extra-marital affair
-
ప్రాణం తీసిన పంచాయితీ తీర్పు
తరిగొప్పుల: పల్లెల్లో పెద్ద మనుషులు ఇచ్చే తీర్పులు మనుషుల ప్రా ణాలు బలికొంటున్నా యి. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం వాల్యా తండాకు చెందిన బానోతు రాజు (22), అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇరవై రోజుల క్రితం ఇద్దరూ ఊరు విడిచి వెళ్లిపోయారు. దీంతో వారి కోసం సదరు వివాహిత భర్త, బంధువులు వెతకగా.. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బస్టాండ్‌లో దొరికారు. అనంతరం గ్రామంలో పెద్ద మనషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా రూ.20 లక్షలు సదరు వివాహిత భర్తకు రాజు చెల్లించేలా తీర్మానించారు. దీంతో మనస్తాపం చెందిన రాజు.. అదేరోజు రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
బయటపడుతున్న ట్రంప్ అక్రమ సంబంధాలు!
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాహేతర సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే పోర్న్ స్టార్ స్టార్మీ డానియెల్ ట్రంప్‌పై దావా వేయగా.. ఇప్పుడు మరో మాజీ మోడల్ ఆయనపై కోర్టుకు ఎక్కింది. ట్రంప్‌తో తనకు ఎఫైర్ ఉందని, ఈ వ్యవహారంపై నోరు మెదపకుండా ఉండేందుకు చేసుకున్న లీగల్ ఒప్పందం నుంచి తనకు విముక్తి కల్పించాలని ప్లేబాయ్ మాజీ మోడల్ కరెన్ మెక్‌డౌగల్ లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో దావా వేశారు. ట్రంప్‌తో ఎఫైర్ గురించి బయటకు వెల్లడించవద్దంటూ నేషనల్ ఎంక్వైరర్ పత్రిక ప్రచురణ సంస్థ అయిన అమెరికన్ మీడియా ఇంక్ 2016లో తనకు లక్ష 50వేల డాలర్లు చెల్లించిందని ఆమె తన దావాలో పేర్కొన్నారు. ఈ మీడియా సంస్థ అధిపతి డేవిడ్ పెకర్ గతంలో ట్రంప్ తన వ్యక్తిగత స్నేహితుడని ప్రకటించారు. ఈ క్రమంలో ట్రంప్‌తో మెక్‌డౌగల్ ఎఫైర్ గురించి కథనాన్ని ప్రచురించే హక్కులను ఆమె నుంచి అమెరికన్ మీడియా సంస్థ కొనుగోలు చేసినప్పటికీ.. అది ఇప్పటివరకు ప్రచురించలేదని న్యూయార్కర్ మ్యాగజీన్ గత నెల వెల్లడించింది. ఈ నేపథ్యంలో మెక్ డౌగల్ ట్రంప్‌పై దావా వేయడం గమనార్హం. ఇప్పటికే ట్రంప్ ఇద్దరు మహిళల నుంచి కేసులు ఎదుర్కొంటున్నారు. ట్రంప్‌తో తనకు లైంగిక సంబంధాలు ఉన్నాయని, వీటి గురించి బయటకు వెల్లడించవద్దంటూ ట్రంప్ లాయర్ తనతో ఒప్పందం చేసుకున్నారని, ఈ ఒప్పందం నుంచి తనకు విముక్తి కల్పించాలని పోర్న్‌స్టార్ స్టార్మీ డానియెల్ కేసు వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ట్రంప్ ఆధ్వర్యంలో నడిచిన రియాలిటీ షో ‘అప్రెంటిస్’ కంటెస్టెంట్ అయిన సమ్మర్ జెరోస్ కూడా ఆయనపై దావా వేశారు. ఈ షోలో పాల్గొంటున్న సమయంలో ట్రంప్ తనను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. ఈ కేసులో ట్రంప్ విచారణ ఎదుర్కోవాల్సిందేనని న్యూయార్క్ స్టేట్ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తాజా కేసు వెలుగుచూడటం అధ్యక్షుడిగా మరో ఎదురుదెబ్బగా మారింది. 10 నెలలపాటు... 2006-07 మధ్యకాలంలో పది నెలలపాటు ట్రంప్ తనతో ‘వివాహేతర ప్రణయ సంబంధాన్ని’ కొనసాగించాడని మెక్‌డౌగల్ దావాలో పేర్కొన్నారు. ఈ సమయంలోనే ట్రంప్ పోర్న్ స్టార్ స్టార్మీ డానియెల్‌తో కూడా ఎఫైర్ నడిపించారు. ఆ సమయంలో ట్రంప్ భార్య మెలానియా గర్భవతిగా ఉండి.. తమ చిన్న కొడుకు బ్యారన్‌కు జన్మనిచ్చింది. 2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తన లాయర్ కీత్ డేవిడ్సన్తో.. ట్రంప్ వ్యక్తిగత లాయర్ మైఖేల్ కోహెన్ రహస్యంగా సంప్రదింపులు జరిపారని ఆమె తెలిపారు. స్టార్మీ డానియెల్తోనూ ఇదేవిధంగా సంప్రదింపులు జరిపి.. ఆమె ఈ బాగోతాన్ని బయటపెట్టకుండా చెల్లింపులు జరిపినట్టు కోహెన్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌పై న్యాయపోరాటం చేస్తున్న ముగ్గురు మహిళలు సమ్మర్ జెరోస్.. పోర్న్‌స్టార్ స్టార్మీ డానియెల్ ప్లేబాయ్ మాజీ మోడల్ కరెన్ మెక్‌డౌగల్ -
ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
షాద్‌నగర్: నిత్యం తాగి వేధింపులకు గురిచేస్తుండటంతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలసి పథకం పన్ని కట్టుకున్న భర్తను హతమార్చిన కేసులో నిందితులను షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ శ్రీనివాస్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం వీరంపల్లి గ్రామానికి చెందిన కావలి ఆంజనేయులు ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. తాగుడుకు బానిసైన ఆంజనేయులు నిత్యం తన భార్య లక్ష్మిని వేధించేవాడు. ఈ నేపథ్యంలోనే గ్రామానికి చెందిన కావలి హన్మంతుతో అక్రమ సంబంధం పెట్టుకున్న లక్ష్మి భర్తను కడతేర్చాలని పథకం పన్నింది. ఆర్మీ జవాన్‌గా పని చేస్తున్న హన్మంతుతో లక్ష్మి విషయాన్ని చెప్పడంతో విధులకు సెలవు పెట్టి హన్మంతు జూన్14న హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అనంతరం లక్ష్మి భర్త ఆంజనేయులుకు ఫోన్ చేసి వెంటనే గ్రామానికి వెళ్లే పని ఉందని ఆటో తీసుకురావాలని చెప్పాడు. తాగుడుకు బానిసైన ఆంజనేయులు హైదరాబాద్ నుంచి ఆటోలో హన్మంతుతో కలసి రాత్రి 11 గంటలకు గ్రామానికి బయలుదేరాడు. పథకం ప్రకారం ఆంజనేయులును కడతేర్చాలని వచ్చిన హన్మంతు ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల గ్రామ సరిహద్దులోనికి చేరుకోగానే ఆటోను నిలిపి తన వెంట తెచ్చుకున్న మద్యాన్ని సేవించి బయలు దేరుదామని చెప్పాడు. దీంతో అక్కడే ఆటో నిలిపి వేసి మద్యం సేవించిన అనంతరం మత్తులో ఉన్న ఆంజనేయులును బూటు కాల్లతో తన్ని , గొంతు నులిమి హత్య చేసి హన్మంతు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు షాద్‌నగర్ సీఐ శ్రీనివాసచారి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపగా అనుమానం వచ్చిన పోలీసులు మృతుడి భార్య లక్ష్మితో పాటు, కావలి హన్మంతును విచారించారు. ఈ మేరకు నిందితులు చేసిన తప్పును అంగీకరించడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో చురకుగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న పట్టణ సీఐ శ్రీనివాస చారితో పాటు ఐడి పార్టీ సిబ్బంది అబ్దుల్లా, వెంకటేష్, శేఖర్, రవికుమార్, గురు ప్రసాద్, నవీన్‌కుమార్, శివకుమార్లను ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో షాద్‌నగర్ ఎస్ఐ దాసు, ఐడి పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. -
హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం
శ్రీకాకుళం సిటీ: ఎచ్చెర్ల మండలంలో ఇటీవల జరిగిన ఓ మహిళ హత్య కేసును పోలీసులు చాకచక్యంతో చేధించారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం వెల్లడించారు. ఎచ్చెర్ల మండలం దారపువానిపేటకు చెందిన బోర రాములమ్మతో అదే గ్రామానికి చెందిన సుగంధి లక్ష్మణరావు నాలుగు నెలల నంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. వారిద్దరి వద్ద ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా దీన్ని గుర్తించామన్నారు. రాములమ్మ తనను ఎక్కడికైనా తీసుకువెళ్లి వేరే కాపురం పెట్టమని లక్ష్మణరావును వేధించడంతో విరక్తి చెందిన లక్ష్మణరావు ఎలాగైనా రాములమ్మను చంపేయాలని పథకం పన్నినట్టు చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 14న సాయంత్రం రాముల్మను జీడిమామిడి తోట వద్దకు రమ్మని చెప్పి పథకం ప్రకారం ఆమెపై లక్ష్మణరావు దాడి చేశాడని తెలిపారు. కర్రతో తలపై కొట్టడమే కాకుండా ఆమె మెడపై కర్రను అణిచివేయడంతో మృతి చెందినట్టు ఎస్పీ వివరించారు. బంగారు ఆభరణాలు స్వాధీనం రాములమ్మ చనిపోయిందని నిర్ధారణకు వచ్చాక ఆమె ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలను లక్ష్మణరావు తీసుకుపోయాడని ఎస్పీ చెప్పారు. వీటిలో రెండు తులాల బంగారు పుస్తెలతాడు, రెండు పుస్తెలు, రెండు బుట్టల బంగారు ఆభరణాలను ఓ పశువుల శాలలో దాచి పెట్టినట్లు నేర పరిశోధనలో ముద్దాయి లక్ష్మణరావు ఒప్పుకున్నాడని చెప్పారు. అలాగే రాములమ్మపై దాడి చేసిన కర్రను పక్కనే ఉన్న చిన్నపాటి చెరువులో పడేసాడన్నారు. మూడు తులాల బంగారు ఆభరణాలతో పాటు పర్సు, కర్ర, రెండు మొబైల్ ఫోన్ల చోరీ సోత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. భర్తకు దూరంగా ఉన్న రాములమ్మ ఇద్దరు పిల్లలతో కలసి పుట్టింట్లోనే గత కొన్నేళ్లుగా నివాసం ఉంటోందన్నారు. పోలీసులకు అభినందన ఇది మర్డర్ ఫర్ గెయిన్ కేసుగా ఎస్పీ బ్రహ్మారెడ్డిగా పేర్కొన్నారు. తక్కువ సమయంలో ఈ కేసును చేధించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ కె.భార్గవరావునాయుడు, ఎచ్చెర్ల సీఐ వై.రామకృష్ణ, ఎస్ఐలు సీహెచ్ రామారావు, వి.సందీప్‌కుమార్ పాల్గొన్నారు. -
'ఆమె వివాహేతర సంబంధమే అసలు విషయం'
తన తదుపరి చిత్రం 'రుస్తుం' గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు హీరో అక్షయ్ కుమార్. క్రైమ్ మిస్టరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో అక్షయ్ తొలిసారి నేవల్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమాలో భార్య ప్రియుడిని చంపే వ్యక్తిగా అక్షయ్ నటిస్తున్నారు. దీనిపై అక్షయ్ మాట్లాడుతూ.. సాధారణంగా హిందీ సినిమాల్లో భర్త వివాహేతర సంబంధం కలిగి ఉంటాడు, చివరికి తన తప్పు తెలుసుకున్నాక భార్య అతడిని క్షమిస్తుంది, అంగీకరిస్తుంది. తిరిగి వారిద్దరూ సంతోషంగా జీవిస్తారు. కానీ ఈ కథలో అలా కాదు. భార్యే వివాహేతర సంబంధాన్ని కలిగి ఉంటుంది, భర్త క్షమాపణలు కోరుతుంది.. ఆ భర్త క్షమించాడా లేదా అన్నది తెర మీద చూడాల్సిన కథ అన్నారు. భార్య వివాహేతర సంబంధమే కథకు కీలకమైన పాయింట్ అని తెలిపారు. ఈ సినిమాలో అక్షయ్ భార్యగా ఇలియానా నటిస్తున్నారు. తొలిసారి ఇంత వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నందుకు ఈ స్టార్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదటిసారి నౌకాదళ అధికారిగా నటిస్తున్న అక్షయ్.. పాత్రకు సంబంధించి ఎలాంటి శిక్షణ తీసుకోలేదని చెబుతున్నారు. ప్రత్యేకించి నౌకాదళ ఆఫీసర్లను కలవడంగానీ, పుస్తకాలను చదవడంలాంటివేమీ చేయలేదట. ఓ అధికారి మాత్రం సెల్యూట్ ఎలా చేయాలి, బ్యాడ్జెస్ ఎలా ధరించాలి అనే విషయాల్లో ఆయన్ను గైడ్ చేసినట్లు తెలిపారు. ఆ యూనిఫామ్ వేస్కున్న తరువాత మాత్రం తెలీకుండానే బాధ్యతగా ఫీలయ్యానని, అధికార దర్పం తెలిసిందని అంటున్నారు. ఆ యూనిఫామ్ ధరించేవారిని చూస్తుంటే తనకిప్పుడు అసూయగా ఉందని చెప్పారు ఎయిర్ లిఫ్ట్ స్టార్ అక్షయ్ కుమార్. టిను సురేష్ దేశాయ్ దర్శకత్వం వహించిన రుస్తుం ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఇలియానా మరోసారి బాలీవుడ్లో తన అదృష్టం పరీక్షించుకోనుంది. -
మహిళను చంపి.. తనను కాల్చుకున్న ఎస్సై!
న్యూఢిల్లీ: వివాహేతర సంబంధం కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఎస్సై సర్వీస్ రివాల్వర్‌తో మహిళను కాల్చి చంపి.. తనను తాను హతమార్చుకున్నాడు. ద్వారాకా సెక్టర్-4లోని ఓ పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై విజయేందర్ మొదట నిక్కీ చౌహన్ అనే మహిళపై తన రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. దీంతో మూడు బుల్లెట్లు దిగిన ఆమె సంఘటన స్థలంలోనే కుప్పకూలింది. ఆ తర్వాత అతను తనను తాను రెండుసార్లు కాల్చుకున్నాడు. వెంటనే అతన్ని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించినా లాభం లేకపోయింది. తీవ్రగాయాలతో విజయేందర్ కూడా ప్రాణాలు విడిచాడు. విజయేందర్‌కు, నిక్కీకి వేర్వేరుగా పెళ్లిలు అయ్యాయి. అయితే కొన్నాళ్లుగా భర్త నుంచి వేరుగా ఉంటున్న నిక్కీ ఉత్తమ్‌నగర్‌లో విజయేందర్‌తో కలిసి జీవించింది. ఫ్రీలాన్స్ జర్నలిస్టు అయిన ఆమె గతంలో విజయేందర్‌పై అత్యాచారం కేసు పెట్టి.. ఆ తర్వాత ఉపసంహరించుకుంది. కేసు ఉపసంహరించుకున్నందుకు నిక్కీ విజయేందర్ వద్ద డబ్బులు గుంజడమే కాకుండా.. తనను పెళ్లి చేసుకోవాలని అతనిపై ఒత్తిడి చేసేదని ప్రాథమిక విచారణలో తేలింది. వివాహేతర సంబంధం కారణంగానే ఎస్సై విజయేందర్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు ప్రాథమికంగా తెలుస్తున్నా.. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరుపుతామని వాయవ్య ఢిల్లీ జాయింట్ పోలీసు కమిషనర్ దీపేంద్ర పాఠక్ తెలిపారు. -
అనుమానంతో భార్యను చంపిన భర్త
అనంతపురం టౌన్: అనంతపురం పట్టణంలోని నవోదయకాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఈశ్వరయ్య అనే వ్యక్తి తన భార్య రాజే శ్వరీ(28)ని కొట్టి చంపాడు. రాజేశ్వరీ అనంతపురం మెడికల్ కాలేజీలో స్వీపర్‌గా పనిచేస్తుంది. కొన్ని రోజులుగా ఈశ్వరయ్య తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఈశ్వరయ్య ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడని..
భూతగాదా ఉన్న వ్యక్తికి మద్దతుగా నిలిచాడన్న కోపం.. తన భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడన్న అనుమానం.. అతడిని విచక్షణ కోల్పోయేలా చేశాయి.. అలిగి సోదరి ఇంటికి వెళ్లిన భార్య ఇక కాపురం చేయనని స్పష్టం చేయడంతో తట్టుకోలేకపోయాడు.. అన్నింటికీ ఆ..‘పెద్దమనిషే’ కారణమని కక్షపెంచుకున్నాడు.. పూటుగా తాగాడు.. ఆదమరచి నిద్దరోతున్న పెద్దమనిషిని విచక్షణారహితంగా నరికి హత్య చేశాడు.. ఇవీ.. ఈ నెల 9వ తేదీన మునుగోడు మండలం చోల్లేడు గ్రామంలో కనకాల యాదయ్య హత్యోదంతం వెనుక ఉన్న కారణాలు. -మునుగోడు చొల్లేడు గ్రామానికి చెందిన కనగాల యాదయ్య హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు చండూ రు సీఐ సుబ్బిరామిరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో హత్యకు గల కారణాలు, నింది తుడి వివరాలను సీఐ వివరించారు. గ్రామానికి చెందిన జనిగల హనుమంతుకు సర్వేనంబర్ 216లోని అసైండ్ భూ విషయంలో అదే గ్రామంలోని ఓ పార్టీకి చెందిన వ్యక్తి తో తగాదాలు ఉన్నాయి. పలుమార్లు పెద్ద మనుషు ల సమక్షంలో పంచాయితీలు కూడా పెట్టుకున్నారు. అయితే గ్రామంలో పెద్దమనిషిగా చలామణి అవుతున్న యాదయ్య హనుమంత్‌కు తగాదా ఉన్న వ్యక్తికి మద్దతుగా నిలిచాడు. తనను తిట్టి.. భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడని.. భూతగాదా విషయంలో కనకాల యా దయ్య పలుమార్లు హనుమంతును తాట్టాడు. కానీ హనుమంత్ భార్యతో మాత్రం మామూలుగానే మాట్లాడుతుండేవాడు. ఇది పలుమార్లు గమనించిన హనుమంతు తన భార్యతో యాదయ్య వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానం మొ దలైంది. మూడు నెలల క్రితం హనుమతంతు భార్య మర్రిగూడ మం డలం లెంకలపల్లి గ్రామంలో జరిగిన పండగకు తన బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడికి యాదయ్య కూడా వెళ్లినట్టు కొందరు హనుమం తు చెవిలో వేశారు. అంతే కాకుండా నెల రోజుల క్రితం ఓ వివాహంలో హనుమంతు భార్య వంట చేస్తుండగా యాదయ్య కొంగుపట్టి లాగడం హనుమంతు కంట పడడంతో అనుమానం రెట్టింపైంది. అన్నింటినీ దృష్టిలో పె ట్టుకుని ఈ నెల 7న హనుమంతు భార్యను చితకబాదాడు. దీంతో ఆమె అలిగి పిల్లలను తీసుకుని చీకటిమామిడిలో ఉంటున్న తన సొందరి ఇంటికి వెళ్లింది. మరుసటి రోజు హనుమంతు అక్కడికి వెళ్లి భార్యను రమ్మని కోరగా ససేమిరా అంది. పూటుగా మద్యం తాగి.. భార్య ఇక కాపురం చేయనని స్పష్టం చేయడంతో హనుమంతు జీర్ణించుకోలేకపోయాడు. యాదయ్యతో వివాహే తర సంబంధం కొనసాగిస్తూ ఈ నిర్ణయం తీసుకుందని అతడిలో బల మైన అనుమానాలు మొదలయ్యా యి. పైగా భూతగాదాలో కూడా యా దయ్య ప్రత్యర్థి వర్గానికి మద్దతుగా ఉంటుండడాన్ని హనుమంతు తట్టుకోలేకపోయాడు. ఇటు కాపురం.. అటు భూ తగాదాలో అడ్డుగా ఉన్న యాదయ్యను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచనలతోనే అతడు పూటుగా మద్యం తాగాడు. ఆపై తన ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకొని ఇంటి ఆరుబయట ఆదమరచి నిద్రపోతున్న యాదయ్యను ఏడు సార్లు విచక్షణారహితంగా నరికి హత్య చేశాడు. గొడ్డలిని ఇసుకమేటలో దాచి.. యాదయ్యను హత్య చేసేందుకు ఉపయోగించన గొడ్డలిని హనుమంతు కల్వకుంట్ల గ్రామంలోని కల్వర్టు వద్ద వాగులోని ఇసుకమేటలో దాచిపెట్టాడు. అనంతరం బైక్‌పై తన అత్తగారు ఊరైన నారయణపురం మం డలం ఆరెగూడెం వెళ్లి బావమరిది వ్యవసాయ భూమిలో బైక్‌ను కూడా దాచిపెట్టాడు. అక్కడ నుంచి హైదరాబాద్, మహబూనగర్ జిల్లాలో తలదాచుకున్నాడు. తిరిగి గురువారం రాత్రి అత్తగారి ఇంటికి వచ్చాడు. విషయం తెలుసుకున్న ఐడీ పార్టీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని విచారిం చగా నేరం అంగీకరించాడు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు సీఐ వివరించారు. సమావేశంలో ఎస్ఐ బి.డానియల్‌కుమార్, ఏఎస్ఐ రామయ్య, కానిస్టేబుల్స్ మురళి, క్రిష్ణ, రాహుఫ్, సత్యనారయణరెడ్డి ఉన్నారు. -
ఉసురు తీసిన వివాహేతర సంబంధం
భార్యను కడతేర్చిన భర్త పోలీసుల అదుపులో నిందితుడు కోటనందూరు (తుని) :కలకాలం కలిసి జీవించాల్సిన భార్యాభర్తల మధ్య వివాహేతర సంబంధం చిచ్చురగిల్చింది. భార్యను భర్తే కడతేర్చిన సంఘటన కోటనందూరు మండలం అల్లిపూడిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అల్లిపూడికి చెందిన రుత్తల రాఘవ (45)ను భర్త రుత్తల సత్యనారాయణ అలియాస్ రాంబాబు హత్య చేశాడు. కాకినాడకు చెందిన రాఘవకు అల్లిపూడికి చెందిన సత్యనారాయణతో 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె హేమనిలక్ష్మి విశాఖపట్నంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. కుమారుడు భాస్కర్ హైదరాబాదులో డిగ్రీ చదువుతున్నాడు. రాఘవకు అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, బుధవారం అర్ధరాత్రి సమయంలో సత్యనారాయణ ఇంటికి వచ్చిన సమయంలో వీరిద్దరూ కలిసి ఉండడం చూశాడు. దీంతో ఆగ్రహం చెందిన సత్యనారాయణ గట్టిగా కేకలు వేయడంతో బయట వ్యక్తి పలాయనం చిత్తగించాడు. రాఘవ, సత్యనారాయణ ఇద్దరు ఘర్షణ పడ్డారని, పెనుగులాటలో రాఘవ ఇంట్లో ఉన్న రాతిరోలుపై పడిపోవడంతో తల వెనుక భాగంలో తీవ్రగాయమై అక్కడకక్కడే మృతి చెందిందని కోటనందూరు ఎస్సై గోపాలకృష్ణ తెలిపారు. మృతురాలి సోదరుడు నాళం దుర్గాప్రసాద్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు ఆధ్వర్యంలో ఎస్సై గోపాలకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక వీఆర్వో సమక్షంలో పంచనామా చేసి తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు
సారంగాపూర్ :వివాహేతర సంబంధాలు, అనుమానాల కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. దీని కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు.. ప్రేమ, వాత్సల్యానికి దూరమవుతూ అనాథలుగా మిగిలిపోతున్నా రు. క్షణికావేశం, మితిమీరిన అహంకారం వారి పిల్లలకు శాపంగా మారుతోందని గ్రహించని స్థి తిలో ఏం చేయడానికైనా తెగిస్తూ తమ జీవితం, పిల్లల భవిష్యత్తును చిదిమేస్తున్నారు. దీనికి నిదర్శనం సారంగాపూర్ మండలంలో ఇదివరకు జ రిగిన ఘాతుకాలే. శుక్రవారం రాత్రి సైతం మం డలంలోని జామ్ గ్రామంలో వివాహేతర సం బంధం వద్దని.. మనకు పిల్లలున్నారని వారించి న పాపానికి ప్రియురాలితో కలిసి కట్టుకున్న భార్యనే కడతేర్చాడో ప్రబుద్ధుడు. ఈ ఘాతుకానికి ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. ఇలా జరిగింది... జామ్ గ్రామానికి చెందిన పబ్బు అల్లమయ్యతో నిర్మల్ పట్టణం బంగల్‌పేట్‌కు చెందిన పుష్పలత(ప్రేమల)కు 25 ఏళ్లక్రితం వివాహం జరి గింది. వారి వైవాహిక బంధానికి ప్రతీకగా వారి కి నలుగురు ఆడపిల్లలు జన్మించారు. అయితే వివాహానంతరం నుంచే అల్లమయ్య మద్యం తాగుతూ, వివాహేతరర సంబంధాలు కొనసాగిస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇదే సమయంలో అల్లమయ్య తండ్రి అయిన లింగమ య్య బాధ్యత లేని కొడుకుపై నమ్మకం లేక ము గ్గురు పిల్లలకు తన కష్టార్జితంతో వివాహం జరి పించాడు. వివాహాలు చేసిన తన తండ్రి, భార్యలను డబ్బుల కోసం తరచూ వేధించేవాడు అల్లమయ్య. ఈ వేధింపులు తాళలేక భార్య పుష్పల త, తండ్రి లింగమయ్య పలుమార్లు అల్లమయ్య పై పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా తనలో మార్పు రాలేదు. మార్పు రాకపోగా మళ్లీ వివాహేతర సంబంధాలను కొనసాగించాడు. శుక్రవారం రాత్రి నిర్మల్ మండలం మేడిపెల్లి గ్రామానికి చెందిన ఓ మహిళను వెంట తెచ్చుకు ని వచ్చి తన ఇంట్లోనే కార్యకలాపాలు సాగించా డు. అది గమనించిన ఆయన భార్య దానిని అ డ్డుకునేందుకు ప్రయత్నిస్తే చిన్నకూతురు రుచిత ను, భార్యను చితకబాదాడు. అంతటితో ఊరుకోకుండా ముందుగా తన వెంట తెచ్చిన పురుగుల మందును అల్లమయ్య, తన ప్రియురాలు ఇద్దరు కలిసి పుష్పలత నోట్లో బల వంతంగా పోశారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె ను స్థానికులు కాపాడేందుకు గాను 108కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చే లోపే పుష్పలత తుది శ్వాస విడిచింది. దీంతో అల్లమయ్య కటకటాల పాలు కాగా.. తల్లి మరణించడంతో తన 12 ఏళ్ల కుమార్తె రుచిత తల్లిదండ్రులు లేని అనాథగా మిగిలిపోయింది. అల్లమయ్యను గ్రామస్తులు బ ట్టలూడదీసి చితకబాది పోలీసులకు అప్పగించా రు. ప్రస్తుతం ఆయనపై కేసు నమోదు చేశారు. అనుమానమే అనాథలను చేసింది మండలంలోని జామ్ గ్రామానికి చెందిన ఆరె గంగాధర్-వజ్రమాల అనే దంపతులను అనుమానం అనే భూతం కాటేసింది. మహారాష్ట్రలోని మలక్ జామ్ గ్రామానికి చెందిన గంగాధర్ జామ్ గ్రామానికి చెందిన వజ్రమాలను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు వినీల, విజయ్ జన్మించారు. అయితే వారికి అప్పట్లో 12 ఏళ్లు వచ్చాక వారి తల్లి అయిన ఆరె వజ్రమాలను 2010 ఏప్రిల్ మూడో తేదీన తండ్రి గంగాధర్ వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కత్తితో గొంతు కోసి చంపేశాడు. అనంతరం తన ఇద్దరు పిల్లల గురించి ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే గంగాధర్ సైతం గ్రామ చివరన పంట పొలాల్లో ఉరేసుకుని తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ దంపతుల సంతానం వినీల, విజయ్లిద్దరూ అనాథలయ్యారు. అప్పటి నుంచి అమ్మమ్మ కోర్వ లక్ష్మి, తాతయ్య భోజన్నలే వారి ఆలనాపాలనా చూస్తున్నారు. ఇలా అనుమానాలు క్షణికావేశాలతో ఎంతో మంది అనాథలవుతున్నారు. ఒక్క క్షణం ఆలోచించండి అనుమానం వస్తే కనీసం ఐదు నిమిషాలైనా ఆలోచించండి. క్షణికావేశం తమ జీవితాన్నే కాక తమపై ఆధారపడే వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందని గ్రహించాలి. వచ్చిన ఆవేశాన్ని ఆ ఐదు నిమిషాలు ఆపుకుంటే సమస్య పరిష్కారానికి మార్గం కనిపిస్తుంది. నిండు జీవితం మీతోనే ఉంటుంది. -
వివాహేతర బంధాన్ని బయట పెట్టిందని...
విజయవాడ: వివాహేతర సంబంధాన్ని బయట పెట్టిందన్న కక్షతో విజయవాడలో సునీత అనే బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలిపై సుభానీఖాన్ అనే వ్యక్తి దాడి చేశాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 20 రోజుల క్రితం సుభానీఖాన్ మరో అమ్మాయితో బ్యూటీ పార్లర్ కు వచ్చాడు. ఈ విషయాన్ని సుభానీఖాన్ భార్యకు సునీత చెప్పింది. దీంతో కక్ష పెంచుకున్న సుభానీఖాన్ శనివారం రాత్రి కత్తితో సునీతపై దాడికి పాల్పడ్డాడు. గాయపడిన సునీతను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సుభానీఖాన్ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
రేప్ కేసులో నిందితుడికి విముక్తి
వివాహితను అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి బాధితురాలిపై మోతి నగర్‌కు చెందిన 25 సమీర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు అభియోగాలు మోపారు. అయితే కేసును క్షుణ్ణంగా విచారించిన న్యాయస్థానం.. నిందితుడిపై అత్యాచార ఆరోపణలను కొట్టివేసింది. ఇది రేప్ కేసు కాదని, వివాహేతర సంబంధానికి సంబంధించిన అంశమని పేర్కొంది. నలుగురు పిల్లల తల్లైన బాధితురాలు.. నిందితుడిపై తప్పుడు ఆరోపణలు చేసిందని నిర్ధారించింది. తమ సంబంధం గురించి భర్తకు తెలియడంతో ఆమె ఈ పని చేసిందని తేల్చింది. భర్తను తనను ఏలుకోడన్న భయంతో ఆమె రేప్ కేసు పెట్టిందని తెలిపింది. వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారు అత్యాచార కేసులు వేయడం పెరిగిపోయిందని న్యాయస్థానం పేర్కొంది. తోడు కోసం ఒకరిని పెళ్లి చేసుకుని మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం నైతికం కాదని అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి నివేదిత అనిల్ శర్మ పేర్కొన్నారు.