
దొడ్డబళ్లాపురం: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో యువతి ప్రాణాలు కోల్పోయింది. మళవళ్లి తాలూకా హలగూరు గ్రామం సమీపంలోని బసాపుర గేట్ వద్ద చోటుచేసుకుంది. బళెహొన్నిగ గ్రామానికి చెందిన శరణ్య (25) గత ఏడాది నుంచి కనకపుర తాలూకా సాతనూరు పంచాయతీలో నరేగా ఇంజినీర్‌గా పని చేస్తోంది.
ఫిబ్రవరి 16న ఆమె వివాహం కూడా నిశ్చయమైంది. శనివారం సాయంత్రం స్కూటర్‌లో బళెహొన్నిగ నుంచి హలగూరుకు వస్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శరణ్య అక్కడికక్కడే చనిపోయింది. హలగూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.