నాడు భర్త.. నేడు కొడుకును హత్య చేసింది.. | mother kills to son at maldkal | Sakshi
Sakshi News home page

నాడు భర్త.. నేడు కొడుకును హత్య చేసింది..

Published Sat, Aug 8 2015 9:05 AM | Last Updated on Sun, Sep 2 2018 4:41 PM

నాడు భర్త.. నేడు కొడుకును హత్య చేసింది.. - Sakshi

నాడు భర్త.. నేడు కొడుకును హత్య చేసింది..

* నాడు భర్త.. నేడు కొడుకు హత్య, ఇంటి ఆవరణలోనే మృతదేహం
* ఫిర్యాదును పట్టించుకోని ఎస్‌ఐపై దాడికి గ్రామస్తుల యత్నం


మల్దకల్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని పన్నెండేళ్ల క్రితం ప్రియుడితో కలసి భర్తను హత్య చేసి పూడ్చివేసిన మహిళ.. ఇప్పుడు కొడుకును కూడా చంపేసి ఇంటి ఆవరణలో పూడ్చేసింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ మండలం అమరవాయిలో శుక్రవా రం వెలుగులోకి వచ్చింది. గ్రామాని కి చెందిన కిష్టమ్మకు అదే గ్రామానికి చెందిన కిష్టన్నతో 25 ఏళ్ల క్రితం వివాహ మైంది.

అయితే, అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో కిష్టమ్మకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇందుకు అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలసి పన్నెండేళ్ల క్రితం హత్య చేసి కేసు వెలుగులోకి రాకుండా వ్యవహరించింది. ప్రవర్తనను మార్చుకోవాలని పెద్ద కుమారుడు పెద్ద మౌలాలి(20) తరచూ తల్లికి హితవు చెప్పేవాడు. ఇది నచ్చని ఆమె  తన సోదరులతో కలసి కుమారుడిని హత్య చేసి మృతదేహాన్ని ఇంటి ఆవరణలో  పూడ్చి ఇసుకతో కప్పి పెట్టింది.

మౌలాలి కనిపించడం లేదని జూలై మొదటి వారంలో అతని పెదనాన్న కొడుకులు, గ్రా మస్తులు మల్దకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జూలై 7న కేసు నమోదైంది. ఎస్పీ, గద్వాల డీఎస్పీ బాలకోటి ఆదేశాల మేరకు మల్దకల్ ఎస్‌ఐ శ్రీనివాసరావు.. కిష్టమ్మను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. భర్తను 12 ఏళ్ల క్రితం, ఇప్పుడు కొడుకును హత్య చేసి ఇంట్లోనే పూడ్చినట్లు కిష్టమ్మ పోలీసులకు తెలిపింది. దీంతో శుక్రవారం మృతదేహాన్ని వెలికితీశారు. ఫిర్యా దుపై ఎస్‌ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని గ్రామస్తులు దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో డీఎస్పీ గ్రామంలో పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement