాగేశ్వరరావు దూరపు బంధువు అయిన వెంకటరమణమ్మను హత్య చేయాలని భావించాడు. ఉదయం వెంకటరమణమ్మకు ఫోన్ చేసి పొలం కొనాలనుకున్నావు కదా మాట్లాడుదాం రమ్మని పిలిచాడు. దీంతో ఆమె ఉదయం 10 గంటల సమయంలో నెల్లూరులోని నాగేశ్వరరావు ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరిన ఆమెç కత్తితో దాడి చేశాడు. తల వెనుక భాగం, కాళ్లు చేతులను విచక్షణ రహితంగా నరికివేశాడు. దీంతో వెంకటరమణమ్మ మృతి చెందింది. వెంకటరమణమ్మ సాయంత్రానికి ఇంటికి చేరకపోవడంతో పెద్దకుమారుడు బాలాకుమార్ ఇతర కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం వేకువ జామున నిందితుడు నాగేశ్వరరావు నెల్లూరురూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు లొంగిపోవడంతో హత్యల ఘటన వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న హతురాళ్ల బంధువులు, కుటుంబ సభ్యులు, నెల్లూరురూరల్ పోలీసులు ఆదివారం వేకువన 3 గంటల సమయంలో నాగేశ్వరరావు ఇంటికి చేరుకున్నారు. నెల్లూరురూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై నాగార్జునరెడ్డి తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లోని హాల్లో రక్తమడుగులో వెంకటరమణమ్మ మృతదేహాన్ని గుర్తించారు. బెడ్రూంలో నిర్మలమ్మ మొండెంకు దుప్పటి కప్పి ఉండడాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నెల్లూరురూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఇందుకూరుపేట మండలం మైపాడు, ప్రశాంతిగిరినగర్లో విషాద ఛాయలు అలముకున్నాయి. -
తాళే.. యమపాశంగా!
పశ్చిమగోదావరి ,గణపవరం: అనుమానంతో భర్త పెట్టే వేధింపులు భరించలేక చంటిబిడ్డతో పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను బాగా చూసుకుంటానని నమ్మించి ఇంటికి తీసుకువచ్చి, తాను కట్టిన తాళినే ఉరితాడుగా మార్చి కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్తను గణపవరం పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగో నెల గర్భిణి అనే కనికరం కూడా లేకుండా అనుమానంతో ఆమె ప్రాణాలనే బలిగొన్నాడు. ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ బుధవారం గణపవరం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. దేవరపల్లికి చెందిన మేడా అబ్బులు అనే వ్యక్తి మద్యానికి బానిసై, మొదటి భార్యను వేధింపులకు గురిచేయడంతో ఆమె అతనిని నుంచి విడిపోయింది. గణపవరానికి చెందిన నంగాలమ్మను రెండేళ్లక్రితం రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి 9 నెలల బాబు ఉన్నాడు. భార్యను తరచూ వేధించడం, మద్యానికి బానిసై రోజూ కొట్టడంతో నంగాలమ్మ రెండు నెలలక్రితం పుట్టింటికి గణపవరం వెళ్లి, కొద్దిరోజుల తర్వాత ఐ.పంగిడిలో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లింది. అబ్బులు ఇటీవల పిప్పరలో ఒక చేపల చెరువుపై పనికి చేరాడు. అప్పటినుంచి భార్యను రమ్మని కబురు చేస్తూ పలుమార్లు బంధువులతో రాయబారం పంపాడు. తాను ఇకమీదట వేధించనని, చేయి చేసుకోనని, బాగా చూసుకుంటానని నమ్మకంగా చెప్పి ఈ నెల 17న అబ్బులు తనతోపాటు భార్యను పిప్పర తీసుకువచ్చాడు. 18వ తేదీ రాత్రి అబ్బులు బాగా తాగివచ్చి భార్యతో గొడవపడ్డాడు. నాలుగో నెల గర్భిణిగా ఉన్న ఆమెపై అనుమానంతో అదే రోజు రాత్రి భార్య మెడలో ఉన్న పసుపుతాడునే పీకకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. తన భార్య పడుకుని కదలడంలేదంటూ కొంతసేపు హడావుడి చేశాడు. అనంతరం బీరు సీసాతో తన గొంతులో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం తన తమ్ముడి ఇంటికి వెళ్లిపోయాడు. నిందితుడిని బుధవారం గణపవరం ఎస్సై ఎం.వీరబాబు అరెస్ట్ చేశారు. డీఎస్పీ పర్యవేక్షణలో గణపవరం సీఐ డేగల భగవాన్‌ప్రసాద్, ఎస్సై వీరబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను చంపి.. గొంతు కోసుకుని..
చిత్తూరు ,వి.కోట: భార్యను హతమార్చి అనంతరం తానూ గొంతుకోసుకున్న సంఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పాముగానిపల్లెకు చెందిన ప్రభాకర్‌రెడ్డి (37)కి కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా అల్కీల్æ గ్రామానికి చెందిన అరుణ(29)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి దిలీప్(7), మౌనిక (6) పిల్లలు ఉన్నారు. ప్రభాకర్ గొరెల్రు మేపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో భార్య అరుణపై అనుమానం పెంచుకుని మద్యం సేవించి గొడవ పడేవాడు. గ్రామపెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ చేసినా ఫలితం లేదు. సోమవారం దంపతులు ఇద్దరూ గొర్రెలకు మేతకోసం ఉదయాన్నే తమ పొలం వద్దకు వెళౠ్లరు. అక్క డ ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ప్రభాకర్ క్షణి కావేశంతో తన వద్ద ఉన్న కొడవలితో భార్య మెడపై నరికి హతమార్చాడు. అనంతరం అదే కత్తితో తానూ గోంతుకోసుకుని ఆత్మహత్యకుయత్నించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ మహేష్‌బాబు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న ప్రభాకర్‌ను కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ ఆరిపుల్లా గ్రామస్తులతో మాట్లాడి సమాచారం సేకరించారు. -
భార్య తల, మొండం వేరు చేసిన కసాయి భర్త
ఆ చిన్నారుల కళ్లలో బేల చూపులు.. రాత్రి పక్కనే గుండెలపై చేయి వేసి నిద్దుర పుచ్చిన అమ్మ .. తెల్లవారే సరికి శాశ్వతంగా నిద్దురలోకి జారిపోయింది. ఏ రాత్రి వేళో, వేకువ వేళో డబ్బులిచ్చి తలపై ప్రేమగా నిమిరే నాన్న చేతులు.. బేడీలతో కటకటాల వెనక్కి వెళ్లి ముడుచుకుపోయాయి. మద్యం మత్తులో కర్కశంగా మారిన తండ్రి మూర్ఖత్వానికి ఇద్దరు పసివాళ్ల జీవితాలు అనాథగా మారాయి. వివాహేతర సంబంధం వద్దన్నందుకు భార్య తలను నరికిన కసాయి భర్త ఉదంతం కలకలం రేపింది. గుంటూరు ,సత్తెనపల్లి: కట్టుకున్న భార్యను భర్త దారుణంగా హతమార్చిన ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో జరిగింది. అర్బన్ సీఐ ఎస్.విజయ చంద్ర తెలిపిన వివరాల మేరకు.. సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన ముప్పన శ్రీనివాసరావుకు తండ్రి మరణంతో లింగంగుంట్ల మేజర్‌పై ఉద్యోగం వచ్చింది. పిల్లుట్ల గ్రామానికి చెందిన మాండ్ల అంకమ్మ (35)ను 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఐదేళ్ల క్రితం శ్రీనివాసరావు సాధారణ బదిలీల్లో భాగంగా ఫిరంగిపురం మండలానికి బదిలీ అయ్యాడు. కొండవీడు మేజర్‌పై లస్కర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య, పిల్లలను సత్తెనపల్లిలోని ఎన్ఎస్పీ కాలనీలో ఉంచి రాకపోకలు సాగించేవాడు. ఈ క్రమంలో శ్రీనివాసరావు ఫిరంగిపురంలో మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని నిత్యం మద్యం సేవిస్తూ భార్య, పిల్లలను నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఇంటికి రావడం పూర్తిగా తగ్గించాడు. జీతం ఇవ్వకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో భార్య అంకమ్మకు అనుమానం వచ్చి కొద్దిరోజుల క్రితం ఫిరంగిపురం వెళ్లి భర్త శ్రీనివాసరావు ఉంటున్న ఇంటిని పరిశీలించింది. అక్కడ భర్త శ్రీనివాసరావు మరో మహిళతో ఉండటం ప్రత్యక్షంగా చూసింది. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. అనంతరం తన భర్తను వెంట పెట్టుకుని అంకమ్మ సత్తెనపల్లి వచ్చింది. శ్రీనివాసరావు ఎప్పుడు వచ్చినా అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత రావడం, తెల్లవారుజామున 3, 4 గంటల మధ్య వెళ్లిపోవడం చేస్తుంటాడు. రెండు రోజులుగా భార్యతో భర్త శ్రీనివాసరావు గొడవ పడుతున్నాడు. సోమవారం రాత్రి పూటుగా మద్యం సేవించి భార్య అంకమ్మతో గొడవకు దిగాడు. అంకమ్మ జరిగిన ఘటనను తొమ్మిది గంటల సమయంలో తన సోదరుడు అంకారావుకు ఫోన్లో చెప్పింది. అర్ధరాత్రి సమయంలో శ్రీనివాసరావు గొడవ చేస్తుండడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తేల్చి చెప్పింది. పోలీసుస్టేషన్‌కు బయలుదేరి వెళుతుండగా కోపోద్రిక్తుడైన శ్రీనివాసరావు మొండి కొడవలితో వెనుక నుంచి వచ్చి ఎన్ఎస్పీ బంగ్లా వద్ద అతి కిరాతకంగా నరికాడు. తల, మొండం వేరు చేశాడు. తలను పట్టుకుని పారిపోయేందుకు యత్నించగా సమాచారం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తలను పట్టుకున్న శ్రీనివాసరావును సీఐ ఎస్.విజయచంద్ర అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి సోదరుడు మాండ్ల అంకారావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన భార్యను..
సాక్షి, సదాశివనగర్(ఎల్లారెడ్డి): మరో మహిళతో అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావు అని అడిగిన భార్యను ఓ భర్త కిరాతకంగా కొట్టి చంపిన సంఘటన సదాశివనగర్ మండలంలోని సాజ్యనాయక్ తండాలో శుక్రవారం తెల్లవాజామున వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తండాకు చెందిన శివరాం మొదటి భార్యను ఒప్పించి 20 ఏళ్ల క్రితం రెండో నాందేడ్ జిల్లా ఉమ్రిలోని ఉండతండాకు మేనక(40)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. మొదటి భార్య లింమ్డిబాయికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరి భార్యలు వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. అయితే రెండో భార్య మేనకకు శివరాంకు తరచు గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గురువారం రాత్రి మేనక, శివరాంను మరో మహిళతో అక్రమ సంబంధం విషయమై ప్రశ్నించింది. దీంతో ఆమెను శివరాం తీవ్రంగా కొట్టాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మేనకను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు శివరాంపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకట్, ఎస్సై నరేశ్ తెలిపారు. మృతదేహంతో నిరసన మేనకను చంపిన శివరాంను కఠినంగా శిక్షించా లని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగా రు. నాందేడ్ నుంచి మృతురాలి కుటుంబీకులు వచ్చే వరకు మృతదేహాన్ని తరలించలేదు. -
సంతానం లేదని భార్య హత్య.. ఆపై భర్త ఆత్మహత్య
అనంతపురం, బొమ్మనహాళ్: భార్యను హత్య చేసి ఆపై భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం తారకాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గురువారం పోలీసులు కథనం మేరకు .. కణేకల్లు మండలం బిదురుకొంతం గ్రామానికి చెందిన హరిజన సురేష్ (25) బొమ్మనహాళ్ మండలం తారకాపురంలోని తిప్పయ్య కుమారై హరిజన లలిత (21) తొమ్మిది నెలల క్రితం వివాహాం చేసుకున్నాడు. కొన్ని నెలలు వీరి దాంపత్యం సాఫీగా సాగింది. ఇటీవల లలితకు ఆరోగ్యం సరిగ్గా లేదు. దీనికితోడు సంతానం కలుగలేదు. ఈ నేపథ్యంలో కల్లుదేవనహళ్లి వన్నూరుస్వామి పీర్ల చావిడిలో మొక్కులు తీర్చుకుంటే రోగం నయమై సంతానం కలుగుతుందని తెలిసిన వాళ్లు చెప్పడంతో భర్తతో కలిసి లలిత పుట్టిళ్లు అయిన తారకాపురం గ్రామానికి వచ్చింది. తారకాపురంలో భర్త చేతిలో హతమైన లలిత, చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న భర్త సురేష్ అక్కడి నుంచి కల్లుదేవనహళ్లి దగ్గర కావడంతో అక్కడికి వెళ్దామని భావించారు. అయితే ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న సురేష్ గురువారం లలిత తల్లిదండ్రులు ఎవరూ లేని సమయంలో భార్యతో గోడవపడ్డాడు. ఇందులో భాగంగానే తలపై బండను మోదడంతో లలిత చనిపోయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అనంతరం భర్త కూడా ఇంటి సమీపంలోని ఓ చెట్టుకు ఊరి వేసుకునేందుకు ప్రయత్నం చేశాడని, అయితే అక్కడ జన సంచారం ఉండటంతో గ్రామ సమీపంలోని వేప చెట్టుకడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. ఘటనా స్థలాన్ని కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ, రాయదుర్గం రూరల్ సీఐ రాజా, బొమ్మనహాళ్ ఎస్ఐ రమాణారెడ్డి పరిశీలించారు. లలిత తండ్రి తిప్పయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
భార్యను హతమార్చిన భర్త
ప్రకాశం, పెద్దదోర్నాల: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను నమ్మకంగా ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి గొడ్డలి గొంతును తెగనరికాడు. దీంతో పాటు అతను కూడా పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దారుణ సంఘటన మండల పరిధిలోని బందంబావి గిరిజన గూడెం వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ వార్త మండలంలో దావానలంగా వ్యాపించింది. ఈ విషయాన్ని బంధువులు పోలీసుల దృష్టికి తీసుకురావటంతో సమాచారం అందుకున్న ఎస్సై అబ్దుల్ రహిమాన్ హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మండల పరిధిలోని తిమ్మాపురానికి చెందిన మండ్లా శ్రీను, మండ్లా రమాదేవి (27) భార్యాభర్తలు. వీరివురు మండల పరిధిలోని బందంబావి వద్ద ఓ పంట పొలానికి కాపలా కోసం గత కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు భార్య రమాదేవిని కట్టెలకు వెళదామని సమీపంలోని తుప్పల వద్దకు శ్రీను తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో ఘర్షణ పడి గొడ్డలితో భార్య గొంతుపై నరికాడు. ఆ తర్వాత మండ్ల శ్రీను తాము నివాసం ఉండే గృహానికి సమీపంలో పురుగు మందు సేవించి ఆత్మహత్య యత్నం చేశాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది పురుగు మందును తాగిన శ్రీనును మండల కేంద్రంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మార్కాపురం వైద్యశాలకు తరలించారు. మృతురాలు రమాదేవికి 10 సంవత్సరాల వయసు కలిగిన కుమార్తె లక్ష్మి, 8 యేళ్ల వయస్సున్న కుమారుడు వెంకటేష్ ఉన్నారు. తల్లి హత్య గురయి, తండ్రి పురుగు మంది తాగి చావు బతుకుల మద్య కొట్టు మిట్లాతున్న విషయం తెలుసుకున్న ఆ చిన్నారులు దీనంగా చూసే చూపులు అందరి హృదయాలను కలిచి వేశాయి. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
భార్య హత్య.. ఆస్తి రాసిస్తేనే అంత్యక్రియలు
కర్ణాటక, బొమ్మనహళ్లి : 17 ఏళ్ల పాటు సాగిన అన్యోన్య దాంపత్యంలో ఒక్కసారిగా అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను హత్య చేసి జైలుపాలుకాగా ఇద్దరు అమ్మాయిలు రోడ్డున పడిన ఘటన మైసూరు సమీపంలోని చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా అంకహళ్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. అంకహళ్లిలో నివాసం ఉంటున్న సురేశ్‌కు, పడగూరు గ్రామానికి చెందిన శశికళతో 17 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన సురేశ్ నిత్యం మద్యం మత్తులో భార్యతో గొడవపడేవాడు. తీవ్రంగా అనుమానించేవాడు. దీంతో పెద్ద కుమార్తెను తాత ఇంటికి పంపించారు. చిన్న కుమార్తె అక్కడే ఉంటోంది. శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సురేశ్ భార్యతో గొడవపడి ఆగ్రహంతో తలపై కట్టెతో బలంగా బాదడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సురేశ్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఆస్తి రాసిస్తేనే అంత్యక్రియలు : పిల్లలు అనాథలుగా మారడంతో సురేశ్ ఇటీవల 14 ఎకరాల భూమిని తన అక్కలకు రాసివ్వడంతో ఆ భూమిని తమ పిల్లలకు రాసిస్తేనే శశికళ అంత్యక్రియలు నిర్వహిస్తామని శశికళ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన నిర్వహించారు. దీంతో సురేశ్ అక్కలు అక్కడికి చేరుకుని ఆస్తిని పిల్లల పేరుతో రాసిస్తామని హామీ ఇవ్వడంతో సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. -
తప్పు ఎవరిది..శిక్ష ఎవరికి?
కర్నూలు ,ఎమ్మిగనూరు రూరల్: భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త కొద్ది గంటల్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని కడివెళ్ల గ్రామానికి చెందిన స్వాతి(35)కి, మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామానికి చెందిన నరసింహారెడ్డికి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టించుకోకుండా అల్లరచిల్లరగా తిరుగుతుండటంతో భార్య, భర్త మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. పెద్దలు సర్దిచెప్పినా భర్తలో మార్పు రాకపోవడంతో ఐదేళ్లుగా స్వాతి పుట్టినిళ్లు కడివెళ్లలో ఉంటూ పిల్లలను చదివించుకుంటోంది. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం భార్య వద్దకు వచ్చిన నరసింహారెడ్డి రెండ్రోజులు బాగానే ఉన్నాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూరగాయలు తరిగే కత్తితో భార్య గొంతు కోసి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకునే లోపే పరారయ్యాడు. లాడ్జీలో ఆత్మహత్య.. బుధవారం సాయత్రం భార్య స్వాతిని అతికిరాతంగా కత్తితో గొంతు కోసి హత్య చేసి పరారైన నరసింహారెడ్డి ఎమ్మిగనూరుకు చేరుకున్నాడు. ముందస్తు ప్రణాళికలో భాగంగా అద్దెకు తీసుకున్న లాడ్జీ గదికి వెళ్లి పంచెతో ఉరివేసుకున్నాడు. గురువారం ఉదయం లాడ్జీలో నుంచి రక్తం బయటకు వస్తుండటం గమనించిన పక్క గది వారు లాడ్జీ సిబ్బందికి తెలియజేశారు. వారు పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పట్టణ ఎస్ఐ శ్రీనివాసులు సిబ్బందితో వెళ్లి తలుపు బద్దలకొట్టి చూడగా ఉరికి వేళాడుతూ కనిపించాడు. మృతదేహాన్ని కిందకు దించి కుటంబ సభ్యులకు తెలియజేశారు. శిక్ష పిల్లలకా? తల్లిదండ్రులు గొడవ పడుతుంటే చిన్నారులు కుమిలిపోయేవారు. ఐదేళ్లుగా అమ్మమ్మ ఊరిలో తల్లితో పాటు ఉంటూ చదువుకునే చిన్నారులకు తండ్రి దూరంగా ఉండేవాడు. అప్పుడప్పుడూ వచ్చే తండ్రిని నాన్నా అని పిలిచేందుకు కూడా భయపడే వారు. ఈ క్రమంలో తల్లి హత్యకు గురికావడం, తండ్రి ఆత్మహత్యకు పాల్పడటంతో అనాథలయ్యారు. తప్పు ఎవరిదైనా తల్లిదండ్రుల ప్రేమకు దూరం కావడమనే శిక్ష చిన్నారులకు పడిందని పలువురు కంట తడిపెట్టారు. -
వివాహిత హత్య...!
రామభద్రపురం: మండలంలోని కొండకెంగువ గ్రామ సమీపంలో కోళ్ల ఫారం వద్ద వివాహిత హత్యకు గురైన సంఘటన గురువారం వేకువజామున చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, కోళ్ల ఫారం యజమాని తెలిపిన వివరాలు... పాచిపెంట మండలం తాడూరు కు చెందిన ఊలం పైడిరాజు భార్య కాంతమ్మతో కలసి రెండు నెలల క్రితం కొండకెంగువ గ్రామానికి చెందిన శిరిపురం శ్రీనివాసరావు కోళ్ల ఫారంలో కాపలాదారుడుగా చేరాడు. కోళ్లఫారం వద్దే చిన్న పూరిగుడిసెలో నివాసం ఉంటూ ప్రతీ రోజూ మద్యం సేవించి భార్యాభర్తలిద్దరూ గొడవలు పడేవారు. బుధవారం సంక్రాంతి పండగ కావడంతో కోళ్లఫారం యజమాని ఆ రోజు వేగంగా కొండకెంగువలో ఉన్న తన ఇంటికి చేరుకున్నాడు. గురువారం వేకువజామున ఫారం యజమాని శ్రీనివాసరావు కొళ్లఫారం వద్దకు వచ్చి కాపలాదారుని పిలిచేందుకు ఇంటికి వెళ్లేసరికి కాపలాదారుని భార్య కాంతమ్మ రక్తపుమడుగులో పడి కొన ఊపిరితో ఉంది. కాపలాదారుడు భర్త పైడిరాజు ఆచూకీ లేకుండా పోయాడు. వెంటనే ఫారం యజమానికి విషయం తెలియక ప్రథమ చికిత్స నిమిత్తం బాధితురాలిని ఆటోలో బాడంగి సీహెచ్‌సీకి తరలించాడు. అక్కడ చికిత్స కోసం ఆటో దించేసరికి కాంతమ్మ మృతి చెందింది. వెంటనే ఫారం యజమాని శ్రీనివాసరావు బంధువులకు, స్థానిక పోలీసులకు విషయాన్ని తెలియజేశాడు. పోలీసులు బాడంగి సీహెచ్‌సీకి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా తల, ముఖం, శరీరంపై గాయాలు ఉండటంతో హత్యేనని నిర్ధారించారు. గతంలో కూడా చాలా సార్లు మద్యం సేవించి భార్యాభర్తలిద్దరూ గొడవలు పడేవారని అల్లుడు పైడిరాజే తన కుమార్తె కాంతమ్మను హత్య చేశాడని మృతురాలి తండ్రి తేడా పూసపాటి సోమరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు సాలూరు సీఐ సింహాద్రినాయుడు, ఎస్ఐ ఎస్.కృష్ణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు చేపట్టారు. పండగ పూట హత్యోదంతం తెలిసి మృతురాలి సొంత గ్రామం పాచిపెంట మండలం తాడూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
బ్యాట్‌తో కొట్టి తలకు ప్లాస్టిక్ కవరు చుట్టి హత్య
నరసరావుపేటరూరల్: భార్యభర్తల మధ్య చోటు చేసుకున్న స్వల్పవివాదం భార్య హత్యకు దారితీసింది. పురపాలక సంఘం పరిధిలోని బరంపేట కాసు బ్రహ్మనంద ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న షేక్ హయతున్నీసా(35) తన భర్త ముస్తఫా చేతిలో దారుణ హత్యకు గురైంది. క్రికెట్ బ్యాట్‌తో తలపై దాడి చేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... నగరం మండలం చినమట్లపూడి గ్రామానికి చెందిన షేక్ హయతున్నీసాకు తన సమీప బంధువైన నిజాంపట్నానికి చెందిన ముస్తఫాతో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల కుమా రుడు ఉన్నాడు. ఆరు నెలల కిందట ఉద్యోగ బదిలీలలో భాగంగా హయతున్నీసా నరసరావుపేటకు వచ్చి సత్తెనపల్లి రోడ్డులోని సాయినగర్ 4వ లైన్‌లోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. భర్త ముస్తఫాకు ఉద్యోగం లేకపోవడంతో గతంలో ఇన్నోవా వాహనాన్ని బాడుగులకు నడిపే నిమిత్తం కొనుగోలు చేసింది. అయితే ఇందులో ముస్తఫాకు నష్టాలు వచ్చా యి. తర్వాత రూ.2లక్షల పెట్టుబడితో వస్త్ర వ్యాపారం మొదలుపెట్టించింది. ఈ వ్యాపారంలోను నష్టాలు రావడంతో భార్యభర్తల మధ్య వివాదం మొదలైంది. తనకు డబ్బు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే హయతున్నీసా కుటుంబానికి దూరంగా బదిలీ చేయించుకుందని ముస్తఫా భావించాడు. ఈ నేపథ్యంలో ఆరు నెలల కిందట నుంచి హయతున్నీసా నరసరావుపేటలో నివాసం ఉంటున్నప్పటికీ ముస్తఫా మాత్రం ఇక్కడకు రాలేదు. నెల రోజుల కిందట పెద్దమనుషులు ఇరువురి మధ్య రాజీ చేశారు. అప్పటి నుంచి ఇరువురు ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి దంపతులు ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ముస్తఫా ఆవేశంతో అందుబాటులో ఉన్న క్రికెట్ బ్యాట్‌తో భార్య హయతున్నీసా తలపై దాడి చేశాడు. తలకు తీవ్రగాయమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. అనంతరం ఆమె తలకు ప్లాస్టిక్ కవరు చుట్టి హత్యకు పాల్పడ్డాడు. ముస్తఫా తన కుమారుడు రజాను తీసు కుని పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించారు. క్లూస్ టీమ్ రప్పించి ఆధారా లు సేకరించారు. డీఎస్పీ వీరారెడ్డి, సీఐలు బిలాలుద్దిన్, కృష్ణయ్య, అచ్చయ్య, ఎస్ఐలు బ్రహ్మం, నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
పోచంపల్లిలో దారుణ హత్య
సాక్షి, రేగొండ: కట్టుకున్న భర్తే కాలయముడై భార్యను అతి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పోచంపల్లిలో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన మోటం లత అనే మహిళను ఆమె భర్త సదయ్య గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. శుక్రవారం తెల్లవారు జామున లతను హత్య చేసి సదయ్య పరారయ్యాడని మృతురాలి బంధువులు,గ్రామస్తులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆడపిల్లలు పుట్టారని అమానుషం
బంజారాహిల్స్: ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారని భార్యపై కోపం పెంచుకున్న ఓ వ్యక్తి మద్యం మత్తులో ఆమె గొంతు నులిమి హత్య చేసిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాదగిరిగుట్ట మండలం, కొల్లేర్ గ్రామానికి చెందిన బుగ్గా పద్మ(32)కు 12 ఏళ్ల క్రితం భువనగరి మండలం, కూనూరు గ్రామానికి చెందిన బుగ్గా బాబుతో వివాహం జరిగింది. డ్రైవర్‌గా పని చేసే బాబు కుటుంబంతో కలిసి ఎన్బీటీనగర్లో ఉంటున్నాడు. వీరికి హర్షిత, శ్రీవర్షిణి, చిత్ర ముగ్గురు కుమార్తెలు. పెద్ద కూతురు హాస్టల్లో ఉండగా, మిగతా ఇద్దరూ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. కాగా మూడో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టడంతో అప్పటి నుంచి బాబు పద్మను వేధిస్తున్నాడు. పద్మ మృతదేహం, నిందితుడు రాజు ముగ్గురు ఆడపిల్లలే పుట్టారని తరచూ ఆమెను కొట్టేవాడు. సోమవారం ఉదయం మద్యం మత్తులో అతను భార్యను తీవ్రంగా కొట్టాడు. దీంతో పద్మ కుమార్తెలను స్కూలుకు వెళ్ల వద్దని చెప్పింది. అయినా బాబు వినిపించుకోకుండా పిల్లలిద్దరినీ బలవంతంగా స్కూల్లో దించి ఇంటికి వచ్చి భార్యను చితక బాదాడు. తలుపులు వేసి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పద్మ సోదరుడికి ఫోన్ చేసి మీ చెల్లి చనిపోయిందని చెప్పి ఇంట్లోంచి పరారయ్యాడు. దీంతో ఇంటికి వచ్చిన పద్మ సోదరుడు చెల్లెలి మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు బాబును అరెస్ట్ చేశారు. -
భర్తే హంతకుడు
నెల్లూరు, వెంకటగిరి: పట్టణంలోని మందరిల్లు ప్రాంతానికి చెందిన నాశిన నాగమణి ఉరఫ్ నాగరత్నమ్మ అనే వివాహిత హత్య కేసులో ఆమె భర్త నాసిన నిరంజన్ను అరెస్ట్ చేసినట్లుగా గూడూరు డీఎస్పీ భూమన భవానీహర్ష తెలిపారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రాణిపేట సమీపంలోని మందరిల్లు ఎస్టీ కాలనీ ప్రాంతానికి చెందిన నాగమణి గత నెల 28వ తేదీన తన ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో రెండురోజుల క్రితం మృతురాలి భర్త నిరంజన్ వెంకటగిరి తహసీల్దార్ ఎదుట లొంగిపోయి బంగారు నెక్లెస్ విషయంలో గొడవపడి భార్యను గొంతునులిమి హత్య చేసినట్లుగా అంగీకరించాడు. వెంకటగిరి సీఐ అన్వర్‌బాషా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేసి అరెస్ట్ చేశాడు. అతడిని కోర్టుకు హాజరుపరుస్తామని డీఎస్పీ తెలియజేశారు. సమావేశంలో ఎస్సైలు వెంకటరాజేష్, అనూష తదితరులు పాల్గొన్నారు. -
వివాహిత దారుణ హత్య
చిత్తూరు, రేణిగుంట : అగ్ని సాక్షిగా జీవితాంతం తోడుగా ఉంటానని పెళ్లినాటి ప్రమాణాలను గాలికొదిలేశాడు. తిరుమల వెంకన్న దర్శనం కోసం అని మాయమాటలు చెప్పి భార్యను కిరాతకంగా కడతేర్చాడు. గురువారం ఈ సంఘటన రేణిగుంట మండలంలో వెలుగుచూసింది. గాజులమండ్యం సీఐ అమరనాథరెడ్డి కథనం... గాజులమండ్యంకు చెందిన రుక్మానందరాజు కుమార్తె రూప(26)కు విప్పమానుపట్టెడకు చెందిన మునిశంకర్(30)తో 2014లో వివాహమైంది. వీరికి నిఖిత(4) కుమార్తె ఉంది. మునిశంకర్ టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వివాహమైన కొంత కాలానికే మునిశంకర్ తాగొచ్చి భార్యతో గొడవ పడుతూ తరచూ కొట్టి హింసించేవాడు. ఈ నేపథ్యంలో తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లాలని భార్యను నమ్మించాడు, చిన్నారి నిఖితను గాజులమండ్యంలోని అమ్మమ్మ ఇంటి వద్ద దింపి అక్కడ నుంచి బుధవారం ఉదయం దంపతులిద్దరూ తిరుమలకు ఇంటి నుంచి వ్యానులో బయల్దేరారు. అయితే సాయంత్రానికి పూటుగా మద్యం సేవించి మునిశంకర్ ఒక్కడే విప్పమానుపట్టెడకు చేరుకుని కాసేపటికే పరారయ్యాడు. అయితే గురువారం ఉదయం మండలంలోని తూకివాకం–విప్పమానుపట్టెడ మార్గంలోని ఓ ప్రైవేటు వెంచర్ సమీపంలో వివాహిత మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు సమాచారం చేరవేయడంతో డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అమరనాథరెడ్డి, ఎస్ఐ స్వాతి, తహసీల్దార్ విజయసింహారెడ్డి అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఇనుపరాడ్‌తో తలపై బలంగా మోది వివాహితను హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. ఘటన స్థలంలో రక్తపు మరకలు అంటిన ఇనుప రాడ్ పడి ఉండడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. హతురాలు రూప అని నిర్థారించుకున్న పోలీసులు ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న మృతురాలి బంధువులు గుండెలవిసేలా రోదించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో రూపను ఆమె భర్తే హత్య చేసి పరారైనట్లు గ్రహించిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా తండ్రి చేతిలో తల్లి దారుణ హత్యకు గురవడంతో చిన్నారి నిఖిత అనాథగా మారింది. -
అనుమానించాడు.. హతమార్చాడు
దొడ్డబళ్లాపురం : భార్య శీలాన్ని శంకించిన భర్త అనుమానం పెనుభూతమై ఆమెను కొడవలితో నరికి హత్యచేసి పరారైన సంఘటన మాగడి తాలూకా హాలశెట్టిహళ్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... నెలమంగల తాలూకా చిక్కనాయకనపాళ్య గ్రామానికి చెందిన మంజుల, రేవణ్ణ దంపతుల కుమార్తె పూర్ణిమ (24)హత్యకు గురైంది. పూర్ణిమను 2018 నవంబర్‌లో మాగడి తాలూకా హాలశెట్టిహళ్లికి చెందిన గంగాధరయ్య కుమారుడు నాగరాజుకు ఇచ్చి వివాహం జరిపించారు. పూర్ణిణమ బెంగళూరులోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేసేది. నాగరాజు గ్రామంలోనే వ్యవసాయం చేసుకునేవాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న నాగరాజు నిత్యం ఆమెతో గొడవపడేవాడు. బుధవారం సాయంత్రం భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నాగరాజు ఆవేశం పట్టలేక కొడవలితో భార్యను నరికి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుండి పరారయ్యాడు. బయటకు వెళ్లిన నాగరాజు తండ్రి గంగాధరయ్య రాత్రి ఇంటికి వచ్చి చూడగా పూర్ణిమ రక్తం మగుడులో కనిపించింది. సమాచారం అందుకున్న సీఐ రవికుమార్, ఎస్సై వెంకటేశ్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నాగరాజు కోసం గాలిస్తున్నారు. -
కసితోనే భార్య తల నరికాడు
సాక్షి, అమరావతి: అన్యోన్యంగా సాగుతున్న కాపురంలో తలెత్తిన విభేదాలు, మనస్పర్థల కారణంగానే భార్య మణిక్రాంతిని కసితోనే కడతేర్చాడని విజయవాడ శాంతిభద్రతల విభాగం డీసీపీ–2 విజయరావు తెలిపారు. ఈ నెల 11వ తేదీన శ్రీనగర్‌కాలనీ 4వ లైనులో భర్త చేతిలో మణిక్రాంతి దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రదీప్‌కుమార్‌ను, అతడికి సహకరించిన కారు డ్రైవర్ భవానీ ప్రసాద్‌ను శుక్రవారం సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేశారు. విలేకరులకు వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ విజయరావు ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ విజయరావు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘విజయవాడలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న మణిక్రాంతి, ప్రదీప్‌కుమార్ 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లపాటు వీరి కాపురం బాగానే ఉంది. 2017లో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ప్రదీప్ అతడి కుటుంబ సభ్యులపై మణిక్రాంతి సత్యనారాయణపురం పోలీసు స్టేషన్లో 2018లో ఫిర్యాదు చేయగా 498(ఏ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తరువాత వివిధ సందర్భాల్లో అదే పోలీసు స్టేషన్లో మరో మూడు సార్లు మణిక్రాంతి ఫిర్యాదు చేయగా ప్రదీప్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యారావుపేట పోలీసుస్టేషన్లో మూడు కేసులు.. మాచవరం పోలీసుస్టేషన్లో కేసు పెట్టింది. సదరు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని అరెస్టు చేశారు. మణిక్రాంతి పెట్టిన కేసులలో ప్రదీప్‌కుమార్, అతడి కుటుంబ సభ్యులు కోర్టు వాయిదాలకు హాజరవుతున్నారు. కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో ఇటీవల సూర్యారావుపేట పోలీసుస్టేషన్లో పెండింగ్‌లో ఉన్న వారెంట్ ఆధారంగా ఈ నెల 6వ తేదీ అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచగా 7వ తేదీ ప్రదీప్ బెయిల్‌పై బయటకొచ్చాడు. నీవెంతంటే.. నీవెంత.. ఈ నెల 7వ తేదీన విజయవాడలోని కోర్టు ఆవరణలో భార్యభర్తల మధ్య కోర్టు ఆవరణలో తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. నీవెంత అంటే నీవెంత అనే స్థాయిలో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికి అతడి స్నేహితుడు మధురానగర్ 7వ లైనుకు చెందిన గరికపాటి భవానీప్రసాద్ సహకారం తీసుకున్నాడు. హత్య జరిగిన ముందు(10.8.19) రోజు శ్రీనగర్ కాలనీకి భవానీప్రసాద్కు చెందిన కారులో వెళ్లి రెక్కీ నిర్వహించారు. 11వ తేదీ మధ్యాహ్నం మళ్లీ భవానీప్రసాద్ తన కారులో ప్రదీప్‌ను శ్రీనగర్ కాలనీకి తీసుకొచ్చి మణిక్రాంతి ఇంటి ముందు అతడిని దించి తాను వెళ్లిపోయాడు. ఆ తర్వాత ప్రదీప్ కుమార్ తన పథకం ప్రకారం తనతో తెచ్చుకున్న కొబ్బరి బొండాలు నరికే కత్తితో మణిక్రాంతి వద్దకు వెళ్లి ఆమెను కాళ్లపైనా, మెడపైన విచక్షణా రహితంగా నరుకుతుండగా ఆమె కేకలు వేసింది. అది విని మృతురాలి తల్లి, చెల్లి బయటకు వచ్చి చూడగా వారిని బెదిరించాడు. తలను వేరు చేసి చేతిలో పట్టుకుని వెళ్తుండగా అడ్డువచ్చిన ఆమె తల్లి, చెల్లితోపాటు స్థానికులను ప్రదీప్ కత్తితో బెదిరించి పారిపోతూ సమీపంలోని ఏలూరు కాలువలో తలను, కత్తిని, ఫోన్‌ను పడేశాడు. ఈ నేపథ్యంలో డెయిల్ 100కు వచ్చిన సమాచారం మేరకు సత్యనారాయణపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరినీ శుక్రవారం అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన కారు, రక్తపు మరకలతో ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలతో.. నిందితుడు మృతురాలి తలను వేరు చేసి కాలువలో పడేశాడు. ఆ తల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నాం. కాలువ మార్గంలో ఉన్న పోలీసుస్టేషన్లకు సమాచారం అందించాం. స్థానిక పోలీసులు వెతుకుతున్నారు. అయితే తల కనబడకపోయినా.. కేసుకు సంబంధించి బలమైన సాంతికేక ఆధారాలైన సీసీ టీవీ ఫుటేజీ సేకరించాం. హతుడు ఉపయోగించిన కత్తికి సంబంధించిన పిడికిలి లభ్యమైంది. రక్త నమానాలు తీసుకున్నాం. ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. కారును సీజ్ చేశాం. వీటన్నింటీ ఆధారంగానే చార్జీషీటు దాఖలు చేసి నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం’ అని విజయరావు వివరించారు. సమావేశంలో ఏడీసీపీ ఎల్టీ చంద్రశేఖర్, ఏసీపీ షేక్ షరీఫుద్దీన్, సీఐ బాలమురళీ కృష్ణ, ఎస్ఐ సత్యానారాయణ పాల్గొన్నారు. -
అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
మండ్య: భార్యపై అనుమానం పెంచుకొని ఆమెను దారుణంగా హత్య చేసిన భర్త ఉదంతం గురువారం మండ్య జిల్లాలోని పాండవపురలో చోటు చేసుకుంది. పాండవ పుర పట్టణంలో నారాయణ, మంగళ(33) దంపతులు నివాసం ఉంటున్నారు. మంగళ స్థానికంగా ఉన్న ఇందిరా క్యాంటిన్లో పనిచేసేది. కొంతకాలంగా మంగళపై నారాయణ అనుమానం పెంచుకొని తరచూ గొడవపడేవాడు. ఈక్రమంలో గురువారం పనులు ముగించుకొని ఇంటికి వచ్చి నిద్రస్తున్న మంగళను నారాయణ బండరాతితో బాది ఉడాయించాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న మంగళను స్థానికులు గుర్తించి మైసూరులోని కేఆర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నారాయణను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. -
ప్రేమ పెళ్లి: అనుమానంతో అతి కిరాతకంగా..
సాక్షి, గుంటూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. నిండు నూరేళ్లు తోడుగా ఉంటానన్నాడు.. మూడు ముళ్లు కట్టి.. ఏడడుగులు వేసిన బంధాన్ని కాటికి పంపాడు.. భార్యను అతి కిరాతకంగా హతమార్చిన కేసులో భర్తకు జీవిత ఖైదు (బతికున్నంత కాలం) శిక్షను విధిస్తూ... ఆరో అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ నిర్వహించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కట్టా కాళిదాసు కథనం మేరకు.. మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన మహంకాళి నాగమల్లేశ్వరరావు అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మను (25) ప్రేమ వివాహం చేసుకున్నాడు. నాగమల్లేశ్వరరావు భవన నిర్మాణ కార్మికుడిగా ఉండగా వెంకటేశ్వరమ్మ ఇళ్లల్లో పనులు చేస్తుండేది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వివాహం అనంతరం కొద్ది కాలంగా వెంకటేశ్వరమ్మపై భర్త నాగమల్లేశ్వరరావు అనుమానం పెంచుకున్నాడు. భార్యను చీటికి, మాటికి కొడుతూ ఉండటంతో వెంకటేశ్వరమ్మ తల్లి వెంకాయమ్మ పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టి సఖ్యత చేసింది. దీంతో భార్యాభర్తలు మార్టూరు వెళ్లి అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. అక్కడకు వెళ్లినప్పటికీ నాగమల్లేశ్వరరావు ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో వెంకటేశ్వరమ్మ తన ఇద్దరు పిల్లలతో మంగళగిరిలోని గండాలయ్యపేటలో నివాసం ఉంటూ ఇంటి పనులు చేసుకుంటు జీవనం సాగిస్తుంది. 2013 ఆగస్టు 24న ఆమె నివాసం ఉంటున్న ఇంటి వద్దకు వచ్చిన నాగమల్లేశ్వరరావు భార్యతో ఘర్షణకు దిగడంతో చుట్టుపక్కలవారు, ఇంటి యజమాని మందలించి పంపించారు. మరుసటి రోజు 25వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో వెంకటేశ్వరమ్మ గదిలో నుంచి బయటకు వచ్చి తన కుమార్తెను బాత్రూముకు తీసుకెళుతున్న క్రమంలో తనతోపాటు కత్తి తెచ్చుకున్న నాగమల్లేశ్వరరావు వెంకటేశ్వరమ్మను విచక్షణారహితంగా పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న అన్న, తల్లి, ఇంటి యజమాని బయటకు వచ్చే సమయంలో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. దీంతో వెంకటేశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ హత్యపై మృతురాలి సోదరుడు సాంబయ్య మంగళగిరి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి సీఐ ఆర్.సురేష్‌బాబు కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టడంతో, కోర్టు మాని టరింగ్ సెల్ ఏఎస్సై గాజుల శివప్రసాద్, టౌన్ పోలీసు స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ పాలపర్తి నరేంద్ర చొరవ చూపారు. కోర్టులో నాగమల్లేశ్వరరావుపై కేసు రుజువు కావడంతో న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ నిందితుడికి జీవించి ఉన్నంతకాలం జీవిత ఖైదు, రూ. 2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
దంపతుల ప్రాణం తీసిన జూదం
-
నిద్రలో ఉన్న భార్యను కడతేర్చిన భర్త
చెడు వ్యసనాలు అతడిని అప్పులపాలు చేశాయి. తాకట్టు పెట్టిన తన నగలను తెచ్చివ్వాలని కోరిన ఇల్లాలిపై కోపోద్రిక్తుడై కాలయముడిగా మారాడు. నిద్రిస్తున్న భార్యను కర్రతో బాది హత్య చేశాడు. ఆపై తనూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో యాటకల్లులో విషాదం అలుముకుంది. అనంతపురం ,శెట్టూరు: కళ్యాణదుర్గం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన గొల్ల సరళమ్మ(30)కు శెట్టూరు మండలం యాటకల్లుకు చెందిన గొల్ల రామచంద్రతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు యోగానంద, గోవర్ధన్, కుమార్తె చైత్ర ఉన్నారు. చెడువ్యసనాలకు అలవాటుపడిన రామచంద్ర అందినకాడల్లా అప్పులు చేశాడు. ఈ క్రమంలో భార్య ఒంటిపై ఉన్న నగలు కూడా తాకట్టు పెట్టి నగదు తెచ్చుకుని జూదంలో కోల్పోయాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరిగేది. శనివారం రాత్రి సరళమ్మ తన నగలు తనకు తెచ్చివ్వాలంటూ భర్తను నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో రామచంద్ర ఆవేశంతో ఊగిపోయాడు. అలా కాసేపటి తర్వాత అందరూ నిద్రకు ఉపక్రమించారు. అయితే తనను నిలదీసిందనే కోపంతో రగిలిపోతున్న రామచంద్రప్ప ఆదివారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న భార్య సరళమ్మను కర్రతో తలపై మోదాడు. సమీపంలోనే నిద్రిస్తున్న రామచంద్ర తల్లి ఉలికిపడి లేచి చూసి గట్టిగా అరిచింది. చుట్టు పక్కల జనం వచ్చి సరళమ్మను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి భార్య చనిపోయిందని తెలిసిఆత్మహత్యాయత్నం భార్య చనిపోయిందని తెలుసుకున్న గొల్ల రామచంద్ర బహిర్భూమికని వెళ్తూ పురుగుమందు వెంట తీసుకెళ్లి.. అక్కడే తాగి పడిపోయాడు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు అపస్మారక స్థితిలో పడి ఉన్న రామచంద్రను చూసి కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రామచంద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సీఐ శివప్రసాద్, ఎస్ఐ రమనారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, హతురాలి తల్లి లక్ష్మిదేవమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. తల్లిని కోల్పోయిన ముగ్గురు పిల్లలు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. -
భార్యను కడతేర్చిన భర్త
కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట : భార్యను కట్టుకున్న భర్త కడతేర్చిన ఘటన పట్టణంలోని వైవై కాలనీలో బుధవారం అర్థరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే మాడావత్ యలమంద నాయక్ భార్య రత్నకుమారి (40) నటరాజ్ సెంటర్లో నూడిల్స్ హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి వివాహమైన కుమార్తె ఉంది. అయితే ఇటీవల యలమంద నాయక్ హోటల్ విక్రయించాడు. దీంతో భార్యాభర్తల మధ్య నగదు విషయమై వారం రోజులుగా గొడవ జరుగుతోంది. హోటల్ విక్రయించిన నగదు తనకు ఇవ్వాలని భార్యను యలమంద నాయక్ తీవ్ర వత్తిడి చేస్తున్నాడు. ఈ క్రమంలో అర్థరాత్రి 12 గంటల సమయంలో బయట నుంచి ఇంటికి వచ్చిన భర్తకు బెడ్రూంలో భార్య ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది. ఎవరితో మాట్లాడుతున్నావంటూ అడిగాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మంచంపై ఉన్న కండువాను భార్య మెడకు చుట్టి ఊపిరాడకుండా చేశాడు. కొద్దిసేపటికి భార్య రత్నకుమారి అపస్మారక స్థితికి చేరుకుని మృతి చెందింది. ఏం చేయాలో తెలియక ఇంటికి తలుపులు వేసి బైకుపై సమీపంలోని వత్సవాయి మండలం గోపినేనిపాలెం గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి భార్యను హత్య చేశానని భయంగా ఉందని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో వారు ఖమ్మంలో ఉంటున్న మృతురాలి కుమార్తెకు సమాచారం అందించారు. గురువారం తెల్లవారుజామున బంధువులు, కుటుంబ సభ్యులు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే మృతి చెంది ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ అబ్దుల్ నబీ, ఎస్ఐలు ధర్మరాజు, తాతాచార్యులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతురాలి సోదరి బాణావత్ లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులకు లొంగుబాటు.. భార్యను హత్య చేసిన భర్త యలమంద ఉదయం 10 గంటల సమయంలో పోలీసులకు లొంగిపోయాడు. ఇదిలా ఉండగా తనకు ఇద్దరు భార్యలున్నారని చెప్పారు. మృతి చెందినది మొదటి భార్య కాగా, రెండవ భార్య మిర్యాలగూడలో ఉంటుందని చెప్పారు. కానీ తరచూ ఇరువురి భార్యలు ఘర్షణ పడేవారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. -
భార్య మరో వ్యక్తితో చాటింగ్ చేస్తోందని..
సాక్షి, కోల్ సిటీ (రామగుండం) : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటుచేసుకుంది. గాంధీనగర్‌కు చెందిన దుర్గం మౌనికను ఆమె భర్త శ్రావణ్ హత్యచేశాడు. మౌనిక తలపై ఇనుపరాడుతో బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. మౌనిక, శ్రావణ్‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. భార్యను డిగ్రీ చదివించిన శ్రావణ్ ఇటీవల లాసెట్ పరీక్ష కూడా రాయించాడు. అయితే ఎలాంటి పనిచేయని శ్రావణ్ తండ్రి వారసత్వ ఉద్యోగం(సింగరేణి) కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్య కాలంలో భార్యపై శ్రావణ్ అనుమానం పెంచుకున్నాడు. మొబైల్లో మరో వ్యక్తితో చాటింగ్ చేస్తోందని భార్యతో గొడవపడ్డ శ్రావణ్ ఆమెను హత్య చేశాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
‘నా భార్య ఉరి వేసుకుంది, రండి చూద్దాం'
కడప, రాజంపేట : కట్టుకున్న భార్యనే గొంతునులిమి హతమార్చాడు భర్త. ఈ ఘటన రాజంపేట పట్టణంలో ప్రశాంత్‌నగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా.. పెనగలూరు మండలం ఎన్‌ఆర్‌పురానికి చెందిన ముండే రామానుజమ్మ(27), రైల్వేకోడూరు మండలంలోని ఉప్పరపల్లెకు చెందిన శంకరయ్యకు రెండు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వీరిద్దరికి ఇది రెండవ వివాహం కావడం గమనార్హం. కాగా శంకరయ్యకు నెల్లూరు జిల్లా పొదలకూరులో మొదటి భార్య చనిపోవడంతో శంకరయ్య, జీవనో పాధి నిమిత్తం కువైట్‌లో ఉండి వచ్చిన రామానుజమ్మను (మొదటి భర్తను వదలివేసి) వివాహం చేసుకున్నాడు. శంకరయ్య, రామానుజమ్మల కాపు రం సజావుగా కొనసాగింది. ఐదునెలల పాప కూడా ఉంది. అయితే ఏం జరిగిందో తెలియదు. ఆదివారం ఒక్కసారిగా శంకరయ్య కిందకు వచ్చి ‘‘నా భార్య ఉరి వేసుకుంది, రండి చూద్దాం అని మృతురాలి గ్రామస్తుడు, కింది అంతస్తులో నివాసం ఉంటున్న పెంచలయ్యను పైకి తీసుకెళ్లాడు. అప్పటికే మృతురాలిని కిందికి దించి ఉన్నాడు. ఆటో తీసుకొని వస్తా అని చెప్పి’’ శంకరయ్య పరారీ అయ్యాడు. అయితే స్థానికులు ఈ మృతిని అనుమానాస్పదంగా భావించారు. హత్యకేసుగా నమోదు రామానుజమ్మ ఇంటిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని స్ధానికుల నుంచి పోలీసులకు సమాచారం చేరింది. పట్టణ ఎస్ఐ హనుమంతు రామానుజమ్మ మృతికి గల కారణాలపై దృష్టి సారించారు. భార్యను భర్త గొంతు నులిపి హత్య చేశాడనే విధంగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. శంకరయ్య పరారీలో ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా హాస్పిటల్‌కు తరలించామని వివరించారు. కలిచివేసిన పాప ఏడుపులు రామానుజమ్మ మృతి చెందడంతో ఆమె బిడ్డ ఏడుపులు ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేశాయి. చుట్టుపక్కల వారు ఓదార్చడానికి ప్రయత్నంచినా సాధ్యంకాలేదు. తల్లి తనకు ఎక్కడ దూరమైందో అనే విధంగా చిన్నారి రోదన ప్రతి ఒక్కరికి కంటితడిపెట్టించింది. -
దుర్వ్యసనాలు మానుకోమన్నందుకే..
కృష్ణాజిల్లా పామర్రు : వివాహిత ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. దుర్వ్యసనాలు మానేయాలంటూ రోజూ ఇబ్బందులు పెడుతోందన్న కసితోనే భార్య గొంతు నులిపి చంపేశాడు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించడంతో నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు. పామర్రు సీఐ డి శివశంకర్ గురువారం తన కార్యాలయంలో మీడియాకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 5వ తేదీ రాత్రి నాగపట్నం వద్ద హోటల్ నిర్వహిస్తున్న జువ్వనపూడి ప్రశాంతి ఆత్మహత్య చేసుకున్న ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో విచారణ నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జుఝవరం గ్రామానికి చెందిన మృతురాలి తండ్రి మట్టా కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మృతురాలు ప్రశాంతి (32) కి 2007లో రిమ్మనపూడి గ్రామానికి చెందిన జువ్వనపూడి అంజిబాబుతో వివాహం జరిగింది. వీరికి ఇరువురు సంతానం. మృతురాలి భర్త చంటిబాబు మొదటి నుంచి దుర్వ్యసనాలకు బానిస. మద్యం తాగటం, ఆడవాళ్లతో తిరుగుతూ భార్యను అనుమానిస్తుండేవాడు. ఏ కారణం లేకుండా తరచూ భార్యను చులకనగా చూస్తూ, ఆమెను కొడుతూ, తిడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బందులు పెడుతుండేవాడు. భర్త ఇబ్బందులను తాళలేక పది రోజుల క్రితం పిల్లలతోసహా పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో చంటిబాబు జుఝవరం వెళ్లి ప్రశాంతి తల్లిదండ్రులను బతిమిలాడి బాగా చూసుకుంటానని చెప్పి ఈనెల 3న నాగపట్నం తీసుకువచ్చాడు. అయితే, తర్వాత కూడా చంటిబాబులో మార్పు రాలేదు. మద్యం సేవించడం, తిరగటం, కొట్టడం చేస్తుండటంతో భరించలేని ప్రశాంతి ఈనెల 5 వ తేదీ రాత్రి గట్టిగా ప్రశ్నించింది. మద్యం మత్తులోఉన్న చంటిబాబు తన భార్యను మంచంపైకి నెట్టి రెండు చేతులతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె చీరతో గట్టిగా మెడ చుట్టూ బిగించి ఫ్యానుకు ముడి వేసి ఉరి వేసుకున్నదని అందరిని నమ్మించి నేరం నుంచి తప్పించుకోవాలని చూశాడు. అయితే, పోలీసులు తమదైన శైలిలో విచారణ నిర్వహించడంతో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతనిని గురువారం కోర్టులో హాజరుపరిచామని సీఐ తెలిపారు. సెక్షన్ 498(ఎ), ఐపీసీ 302 తో పాటు సెక్షన్ 201 కూడా కలిపి దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పామర్రు ఎస్ఐ అబీబ్ బాషా, పీ ఎస్ఐలు సూర్య, గాయత్రీ, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు. -
పాల్వంచలో దారుణం.. భార్యపై అనుమానంతో
సాక్షి, ఖమ్మం : పాల్వంచలో దారుణం చోటు చేసుకుంది. ఓ అనుమానం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అనుమానంతో భార్యను హతమార్చిన ఘటన పాల్వంచలోని సీతారాంపట్నంలో వెలుగుచూసింది. భార్యను అనుమానుమించిన భర్త (శివ).. ఆమె మొహంపై అతికిరాతకంగా కర్రతో కొట్టి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
మిస్టరీ వీడిన జంట హత్యల కేసు
నాగోలు: కట్టుకున్న భార్యను, కుమారుడిని హత్య చేసిన నిందితుడిని వనస్థలిపురం పోలీస్‌లు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. బుధవారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. బిహార్ రాష్ట్రం పాట్నాకు చెందిన మొహాద్ అబిడ్ ఆలం (27) 2010లో నగరానికి వచ్చాడు. వనస్థలిపురం ఇందిరా నగర్లో ఓ ఇంట్లో కిరాయికి ఉండేవాడు. నగర శివారులోని సెయింట్ మేరీ ఇంజినీంగ్ కళాశాలలో 2014లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అబిడ్ ఆలం నివసించే ఇందిరానగర్‌లోని ఇంటి పక్కనే యువతి కవిత ఉండేది. వీరి మధ్య పరిచయం ప్రేమకు దారి తీసి పెళ్లి చేసుకున్నారు. అబిడ్ ఆలం, కవిత అలియాస్ సభా కలిసి ఆటోనగర్ విజయ శ్రీకాలనీలో నివాసం ఉండేవారు. వీరికి రెండేళ్ల వయసున్న కుమారుడు మొహాద్ ఇర్ఫాన్ ఉన్నాడు. కొన్ని రోజులుగా భార్య కవితపై అనుమానం పెంచుకున్నాడు. ఇటీవల ఆమెపై దాడి చేసి టవల్‌ను మెడకు చుట్టి హత్య చేశాడు. అనంతరం కుమారుడు ఇర్ఫాన్ ముక్కు మూసి చంపేశాడు. అనంతరం మృతదేహాలను ఇంట్లోని వాటర్ డ్రమ్ములో వేసి పారిపోయాడు. గత నెల 30న ఇంట్లోంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. తల్లీ కొడుకులను హత్య చేసి డ్రమ్ములో పడేసి పారిపోయినట్లు పరారైనట్లు తెలుసుకున్నారు. కవిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం మేడ్చల్ పరిధిలో అబిడ్ ఆలంను అరెస్టు చేశారు. భార్యపై అనుమానంతో తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, వనస్థలిపురం ఏసీపీగాంధీనారాయణ.సీఐ వెంకటయ్య, డీఐలు జగన్నాధం, సత్యనారా యణ పాల్గొన్నారు. -
వివాహిత దారుణహత్య
కర్నూలు, పత్తికొండ టౌన్: పట్టణంలో ఓ వివాహిత గురువారం కట్టుకున్న భర్త చేతిలోనే దారుణహత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక మడ్డిగేరి కాలనీకి చెందిన సూర్యనారాయణ, భూషమ్మ దంపతుల కుమార్తె మహేశ్వరిని చక్రాళ్లరోడ్డు కొండగేరిలో నివాసం ఉంటున్న నాగభూషణం, సంజమ్మ దంపతుల కుమారుడు రవికి ఇచ్చి రెండేళ్లక్రితం వివాహం చేశారు. వీరికి 8 నెలల కూతురు ఉంది. రవి, మహేశ్వరి దంపతులు జీవనోపాధి కోసం రాజంపేటకు వలస వెళ్లారు. బంధువులు గద్దెరాళ్ల దేవర చేస్తుండటంతో వారం రోజుల క్రితం స్వగ్రామం పత్తికొండకు వచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి భార్యాభర్త గొడవపడ్డారు. భర్త రవి, అత్తమామలు మహేశ్వరిని తీవ్రంగా కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. ఉదయం ఏమీ తెలియని వారి మాదిరిగా ఫిట్స్ వచ్చి పడిపోయిందని చెప్పి, మహేశ్వరి మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యసిబ్బంది ధ్రువీకరించారు. తమ కూతురు మహేశ్వరిని పెళ్లయినప్పటి నుంచి భర్త, అత్తమామలు నిత్యం అనుమానంతో శారీరకంగా, మానసికంగా వేధిస్తూ, తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, వారే కొట్టిచంపారని మృతురాలి తండ్రి సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ కృష్ణయ్య, ఎస్ఐ విజయకుమార్ పోలీసు సిబ్బంది ఆస్పత్రికి వెళ్లి మహేశ్వరి మృతదేహాన్ని పరిశీలించారు. భర్త రవి, అత్తమామలు నాగభూషణం, సంజమ్మలను అదుపులోకి తీసుకుని పోలీసుశైలిలో విచారించడంతో హత్యానేరం అంగీకరించారు. ఈ మేరకు వారిపై హత్యకేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణయ్య తెలిపారు. కాగా తల్లి మృతిచెందడం, తండ్రిని పోలీసులు అరెస్టు చేయడంతో ఏ పాపం ఎరుగని 8నెలల చిన్నారి అనాథగా మిగలడాన్ని చూసిన పలువురు చలించిపోయారు. -
వనస్థలిపురంలో దారుణం
-
భార్య, కొడుకుని చంపి ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి..
హస్తినాపురం: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్య, రెండేళ్ల కుమారుడిని హత్యచేసి ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి ఇంట్లో నుంచి వ్యక్తి వెళ్లిపోయాడు. దుర్వాసన రావడంతో ఇంటి యజమాని మంగళవారం రాత్రి వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించాడు. ఈ సంఘటన నాలుగు రోజుల క్రితం జరిగి ఉండవచ్చునని మృతురాలి భర్త హత్యచేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కొత్తపల్లికి చెందిన గౌరవరపు రాజమ్మ, ఉప్పలయ్య దంపతులు తన కూతురు కవిత, కొడుకుతో కలిసి మన్సూరాబాద్‌లో నివాసముంటున్నారు. ఇంటి పక్కన ఒడిషాకు చెందిన ఆయూబ్, కవితను ప్రేమించి నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. గత 18 నెలలుగా సయ్యద్ ఇబ్రహిం ఇంట్లో రెండేళ్లుగా కుమారుడు ఇర్ఫాన్‌తో కలిసి ఆయూబ్, కవిత దంపతులు అద్దెకుంటున్నారు. ఆయూబ్ ఆటోనగర్‌లోని ఇసుక లారీల అడ్డాలో కూలీగా పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య శనివారం గొడవ జరిగింది. అనంతరం భార్య కవిత, కుమారుడు ఇర్ఫాన్‌ను హత్యచేసి వారిద్దరి శవాలను డ్రమ్ములో కుక్కి పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ, వనస్థలిపురం క్రైం సీఐ జగన్నాథం, హయత్‌నగర్ సీఐ సతీష్ ఘటనా స్థలానికి చేరుకొని డ్రమ్ములో ఉన్న రెండు మృతదేహాలను బయటికి తీశారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి మృతదేహాలను తరలించారు. -
ప్రియుడితో ఉన్న భార్య హత్య..
తమిళనాడు, సేలం: ప్రియుడితో కలిసి పడకపై ఉన్న భార్యను దారుణంగా హత్య చేసిన భర్త, ఆమె తలను బైకుపై పెట్టుకుని షికారు చేసిన సంఘటన ఈరోడ్ జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఈరోడ్ జిల్లా పెరుందురై వేప్పంపాళయం ప్రాంతానికి చెందిన మునియప్పన్ (28) గ్యాస్ సిలిండర్ లోడ్ తీసుకెళ్లే పని చేస్తుంటాడు. ఇతని భార్య నివేద డిపార్ట్మెంటల్ దుకాణంలో పని చేస్తుంది. ఈ క్రమంలో మునియప్పన్ సోమవారం రాత్రి ఎప్పటిలానే పనికి వెళ్లాడు. అయితే పని లేకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య నివేద వేరొక వ్యక్తితో పడకపై కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన మునియప్పన్ దిగ్భ్రాంతి చెందాడు. భార్యతో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో భార్యభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత ఆమెను పుట్టింటికి పంపడానికి బైకుపై తీసుకెళ్లాడు. ఎరుకంకాట్టువలసు వద్ద వస్తున్న సమయంలో మళ్లీ వాళ్ల మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆవేశానికి గురైన మునియప్పన్ తన వద్ద ఉన్న కత్తితో భార్య గొంతు కోశాడు. తర్వాత ఆమె తలను బైకు పెట్రోల్ ట్యాంకుపై ఉంచుకుని ఆమె దేహాన్ని బైకులో తన వెనుక కూర్చోపెట్టుకుని రోడ్డుపై షికారుగా వెళ్లాడు. ఒక ఇంటి వద్ద బైకు అదుపు తప్పి తల కింద పడిపోవడంతో స్థానికులు గుర్తించారు. సమాచారం అదుకున్న పెరుందురై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మునియప్పన్ను అరెస్టు చేశారు. నివేద మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం ఈరోడ్ జీహెచ్‌కు తరలించారు. పెరుందురై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
భార్యనే కడతేర్చాడు?
చిత్తూరు, తంబళ్లపల్లె: ఓ వివాహిత హత్యకు గురైన సంఘటన సోమవారం మండలంలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం..మండలంలోని రేణుమాకులపల్లె పంచాయతీ దండువారిపల్లెకు చెందిన విశ్వనాథ్(34)కు పలమనేరు నియోజకవర్గంలోని ధర్మపురికి చెందిన వాణి(30)తో వివాహమైంది. వారికి నాలుగేళ్ల కుమార్తె హేమలత ఉంది. ప్రస్తుతం వాణి ఆరు మాసాల గర్భవతి. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. వీటిమూలాన గొడవపడేవారు. ఈ నేపథ్యంలో దంపతులిద్దరూ ఆదివారం ఆ గ్రామానికి సమీపంలోని పొలాల్లోకి పాడి ఆవులను మేపేందుకు వెళ్లారు. వారు రాత్రి ఇంటికి రాకపోవడంతో బంధువులు, స్థానికులు పలుచోట్ల వెతికారు. సోమవారం ఉదయం ఆ గ్రామ సమీపంలోని కన్నెమడుగోళ్ల పొలాల ప్రాంతంలో వాణి హత్యకు గురై పడి ఉండటాన్ని గ్రామస్తులు గుర్తించారు. వాణి మెడపై కత్తితో నరకడంతో ఆమె మృతి చెందిన ఆనవాళ్లు ఉండటం, మరోవైపు భర్త పరారీలో ఉండడంతో అతనే ఈ దురాగతానికి పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న ములకలచెరువు సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ శివకుమార్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. హత్యకు దారితీసిన కారణాలేమిటో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
పగలు ఇంట్లో ఉంటూ భార్య ఫోన్ పరిశీలిస్తూ..
చాంద్రాయణగుట్ట: అనుమానంతో ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి భార్యను గొంతుకోసి హత్య చేసిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జి.కోటేశ్వర్రావు కథనం ప్రకారం.. బార్కాస్ సలాలా ప్రాంతానికి చెందిన ఫాతిమా బిన్ అలీ సాది(22), ఇదే ప్రాంతానికి చెందిన అహ్మద్ బిన్ సాలం అలియాస్ అహ్మద్ బా సులేమాన్(26)ల వివాహం గతేడాది ఫిబ్రవరిలో జరిగింది. కాగా వెంటనే పిల్లలు వద్దని ఫాతిమా.. తనకు పిల్లలు కావాలని అహ్మద్ వాదించుకునేవారు. ఈ విషయంలో ఇద్దరూ గొడవ పడుతున్నారు. మాదాపూర్, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో పబ్బులో బౌన్సర్‌గా పనిచేసే అహ్మద్.. పగలు ఇంట్లో ఉంటూ భార్య ఫోన్ పరిశీలిస్తూ.. ఎవరితో చాటింగ్ చేస్తున్నావంటూ అనుమానంతో ప్రశ్నించేవాడు. రోజు రోజుకు అనుమానాన్ని తలకెక్కించుకొని వేధించేవాడు. ఇవి భరించలేని ఫాతిమా నాలుగు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. గతనెల ఫిబ్రవరి 4న మొదటి వివాహ వార్షికోత్సవం ఉండడంతో అంతకు రెండు రోజుల ముందు ఫాతిమా పుట్టింటికి వచ్చిన అహ్మద్.. భార్యను బాగా చూసుకుంటానని వెంట తీసుకొచ్చాడు. కాగా ఈనెల 5న రాత్రి అహ్మద్ తల్లి బయటికి వెళ్లగా.. మళ్లీ భార్యాభర్తల మధ్య గొడవ రేగింది. అహ్మద్ కోపంతో ఆమెను కొట్టగా భయపడిన ఫాతిమా బాత్రూంలో దాక్కుంది. అయినా వదలని భర్త ఆమె గొంతుకోసి విచక్షణా రహితంగా పొడిచి చంపేసి పరారయ్యాడు. రాత్రి 11 గంటలకు చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం అందగా వారు మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి పోలీస్ ఉన్నతాధికారులు... గృహిణి దారుణ హత్య విషయం తెలుసుకున్న నగర జాయింట్ సీపీ (ఎస్బీ) తరుణ్ జోషి, ఫలక్‌నుమా, మీర్‌చౌక్ ఏసీపీలు డాక్టర్ ఎంఏ.రషీద్, ఆనంద్, చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ జి.కోటేశ్వర్ రావు, ఎస్సై ఎ.శివతేజ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య జరిగిన తీరును పరిశీలించిన అధికారులు ఘటనా స్థలంలో లభ్యమైన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. -
నోటిలో శనగ మాత్ర వేసి.. చీరతో గొంతు బిగించి..
కర్నూలు, సంజామల: వ్యసనాలకు బానిసైన భర్త కట్నం కోసం కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ ఘటన మండలంలోని ముదిగేడు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సోముల హర్షవర్ధన్‌రెడ్డి అలియాస్ సోముల కుళ్లాయిరెడ్డికి వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలం నలింగాయపల్లి గ్రామానికి చెందిన సుబ్బిరెడ్డి కుమార్తె సువర్ణతో 2014 జూన్ నెల 22వ తేదీన వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.9 లక్షలు కట్నకానుకలు ఇచ్చారు. వీరికి కూతురు హర్షిత(4), కుమారుడు అన్విత్‌రెడ్డి(2)ఉన్నారు. అయితే పెళ్ళయిన ఏడాది నుంచే అదనపు కట్నం కోసం భార్యను వేధించ సాగాడు. తనకు రూ.30 లక్షలు కట్నం ఇచ్చేవారని తరచూ వేధించేవాడు. ఈ విషయాన్ని సువర్ణ తల్లిదండ్రులకు చెప్పగా ఒకసారి రూ.6 లక్షలు, మరోసారి రూ. 3 లక్షలు అదనపు కట్నం ఇచ్చారు. అయినా సంతృప్తి చెందని హర్షవర్ధన్ రెడ్డి మళ్లీ అదనపు కట్నం కావాలని భార్యను వేధించసాగాడు. సంక్రాంతి పండుగకు ఇస్తామని అత్తమామలు సర్దిచెప్పారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. ఉదయం కూడా టిఫిన్ సరిగా చేయలేదని గొడవపెట్టుకున్నాడు. అయితే ముందే చంపాలని నిశ్చయించుకున్న భర్త భార్యను గట్టిగా అదిమిపట్టుకొని శనగల మాత్ర నోట్లో వేశాడు. బలవంతంగా శనగమాత్ర మింగించి నీరు తాగించాడు. అనంతరం చీరను గొంతుకు బిగించి చంపే ప్రయత్నం చేశాడు. భార్యను చంపేందుకు ఒడిగట్టిన భర్త ఆమె చావు బతుకుల్లో కొట్టుమిట్టాడడం చూసి దొంగలు బంగారం కోసం తన భార్యను చంపే ప్రయత్నం చేశారని నమ్మించే ప్రయత్నం చేశాడు. కోవెలకుంట్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సకు వెళ్ళగా పరిస్థితి విషమించిందని చెప్పడంతో అక్కడ నుంచి నంద్యాలకు తరలించే ప్రయత్నంలో మార్గమధ్యలో సువర్ణ మృతి చెందింది. విషయం తెలుసుకున్న కోవెలకుంట్ల సీఐ శ్రీనివాసరెడ్డి ముదిగేడు గ్రామానికి చేరుకొని విచారించాడు. భర్త తీరు పట్ల అనుమానం రావడంతో తనదైన శైలిలో విచారణ చేయడంతో భార్యను చంపేందుకు నోటిలో శనగమాత్రను మింగించి గొంతుకు చీరతో బిగించానని ఒప్పుకున్నాడు. మృతురాలి తండ్రి సుబ్బిరెడ్డి ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ అబ్దుల్ ఘనీ తెలిపారు. -
భార్యను హత్య చేసి.. ఆత్మహత్యాయత్నం
చైతన్యపురి: భార్యాభర్తల మధ్య ఘర్షణ హత్యకు దారితీసింది. గొంతుపిసికి భార్యను హత్య చేసిన ఓ వ్యక్తి యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా సైదాపూర్‌కు చెందిన గోపాల్‌చారి పెయింటర్ పనిచేసేవాడు. బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చిన అతను భార్య కవితతో కలిసి పీఅండ్‌టీ కాలనీ ప్రగతినగర్‌లో ఉంటున్నాడు. బుధవారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికిలోనైన కవిత ‘నన్ను వదిలేయ్, నేను నీతో ఉండను’ అని చెప్పడంతో ఆగ్రహానికిలోనైన గోపాల్‌చారి ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం యాసిడ్ తాగి రోడ్డుపైకి వచ్చి కేకలు వేశాడు. తన భార్యను హత్య చేసి యాసిడ్ తాగినట్లు చెప్పడంతో ఇంటి ఓనర్ బాలరాజు అక్కడికి వెళ్లి చూడగా కవిత అపస్మారకస్థితిలో పడి ఉంది. దీంతో ఇద్దరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా కవిత అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. గోపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే కవిత, గోపాల్ ఇద్దరికీ గతంలోనే రెండు పెళ్లిల్లు అయినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
భార్యను చంపిన భర్త
కర్నూలు,డోన్ రూరల్: కట్టుకున్న భార్యను రోకలి బండతో తల మీద మోది హత్యచేసిన భర్త ఉదంతం బుధవారం పట్టణంలోని కొత్తపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన మధు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సునీతను 15ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా డోన్ పట్టణంలోని కొత్తపేటలో నివాసముంటున్నారు. మధు హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తూ వారానికోసారి వచ్చి పోయేవాడు. అయితే ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చిన మధు బుధవారం తెల్లవారుజామున మంచంపై నిద్రిస్తున్న భార్యను రోకలిబండతో మోదాడు. మృతిచెందిందని భావించి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విషయం పోలీసులకు చెప్పాడు. వారు హుటాహుటిన వచ్చి చూడగా రక్తపు మడుగులో కొనఊపిరితో ఉన్నట్లు గమనించి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డీఎస్పీ ఖాదర్‌బాషా, సీఐ.కళావెంకరమణ, ఎస్ఐ.సునీల్‌కుమార్ ఆస్పత్రికి చేరుకుని మహిళ పరిస్థితిని గమనించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు కర్నూలు పెద్దాస్పత్రికి తరలించగా అక్కడ కోలుకోలేక మృతిచెందింది. మధును అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లి మృతిచెందడం, తండ్రి పోలీసులు తీసుకెళ్లడంతో ఇద్దరు కుమారులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. -
‘గత్యంతరం లేకే నా భార్యను చంపేశా’
సాక్షి, హైదరాబాద్: భార్యపై అనుమానంతో దుబాయ్ నుంచి వచ్చి మరీ హత్య చేశాడో భర్త. సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం.. గద్వాల్‌కు చెందిన రహీం ఉపాధి కోసం దుబాయ్‌కి వలస వెళ్లాడు. అయితే తన మొదటి భార్య బేగం ఇతరులతో ఫోన్లో మాట్లాడుతోందని, ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని రహీం అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య ఫోన్లో తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రహీం.. మంగళవారం సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జ్‌లో దిగాడు. అనంతరం భార్యకు ఫోన్ చేసి గద్వాల్ నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు రమ్మన్నాడు. ఆమెను లాడ్జ్‌కు తీసుకెళ్లి ఈ విషయమై చర్చించారు. ఇద్దరి మధ్య దీనిపై పెద్ద గొడవే జరిగిందని సమాచారం. కోపోద్రిక్తుడైన రహీం అతి కిరాతకంగా ఆమెను హత్య చేశాడు. అనంతరం గత్యంతరం లేకే తన భార్యను చంపినట్టు 100కు ఫోన్ చేసి పోలీసులకు చెప్పాడు. పోలీసులు లాడ్జ్‌కు వచ్చేంతవరకు వేచివున్న అతడు వాళ్లు వచ్చిన వెంటనే పరారయ్యాడు. మృతురాలి వివరాలు సేకరించిన పోలీసులు ఆమె బంధువులకు సమాచారమిచ్చారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
నెల్లూరులో కిరాతకం..
నెల్లూరు(క్రైమ్): ఓ వ్యక్తి భార్యను హత్యచేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడు. ఈ ఘటన నెల్లూరులోని ప్రశాంతి నగర్లో చోటుచేసుకుంది. నవాబుపేట ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళంకు చెందిన గౌరీశ్వరి, తౌడు దంపతులు. వారికి ఇద్దరు కుమారులు, సంధ్య (20) కుమార్తె. అందరూ 18 సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం నెల్లూరుకు వచ్చారు. సౌత్‌రాజుపాళెంలోని ఓ రైస్‌మిల్లులో పనిచేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నారు. అదే మిల్లులో కోడూరుపాడుకు చెందిన మహేష్ మెషిన్ ఆపరేటర్‌గా చేరాడు. అతనికి సంధ్యతో పరిచయమైంది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి 2016 డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. ప్రశాంతి నగర్లో కాపురం ఉంటున్నారు. వారికి పదినెలల కొడుకు ఉన్నాడు. కొంతకాలం కాపురం సజావుగా సాగింది. అనంతరం మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. మహేష్ వివాహానికి ముందు ఓ మహిళతో సన్నిహితంగా ఉండేవాడని తెలుసుకున్న సంధ్య అతడిని నిలదీసింది. దీంతో వారి మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకున్నాయి. తీవ్ర ఘర్షణ కొద్దిరోజులుగా దంపతులిద్దరూ ఘర్షణ పడుతుండటంతో ఇరువురి పెద్దలు వారికి సర్దిచెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి దంపతుల నడుమ తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన మహేష్ ఆమెపై దాడిచేయడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో ఖంగుతిన్న అతను సంధ్యది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఫ్యాన్‌కు తాడుతో ఉరివేసుకున్నట్లు చేసి చుట్టుపక్కల వారిని పిలిచాడు. వారి సమక్షంలో భార్యను చికిత్స నిమిత్తం నారాయణ హాస్పిటల్‌కు తరలించాడు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నవాబుపేట ఇన్స్పెక్టర్ సోమవారం మృతదేహాన్ని పరిశీలించారు. తన సోదరిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి అన్న అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైద్యులు సైతం ఆమెది ఆత్మహత్య కాదని పేర్కొనడంతో హత్య కేసుగా నమోదు చేశామని ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు వెల్లడించారు. తహసీల్దార్ మృతదేహానికి శవపంచనామా నిర్వహించారు. మంగళవారం మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు శవపరీక్ష నిర్వహిస్తారని పోలీసులు వెల్లడించారు. -
తనకంటే అందంగా ఉందని భార్యను..
బంజారాహిల్స్: అనుమానంతో ఓ వ్యక్తి భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా, చిట్యాలకు చెందిన నాగరాజు, జవలమ్మ(27) దంపతులు బతుకుదెరువు నిమిత్తం పదేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి బంజారాహిల్స్ రోడ్ నెంబర్–5లోని దేవరకొండ బస్తీలో ఉంటున్నారు. వీరికి కార్తీక్, రిషి(8) అనే ఇద్దరు కుమారులు. నాగరాజు, జవలమ్మ వెంగళరావు పార్కు రోడ్డులో తోపుడుబండ్లపై వేర్వేరుగా కొబ్బరి బోండాలు విక్రయించేవారు. గత రెండేళ్లుగా నాగరాజు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తనకంటే అందంగా ఉందని, తాను ఆమెకు సరిపోనని తరచూ జవలమ్మతో గొడవ పడేవాడు. గురువారం మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికి చ్చిన నాగరాజు భార్యతో గొడవపెట్టుకున్నాడు. ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూ చితకబాదడంతో తీవ్రంగా గాయపడిన జవలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. దీనిని గమనించిన నాగరాజు బంధువులకు ఫోన్ చేసి తన భార్యను చంపానని, పారిపోతున్నట్లు తెలిపాడు. గురువారం రాత్రి అక్కడికి వచ్చిన ఆమె కుటుంబసభ్యులు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం బంజారాహిల్స్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తాగొద్దన్నదని..
మారేడుపల్లి : తాగుడు మానుకోవాలని కోరినందుకు ఆగ్రహానికి లోనైన ఓ వ్యక్తి భార్యను హత్య చేసిన సంఘటన మారేడుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహంకాళి ఏసీపీ వినోద్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మారేడుపల్లి వాల్మీకినగర్‌కు చెందిన సన్ని విట్లాన్, అదే ప్రాంతానికి చెందిన సత్యవతి (27) 2013లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.సత్యవతి అదే ప్రాంతంలో ఇళ్లల్లో పాచిపని చేస్తుండగా సన్ని విట్లాన్ దుకాణాల్లో పనిచేసేవాడు. సన్ని విట్లాన్ గత కొంతకాలంగా తాగుడుకు బానిసకావడంతో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సన్ని డబ్బుల కోసం భార్యను వేధించేవాడు. సోమవారం రాత్రి అతిగా మద్యంసేవించి వచ్చిన అతను భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం సత్యవతి నిద్రిస్తుండగా గొంతు నులిమి హత్యచేసి, ఇంటిబయట తాళం వేసి పరారయ్యాడు. మరుసటిరోజు (మంగళవారం) రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వచ్చిన అతను తన తండ్రి సురేందర్‌కు తన భార్యను హత్యచేసినట్లు చెప్పి పరారయ్యాడు. దీంతో సురేందర్ మృతురాలి తల్లితండ్రులు, మారేడుపల్లి పోలీసులకు సమాచారం అందించాడు. మృతురాలి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానమే పెనుభూతం
చెన్నై , అన్నానగర్: తారా పురం సమీపంలో ఆదివారం రాత్రి భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరుప్పూర్ జిల్లా తారాపురం సమీపం గుండడం మరవపాలైయానికి చెందిన సెంథిల్‌కుమార్ (40) కూలీ. ఇతని భార్య తులసిమణి (35). వీరికి పూంగొడి (19) అనే కుమార్తె, గోకుల్ (14) అనే కుమారుడు ఉన్నారు. సెంథిల్‌కుమార్, తులసిమణి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. ఈ స్థితిలో ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య తగాదా ఏర్పడింది. దీంతో ఆగ్రహంచిన సెంథిల్‌కుమార్ కత్తితో తులసిమణి గొంతు కోసి హత్య చేశాడు. దీనిపై సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి వచ్చిన గుండడం పోలీసులు తులసీమణి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి అజ్ఞాతంలో ఉన్న సెంథిల్‌కుమార్ కోసం గాలిస్తున్నారు. -
భార్యను హతమార్చి.. కోడలిపై కత్తితో దాడికి యత్నం
విజయనగరం టౌన్: అనుమానం ఆమె పాలిట శాపంగా మారింది. కట్టుకున్నవాడే కాలయముడై కడతేర్చాడు. ఎవరో చెప్పిన మాటలు విని ఆదివారం నుంచి భార్యతో తగాదా పడుతూనే వస్తున్నాడు. సోమవారం ఉదయం కూడా భార్యతో గొడవ పెట్టుకున్నాడు. మాటామాటా పెరగడంతో పక్కనే ఉన్న కత్తితో దాడి చేసి హతమర్చాడు. మృతురాలి కుటుంబ సభ్యులు, డీఎస్పీ డి. సూర్యశ్రవణ్‌కుమార్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని కణపాక అగురువీధిలో నివాసముంటున్న శీల మారమ్మ (50) సోమవారం ఉదయం హత్యకు గురైంది. అనుమానంతో రగిలిపోతున్న భర్త సన్యాసిరావు ఆమెను అతి కిరాతంగా కత్తితో చేయి నరికి అనంతరం కడుపులో ఐదుకి పైగా పోట్లు పొడిచి చంపేశాడు. అడ్డుకోవడానికి వెళ్లిన కోడలను చంపేద్దామని కత్తితో పైకి లేవగా, ఆమె తప్పించుకుని పరుగులు తీసింది. ఎటువంటి చెడు అలవాట్లు లేని సన్యాసిరావుకు భార్య ప్రవర్తన బాగోలేదని చెప్పడంతో అది మనసులో పెట్టుకున్నాడు. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య తగాదా జరిగింది. సోమవారం వేకువజామును మరలా గొడవ పెట్టుకున్నాడు. అనంతరం ఎవరి పనుల్లో నిమగ్నమవ్వగా మారమ్మ తన భర్తకు టిఫిన్ తీసుకువచ్చింది. ఈక్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో అందుబాటులో ఉన్న పొడవాటి కత్తితో కర్కశంగా చేతిని నరికేశాడు. రక్తం మడుగులో కొట్టుకుంటున్న ఆమెపై మరలా కత్తితో దాడి హత్య చేశాడు. ఈ సంఘటన చూసిన కోడలు గట్టిగా కేకలు వేయడంతో ఆమెపై కూడా దాడికి ప్రయత్నించగా.. భయంతో బయటకు పరుగులు తీసింది. విషయాన్ని స్థానికుల సహాయంతో పోలీసులకు చేరవేసింది. వెంటనే డీఎస్పీ డి. సూర్యశ్రవణ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు శ్రీనివాసరావు, వెంకటరావు, కుమార్తె సత్యవతిలు ఉన్నారు. వీరు ముగ్గురికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఉలిక్కిపడిన కణపాక ప్రశాంతంగా ఉండే కణపాకలో ఒక్కసారిగా హత్య జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. కట్టుకున్న భర్తే భార్యను హత్య చేయడంతో ప్రజలు భయాందోళన చెందారు. మృతురాలి కుమార్తె, కొడుకులు, మనుమల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. దర్యాప్తు చేస్తున్నాం అనుమానంతో హత్యచేసినట్లు ప్రాథమిక నిర్ధారణలో వెల్లడైంది. విచారణ చేపట్టాం. ఆధారాలు సేకరించాం. నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం.– డి.సూర్యశ్రవణ్ కుమార్, పట్టణ డీఎస్పీ, విజయనగరం -
అనుమానంతో ఉసురు తీశాడు
ప్రకాశం , మార్కాపురం: అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. తాళికట్టిన భార్యను కిరాతకంగా గొడ్డలితో నరకటంతో అక్కడికక్కడే చనిపోయింది. సంక్రాంతి పండుగ రోజున ఆ కుటుంబంలో తీరని విషాదం మిగిలింది. పోలీసుల కథనం మేరకు.. మార్కాపురంలోని కంభం రోడ్డులో శ్రీనివాస థియేటర్ పక్కన వీధిలో నివాసం ఉంటున్న ఎన్.శరభయ్య తన భార్య పార్వతి (30)ని బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లో గొడ్డలితో నరికి పరారయ్యాడు. ఈ సంఘటనలో పార్వతి అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు జ్ఞానేశ్వర్ (10), వైశాలి(8) ఉన్నారు. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీధర్‌రెడ్డి, పెద్దారవీడు ఎస్సై ముక్కంటి పరిశీలించి మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పార్వతి పిల్లలు, పార్వతి మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ శ్రీధర్‌రెడ్డి వివరాలు పట్టణంలో నివాసం ఉండే బలభద్రుని రంగయ్య, లక్ష్మీదేవిల మూడో కుమార్తె పార్వతిని కంభం రోడ్డులో నివాసం ఉండే శరభయ్యకు ఇచ్చి పదేళ్ల కింద ట వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. పార్వతి ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుండగా, శరభయ్య ముఠా కూలీగా ఉన్నాడు. ఇటీవల కాలంలో భార్యపై అనుమానం పెంచుకుని తరచుగా వేధించసాగాడు. మద్యానికి అలవాటు పడి భార్యను కొట్టేవాడు. విషయం పార్వతి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు వచ్చి కూతురు, అల్లుడితో మాట్లాడి కలిసి ఉండాలని సర్ది చెప్పారు. బుధవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన శరభయ్య గొడ్డలితో పార్వతి తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన స్థలం నుంచి శరభయ్య పరారయ్యాడు. విలపించిన తల్లిదండ్రులు: సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు లక్ష్మీదేవి, రంగయ్యలు కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. పార్వతిని గొడ్డలితో కొట్టడంతో రక్తం ధారలా ప్రవహించింది. పార్వతి పిల్లలు ఇద్దరూ తల్లి మృతదేహాన్ని చూసి రోదించారు. తల్లిని పట్టుకుని లేమ్మా అంటూ పిలవటం అక్కడ ఉన్న వారి కంట కన్నీరు తెప్పించింది. వృద్ధాప్యంలో తమకు కడుపు కోత మిగిల్చి పోయిందని పార్వతి తల్లిదండ్రులు విలపించారు. మృతదేహాన్ని చూసేందుకు ఆ ప్రాంత ప్రజలు తరలివచ్చారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ ఆ ప్రాంత పిల్లలకు ట్యూషన్ చెబుతూ ఉండే పార్వతి చని పోవడం చూసి మహిళలు ఆవేదనకు గురయ్యారు. -
కట్టుకున్నోడే కడతేర్చాడు
చిత్తూరు, పిచ్చాటూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన బుధవారం మధ్యాహ్నం మండలంలోని వెంగళత్తూరు దళితవాడలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. నగరి మండలం నెత్తం గ్రామానికి చెందిన శరవణ(30) చిత్తూరుకు చెందిన సత్య (20)ను మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగకని మూడు రోజుల క్రితం శరవణ తన అక్క సుమతి గ్రామమైన వెంగళత్తూరు దళితవాడకు తన భార్యతో కలిసి వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం సుమారు 3 సమయంలో సుమతి ఇంట్లో హఠాత్తుగా కేకలు వినిపించాయి. చుట్టు పక్కలవారు వెళ్లి చూడగా సత్య కత్తిపోట్లకు గురై, రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటం చూసి దిగ్భ్రాంతి చెందారు. క్షణాల వ్యవధిలోనే ఆమె ప్రాణాలు విడిచింది. హతురాలి భర్త, అతని అక్క, బావ కలిసి రక్తపు మరకలను శుభ్రంగా కడిగేశారు. ఇంట్లోని నులక మంచంపై సత్య మృతదేహాన్ని పడుకోబెట్టిన స్థితిలో ఉంచి సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో పుత్తూరు డీఎస్పీ సౌమ్యలత, నగరి సీఐ మల్లిఖార్జున్, ఎస్ఐ రామాంజనేయులుతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హతురాలి భర్త, అతని బంధువులను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ చేశారు. అయితే శరవణ పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. హత్యకు దారితీసిన కారణాలేమిటో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. సత్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పెనుభూతమైన అనుమానం..!
సాక్షి, హైదరాబాద్: అనుమానం పెనుభూతమైది. భార్యపై అనుమానంతో ఓ భర్త మద్యం తాగివచ్చి ఆమెను గొంతు నులిమి హతమార్చి పరారయ్యాడు. ఈ సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్‌సింగ్‌నగర్‌లో జరిగింది. ఆటో డ్రైవర్ రాము అదేకాలనీకి చెందిన శ్వేత అలియాస్ సోని (25)ని తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 8, 6 సంవత్సరాల ఇద్దరు కూతుర్లు, మూడు సంత్సరాల ఒక కుమారుడు ఉన్నారు. ఆటో నడపగా వచ్చిన డబ్బుతో రాములు నిత్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడి కొట్టేవాడు. అంతేకాకుండా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన రాము భార్యతో గొడవపడి గొంతు నులిమి చంపి పరారయ్యాడు. మంగళవారం ఉదయం పక్క ఇంట్లో ఉండే తోటికోడలు నర్సమ్మ వచ్చి శ్వేతను పిలిచింది.. ఆమెలో ఎటువంటి కదలిక లేకపోవడంతో అత్త, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. వారంతా వచ్చి చూడగా అప్పటికే శ్వేత మృతిచెంది ఉంది. మెడపై గాట్లు ఉండటంతో భర్త రాము ఆమెను హతమార్చి పరారై ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు శ్వేత తండ్రి ఫిర్యాదు మేకు కేసు నమోదు చేశారు. నా కొడుకుని ఉరి తీయండి.. కోడల్ని గొంతు నులిమి చంపిన తన కొడుకు రామును ఉరి తియ్యాలని తల్లి డిమాండ్ చేసింది. నా కోడలు బంగారమని, పెళ్లైన దగ్గర నుంచి నిత్యం కొడుతూ చిత్ర హింసలు పెట్టేవాడని వాపోయింది. తల్లి హత్యకు గురి కావటం, తండ్రి పరారు కావటంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఏం జరిగిందో తెలియక అమాయంకంగా కూర్చున పిల్లలను చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. -
భార్యను చంపిన భర్త
కర్నూలు, ఆళ్లగడ్డ రూరల్: అళ్లగడ్డ మండలంలోని అహోబిలం సమీపంలో తెలుగుగంగ కాలువ వద్ద భర్త.. భార్యను చంపిన ఘటన సోమ వారం చోటుచేసుకుంది. రుద్రవరం మండలం డి.కొట్టాల గ్రామానికి చెందిన నరేష్ కుమార్‌రెడ్డి.. భార్య దమయంతిని(30) అహోబిలం వెళ్లే దారిలో తెలుగుగంగ కాలువ వద్ద అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి హతమార్చాడు. అనతంరం పోలీసులకు లొంగిపోయాడు. వెంటనే డీఎస్పీ కులశేఖర్, ఎస్ఐ సుధాకర్‌రెడ్డి ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహన్ని పరిశీలించారు. నరేష్‌కుమార్‌రెడ్డి, దమయంతి ఏడాది క్రితం విడాకులకు దరఖ>స్తు చేసుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ సోమవారం అతనితో ద్విచక్రవాహనంపై వెళ్లి హత్యకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతురాలికి కుమారుడు, కూతురు ఉన్నారు. -
వివాహ కానుకే శాపమైంది
తమిళనాడు, టీ.నగర్: ప్రభుత్వం వివాహ కానుకగా అందజేసిన ఒక సవరం బంగారు నాణెం కోసం గర్భిణిగా ఉన్న భార్యను హత్య చేసి కేసు నుంచి తప్పిచుకునేందుకు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా నమ్మించడానికి ప్రయత్నించిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. సేలం జిల్లా, జలకంఠాపురం సమీపానగల కరిక్కాపట్టి గ్రామం, ఆండికాడు ప్రాంతానికి చెందిన చంద్రన్ కుమార్తె భువనేశ్వరి (21). ఈమెకు అదే ప్రాంతానికి చెందిన రాజవేల్ (22)తో ఏడాది కిందట వివాహం జరిగింది. ప్రస్తుతం భువనేశ్వరి మూడు నెలల గర్భవతి. ఈ నెల 19న భువనేశ్వరికి ప్రభుత్వం తరఫున వివాహ ఆర్థికసాయం కింద ఇచ్చిన ఒక సవరం బంగారు నాణెన్ని తన తల్లి సంధ్య వద్ద ఉంచింది. ఈ క్రమంలో 20వ తేదీన భువనేశ్వరి తండ్రి చంద్రన్ కొత్తగా బైక్ కొన్నాడు. అతడు బంగారు నాణెన్ని విక్రయించి బైక్ కొన్నట్లుగా భర్త రాజవేల్ అనుమానించి భువనేశ్వరిని బంగారు నాణెం ఇవ్వమని కోరాడు. దీంతో వారి మధ్య తగాదా ఏర్పడింది. ఆగ్రహించిన రాజవేలు భువనేశ్వరిని కిందికి తోసేయడంతో ఆమె తలకు తీవ్రగాయమైంది. తర్వాత దిండుతో ఆమె ముఖాన్ని అదిమిపట్టి, తాడుతో గొంతు నులిమి హత్య చేశాడు. ఈ విషయం దాచేందుకు ఇరుగుపొరుగు, బంధువుల వద్ద్ద భువనేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకమాడిన రాజవేలు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. దీన్ని అనుమానించిన భువనేశ్వరి తల్లి సంధ్య జలకంఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు భువనేశ్వరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ జరిపారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె హత్యకు గురైనట్లు తెలియడంతో పోలీసులు రాజవేలును అరెస్టు చేసి జైలులో నిర్బంధించారు. -
ప్రాణాలు తీసిన అనుమానం
వేర్వేరు చోట్ల ఇద్దరు వివాహితలు దారుణ హత్యకు గురయ్యారు. రెండు చోట్లా కర్రలతో బాది అంతమొందించారు. రెండింటి హత్యల వెనుక ఒకటే కారణం కనిపిస్తోంది. వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారనే అనుమానంతోనే వారిని కడతేర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. రెండు ఘటనలతో చుట్టుపక్క ప్రాంతాల వారు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతపురం, కళ్యాణదుర్గం: బోరంపల్లిలో ఘోరం జరిగింది. వివాహిత దారుణ హత్యకు గురైంది. భర్తే ఆమెను హత్య చేసి ఉంటారని పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బెళుగుప్ప మండలం అంకంపల్లికి చెందిన రామాంజినమ్మ కుమార్తె విమలకు కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన వెంకటేశులుతో 2009లో వివాహం చేశారు. వీరికి కుమారుడు పూర్ణ, కుమార్తె రీనా ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 1.00 గంట సమయంలో విమల సోదరుడు నరసింహులుకు వెంకటేశులు ఫోన్ చేసి ‘మీ అక్క పురుగుల మందు తాగింది రండి’ అంటూ సమాచారం ఇచ్చాడు. ఈ సమయంలో విమల జోక్యం చేసుకుని అదేమీ లేదంటూ ఫోన్లో సమాధానం ఇచ్చింది. తిరిగి 1.50గంటలకు విమల సోదరుడు నరసింహులు తల్లి రామాంజినమ్మ వద్దకు వెళ్లి ఫోన్లో మాట్లాడించే ప్రయత్నం చేశాడు. ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఆటోలో పుట్టింటికి రమ్మని చెప్పాడు. అదేమీ లేదని విమల స్పష్టం చేసింది. తిరిగి మధ్యాహ్నం 2.24 గంటలకు మరోసారి వెంకటేశులు ఫోన్‌చేసి విమల మందు తాగిందని, తాను నిజమే చెబుతున్నానని పుట్టింటి వారికి చెప్పాడు. అనుమానంతో వారు హుటాహుటిన బోరంపల్లికి బయలుదేరి వచ్చారు. అప్పటికే విమల రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. రోకలి బండతో మోది హతమార్చినట్లు గుర్తించి బోరున విలపిస్తూ బయటకు వచ్చారు. ఘటన అనంతరం భర్త వెంకటేశులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. హత్య సంఘటనపై కుటుంబ సభ్యులు గ్రామంలోని రహదారిపై కొద్ది సేపు ఆందోళన చేపట్టారు. రూరల్ ఎస్ఐ నబీరసూల్ సర్దిచెప్పి వారిని శాంతింపచేశారు. ఇదిలా ఉండగా భార్య విమల ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్తే హతమార్చి ఉంటారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మృతురాలి సోదరుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. శింగవరంలో మరొకరు.. యల్లనూరు: శింగవరంలో కమ్మర భారతి (36) మంగళవారం అర్ధరాత్రి దారుణహత్యకు గురైంది. వివరాల్లోకి వెళ్లితే... రెండవ భార్య అయిన భారతి వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో భర్త ఆశ్వర్థ ఆచారి, ఆయన మొదటి భార్య కుమారులు ప్రకాశం ఆచారి, మనోహర ఆచారిలు పథకం ప్రకారం నిద్రిస్తున్న సమయంలో ఆమె తలపై కర్రలతో మోది హత్య చేశారు. రక్తపు మరకలను తుడిచేసిన బట్టను కాల్చివేసేశారు. హతురాలి అక్క లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు భారతి భర్త, ఆయన మొదటి భార్య కుమారులు ఇద్దరిపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హారున్‌బాషా తెలిపారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
కట్టుకున్నోడే కడతేర్చాడు..
అనుమానం పెను భూతమైంది. భర్త క్షణికావేశం కట్టుకున్న భార్యను హతమార్చింది. తల్లి చనిపోయింది.. తండ్రి కటకటాల పాలయ్యాడు. ఇక మిగిలింది అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు.. సంఘటన ఎందుకు జరిగిందో.. ఎలా జరిగిందో వారికి తెలియదు.. కంటి నిండా కారుతున్న నీటితో బోరున విలపిస్తున్న ఆ చిన్నారులను చూసిన ప్రతి గుండె కన్నీరు కార్చింది. తల్లి లేక, తాను ఉండలేని పరిస్థితుల్లో కన్న బిడ్డల భవిష్యత్తు ఏంటన్న ఆలోచన రాకపోవడం బాధాకరం. ఈ సంఘటన చిన్నమండెం మండలం చాకిబండ కుమ్మర పల్లెలో శుక్రవారం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ జిల్లా, రాయచోటి(చిన్నమండెం) : చాకిబండ కుమరపల్లెకు చెందిన వల్లెపు ఆంజనేయులు(32) భార్య గంగాదేవి(29)ని శుక్రవారం మధ్యాహ్నం కొడవలితో నరికి చంపాడు. కూతురిని చంపేస్తున్నాడంటూ అడ్డు వెళ్లిన అత్త మల్లమ్మ(48)ను సైతం అదే కొడవలితో తలపై నరకడంతో తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ భార్య గంగాదేవి ఇంటిలోనే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మల్లమ్మను చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. ఆంజనేయులు, గంగాదేవిలకు తేజశ్రీ(7), శ్రీనాథ్(4) చిన్నారులు ఉన్నారు. వెంటాడిన అనుమానం ఆంజనేయులు గత పదేళ్లుగా గల్ఫ్‌లో ఉంటూ రెండేళ్లకు ఒక మారు ఇంటికి వస్తుండేవాడు. రెండు నెలల కిందటనే స్వగ్రామానికి వచ్చిన ఆంజినేయులుకు భార్య నడవడికపై అనుమానాలు మొదలయ్యాయి. మరో వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉందన్న అనుమానం వెంటాడింది. దీంతో కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవని స్థానికుల సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం ఇరువురి మధ్య మాటమాట పెరిగి కొడవలితో నరికే వరకు దారి తీసినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఇంటివద్దనే ఉన్న గంగాదేవి తల్లి మల్లమ్మ బిడ్డను చంపొద్దని అడ్డుకున్నా ఫలితం లేకపోయింది. కన్న బిడ్డ కళ్లముందు చనిపోవడంతో పాటు తన ప్రాణం మీదకు తెచ్చుకుని కొన ఊపిరితో ఆసుపత్రికి చేరింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ పులివెందుల డీఎస్పీ నాగరాజ, రాయచోటి రూరల్ సీఐ నరసింహరాజులు శుక్రవారం సాయంత్రం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు దారి తీసిన పరిస్థితులపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సంఘటన విషయం తెలిసిన వెంటనే చిన్నమండెం ఎస్ఐ రెడ్డి సురేష్ కుమ్మరపల్లెకు చేరుకుని గాయాల పాలై కొన ఊపిరితో ఉన్న మల్లమ్మను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. భార్యను నరికి చంపిన భర్త వల్లపు ఆంజినేయులును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీఎస్పీ విలేకరులకు తెలిపారు. అనాథలుగా మారిన పిల్లలు భార్యను భర్తే హతమార్చడంతో అల్లారు ముద్దుగా పెరుగుతున్న ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. 7 సంవత్సరాలు వయసున్న తేజశ్రీ, నాలుగు సంవత్సరాలున్న శ్రీనాథ్‌లు అమ్మా నాన్న గొడవతో ఏడవడం తప్పా ఏమి చేయలేకపోయారంటూ స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తోడుగా ఉండాల్సిన తండ్రి కటకటాలలోకి వెళ్లగా, అండగా ఉండాల్సిన అమ్మమ్మ సైతం కొన ఊపిరితో ఆసుపత్రికి చేరడంతో ఆ చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. -
అనుమానం పెనుభూతమై..
విజయవాడ / ఉయ్యూరు : వివాహిత అనుమానాస్పద మృతిలో కొత్తకోణం వెలుగు చూసింది. అనుమానం పెనుభూతంగా మారి తాళి కట్టిన భర్తే ఉరి తాడు బిగించి కాలయముడయ్యాడు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి తప్పుకునేందుకు చూడగా చివరకు పోలీసులు జరిపిన విచారణలో వాస్తవాలు వెలుగు చూడటంతో కటకటాలపాలయ్యాడు. ఉయ్యూరు సీఐ కాశీవిశ్వనాథం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఏజీకే నగర్లో ఆరేపల్లి రామలక్ష్మి (35) ఈ నెల 11న మృతి చెందింది. రేకుల షెడ్డులో ఉరి వేసుకుని వేలాడుతూ ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త శివనాగమల్లేశ్వరరావు తన భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు. లోపల గడియపెట్టి ఉండటంతో తొలుత అందరూ ఆత్మహత్యగానే భావించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఆత్మహత్య కాదు హత్యే అంటూ చెప్పడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. పెళ్లయిన ఏడాది నుంచే.. రామలక్ష్మితో 11 ఏళ్ల క్రితం శివనాగమల్లేశ్వరరావుకు వివాహమైంది. ఇరువురూ ఉయ్యూరుకు చెందిన వారే. పెళ్లి అయిన ఏడాది దాటినప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధించి చిత్రహింసలు పెడుతున్నాడు. భర్త వేధింపులు తాళలేక 2013లో పోలీస్ స్టేషన్లో రామలక్ష్మి కేసు పెట్టడం, పెద్దలు నచ్చచెప్పి లోక్ అదాలత్‌లో రాజీ చేయడం జరిగాయి. తన ఇద్దరు పిల్లల కోసం రామలక్ష్మి బాధలు పడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. భార్య ఎవరితో మాట్లాడినా అనుమానిస్తూ రామలక్ష్మిని వేధించేవాడు. ఈ క్రమంలోనే తరచూ భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తుతోంది. 15 రోజుల క్రితం అఘాయిత్యం.. కాగా, భర్త వేధింపులు తాళలేక 15 రోజుల క్రితం రామలక్ష్మి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాపాయం నుంచి బయటపడేసి నచ్చజెప్పి కాపురానికి పంపారు. ఈ నెల 11వ తేదీన ఇంటికి వచ్చిన రామలక్ష్మితో మళ్లీ గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆమెను మంచంపై నుంచి పడేసి చేతులు రెండూ కరెంటు వైర్లతో కట్టేసి దిండుతో మొహంపై నొక్కి ఊపిరాడకుండా చేసి ఆపై మెడను వైరుతో బిగించి చంపేశాడు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మెడకు చీరను కట్టి రేకుల షెడ్డుకు వేలాడతీసి లోపలి పక్కన గడియపెట్టి తలుపు గుమ్మానికి, తడికకు మధ్య ఉన్న ఖాళీని ఆసరాగా చేసుకుని బయటకు వచ్చి సైకిల్‌పై ఏమీ తెలియనట్లు ఉడాయించాడు. పాఠశాల నుంచి ఇంటికి మధ్యాహ్న సమయంలో భోజనానికి వచ్చిన కుమార్తె తడికలో ఉన్న రంధ్రంలో నుంచి చూసి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా వేలాడుతూ కనిపించింది. పోలీసుల కేసు విచారణలో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. అనుమానాస్పద మృతిని హత్య కేసుగా మార్పు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఎస్ఐ సత్యశ్రీనివాస్ తెలిపారు. -
భార్యను హతమార్చిన భర్త
ప్రకాశం, సతుకుపాడు (సింగరాయకొండ): కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను ఓ భర్త హతమార్చాడు. నల్లగట్ల రెడ్డెమ్మ (48)ను ఆమె భర్త కోటేశ్వరరావు హత్య చేసిన సంఘటన సోమవారం రాత్రి జరుగుమల్లి మండలం సతుకుపాడు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నల్లగట్ల కోటేశ్వరరావుకు ముగ్గురు భార్యలు. రెడ్డెమ్మ అతని రెండో భార్య. కొంతకాలంగా కోటేశ్వరరావు తన రెండో భార్య రెడ్డెమ్మను పట్టించుకోకుండా మూడో భార్యతోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. దీంతో రెడ్డెమ్మ నెల రోజుల క్రితం భర్తతో గొడవపడి దూరంగా ఉంటుంది. ఈ నేథ్యంలో సోమవారం రాత్రి రెడ్డెమ్మ వద్దకు వచ్చిన కోటేశ్వరరావు ఆమెతో మాట్లాడుతూనే కత్తితో పొడిచి చంపేశాడు. అయితే స్థానికుల కథనం మరో విధంగా ఉంది. కోటేశ్వరరావు స్వతహాగా దొంగతనాలకు పాల్పడుతుంటాడని అనేక కేసుల్లో ముద్దాయి అని తెలిపారు. ఇతనికి ఇద్దరు భార్యలు కాగా రెడ్డెమ్మ మొదటి భార్య అని తెలిపారు. ఈమెకు పిల్లలు లేకపోవటంతో ఒక కుర్రాడిని పెంచుకుని వివాహం కూడా చేసింది. అయితే రెడ్డెమ్మ తన అన్న కొడుకుతో చనువుగా ఉండటంతో వారి ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో కోటేశ్వరరావు ఈ హత్యకు పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. రెడ్డెమ్మను కత్తితో పొడవగానే ఆమె బాధతో పెద్దగా కేకలు వేయడంతో ఇంటిలో ఉన్న కోడలు సుహాసిని వెంటనే తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పొలంలో కాపలాకి వెళ్లిన అతను హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో 108కు సమాచారం అందించారు. వారు వచ్చేసరికి సుమారు గంటకు పైగా సమయం పట్టింది. రెడ్డెమ్మను పరీక్షించి చనిపోయిందని ధ్రువీకరించుకుని వెనుతిరిగారని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని సింగరాయకొండ సీఐ బనగాని ప్రభాకర్, ఎస్ఐ సోమశేఖర్ పరిశీలించారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు రిజిష్టరు చేసి దర్యాప్తు చేస్తున్నామని కోటేశ్వరరావు కోసం గాలిస్తున్నామని వివరించారు -
భార్యను కడతేర్చిన భర్త
కర్నూలు,గోస్పాడు: కట్టుకున్న భార్యను ఓ భర్త కడతేర్చిన ఘటన మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గోస్పాడుకు చెందిన చాకలి శ్రీనివాసులకు శిరివెళ్ల మండలం కామినేనిపల్లెకు చెందిన లక్ష్మిదేవి(35)కి పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమాుర్తెలు. శ్రీనివాసులు కొంత కాలంగా తాగుడుకు బానిసయ్యాడు. ఎలాంటి పనులకు వెళ్లకపోవంతో పాటు తాగేందుకు డబ్బులివ్వాలని భార్యను వేధించేవాడు. ఇదే విషయమై సోమవారం రాత్రి భార్యభర్త మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడై రోకలి బండతో భార్య తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మంగళవారం ఉదయం ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. శిరివెళ్ల సీఐ శివశంకర్, ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కాసుల కోసం కిరాతకం
నెల్లూరు, సూళ్లూరుపేట: అత్తింటి ఆరళ్లకు అబల బలైంది. పొలం విక్రయించి నగదు తీసుకురాలేదని భార్యను ఆమె భర్త తన తల్లితో కలిసి హత్యచేసి ఆత్యహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సూళ్లూరుపేట మండలంలోని కుదిరి పంచాయతీ కుదిరి తిప్పకండ్రిగ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తడ మండలం పెరియవెట్టి పంచాయతీ కావలిమిట్ట గ్రామానికి చెందిన బత్తిన లత (25)కు కుదిరి తిప్పకండ్రిగ గ్రామానికి చెందిన బత్తిన సురేంద్రకు పది సంవత్సరాల క్రితం వివాహమైంది. సురేంద్ర వ్యవసాయం చేస్తుంటాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లయిన నాటి నుంచి భర్త వేధిస్తున్నా లత తట్టుకుని కాపురం చేస్తూ వచ్చింది. 2016లో వేధింపులు తీవ్రం కావడంతో కేసు పెట్టి కొంతకాలం దూరంగా ఉంది. తర్వాత పెద్ద మనుషులు రాజీ చేశారు. కోర్టులో కేసును కూడా రాజీ చేసి భార్యాభర్తలను కలిపి కాపురానికి పంపారు. మళ్లీ వేధింపులు మొదలు కావడంతో ఇద్దరి మధ్య తరచూ వివాదాలు జరిగేవి. ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు. కాగా లతకు కావలిమిట్టలో పుట్టింటి వారు కొంత ఇంటి స్థలాన్ని ఇచ్చారు. దానిని విక్రయించి నగదు తీసుకురావాలని భర్త చెప్పడంతో రెండు మూడురోజులుగా వివాదం జరుగుతూ వచ్చింది. గురువారం రాత్రి వివాదం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున భర్త సురేంద్ర తన తల్లి పార్వతమ్మతో కలిసి లతపై దాడిచేసి గొంతు నులిమి చంపివేశారని సీఐ కిషోర్‌బాబు తెలియజేశారు. అనంతరం ఇద్దరూ కలిసి ఇంటి ఆవరణలో ఉన్న వేపచెట్టుకు మృతదేహాన్ని చీరతో ఉరిచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. లత ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి నాగవేణికి సమాచారం అందించారు. ఆమె వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ కిషోర్‌బాబు, ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి శరీరంపై ఉన్న గాయాలు, తలకు వెనుకభాగాన ఉన్న బలమైన గాయాలను బట్టి హత్య చేసి ఉరివేసి ఉంటారని గుర్తించారు. ఈ ఘటన జరిగిన అనంతరం లత అత్త, భర్త పరారీలో ఉండటంతో వారే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ కిషోర్‌బాబు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యలపై భర్తల అమానుషం
సాక్షి ప్రతినిధి, చెన్నై: నాతి చరామీ అంటూ కష్టసుఖాల్లో నూరేళ్లు కలిసి నడుస్తామని పెద్దల సాక్షిగా ప్రతిజ్ఞ చేసిన భర్తలు కాలయముళ్లుగా మారిపోయారు. భార్య, అత్తను హత్యచేసి ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మరో కేసులో సైతం భర్త చేతిలో భార్య బలైన సంఘటనలు తమిళనాడులో చోటుచేసుకున్నాయి. కోయంబత్తూరు పోత్తనూరుకు చెందిన బాబు (46) అనే భవన నిర్మాణ కార్మికునికి సుమతి (42)తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. సంతానలేమి వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో సుమతి రెండేళ్ల క్రితం భర్తను వదిలి పొల్లాచ్చిలోని తన తల్లి విశాలక్ష్మి (60) వద్ద ఉంటోంది. ఈ రెండేళ్లలో భర్త తరచూ తాగి వచ్చి ఘర్షణ పడడాన్ని భరించలేక విడాకులు కోరుతూ మూడునెలల క్రితం సుమతి నోటీసులు పంపినట్లు సమాచారం. అయితే విడాకులు ఇచ్చేందుకు సుముఖంగా లేకపోవడంతో పాటు సుమతితో కలసి జీవించాలని ఆశపడుతున్నాడు. కాగా, మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో మరలా అత్తవారింటికి వచ్చి అత్త విశాలాక్షిని కత్తితో గొంతుకోసి హతమార్చాడు. తల్లి కేకలు విని మరో గది నుంచి బయటకు వచ్చిన భార్య సుమతిని కిందపడేసి ఆమె గొంతు కూడా కత్తితో కోసి కడతేర్చాడు. ఇద్దరు చనిపోయినట్లు నిర్ధారించుకున్న తరువాత బాబు సైతం అదే ఇంటిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అక్కడికి సమీపంలో వేరుగా ఉంటున్న విశాలాక్షి కుమారుడు బుధవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా చెల్లి, తల్లి శవాలై, మరో గదిలో ఉరికి వేలాడుతూ బావ బాబు కనిపించారు. పొల్లాచ్చి తూర్పు విభాగం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెన్నై సైదాపేటకి చెందిన కార్తిక్, భార్య సౌమ్య మంగళవారం రాత్రి తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. బుధవారం ఆగ్రహాన్ని తట్టుకోలేని కార్తిక్ కత్తితో భార్య గొంతుకోసి హత్యచేశాడు. ఆ తరువాత అదే కత్తితో తన చేతి మణికట్టును కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇరుగూపొరుగూ ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కార్తిక్‌ను చెన్నై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి ఈ ఘోరానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్దు చేస్తున్నారు. చెన్నై రామాపురానికి చెందిన రాజన్, ధరణిలకు మూడేళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరూ చెన్నైలోని పాత్రల కంపెనీలో పనిచేస్తున్నారు. రాజన్ మద్యానికి బానిస కావడంతో భార్యాభర్తల మధ్య తరచూ తగాదాలు చోటుచేసుకునేవి. మంగళవారం రాత్రి యథావిధిగా రాజన్ తాగి ఇంటికి రావడంతో కోపగించుకున్న ధరణి ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని బెదిరించింది. అయితే ఇందుకు మరింత ఆగ్రహించిన రాజన్ ఆమెకు నిప్పంటించాడు. మంటల బాధను తట్టుకోలేక కేకలు పెడుతున్న ధరణిని ఇరుగూపొరుగూ కాపాడి చెన్నై కీల్పాక్ ఆస్పత్రిలో చేర్పించగా విషమపరిస్థితిలో చికిత్స పొందుతోంది. భర్త పరారయ్యాడు. -
భార్యను నడిరోడ్డుపై హతమార్చిన భర్త
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను నడిరోడ్డుపై పాశవికంగా హత్యచేశాడు. ఒకటో పట్టణ పోలీసులు, మృతురాలి బంధువులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ పరిధి 26వ వార్డు పండావీధిలో వడిసెల మోహన్‌రావు, భార్య నాగమణి, పిల్లలు దుర్గారావు (13), హంసిక (11)లతో కలిసి జీవిస్తున్నాడు. వీరిరువురు 2004లో పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. మోహన్‌రావు టౌన్ కొత్తరోడ్డులో ట్రాన్స్‌పోర్టు కలాసీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే వచ్చిన ఆదాయం సరిపోకపోవడంతో భార్య నాగమణి మూడేళ్లుగా సిరి పురం ఉడా భవనంలో ఉన్న ఫుడ్ ఎక్స్ దుకాణంలో పండావీధికి చెందిన కొందరు మహిళలతో కలిసి పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో భార్యభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో ఇద్దరి మధ్య నాలుగైదు నెలలుగా గొడవలు జరుగుతున్నా యి. దీంతో తాము నివసించే ఇంటికి సమీపంలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు పిల్లలను తీసుకుని నాగమణి వెళ్లిపోయింది. అదే సమయంలో మోహన్‌రావు సెల్ కనిపించకుండా పోయింది. అనంతరం అది భార్య నాగమణి వద్ద దొరికింది. అయితే తన ఫోన్లో తాను వేసిన సిమ్‌కు బదులు మరొక సిమ్ ఉండడంతో తన భార్య ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందని మోహన్‌రావు అనుమానించాడు. ఈ విషయంపై రెండు సార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి నాగమణిని భర్త వద్దకు పంపారు. అప్పటికి తగువు చల్లబడ్డా తరువాతి కాలాంలో మరలా మనస్పర్థలు బయలు దేరాయి. నడిరోడ్డుపై పాశవికంగా పొడిచి... ఈ నెల 25న రాత్రి 11 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో మోహన్‌రావు తన భార్యను చంపేస్తానని బెదిరించడంతో భయపడిన నాగమణి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో నాగమణి పనిచేస్తున్న ఫుడ్ఎక్స్కు ఈ నెల 27న (శనివారం) రాత్రి మోహన్‌రావు వెళ్లాడు. భార్య వచ్చేవరకూ ఎదురు చూసి నాగమణితో పాటు అక్కడ పనిచేస్తున్న పండావీధికి చెందిన మహిళలతో పాటుగా ఆటోలో పాత నవరంగ్ థియేటర్ వద్దకు చేరుకున్నాడు. సుమారు 11.30 గంటలకు ఆటో దిగిన తరువాత భార్యను తనతో పాటు ఇంటికి రమ్మని పిలుస్తూనే తన వద్ద దాచుకున్న కత్తితో దాడిచేసి ఛాతీ, కడుపు వంటి సున్ని త ప్రాంతాల్లో 8 వరకూ పోట్లు పోడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తమకు సమీపంలో జరిగిన దారుణాన్ని వారితో పాటు వచ్చిన మహిళలు చూసి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు పరుగున వచ్చారు. అప్పటికే రక్తపు మడుగులో పడి నాగమణి ఘటనా స్థలంలోనే మరణించింది. అయితే మోహన్‌రావు తల్లి అప్పలనర్సమ్మ ప్రోద్బలం వల్లనే భార్యను క్షణికావేశంలో హత్య చేశాడన్న ఆరోపణ ఆ ప్రాంతంలో బలంగా విని పిస్తోంది. సమాచారం అందుకున్న ఒకటో పట్ట ణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తమం కేజీహెచ్‌కు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీ సుకున్న పోలీసులు ఏసీపీ రంగరాజు ఆధ్వర్యం లో సీఐ ఉమాకాంత్ బృందం విచారిస్తున్నారు. -
అనుమానం పెనుభూతం!
మూడు ముళ్ల బంధాలు.. అనుమానాల కత్తులకు ముక్కలవుతున్నాయి. ఏడడుగుల అనుబంధాలు.. అపోహల అగాధంలో కూరుకుని విచ్ఛిన్నమవుతున్నాయి.కడదాకా తోడుంటానన్న ప్రమాణాలు.. క్షణికావేశపు కాష్టంలోకి నిలువునా దహించుకుపోతున్నాయి. నీవేనేనై.. నేనేనీవై అంటూ ఒక్కటైన జీవితాలు..ఆప్యాయతల మధురిమలు చవిచూడకుండానే అర్ధంతరంగా ముగిసిపోతున్నాయి.అన్యోన్యపు దాంపత్యాలు.. అనైతిక ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుని మృత్యువు దారుల్లో ఓడిపోతున్నాయి.శుక్రవారం తాడేపల్లిలో భర్త అనుమానమే పెనుభూతమై భార్యను హతమార్చగా.. విజయపురిసౌత్‌లో అనైతిక సంబంధానికి భర్త ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తల్లిదండ్రులు దూరమైన పసి బిడ్డల జీవితాలు.. అయ్యో పాపం అంటూ ప్రతి ఒక్కరి గుండెలపై కన్నీటి ఘోష పెడుతున్నాయి. గుంటూరు, తాడేపల్లిరూరల్: అనుమానంతో ఓ భర్తను భార్యను విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. అడ్డువచ్చిన అత్తను సైతం తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన తాడేపల్లి పట్టణ పరిధిలోని సలాంహోటల్ సెంటర్లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కారంపూడి మండలం గుత్తికొండకు చెందిన దేరంగుల వెంకన్నబాబుకు తాడేపల్లి సలాంహోటల్ సెంటర్‌కు చెందిన తిరుపతమ్మ (25)తో 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిరువురికి ముగ్గురు సంతానం. అత్తగారింటి సమీపంలోని వేరే ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత రెండేళ్లుగా భార్యపై అనుమానం పెంచుకుని తరచూ హింసిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన తమ కూతురు వేరే వారితో ఇంట్లో ఉందని అత్తింటి వారికి ఫిర్యాదు చేయగా వారు వచ్చి పరిశీలించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అల్లుడిని మందలించి అత్త గోవిందమ్మ కూతురిని తమతో పాటు ఇంటికి తీసుకువెళ్లారు. ఈ సమయంలో తిరుపతమ్మ ముగ్గురు పిల్లల్ని అక్కడే వదిలేసి రావడంతో 4వ తేదీ సాయంత్రం అత్తగారింటికి వచ్చి పిల్లల ఆధార్‌కార్డు కావాలంటూ వెంకన్నబాబు గొడవ చేశాడు. భార్య తిరుపతమ్మ ఆధార్‌కార్డ్‌లు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన వెంకన్నబాబు నిన్ను అంతం చేస్తానంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అత్తగారింటికి వెళ్లి తన వెంట తెచ్చుకున్న కత్తితో భార్యపై దాడికి పాల్పడ్డాడు. అడ్డువచ్చిన అత్తను తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తిరుపతమ్మ మృతి చెందగా, గోవిందమ్మ అపస్మారకస్థితిలోకి జారుకుంది. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేరంగుల వెంకన్నబాబు మాత్రం తన భార్యను చంపి మంచి పని చేశానని, గత మూడేళ్ల నుంచి తీవ్ర మనస్తాపానికి గురి చేస్తుందంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. -
భార్యను కడతేర్చిన భర్త
తమిళనాడు, తిరువొత్తియూరు: కుటుంబకలహాలతో భార్యను భర్త కడతేర్చాడు. ఈ ఘటన కన్యాకుమారి జిల్లాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. కన్యాకుమారి జిల్లా అంజు గ్రామం కనకప్పపురానికి చెందిన డాల్టన్ సెల్వ ఎడ్వర్డ్ (40). అతని భార్య జగదీషిని (33). వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. జగదీషిని పాల్‌కులంలో ఉన్న ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసేవారు. కుటుంబ కలహాలతో తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవి. గురువారం రాత్రి దంపతుల మధ్య గొడవ ఏర్పడింది. ఆ సమయంలో ఆగ్రహించిన డాల్టన్ సెల్వ ఎడ్వర్డ్ కత్తితో భార్యపై దాడి చేసి పారిపోయాడు. ప్రాణాలతో పోరాడుతున్న ఆమెను చుట్టుపక్కల వారు నాగర్‌కోవిల్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం తిరువనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం జగదీషిని మృతి చెందింది. నాగర్‌కోవిల్ పోలీసులు పరారైన జగదీషిని భర్త కోసం గాలిస్తున్నారు. -
కొట్టి చంపేశాడు!
కృష్ణాజిల్లా, కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : పెళ్లై 26 ఏళ్లు గడిచినా ఆ అభాగ్యురాలు ఒక్కరోజూ సంతోషంగా గడిపింది లేదు.. మూడు ముళ్ళు వేయించుకున్నందుకు పెళ్లైన రోజు నుంచి కన్నుమూసే క్షణం వరకు భర్త వేధింపులను భరిస్తూనే వచ్చింది.. కట్టబెట్టిన పాపానికి భర్తను వదిలేయమని కన్నవాళ్ళు ఎన్నిసార్లు ప్రాధేయపడినా వివాహ బంధానికి విలువనిచ్చి దశాబ్దాలపాటు అతనితోనే అడుగులు వేసింది.. చివరికి అదే దుర్మార్గుడి పైశాచికానికి ఆ అభాగ్యురాలు బలైపోయింది. ఈ హృదయ విదారకమైన ఘటన ఈ నెల 1వ తేదీన జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో చోటు చేసుకోగా రంగంలోకి దిగిన పోలీసులు ఆ అమాయకురాలిని విచక్షణారహితంగా కొట్టి చంపిన ప్రబుద్ధుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.దీనికి సంబంధించిన వివరాలను గురువారం టౌన్ సీఐ కె. వాసవి మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వ్యసనాలకు బానిసై.. మచిలీపట్నం రామానాయుడుపేటకు చెందిన కురుచేటి త్రివిక్రమశ్రీనివాసప్రసాద్ వెండి వ్యాపారం చేస్తుంటాడు. ఏలూరుకు చెందిన శివనాగకనకరాజకుమారి (40)తో 1996లో పెద్దల సమక్షంలో పెళ్లైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు నిఖిల్ విజయవాడలో సీఏ చదువుతున్నాడు. కుమార్తె మౌనిక పంజాబ్‌లో ఎంబీఏ చదువుతోంది. ఇదిలా ఉండగా పెళ్ళైన నాటికే వ్యసనాలకు బానిసైన శ్రీనివాసప్రసాద్.. రాజకుమారిని నిత్యం వేధిస్తూ ఉండేవాడు. రోజూ మద్యం సేవించి ఆమెతో ఘర్షణ పడుతుండేవాడు. మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తుండేవాడు. అది నచ్చని రాజకుమారి తల్లితండ్రులు ప్రవర్తన మార్చుకోవాలని అతనిని పలుమార్లు వేడుకున్నారు. అనేకమార్లు పంచాయితీలు పెట్టారు. అయినా మార్పు రాలేదు. అతని పైశాచికాన్ని భరించలేక, కూతురు జీవితాన్ని కాపాడుకోవాలనే తపనతో ఆ తల్లితండ్రులు భర్తను వదిలేసి వచ్చేయమని పలుమార్లు బతిమలాడారు. అయినా ఆమె 26 ఏళ్లుగా భరిస్తూ అతనిని అంటిపెట్టుకునే ఉంది. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు. శ్రీనివాసప్రసాద్ వేధింపులు భరించలేని రాజకుమారి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది, రక్షణ కల్పించాలని వేడుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భర్తను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. దీంతో కొంత కాలం శ్రీనివాసప్రసాద్ భార్యతో సజావుగా మెలిగాడు. తిరిగి సైకోలా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. పరువు తీశావంటూ కక్ష సాధింపు చర్యలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో శ్రీనివాసప్రసాద్ ఆమెపై మరింత కక్ష పెంచుకున్నాడు. చదువుల నిమిత్తం పిల్లలు ఇద్దరు వేర్వేరు చోట్ల ఉండటం, రెండు నెలల క్రితం అతని తల్లి కాలం చేయటంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న భార్యపై శ్రీనివాసప్రసాద్ వేధింపులు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 1వ తేదీ మధ్యాహ్నం పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో ఘర్షణకు దిగాడు. ఆమెను విచక్షణారహితంగా చితకబాదాడు, అతని దెబ్బలకు ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. రెండు గంటల పాటు ఇంట్లో శవాన్ని ఉంచిన అతను సాయంత్రం 5 గంటల సమయంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్ళగా రాజకుమారి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో శవాన్ని ఇంటికి తీసుకువచ్చి మెట్లపై జారి పడి చనిపోయిందంటూ పిల్లలకు, బంధువులకు చెప్పి నమ్మించాడు. అనుమానంతో కేసు పెట్టిన కుమారుడు.. తల్లి మరణవార్త విని చలించిపోయిన కొడుకు అఖిల్ హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. ముందు రోజు వరకు బాగానే ఉన్న తల్లి ఒక్కసారిగా చనిపోవటం ఏంటనే అనుమానం వచ్చింది. పైగా తండ్రి ప్రవర్తనపై అనుమానం ఉన్న అఖిల్ తల్లి శవాన్ని పరీక్షగా చూశాడు. ఆమె ఒంటిపై రక్తపు గాయాలు కనిపించటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రిపై అనుమానం వ్యక్తం చేశాడు. ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాసప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నట్లు సీఐ వాసవి తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ సమావేశంలో మచిలీపట్నం, ఆర్‌పేట ఎస్సైలు దుర్గాప్రసాద్, హబీబ్‌బాషా, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
భార్యను హత్య చేసిన భర్త
అనంతపురం, కృష్ణరాజపురం : అనుమానంతో భార్యను హత్య చేసి అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించిన ఘటన మంగళవారం కోణనకుంటె పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాకు చెందిన కుమార్ స్థానికంగా అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తూ భార్య గీతాతో కలసి అక్కడే నివాసం ఉంటున్నాడు. కొంత కాలంగా భార్య గీత ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న కుమార్ ఇదే విషయమై తరచూ గీతతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం కూడా ఇరువురి మధ్య ఇదే విషయమై గొడవ జరగడంతో కోపోద్రిక్తుడైన కుమార్ కత్తితో భార్య గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనస్థలానికి చేరుకున్న కోణనకుంటె పోలీసులు కుమార్‌ను విక్టోరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. -
మహిళ దారుణ హత్య
బంజారాహిల్స్: అదనపు కట్నం కోసం ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సనత్‌నగర్‌కు చెందిన సిరాజ్ వెల్డర్‌గా పని చేసేవాడు. శ్రీకృష్ణానగర్ సి బ్లాక్‌కు చెందిన అసీమా(19)తో గత ఏడాది అతడికి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 1.50 లక్షల నగదు, 20 తులాల బంగారం, రూ.50 లక్షల విలువైన ప్లాట్ ఇచ్చారు. సదరు ప్లాట్ అసీమా పేరున ఉండటంతో దానిని తన పేరున మార్చాలని సిరాజ్ తరచూ తన మామ అస్లాంఖాన్‌పై ఒత్తిడి చేస్తున్నాడు. ఇదే విషయమై గత నెల 18న భార్యతో గొడవ పడటమేగాక ఆమె తీవ్రంగా కొట్టి ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. నాలుగు నెలల కుమారుడితో సహా అసీమా పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల అస్లాంఖాన్ అల్లుడిని ఒప్పించి కుమార్తెను కాపురానికి పంపాడు. ఆమెతో బాగా ఉన్నట్లు నటిస్తూనే భార్యను హతమార్చేందుకు పథకం పన్నాడు. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున మామ, బావమరుదులు, మరదళ్లు నిద్రిస్తుండగా వారి గదులకు గడియపెట్టి నిద్రిస్తున్న భార్య గొంతును కత్తితో కోశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం సిరాజ్ సనత్‌నగర్‌లోని తన తల్లిదండ్రులకు వద్దకు వెళ్లిపోగా, కుటుంబసభ్యులు అందరూ పరారయ్యారు. ఉదయం గదిలో నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించిన అస్లాంఖాన్ బయటి నుంచి గడియ పెట్టి ఉండటాన్ని గుర్తించి పక్కింటి వారికి సమాచారం అందించాడు. వారి సహకారంతో బయటికి వచ్చి చూడగా రక్తం మడుగులో అసీమా మృతదేహాన్ని చూసి అక్కడే కుప్పకూలిపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో జూబ్లీహిల్స్ పోలీసులు, క్లూస్‌టీమ్ ఆధారాలు సేకరించారు. నిందితుడు సనత్‌నగర్ వెళ్లే వరకు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయని ఆ వెంటనే సిగ్నల్స్ కట్ అయినట్లు పోలీసులు తెలిపారు. సిరాజ్, అతని కుటుంబసభ్యుల కోసం గాలింపు చేపట్టారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులుకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానంతో భార్యను చంపిన భర్త
బంజారాహిల్స్: ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేసిన ఉదంతం మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని కంకిపాడు మండలం వల్లూరిపాలెం గ్రామానికి చెందిన మల్లవల్ల ప్రశాంత్‌బాబు(40), మచిలీపట్నం శారదానగర్‌కు చెందిన వేమురి జ్యోత్స్న (31) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రశాంత్‌బాబు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మచిలీపట్నంలో ఉంటున్న వీరిద్దరు విభేదాలతో కారణంగా తొమ్మిది నెలలుగా వేర్వేరుగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో జ్యోత్స్న ఇద్దరు వ్యక్తులతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు ప్రశాంత్‌బాబు అనుమానం వ్యక్తం చేస్తుండటంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో భర్తతో గొడవపడి జ్యోత్స్న తన పుట్టింటికి వెళ్లిపోయింది. గత శుక్రవారం తనకు ఆర్టీసీలో ఉద్యోగం వస్తోందని రూ.80 వేలు కావాలంటూ జ్యోత్స్న తన భర్త ప్రశాంత్ వద్దకు వచ్చింది. ఇద్దరం కలిసి సామరస్యంగా మాట్లాడుకొని కాపురం చేద్దామంటూ సోమవారం రాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని ప్రశాంత్ తమ్ముడు ప్రకాశ్ ఇంటికి వచ్చాడు. ప్రకాశ్ రోడ్ నెం.10లోని హ్యాంగింగ్ గార్డెన్స్ అపార్ట్‌మెంట్స్‌లో డ్రైవర్‌గా పని చేస్తూ సర్వెంట్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రశాంత్ డ్రైవింగ్‌కు వెళ్లిపోగా ఆయన భార్య యజమాని ఇంట్లో పనికి వెళ్లింది. ఆ సమయంలో జ్యోత్స్న ప్రశాంత్ మళ్లీ గొడవకు దిగారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో అక్కడే ఉన్న రోకలిబండ తీసుకొని జ్యోత్స్న తలపై గట్టిగా కొట్టడంతో ఆమె కుప్పకూలింది. ఆమె ప్రాణాలు ఇంకా ఉన్నాయని తెలుసుకొని పక్కనే ఉన్న రుబ్బురోలుతో తలపై బాదాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు ఆరా తీయగా తాము సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో బస్సులో హైదరాబాద్ వచ్చి తన బాబాయ్ కొడుకు ప్రకాశ్ గదికి చేరుకున్నామని, ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కోపం పట్టలేక రుబ్బురోలుతో తలపై బాదినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కుమార్తె వివాహమైన యువకుడిని ప్రేమించడంతో..
పశ్చిమగోదావరి, నిడదవోలు రూరల్: భార్యభర్తల మధ్య తగాదాల నేపథ్యంలో నిద్రపోతున్న భార్య తలపై రాడ్డుతో కొట్టి రక్తం మడుగులో ఉన్న ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యచేశాడు ఓ కిరాతక భర్త. ఈ ఘటన నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మరాజుపాలెంకు చెందిన బొబ్బిలి వెంకటరామారావు అదే గ్రామానికి చెందిన ప్రణయత(33) 2000 సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ప్రణయత ఐదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లింది. దీంతో వెంకటరామారావు దేవరపల్లి మండలం గౌరీపట్నానికి చెందిన ఒక మహిళతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆమె తరచు తిమ్మరాజుపాలెం వస్తూండేది. నాలుగు నెలలు క్రితం ప్రణయత గల్ఫ్‌దేశం నుంచి ఇంటికి రావడంతో భర్తకు వేరే మహిళతో లైంగిక సంబంధం ఉన్నట్టు తెలిసింది. దీంతో భార్యాభర్తలు తరచు తగాదాలు పడేవారు. వారికి పెద్దలు నచ్చజెప్పారు. అయితే వారి పెద్ద కుమార్తె ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్లు తల్లికి తెలియడంతో ఇటీవల కుమార్తెను మందలించింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య ఆదివారం రాత్రి తగాదా జరగటంతో ప్రణయతను తలపై రాడ్డుతో బలంగా కొట్టగా తీవ్రంగా రక్తస్రావమై ఉన్న ఆమెపై పెట్రోల్ పోసి వెంకటరామారావు నిప్పంటించాడు. మృతురాలి తల్లి కొండేపూడి లక్ష్మి ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై జి.సతీష్ కేసు నమోదు చేశారు. నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. కుమార్తె ప్రేమ వ్యవహారమే కారణమా? ప్రణయత పెద్దకుమార్తె (18) నిడదవోలులోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. కొంతకాలంగా పట్టణ శివారు లింగంపల్లికి చెందిన వివాహితుడైన యువకుడి ప్రేమలో పడింది. వీరిద్దరూ చాలాచోట్ల కలిసి కనిపిస్తున్నారని బంధువులు తల్లికి చెప్పడంతో కుమార్తెను నిలదీసింది. దీంతో కొన్నిరోజులుగా తల్లీకూతురు మధ్య సరిగా మాటలు లేవు. ప్రణయత గల్ఫ్ దేశానికి రెండుసార్లు వెళ్లి ఐదేళ్లపాటు పనిచేసింది. ఆ సమయంలో ఆమె పంపిన డబ్బులో సుమారు రూ.2 లక్షలు భర్త వృథాగా ఖర్చుపెట్టడంతో పాటు గౌరీపట్నానికి చెందిన మహిళతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళను కొన్నిసార్లు నేరుగా ఇంటికి తీసుకురావడంతో ఈ విషయం పెద్దకుమార్తెకు తెలిసినా తల్లికి చెప్పలేదు. తండ్రి, కుమార్తెలిద్దరూ ఒకేమాట మీద ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. కుమార్తె వివాహమైన యువకుడిని ప్రేమించడంతో భార్యభర్తల మధ్య ఆదివారం రాత్రి తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం నిద్రిస్తున్న భార్యను కోపంతో రగిలిపోతున్న భర్త రాడ్డుతో కొట్టడంతో పాటు పెట్రోల్ పోసి కిరాతంగా హత్య చేశాడు. తల్లిని హత్య చేయడంలో పెద్దకూతురు కూడా తండ్రికి సహకరించినట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో వేసుకున్న దుస్తులను కూడా పోలీసులు స్వా«ధీనం చేసుకుని కేసు విచారణ చేస్తున్నట్టు తెలిసింది. అల్లుడు, మనవరాలు కలిసి తన కుమార్తెను హత్యచేశారని మృతురాలి తల్లి కొండేపూడి లక్ష్మి ఆరోపిస్తూ కన్నీటిపర్యంమైంది.