రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి | Woman died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి

Published Tue, Feb 14 2017 1:41 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

Woman died in road accident

నార్పల: బంధువుల ఇంట జరుగుతున్న శుభకార్యానికి వెళ్తుండగా సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వివాహిత మృతి చెందింది. వివరాలు.. శింగనమలకు చెందిన మిట్టు కళ్యాణి (36) భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై ధర్మవరానికి వెళ్తున్నారు. నార్పల మండల పరిధిలోని బొమ్మకుంటపల్లి క్రాస్‌ సమీపంలో తాడిపత్రి – ధర్మవరం రహదారిపై ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్‌ ఇవ్వబోయి ద్విచక్రవాహనం అదుపుతప్పింది.

దీంతో భార్యాభర్తలు పవ¯ŒSకుమార్, కళ్యాణి కింద పడిపోయారు. తలకు బలమైన గాయంకావడంతో తీవ్ర రక్తస్రావం జరిగిన కళ్యాణిని చికిత్స నిమిత్తం బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలిస్తుండగా    మార్గంమధ్యలోనే ఆమె ప్రాణాలు విడిచింది. మృతురాలి సోదరుడు చంద్రమోహ¯ŒS ఫిర్యాధు మేరకు నార్పల ఏఎస్‌ఐ రామచంద్రారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement