సారంగాపూర్ :వివాహేతర సంబంధాలు, అనుమానాల కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. దీని కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు.. ప్రేమ, వాత్సల్యానికి దూరమవుతూ అనాథలుగా మిగిలిపోతున్నా రు. క్షణికావేశం, మితిమీరిన అహంకారం వారి పిల్లలకు శాపంగా మారుతోందని గ్రహించని స్థి తిలో ఏం చేయడానికైనా తెగిస్తూ తమ జీవితం, పిల్లల భవిష్యత్తును చిదిమేస్తున్నారు. దీనికి నిదర్శనం సారంగాపూర్ మండలంలో ఇదివరకు జ రిగిన ఘాతుకాలే. శుక్రవారం రాత్రి సైతం మం డలంలోని జామ్ గ్రామంలో వివాహేతర సం బంధం వద్దని.. మనకు పిల్లలున్నారని వారించి న పాపానికి ప్రియురాలితో కలిసి కట్టుకున్న భార్యనే కడతేర్చాడో ప్రబుద్ధుడు. ఈ ఘాతుకానికి ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది.
ఇలా జరిగింది...
జామ్ గ్రామానికి చెందిన పబ్బు అల్లమయ్యతో నిర్మల్ పట్టణం బంగల్‌పేట్‌కు చెందిన పుష్పలత(ప్రేమల)కు 25 ఏళ్లక్రితం వివాహం జరి గింది. వారి వైవాహిక బంధానికి ప్రతీకగా వారి కి నలుగురు ఆడపిల్లలు జన్మించారు. అయితే వివాహానంతరం నుంచే అల్లమయ్య మద్యం తాగుతూ, వివాహేతరర సంబంధాలు కొనసాగిస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇదే సమయంలో అల్లమయ్య తండ్రి అయిన లింగమ య్య బాధ్యత లేని కొడుకుపై నమ్మకం లేక ము గ్గురు పిల్లలకు తన కష్టార్జితంతో వివాహం జరి పించాడు. వివాహాలు చేసిన తన తండ్రి, భార్యలను డబ్బుల కోసం తరచూ వేధించేవాడు అల్లమయ్య. ఈ వేధింపులు తాళలేక భార్య పుష్పల త, తండ్రి లింగమయ్య పలుమార్లు అల్లమయ్య పై పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినా తనలో మార్పు రాలేదు.
మార్పు రాకపోగా మళ్లీ వివాహేతర సంబంధాలను కొనసాగించాడు. శుక్రవారం రాత్రి నిర్మల్ మండలం మేడిపెల్లి గ్రామానికి చెందిన ఓ మహిళను వెంట తెచ్చుకు ని వచ్చి తన ఇంట్లోనే కార్యకలాపాలు సాగించా డు. అది గమనించిన ఆయన భార్య దానిని అ డ్డుకునేందుకు ప్రయత్నిస్తే చిన్నకూతురు రుచిత ను, భార్యను చితకబాదాడు. అంతటితో ఊరుకోకుండా ముందుగా తన వెంట తెచ్చిన పురుగుల మందును అల్లమయ్య, తన ప్రియురాలు ఇద్దరు కలిసి పుష్పలత నోట్లో బల వంతంగా పోశారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె ను స్థానికులు కాపాడేందుకు గాను 108కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చే లోపే పుష్పలత తుది శ్వాస విడిచింది. దీంతో అల్లమయ్య కటకటాల పాలు కాగా.. తల్లి మరణించడంతో తన 12 ఏళ్ల కుమార్తె రుచిత తల్లిదండ్రులు లేని అనాథగా మిగిలిపోయింది. అల్లమయ్యను గ్రామస్తులు బ ట్టలూడదీసి చితకబాది పోలీసులకు అప్పగించా రు. ప్రస్తుతం ఆయనపై కేసు నమోదు చేశారు.
అనుమానమే అనాథలను చేసింది
మండలంలోని జామ్ గ్రామానికి చెందిన ఆరె గంగాధర్-వజ్రమాల అనే దంపతులను అనుమానం అనే భూతం కాటేసింది. మహారాష్ట్రలోని మలక్ జామ్ గ్రామానికి చెందిన గంగాధర్ జామ్ గ్రామానికి చెందిన వజ్రమాలను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు వినీల, విజయ్ జన్మించారు. అయితే వారికి అప్పట్లో 12 ఏళ్లు వచ్చాక వారి తల్లి అయిన ఆరె వజ్రమాలను 2010 ఏప్రిల్ మూడో తేదీన తండ్రి గంగాధర్ వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కత్తితో గొంతు కోసి చంపేశాడు. అనంతరం తన ఇద్దరు పిల్లల గురించి ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే గంగాధర్ సైతం గ్రామ చివరన పంట పొలాల్లో ఉరేసుకుని తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ దంపతుల సంతానం వినీల, విజయ్‌లిద్దరూ అనాథలయ్యారు. అప్పటి నుంచి అమ్మమ్మ కోర్వ లక్ష్మి, తాతయ్య భోజన్నలే వారి ఆలనాపాలనా చూస్తున్నారు. ఇలా అనుమానాలు క్షణికావేశాలతో ఎంతో మంది అనాథలవుతున్నారు.
ఒక్క క్షణం ఆలోచించండి
అనుమానం వస్తే కనీసం ఐదు నిమిషాలైనా ఆలోచించండి. క్షణికావేశం తమ జీవితాన్నే కాక తమపై ఆధారపడే వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందని గ్రహించాలి. వచ్చిన ఆవేశాన్ని ఆ ఐదు నిమిషాలు ఆపుకుంటే సమస్య పరిష్కారానికి మార్గం కనిపిస్తుంది. నిండు జీవితం మీతోనే ఉంటుంది.
విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు
Published Sun, Feb 15 2015 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM
Advertisement
Advertisement