మహిళను చంపి.. తనను కాల్చుకున్న ఎస్సై! | Delhi cop shoots woman, tries to kill self | Sakshi
Sakshi News home page

మహిళను చంపి.. తనను కాల్చుకున్న ఎస్సై!

Published Sun, Jan 17 2016 6:09 PM | Last Updated on Sun, Sep 2 2018 5:04 PM

మృతురాలు నిక్కీ చౌహన్‌ - Sakshi

మృతురాలు నిక్కీ చౌహన్‌

న్యూఢిల్లీ: వివాహేతర సంబంధం కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఎస్సై సర్వీస్‌ రివాల్వర్‌తో మహిళను కాల్చి చంపి.. తనను తాను హతమార్చుకున్నాడు. ద్వారాకా సెక్టర్‌-4లోని ఓ పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై విజయేందర్ మొదట నిక్కీ చౌహన్ అనే మహిళపై తన రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. దీంతో మూడు బుల్లెట్లు దిగిన ఆమె సంఘటన స్థలంలోనే కుప్పకూలింది. ఆ తర్వాత అతను తనను తాను రెండుసార్లు కాల్చుకున్నాడు. వెంటనే అతన్ని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించినా లాభం లేకపోయింది. తీవ్రగాయాలతో విజయేందర్ కూడా ప్రాణాలు విడిచాడు.

విజయేందర్‌కు, నిక్కీకి వేర్వేరుగా పెళ్లిలు అయ్యాయి. అయితే కొన్నాళ్లుగా భర్త నుంచి వేరుగా ఉంటున్న నిక్కీ ఉత్తమ్‌నగర్‌లో విజయేందర్‌తో కలిసి జీవించింది. ఫ్రీలాన్స్ జర్నలిస్టు అయిన ఆమె గతంలో విజయేందర్‌పై అత్యాచారం కేసు పెట్టి.. ఆ తర్వాత ఉపసంహరించుకుంది. కేసు ఉపసంహరించుకున్నందుకు నిక్కీ విజయేందర్‌ వద్ద డబ్బులు గుంజడమే కాకుండా.. తనను పెళ్లి చేసుకోవాలని అతనిపై ఒత్తిడి చేసేదని ప్రాథమిక విచారణలో తేలింది. వివాహేతర సంబంధం కారణంగానే ఎస్సై విజయేందర్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు ప్రాథమికంగా తెలుస్తున్నా.. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరుపుతామని వాయవ్య ఢిల్లీ జాయింట్ పోలీసు కమిషనర్‌ దీపేంద్ర పాఠక్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement