kalyani
-
మహిళల భద్రతపై మండలిలో కూటమిని రఫ్ఫాడించిన వరుదు కళ్యాణి
-
Varudu Kalyani: రెన్యువల్ లేనప్పుడు విజయవాడ వరదల్లో వాలంటీర్లను ఎందుకు వాడుకున్నారు
-
చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: వరుదు కళ్యాణి
-
Disha APP : హోంమంత్రి అనితకు ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి కౌంటర్
-
ఢీ షో డ్యాన్సర్ మోసం చేశాడంటూ యువతి...
ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్‌లో విషాదం నెలకొంది. తన చావుకు ఢీ షో డ్యాన్సర్ అభి కారణమంటూ కావ్య కల్యాణి(24)(Kavya Kalyani) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. తనని పెళ్ళి చేసుకొని తనతో కాపురం చేస్తూ ఇప్పుడు మరో యువతిని పెళ్ళి చేసుకుంటున్నట్లు కావ్యకళ్యాణి సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చింది. 'నా పేరు కావ్య. నేను చచ్చిపోబోతున్నాను. నా చావుకి కారణం అభి. ఐదు సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి,తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇప్పుడేమో మరో అమ్మాయిని తీసుకొచి.. ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు. నన్ను వెళ్లిపొమ్మన్నాడు. ఇప్పుడు నేను ఉరేసుకుంటున్నాను. సారీ అమ్మ.. సారీ డాడీ' అంటూ యువతి సెల్ఫీ వీడియో ద్వారా తెలిపింది.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
వరుదు కల్యాణి మాస్ ర్యాగింగ్!
-
అమ్మాయితో భార్యకు అడ్డంగా దొరికిన జీహెచ్ఎంసీ అధికారి
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు కుటుంబాలను రోడ్డునపడేస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయి. సొసైటీలో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు సైతం వివాహేతర సంబంధాల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలో పరువు తీసుకుని నవ్వుల పాలవుతున్నారు. తాజాగా జీహెచ్ఎంసీకి చెందిన ఓ అధికారి బాగోతం బట్టబయలైంది. తన కంటే 20 ఏళ్ల తక్కువ వయసున్న అమ్మాయితో సదరు అధికారి వివాహేతర సంబంధం పెట్టుకోగా అతడి భార్య వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదారు.వివరాల ప్రకారం.. జీహెచ్ఎంసీ అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జానకీరామ్‌ను వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమెతో కలిసి నగరంలోని వారాసిగూడలో మకాం ఉంటున్నాడు. భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో భార్య కళ్యాణికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలో జానకీరామ్ ఎక్కడికి వెళుతున్నాడని కళ్యాణి నిఘా పెట్టింది. దీంతో, వారాసిగూడలోని ఒక అపార్ట్మెంట్లో ఉన్నట్లు గుర్తించింది.దీంతో, ప్లాన్ ప్రకారం భర్తను ఫాలో చేసిన కళ్యాణి.. అపార్ట్మెంట్లోని గదిలో వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరినీ ఆమె చితకబాదారు. అనంతరం, కళ్యాణి మాట్లాడుతూ.. జానకీరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో వివాహేతర బంధం పెట్టుకున్నాడని అన్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటాడని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం వెళ్లడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిద్దరిని స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో జానకీరామ్‌కు తగిన బుద్ది చెప్పాలని పోలీసులను కళ్యాణి కోరారు. -
YS జగన్‌ను కలిసిన విద్యార్థినిని మానసికంగా వేధిస్తున్నారు: Varudu Kalyani
-
మహిళల రక్షణలో కూటమి ప్రభుత్వం విఫలమైంది
-
బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్
స్పెషల్ అకేషన్ ఎవరిదైనా, అక్కడ మిమ్మల్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మార్చేస్తుంది స్టయిలిస్ట్ కళ్యాణి. ఇక పెళ్లికూతుళ్ల డ్రెస్ షాపింగ్ నుంచి వాటి ఔట్‌లుక్స్ వరకు ప్రతిదీ సూపర్‌గా ప్రజెంట్ చేసి, బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్‌గా మారుతుంది. ఆ విషయాలే..హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన కళ్యాణి ఫ్యాషన్ జర్నీ, చిన్నప్పుడు అమ్మ కుట్టు మెషిన్‌తో మెదలైంది. పట్టు లంగా వోణీలతో ప్రయోగాలు చేయటం ఆమె అలవాటు. క్రమంగా ఆ అలవాటే ఆసక్తిగా మారి, హమ్స్టెచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ నుంచి ఫ్యాషన్ కోర్సు చేసింది. తర్వాత ‘కళ్యాణి డిజైన్స్’ పేరుతో బొటిక్ ప్రారంభించి, ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. కొద్దిరోజుల్లోనే, తన అద్భుతమైన పనితీరుతో అందరినీ మెప్పించింది. ఇక పెళ్లికూతుళ్ళు అయితే, తమ హల్దీ, మెహందీ, బారాత్ ఇలా ప్రతి స్పెషల్ అకేషన్ కోసం డ్రెస్ సెలక్షన్స్‌కు కళ్యాణిని వెంట తీసుకొని వెళ్లేవారు. అలా చాలామంది బ్రైడల్స్‌కు బెస్ట్ ఫ్రెండ్‌గా మారి, వారి ఫొటో షూట్స్‌కు స్టయిలింగ్ చేయటం మొదలు పెట్టింది. అలా స్టయిలింగ్‌పై పట్టు సాధించి, ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాటు, ‘స్వామిరారా’, ‘కేరింత’, ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘రాజా విక్రమార్క’ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. ఆ స్టయిలింగ్‌కు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. అలా ఆమె స్టయిలింగ్‌తో గార్జియస్ అనిపించుకున్న వారిలో శ్రీదివ్య, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి, హరితేజ ఉన్నారు. రానా, నిఖిల్, కార్తికేయలాంటి మేల్ యాక్టర్స్‌కూ కళ్యాణి స్టయిలింగ్ చేసింది. ∙దీపిక కొండి -
బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్
స్పెషల్ అకేషన్ ఎవరిదైనా, అక్కడ మిమ్మల్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మార్చేస్తుంది స్టయిలిస్ట్ కళ్యాణి. ఇక పెళ్లికూతుళ్ల డ్రెస్ షాపింగ్ నుంచి వాటి ఔట్‌లుక్స్ వరకు ప్రతిదీ సూపర్‌గా ప్రజెంట్ చేసి, బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్‌గా మారుతుంది. ఆ విషయాలే..హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన కళ్యాణి ఫ్యాషన్ జర్నీ, చిన్నప్పుడు అమ్మ కుట్టు మెషిన్‌తో మెదలైంది. పట్టు లంగా వోణీలతో ప్రయోగాలు చేయటం ఆమె అలవాటు. క్రమంగా ఆ అలవాటే ఆసక్తిగా మారి, హమ్స్టెచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ నుంచి ఫ్యాషన్ కోర్సు చేసింది. తర్వాత ‘కళ్యాణి డిజైన్స్’ పేరుతో బొటిక్ ప్రారంభించి, ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. కొద్దిరోజుల్లోనే, తన అద్భుతమైన పనితీరుతో అందరినీ మెప్పించింది. ఇక పెళ్లికూతుళ్ళు అయితే, తమ హల్దీ, మెహందీ, బారాత్ ఇలా ప్రతి స్పెషల్ అకేషన్ కోసం డ్రెస్ సెలక్షన్స్‌కు కళ్యాణిని వెంట తీసుకొని వెళ్లేవారు.అలా చాలామంది బ్రైడల్స్‌కు బెస్ట్ ఫ్రెండ్‌గా మారి, వారి ఫొటో షూట్స్‌కు స్టయిలింగ్ చేయటం మొదలు పెట్టింది. అలా స్టయిలింగ్‌పై పట్టు సాధించి, ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాటు, ‘స్వామిరారా’, ‘కేరింత’, ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘రాజా విక్రమార్క’ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. ఆ స్టయిలింగ్‌కు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. అలా ఆమె స్టయిలింగ్‌తో గార్జియస్ అనిపించుకున్న వారిలో శ్రీదివ్య, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి, హరితేజ ఉన్నారు. రానా, నిఖిల్, కార్తికేయలాంటి మేల్ యాక్టర్స్‌కూ కళ్యాణి స్టయిలింగ్ చేసింది. ∙దీపిక కొండిమంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుందనేది నా నమ్మకం. అందుకే, ఎన్ని కష్టాలు వచ్చినా భయపడను. బి పాజిటివ్.. బి హ్యాపీ ∙కళ్యాణి కె. -
40 ఏళ్ల అనుభవం 40 కోట్లు కూడా తేలేదు...వరుదు కళ్యాణి షాకింగ్ రియాక్షన్
-
ప్రభుత్వ సదన్ బాలికల ఒంటిపై గాయాలు.. వరుదు కళ్యాణి స్ట్రాంగ్ రియాక్షన్
-
కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు: Varudu Kalyani
-
Varudu Kalyani: కోడి పందేలుపై ఉన్న శ్రద్ధ - మహిళల ప్రాణాలపై లేవా..?
-
విశాఖ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
-
ప్రెస్ మీట్ లో తిట్టడానికా నీకు మంత్రి పదవి... అనితను ఏకిపారేసిన వరుదు కళ్యాణి
-
మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. మంత్రి వంగలపూడి అనితకు కౌంటర్..
-
విద్యుత్ ఛార్జీలపై సర్కార్ ను మండలిలో నిలదీసిన విపక్ష YSRCP
-
మోడీ తల్లిని,పవన్ తల్లిని తిట్టింది ఎవరు..? చంద్రబాబుకు వరుదు కళ్యాణి మాస్ కౌంటర్
-
సభలో మంత్రి సత్యకుమార్ యాదవ్ తీరు సిగ్గు చేటు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
సాక్షి,అమరావతి : ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. శాసన మండలి చర్చలో ‘డయేరియాపై సభ్యుల ఆవేదన చూసి ముచ్చట వేస్తోంది. 15ఏళ్లలో ఎప్పుడు లేని మరణాలు సంభవించాయి’అని చిరునవ్వుతో మంత్రి సత్యకుమార్ యాదవ్ వెకిలిగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.శాసన మండలి సమావేశాల సందర్భంగా డయేరియా మరణాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. ‘‘సభలో డయేరియాపై ఆరోగ్యశాఖ మంత్రి సమాధానం బాధాకరం. మృతులపై ఎంతటి అభిమానం ఉందో మంత్రి నిర్లక్ష్య సమాధానమే చెబుతోంది.మంత్రి సత్యకుమార్ యాదవ్ వెకిలిగా మాట్లాడటం సిగ్గుచేటు. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. గత 30 ఏళ్లలో గుర్లలో ఎన్నడూ డయేరియా మరణాలు సంభవించలేదు. సెప్టెంబర్ 20న మొదటి కేసు నమోదైంది. అక్టోబర్ 12వ తేదీ నాటికి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 19న వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేసే వరకు ప్రభుత్వంలో చలనం రాలేదు.చదవండి: డయేరియా మరణాలపై నవ్వుతూ హేళనగా మాట్లాడిన ఏపీ మంత్రి 20 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వాసుపత్రి ఉంది. పక్క జిల్లాలో కేజీహెచ్ ఉంది. కానీ స్కూల్ బల్లలపై వైద్యం అందించారు. స్కూల్ బల్లలపై డయేరియా బాధితులకు వైద్యం అందించినందుకు ప్రభుత్వం సిగ్గు పడాలి. మృతుల సంఖ్యను తగ్గించడం పైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. డయేరియా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా చేయలేదు. ఒక్కో డయేరియా బాధిత కుటుంబానికి వైఎస్ జగన్ రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వైఎస్ జగన్ వెళ్లే వరకూ జిల్లా ఇంఛార్జి మంత్రి వంగలపూడి అనిత..ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా వెళ్లలేదు. మృతులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం’’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
Diarrhea: వందల మందిని వణికిస్తున్న డయేరియా
-
నా భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత
సాక్షి అమరావతి: తన భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందర్ రెడ్డి భార్య కళ్యాణి హెచ్చరించారు. ఆమె శనివారం తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. పోలీసులు తన భర్తని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయని, ఇంతవరకు ఎక్కడున్నాడో ఆచూకీ తెలియడంలేదని ఆమె చెప్పారు. శనివారం ఉదయం టీడీపీ నేత బీటెక్ రవి మాట్లాడిన మాటలను బట్టి చూస్తే.. ప్రభుత్వం తన భర్తకి హాని తలపెట్టే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని, ఆయన్ని అంతమొందించాలని పోలీసులు కుట్ర చేస్తున్నారని అనుమానంగా ఉందని చెప్పారు.ఆయన్ని పోలీసులు మీడియా ముందు హాజరు పర్చకపోతే డీజీపీ ఆఫీసు ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఐ–టీడీపీ, విశాఖకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు పినపాల ఉదయ భూషణ్, చంద్ర కిరణ్‌లతో రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ ఐడీ సృష్టించి, దాని ద్వారా షర్మిల, నర్రెడ్డి సునీత, వైఎస్ విజయమ్మలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని తెలిపారు. దీనిపై రవీందర్‌రెడ్డి కడప ఎస్పీకి అప్పట్లోనే ఫిర్యాదు చేయగా, ఎస్పీ వారిని అరెస్టు చేసి మీడియాకు అసలు విషయాలు వివరించారని తెలిపారు.తన భర్త నిర్దోషి అని నాటి ఎస్పీ ప్రకటనతోనే స్పష్టమైందన్నారు. తన భర్త ఎవరి మీద పోస్టులు పెట్టలేదని, అసభ్యకరంగా పోస్టులు పెట్టినట్లు షర్మిల మాట్లాడటం సరికాదని అన్నారు. పులివెందుల వాసి అయినంత మాత్రాన వైఎస్ భారతి మేడానికి పీఏ అవుతారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీపై కక్ష ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి గానీ, తన భర్తని పావుగా వాడుకోవడం సరికాదన్నారు. టీడీపీ నేతలకూ ఆడపిల్లలు, వారికి కూడా భర్తలు ఉన్నారు కదా? వారికి ఏమైనా జరిగితే తట్టుకుంటారా అని నిలదీశారు. తాను కూడా ఒక మహిళనే అన్న విషయం గుర్తించాలంటూ కళ్యాణి కన్నీటి పర్యంతమయ్యారు.నా తమ్ముడి ఆచూకీ తెలపాలి: వర్రా మల్లికార్జున్ రెడ్డి రవీందర్ రెడ్డిని పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు మీడియా ద్వారా చూసి కుటుంబ సభ్యులందరం తల్లడిల్లిపోతున్నామని ఆయన సోదరుడు వర్రా మల్లికార్జునరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తన సోదరుడిని కోర్టులో లేదా మీడియా ముందు హాజరు పరచాలని, లేకుంటే కుటుంబమంతా డీజీపీ ఆఫీసు ఎదుట నిరాహార దీక్ష చేస్తామన్నారు. -
YSRCP మహిళా కార్యకర్తను ఇంత దారుణంగా హింసిస్తారా ?
-
చంద్రబాబు మంత్రివర్గం ఫెయిల్.. వరుదు కళ్యాణి సంచలనం
-
శాంతి భద్రతపై చేతులెత్తేసిన కూటమి
-
చంద్రబాబు కేబినెట్ మొత్తం విఫలం: వరుదు కళ్యాణి ఫైర్
విశాఖపట్నం, సాక్షి: కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు కేబినెట్ మొత్తం విఫలమైందని వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అన్నారు. ఇందుకు సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘శాంతి భద్రతల వైఫల్యానికి హోం మంత్రి కారణమని వైఎస్సార్సీపీ మొదట్నుంచీ చెప్తోంది. ముచ్చుమర్రి బాలిక మృతదేహం ఇంతవరకు దొరకలేదు. ఏపీలో రోజుకో చోట మహిళలపై అత్యాచారాలు జరగుతున్నాయి. హిందూపురంలో అత్తాకోడళ్లపై అత్యాచారం జరిగింది. కనీసం హోంమంత్రి బాధితురాళ్లను పరామర్శించటం లేదు. అత్యాచార ఘటనలపై హోం మంత్రి చర్యలు తీసుకోవడం లేదు. ఏపీలో మహిళలు ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవటం లేదు. కానీ, హోంమంత్రి అనిత మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారు.తప్పులను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. శాంతి భద్రతలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ నిర్వీర్యం చేశారు. పిఠాపురంలో ఓ మహిళపై అత్యాచారం జరిగితే.. పవన్ భరోసా ఎందకివ్వలేదు? పంతం నానాజీ అనుచరుల వేధింపులతో ఫీల్డ్ అసిస్టెంట్ సూసైడ్ చేసుకుంది. మరి ఆ బాధితులకు పవన్ ఎందుకు భరోసా ఇవ్వ లేదు?’’అని నిలదీశారు. -
అనితకు పవన్ వార్నింగ్.. ‘ఇప్పటికైనా మార్చాలి’
గుంటూరు, సాక్షి: చంద్రబాబు సర్కార్ అన్ని రంగాల్లోనూ విఫలమైందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. 5 నెలల్లోనే మహిళలపై వందకుపైగా అఘాయిత్యాలు జరిగాయని మండిపడ్డారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘హోమంత్రిగా అనిత ఫెయిల్ అయ్యారని కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న వవన్ కల్యాణే చెబుతున్నారు. మేం కూడా మొదట్నుంచీ అనిత తీరును ఎండగడుతూనే ఉన్నాం. అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నైతిక బాధ్యత వహిస్తూ అనిత రాజీనామా చేయాలి. అనితతో పాటు చంద్రబాబు సైతం సీఎంగా రాజీనామా చేయాలి’’ అన్నారు.‘పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే బాబును రాజీనామా చేయమనాలి’హోంమంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారని వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అన్నారు. ఇప్పటికైనా హోం మంత్రిని మార్చాలి. వైఎస్ జగన్‌ను తిట్టడానికే అనితకు హోం మంత్రి పదవి ఇచ్చినట్లు ఉందని మండిపడ్డారు. సోమవారం వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. ‘‘హోంమంత్రి అనితను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. కూటమి అక్రమాలపై పశ్నిస్తే.. అక్రమ కేసులు పెడుతున్నారు. ఇప్పటికైనా సర్కార్ తీరు మార్చుకోవాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలైమంది. పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే బాబును రాజీనామా చేయమని చెప్పాలి’’ అని అన్నారు. -
‘కూటమి’ పాలనలో మహిళలకు రక్షణ ఏదీ?: వరుదు కల్యాణి
సాక్షి, విశాఖపట్నం: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం సొంత జిల్లాలోనే మహిళలకు భద్రత కరువైందన్నారు. బాధిత కుటుంబాలను కూటమి నేతలు ఇప్పటివరకు పరామర్శించలేదన్నారు. వైఎస్సార్సీపీ స్పందిస్తేనే కూటమి నేతలు బాధిత కుటుంబాల వద్దకు వెళ్తున్నారన్నారు.‘‘రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ లేదని రోజూ రుజువవుతుంది. రాష్ట్రంలో 120కి పైగా ఘటనలు మహిళలపై జరిగాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటే మహిళలపై జరుగుతున్న ఘటనలపై ఎందుకు స్పందించడం లేదు?. చంద్రబాబు జిల్లాలోనే మహిళలపై, బాలికలపై దాడులు జరుగుతున్నాయి. తిరుపతిలో మరో బాలికపై అత్యాచారం చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లల తల్లితండ్రులు భయపడుతున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇన్ని ఘటనలు జరుగుతుంటే ఆయన ఎందుకు స్పందించడం లేదు?’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నలు గుప్పించారు.మద్యం, ఇసుక మీద పెట్టిన చర్చ మహిళల భద్రతపై ఎందుకు పెట్టరు..?. వైసీపీ నేతలు బాధితుల పరామర్శకు వెళ్తే.. ప్రభుత్వం స్పందిస్తుంది. గంజాయి నిర్మూలిస్తామని చెప్పే హోం మంత్రి ఏమి మాట్లాడటం లేదు. ఇన్ని ఘటనలు జరుగుతుంటే.. హోం మంత్రి ఏమి చేస్తున్నట్టు.. ఏమైనా అంటే నేను లాటీ పట్టుకొని తిరగాలా అని హోం మంత్రి అడుగుతారు. చేతగాని ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి చేతకాని పరిపాలన చేస్తున్నారు. ఆడపిల్లలు ఎక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నారు.. హోం మంత్రి సమాధానం చెప్పాలి. ప్రతిపక్ష నాయకుడికి ఉన్న మానవత్వం ఈ ప్రభుత్వానికి లేదు’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు. -
వాసిరెడ్డి పద్మక్తి వరుదు కళ్యాణి అదిరిపోయే స్ట్రాంగ్ కౌంటర్..
-
స్వలాభం కోసమే జగన్‌పై వాసిరెడ్డి పద్మ విమర్శలు: వరుదు కల్యాణి
సాక్షి, తాడేపల్లి: స్వలాభం కోసమే వైఎస్ జగన్‌పై వాసిరెడ్డి పద్మ విమర్శలు చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. జగనన్న కార్యకర్తలను సరిగా చూసుకోకపోతే మహిళా చైర్మన్ పదవి ఆమెకు ఎలా వచ్చింది? అని ఆమె ప్రశ్నించారు. కార్యకర్తలకు వైఎస్ జగన్ అగ్రస్థానం కల్పించారన్నారు. వ్యక్తిగత స్వార్థంతో వాసిరెడ్డి పద్మ విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.‘‘పదవులు అనుభవించి వాసిరెడ్డి పద్మ ఇప్పుడు ఇలా మాట్లాడటం పద్దతి కాదు. పదవిలో ఉన్నప్పుడే ఆమె రాజీనామా చేయవలసింది. వాసిరెడ్డి పద్మకి క్యాబినెట్ హోదాతో కూడిన మహిళా చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. దాడుల్లో చనిపోయిన వారికి పది లక్షలు అందజేస్తున్నాం. పదవులు పూర్తిగా అనుభవించి నైతిక విలువలు గురించి వాసిరెడ్డి పద్మ మాట్లాడటం సరికాదు. రాజకీయం కోసం ఆత్మవంచన చేసుకోకూడదు. వైఎస్సార్సీపీపై బురద చల్లడం మానుకోవాలి’’ అంటూ వరుదు కల్యాణి ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: చంద్రబాబుకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్ -
రాష్ట్రానికి సీఎం ఉన్నారా? లేరా?.. చంద్రబాబుపై వరుదు కళ్యాణి ఆగ్రహం
సాక్షి,అమరావతి : మహిళపై హత్యలు, అగాయిత్యాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత సంతాపాలు తెలిపి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి. బద్వేల్లో కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి, ఆపై పెట్రోల్ పోసిన ఘటనపై వరుదు కళ్యాణి విచారం వ్యక్తం చేశారు.ఈ దుర్ఘటనపై వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ఆడపిల్లల ప్రాణాలు గాలిలో దీపంలా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా, సీఎం , డిప్యూటీ సీఎం, హోం మంత్రి, డీజీపీ ఉన్నారా? లేరా? అని ప్రశ్నించారు.ప్రతి రోజూ మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆడపిల్లను పెట్రోల్ పోసి చంపితే ఎందుకు ఆ కుటంబాన్ని ఎందుకు పరమర్శించలేదు. కూటమికి ఎందుకు ఓట్లు వేశామా అని మహిళలు భాద పడుతున్నారు. రాష్ట్రంలో ఆన్ పిట్ హోం మంత్రి ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం కలుగుతుంది. మహిళపై హత్యలు అగయిత్యాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబు, హోం మంత్రి సంతాపాలు తెలిపి చేతులు దులుపుకున్నారు.వీకెండ్ అయితే చాలు పక్క రాష్ట్రాలకు సీఎం, డిప్యూటీ సీఎం వెళ్ళిపోతున్నారు. దిశా యాప్ ఉంటే మహిళపై దాడులు జరిగేవి కాదు. రాజకీయ దురుద్దేశంతో దిశా యాప్ పోలీస్ స్టేషన్లను నిర్విర్యం చేశారు. ఆడపిల్లను బైటకు పంపాలంటే తల్లి దండ్రులు భయపడుతున్నారు. -
టీడీపీ నేతల సంపద పెంచేందుకే కొత్త మద్యం పాలసీ..
-
ఇంత దారుణం జరిగినా చీమకుట్టినట్లైనా లేదా బాబూ?: వరుదు కల్యాణి
సాక్షి, విశాఖపట్నం: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో అత్తా, కోడళ్లపై లైంగిక దాడి ఘటనపై వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి స్పందించారు. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించారు. సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంత దుర్మార్గమైన ఘటన జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు.ఇంత దారుణం జరిగినా ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి, కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి భరోసా కల్పించలేకపోవడం శోచనీయమన్నారు. మచ్చుమర్రి ఘటనతో సహా రాష్ట్రంలొ రోజుకొక దారుణం జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్న వరుదు కళ్యాణి.. మహిళల రక్షణకు కనీస చర్యలు తీసుకోవడంలో పూర్తిగా కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు.గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణకు రూపొందించిన దిశ యాప్, దిశ చట్టాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా రాష్ట్రంలో మహిళలు స్వేచ్ఛగా బయట తిరిగే పరిస్థితులు లేకపోగా.. హిందూపురం ఘటనతో ఇంట్లో ఉన్నా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూపురం ఘటనలో అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: సునీల్ పోస్టులో తప్పేముంది?.. ఏపీ సర్కార్‌పై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్ -
ఏపీలో మహిళలకు భదత్ర ఏది?: వరుదు కల్యాణి
సాక్షి, విశాఖపట్నం: ఏపీ అరాచక ఆంధ్రప్రదేశ్‌గా మారిందని.. వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలనలో రోజు రోజుకు రాష్ట్రంలో మహిళలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మహిళలు శవాలై తేలుతున్నాయన్నారు.‘‘పుంగనూరులో అంజుమ్ అనే బాలిక హత్యకు గురైంది. ఇంతవరకు దోషులను పట్టుకోలేదు. చంద్రబాబు ఎందుకు బాలిక కుటుంబాన్ని పరామర్శించలేదు. చంద్రబాబు పాలనలో చిత్తు కాగితానికి ఉన్న విలువ మహిళకు లేదా?. హోం మంత్రి అనితా నియోజకవర్గంలో మహిళను వివస్త్రను చేసి టీడీపీ నాయకులు దాడి చేశారు. ఆడ పిల్లల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం ఏం చేసింది? ఐదు నెలల చిన్న పిల్లలపై కూడా లైంగికదాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మహిళలు పై జరుగుతున్న హత్యలు, లైంగికకదాడులపై ఎందుకు పవన్ ప్రశ్నించలేదు’’ అంటూ వరుదు కల్యాణి నిలదీశారు.ఇదీ చదవండి: కట్టుకథల బాబూ.. విష ప్రచారం ఆపు: కురసాల కన్నబాబు -
స్వతంత్ర దర్యాప్తుతో వాస్తవాలు తెలుస్తాయి
-
కొత్త మద్యం పాలసీ.. చెత్త పాలసీ
-
బాబు కొత్త మద్యం పాలసీ పై వరుదు కళ్యాణి సెటైర్లు
-
వీడియోల లీక్ ఘటనలో నిందితుడు పవన్ కళ్యాణ్ అభిమాని
-
45 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక..
-
హామీల అమలు ఎప్పుడు?
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తుందో చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. 18 నుంచి 60 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల హామీల అమలు కోసం వారంతా ఎదురుచూస్తున్నారన్నారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు.హామీల అమలుకు కార్యాచరణ ఏదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెలవుతోందని.. పథకాల అమలు ఎప్పుడని నిలదీశారు. ప్రభుత్వ ధోరణి చూస్తుంటే పరిపాలన మీద కంటే కక్ష సాధింపులపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు అర్థమవుతోందన్నారు. రెడ్ బుక్ అమలు మీద కంటే హామీల అమలు మీద దృష్టి పెట్టాలని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కళ్యాణి ఇంకా ఏమన్నారంటే.. 2014లోనూ ఇలాగే మాటతప్పారు..కూటమి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా రైతులకు రుణమాఫీ, మహిళలకు డ్వాక్రా రుణమాఫీ చేయలేదు. 2016 నుంచి సున్నా వడ్డీ ఆపేశారు. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు ఇస్తామని ఇవ్వలేదు.మహిళల సొంతింటి కల నెరవేరుస్తామని ఆ హామీనీ నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం మహిళల్లో పెన్షన్‌దారులను తీసేస్తే ఈ పథకానికి అర్హత ఉన్న మహిళలు 1.72 కోట్ల మంది ఉన్నారు. ప్రభుత్వం నిజంగా ఈ పథకాన్ని అమలు చేస్తుందా, లేదా అని అందరికీ అనుమానం కలుగుతోంది. ఆయా పథకాల చెల్లింపులేవి?మా ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్.. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, విద్యాదీవెన, వసతి దీవెన, పెన్షన్లు అన్నీ ఠంచనుగా ప్రకటించిన తేదీనే ఇచ్చారు. చివరలో చేయూత కోసం రూ.4 వేల కోట్లు సిద్ధం చేసి ఉంచారు. అయితే ఆ డబ్బులను మహిళల ఖాతాల్లో వేయనీయకుండా టీడీపీ అడ్డుకుంది. జగనన్న ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ పాటికే డబ్బులు జమై ఉండేవి. ఆ నగదును వెంటనే ప్రభుత్వం మహిళల ఖాతాల్లో వేయాలి. మా ప్రభుత్వంలో అమ్మఒడి కింద ఏటా 44.5 లక్షల మంది మహిళలకు ఐదేళ్లలో రూ.25,809 కోట్లు ఇచ్చాం. స్కూలుకు వెళ్లే ప్రతి బిడ్డకూ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. దాదాపు రాష్ట్రంలో కోటి మందికి పైగా స్కూలుకు వెళ్తున్న పిల్లలున్నారు. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. అలాగే విద్యాదీవెన, వసతి దీవెన నిధులను ఇవ్వకపోవడంతో విద్యార్థులు అప్పులు చేసి స్కూళ్లు, కళాశాలల ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. అన్నదాతలు అప్పులపాలుజగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.13,500 చొప్పున 50 లక్షల మందికి పైచిలుకు రైతుల ఖాతాల్లో జమ చేశారు. చంద్రబాబు ఏటా రూ.20 వేలు రైతులకు ఇస్తామని చెప్పారు. ఖరీఫ్ ప్రారంభమైపోయినా ఇంతవరకు రైతులకు పెట్టుబడి సాయం అందని దుస్థితి. దీంతో నూటికి రూ.10, రూ.20 వడ్డీలకు అప్పులు తెచ్చి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. అలాగే ప్రతి మహిళకు ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని కూటమి నేతలు చెప్పారు. రాష్ట్రంలో 2.5 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోసం చూస్తున్నారు. అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.. ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారు. ఇవన్నీ నెరవేర్చడానికి నిర్దేశిత తేదీలు ప్రకటించి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. -
దుశ్శాసనపర్వంపై హోం మంత్రి చర్యలేవి?
సాక్షి, అనకాపల్లి: హోం మంత్రి అనిత సొంత నియోజకవర్గమైన పాయకరావుపేటలోని కోటవురట్లలో చేనేత కారి్మకులైన ఇద్దరు మహిళలపై టీడీపీ మూకలు దాడిచేస్తే వారిపై చర్యల్లేవని.. దీనిపై అనిత సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. ఆమె సోమవారం కోటవురట్లలో మీడియాతో మాట్లాడారు. దాడి చేసిందే కాకుండా వారిపై కేసులు కూడా నమోదు చేశారంటే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలా ఉందో అర్థమవుతోందన్నారు.హోం మంత్రిగా అనిత బాధ్యతలు తీసుకున్న వెంటనే కోటవురట్ల మండలంలో ఇద్దరు మహిళల మీద తెలుగుదేశం కార్యకర్తలు దారుణంగా దాడిచేయడమే కాకుండా వాళ్ల బట్టలు చించి బండబూతులు తిట్టారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు.. మహిళలపై ఎవరైనా చేయివేస్తే వారి తాటతీస్తామని ప్రగల్భాలు పలికిన హోం మంత్రికి ఈ దాడి కనిపించలేదా? అని ప్రశ్నించారు.మీది మాటల ప్రభుత్వమేనా.. చేతల ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో దళిత మహిళను వివస్త్రను చేసి దాడిచేసిన పరిస్థితులు చూశామని, మళ్లీ అదే దుశ్శాసన ప్రభుత్వం వచ్చిందని మహిళలంతా భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పాలనపై, మహిళల రక్షణపై దృష్టి సారించాలని.. వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాలను ఎలా కూల్చేయాలి? వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఎలా దాడిచేయాలనే ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. బాలికపై లైంగిక దాడి కేసులో అలసత్వం బీచ్‌రోడ్డు (విశాఖ): విశాఖ మధురవాడలో ఐదేళ్ల బాలికపై లైంగికదాడి జరిగితే ఆ కేసును నీరుగార్చే విధంగా విచారణ చాలా నెమ్మదిగా సాగుతోందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. ఆమె సోమవారం విశాఖపట్నంలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రానున్న రోజుల్లో ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే చర్యలు వేగంగా తీసుకోవాలని సూచించారు. బాధితులకు ప్రభుత్వం ఆరి్థక సహాయాన్ని తక్షణమే అందించాలని ఆమె డిమాండ్ చేశారు. -
సీఎం జగన్ పాలనలోనే అన్ని వర్గాలకు మంచి జరిగింది
-
మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు: వరుదు కల్యాణి
సాక్షి, విశాఖపట్నం: డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మోసం చేసింది సైకో చంద్రబాబు కాదా? అంటూ ప్రశ్నించారు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మీ ఐదేళ్ల పాలనలో వడ్డీ లేని రుణాలు ఎత్తేసింది మర్చిపోయావా బాబూ?. ఇప్పుడు కొత్తగా రూ.10లక్షల రుణాలిస్తానంటే నమ్మడానికి మహిళలు సిద్ధంగా లేరు. మీరు ఎగ్గొట్టిన రూ.25,500 కోట్ల డ్వాక్రా రుణమాఫీని జగనన్నఇచ్చారు. ప్రతి మహిళ గర్వంగా చెప్పుకునే మహిళా పక్షపాత ప్రభుత్వం జగనన్నదేనన్నారు.ఆమె ఇంకా ఏమన్నారంటే..అబద్ధానికి ఫ్యాంటు షర్టు వేస్తే అది చంద్రబాబేతెలుగుదేశం పార్టీకి ఇవే చివరి ఎన్నికలు.. ఇదే చివరి మేనిఫెస్టోమహిళా ద్రోహి, మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబుఉత్తరాంధ్రలో చంద్రబాబు మహిళా సదస్సులంటూ వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేశారుఆయన మహిళల కోసం ఏదో చేశారట..మహిళా పక్షపాతి అని చెప్పుకొచ్చాడుఅతని మాటలు విని మహిళలు నవ్వుకుంటున్నారు. ఇంతటి పచ్చి అబద్ధాలు కూడా చెప్తారా అని నవ్వుకుంటున్నారుఈ రాష్ట్రంలో మహిళా ద్రోహి, మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబుకోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ మహిళలను కించపరిచిన వ్యక్తి చంద్రబాబుఈయన అధికారంలోకి వస్తే పది లక్షల వడ్డీలేని రుణాలు ఇస్తారటమరి, 2014–19 మీ పాలనలో వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పి 2016 అక్టోబర్ నుంచి వడ్డీ లేని రుణాలు ఎత్తేసినది మర్చిపోయారా?దీని వల్ల ఏ, బీ గ్రేడ్లలో ఉన్న డ్వాక్రా సంఘాలు సీ, డీ గ్రేడ్లకు పడిపోయాయి!డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మహిళలను మోసం చేసి ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయకుండా వారిని అప్పుల పాలు చేసింది మీరు కాదా?మీరు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ల చరిత్రలో ఒక్కటంటే ఒక్కటి మహిళల కోసం చెప్పుకోదగ్గ పథకం ఏదైనా ఉందా? రూ.14,204 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మోసం చేసిన సైకో మీరు కాదా?దీనివల్ల, డ్వాక్రా మహిళలు రూ.3వేల కోట్ల అపరాధ వడ్డీ బ్యాంకులకు కట్టే పరిస్థితికి తెచ్చింది చంద్రబాబేఆడ బిడ్డ పుడితే రూ.25 వేలు ఇస్తానన్న మీరు ఒక్కరికైనా ఇచ్చారా?గర్భిణీ స్త్రీలకు రూ.10 వేలు ఇస్తానని చెప్పి మోసం చేసింది చంద్రబాబేఇన్ని మోసాలు చేసి మళ్లీ ఏ మొహం పెట్టుకుని మహిళలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు?మా జగనన్న ఇచ్చినట్లు 44 లక్షల మందికి అక్కచెల్లెమ్మలకు అమ్మ ఒడి పథకం మీరు ఎందుకు అమలు చేయలేకపోయారు?80 లక్షల మంది డ్వాక్రా మహిళకు అసరా ఇచ్చి ఆదుకున్న మనసున్న నాయకుడు జగనన్నఆనాడు మీరు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని ఎగ్గొడితే, జగనన్న రూ.25,500 కోట్ల డ్వాక్రా సంఘాల రుణాలను ఆసరా ద్వారా నాలుగు విడతలుగా ఇచ్చారుచేయూత ద్వారా 45–60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు రూ.19వేల కోట్లు మహిళల అకౌంట్లలో వేసి వాళ్లకాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేశారుమహిళలకు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. మీరెందుకు చేయలేకపోయారు?22 లక్షల ఇళ్లు మహిళల పేరున కట్టిస్తున్నారు. మీరెందుకు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి మహిళల పేరుతో ఇళ్లు కట్టలేదు?అన్ని జగనన్న చేస్తే ఇప్పుడు మీరొచ్చి ఏదో చేస్తానంటూ మభ్యపెడుతున్నారు. మీది మేనిఫెస్టో కాదు..‘మాయా’ఫెస్టో..!:మేనిఫెస్టోను వెబ్సైట్లోంచే తీసేసిన మీరు ఇప్పుడు మినీ మేనిఫెస్టో అంటూ ప్రజల ముందుకు వచ్చారుఆ మినీ మేనిఫెస్టోలో అన్నీ కాపీ పేస్ట్ పథకాలే. అది మేనిఫెస్టో కాదు..‘మాయా’ఫెస్టోఅబద్దానికి ఫ్యాంటు షర్టు వేస్తే చంద్రబాబు. చీటింగ్‌కు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబుమేనిఫెస్టోను జగనన్న బైబిల్,ఖురాన్, భగవద్గీతగా భావించి ఇచ్చిన హామీల్లో మేజర్ లబ్ధిదారులు మహిళలేమీ మేనిఫెస్టోలో సొంతగా ఒక్క పథకం కూడా పెట్టుకోలేని దుస్థితి మీదిమీరిచ్చిన సూపర్ సిక్స్‌లో మూడు మా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేమిగిలిన మూడింటిలో రెండు కర్నాటక కాంగ్రెస్ పథకాలు కాపీ కొట్టాడుమరొకటి కర్నాటకలో బీజేపీ ఇచ్చిన హామీల్లోంచి ఒక పథకం తీసుకుని కాపీ కొట్టారుమీరు కాపీ క్యాట్‌లా ప్రవర్తిస్తున్నారు తప్ప మహిళల కోసం సొంతగా ఒక పథకం కూడా ఆలోచన చేయలేకపోతున్నారుఇలాంటి మీరు మహిళలకు ఏదో చేస్తారంటే మిమ్మల్ని ఎలా నమ్ముతారు?ఐదేళ్లలో ఈయన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడట. మెగా డిఎస్సీపై తొలి సంతకం చేస్తాడట2014–19 మధ్య ఇదే కూటమి పరిపాలన చేసింది. అప్పుడు చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో గుర్తుందా?కేవలం 34వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చాడు. అలాంటిది 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారటడిఎస్సీ కాదు కదా..ఏ ఒక్క ఉద్యోగం కూడా మీరు ఇవ్వలేదన్న విషయం ఆంధ్ర రాష్ట్ర యువత మర్చిపోలేదుఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2వేల నిరుద్యోగ భృతి అని చెప్పి యువతను మోసం చేశారుఈ ఐదేళ్లలో జగనన్న 2.31 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలతో కలిపితే 6.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చారురాష్ట్రంలో ఒక ఉద్యోగ విప్లవాన్నే జగనన్న కల్పించారువైద్య ఆరోగ్య రంగంలో ఖాళీ అనేది ఉండకూడదని పూర్తి స్థాయిలో 54 వేల నియామకాలు చేపట్టారుపోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు 6,511 ఉద్యోగాలు ఇచ్చారుప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం వల్ల 52 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులయ్యారుమీరా ఉద్యోగాల గురించి మాట్లాడేది?మీరు 2018లో ఎన్నికల స్టంట్‌గా ప్రకటించిన డిఎస్సీ ఉద్యోగాలు కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక భర్తీ చేశారు. వీధికో బెల్ట్ షాపుతో మద్యం ఏరులై పారింది మర్చిపోయారా బాబూ..?మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో వీధికో బెల్ట్ షాపుల రూపంలో మద్యం ఏరులై పారింది.జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 4,500 మద్యం షాపులను 3వేలకు తగ్గించారుపర్మిట్ రూమ్స్‌ను కూడా పూర్తిగా తొలగించారు. 43 వేల బెల్ట్ షాపులను పూర్తిగా క్లోజ్ చేశారుమీ హయాంతో పోలిస్తే 40 శాతం మద్యం అమ్మకాలను మా ప్రభుత్వం తగ్గించింది.మీ హయాంలో రాష్ట్రాన్ని గంజాయి అడ్డాగా మార్చారు. మీ హయాంలో కేబినెట్ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావే ఆనాడు ఈ విషయాన్ని చెప్పారు.స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేసి గంజాయిని ఉక్కు పాదంతో అణచివేసిన పరిస్థితి మీకు తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన అవకాశాలకు మిన్నగా జగనన్న ఇచ్చారుచంద్రబాబు హయాంలో మహిళలకు రక్షణ లేక ఎంతో మంది మహిళలు మాన ప్రాణాలు కోల్పోయారువైఎస్జగన్ గారు సీఎం అయిన తర్వాత దిశ యాప్,ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చి, ప్రతి ఆడపిల్లకు రక్షణగా ఉన్నారుదిశ చట్టం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నా, దాని ప్రకారం మహిళల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం మాదిమహిళలు ముఖ్యమంత్రులుగా చేసిన రాష్ట్రాల్లో కంటే మిన్నగా జగనన్న ఇక్కడ చేశారురాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే జగనన్న ఎక్కువ అవకాశాలు ఇచ్చారుజగనన్న ముఖ్యమంత్రి అయ్యాక రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో మహిళల్ని కూర్చోబెట్టారుమహిళలకు నామినేషన్ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఇవ్వాలని ఏకంగా చట్టమే చేశారుఆడబిడ్డకు కన్నవారు ఇవ్వని ఆస్తి 31 లక్షల ఇళ్ల పట్టాల ద్వారా జగనన్న ఇచ్చారని ప్రతి మహిళ అనుకుంటోందిప్రతి మహిళ గర్వంగా చెప్పుకునేలా మహిళా పక్షపాత ప్రభుత్వం అందించింది జగననేటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు- ఇదే చివరి మేనిఫెస్టోతెలుగుదేశం పార్టీకి ఇవే చివరి ఎన్నికలు..ఇదే చివరి మేనిఫెస్టో..ఇవే చివరి అబద్ధాలు కూడాచంద్రబాబు ఎంత మభ్యపెట్టాలని చూసిన ఈ రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలంతా జగనన్నకు జై కొట్టడానికి సిద్ధంగా ఉన్నారుప్రతి మహిళా ఆత్మగౌరవంతో బతికే పరిస్థితిని జగనన్న కల్పించారురాజకీయంగా కూడా జనరల్ కేటగిరీ స్థానాల్లో సైతం మహిళలను కూర్చోబెట్టి వారిని ఉన్నతంగా నిలిపారుతన అన్న ముఖ్యమంత్రి అయితే ఎంత రక్షణగా ఉంటారో, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అవుతారో జగనన్న పాలనలో మహిళలు అలా ఉన్నారుఅందుకే మహిళలంతా మళ్లీ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నారుదానికి నిదర్శనంగానే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మహిళలు జగనన్నను పెద్ద ఎత్తున ఆశీర్వదించారు. -
విశాఖపట్నంలో మరో సముద్రం జననేతకు అడుగడుగునా జన నీరాజనం
-
పెన్షన్‌దారుల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది: వరుదు కళ్యాణి
-
ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి: వరుదు కళ్యాణి
-
అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల జీవితాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలుగులు నింపారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత తెలిపారు. జగనన్న గెలుపు.. ఈ రాష్ట్రంలోని మహిళల గెలుపు.. అని ఆమె అన్నారు. సంక్షేమ పథకాల్లో లబ్ధిపొందిన వారిలో బీసీ మహిళలే అధికమని.. అన్ని రంగాల్లో మహిళలకు సీఎం జగన్ అగ్రస్థానం కల్పించారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాళ్లు, ఎమ్మెల్సీలు పోతుల సునీత, వరుదు కల్యాణి, పార్టీ సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పోతుల సునీత మాట్లాడుతూ ‘అమ్మఒడి, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం, దిశ యాప్, మహిళా పోలీసు.. ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగని విధంగా మన పార్టీ అధ్యక్షుడు సీఎం అయ్యాకే తీసుకొచ్చారు. ఇవన్నీ ప్రతి అక్కచెల్లెమ్మకు కొనసాగాలంటే జగనన్న ప్రభుత్వానికి అండగా ఉండాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రతి ఓటరుకు చెప్పాలి.’ అని పేర్కొన్నారు. ప్రతీ మహిళా స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేయాలి: వరుదు కళ్యాణి వరుదు కళ్యాణి మాట్లాడుతూ ‘ఈ ఐదేళ్లలో డీబీటీ ద్వారా రూ.2.55లక్షల కోట్లు పేదల ఖాతాల్లో సీఎం జగన్ జమచేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇలా ఎప్పుడైనా చేశారా? సీఎం జగన్ మహిళా పక్షపాతి. ఇవాళ రాష్ట్రంలోని ఏ గ్రామానికి వెళ్లినా ఓ విలేజ్ సెక్రటేరియట్, విలేజ్ క్లినిక్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. వీటన్నింటిలో ఎక్కువ ఉద్యోగాలు పొందింది మహిళలే. నాడు–నేడుతో కొత్తరూపు సంతరించుకున్న బడులు, ఆస్పత్రులూ కనిపిస్తాయి. ఇవన్నీ ఈ 57 నెలల కాలంలోనే సీఎం వైఎస్ జగన్ చేశారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. ప్రతి మహిళ ఒక స్టార్ క్యాంపెయినర్ అయి వచ్చే ఎన్నికల్లో పనిచేయాలి.’ కోరారు. ఎన్నికల్లో ప్రచారం కోసం రాజీనామా చేశా: వాసిరెడ్డి పద్మ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని కోట్లాదిమంది మహిళలు హారతి పడుతూ సీఎం వైఎస్ జగన్‌కు బిగ్ థాంక్స్ చెబుతున్నాం. కుటుంబంలో ఎవరూ ఇవ్వని సమానత్వం సీఎం జగన్ ఇచ్చారు. మహిళల పేరిట ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇలా ప్రతి పథకంలోనూ మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యతతో వారికి గుర్తింపు, సమానత్వం వచ్చింది. ‘వై నాట్ 175’ అనే సీఎం జగన్ నినాదాన్ని నిజంచేసే శక్తి మహిళలకు ఉంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ప్రచారం చేయడానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశాను.’ అని వివరించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం నాయకురాళ్లు అమ్మాజీ, బండి పుణ్యశీల, బెందాళం పద్మావతి, డాక్టర్ శశికళ, భవానీ, నాగమణి, సంపత్ విజితా, ఏబీ రాణి, రజనీ, డాక్టర్ షమా సుల్తానా, మాధవీ వర్మ, రాజేశ్వరి, పార్టీ ఉపాధ్యక్షులు, జోనల్ కమిటీ చైర్మన్లు, మహిళా అడ్వొకేట్లు తదితరులు పాల్గొన్నారు. -
నీపేరు "ప్యాకేజీ" కళ్యాణ్ మీ పార్టీ "చంద్రసేన" ఇది అందరికీ తెలిసిందే కదా
-
షర్మిలా.. నిజాలు మాట్లాడడం నేర్చుకో
అల్లిపురం (విశాఖ దక్షిణ) : వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత వైఎస్సార్ పేరును ఆయన మరణం తరువాత ఎఫ్ఐఆర్లో చేర్చి అవమానించిన కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావని పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించడమే కాకుండా ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా తయారుచేసిన కాంగ్రెస్, టీడీపీలతో జతకట్టి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. వాస్తవాలు మాట్లాడడం షర్మిల నేర్చుకోకపోతే రానున్న కాలంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె హెచ్చరించారు. విశాఖలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. పొరుగు రాష్ట్రం నుంచి ఇక్కడకు వచ్చి ప్రభుత్వంపై అవాస్తవాలు మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు. ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థను యావత్తు దేశమే పొగుడుతుంటే షర్మిల సచివాలయ వ్యవస్థపై బురదజల్లేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని.. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల మధ్య తేడా కూడా తెలియకుండా మాట్లాడడం ఆమె అవగాహనారాహిత్యమని వరుదు కళ్యాణి విమర్శించారు. ఎక్కువ ఉద్యోగాలిచ్చింది వైఎస్సార్సీపీ సర్కారే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో 2 లక్షల 14 వేల శాశ్వత ఉద్యోగాలు, 6 లక్షల 30 వేలకు పైగా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పించామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా.. 2008లో డీఎస్సీ నోటిఫికేషన్లో ఆగిన ఉద్యోగాలను కూడా తమ ప్రభుత్వంలో భర్తీ చేశామన్నారు. యువతకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వమన్నారు. కనీస అవగాహనలేకుండా ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతున్న షర్మిల తన సొంత కుటుంబాన్ని వేధించిన వారితోనే జతకట్టడానికి సిగ్గులేదా అని ఆమె ప్రశ్నించారు. -
చంద్రబాబుపై భువనేశ్వరి వ్యాఖ్యలు వరుదు కళ్యాణి రియాక్షన్
-
టీడీపీ భూ కబ్జాలపై చర్చకు సిద్ధం
-
గవర్నర్ ని చులకన చేసిన టీడీపీ నాయకులపై నిప్పులు చెరిగిన వరుదు కళ్యాణి
-
సింహంతో వేట జగనన్నతో ఆట అంత ఈజీ కాదు
-
అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి స్ట్రాంగ్ కౌంటర్
-
బీసీలను చంద్రబాబు బెదిరించినప్పుడు మీరు ఎక్కడ వున్నారు?: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ సాధికార బస్సు యాత్రకు విశేష స్పందన వస్తోందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసి టీడీపీకి వెన్నులో వణుకు పుడుతోందన్నారు. బీసీల తోకలు కట్ చేస్తానని చంద్రబాబు.. బీసీలను అవమానించారన్నారు. అసలు బీసీల గురించి మాట్లాడే హక్కు అచ్చెన్నాయుడికి వుందా?. టీడీపీ బీసీ మంత్రులు జయం జయం చంద్రన్న అంటూ భజన చేశారు. బీసీలను చంద్రబాబు బెదిరించినప్పుడు మీరు ఎక్కడ వున్నారు?. రాజ్యసభకు మీ పార్టీ ఎవరినైనా పంపించిందా ?. బీసీ జడ్జిలు వద్దని చంద్రబాబు లేఖ రాసినప్పుడు మీరు ఎక్కడ వున్నారు? అంటూ కల్యాణి ప్రశ్నించారు. ‘‘టీడీపీకి 175 స్థానాల్లో అభ్యర్థులు లేక జనసేన, బీజేపీ, మిగిలిన పార్టీల కాళ్లు పట్టుకుంటున్నారు. బీసీల అభివృద్ధికి కులగణన అవసరం అంటే.. టీడీపీ ఎందుకు అడ్డుకుంటుంది. రాజ్యాంగ సూచనకు మించి ఏపీలో బీసీలకు మేలు జరిగింది. బీసీలకు సీఎం జగన్ బ్యాక్‌బోన్‌గా నిలిచారు’’ అని వరుద కళ్యాణి అన్నారు. చదవండి: బోగస్ ఇన్వాయిస్లతో ‘స్కిల్’ నిధులు స్వాహా -
మోసపూరిత హామీలిచ్చి చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు
-
నారా భువనేశ్వరిపై ఎమ్మెల్సీ కళ్యాణి సెటైర్లు..
-
భువనేశ్వరిని ఏకిపారేసిన వరుదు కళ్యాణి
-
బండారు సత్యనారాయణ అరెస్ట్ పై వరుదు కళ్యాణి కామెంట్స్
-
రోజాపై అనుచిత వ్యాఖ్యలపై బండారును ప్రశ్నించిన పోలీసులు
-
నారా బ్రాహ్మణికి చెంప చెళ్లుమనిపించే సమాధానం ఇచ్చిన ఎమ్మెల్సీ కళ్యాణి
-
భువనేశ్వరి వ్యాఖ్యలకు వరుదు కళ్యాణి కౌంటర్
-
పవన్‌వి అర్థం లేని మాటలు
మద్దిలపాలెం (విశాఖ తూర్పు)/సాక్షి, అమరావతి/ఆరిలోవ (విశాఖ తూర్పు): రుషికొండ చూడడానికి వెళ్లి పవన్‌కళ్యాణ్ అక్కడ జరుగుతున్నవి అక్రమ నిర్మాణాలని, అక్కడ స్థలాలను కబ్జాచేశారని, ఈ నిర్మాణాలకు అనుమతులెవరు ఇచ్చారని అర్థంపర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ కట్టడాలు అధికారికంగా కడుతుంటే ఎవరి అనుమతి తీసుకుంటారని, ఈ మాత్రం జ్ఞానంలేకుండా పవన్‌కళ్యాణ్ అవివేకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజారంజకమైన పాలనతో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్న సీఎం జగన్ చర్మిషాను చూసి పవన్ విద్వేషంతో రగిలిపోతున్నారన్నారు. విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో ఆదివారం మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. రుషికొండ మీద నిర్మిస్తున్న భవనాలలో సీఎం కార్యాలయాన్ని గానీ, ప్రభుత్వ కార్యాలయాలను గాని వినియోగించే అవకాశాలున్నాయి. సీఎం విశాఖపట్నం రావడానికి ఎలాంటి బిల్లు అవసరంలేదు. విశాఖ నుంచి పాలన చేస్తాననే మాటకు ఆయన కట్టుబడి ఉన్నారు. త్వరలో సీఎం విశాఖకు రానున్నారు. ఇక రుషికొండలో షరతులను ఎక్కడా ఉల్లంఘించకుండా అన్ని అనుమతులతో చేపడుతున్నవే. రామానాయుడు స్టూడియో, వేంకటేశ్వరస్వామి ఆలయం, ఐటీ కంపెనీలు కొండలపైన కట్టినవే. ఇవన్ని అభివృద్ధిలో భాగమే. భూమి లభ్యత తక్కువున్న ప్రాంతాల్లో కొండలపై ఇటువంటి భవనాలను నిర్మించడం సర్వసాధారణం. ఈ విషయం పవన్‌కు తెలీకపోవడం దురదృష్టకరం. రామోజీ ఫిల్మ్‌సిటీ, మీ అన్నగారు చిరంజీవి ఇళ్లు కొండ మీద కట్టలేదా? వీటన్నింటికి లేని అభ్యంతరాలు రుషికొండపై ప్రభుత్వ భవనాలు కడితే వచ్చిందా? బాబు అజెండాను మోస్తున్న పవన్ చంద్రబాబు కోసం కోతిలా ఎగురుతున్న పవన్‌కళ్యాణ్ తెలుగుదేశం హయాంలో జరిగిన అక్రమాలను ఆ పార్టీ నాయకులే బయట పెట్టినప్పడు ఎందుకు నోరు విప్పలేదు? నది ఒడ్డున చంద్రబాబు ఇల్లు కట్టుకున్నప్పుడు పవన్ కళ్లు కనబడలేదా? నిజానికి.. పవన్ తన జెండాను పక్కనపెట్టి చంద్రబాబు అజెండాను మోస్తున్నారు. విశాఖ నగరంలో లక్షన్నర మంది పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తే దానిని అడ్డుకునేందుకు చంద్రబాబు కేసులు వేశారు. దీనిపై పవన్ ఎందుకు చంద్రబాబుని ప్రశ్నించలేదు? అసలు ఆయనకు సరైన పొలిటకల్ స్టాండ్లేదు. మంత్రిగా వాస్తవాలను చెప్తే వేయరా?: రోజా మరోవైపు.. మంత్రి రోజా ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు కడుతుంటే.. మధ్యలో పవన్, చంద్రబాబుకు వచి్చన బాధేంటని ఆమె అందులో ప్రశ్నించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. రుషికొండ వద్ద ఏం నిర్మిస్తున్నామన్న విషయాన్ని శనివారం అధికారికంగా మీడియా సమావేశంలో వివరించా. కానీ, ఈనాడు సహా టీడీపీ అనుకూల పత్రికలు, టీవీలు ఈ నిజాలను ప్రజలకు చెప్పలేదు. అందుకే మరోసారి స్పష్టతనిస్తున్నాను. రుషికొండలోని భూమి ప్రభుత్వ భూమి. పర్యాటక శాఖకు సంబంధించిన భూమి అది. ఇక్కడ పర్యాటక శాఖకు 69 ఎకరాల భూమి ఉంది. ఇందులో 9.88 ఎకరాల్లో నిర్మాణాల కోసం ప్రభుత్వానికి అనుమతులిచ్చారు. ఇందులో కూడా మేం కడుతున్నది కేవలం 2.7 ఎకరాల్లోపే. ఏడు భవన నిర్మాణాలకు అనుమతులొస్తే కేవలం నాలుగు భవనాలు మాత్రమే నిర్మిస్తున్నారు. అదికూడా జీ ప్లస్ వన్ మాత్రమే. రుషికొండ నిర్మాణాలపై హైకోర్టు వేసిన కమిటీ అన్నింటినీ పరిశీలించి, తనిఖీచేసి రిపోర్టు కూడా ఇచ్చింది. హైకోర్టు ఏమైనా సూచనలు చేస్తే వాటిని కూడా పాటిస్తాం. ప్రజాప్రతినిధిగా ఏ హోదాలేని వాడు, కనీసం వార్డు మెంబర్ కూడా కాని పవన్ మాటలను పెద్దపెద్దగా ప్రచారం చేస్తారా? ఆయన ఊగుడు చూస్తుంటే త్వరగా మెంటల్ ఆస్పత్రిలో చేరేట్లు ఉన్నాడు. పవన్ ఓ ఫ్లవర్‌స్టార్: వరుదు కళ్యాణి విశాఖపట్నం రుషికొండ వద్ద ఉన్న గీతం వర్సిటీ ఆక్రమించిన ప్రభుత్వ భూములు కనిపించడం లేదా? అని పవన్‌ను ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. నగర పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ. రుషికొండపై ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తే పర్యావరణం దెబ్బతింటుందని తప్పుపడుతున్నారని, అయితే దీనికి ఎదురుగా ప్రభుత్వ భూమిని ఎకరాలకొద్దీ ఆక్రమించిన లోకేశ్ తోడల్లుడు భరత్‌కు చెందిన గీతం వర్సిటీ గురించి, ఓ కొండపై పూర్తిగా పచ్చదనం నాశనం చేసి నిర్మించిన రామానాయుడు స్టూడియో గురించి పవన్ ఎందుకు మాట్లాడటంలేదో చెప్పాలన్నారు. తన పర్యటనల్లో పవన్ చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆమె అన్నారు. పవన్ నడుపుతున్నది జనసేన కాదు.. చంద్రసేన అంటూ వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. ఆయన సినిమాల్లో పవర్‌స్టారే కావచ్చు.. కానీ, రాజకీయాల్లో మాత్రం ఫ్లవర్‌స్టార్ అని వ్యాఖ్యానించారు. పెందుర్తిలో మరణించిన వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన పవన్.. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారన్నారు. వలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్ అని అనడానికి ఆయనకు నోరెలా వచ్చిందన్నారు. ఇక హిందూపురంలో జనసేన నేత ఓ వ్యక్తిపై దాడిచేసి 16 తులాల బంగారు ఆభరణాలు దోచేశాడని, ఈ ఘటనతో జనసేన నేతలు హత్యలు, దోపిడీలు చేస్తారని ఒప్పుకుంటావా? అని ఆమె ప్రశ్నించారు. -
ఉన్నదంతా అమ్మేశారు, పీకల్లోతు అప్పులు.. కల్యాణి విడాకులకు కారణమిదే!
పసివాడి ప్రాణం సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సుజిత తర్వాత సినిమాలు, సీరియల్స్‌లోనూ నటించి పెద్ద నటిగా ఎదిగింది. ఎంతో సాంప్రదాయంగా రెడీ అయ్యే సుజిత అన్నయ్య సూర్యకిరణ్ కూడా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ సత్తా చాటిన ఈయన బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో పాల్గొన్న వారం రోజులకే ఎలిమినేట్ అయ్యాడు. ఈయన నటి కల్యాణిని పెళ్లి చేసుకుని కొన్నేళ్లకే ఆమెకు విడాకులిచ్చాడు. తాజాగా వీరి విడాకులకు గల కారణాన్ని సుజిత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. 'అన్నయ్యకు పెళ్లయిన మూడేళ్లకే నాకు వివాహం జరిగింది. నేను ఎక్కువగా షూటింగ్‌లోనే ఉండేదాన్ని. అప్పుడప్పుడు అన్నయ్యతో ఫోన్ మాట్లాడేదాన్ని. హైదరాబాద్‌కు షూటింగ్‌కు వచ్చినప్పుడు మాత్రం తనను నేరుగా కలిసేదాన్ని. వదిన (కల్యాణి) అప్పటికే తెలుగు ఇండస్ట్రీలో గొప్ప నటి. తనతో మాట్లాడటం, తనతో ఉండటం నాకు చాలా ఇష్టం. అక్కాచెల్లెళ్లు ఎలా ఉండేవారో మేమిద్దరం అలా ఉండేవాళ్లం. అయితే ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువకాలం ఉండకూడదు. అటువంటి ఇబ్బందులు వస్తే దాన్ని బ్యాలెన్స్ చేసే సామర్థ్యం దంపతుల్లో ఒక్కరికైనా ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. వాళ్లిద్దరూ అనవసరంగా పెద్ద పెద్ద విషయాల్లో కాలు పెట్టారు. అన్నయ్య నిర్మాతగా సినిమా తీశాడు. నాకు చెప్తే సరేనన్నాను. అన్నయ్యకు, నాకు 8 ఏళ్ల ఏజ్ గ్యాప్. ఆయనకు సలహా ఇచ్చేంత పెద్ద దాన్ని కాదు. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో తనే నాకు తండ్రి లాగా! తనంటే నాకు కొంత భయం కూడా! చివరకు వారు తీసిన సినిమా డిజాస్టర్ అయింది, నష్టాలు వచ్చాయి. అదే వారి జీవితంలో వచ్చిన పెద్ద సమస్య! మాకీ విషయం తెలిసి సాయం చేద్దామనుకునేలోపు వారు మరీ దారుణ స్థితిలోకి వెళ్లిపోయారు. అన్నీ అప్పులు, ఉన్నదంతా అమ్మేశారు. కేరళలో మంచి ప్రాపర్టీ ఉండేది, దాన్ని కూడా అమ్మేశారు. సినిమా అనేది గ్యాంబ్లింగ్. ఇది అందరికీ కలిసి రాదు.. ఉన్న డబ్బంతా సినిమా కోసం పెట్టడం అనేది తెలివితక్కువ తనం. ఈ ఒక్క పని వాళ్ల జీవితాన్ని ముంచేసింది' అని చెప్పుకొచ్చింది సుజిత. చదవండి: దేశంలోనే రిచ్ హీరో.. కారు, బంగ్లాలు అమ్మేసి చివరి రోజుల్లో మురికివాడలో -
టీడీపీ నేత పై మండి పడ్డ ఎమ్ఎల్సి వరుడు కళ్యాణి...
-
మాకు కూడా చెప్పులు ఉన్నాయి జాగ్రత్త... అనితకు వరుదు కళ్యాణి కౌంటర్
-
వైఎస్సార్ సీపీకి వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేకపోతోన్న టీడీపీ
-
‘ఈనాడు’ పైత్యం: అటకాయించడమే కాక.. ఎదురుదాడా!?
హనుమాన్ జంక్షన్ రూరల్: దొంగే దొంగా.. దొంగా అన్నట్లుగా ఉంది ఈనాడు పైత్యం చూస్తుంటే. చట్ట ప్రకారం.. నిబంధనల ప్రకారం కృష్ణాజిల్లా గన్నవరం పోలీసులు విధులు నిర్వర్తించినప్పటికీ వారి విధులకు ఆటంకం కలిగించడమే కాక వారిపై ఎదురుదాడికి దిగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పడక గదిలోకి చొరబడి దౌర్జన్యం’ అంటూ ఆ పత్రిక మంగళవారం సంచికలో అచ్చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిజానికి.. తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరు సాయి కల్యాణిని అరెస్టుచేయటానికి వచ్చిన గన్నవరం పోలీసులపై నిందితురాలి కుటుంబ సభ్యులు దురుసుగా ప్రవర్తించి, వారి విధులకు ఆటంకం కలిగించారు. ఆమెను అరెస్టుచేసేందుకు వచ్చినట్లు ఎస్ఐ జి. రమేష్‌బాబు వారికి చెప్పారు. కానీ, ఈ సమయంలో సాయికల్యాణి కుటుంబ సభ్యులు ఎస్ఐతో పాటుగా వచ్చిన మహిళా కానిస్టేబుళ్లపై దురుసుగా వ్యవహారిస్తూ నానా దుర్భాషలాడారు. అరెస్టుకు సహాకరించాల్సిందిగా ఎస్ఐ రమేష్‌బాబు పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ పోలీసులపై ఆమె కుటుంబ సభ్యులు ఎదురుదాడికి దిగారు. దీంతో సాయికల్యాణిని అరెస్ట్‌చేసి తీసుకువెళ్లేందుకు యత్నించిన పోలీసులకు ఆమె కుటుంబ సభ్యులు అడ్డుపడి ఆటంకాలు సృష్టించారు. ఇలా దాదాపు గంటసేపు అరెస్టుచేయటానికి వచ్చిన గన్నవరం పోలీసులకు చుక్కలు చూపించారు. చదవండి: టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ.. నోటీసులు అయినప్పటీ ఎంతో ఓర్పుతో, సంయమనంతో, బాధ్యతాయుతంగా వ్యవహారించిన పోలీసులు ఆమె దుస్తులు మార్చుకుని, బ్రష్ చేసుకునేందుకు తగిన సమయం ఇచ్చిన తర్వాతే అరెస్టు చేసి తీసుకువెళ్లారు. కానీ, ఈనాడు పత్రిక ఈ వివరాలేమీ ప్రస్తావించకుండా ఏకపక్షంగా పోలీసుల తీరును అభ్యంతరకర రీతిలో విమర్శించడం శోచనీయం. అయినా, తప్పు చేసిన వారి కోసం పోలీసులు ఎక్కడైనా వెతుకుతారు. ఇందులో తప్పేముంది?. -
టీడీపీకి బిగ్ షాక్.. మహిళా నేత కల్యాణి అరెస్ట్
సాక్షి, కృష్ణా: టీడీపీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, గత ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరంలో పట్టాభితో పాటు ఆమె కూడా అల్లర్లు సృష్టించి సీఐని గాయపరిచిన ఘటనలో కల్యాణిపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ రాకపోవడంతో కల్యాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కల్యాణి హనుమాన్ జంక్షన్లో ఉన్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో వారు అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై కల్యాణి పరుష పదజాలంతో వాగ్వాదానికి దిగారు. -
టీడీపీ మహిళా రాష్ట్రప్రధాన కార్యదర్శి ముల్పూరి కళ్యాణి అరెస్ట్
-
చంద్రబాబు, లోకేష్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి
-
వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వరుదు కల్యాణి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వరుదు కల్యాణి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, వైఎస్సార్సీపీకి చెందిన 22 అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిపినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
‘కబ్జా చేసిన అయ్యన్నపాత్రుడు భూకబ్జాల గురించి మాట్లాడుతున్నాడు’
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడమే చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడికి ఇష్టం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'విశాఖ పరిపాలనా రాజధానిపై టీడీపీ నాయకులు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. వచ్చే నెల 11,12 తేదీల్లో ప్రధాని మోదీ విశాఖలో పర్యటించి సీఎం జగన్‌తో కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. దీనిని టీడీపీ నాయకులు సహించలేకపోతున్నారు. ఉత్తరాంద్ర ప్రజల ఓట్లతో గెలిచిన టీడీపీ నాయకులు ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తున్నారు. చంద్రబాబు ఆడమన్నట్లు ఆడి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు. రుషికొండ ప్రాంతంలో టూరిజం ప్రాజెక్ట్ కడుతుంటే తప్పు ఏంటి?. పర్యావరణం అనేది కోర్టు పరిధిలో ఉంటుంది. కోర్టు నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొండలపై నిర్మాణాలు చెయ్యలేదా. టీడీపీ నాయకులు ఉత్తరాంద్ర ప్రాంతాన్ని దోచుకున్నారు. ఇరిగేషన్ భూములను కబ్జా చేసిన అయ్యన్నపాత్రుడు భూకబ్జాల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఇల్లే కరకట్టను ఆక్రమించి కట్టుకున్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ను చెడగొట్టే విధంగా టీడీపీ వ్యవహరిస్తోంది. సీఎం జగన్ గంజాయి నియంత్రణ కోసం ప్రత్యేకంగా సెబ్ అనే విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రలో సీఎం జగన్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు' అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పేర్కొన్నారు. -
ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు కుట్ర: వరుదు కల్యాణి
సాక్షి, విశాఖపట్నం: ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి దుయ్యబట్టారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 29 గ్రామాల కోసమే చంద్రబాబు ఆరాటమని మండిపడ్డారు. 26 జిల్లాల అభివృద్ధికి సీఎం జగన్ పాటుపడుతున్నారన్నారు. చంద్రబాబు అమరావతిని భ్రమరావతి చేశారు. గ్రాఫిక్స్‌తో చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివద్ధి చెందుతుందని ఆమె అన్నారు. చదవండి: ‘ఎన్టీఆర్ కుమార్తెను చంద్రబాబు పెళ్లి చేసుకోకుంటే..’ ‘‘14 సంవత్సరాల సీఎంగా ఉన్న చంద్రబాబు కనీసం కుప్పంను మున్సిపాలిటీ చేయలేదు. ఉత్తరాంధ్రలో అధికంగా వలసలు కొనసాగుతున్నాయి. సీఎం వైఎస్ జగన్.. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారు. ఏపీలో తక్కువ వ్యయంతో కొత్త రాజధాని నిర్మాణానికి విశాఖ అనువైంది. శ్రీ కృష్ణ కమిషన్ కూడా విశాఖ రాజధానికి అనువైందని ఎప్పుడో చెప్పింది. సీఎంగా చంద్రబాబు విశాఖలో పెట్టుబడుల సదస్సు పెట్టీ రాజధానిగా అనువైందనీ గతంలో అన్నారని వరుదు కల్యాణి గుర్తు చేశారు. మరి అప్పుడు అమరావతిలో పెట్టుబడులు అని నేరుగా ఎందుకు చెప్పలేదని ఆమె ప్రశ్నించారు. ‘ఉత్తరాంధ్ర ప్రజల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. ఆదాయం అంతా అమరావతికి ఇస్తే మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటి?. బిడ్డ ఆకలిగా ఏడుస్తుంటే పాల ఫ్యాక్టరీ పెడతానని చెప్పే నైజం చంద్రబాబుది. విశాఖ రాజధానిగా ప్రజలు కోరుకుంటున్నారు’’ అని వరుదు కల్యాణి అన్నారు. -
‘చంద్రబాబు జీవితంలో మళ్లీ సీఎం కాలేరు’
సాక్షి, విశాఖపట్నం: జీవితంలో చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మహిళా పక్షపాతిగా సీఎం జగన్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జనం.. టీడీపీ మహిళా నేత అనిత పేరు చెబితే అబద్ధాల అనిత ...అబండాల అనిత అంటారంటూ ఆమె దుయ్యబట్టారు. ఐరన్ లెగ్ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే చంద్రబాబు పేరు వస్తుందని ఎద్దేవా చేశారు. చదవండి: టీడీపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు ‘‘వైఎస్ భారతి కాలి గోటికి కూడా టీడీపీ మహిళా నేత అనిత సరిపోదు. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురిచేసిన దశలో మనో నిబ్బరంతో కుటుంబాన్ని వైఎస్ భారతమ్మ నడిపారు. ఆమె ఓ మంచి తల్లి.. భార్య.. బిజినెస్ విమెన్‌గా మా అందరికీ ఆదర్శమని కల్యాణి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుమార్తె డిస్టింక్షన్లో పాసైతే చంద్రబాబు అసూయతో విమర్శలు చేశారు. భారతమ్మ సూట్ కేసులు మోశారన్నారు.. మరి భువనేశ్వరీ దేవి ఎన్ని సూట్ కేసులు మోశారు’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు. ‘‘ఇంట్లో ఆడవాళ్లని కూడా బయటకు లాగే నైజం చంద్రబాబు పార్టీది. జన్మభూమి కమిటీలు ప్రజలను జలగల్లా దోచుకున్నాయి. జగనన్న పాలనలో చేసిన అప్పులు జనం కోసం చేస్తే.. టీడీపీ హయాంలో అప్పులు నాయకుల జేబుల్లోకి వెళ్లాయి. జగనన్న పాలనలో ఎన్నో జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నంబర్‌వన్‌గా నిలిచింది. సీఎం జగన్ మూడేళ్ల పాలనలో ప్రధాని నుంచి.. అన్ని రాష్ట్రాల సీఎంలు ప్రశంసలు కురిపించారని’’ కల్యాణి అన్నారు. చంద్రబాబుకి మహిళలను కలుపు మొక్కలుగా తీసి పారేయడం అలవాటు. అనితకు కూడా అదే పరిస్థితి దాపురిస్తోంది జాగ్రత్త. దివ్యవాణి కూడా అలాగే నష్టపోయింది. ప్రభుత్వ విధానాల మీద విమర్శలు చేస్తే సమాధానం చెప్తాం. కానీ సభ్యత మరిచి విమర్శలు చేస్తే ఉపేక్షించం’’ అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హెచ్చరించారు. -
నటి కల్యాణితో విడాకులు.. కారణమేంటో చెప్పిన డైరెక్టర్
డైరెక్టర్, బిగ్‌బాస్ ఫేం సూర్య కిరణ్ గురించి ప్రత్యేకం పరిచయం అక్కర్లేదు. సుమంత సత్యం మూవీతో డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. ఈ క్రమంలో జౌను.. వాళ్లిద్దరు ఇష్టపడ్డారు మూవీతో పరిచయమైన వీరిద్దరూ 2005లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2020లో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే వీరి విడాకుల కారణాలేంటో ఎవరికి తెలియదు కానీ, సడెన్‌గా విడిపోతున్నామని ప్రకటించడంతో అందరు షాక్ అయ్యారు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన సూర్య కిరణ్.. కల్యాణితో విడాకులపై స్పందిచాడు. వారి విడాకులకు కారణాలపై నోరు విప్పాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘మేం 15 ఏళ్లు కాపురం చేశాం. మా మధ్య ఎన్నడు అభిప్రాయ భేదాలు కానీ, గొడవలు కానీ రాలేదు. ఎంతో అనోన్యంగానే ఉన్నాం. నేను చూసిన మంచి అమ్మాయిల్లో కల్యాణి ఒకరు. ఆవిడ చాలా మంచివారు. అయితే సొంత ప్రొడక్షన్ పెట్టి సినిమాలు తీయడం వల్ల ఆస్తుల పోయాయి. అప్పుల పాలయ్యాను, ఒకవేళ దానికి బయపడే ఆమె విడాకులు అడిగిరామో’ అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ‘‘మేం విడిపోవడానికి కారణమేంటని కోర్టు అడిగిన ప్రశ్నకు కూడా కల్యాణి ఏం సమాధానం చెప్పలేదు. విడాకుల కోసం మేం జడ్జిని సపరేట్ చాంబర్లో కలిశాం. అప్పుడు జడ్జి నన్ను చూపిస్తు ‘ఈయన కొడతారా? తిడతారా? మీ అత్తింటివారు ఇబ్బంది పెడుతున్నారా?’ అని కల్యాణిని అడిగారు. దానికి కల్యాణి లేదని సమాధానం ఇచ్చింది. మరెందుకు విడాకులు తీసుకుంటున్నారని అడిగినా తను ఎలాంటి సమాధానం చెప్పలేకపోయింది. ఆ వెంటనే జడ్జి మీరు డైవర్స్ తీసుకుంటే పిల్లల బాధ్యత ఎవరిది?’ అని ప్రశ్నించారు. వెంటనే నేను మాకు పిల్లలు లేరన్నాను. చదవండి: మహేశ్ సినిమాలో ఆ పాత్రను అయిష్టంగానే చేశా: ప్రకాశ్ రాజ్ మీకు పిల్లలు లేకపోవడటమే విడాకులకు కారణమా? అని అడగంతో అవును అని చెప్పాను. ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ‘వేయిట్ చేయండి. అప్పులు తీరిపోయిన తర్వాత మనం మళ్లీ పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాను’’ అన్నాడు. చివరగా తనకున్న అప్పుల కారణంగా అందరు తనని డబ్బులు అడిగి ఇబ్బంది పెడతారనే ఆందోళనతోనే కల్యాణి విడాకులు తీసుకుని ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా సూర్య కిరణ్ తమిళంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పనిచేశాడు. బాల నటుడిగా ఆయన దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించాడు. -
Kalyani: 20 నిమిషాలు అమ్మతో మాట్లాడి ఉంటే ఆమె బతికి ఉండేది! కానీ
ఒక్క ఇరవై నిమిషాలు అమ్మతో ఉండి ఉంటే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయేది కాదు. అమ్మలా చాలామంది మానసిక ఆందోళనతో నూరేళ్ల జీవితానికి అర్థాంతరంగా ముగింపు పలుకుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతోన్న వారిలో యువత ఎక్కువగా ఉంటుంది. వీరిని మానసికంగా దృఢపరిచేందుకు ‘మానసిక హెల్త్ హెల్ప్‌లైన్’ చాలా అవసరం. హెల్ప్‌లైన్ అందుబాటులో ఉన్నప్పటికీ... అవగాహన, ప్రచారం లేక చాలామంది చనిపోతున్నారు. అరచేతిలో ప్రపంచాన్ని చుట్టేస్తున్న నేటి యువతరానికి దీనిమీద అవగాహన కల్పించాలని పోరాడుతోంది నటి కల్యాణి. ఒకప్పుడు తను కూడా ఇలాంటి మానసిక సంఘర్షణకు లోనయ్యాననీ, తనలా మరెవరూ కాకూడదన్న ఉద్దేశ్యంతో హెల్ప్‌లైన్‌పై అవగాన కల్పిస్తోన్న 31 ఏళ్ల కల్యాణి గురించి ఆమె మాటల్లోనే... మాది చెన్నై. అమ్మే నా ప్రపంచం. ఆమె శాస్త్రీయ నృత్యకారిణి కావడం వల్ల డ్యాన్స్‌తో పాటు, సంగీతం, నటనను బాగా ఇష్టపడేది. అమ్మానాన్నల బంధం బలహీనంగా ఉండేది. ఇంట్లో ఎప్పుడూ ఇద్దరిమధ్య వాగ్వాదాలు, అరుపులతో చీటికిమాటికి గొడవపడుతుండేవారు. దీంతో అమ్మ మానసికంగా, శారీరకంగా కృంగిపోయేది. అమ్మంటే ఎంతో ఇష్టమున్న నేను ఇవన్నీ చూసి చూసి ఎలాగైనా అమ్మను సంతోషంగా ఉంచాలనుకునేదాన్ని. చైల్డ్ ఆర్టిస్ట్‌గా.. అమ్మకు సాయపడేందుకు ఏడేళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నా కెరీర్‌ను ప్రారంభించాను. ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క దాదాపు మూడువందలకు పైగా యాడ్స్‌లో నటించాను. ఎంత బిజీగా ఉన్నా అమ్మతోనే ఎక్కువ సమయాన్ని గడిపేదాన్ని. 22 ఏళ్లకు అమ్మ నాకు పెళ్లి చేసింది. అప్పుడు అమ్మను విడిచి ఉండలేక, నా భర్తతో మాట్లాడి బెంగళూరు వెళ్లకుండా చెన్నైలోని అమ్మ ఇంటికి దగ్గర్లో ఇల్లు తీసుకుని ఉన్నాను. సవ్యంగా సాగుతోన్న జీవితంలో... అమ్మకు దగ్గరగా ఉంటూ ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా అంతా మారిపోయింది. అది 2014 డిసెంబర్ 23.. ఎంత కొట్టినా అమ్మ తలుపు తీయడం లేదని నా భర్తకు చెప్పడంతో ఆయన వచ్చి తలుపులు పగులకొట్టి లోపలికెళ్లి చూస్తే అమ్మ ఉరివేసుకుని కనిపించారు. ఆ తర్వాత ఆమె డైరీ చదివాను. అందులో ఆమె అనుభవిస్తోన్న ఆవేదన కనిపించింది. ఆమె బాధ ఎవరికైనా చెప్పుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అనిపించింది. నేను కూడా చనిపోవాలని.. అమ్మేలోకంగా బతికిన నాకు ఆమె లోటు నన్ను అగాథంలోకి నెట్టేసింది. రోజూ చేయాల్సిన పనులు కూడా చేయకుండా ఒంటరిగా ఉండిపోయి నిరాశలో కూరుకుపోయాను. రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాను. ఒకసారి మానసిక ఆరోగ్యం హెల్ప్‌లైన్‌కు కూడా ఫోన్ చేశాను. ఎవరూ ఫోన్ తీయలేదు. మరోసారి చనిపోవడానికి ప్రయత్నించినప్పుడు నా భర్త కాపాడారు. అప్పుడు కాస్త ధైర్యం తెచ్చుకుని ఇలా చేయకూడదని నిర్ణయించుకున్నాను. అమ్మ ఆత్మహత్య, నా ఆత్మహత్య ప్రయత్నాల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాను. నా పోస్టు చూసిన చాలామంది తమ జీవితంలో కొన్ని పరిస్థితుల వల్ల ఇలా చేశామని చెప్పారు. అలాంటి వాళ్లకు ఏదైనా సాయం చేయాలనుకున్నాను. నాలుగేళ్ల కూతురికి తల్లిగా, మరెవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదన్న ఉద్దేశ్యంతో మానసికంగా బలహీనంగా ఉన్నవారికి దానినుంచి బయటపడేందుకు అవగాహన కల్పిస్తూ మోటివేట్ చేస్తూ నాకు చేతనైన రీతిలో సాయపడుతున్నాను. ఓటీటీతో కోట్లమందికి అవగాహన ఇప్పుడంతా ఓటీటీ చుట్టూ ప్రపంచం తిరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమేజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది వీక్షకులు ఉన్నారు. ఒక అధ్యయనం ప్రకారం 2023 నాటికి ఇండియాలో ఓటీటీ వినియోగదారుల సంఖ్య యాభైకోట్లకు చేరుతుంది. ఇలాంటి ప్లాట్‌ఫాంలలో జాతీయ మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్ ‘కిరణ్ (1800–599– 0019) ’ నంబర్‌ను డిస్ప్లే చేయాలి. 24 గంటలు అందుబాటులో ఉండి, మానసిక ఆరోగ్యంపై ఉచితం గా కౌన్సెలింగ్ ఇచ్చే హెల్ప్‌లైన్ నంబర్ ఎప్పుడూ డిస్ప్లే అవ్వాలి. ఈ నంబర్‌కు కాల్ చేయడం వల్ల మానసిక నిపుణులు కౌన్సెలింగ్ ఇచ్చి ఆత్మహత్య ఆలోచనలనుంచి బయట పడేస్తారన్నది నా ఆలోచన. – కల్యాణి ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
డైరెక్టర్‌గా మారిన సీనియర్ హీరోయిన్ కల్యాణి
Actress Kalyani Turns As Director With Multilingual Film: హీరోయిన్ కల్యాణి ఇప్పుడు మెగాఫోన్ పట్టింది. సొంత బ్యానర్లో ఓ సినిమాను రూపొందిస్తుంది. చేతన్ చీను ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. కాగా కేరళలో పుట్టి పెరిగిన కల్యాణి శేషు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' చిత్రంతో క్రేజ్ సంపాదించుకున్న కల్యాణి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత నిర్మాతగానూ మారింది. ఇటీవలె నటిగా రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పడు డైరెక్టర్‌గా పరిచయం కానుంది. సొంత బ్యానర్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది. తెలుగు, తమిళ, భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
దుశ్శాసనులకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ
సాక్షి, విశాఖపట్నం: దుశ్శాసనులకు తెలుగుదేశం పార్టీ కేరాఫ్ అడ్రస్ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ధ్వజమెత్తారు. విజయవాడలో ఓ బాలికను టీడీపీ నాయకుడు వినోద్‌జైన్ లైంగికంగా వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశాడని, ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బాలిక సూసైడ్ నోట్‌ను చదువుతుంటే కన్నీళ్లు ఆగలేదన్నారు. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలులు వైఎస్సార్ సీపీలో ఉంటే కఠిన శిక్షలు పడతాయని చెప్పారు. ఇప్పటికే వినోద్జైన్పై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారన్నారు. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే టీడీపీ నారీమణులు ‘నారీ సంకల్ప దీక్ష’ చేపట్టి.. చంద్రబాబు హయాంలో మహిళలకు న్యాయం జరిగిందని చెబుతుంటే మహిళలంతా నివ్వెరపోతున్నారన్నారు. చంద్రబాబు పుత్రుడు లోకేష్ పీఏ మహిళను లైంగికంగా వేధించగా, ఆమె టీడీపీ కార్యాలయం ముందు బైఠాయించారని, దానినుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బాబు వేసిన మాస్టర్ ప్లాన్‌లో భాగమే నారీ సంకల్ప దీక్ష అని చెప్పారు. ఈ దీక్షకు చంద్రబాబు దర్శకత్వం వహిస్తే, లోకేష్ స్క్రీన్‌ప్లే రచించాడని తెలిపారు. బాబు పాలనలో మహిళలపై జరిగిన నేరాలను తెలుసుకుని టీడీపీ నారీమణులు దీక్షలు చేయాలన్నారు. గాజువాకలో లావణ్యను టీడీపీ నాయకులే హత్యచేసి రూ.10.50 లక్షలకు సెటిల్ చేసుకున్నారని చెప్పారు. పెందుర్తి నియోజకవర్గంలో దళిత మహిళను వివస్త్రను చేసి జుట్టు పట్టుకుని ఈడ్చినప్పుడు, ఏలూరులో దళిత అధికారిపై దాడి, విజయవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్‌కు పాల్పడినప్పుడు టీడీపీ నారీమణులు, వంగలపూడి అనిత ఏమైపోయారని ప్రశ్నించారు. దేశానికే ఆదర్శం దిశ దేశానికే ఆదర్శంగా వైఎస్ జగన్ దిశ చట్టాన్ని రూపొందించి, అసెంబ్లీలో పెడితే టీడీపీ ఎమ్మెల్యేలు సభ బయట ఆ పేపర్లను చించేసిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. దిశ చట్టం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని, మీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో ప్రశ్నించాలని మీ ఎంపీలను కోరాలని హితవు పలికారు. ఈ కేసుల్లో సత్వర శిక్ష పడేలా 19మంది పీపీలను నియమించారన్నారు. -
IFA Shield: ఫైనల్లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ
IFA Shield Football Tournament- కల్యాణి (పశ్చిమ బెంగాల్): భారత్‌లో రెండో అతి పురాతనమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఐఎఫ్ఏ షీల్డ్ ఫుట్‌బాల్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎస్‌డీఎఫ్‌సీ) జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. అదనపు సమయం వరకు జరిగిన సెమీఫైనల్లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టు 2–1 గోల్స్ తేడాతో రైల్వేస్ ఫుట్‌బాల్ క్లబ్‌పై గెలిచింది. శ్రీనిధి డెక్కన్ జట్టు తరఫున ఫాల్గుణి సింగ్ రెండో నిమిషంలో... 118వ నిమిషంలో మల్సాజువాలా ఒక్కో గోల్ చేశారు. రైల్వే జట్టు తరఫున 14వ నిమిషంలో కెల్విన్ కెల్లీ గోల్ చేశాడు. మరో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ రియల్ కశ్మీర్ ఎఫ్‌సీ 2–1తో గోకులం కేరళ జట్టును ఓడించి బుధవారం శ్రీనిధి ఎఫ్‌సీతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. చదవండి: Max Verstappen: ఆఖరి బంతికి సిక్స్ కొట్టేశాడు; ఇది అతి పెద్ద తప్పిదం! -
సరికొత్తగా కల్యాణి రీ ఎంట్రీ.. నటిగా మాత్రం కాదు..
జీవిత రాజశేఖర్ హిట్ మూవీ ‘శేషు’తో హీరోయిన్గా తెలుగు తెరకుపరిచమైంది నటి కల్యాణి. ఆ తర్వాత ఆమె నటించిన రెండో చిత్రం ‘జౌను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’కు ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకుంది. ఇందులో ఆమె రవితేజ సరసన నటించిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్లో వాంటెడ్ హీరోయిన్గా మారిన కల్యాణి తెలుగు, తమిళ, కన్నడ బాషల్లో కూడా నటించింది. ఈ నేపథ్యంలో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గడంతో బిగ్‌బాస్ ఫేం సూర్య కిరణ్‌ను పెళ్లి చేసుకుని సెటిలైయిపోయింది. పెళ్లి తర్వాత కూడా ఆమె వదిన వంటి క్యారెక్టర్లు చేసినప్పటికి అంతగా గుర్తింపు రాలేదు. దీంతో ఆమె సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చింది. అయితే తన భర్తతో కలిసి ఆమె మైదాస్ టచ్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటూ ఇంటి పనులను అటూ నిర్మాణ సంస్థ పనులను చూసుకుంటున్న కల్యాణి సరికొత్తగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. తన నిర్మాణ సంస్థలో కల్యాణి ఓ మూమీని డైరెక్ట్ చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తన డైరెక్షన్లో చేతన్ శ్రీను అనే యంగ్ హీరోను పరిచయం చేయనుంది ఆమె. ఇక ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పొస్ట్‌ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావడంతో త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు ఆమె సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుత కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే ఈ మూవీని పట్టాలెక్కించనుందట. అయితే హోలీ పండుగ సందర్భంగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. అందరి నటినటుల్లా కాకుండా కల్యాణి కాస్తా డిఫరెంట్ రీ ఎంట్రీతో డైరెక్టర్‌గా పరిచయం కానుంది. చదవండి: నేను హ్యాంగ్ అవుట్ అయ్యేది అక్కడే : అల్లు శిరీష్ నా కోసం రామ్‌చరణ్ అలా చేయడం సంతోషాన్నిచ్చింది :అనసూయ -
ప్రేమ విఫలమై న్యూస్ చానల్ ఉద్యోగిని ఆత్మహత్య
బన్సీలాల్‌పేట్: ప్రేమ విఫలమై మానసిక ఆందోళనకు గురైన ఓ యువతి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ మల్లేశ్ సమాచారం మేరకు... సిద్దిపేట ప్రాంతానికి చెందిన పయ్యావుల రాములు కూతురు పి.కళ్యాణి(26) నగరంలోని ఓ న్యూస్ చానల్లో పనిచేస్తున్నది. కళ్యాణి అదే సంస్థలో పనిచేస్తున్న శివ అనే యువకుడిని ప్రేమించిందని పోలీసులు చెప్పారు. రెండు సంవత్సరాలుగా వీరి ప్రేమ కొనసాగుతున్నది. అయితే ఇటీవల కళ్యాణి తాను ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకోవాలని కోరింది. ఆ యుకువడు నిరాకరించడంతో తీవ్ర మనోవేదనకు లోనయ్యింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కళ్యాణి తన సోదరుడు సుమన్‌తో కలిసి బోలక్‌పూర్‌లో ఉంటున్నారు. ఓ బార్బర్ షాపులో పనిచేస్తున్న సోదరుడు ఉదయం విధులకు వెళ్లాడు. రాత్రి వచ్చి చూసే సరిగా ఇంట్లో కళ్యాణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగుచూసింది. వెంటనే గాంధీనగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తన కుమార్తె మరణానికి శివ కారణమంటూ తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లేశ్ వివరించారు. -
సినిమాలోనే కాదు బుల్లితెరలోనూ అడ్జెస్ట్మెంట్
సినిమా: చేదు అనుభవాలెన్నో ఎదుర్కొన్నానని నటి కల్యాణి చెప్పింది. కేరళకు చెందిన ఈ అమ్మడు తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. బాలనటిగా పరిచయమైన కల్యాణి కథానాయకి స్థాయికి ఎదిగింది. 10 చిత్రాలకు పైగా కథానాయకిగా నటించిన కల్యాణి ఆ తరువాత బుల్లితెరకు పరిచయమైంది. తరువాత బుల్లితెర నుంచి నిష్క్రమించింది. నటనకు దూరం కావడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు కల్యాణి బదులిస్తూ నేనని ఠక్కున చెప్పింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థల్లో నుంచి ఫోన్లు వచ్చేవని, తమ చిత్రంలో కథానాయకి మీరేనని చెప్పేవారని అంది. అందుకు సంతోషపడే లోపే అడ్జెస్ట్మెంట్ కావాలని చెప్పేవారన్నారు. అదేది కాల్షీట్స్కు సంబంధించిన పదం అనుకుని తన తల్లి ఓకే చెప్పేదని ఆ తరువాత విషయం అర్థం తెలియడంతో అడ్జెస్ట్మెంట్ అన్న పదం వినగానే ఫోన్ కట్ చేశానని చెప్పింది. సినిమాలోనే కాదు బుల్లితెరలోనూ అలాంటి చేదు అనుభవాలను చాలా ఎదుర్కొన్నట్లు చెప్పింది. ఒక టీవీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నత బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి రాత్రికి పబ్బుకు పిలిచారని, అందుకు తాను సాయంత్రం కాపీ షాప్‌లో కలుసుకుందామని చెప్పానని అంది. అంతే ఆ తరువాత ఆ టీవీలో ఏ కార్యక్రమంలోనూ తనకు అవకాశం రాలేదని చెప్పింది. దీని కారణంగా తాను నటనకు దూరమైనట్లు నటి కల్యాణి చెప్పింది. ప్రస్తుతం ఈమె పెళ్లిచేసుకుని సంసారజీవితంలో మునిగిపోయింది. -
డైరెక్షన్ మారింది
‘‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, వసంతం, కబడ్డీ కబడ్డీ, పెదబాబు’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా నటించి, తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కల్యాణి డైరెక్షన్ మార్చారు. దర్శక–నిర్మాతగా మారారు. ఇటీవల అతిథి పాత్రల్లో కనిపిస్తూ వస్తున్న ఆమె కే2కే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. చేతన్ శీను, సిద్ధి, సుహాసినీ మణిరత్నం, రోహిత్ మురళి, శ్వేత ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. హోలి పర్వదినం సందర్భంగా ఈ సినిమా ప్రీ లుక్, టీజర్ గ్లింప్స్‌ను దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందనున్న చిత్రమిది. విలక్షణ ప్రేమకథతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. త్వరలోనే చిత్రీకరణ మొదలవుతుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. -
దర్శకురాలిగా మారిన హీరోయిన్
నటి కళ్యాణి ఒకప్పుడు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. మలయాళంలో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి.. ఆ తర్వాత దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్న కళ్యాణి.. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారు. దర్శకురాలిగా మారి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కే2కే ప్రొడక్షన్‌పై చేతన్ శీను హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను హోలీ సందర్భంగా సోమవారం ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేశారు. సైకాలజికల్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రానికి తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఈ చిత్రంలో సుహాసిని, సిద్ధి, రోహిత్ మురళి, శ్వేత ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. Best wishes #KaveriKalyani for your directorial debut. Here is the PreLook & #TeaserGlimpse of @K2KProduction Prod No.1 https://t.co/SIL6hBxsoh All the best @ChethanCheenu, #Shweta & team. #K2KProductions #ChethanCheenu@UrsVamsiShekar #HappyHoli pic.twitter.com/7QotRUZkTu — PURIJAGAN (@purijagan) March 9, 2020 -
తొలి మహిళా రాణిగా యువరాణి
ఒడిశా, పర్లాకిమిడి: పర్లాఖెముండి సంస్థానం రాణిగా యువరాణి కల్యాణీ దేవి గజపతికి ఆదివారం పట్టాభిషేకం నిర్వహించారు. ఇంతవరకు దాదాపు 17 మంది రాజులు పర్లాఖెముండి సంస్థాన సింహాసనాన్ని అధిష్టించగా, ఇటీవల 17వ రాజు గోపీనాథ గజపతి మరణించడంతో ఆ స్థానం ఖాళీగా అయింది. అమరులు గోపీనాథ గజపతి రాజా వారికి కుమారులు లేకపోవడంతో ఆయన కుమార్తె యువరాణి కల్యాణీదేవి గజపతికి పట్టాభిషేకం నిర్వహించడం అనివార్యమైంది. దీంతో ఆ సంస్థానం సింహాసనాన్ని అధిష్టించిన మొట్టమొదటి మహిళా రాణిగా యువరాణి కీర్తి గడించారు. 1550లో తొలిసారిగా శివలింగ నారాయణదేవ్ రాజుగా పర్లాఖెముండి సింహాసనం అధిష్టించిన విషయం విదితమే కాగా ఆ తర్వాత వరుసగా 17 మంది రాజులు పర్లాఖెముండి సంస్థానానికి రాజులుగా వ్యవహరించారు. అయితే ఈ నెల 22వ తేదీన రాజమందిరం వద్ద పెద్దఎత్తున అధికారికంగా పట్టాభిషేకం నిర్వహించేందుకు రాణి వారి అనుయాయులు సన్నాహాలు చేస్తున్నారు. అదేరోజున అమర గోపీనాథ గజపతి శ్రద్ధకర్మ(చనిపోయి 12వ రోజు)కూడా కావడంతో అంతా కలసివస్తుందన్న నమ్మకంతో పట్టా భిషేక కార్యక్రమానికి నిర్ణయించినట్లు తెలు స్తోంది. సంస్థానం రాణిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం యువరాణి కల్యాణీదేవి ఆస్థా న విధులను సక్రమంగా నిర్వహించి, రాజవంశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా రాణి కల్యాణీదేవిని చికిటి రాణి, ఎమ్మెల్యే ఉషాదేవి కలిసి, అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీజేడీ నాయకులు ప్రదీప్ నాయక్, వి.ఎస్.ఎన్.రాజు, బసంత్ దాస్, సంస్థానం ప్రముఖులు ఉన్నారు. -
సినీ ఆర్టిస్ట్ ఆత్మహత్యపై అనుమానాలు?
అమీర్‌పేట: సినీ ఆర్టిస్ట్ కళ్యాణి ఆత్మహత్యపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోంగార్డుగా పనిచేస్తున్న ఆమె భర్త ప్రసాద్ కళ్యాణిని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని మృతురాలి తల్లి సూరినేనమ్మ ఆరోపించింది. ఈ మేరకు తెలంగాణ సినీ,ఆర్టిస్ట్ యూనియన్ నాయకులతో కలిసి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా, భీమడోలు మండలం, కుల్లా గ్రామానికి చెందిన కళ్యాణి మొదటి భర్తతో విడాకులు తీసుకుని కుమార్తెతో సహా నగరానికి వలస వచ్చింది. ఈవెంట్లు నిర్వహిస్తూ సినిమాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న ప్రసాద్‌తో ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది. ఇదిలా ఉండగా ఈ నెల 10న కళ్యాణి బల్కంపేట లింగయ్యనగర్లోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి భర్త ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ఆర్టీఓ సమక్షంలో పంచనామా నిర్వహించారు. శనివారం రాత్రి ఈఎస్ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా అక్కడికి వచ్చిన సినీ మూవీ, ఆర్టిస్ట్ యూనియన్ నాయకులు కళ్యాణి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళకు దిగారు. మృతురాలి ఒంటిపై గాయాలు ఉన్నాయని, ఆమె భర్త ప్రసాద్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపించారు. అంతే కాకుండగా సొంత తల్లి సూరినేనమ్మకు సమాచారం అందించకుండా సవతి తల్లి సావిత్రి సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించడం ఏమిటన్నారు. ఆదివారం ఉదయం నగరానికి చేరుకున్న కళ్యాణి తల్లి సూరినేనమ్మ కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్తికోసం ప్రసాద్ కళ్యాణిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని పేర్కొంది. 8 నెలల క్రితం వారు వివాహం చేసుకున్నట్లు స్నేహితులు చెబుతుండగా రెండేళ్ల క్రితమే వివాహం చేసుకున్నట్లు ప్రసాద్ పేర్కొంటున్నాడన్నారు. తమ ఎదుటే గొంతు పట్టుకున్నాడు... కాగా కళ్యాణి, ప్రసాద్ ఓ యూట్యూబ్ చానెల్ నడుపుతున్నారని, మొట్టమొద తనను ఇంటర్వ్యూ చేసేందుకు ఇంటికి పిలిపించారని డ్యాన్స్ మాస్టర్ రాకేష్ తెలిపాడు. ఇంటర్వ్యూ అనంతరం రాత్రి వారి ఇంట్లోనే ప్రసాద్‌తో పాటు తాను, పౌల్, సుహాల్ మద్యం తాగామన్నారు. ఈ సందర్భంగా కళ్యాణి, ప్రసాద్ మధ్య గొడవ జరగడంతో ప్రసాద్ కళ్యాణి గొంతుపట్టుకున్నాడని రాకేష్ తెలిపాడు. అతడికి నచ్చజెప్పి వెళ్లిపోయామన్నాడు. ఉదయం చార్జర్ కోసం ప్రసాద్‌కు ఫోన్ చేయగా కళ్యాణి ఆత్మహత్య చేసుకుందని చెప్పాడన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు... కళ్యాణి మృతికి ఆమె భర్త ప్రసాదే కారణమని ఆరోపిస్తూ ఆమె తల్లి ఫిర్యాదు చేసినట్లు ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే ఆమె కుమార్తె తాను తండ్రి వద్ద ఉండనని చెప్పడంతో ఆమెను నింబోలి అడ్డలోని ప్రభుత్వ వసతి గృహానికి తరళించినట్లు తెలిపారు. కళ్యాణి తన కూతురని మొదట సావిత్రి అనే మహిళ ఫిర్యాదు చేసిందని, తాజాగా సూరినేనమ్మ అనే మహిళ వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మృతికి గల కారణాలు వెలుగులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. -
మహిళలు, యువత మద్దతు జగన్‌కే..
అక్కచెల్లెమ్మల కష్టాలు ఎరిగిన నేత వైఎస్ జగన్. అందుకే వారి కోసం పలు పథకాలు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేయనున్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఇల్లు గుల్ల చేస్తున్న మద్యం మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమేసి, ఆడపడుచులను ఆదుకోడానికి మద్య నిషేధం అమలు చేయనున్నారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మల కోసం వైఎస్సార్ ఆసరా, పేద తల్లుల కోసం వైఎస్సార్ అమ్మఒడి పథకాలు అమలు చేయనున్నారు. వైఎస్సార్ గృహ నిర్మాణ పథకం కింద మంజూరైన ఇళ్లను మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల భర్తీకి కూడా ఆయన హామీ ఇవ్వడంతో మహిళలు, యువత జగనన్నకే మద్దతు పలుకుతున్నారని ఆ పార్టీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా ఎన్నికల సమన్వయకర్త వరుదు కల్యాణి తెలిపారు. ఆమెతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ... సాక్షి: ‘నవరత్నాల’కు ప్రజాధారణ ఎలా ఉంది ? వాటిని ప్రజల్లోకి ఎంతమేర తీసుకెళ్లగలిగారు ? వరుదుకల్యాణి: వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలు అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించాయి. పార్టీలో బూత్ కమిటీలు ఏర్పాటు చేసి వారి ద్వారా ప్రజల్లోకి త్వరగా, వంద శాతం తీసుకెళ్లాం. నవరత్నాలకు ప్రజలలో విశేషస్పందన వచ్చింది. ఇది మా తొలివిజయంగా భావిస్తున్నాం. సాక్షి: మీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ‘మద్యనిషేధం’ అమలు చేస్తామని హామీ ఇచ్చా రు. దీనిపై మహిళల స్పందన ఎలాగుంది ? వరుదుకల్యాణి:పేద, బడుగు, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా మద్యానికి బానిసలవుతుండడంతో వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. అప్పుల కారణంగా ఇల్లు గుల్లవడంతో పాటు, ఆరోగ్యం క్షీణించడంతో మహిళలు భర్తలను కోల్పోతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో లిక్కర్ మాఫియా మరింత పెరిగిపోయింది. మహిళ వెతలు గమనించిన జగన్ మద్యపానాన్ని నిషేధిస్తామని ప్రకటించారు. దీంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న మహిళలంతా వైఎస్సార్సీపీకి ఓట్లు వేస్తారు. సాక్షి: ‘పసుపు–కుంకుమ’ పథకంపై డ్వాక్రా సభ్యుల స్పందన ఎలాగుంది ? వరుదుకల్యాణి:మహిళలంతా చాలా తెలివిగా ఆలోచిస్తారు. చంద్రబాబు డ్వాక్రా రుణాలు రద్దు చేయకుండా మాయచేయడంతో చాలా మందికి బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయి. దీంతో తీవ్ర అవమానాలకు గురయ్యారు.ఇప్పుడు ఎన్నికల ముందు పసుపుకుంకుమ పేరుతో మరోసారి మోసం చేయనున్నారని మహిళలంతా ముందుగానే గ్రహించారు. చంద్రబాబు ఎన్ని గిమ్మిక్కులు చేసినా తగిన బుద్ధి చెప్పడం ఖాయం. సాక్షి: ప్రజాసంకల్పయాత్రలో అనకాపల్లి పార్లమెంట్సమన్వయకర్తగా ప్రాంతీయ సమస్యలను మీ అధినాయకుడు దృష్టికి తీసికెళ్లారా..? వరుదుకల్యాణి: ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకున్నారు. మరికొన్ని సమస్యలను నేను నేరుగా మా నాయకుడు దృష్టికి తీసుకెళ్లాను. అధికారం వచ్చిన వెంటనే ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా సహకారంగంలో ఉన్న సుగర్ ఫ్యాక్టరీలను మొదటిగా తెరిపిస్తానన్నారు. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. సాక్షి: ఈ ఎన్నికల్లో యువత, నిరుద్యోగులు ఏ పార్టీవైపు ఉంటారు..?జనసేన ప్రభావం ఉంటుందా..? వరుదుకల్యాణి: ఈ ఎన్నికల్లో యువత, నిరుద్యోగులు వైఎస్సార్సీపీకే ఓట్లు వేస్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి, పది మందిని నియమించనున్నారు. పథకాల అమలుకోసం ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ, ప్రభుత్వ ఉద్యోగాలకు రోస్టర్ విధానం అమలు, స్కిల్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు తదితర హామీలతో యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అందువల్ల ఆ అవకాశాన్ని వారు చేజార్చుకోరు. యువతపై జనసేన ప్రభావం ఉండదు. పవన్‌కల్యాణ్‌ను సినిమాల వరకే అభిమానిస్తామని, మా భవిష్యత్ నిర్ణయించే వైఎస్సార్సీపీకి ఓట్లు వేస్తామని యువత చెబుతున్నారు. సాక్షి: విశాఖ జిల్లాలో త్రిముఖ పోరు ఉంటుందని మీరు భావిస్తున్నారా..? వరుదుకల్యాణి: ఎట్టి పరిస్థితుల్లో త్రిముఖ పోరు ఉండదు. వైఎస్సార్సీపీకి, టీడీపీ పార్టీల మధ్యనే ప్రధాన పోరు ఉంటుంది. అందులో అత్యధిక స్థానాలు వైఎస్సార్సీపీ ఖాతాలో పడతాయి. మా పార్టీ అభ్యర్థులు మంచి మెజార్టీతో విజయం సాధిస్తారు. -
‘చంద్రబాబు బీసీలను అవహేళన చేశారు’
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీలకు ఇచ్చిన 119 హామీలను నెరవేర్చకుండా వారిని అవహేళన చేశారని వైఎస్సార్ సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరదు కల్యాణి మండిపడ్డారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అందాయన్నారు. వైఎస్సార్ స్వర్ణయుగం మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంలో కలిసి ఉన్నపుడు ఏపీకి ప్రత్యేకహోదా కావాలని అడగని.. ఏనాడూ దీక్షలు చేయని చంద్రబాబు ప్రజలను మోసం చేయటానికే దొంగ దీక్షలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలను మభ్య పెట్టడానికే పోస్ట్ డేటెడ్ చెక్‌లు ప్రవేశపెట్టారని తెలిపారు. నిజంగా మహిళలకు సహాయం చేయాలని ఉంటే తక్షణమే చెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబు బీసీలకు వెన్నుపోటు పొడిచారు
-
వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతలకు నిద్రపట్లేదు
-
వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేక కుట్ర రాజకీయాలు
-
వైఎస్ జగన్‌కు పెరుగుతొన్న ప్రజాదరణ
-
ఫిలింఫేర్ అవార్డ్స్ హంగామా
జియో 65 సౌత్ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో దక్షణాది ఇండస్ట్రీలకు సంబంధించిన పలువురు తారలు పాల్గొని అవార్డులను అందుకున్నారు. ఈ ఈవెంట్‌ను సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ హోస్ట్ చేశారు. రకుల్ ప్రీత్‌సింగ్, రెజీనా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు హైలైట్‌గా నిలిచాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’, ఉత్తమ దర్శకుడు : రాజమౌళి (బాహుబలి: ది కన్‌క్లూజన్) ఉత్తమ నటుడిగా విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి), విమర్శకుల ఉత్తమ నటుడు వెంకటేశ్ (గురు), ఉత్తమ నటి: సాయి పల్లవి (ఫిదా), విమర్శకుల ఉత్తమ నటి : రితికా సింగ్ (గురు), ఉత్తమ సహాయ నటుడు : రానా దగ్గుబాటి (బాహుబలి: ది కన్‌క్లూజన్ ), ఉత్తమ సహాయ నటి : రమ్యకృష్ణ (బాహుబలి: ది కన్‌క్లూజన్), ఉత్తమ సంగీత దర్శకుడు, సాహిత్యం : కీరవాణి (బాహుబలి: ది కన్‌క్లూజన్), ఉత్తమ తొలి చిత్ర కథానాయిక : కల్యాణి ప్రియదర్శన్, ఉత్తమ ఛాయాగ్రాహకుడు: సెంథిల్ కుమార్ (బాహుబలి: ది కన్‌క్లూజన్), ఉత్తమ కొరియోగ్రాఫర్: శేఖర్ (ఖైది నెం:150, ఫిదా), జీవిత సాఫల్య పురస్కారాన్ని కైకాల సత్యనారాయణ అందుకున్నారు. తమిళం ఉత్తమ చిత్రం: ఆరమ్, మలయాళంలో ఉత్తమ నటుడిగా ఫాహిద్ ఫాజల్, కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ అవార్డులను కైవసం చేసుకున్నారు. రానా, విజయ్, శోభు యార్లగడ్డ -
వివాహిత దారుణహత్య
ఓ వివాహిత మహిళను ఒంటరిని చేసి పదిమంది చుట్టుముట్టి గ్రామం నడిబొడ్డున విచక్షణారహితంగా కట్టెలతో దాడిచేసి హతమార్చారు. అడ్డుకోబోయిన బాలింతను కాళ్లతో తన్ని దాష్టీకానికి దిగారు. ఈ దారుణాన్ని చూసి మనస్తాపానికి గురైన ఆడపడచు ఆత్మహత్యాయత్నం చేసింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ ఘటనలతో చాలకూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమందేపల్లి: చాలకూరు గ్రామంలో కల్యాణి (36) అనే వివాహిత దారుణహత్యకు గురైంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కల్యాణి, చిరంజీవి దంపతులు. చిరంజీవి, ఇంటి పక్కనే ఉన్న రాము, రామాంజినప్ప, రామాంజినమ్మలు గత కొద్దిరోజులుగా చిన్నపాటి గొడవలు పడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం హిందూపురం వెళ్లిన చిరంజీవిపై రాము, రామాంజినప్పలు దాడి చేశారు. దీంతో బాధితుడు సోమందేపల్లికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒకేసామాజిక వర్గానికి చెందిన వీరి మధ్య గొడవను రాజీ చేయించేందుకు శనివారం ఉదయం గ్రామపెద్దలు పంచాయితీ చేశారు. ఆ పంచాయితీ తీర్మానం మేరకు చిరంజీవి ఫిర్యాదును వెనక్కు తీసుకున్నాడు. దాష్టీకం జరిగిందిలా.. శనివారం సాయంత్రం ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న చిరంజీవి భార్య కల్యాణితో రాము, రామాంజినప్ప, రామాంజినమ్మ, నరసింహప్పలు గొడవకు దిగారు. గ్రామ నడిబొడ్డున దాదాపు పదిమంది ఆమెను చుట్టుముట్టి కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కల్యాణి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. దాడిని అడ్డుకునేందుకు బాలింత అయిన మేనకోడలు మంజుల ప్రయ త్నించింది. అయితే ఆ వ్యక్తులు బాలింత అని కూడా చూడకుండా కాళ్లతో తన్నారు. గ్రామ నడిబొడ్డున అందరూ చూస్తుండగా ఇంత ఘోరం జరుగుతున్నా అడ్డుకునేవారే లేరా అంటూ కల్యాణి ఆడపడచు అఖిల ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అనంతరం కల్యాణి, అఖిలను హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో కల్యాణి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చాలకూరులో పోలీస్ పికెట్ వివాహిత హత్యకు గురైనట్లు సమాచారం అందుకున్న పెనుకొండ సీఐ శ్రీనివాసులు, ఇన్చార్జ్ ఎస్ఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి చాలకూరు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గేవరకు రెండురోజులు పోలీస్ పికెట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. -
టీడీపీ ఎంపీలది రెండు నాల్కల ధోరణి
నక్కపల్లి (పాయకరావుపేట) : కేంద్రబడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయింపుల్లో జరిగిన అన్యాయంపై టీడీపీ ఎంపీలు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి ఆరోపించారు. సోమవారం ఆమె నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ విభజన చట్టంలో హామీలను నెరవేర్చాలని పార్లమెంట్లో ఒత్తిడి చేయలేక చేతకాని దద్దమ్మల్లా ఉండిపోయారని ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఏపీకీ ప్రత్యేకహోదా, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ సాధించడంలో వీరంతా విఫలమయ్యారని కల్యాణి విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంపై వైఎస్సార్ సీపీ ఎంపీలే పార్లమెంట్లో గట్టిగా నినాదాలు చేశారంటూ ఈరోజు వరకు కూడా వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదా కోసం రాజీలేనిపోరాటం చేస్తోందన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే కేంద్ర సహాయ నిరాకరణకు నిరసనగా తమ పార్టీ ఎంపీలు, మంత్రులతో∙రాజీనామాలు చేయించి ప్రజాతీర్పుకోరాలని ఆమె సవాల్ విసిరారు. సమావేశంలో సమన్వయకర్త వీసం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆలోచించింది... ఆవిష్కరించింది!
ఆమె వయసుకు చిన్నదే కాని, విజ్ఞతలో... విజ్ఞానంలో చాలా పరిణతి సాధించింది. పండ్లు, కూరగాయలతో పరిశోధనలు చేసి ఫలితాలు సాధిస్తోంది. తన మేటి ఆలోచనలతో హృదయ సంబంధిత వ్యాధిగ్రస్తులకు భరోసాను నింపింది. కూరగాయలు, పండ్లు నెలరోజులపాటు తాజాగా ఉండే కవచాన్ని తయారు చేసింది. శస్త్రచికిత్సల అనంతరం ఇన్ఫెక్షన్లను నివారించేందుకు, నొప్పిని తగ్గించేందుకు ప్యాచ్‌లను తయారు చేసింది. ఆ అత్యుత్తమ పరిశోధనాత్మక ఆలోచనకు ప్రతిష్టాత్మక గాంధీయన్ యంగ్ టెక్నోలాజికల్ ఇన్నోవేషన్ అవార్డును అందుకుంది. అమెరికాలో జరిగిన సెమినార్లో నొప్పిని తగ్గించే ప్యాచ్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రశంసలు అందుకుంది. వరంగల్‌లోని కొత్తవాడకు చెందిన ఆడెపు సదానందం, స్వప్న దంపతుల పెద్ద కుతురు శివకళ్యాణి. వీరిది చేనేత కుటుంబం. ఆ వృత్తిమీద వచ్చే అరకొర సంపాదనే వారికి జీవనాధారం. తమ పరిస్థితి బాగుపడాలంటే చదువుతోనే ఎదగాలనుకుంది శివకల్యాణి. మొదటి నుంచి చదువులో ప్రతిభను చూపించేది. డాక్టర్ కావాలన్న తన లక్ష్యాన్ని అందుకోవడానికి కొద్దిలో అవకాశం చేజారడంతో బీఫార్మసీలో చేరింది. పద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో బీఫార్మసీ, తర్వాత అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ రీసెర్చ్‌లో ఎమ్‌ఫార్మసీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఇండియన్ ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదారాబాద్‌లో పీహెచ్డీ చేస్తోంది. హృదయ సంబంధిత వ్యాధిగ్రస్తులకు భరోసా గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతే రక్త ప్రసరణ అగిపోయి గుండె జబ్బులకు కారణమవుతుంటుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి శస్త్రచికిత్స ద్వారా స్టెంట్లు వేస్తారు. వీటి ఖరీదు సుమారు రూ 30 వేల నుంచి రూ లక్ష వరకు ఉంటుంది. ఇంత ఖరీదైన వైద్యం చేయించినా రోగి బతుకుతాడనే నమ్మకం ఉండదు. కొన్నిసార్లు శస్త్రచికిత్స ఫెయిల్ అయితే, మరికొన్ని సార్లు స్టెంట్లు వేసిన చోట రక్తం గడ్డకట్టి కొత్త ప్రమాదాలు ముంచుకొచ్చి ఊహించని మరణాలు సంభవిస్తుంటాయి. దీనికి విరుగుడుగా కూరగాయల మొక్కల నుంచి తయారు చేసిన ఒక ఔషధాన్ని వాడొచ్చని నిరూపించింది శివకళ్యాణి. పెయిన్‌కు ప్యాచ్ మందు యాంటి బయోటిక్స్ వాడటం వలన శరిరంలోని వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే నొప్పుల నివారణ మందులను అధికంగా వాడితే జీర్ణశాయం, మూత్రపిండాలు, ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న ఔషధంలో వెయ్యవ వంతుతోనే వ్యాధి నయం అయ్యే పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది. శరీరంపై అతికించుకునే విధంగా ట్రాన్స్ నిర్మల్ ప్యాచ్‌ను తయారు చేసింది. ఈ ప్యాచ్‌కు సూక్ష్మమైన రంధ్రాలుండటం వల్ల చర్మం ద్వారా తక్కువ మోతాదులో ఎక్కువ గంటల సమయం ఔషధం శరీరంలో కలుస్తుంది. ఈ పరిశోధన ఫలితాలు ఇప్పటికే అప్లయిడ్ సర్ఫేస్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఫ్రిజ్ లేకుండానే పండ్లు, కూరగాయల నిల్వ పండ్లు, కూరగాయలను ఫ్రిజ్‌లో లేకుండానే నెల రోజుల పాటు నిల్వ ఉండే విధంగా ఒక విధమైన పొరను తయారు చేసింది శివకల్యాణి. నిమ్మజాతులతో పాటు, ద్రాక్ష పండ్ల రసాలను 14 రోజుల పాటు ప్రత్యేక యంత్రాల్లో నిల్వ ఉంచితే బ్యాక్టీరియల్ నానో సెల్యులోస్ ఫైబర్ ఏర్పడుతుంది. శుద్ది చేసిన అనంతరం దానికి వెండి ద్రావణం కలుపుతారు. ఈ ఫైబర్‌లో మూడు నుంచి ఐదు నానో మీటర్ల అతిసూక్ష్మ రంధాలలో ద్రావణ రూపంలో ఉన్న వెండిరేణువులు అతుక్కుపోతాయి. సూక్ష్మ వెండి రేణువులకు బ్యాక్టీరియాను చంపే శక్తి ఉంటుంది. ఇలా రూపొందించిన పొరను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పండ్లు, కూరగాయలపై అతికిస్తే దాదాపు 30 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఇదే పొరను శస్త్రచికిత్సల అనంతరం వచ్చే ఇన్ఫెక్షన్నూ నివారించేందుకు ఉపయోగించవచ్చు. బ్యాండేజీలో ఈ ఉత్పత్తిని ఉంచి కట్టుకడితే గాయంపై ఉన్న బ్యాక్టీరియా నశించడంతో పాటు గాయం నిరంతరం పొడిగా ఉంటుంది. యంగ్ టెక్నోలాజికల్ అవార్డు యువతలో సరికొత్త ఆలోచనలను ప్రోత్సహించి వాటికి ప్రాధాన్యం కల్పించి ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కేంద్రప్రభుత్వం గాంధీయన్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. దీనికి దేశ వ్యాప్తంగా దరఖాస్తులొస్తాయి. వచ్చిన ప్రతి ఆలోచనలను దేశంలోని అన్ని ఐఐటీలు, పరిశోధన కేంద్రాలు, ప్రముఖ శాస్త్రవేత్తలకు పంపిస్తారు. వాటిపై ఆధ్యయనం చేసి ఆచరణ సాధ్యమైన ఉత్తమాలోచనలను అవార్డులకు సిఫార్సు చేస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి శివకళ్యాణి ఈ అవార్డును అందుకుంది. అమెరికాలోని బోస్టన్ సిటీలో హైన్స్ కన్వెన్షన్ సెంటర్లో మెటీరియల్ రిసెర్చ్ సొసైటీ అర్గనైజేషన్(ఎంఆర్ఎస్) ఆధ్వర్యంలో ఇటీవల టూడీ నానో మెటీరియల్స్ ఇన్ హెల్త్ కేర్ సదస్సులు జరిగాయి. ఈ సదస్సుకు ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి పరిశోధకులు విచ్చేశారు. వారిలో భారతదేశం నుంచి హాజరైన ఆరుగురిలో శివకల్యాణి ఒకరు. నొప్పిని తగ్గించే ప్యాచ్‌పై ఆమె ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది అందరినీ ఆకట్టుకుంది. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, వరంగల్‌రూరల్ ఫోటోలు: పెద్దపల్లి వరప్రసాద్, వరంగల్ రూరల్ అమ్మానాన్నల ప్రోత్సాహంతో.... నేను ఇవ్వాళ ఈ స్థాయికి వచ్చానంటే అమ్మానాన్నల ప్రోత్సాహమే కారణం. మా అమ్మానాన్నలు రోజుకు 12 గంటల పాటు కష్టపడి చేనేత పని చేస్తున్నారు. మరిన్ని పరిశోధనలు చేసి పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధమైనవి కనుక్కొంటాను. నా పరిశోధనలకు మా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎంతగానో సహకరిస్తున్నారు. – శివకళ్యాణి సాయం చేస్తే... సార్థకం చేస్తుంది నేను కష్టపడి సంపాదించిన ప్రతి పైసాకూ మా పిల్లలు తగిన గుర్తింపును ఇచ్చారు. పేదకుటుంబమైనా, మా పిల్లల చదువు కోసం వెనుకడుగు వేయలేదు. నేను ఎంత కష్టమైనా పడి పిల్లలను చదివిస్తున్నాను. చేనేత వర్గానికి చెందిన వాళ్ళం మేము. నా కూతురు చేసే పరిశోధనలపైన రాష్ట్రప్రభుత్వం, ఇతర పెద్దలు దృష్టి పెట్టి సహాయం చేస్తే ప్రజలకు ఉపయోగపడే వాటిని నా కూతురు కనుక్కొని చవకగా అందజేస్తది. -
పొరుగింట్లో కల్యాణి
పొరిగింటి పుల్లకూర రుచి అన్నది నానుడి. ఇది వాస్తవం కూడా. కమలహాసన్ వారసురాలు శ్రుతిహాసన్ నటిగా పరిచయమైంది బాలీవుడ్లోనే. తర్వాత టాలీవుడ్, ఆపై కోలీవుడ్‌లో రంగప్రవేశం చేశారు. ఒకప్పటి అందాల తార రాధ కూతురు కార్తీక మలయాళీ. రాధ కోలీవుడ్, టాలీవుడ్‌లలో కథానాయకిగా రాణించినా తన కూతుర్ని హీరోయిన్గా పరిచయం చేయడానికి మాలీవుడ్, కోలీవుడ్‌ల్లో చాలా ప్రయత్నాలు చేశారు. అయితే తొలుత జోష్ అనే టాలీవుడ్ చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ తరువాత కోలీవుడ్‌లో నటించిందనుకోండి. ఇక అతిలోక సుందరి శ్రీదేవి తన కూతురు జాన్వీని తొలుత తెలుగులో పరిచయం చేయాలని భావించినా హిందీ చిత్రం ద్వారా పరిచయం అవుతోంది. తాజాగా కల్యాణి విషయంలోనూ ఇదే జరిగింది. ఇంతకీ కల్యాణి ఎవరో చెప్పలేదు కదూ. ప్రముఖ మలయాళీ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల కూతురే ఈ బ్యూటీ. ప్రియదర్శన్, లిజీలు సుమారు 25 ఏళ్లు కలిసి కాపురం చేసి మనస్పర్థల కారణంగా ఈ మధ్యనే విడిపోయారు. వీరికి ఒక కూతురు, కొడుకు. ఆ కూతురే కల్యాణి. న్యూయార్క్‌లో చదువుకుంటున్న కల్యాణిని హీరోయిన్ చేయడానికి లిజీ కోలావుడ్‌లో చాలా ప్రయత్నాలే చేశారు. అయితే అవేవీ ఫలించలేదు. టాలీవుడ్ మాత్రం కల్యాణిని కథానాయకిగా స్వాగతించింది. నాగార్జున రెండో వారసుడు అఖిల్ హీరోగా నటించిన హలో చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైంది. 24 చిత్రం ఫేమ్ విక్రమన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 22న తెరపైకి రానుంది. ఈ చిత్రం హిట్ అయితే ఆమెను కోలీవుడ్ కచ్చితంగా రెడ్‌కార్పెట్‌తో స్వాగతిస్తుందని చెప్పవచ్చు. -
హలో... అప్పుడు రావడం పక్కా!
ఏడు నెలల క్రితం ఎంతో ఎగై్జటింగ్‌గా అఖిల్ ‘హలో... కొత్త సినిమా స్టార్ట్ చేశా గురూ’ అన్నారు. ఏడు నెలల తర్వాత ఇప్పుడూ అంతే ఎగై్జటింగ్‌గా ‘హలో.. లాస్ట్ షెడ్యూల్లోకి ఎంటరయ్యా’ అంటున్నారు. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఎంత ఎగై్జటెడ్‌గా ఉన్నారో... ఎండింగ్‌కి వచ్చేసరికి అంతే ఎగై్జటెడ్‌గా ఉన్నారు అఖిల్. దాన్ని బట్టి షూటింగ్‌ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఊహించవచ్చు. అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘హలో’ చివరి షెడ్యూల్ జరుగుతోంది. ముందుగా ప్రకటించినట్లుగానే డిసెంబర్ 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అఖిల్ తలకిందులుగా ఉన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత గాల్లో ఎగురుతున్నట్లు ఉన్న సెకండ్ స్టిల్ కూడా సూపర్ అనిపించుకుంది. హిట్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. అక్కినేని కుటుంబానికి కలిసొచ్చిన నెల డిసెంబర్. నాగార్జున నటించిన పలు చిత్రాలు ఈ నెలలోనే విడుదలై, మంచి హిట్టయ్యాయి. ఆ సెంటిమెంట్‌ని బట్టి చూస్తే.. ‘హలో’ కూడా హిట్టే అని ఫిక్సయ్యారు అక్కినేని అభిమానులు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కల్యాణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ‘‘ముందు చెప్పినట్లే డిసెంబర్ 22న సినిమా విడుదలవుతుంది. త్వరలో మరిన్ని ఆసక్తికర విషయాలు చెబుతా’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు అఖిల్. -
బెట్టింగ్ నేపథ్యంలో...
శ్రనిత్ రాజ్, కల్యాణి, అనిరుథ్, నేహా, ‘చిత్రం’ శీను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గేమర్’. బి.జి. వెంచర్స్ పతాకంపై రాజేశ్ తడకల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో చిత్రబృందం సినిమా విశేషాలు పంచుకున్నారు. దర్శక–నిర్మాత రాజేశ్ తడకల మాట్లాడుతూ– ‘‘బెట్టింగ్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ చిత్రమిది. లవ్, హారర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సన్నివేశాలు ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగిస్తాయి. మా బ్యానర్లో రూపొందిస్తోన్న ఏడవ సినిమా ఇది. ప్రతిసారి కొత్తవారితోనే సినిమాలు చేస్తున్నాం. ఈ సినిమాతో శ్రనిత్ రాజ్, కల్యాణిలను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నా. బి.జి. యాక్టింగ్ అకాడమీ ద్వారా నటీనటులను ఎంపిక చే శాం’’ అన్నారు. ‘‘గేమర్’లో నాది ఛాలెంజింగ్ పాత్ర. ఈ సినిమా ట్రెండీగా, అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శ్రనిత్ రాజ్, కల్యాణి, అనిరుధ్, నేహా తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణిఖని ఓసీపీ సిద్ధం
- సింగరేణి ఖాతాలోకి మరో ఓపెన్‌కాస్ట్ - ఈ నెలాఖరులోగా ఉత్పత్తి ప్రారంభం ∙లక్ష్యం ఏటా 2 మిలియన్ టన్నులు సాక్షి, మంచిర్యాల: సింగరేణి ఖాతాలోకి మరో ఓపెన్‌కాస్ట్ గని చేరింది. మంచిర్యాల జిల్లా లోని మందమర్రి ప్రాంతంలో ప్రతిపాదించిన కల్యాణిఖని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు పనులు శరవేగంతో సాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా గని నుంచి బొగ్గు ఉత్పత్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో సింగరేణిలో ఓపెన్‌కాస్ట్ గనుల సంఖ్య 19కి చేరనుంది. భూగర్భ గనుల స్థానంలోనే.. సింగరేణి మందమర్రి ఏరియాలో సోమ గూడెం 1, 1ఏ, 3 గనులతోపాటు కల్యాణిఖని 2, 2ఏ పేరుతో భూగర్భ గనులు ఉండేవి. భూగర్భగనుల ద్వారా బొగ్గు వెలికితీతతో నష్టాలు వస్తుండడంతో వీటిని 2006–07లోనే మూసివేసి ఓపెన్‌కాస్ట్ గనిని తేవాలని సంస్థ నిర్ణయించింది. ఓపెన్కాస్ట్లపై స్థానికంగా వ్యతిరేకత ఎదురవడం, భూ సమస్య, 1/70 గిరిజన చట్టం నేపథ్యంలో ప్రణాళికా బద్ధంగా సోమగూడెం 1వ గనితోపాటు కేకే 2 గని జీవితకాలాన్ని తగ్గించి మూసివేసింది. కాసిపేట ఓపెన్‌కాస్ట్ పేరుతో కొత్త గనికి అంకురార్పణ చేసేందుకు జరిగిన ప్రయత్నాలను స్థానికులు వ్యతిరేకించారు. దీంతో 2013లో మందమర్రి ఏరియాలోని కల్యాణిఖని–2 వద్ద ప్రజాభిప్రాయం చేపట్టి, కళ్యాణిఖని ఓపెన్‌కాస్ట్‌కు శ్రీకారం చుట్టింది. 945 హెక్టార్ల భూమి అవసరం కల్యాణిఖని ఓపెన్‌కాస్ట్ కోసం ప్రస్తుతం సింగరేణి సంస్థ అధీనంలో 246.17 హెక్టార్ల భూమి ఉండగా, మరో 250 హెక్టార్ల వరకు భూసేకరణ ద్వారా స్వాధీనం చేసుకుంది. మరో 250 హెక్టార్ల వరకు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. పలు వివాదాల నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 500 హెక్టార్ల భూమిలో పనులు ప్రారంభించాలని నిర్ణయించి, మార్చి 24న భూమిపూజ చేశారు. ప్రస్తుతం ఓబీ (మట్టి) తొలగింపు పనులు శరవేగంగా సాగుతున్నాయి. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. కల్యాణిఖని ఓపెన్‌కాస్ట్ ప్రొఫైల్.. ఓపెన్‌కాస్ట్ కోసం అవసరమైన భూమి: 945.21 హెక్టార్లు గని విస్తీర్ణం: 799.98 హెక్టార్లు ముంపు గ్రామాలు: కాసిపేట మండలంలోని దుబ్బగూడెం, గొండుగూడెం గని జీవిత కాలం: 19 సంవత్సరాలు బొగ్గు నిల్వలు: 45.32 మిలియన్ టన్నులు భూగర్భం ద్వారా తీసిన బొగ్గు: సోమగూడెం –1, 1ఏ, 3, కె.కె–2, 2 ఏ ద్వారా 10.25 మిలియన్ టన్నులు తీయాల్సిన బొగ్గు: 30.54 మి.టన్నులు బొగ్గు గ్రేడ్ : జీ–10 ఉత్పత్తి లక్ష్యం: ఏటా 2 మిలియన్ టన్నులు పెట్టుబడి: రూ. 417.33 కోట్లు బొగ్గు, మట్టి వెలికితీత రేషియో: 1:12 బొగ్గు లభించే లోతు: 15 నుంచి 250 మీ. గనిలో తీసే మట్టి (ఓబీ): 365.49 మిలియన్ క్యూబిక్ మీటర్లు -
మరో వారసురాలి తెరంగేట్రం
తమిళసినిమా: మరో నట వారసురాలు కథానాయకిగా తెరంగేట్రం చేయడానికి రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీ కూతురు కల్యాణి కథానాయకిగా తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. దర్శకుడు ప్రియదర్శన్, లిజీలకు కల్యాణి, సిద్ధార్థ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా రెండేళ్ల కిందట ప్రియదర్శన్, లిజీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పిల్లలు లిజీ సంరక్షణలోనే పెరుగుతున్నారు. న్యూయార్క్‌లో చదువు పూర్తి చేసిన కల్యాణి సినీరంగంపై ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే విక్రమ్, నయనతార జంటగా నటించిన ఇరుముగన్ చిత్రానికి సహాయదర్శకురాలిగా పని చేసింది. కాగా కల్యాణిని కథానాయకి చేసే పనిలో ఆమె తల్లి లిజీ ముమ్మరంగా ఉన్నట్లు సమాచారం. తాజాగా దర్శకుడు విక్రమ్‌కుమార్ దర్శక్వతం వహిస్తున్న తెలుగు చిత్రంలో యువ నటుడు అఖిల్‌కు జంటగా కల్యాణి ఎంపికయినట్లు తాజా సమాచారం. నాగార్జున నిర్మించనున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. మరో పది రోజుల్లో కల్యాణి ఈ షూటింగ్లో జాయిన్ కానున్నట్లు సినీవర్గాల సమాచారం. కాగా విక్రమ్‌కుమార్ కల్యాణి తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్ శిష్యుడన్నది గమనార్హం. అదే విధంగా కల్యాణి మరో మలయాళ చిత్రంలో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. -
కల్యాణితో జోడీ కుదిరిందా?
అఖిల్ సినిమాలో హీరోయిన్ ఎవరు? గత కొన్నాళ్లుగా జరుగుతోన్న చర్చ ఇది. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం షూటింగ్ ఆరంభమైంది. అయితే కథానాయికను ఫైనలైజ్ చేయలేదు. దాంతో ఈ అక్కినేని యువ హీరో సరసన ఎవరు నటిస్తారు? అనే చర్చల్లో పలువురి కథానాయికల పేర్లు వినిపించాయి. తాజాగా, దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కల్యాణి పేరు వినిపిస్తోంది. మలయాళం, తమిళ్, హిందీ చిత్రాలతో పాటు నాగార్జునతో తెలుగులో ‘నిర్ణయం’ చిత్రం తెరకెక్కించారు ప్రియదర్శన్. తండ్రి బాటలో కల్యాణి డైరెక్టర్ కావాలనుకున్నారని తెలుస్తోంది. విక్రమ్ హీరోగా రూపొందిన ‘ఇంకొక్కడు’ సినిమాకు ఆమె అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. సో.. కల్యాణి డైరెక్టర్ కావడం ఖాయం అనుకుంటున్న టైమ్‌లో ఆమె కథానాయికగా చేయనుందనే వార్త వచ్చింది. మరి.. అఖిల్ సరసన కథానాయికగా నటించబోయేది కల్యాణియేనా? వెయిట్ అండ్ సీ. -
మహిళా కండక్టర్‌ను చంపి తగులబెట్టారు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ)లో కండక్టర్‌గా పనిచేస్తోన్న కల్యాణి అనే మహిళ దారుణహత్యకు గురైంది. రెండు రోజుల కిందట అదృశ్యమైన ఆమె.. ప్రాణాలు కోల్పోయి, సగం కాలిన స్థితిలో కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఆర్టీసీ కండక్టర్ అయిన కల్యాణి తన భర్త వెంకట రాఘవయ్యతో కలిసి గుంటూరు నగరంలోని సంపత్ నగర్లో నివసించేది. మూడు రోజుల కిందట కల్యాణి అనూహ్యంగా అదృశ్యమైంది. దీంతో కల్యాణి సోదరి రెండు రోజుల కిందట లాలాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేసింది. పోలీసులు కల్యాణి గురించి గాలిస్తుండగానే.. సోమవారం గుంటూరు శివారు బొంతపాడులో సగం కాలిపోయిన మహిళ శవాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ శవం కల్యాణిదేనని నిర్ధారించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎవరు చంపారు?: కల్యాణిని భర్త రాఘవయ్యే చంపేసి ఉంటాడని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. సంపత్ నగర్‌లోని ఇంట్లోనే రోకలి బండతోమోది కల్యాణిని చంపేసి, వాహనంలో శవాన్ని బొంతపాడుకు తీసుకొచ్చి తగులబెట్టి ఉంటారని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం రాఘవయ్యను విచారిస్తున్నామన్న పోలీసులు నిందితులను వదిలిపెట్టబోమని చెప్పారు. కుటుంబ కలహాలు?: మృతురాలు కల్యాణికి భర్త రాఘవయ్యకు మధ్య ఇటీవల విభేదాలు తలెత్తాయని, ఈ నేపథ్యంలోనే భర్త దారుణానికి పాల్పడి ఉంటాడని పలువురు అనుమానిస్తున్నారు. -
ఏపీ అసెంబ్లీ వద్ద కలకలం
- అసెంబ్లీ గేటు ముందు యువతి ఆత్మహత్యాయత్నం అమరావతి: ఏపీ అసెంబ్లీ వద్ద ఒక యువతి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఏపీ అసెంబ్లీ రెండో గేట్ వద్ద జరిగిన ఈ ఘటన వివరాలివీ.. శ్రీకాకుళానికి చెందిన కళ్యాణి నాలుగో తరగతి ఉద్యోగినిగా పనిచేస్తోంది. తనకు కొన్ని రోజులుగా ఉన్నతాధికారులు వేతనం ఇవ్వటం లేదని ఆమె ఆరోపిస్తోంది. దీనిపై సీఎంను కలిసేందుకు ఆమె బుధవారం ఉదయం వెలగపూడిలోని అసెంబ్లీ వద్దకు వచ్చింది. అయితే లోపలికి ప్రవేశించేందుకు యత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సిబ్బంది వెంటనే ఆమెను మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. గతంలోనూ ఇదే విధంగా ప్రయత్నించగా ముఖ్యమంత్రి ఆమెకు రూ. 25 వేలు అందజేశారని.. అప్పటి నుంచి కల్యాణి ఇలా వ్యవహరిస్తూ హంగామా చేస్తుంటుందని ఆమె స్నేహితులు అంటున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
నార్పల: బంధువుల ఇంట జరుగుతున్న శుభకార్యానికి వెళ్తుండగా సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వివాహిత మృతి చెందింది. వివరాలు.. శింగనమలకు చెందిన మిట్టు కళ్యాణి (36) భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై ధర్మవరానికి వెళ్తున్నారు. నార్పల మండల పరిధిలోని బొమ్మకుంటపల్లి క్రాస్ సమీపంలో తాడిపత్రి – ధర్మవరం రహదారిపై ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి ద్విచక్రవాహనం అదుపుతప్పింది. దీంతో భార్యాభర్తలు పవ¯ŒSకుమార్, కళ్యాణి కింద పడిపోయారు. తలకు బలమైన గాయంకావడంతో తీవ్ర రక్తస్రావం జరిగిన కళ్యాణిని చికిత్స నిమిత్తం బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ఆమె ప్రాణాలు విడిచింది. మృతురాలి సోదరుడు చంద్రమోహ¯ŒS ఫిర్యాధు మేరకు నార్పల ఏఎస్ఐ రామచంద్రారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విషం కక్కుతున్నారు!
ఈ అమ్మాయి కల్యాణి. తల్లి సత్యవతి... నెలరోజులుగా జైల్లో ఉంది! అన్న వాసు... అతనూ జైల్లోనే ఉన్నాడు! తండ్రికి క్యాన్సర్. ఆయన మంచంలో ఉన్నాడు! ఫుడ్ పార్క్‌ను నిర్మించి కుటుంబాలను, ఊళ్లను విషమయం చెయ్యొద్దన్నందుకు ఈ ఇంటిపై వ్యవస్థ విషం కక్కింది. తల్లికి, అన్నకు బెయిల్ రాకుండా చేస్తోంది. వాళ్లు ఇంటికి వస్తేనే తండ్రి బతుకుతాడు. విష యంత్రాలు వెళ్లిపోతేనే ఊరు బతుకుతుంది. ఇల్లు, ఊరు బాగుండాలని కల్యాణి ఆకాంక్ష.. ఆ కుటుంబం ఊరి కోసం పోరాటం చేస్తోంది! ఊళ్లోవాళ్లకు అండగా నిలిచినందుకు ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొంటోంది. ఆ ఇంటి తల్లిని జైల్లో వేశారు. ఆ ఇంటి కొడుకును ఇంకో జైల్లో ఖైదు చేశారు. ఆ ఇంటి పెద్ద అనారోగ్యంతో సతమతమవుతున్నాడు. ఇదీ.. పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులోని సత్యనారాయణ కుటుంబ పరిస్థితి. ‘‘మా ఊళ్లో ఆక్వా ఫ్యాక్టరీ కట్టొద్దు. ఆ కాలుష్య విషసర్పానికి మా ప్రాణాలను ఫణంగా పెట్టొదు’ అని నినదించిన ప్రజలతో గొంతు కలిపినందుకు సత్యనారాయణ భార్య సత్యవతిని తణుకు జైల్లో పెట్టారు. ఉద్యమానికి ఊతం ఇచ్చినందుకు ఆయన కొడుకు వాసును నరసాపురం జైల్లో బంధించారు. చెట్టుకొకరు పుట్టకొకరుగా మారడంతో ఆ ఇల్లు తల్లడిల్లుతోంది. ఊరు ఊరంతా ఆ తల్లీకొడుకుల విడుదల కోసం ఎదురుచూస్తోంది. వాళ్లతో పాటు ఆ ఇంటి ఆడపిల్ల కల్యాణి కూడా. అమ్మ కోసం, అన్న కోసం... వెయ్యి కళ్లతో నిరీక్షిస్తోంది. ఈ సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలీ’... కల్యాణిని పలకరించింది. మీ కుటుంబానికే ఇంత కష్టం ఎందుకు వచ్చింది? ఇది మా ఇంటి కష్టం కాదు. మా ఊరి కష్టం. కానీ మీ కుటుంబ సభ్యులను మాత్రమే వేధిస్తున్నారు కదా! ఊరి తరఫున మా అమ్మ, మా అన్న ముందుకొచ్చి మాట్లాడారు. అందుకే మాపై వేధింపులు. ముప్పై ఏళ్ల క్రితం నాన్న తుందుర్రు వచ్చారు. మేం ఇక్కడే పుట్టాం. ఇక్కడే పెరిగాం. కొద్దిగా పొలం ఉంది. నాన్నే సాగు చేస్తారు. ఆ గింజలు తింటున్నాం. ఈ గాలిని పీలుస్తున్నాం. ఇప్పుడీ గాలి, గింజ... ఫ్యాక్టరీ కారణంగా విషమయం కాబోతున్నాయి. ఈ భయం ఊరంతటికీ ఉంది. కానీ అడిగేవారెవరు? అన్న డిగ్రీ వరకు చదువుకున్నాడు. కొద్దో గొప్పో లోకం తెలిసినవాడు. ఊళ్లో నోరు లేని వాళ్లకు మా అన్నే నాయకుడు. ‘ఫుడ్ పార్క్ నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ’ నాయకుడిగా ఊరు మా అన్నను ఎన్నుకుంది. మీ అమ్మగారిని కూడా జైల్లో వేశారు. ఆమె కూడా మీ అన్నయ్యకు బాసటగా ఉన్నారా? అన్నకు కాదు. ఊరికి బాసటగా ఉన్నారు. మా అమ్మ మహిళా నాయకురాలు కాదు. కనీసం డ్వాక్రా గ్రూపు లీడర్ కూడా కాదు. ఫ్యాక్టరీ వద్దని ఊరి మహిళల తరఫున మాట్లాడ్డమే మా అమ్మ తప్పయింది! సెప్టెంబర్ 20న పాలకొల్లులో విశ్వమానవ వేదిక స్వచ్ఛంద సంస్థ సమావేశానికి మా ఊళ్లోవాళ్లంతా వెళ్లారు. అక్కడ మా అమ్మ మాట్లాడింది. 144 సెక్షన్ ఉందని, ఎవరూ మాట్లాడకూడదని చెప్పి అక్కడికక్కడ మా అమ్మను పోలీసులు అరెస్టు చేశారు. జీపులో ఎక్కించుకుని వెళ్లి తణుకు సబ్జైల్లో పెట్టారు. నిజానికి ఆరోజు అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లేదు. ప్రజల తరఫున మాట్లాడినందుకే అమ్మను అరెస్టు చేశారు. ఆమెను జైల్లో ఉంచి నెలరోజులు దాటిపోయాయి. మీ అన్నయ్యను ఎందుకు అరెస్ట్ చేశారు? సెప్టెంబర్ 7న తుందుర్రులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఎంక్వయిరీకి వచ్చారు. ఫ్యాక్టరీ వాళ్లను కలసి గ్రామస్తులను సంప్రదించకుండా వెళ్లిపోయారు! దాంతో పోరాటకమిటీ నాయకులు వారిని కలిసేందుకు వినతి పత్రాలు తీసుకుని వెళుతుంటే.. కొంతమంది వ్యక్తులు ఫ్యాక్టరీకి అనుకూలంగా ఉన్న మరికొంతమంది వ్యక్తులతో కలిసి మా అన్నయ్య వాళ్లను రెచ్చగొట్టారు. ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరుపక్షాలు కేసులు పెట్టుకునే వరకూ వెళ్లింది. కానీ మిగతా అందర్నీ వదిలేసి అదే రోజు మా అన్నయ్యను, మరో ఐదుగురిని అరెస్టు చేశారు. మా అన్నయ్యను అరెస్టు చేస్తే ఫ్యాక్టరీ నిర్మాణానికి అడ్డు ఉండదనే ఆలోచనతో పథకం ప్రకారమే రెచ్చగొట్టారు. అన్నయ్యపై హత్యాయత్నం (307 సెక్షన్), రౌడీ షీటర్ కింద కేసు నమోదు చేశారు. ఆక్వా పార్క్ కడితే మీకొచ్చే నష్టం ఏమిటి? ఊళ్లో ఎవరిని అడిగినా చెప్తారు. తుందుర్రులో నిర్మించే ఫ్యాక్టరీ నుంచి చేపలు, రొయ్యలు రెడీ టు కుక్ పద్ధతిలో ఇతర దేశాలకు, రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. రోజుకు వెయ్యి టన్నుల చేపలు, రొయ్యలు శుభ్రం చేసే ఈ ఫ్యాక్టరీని ఎక్కడో దూరంగా పెట్టకుండా జనావాసం ఉన్న జొన్నలగరువు, తుందుర్రు, కంసాలి బేతపూడి గ్రామాల మధ్యే కడుతున్నారు. ఫ్యాక్టరీకీ మంచినీటి చెరువుకూ 100 మీటర్ల దూరం కూడా లేదు. ఫ్యాక్టరీలో అమ్మోనియా నైట్రేట్, సాల్ట్‌లతో చేపలు, రొయ్యలను శుభ్రం చేసి వృథా నీటిని ఈ ప్రాంతంలో వదులుతారు. దీని వల్ల మూడు పంటలు పండే ఊరి భూములు ఉప్పుకయ్యలుగా మారిపోతాయి. జీవనదిగా ఉన్న గొంతేరు డ్రెయిన్ విషతుల్యం అవుతుంది. ఇప్పటికే భీమవరంలోని యనమదుర్రు డ్రైన్ మురికి కాల్వగా మారిపోయింది. ఈ వివరాలన్ని విశ్లేషకులు, నిపుణులు, ప్రజా నాయకులు చెప్పి చైతన్యపరచడంతో గ్రామస్తులలో ఫ్యాక్టరీ నిర్మాణంపై వ్యతిరేకత ఏర్పడింది. అందుకే ఊరు పోరాడుతోంది. చాలాకాలంగా పోరాటం చేస్తున్నట్లున్నారు... అవును. చాలాకాలంగానే. సుమారు 40 గ్రామాల ప్రజలకు, ఫుడ్‌పార్కు యజమానులకు మధ్య జరుగుతోంది. రెండున్నరేళ్ల క్రితం ఈ ప్రాంతంలోని ఆనంద గ్రూప్ సంస్థ రూ.150 కోట్ల సబ్సిడీతో రొయ్యలు, చేపల శీతల గిడ్డంగుల ఫ్యాక్టరీని నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. భీమవరం మండలంలోని తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల మధ్యన దీనిని నిర్మించేందుకు పనులు కూడా మొదలుపెట్టారు. ముందుగా రైతుల నుంచి - చేపల చెరువులు వేస్తున్నామని చెప్పి - 68 ఎకరాల భూమిని రూ. 8 నుంచి 12 లక్షలకు కొనుగోలు చేశారు. కానీ అది అబద్ధం అని తర్వాత తెలిసింది. 6 నెలలు తరువాత ఆ భూమిలో ‘గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కు’ అని బోర్డు పెట్టారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి ముందు మీ ప్రాంతంలోని ప్రజల అభిప్రాయం తీసుకోలేదా? లేదు. మేమే వెళ్లి కలెక్టర్‌కు, సబ్‌కలెక్టర్‌కు, ఇతర ఉన్నతాధికారులకు గోడు వెళ్లబోసుకుంటున్నాం. ఫ్యాక్టరీ వద్దని ఈ ప్రాంత ప్రజలు సుమారు 6 వేల మంది జనవరి 22న శాంతియుతంగా ర్యాలీ చేసేందుకు ప్రయత్నించారు. అప్పుడు ప్రజలకు, పోలీసులకు తీవ్రవాగ్వాదం జరిగింది. అది తెలిసి నేను అత్తగారింటి నుంచి మా వాళ్లు ఎలా ఉన్నారో చూడ్డానికి ఇక్కడికి వచ్చాను. అప్పుడు మా అన్నయ్య విపరీతమైన ఒత్తిడిలో ఉండడం చూశాను. ఎలాంటి ఒత్తిడి? అన్నయ్య ఫుడ్‌పార్కు పోరాటం నుంచి తప్పుకుంటే ఫ్యాక్టరీ యజమానులు రూ. 50 లక్షలు నగదు, కోరుకున్న చోట స్థలం, ఉద్యోగం ఇస్తామంటూ ఒత్తిడి తీసుకువచ్చారు. అన్నయ్య వినలేదు. అందుకే అక్రమంగా నిర్బంధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఏమంటున్నారు? పవన్ కల్యాణ్ చెప్పడంతో మేము టీడీపీకి ఓట్లేశాం. మొదట్లో నరసాపురం ఎమ్మెల్యే మాధవనాయుడు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఫ్యాక్టరీ ఆపేస్తున్నాం అని చెప్పారు. మేం ఊపిరి పీల్చుకున్నాం. మళ్లీ మూడు నెలలకు వచ్చి ఫ్యాక్టరీ ఉంటుందనీ అయితే దాని వల్ల నష్టాలు ఉండవని చెప్పారు. మా సమస్యలు తీర్చాల్సిన నాయకులే అలా అంటే ఎలా చెప్పండి? మీ నాన్నగారి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడెలా ఉంది? ఆయన క్యాన్సర్ పేషెంట్. లివర్ దగ్గర కణితి ఉండటంతో హైదరాబాద్ నిమ్స్‌లో ఆపరేషన్ చేయించుకున్నాడు. అమ్మే సపర్యలు చేస్తోంది. భార్య తన దగ్గర లేదన్న బెంగే క్యాన్సర్ కన్నా ఎక్కువగా ఆయన్ని కుంగదీస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి మా పోరాటానికి మద్దతు ఇచ్చి మా దగ్గరకు వచ్చి భరోసా ఇవ్వడంతో ఫ్యాక్టరీ నిర్మాణం ఆగుతుందన్న నమ్మకం మాలో కలిగింది. ఫ్యాక్టరీ నిర్మాణం ఆగేవరకూ పోరాడుతాం. సాక్షి పత్రికే మా ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకువచ్చింది. - కల్యాణి -
23న జాబ్‌మేళా
అనంతపురం ఎడ్యుకేషన్ : చెన్నైకు చెందిన బాట్లిబాల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఈనెల 23న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి ఎ.కళ్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. బీటెక్ (ఈఈఈ), డిప్లొమా ఎలక్ట్రికల్ విద్యార్హతలు ఉన్నవారు అర్హులన్నారు. 25–35 ఏళ్లలోపు పురుఫులకు మాత్రమే అవకాశం ఉందన్నారు. మొత్తం 60 ఖాళీలు ఉన్నాయని, జీతం నెలకు రూ. 15 వేలు ఉంటందని, ఎంపికైన వారు అనంతపురం జిల్లాలోనే పని చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు 23న ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక ప్రభుత్వ బాలికల ఐటీఐలో జరిగే జాబ్‌మేళాకు బయోడేటాతో పాటు విద్యార్హత పత్రాలతో హాజరుకావాలన్నారు. వివరాలకు 88868 82092 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
హుస్సేన్ సాగర్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం
హుస్సేన్‌సాగర్‌లో దూకి ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. సమయానికి లేక్ పోలీసులు అక్కడే ఉండటంతో వెంటనే రక్షించారు. తాగుబోతు భర్త అమానుషంగా చితకబాదడంతో భరించలేకే ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని బాధితురాలు కళ్యాణి తెలిపింది. భోలక్‌పూర్ మేకలమండికి చెందిన కల్యాణి భర్త చిన్ని రాజు వేధింపులు భరించలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని లేక్ పోలీస్‌స్టేషన్ సీఐ శ్రీదేవి తెలిపారు. కౌన్సెలింగ్ నిర్వహించి ఇంటికి పంపించివేసినట్లు తెలిసింది. -
గడుసు దెయ్యం
చేతనబడి సాధారణంగా... దెయ్యం మనిషిని పట్టుకుంటుంది. మరి, మనిషే దెయ్యాన్ని పట్టుకుంటే? అక్కడో కథ ఉంటుంది. వ్యథ ఉంటుంది. దెయ్యాలు ఉన్నాయా? లేవా? అన్నది వేరే టాపిక్. ఈ కథలోని అమ్మాయి దెయ్యాన్ని పట్టుకుంది. పట్టుకుని ఏం చేసింది? ఏం సాధించింది? చదవండి. మాఘమాసం. ‘ఇదిగో.. వెళ్లిపోతున్నా’నన్న సంకేతాలిస్తూనే మధ్యరాత్రి రగ్గు వెతుక్కునేటట్లు చేస్తోంది చలి. పగలవగానే సూర్యుడూ బద్దకంగానే ఒళ్లు విరుచుకుంటున్నాడు. ఉండీలేనట్లున్న చలి; లేనట్లు, ఉన్నట్లున్న గోరువెచ్చని ఎండ. పెళ్లి పనులు చేసుకోవడానికి, పెళ్లికి హాజరయ్యే వారికి హాయైన వాతావరణం ఇది. ఉదయం పది గంటలు. కల్యాణిని పెళ్లి కూతురిగా అలంకరిస్తున్నారు. ఇంటి ముందు పెళ్లిపందిరి. బంధువులు ఒక్కొక్కరే వస్తున్నారు. పట్టుచీర కట్టుకున్న వధువు మండపంలోకి అడుగుపెట్టింది. కొబ్బరికాయను పూజారి చేతిలో పెట్టి పీటల మీద కూర్చుంది. పూజారి ఇచ్చిన అక్షతలను గౌరీదేవి మీద వేయకుండా పూజారి ముఖం మీదకు చల్లింది! పూజారి ఖంగుతిన్నాడు. అంతలోనే సర్దుకుని ‘గౌరీదేవికి పూజ చేయమ్మా’ అన్నాడు అనునయంగా. అమ్మాయి కళ్లెర్రబడ్డాయి. బాడీ లాంగ్వేజ్ మారింది. ‘ఎందుకు గౌరీ పూజ, ఎవరికి పెళ్లి చేస్తున్నావ్’ అంటూ పూజ సామగ్రిని చిందరవందర చేస్తోంది. వేదిక కింద కూర్చున్న వాళ్లకు పరిస్థితి అర్థంకావడం లేదు. ‘పెళ్లి కూతురికి దెయ్యం పట్టినట్లుంది’... గుసగుసలాడుతున్నారు వేదిక మీదున్న మహిళలు. ‘ఆ...’ అంటూ కంగారుపడ్డారు పెళ్లికొడుకు బంధువులు. వెంటనే వేదిక దిగి ఓ పక్కగా గుమిగూడి... ‘పెళ్లిచూపులప్పుడు బాగానే ఉందా, అప్పుడెవరెవరెళ్లారు, వాళ్లింట్లో ఇంకెవరికైనా గాలి పట్టిందా...’ ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఆరా తీస్తున్నారు. ఈ మాటలన్నీ పెళ్లికూతురి బంధువుల చెవిన కూడా పడుతున్నాయి. ‘లక్షణంగా చదువుకుంటున్న పిల్ల. ఎప్పుడూ ఇలాంటిది లేదు. శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఇప్పుడు దెయ్యం పట్టడమేంటి?’ ఆందోళన మొదలవుతోంది వారి గుండెల్లో. అబ్బాయి వాళ్లు ఏమనుకుంటారో ఏమో... పెళ్లి ఆగకుండా మూడుముళ్లు పడితే చాలు’ ఆని మనసులోనే దేవుళ్లకు మొక్కుకుంటోంది అమ్మాయి తల్లి రాణెమ్మ. తండ్రి ‘బాణు’ ముఖం ఎర్రగా కందగడ్డలా ఉంది. అమ్మాయి మేనమామలు చొరవ తీసుకుని పెళ్లికొడుకు అన్నావదినలకు నచ్చచెబుతున్నారు. ఎలా స్పందించాలో తెలియని అయోమయం వారిది! నీ కోరికలు చెప్పమ్మా! దెయ్యం... కోరిన కోరికలు తీరిస్తే వదులుతుందని నమ్మకం. ఇద్దరు మహిళలు ధైర్యం చేసి ‘నీకేం కావాలమ్మా’ అనగానే... రకరకాలుగా నోరంతా తెరిచి విచిత్రంగా అభినయిస్తూ ‘మాంసం, చేపలు, కోళ్లు...’ జాబితా చదువుతోంది. ‘అమ్మో! ఇది రాకాసి దెయ్యమే...’ నిర్ధారణకు వచ్చేశారు పెళ్లికొడుకు బంధువులు. మంచి దెయ్యమైతే పూలు, చీరలు, ఆకు, వక్క, తాంబూలం వంటివి అడుగుతుందని, అవి పెద్దగా హానికరం కాదని, మాంసం అడిగిన దెయ్యాలు భయంకరమైనవని, అవి ప్రాణాన్ని బలి తీసుకునే వరకు వదలవని నమ్ముతారు. పెళ్లి కూతురు మాంసం అడగడంతో ... ‘అసలే పెద్ద దిక్కు లేని కుటుంబం మాది. అమ్మానాన్నలు లేని వాడిని అన్నావదినలు పట్టించుకోకుండా వదిలేశారంటారని బాధ్యతగా పెళ్లి చేస్తున్నాం. ఈ దెయ్యాన్ని ఇంటికి తీసుకెళ్తే మాలో ఎవర్ని మింగుతుందో ఏమో’ అని మనసులో ఉన్న భయాన్ని కక్కేసింది పెళ్లికొడుకు వదిన. అంతే... అబ్బాయి వాళ్లంతా ఒక్కొక్కరుగా మాయమయ్యారు. గతం మెదిలింది! ఇంతలో అమ్మాయి పీటల మీద నుంచి లేచి నిలబడింది. తండ్రిని ‘ఏరా’ అని సంబోధిస్తోంది. బాణు పరుగెత్తుకుంటూ వెళ్లి కూతురి ఎదురుగా నిలబడ్డాడు. కూతురి మాటల్ని బట్టి ఆమెను పూనింది తన తండ్రని భావించాడతడు. ‘పిల్లకు ఇష్టం లేని పెళ్లి చేస్తావురా, నేన్నీకు అట్లనే చేసిన్నా’ అంటూ రంకెలు వేస్తోంది. నిలువునా కూలబడిపోయాడతడు. బంధువులు ధైర్యం చెబుతున్నారు. ఆడవాళ్లు పెళ్లికూతురిని శాంత పరుస్తున్నారు. బంధువుల్లో ఓ పెద్దాయన చొరవగా బాణుతో ఓ మాటన్నాడు. ఆ మాటతో బాణు కళ్ల ముందు ‘నాగు’ మెదిలాడు. అతడి కొడుకులు సునంద్, ప్రమోద్లకైతే గతంలో.. కల్యాణి జోలికి రావద్దని నాగును మందలించిన సంఘటన కూడా కళ్ల ముందు మెదిలింది. సందేహంగా తండ్రి వైపు చూశారు. ‘మేము మాట్లాడతాం’ అంటూ మరికొందరు ఆత్మీయులు ముందుకొచ్చారు. నాగు కూడా ఆ పెళ్లికి వచ్చాడు! అయితే పెళ్లి ఆగిపోయింది. ఇంకా అక్కడే ఉంటే ఏం బావుంటుందని వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు నాగు, అతడి అన్నలు. ‘కల్యాణిని పెళ్లి చేసుకుంటావా’ అని నాగును అడగ్గానే... ‘నాకిస్తారా’ అంటూ బదులు ప్రశ్నించాడు నాగు. ‘మేమిప్పుడే వస్తా’మని వధువు గదిలోకి వెళ్లారు పెద్దలు. ‘నాగును పెళ్లి చేసుకోవడానికే ఇదంతా’ అనేసిందా అమ్మాయి. ఆ ఒక్క సందర్భం మినహా అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఆ అమ్మాయికి దెయ్యం పట్టనేలేదు. పెద్దవాళ్లకు పెద్ద మనసుండాలి పెద్దవాళ్లు... పెద్దవాళ్లమనే మొండితనంతో ఇష్టంలేని పెళ్లిని పీటల వరకు తీసుకురాకపోయి ఉంటే ఆ అమ్మాయికి అసలు దెయ్యమే పట్టేది కాదు. ఒక మూర్ఖత్వం నుంచి తప్పించుకోవడానికి ఈ మూఢత్వాన్ని ఒంటబట్టించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పుకోవడానికి సరదాగానే ఉంటుంది. కానీ అప్పటి వరకు ఒక అమ్మాయి పడిన ఆవేదనను వివరించడానికి మాటలు చాలవు. కల్యాణి ధైర్యం ఉన్న అమ్మాయి. దెయ్యం డ్రామాతో కథను సుఖాంతం చేసుకుంది. కానీ చాలా మంది అమ్మాయిలు ఇష్టం లేని పెళ్లి చేసుకుని మౌనంగా రోదిస్తూ జీవిస్తుంటారు. మరికొంత మంది జీవితాన్ని అంతం చేసుకుంటారు. అందుకే... తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవాలి. వాళ్లను ప్రేమించినంతగా వాళ్ల ఇష్టాల్నీ ప్రేమించగలగాలి. పిల్లల ప్రేమలో ఆకర్షణ తప్ప జీవితానికి బంధం ఏర్పడే భరోసా లేదనిపించినప్పుడు ఆ విషయాన్ని వారితోనే మాట్లాడాలి. వారిని మాట్లాడనివ్వాలి. పిల్లల్ని కన్విన్స్ చేయాలి. తల్లిదండ్రులు ఏది చెప్పినా పిల్లల పట్ల ప్రేమతోనే చెబుతారనే నమ్మకం పిల్లల్లో కలిగించాలి. పిల్లల ఎంపిక బావుందనే భరోసా కలిగితే పెద్దలూ ఒప్పుకోవాలి. అలాగే పేరెంట్స్ చెప్పిన విషయాన్ని ఓ క్షణం పాటు వాళ్ల స్థానంలో నిలబడి ఆలోచిద్దాం అని పిల్లలూ అనుకోవాలి. వాళ్లనుకోకపోతే తల్లిదండ్రులే ‘మా స్థానంలో నిలబడి ఆలోచించ’మని ఓ రిక్వెస్ట్ చేస్తే పోయేదేమీ ఉండదు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి గమనిక: వ్యక్తుల పేర్లు మార్చాం. నాగు ఎవరు? అనంతపురం జిల్లా, ముదిగుబ్బ గ్రామంలో బాణు పొలాన్ని కౌలు చేసేవాళ్లు నాగు అన్నలు. ఆ కుటుంబంతోదూరపు బంధుత్వం కూడా ఉంది. ముగ్గురన్నలు కష్టపడుతూ చిన్నవాడిని చదివించారు. అనంతపురం కాలేజీలో నాగు డిగ్రీ చదివేటప్పుడు కల్యాణి ఇంటర్ చదివేది. ఒక ఊరి వాళ్లు, తెలిసిన వాళ్లు కావడంతో కలిసి ప్రయాణించేవారు. సాన్నిహిత్యం పెరుగుతుందేమోనని సందేహ పడిన కల్యాణి అన్నదమ్ములు నాగును మందలించారోసారి. అప్పటి నుంచి కల్యాణి, నాగుల సాన్నిహిత్యం పెరిగింది. ప్లాన్ లేదు కానీ... ప్రేమ ఉంది నాగుతో ‘కల్యాణికి దెయ్యం ప్లాన్ ఇచ్చింది నువ్వేనా’ అంటే ‘అదేమీ లేదబ్బా’ అన్నాడు కంగారుగా. ‘ప్రేమించిన అమ్మాయికి పెళ్లవుతుంటే బాధతో ఆ పరిసరాల్లోకి రాకుండా దూరంగా ఉంటారు ఎవరైనా. మరి నువ్వు పెళ్లి పందిట్లో ఎందుకున్నావు’ అని అడగ్గానే... నవ్వుతూ ‘పోనివ్వకూడదూ’ అని... ‘ఆ అమ్మాయి ఎప్పుడైనా ప్రేమిస్తున్నానని నాతో చెప్పిందా, లోపలే దాచుకుంది. నాకు మాత్రం చెప్పాలని ఉండేది. వాళ్ల డబ్బు చూసి భయమేసేది’ అన్నాడు. వాళ్లిద్దరూ పెళ్లయ్యాక ఎం.ఎ, బిఈడీ చేసి, ఇప్పుడు బెంగళూరులో టీచర్లుగా ఉద్యోగం చేసుకుంటున్నారు. నాలుగేళ్ల కొడుకుతో ఆనందంగా జీవిస్తున్నారు. - ఎస్. శంకర శివరావు, కన్వీనర్, జెవివి నేషనల్ మేజిక్ కమిటీ -
ఆమెకు ఈ అవార్డు అరుదైనదే
హైదరాబాద్: టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు కళ్యాణి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. కమెడియన్ గా, పత్యేక నటిగా తెలుగు చిత్ర సీమకు పరిచయమైన నటి కళ్యాణి తన విశేష ప్రతిభతో లిమ్కా రికార్డు దక్కించుకుంది. కరాటే విద్యలో ఉత్తమమైన బ్లాక్ బెల్టును దక్కించుకున్న ఆమె హరికథ కళాకారిణి కూడా. తాజాగా సుదీర్ఘ హరికథా గానంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నట్టు ఆమె తెలిపారు. దీనికి సంబంధించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ విజయ ఘోష్ నుంచి లేఖ వచ్చినట్టు ఆమె తెలిపారు. ఆదిభట్ల కళాపీఠం వ్యవస్థాపకురాలైన పడాల కళ్యాణి ఈ కళాపీఠం ద్వారా సుదీర్ఘ హరికథా ప్రవచనాలను నిర్వహించి ఈ రికార్డు సాధించారు. గత ఏడాది జూన్ 20 నుంచి 25 వరకు హైదరాబాద్‌లోని సిద్దార్ధనగర్ కమ్యూనిటీ హాల్లో నిరంతరంగా 114 గంటల 45 నిమిషాల 55 సెకెన్ల పాటు హరికథలను వినిపించినట్టు తెలిపారు. దీంతో పాటు 61 మంది కళాకారులతో అష్టోత్తర శతనిర్విరామ హరికథా గాన యజ్ఞం నిర్వహించామన్నారు. గతేడాది ఏప్రిల్ నెలల కళ్యాణిపై పేకాట ఆరోపణలు రావడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే తనను ఎవరో కావాలనే పేకాట కేసులో ఇరికించారంటూ కళ్యాణి ఆరోపణలను కొట్టి పారేశారు. హరికథ కళాపీఠం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో తన కార్యాకలాపాలను ఆపాలని కొందరు కుట్ర చేసి ఇరికించారన్నారు. కాగా ఈ సంఘటనతో మనస్తాపానికి గురైన కళ్యాణి పట్టుదలతో హరికథ కళాపీఠంపై సీరియస్ గా దృష్టి సారించినట్టు సమాచారం. ఆదిభట్ల కళాపీఠం స్థాపించి, అవార్డు సాధనకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. -
మద్యం దుకాణంలో రూ.85వేలు చోరీ
గుంటూరు జిల్లా రెంటచింతల పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు విజయా థియేటర్ సమీపంలోని కల్యాణి వైన్స్ పైకప్పు రేకులను తొలగించి లోపలికి ప్రవేశించారు. క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.85 వేల విలువైన నగదును ఎత్తుకుపోయారు. గురువారం ఉదయం నిర్వాహకుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై సాంబశివరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. -
విశాఖ సీఐకి చార్జీ మెమో
విశాఖపట్నం: ఓ దొంగతనం కేసుకు సంబంధించి విశాఖపట్నం పోలీసులు చిక్కుల్లో పడ్డారు. ముగ్గురు పోలీసులు ఈ కేసులో చిక్కుకోగా ఒక్కొక్కరికి వేర్వేరు చార్జీలు ఎదుర్కొన్నారు. ఓ దొంగతనం కేసులో అక్రమాలకు పాల్పడ్డారని విశాఖపట్నం టూటౌన్ సీఐ కళ్యాణికి చార్జిమెమోను జారీ చేయగా, హెడ్ కానిస్టేబుల్ దేముడిపై సస్సెన్షన్ వేటు వేశారు. ఇక నాయుడు అనే హోంగార్డును మాత్రం విధుల్లోంచి తొలగించారు. -
ఓ మనిషి కథ మూవీ స్టిల్స్
-
మనిషి ఎలాంటి వాడు?
మనిషి జీవితంలోని ఎత్తుపల్లాలు, మలుపులు, గుణాల నేపథ్యంలో సాగే కథతో రాధాస్వామి ఆవుల దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓ మనిషి కథ’. జగపతిబాబు, కల్యాణి జంటగా బాలా భాయ్ చొవాటియా నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ కురాకుల పాటలు స్వరపరిచారు. రాధాస్వామి ఆడియో సీడీని ఆవిష్కరించి రచయిత సుద్దాల అశోక్తేజకి ఇచ్చారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ -‘‘కథతో పాటు సినిమాపట్ల నాకున్న అపరిమితమైన ప్రేమనుచూసి జగపతిబాబు గారు ఈ సినిమా చేశారు. నిర్మాత కూడా కథను నమ్మారు. మూడక్షరాల మనిషిలో ఉన్న మూడు గుణాలను బట్టి, అతనెలాంటివాడో నిర్ణయిస్తాం. ఈ విషయానికి పలు వాణిజ్య అంశాలు జోడించి, ఈ సినిమా చేశాం. విజయ్ కురాకుల మంచి పాటలిచ్చారు. సుద్దాల రాసిన సాహిత్యం అద్భుతం’’ అన్నారు. ప్రస్తుతం పరిశ్రమలో నడుస్తున్న ట్రెండ్‌తో తనకు సంబంధం లేదనీ, కథే తనకు ముఖ్యమని నిర్మాత ఈ చిత్రం చేశారని అశోక్‌తేజ చెప్పారు. మంచి పాటలివ్వడానికి ఆస్కారం ఉన్న కథ ఇదని విజయ్ కురాకుల తెలిపారు. ‘సీత లేని రామ కథ ఇంతేనమ్మా..’ అనే పాటకు జాతీయ అవార్డు వస్తుందని ‘ఆదిత్య’ సత్యదేవ్ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: చంద్రశేఖర్. -
ప్రేమ జంటపై దాడికి యత్నం
తొగుట : ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటపై దాడికి యత్నించడంతో భయాందోళనకు గురైన ఆ జంట ఆదివారం స్థానిక పోలీసులను ఆశ్రయించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని గుడికందుల గ్రామానికి చెందిన మట్టె వెంకట్‌రెడ్డి, బుచ్చవ్వల కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి(22) అదే గ్రామానికి చెందిన తూంకుంట్ల అలియాస్ చీకోడ్ శ్రీనివాస్‌రెడ్డి, యాదమ్మల కుమార్తె కల్యాణి (19)లు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరి పెళ్లికి ఇరువురు కుటుంబీకులు అడ్డు చెప్పడంతో అక్టోబర్ 19న నిజామాబాద్ జిల్లా బాసరలో గల సరస్వతి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం నేరుగా మిరుదొడ్డి (గుడికందుల గ్రామం మిరుదొడ్డి పోలీస్‌స్టేషన్ పరిధి)లోకి రావడంతో ప్రేమ జంట పోలీస్టేషన్‌కు వెళ్లారు. దీంతో సీఐ రామకృష్ణారెడ్డి ఇరువర్గాల పెద్దలను పోలీస్టేషన్‌కు పిలిపించి ఇరువురూ మేజర్లు కావడంతో వారికి ఏమైనా ఇబ్బందులు కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కౌన్సెలింగ్ నిర్వహించి పంపారు. అనంతరం కొత్త జంట గుడికందులలో కాపురం పెట్టారు. ఈ నేపథ్యంలో కల్యాణి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి శనివారం అర్ధరాత్రి తన బంధువులు, అనుచరులతో కుమార్తె కల్యాణి, ఆమె భర్త శ్రీకాంత్రెడ్డిను హత్య చేసేందుకు రెండు వాహనాల్లో గుడికందులకు వచ్చాడు. అనంతరం శ్రీకాంత్రెడ్డిఇంటి తలుపు తట్టాడు. దీంతో శ్రీకాంత్‌రెడ్డి, కల్యాణిలు భయంతో పెద్దగా అరవడంతో ఇరుగు పొరుగు వారు మేలుకొనడంతో శ్రీనివాసరెడ్డి, అనుచరులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి వెంట తెచ్చుకున్న వేట కొడవళ్లు, కత్తులు, గడ్డపారలు, కారంపొడి, కట్టెలు అక్కడే పడేసి వెళ్లారు. దీంతో భయాందోళనకు గురైన శ్రీకాంత్‌రెడ్డి, కల్యాణిలు ఆదివారం మిరుదొడ్డి పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పారు. తనను , తన భర్తను చంపడానికి తన తండ్రి శ్రీనివాసరెడ్డి, ఎల్లయ్య శ్రీపాల్‌రెడ్డి, శేఖర్, బైరారెడ్డి, బోయిని యాదయ్యలు యత్నించడంతో తాను గుర్తించినట్లు కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తండ్రితో తమకు ప్రాణహాని ఉందని శ్రీకాంత్‌రెడ్డి దంపతులు తెలిపారు. -
ఓ మనిషి కథ మూవీ స్టిల్స్
-
కొడుకు ఆచూకీ తెలిపిన ఆధార్!
కాలడి: కొడుకు కోసం 16 ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన ఓ వృద్ధురాలు ఆధార్ కార్డు సాయంతో అతని ఆచూకీ కనుగొంది! కేరళ లోని శ్రీమూలనగరం గ్రామానికి చెందిన కల్యాణి(80)కి భర్త, ఇద్దరు కొడుకులు చనిపోయారు. మూడో కొడుకు వీవీ మోహన్ 16 ఏళ్ల కిందట పనికోసం గోవా వెళ్లాడు. దీంతో అమె అప్పట్నుంచి శిథిలావస్థలోఉన్న ఇంట్లో గడుపుతూ, ఇరుగుపొరుగు వారు పెట్టే తిండితో రోజులు వెళ్లదీస్తోంది. వయసు పైబడినా, కంటిచూపు తగ్గినా ఆశ మాత్రం వదులుకోలేదు. ఇటీవల ఆమె ఇంటికి పోస్టులో ఓ కవరు వచ్చింది. దాన్ని ఆమె గ్రామ పంచాయతీ అధ్యక్షుడు కేసీ మార్టిన్ వద్దకు తీసుకెళ్లింది. కవర్ తెరిచి చూడగా అందులో మోహన్ ఆధార్ కార్డు కనిపించింది. కల్యాణి బంధువులు, పొరుగువారు శతవిధాలా ప్రయత్నించి అతని ఆచూకీ కనుగొన్నారు. మోహన్ ఓ హత్యకేసులో 13 ఏళ్ల నుంచి గోవాలోని అగౌదా జైల్లో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. గత శనివారం జైలుకు వెళ్లి అతన్ని కలుసుకుని తల్లి పరిస్థితి గురించి చెప్పారు. అతడు తల్లిని చూసేందుకు వీలుగా పెరోల్ కోసం సన్నాహాలు చేస్తున్నామన్నారు. -
ఆరేళ్లకే ఇంటిదీపం ఆరిపోయింది!
రెండో తరగతి విద్యార్థిని దుర్మరణం జీవీఎంసీ ట్రాక్టర్ ఢీకొని ప్రమాదం కడుపుకోతతో తల్లడిల్లుతున్న కుటుంబం అనకాపల్లి రూరల్: ‘సాటర్డే హాఫ్‌డే అమ్మా... ఈరోజు స్కూల్‌కు వెళ్లను...’ అంటూ చిట్టిపొట్టి మాటలతో ఆ చిన్నారి మారాం చేసింది. అయితే కన్నకూతురుకు బాగా చదివించుకోవాలనే ఆకాంక్ష ఉన్న ఆమె అమ్మ మనసు మాత్రం అందుకు అంగీకరించలేదు. ‘ఈ రోజు సాటర్డే స్కూల్‌కు వెళ్తే రేపు సండే సెలవే కదమ్మా... నీకు నచ్చింది కొంటా’నంటూ నచ్చచెప్పింది. చివరకు ఎలాగో ఆ చిన్నారి ఇంటి నుంచి స్కూల్‌కు బయల్దేరి వెళ్లిందో లేదో అంతలోనే ‘పాపను ట్రాక్టర్ గుద్దేసింది...’ అన్న వార్త ఆ తల్లి చెవిన పడింది. ఆమెకు గుండె ఆగినంత పనైంది. పరుగున వెళ్లి చూస్తే... తన కూతురే. విగతజీవిగా పడిఉంది. నున్నగా దువ్వి పంపిన తల ట్రాక్టర్ చక్రం కింద చిద్రమైంది. యూనిఫాం రక్తసిక్తమైంది. ‘అల్లారుముద్దుగా, ప్రాణానికి ప్రాణంగా పెంచుతున్న తమ బిడ్డను అప్పుడే ఎందుకు తీసుకుపోయావు దేవుడా...’ అంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరవుతుంటే... చూసినవారి కంట నీరు ఆగలేదు. ఈ దుర్ఘటన శనివారం అనకాపల్లిలోని పార్కుసెంటర్ సమీపంలో చోటుచేసుకుంది. వెల్డర్‌గా పనిచేస్తున్న పాలవలస శ్రీనివాసరావు, లక్ష్మి దంపతుల కుమార్తె కల్యాణి (6) మున్సిపాలిటీ ట్రాక్టర్ కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ట్రాక్టర్ తొట్టి కొక్కెం బ్యాగుకు తగలడంతో ఆ చిన్నారి తూలిపడింది. వెనుక చక్రం ఎక్కేయడంతో ఆమె తల చిద్రమైంది. తీవ్ర గాయమైన ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. గవరపాలెం సంతోషిమాత కోవెల సమీపంలో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు దంపతులకు కల్యాణితో పాటు ఎనిమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కల్యాణి పార్కుసెంటర్ సమీపంలోని సత్యసాయి కాన్వెంట్లో రెండో తరగతి చదువుతోంది. రోజూలాగే నడిచివెళ్తున్న ఆ చిన్నారి కొద్ది నిమిషాల్లో స్కూల్‌కు చేరుకునేదే. వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ రూపంలో మృత్యువు ఆమెను బలితీసుకుంది. విషయం తెలిసిన వెంటనే జీవీఎంసీ జెడ్సీ చంద్రశేఖర్ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. తమ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మృతదేహాన్ని వంద పడకల ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసును ట్రాఫిక్ ఎస్ఐ సత్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు. -
సినిమా రివ్యూ: రారా...కృష్ణయ్య
నటీనటులు: సందీప్ కిషన్, రెజీనా కాసాండ్రా, జగపతి బాబు, కళ్యాణి, రవిబాబు, చలపతిరావు, తాగుబోతు రమేశ్, తనికెళ్ల భరణి సంగీతం: అచ్చు రాజమణి ఫోటోగ్రఫీ: శ్రీరాం నిర్మాత: వంశీ కృష్ణ శ్రీనివాస్ కథ, దర్శకత్వం: మహేశ్ బాబు.పి ప్లస్ పాయింట్స్: రెజీనా ఫోటోగ్రఫీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైనస్ పాయింట్స్: కథ, కథనం సెకండాఫ్ లో స్లో నేరేషన్ క్లైమాక్స్ 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంతో ఆకట్టుకున్న సందీప్ కిషన్, రొటీన్ లవ్ స్టోరి 'ఫేం' రెజీనా కాంబినేషన్ లో నూతన దర్శకుడు మహేశ్ బాబు.పి రూపొందించిన చిత్రం 'రారా...కృష్ణయ్య'. కిడ్నాప్ నేపథ్యంగా ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం జూలై 4 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సందీప్ కిషన్, రెజీనాలతో, దర్శకుడు మహేశ్ బాబు రూపొందించిన కిడ్నాప్ డ్రామా ఏ మేరకు పండిందో తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకోవాల్సిందే. వంశ పారంపర్యంగా చేస్తున్న దందాను కొనసాగించడం ఇష్టంలేక తన అన్నయ్య జగ్గు భాయ్ (జగపతిబాబు)కు దూరంగా వెళ్లి మాణిక్యం (తనికెళ్ల భరణి) అనే ట్రావెల్స్ వ్యాపారి వద్ద డ్రైవర్ పనిచేస్తుంటాడు కిట్టూ అలియాస్ కృష్ణయ్య(సందీప్ కిషన్). తాను నమ్మిన మాణిక్యం కిట్టూని మోసగిస్తాడు. తనకు జరిగిన మోసానికి జీర్ణించుకోలేని కిట్టూ.. తండ్రి కుదుర్చిన పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని మాణిక్యం కూతురు నందూ(రెజీనా)ను కిడ్నాప్ చేస్తాడు. నందూని కిడ్నాప్ చేసిన తర్వాత కృష్ణయ్య జీవితంలో ఏలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కృష్ణయ్య కుటుంబం చేసే దందా ఏమిటి? నందూ, కృష్ణయ్యల మధ్య చిగురించిన ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చిందా? ఈ కిడ్నాప్ కథలో, తమ్ముడి ప్రేమ వ్యవహారంలో జగ్గూ భాయ్ పాత్రేంటి అనే ప్రశ్నలకు సమాధానమే 'రారా...కృష్ణయ్య' చిత్రం. నటీనటుల ఫెర్ఫార్మెన్స్: కృష్ణయ్య పాత్రలో సందీప్ కిషన్ పర్వాలేదనిపించాడు. పాత్రకు ఉన్న పరిమితి కారణంగా సందీప్ కిషన్ చలాకీతనాన్ని గొప్పగా ప్రదర్శించలేకపోయాడు. ఫైట్లకు పెద్ద స్కోప్ లేకపోవడంతో తన సత్తాను పెద్దగా చూపించలేకపోయాడు. డాన్యులతో ఓకే అనిపించాడు. నందూ పాత్రలో రెజీనా మరోసారి ఆకట్టుకుంది. ఫెర్ఫార్మెన్స్ తోపాటు, గ్లామర్ తో కూడా మెప్పించింది. అల్లరిపిల్లగా, చలాకీతనంతో రెజీనా మరోసారి మెరిసింది. టాలీవుడ్ లో మరోసారి గుర్తింపు తెచ్చుకునే ఫుల్ లెంగ్త్ పాత్రకు రెజీనా పూర్తిగా న్యాయం చేసింది. లెజెండ్ తర్వాత జగ్గు భాయ్ అనే ఓ ప్రధానమైన పాత్రలో జగపతిబాబు కనిపించారు. అయితే పాత్రలో ఇంటెన్సిటీ ఉన్నా.. కథనంలో తేలిపోయింది. జగ్గుభాయ్ పాత్రకు వినియోగించిన క్యాస్టూమ్స్ జగపతిబాబుకు చక్కగా కుదిరాయి. అక్కడక్కడ జగ్గుభాయ్ పాత్ర ఆకట్టుకున్నా.. పూర్తి స్థాయిలో గుర్తుంచుకునే పాత్రను పోషించడానికి జగపతిబాబుకు అవకాశం చిక్కలేదు. తనికెళ్ల భరణి, రవిబాబులవి రోటీన్ పాత్రలే. ఇప్పటిలానే తాగుబోతు పాత్రలో రమేశ్ చిత్ర తొలిభాగంలో కొంత వినోదాన్ని పండించేందుకు ప్రయత్నించాడు. టెక్నికల్ ఫెర్ఫార్మెన్స్: ఈ చిత్రంలో గొప్పగా చెప్పుకునే విధంగా శ్రీరాం మంచి ఫోటోగ్రఫిని అందించాడు. అందమైన లోకేషన్లను చక్కగా చిత్రీకరించాడు. రెజీనాను గ్లామర్ ను ఎలివేట్ చేయడంలో శ్రీరాం సఫలమయ్యారు. ప్రేమకథకు పాటలే సగం బలం పాటలు. అయితే ఒకటి..అరా పాటలు ఆకట్టుకునే విధంగా ఉన్నా.. పూర్తి స్థాయిలో సందీప్ కిషన్, రెజీనా కెమిస్ట్రీని పండించే విధంగా పాటలు లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపించింది. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఈ చిత్రానికి పాజిటివ్ అంశమని చెప్పవచ్చు. దర్శకుడు మహేశ్ బాబు ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. కొత్త దర్శకుడు అనే భావన ఎక్కడ కనిపించకపోవడం ప్లస్ పాయింటే. అయితే తొలి భాగంలో కథను తన చెప్పు చేతల్లోనే ఉంచుకుని నడిపించారనే ఫీలింగ్ కలిగించిన దర్శకుడు.. రెండవ భాగంలో తడబాటుకు గురయ్యాడు. తొలి భాగంలో వినోదాన్ని ప్రధాన అస్త్రంగా మలుచుకుని సంతృప్తి పరిచినా.. రెండవ భాగంలో నత్తనడకగా సాగిన కథనంతో ప్రేక్షకుల సహనానికి దర్శకుడు పరీక్ష పెట్టారు. జగపతి పాత్ర ఎంట్రీ బాగా ఉన్నా.. అదే వూపును కొనసాగించలేకపోయారు. సందీప్, రెజీనాల మధ్య లవ్ సీన్లు చప్పగా చిత్రీకరించారు. ఓవరాల్ గా... గొప్పగా కాకపోయినా.. ఓకే అనే రేంజ్ లో రారా... కృష్ణయ్య ఉన్నాడనిపించారు. ట్యాగ్: రారా..పిలుపుకు స్పందించని కృష్ణయ్య! Follow @sakshinews -
మళ్లీ జంటగా...
ఒకే సంఘటనపై ముగ్గురు వ్యక్తుల ప్రతిస్పందన నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘ఓ మనిషి కథ’. జగపతిబాబు, కల్యాణి జంటగా నటిస్తున్నారు. రాధాస్వామి ఆవుల దర్శకుడు. బాలా భాయ్ చోవాటియా నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘మా దర్శకుడు రాధాస్వామి సీనియర్ టెక్నీషియన్. మరాఠీలో పది చిత్రాలకు ఆయన దర్శకత్వం వహిస్తే... అందులో నాలుగు సిల్వర్‌జూబ్లీ ఆడాయి. బాలీవుడ్లో బెస్ట్ సౌండ్ రికార్డిస్ట్‌గా పేరు తెచ్చుకు న్నారాయన. ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. ఆయన మా చిత్రానికి దర్శకుడు కావడం ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రచార చిత్రాలను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. జగపతిబాబు, కల్యాణి పోషిస్తున్న పాత్రలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని, త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. కొండవలస, సుమన్‌శెట్టి, అస్మిత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఆది గణేశ్, కెమెరా: జి.రంగనాథ్, సంగీతం: విజయ్ కూరాకుల, పాటలు: సుద్దాల అశోక్‌తేజ. -
పరిమళించిన మానవత్వం
చికిత్స కోసం వచ్చిన బాలిక అకస్మాత్తుగా మృతి.. మృతదేహాన్ని ఇంటికి తరలించమంటూ విలపించిన తల్లి, తాత చందాలు వేసుకుని సాయం చేసిన స్థానికులు గుడివాడ అర్బన్, న్యూస్‌లైన్ : చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకొచ్చిన ఓ బాలిక అకస్మాత్తుగా మృతిచెందింది. అయితే మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు చేతిలో డబ్బు లేకపోవడంతో తల్లి, తాత నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. వారి దీనావస్థను చూసి స్థానికులు స్పందించి మానవతా దృక్పథంతో చందాలు వేసుకుని బాలిక మృతదేహాన్ని స్వస్థలానికి పంపించారు. పట్టణంలో బుధవారం జరిగిన ఈ ఘటనను చూసిన పలువురి కళ్లు చెమర్చాయి. మండవల్లి మండలం పుట్లచెరువు గ్రామానికి చెందిన మద్దాల శ్రీనివాసరావు, రమణ దంపతుల కుమార్తె కళ్యాణి(13) ఏడో తరగతి చదువుతుంది. బాలిక 20 రోజులుగా అనారోగ్యంతో ఉండడంతో గుడివాడ తీసుకొచ్చి ఏలూరు రోడ్డులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో తల్లి రమణ, తాత బుధవారం మరోసారి ఇక్కడకు తీసుకొచ్చారు. పట్టణంలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి తాడు వేయించారు. ఆటోలో తిరిగి వస్తుండగా మున్సిపల్ కార్యాలయం సమీపంలో అందులోనే బాలిక కుప్పకూలిపోయింది. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయిందని చెప్పారు. దీంతో ఏజీకే పాఠశాల పక్క గేటు వద్ద మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఊరికి తీసుకెళ్లేందుకు చిల్లిగవ్వ లేదని తల్లి, తాత విలపించారు. స్థానికులు స్పందించి చందాలు వేసుకున్నారు. ఆటో మాట్లాడి రూ.200 ఆయిల్ కొట్టించారు. బాలిక కుటుంబీకులకు మరో రూ.700 ఇచ్చి మృతదేహాన్ని ఆటోలో పంపి మానవత్వాన్ని చాటుకున్నారు. -
అమ్మయినా.. అమ్మాయైనా!
మహిళలు సగం కాదు... ఇంకా ఎక్కువే అంటున్నాయి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు. ఎస్బీఐ, బజాజ్ అలయంజ్ జనరల్ వంటి సంస్థలు మహిళల కోసం ప్రత్యేక శాఖలను ప్రారంభించినా... కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఏకంగా బ్యాంకునే సృష్టించినా... అవన్నీ వారికిస్తున్న ప్రాధాన్యాన్ని తెలిపేవే. వీటన్నిటికీ తోడు ప్రత్యేక పథకాలు ఎటూ ఉన్నాయి. అదే ఈవారం ప్రత్యేకం... పాలసీలు... బజాజ్ అలయంజ్ క్రిటికల్ ఇల్నెస్ కవర్.. మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే ఎనిమిది రకాల వ్యాధులకు రక్షణ కల్పించేలా బజాజ్ అలయంజ్ క్రిటికల్ ఇల్నెస్ కవర్‌ను అందిస్తోంది. రొమ్ము కేన్సర్, గర్భాశయ కేన్సర్ వంటి వివిధ కేన్సర్లతో పాటు, గాయాలకు కూడా దీనిద్వారా బీమా రక్షణ లభిస్తుంది. ఇది మెడిక్లెయిమ్ పాలసీకాదు. దీన్లో పేర్కొన్న వ్యాధులకు గాను చికిత్స కోసం చేరితే చికిత్సా వ్యయంతో సంబంధం లేకుండా మొత్తం సొమ్మును ఇవ్వడం జరుగుతుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ స్మార్ట్ ఉమన్ యులిప్... ఇది యులిప్ పాలసీ. ఇందులో నాలుగు రకాల ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. సాధారణ యులిప్స్లా కాకుండా ఇది మహిళల జీవితంలో వివిధ సందర్భాలకు అనుగుణమైన కవరేజిని అందిస్తుంది. ప్రసవం, తీవ్రమైన అనారోగ్యం, జీవిత భాగస్వామి ఆకస్మిక మరణం వంటి సమయాల్లో ఈ పాలసీ కవరేజీ ఉపయోగపడుతుంది. టాటా ఏఐజీ వెల్ష్యూరెన్స్ ఉమన్.. ఇటు హాస్పిటలైజేషన్ ప్రయోజనాలతో పాటు క్రిటికల్ ఇల్నెస్ కవరేజి కూడా ఇది కల్పిస్తుంది.కేన్సర్, గుండెపోటు సహా 11 రకాల అనారోగ్యాలు తలెత్తిన పక్షంలో ఏకమొత్తంగా కవరేజి సొమ్ము చెల్లిస్తుంది. అదే కేన్సర్ అయితే అధిక బీమా రక్షణను కల్పిస్తోంది. సేవింగ్స్ ఖాతాలు... 400 రోజుల డిపాజిట్... స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మహిళల కోసం పరిమిత కాలానికి 400 రోజుల డిపాజిట్ పథకాన్ని కొత్తగా ప్రకటించింది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 9.25 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇక సీనియర్ సిటిజన్లయితే వడ్డీ 9.55 శాతంగా ఉంది. ఈ ప్రత్యేక ఆఫర్ మార్చి 7 నుంచి 10 వరకు మాత్రమేనని ఎస్బీహెచ్ బుధవారం ప్రకటించింది. అడ్వాంటేజ్ ఉమన్ సేవింగ్స్ ఖాతా రూ. 2000 రికరింగ్ డిపాజిట్‌తో (ఆర్డీ) ఉచితంగా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా. మహిళల కోసం ప్రత్యేకమైన ఇంటర్నేషనల్ ఉమన్ డెబిట్ కార్డులు. లాక్మే సెలూన్, తారా జ్యుయలర్స్ వంటి సంస్థల్లో వీటిని ఉపయోగించినప్పుడు 15 శాతం మేర డిస్కౌంట్లు.ర్డీ కొనసాగించినంత కాలం సేవింగ్స్ ఖాతాకు జీరో బ్యాలెన్స్ విధానం వర్తిస్తుంది. ఆర్డీ ఆపేస్తే కనీస బ్యాలెన్స్ నిబంధనలు వర్తిస్తాయి. సూపర్ శక్తి జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాపద్దెనిమిదేళ్ల లోపు పిల్లలు ఇద్దరికి ఉచిత ఖాతాలు నిబంధనలను బట్టి లాకర్ సర్వీసులపై 25% వరకూ డిస్కౌంటు షేర్ల లావాదేవీలకు ఉపయోగపడే డీమ్యాట్ ఖాతా వార్షిక చార్జీల్లో 50%డిస్కౌంటుఇతర బ్యాంకుల ఏటీఎంలలో పది దాకా ఉచిత లావాదేవీలకు వెసులుబాట మహిళల కోసం ప్రత్యేక ఇంటర్నేషనల్ ఏటీఎం కమ్ డెబిట్ కార్డు ప్రత్యేక గృహ రుణాలు... ఎస్బీఐ మహిళలకిచ్చే గృహ రుణాలపై 0.05 శాతం తక్కువ వడ్డీ వసూలు చేస్తోంది. రూ.75 లక్షల లోపు రుణాలపై 10.10 శాతం, అంతకు మించితే 10.25 శాతం మేర వడ్డీ రేటు వసూలు చేస్తోంది. ఇతరులకు ఈ వడ్డీ రేటు 10.15-10.30 శాతంగా ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు కూడా ఎస్బీఐ మాదిరిగానే మహిళలకు 0.05 శాతం మేర తక్కువ వడ్డీకి గృహ రుణాలిస్తోంది. ప్రాధాన్యతా రంగం కింద రూ.25 లక్షల దాకా ఇచ్చే గృహ రుణాలపై 10.10 శాతం, అంతకు మించితే 10.20 శాతం మేర వడ్డీ రేటు వసూలు చేస్తోంది. ఇదే మొత్తానికి ఇతరులకైతే 10.15 -10.25 శాతం స్థాయిలో ఉంటోంది. రుణాలు... వనితా వాహన్... కార్లు, ద్విచక్ర వాహనాలు తీసుకునే మహిళలకు ఆంధ్రాబ్యాంక్ ‘వనితా వాహన్’ పేరిట ప్రత్యేక రుణ పథకాన్ని ప్రవేశపెడుతోంది. ఈ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలూ ఉండవు. క్రమం తప్పకుండా బకాయిలు చెల్లిస్తే వడ్డీరేటులో 0.5 శాతం రాయితీ కూడా ఉంటుంది. కొత్త వాహనాలతో పాటు, సెకండ్ హ్యాండ్ వాహనాలపై కూడా రుణాలు లభిస్తాయి. సంపాదన ఉన్న వారికి వారి ఆదాయాన్ని బట్టి రుణం మంజూరు చేస్తారు. గృహిణులకైతే భర్త జీతంలో సగం ఆదాయాన్ని తీసుకొని రుణ విలువను లెక్కిస్తారు. అయితే రుణం తీసుకునే మహిళలకు తప్పనిసరిగా డ్రైవింగ్ లెసైన్స్ ఉండాలి. సెంట్ కళ్యాణి ఒకరిపై అధారపడకుండా సొంతగా జీవించాలనుకునే మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ‘సెంట్ కళ్యాణి’ పేరుతో వ్యాపార రుణాలను అందిస్తోంది. చిన్న చిన్న క్యాంటీన్లు, మొబైల్ రెస్టారెంట్లు, గార్మెంట్స్, వృత్తి నిపుణులు, చిన్న తరహా కుటీర పరిశ్రమలతో పాటు దాదాపు అన్ని రకాల వ్యాపారాలకూ రుణాలిస్తోంది. వ్యవసాయ సంబంధిత వ్యాపారాలకు కూడా ఈ రుణాలు లభిస్తాయి. అర్వింద్, మహిమా... {V>Ò$× ప్రాంతాల్లో ఉన్న మహిళలకు ఆర్థికంగా తోడ్పాటునిచ్చే విధంగా ప్రభుత్వరంగ విజయా బ్యాంక్... అర్వింద్, మహిమా పేరుతో రెండు రకాల రుణ పథకాలను అందిస్తోంది. వ్యవసాయేతర ఉత్పత్తులను తయారు చేసే మహిళలకి లేదా మహిళా సంఘాలకు ఈ రుణాలు మంజూరు చేస్తోంది. ఇలా తయారు చేసిన వస్తువులను విక్రయించడానికి స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలకు కూడా రుణాలిస్తోంది. ఈ రుణాలకు నాబార్డు 100 శాతం రీ-ఫైనాన్స్ చేస్తోంది. వ్యక్తిగతంగా గరిష్టంగా రూ.50,000 వరకు, అదే 20 మంది సభ్యులున్న సంఘాలకైతే రూ.10 -
రెచ్చిపోయిన స్నాచర్లు
=వేర్వేరు ప్రాంతాల్లో 8 గొలుసు దొంగతనాలు =మొత్తం 28.5 తులాల బంగారం చోరీ ఉప్పల్/నాచారం/కుషాయిగూడ, న్యూస్‌లైన్: నగరంలో స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు. గురువారం ఉప్పల్, నాచారం, కుషాయిగూడ, కేపీహెచ్‌బీ, ఆసిఫ్‌నగర్ ఠాణాల పరిధిలో ఎనిమిది గొలుసు చోరీలకు పాల్పడ్డారు. మొ త్తం 28.5 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దీని విలువ సుమారు 8.5 లక్షలు ఉంటుంది. కాగా, బాధితుల్లో ఒకరు ఏఎస్ఐ భార్య ఉండటం గమనార్హం. గుడికి వెళ్తుండగా... గాంధీనగర్ ఏఎస్ఐగా పనిచేస్తున్న కె.మోహన్‌లాల్ మౌలాలి హౌసింగ్‌బోర్డు వెంకటేశ్వరనగర్‌లో ఉంటున్నారు. ఇతని భార్య కల్యాణి(46) మరో ముగ్గురు మహిళలతో కలిసి గురువారం ఉదయం 10.30కి స్థానిక సాయిబాబా గుడికి నడుచుకుంటూ వెళ్తుండ గా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని 4 తులాల మంగళసూత్రం లాక్కొనిపోయారు. రేషన్ షాపునకు వెళ్తుండగా... మౌలాలి హెచ్‌బీ కాలనీ లక్ష్మీనగర్‌లో ఉండే పెండ్యాల మాధవి(38) గురువారం ఉదయం రేషన్ షాపునకు వెళ్తుండగా గోపాల్ జ్యువెలరీస్ సమీపంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. ఈ రెండు ఘటనలపై కుషాయిగూడ పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాచారంలో.. నాచారం హెచ్ఎంటీ నగర్లో ఉండే దేవినేని సువర్ణ(50) గురువారం మధ్యాహ్నం తన మనుమడిని స్కూల్నుంచి తీసుకొచ్చేందుకు బాపూజీనగర్ గుండా వెళ్తున్నారు. అదే సమయంలో ఉప్పల్ కళ్యాణపురి నుంచి హెచ్ఎంటీ నగ ర్కు నల్లరంగు కరిజ్మా బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని 3 తులాల గొలు సు తెంచుకుని రెప్పపాటులో పారిపోయారు. నాచారం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పల్‌లో... ఉప్పల్ రాఘవేంద్రనగర్‌కు చెందిన రాధిక(35) మధ్యాహ్నం 12.45కి ఉప్పల్ బ్యాంక్ కాలనీ మీదుగా ఇంటికి వెళ్తున్నారు. ఎస్బీఐ వద్దకు రాగానే వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇ ద్దరు రాధిక మెడపై గట్టిగా కొట్టారు. ఆమె వెన క్కి తిరిగి చూసేలోగా 4 తులాల మంగళ సూ త్రం,పుస్తెల తాడును లాక్కొని పారిపాయారు. బస్సు ఎక్కుతుండగా... ఉప్పల్ శాంతినగర్‌కు చెందిన శారద ఇదే ప్రాంతంలో బస్సు ఎక్కుతుండగా వెనుక నుంచి వచ్చిన ఓ దుండగురాలు ఆమె మెడలోని నాలుగు తులాల మంగళ సూత్రాన్ని చోరీ చేసుకుపోయింది. బాధితురాలు బస్సు హబ్సిగూడ చేరుకున్నాక తన మెడలోని గొలుసు చోరీకి గురైందన్న గుర్తించింది. వెంటనే ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో... మలేసియాటౌన్‌షిప్: కేపీహెచ్‌బీ ఠాణా పరిధి లో పది నిమిషాల తేడాలో రెండు చోట్ల స్నా చింగ్‌లు జరిగాయి. ఎస్సై లింగయ్య కథనం ప్రకారం.. కేపీహెచ్‌బీకాలనీ 3వ ఫేజ్ లో ఉంటున్న పిల్లారిశెట్టి రామపుష్పం (72) గురువారం మధ్యాహ్నం కన్యకాపరమేశ్వరి ఆల యం వద్ద ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా... రమ్యా సెంటర్ వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కొ ని ఉడాయించారు. ఇదిలా ఉండగా, కేపీహెచ్ బీ కాలనీ బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్‌లో ఉంటున్న కంతి కళావతి (56) మధ్యాహ్నం 12.45కి గుడికి వెళ్లి వస్తుండగా బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్దకు రాగానే వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలో ఉన్న 4 తులాల గొలుసును తెంచుకుపోయారు. గుడి నుంచి వస్తుండగా... మెహిదీపట్నం: గుడిమల్కాపూర్‌కు చెందిన గంగమ్మ అనే మహిళ గురువారం పద్మనా భనగర్లోని సాయిబాబాగుడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దిల్షాద్నగర్లో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు నగలు తెంచుకుపోయారు. ఆసిఫ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెంపకాన్ని ఒక తపస్సులా చేశాం!
ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురబ్బాయిలు... ఆ త్రిమూర్తులే తమ ఇంట్లో వెలిశారని పొంగిపోయారు... ఈ తల్లిదండ్రులు. ఈ తండ్రికి అపారమైన దైవభక్తి. ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా ఉండడం... ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తించడమే అసలైన దైవత్వం... అని నమ్ముతారు ఈ తల్లి. పిల్లలందరినీ ఉన్నతవిద్యావంతుల్ని చేయాలనుకున్నారు... దానినో తపస్సులా చేశారీ తల్లిదండ్రులు. ఆ తపస్సులో పొందాల్సిన వరాలన్నీ పొందారు కూడ. ఆ వరాలే మూడు తెల్లకోటులు... మూడు స్టెతస్కోపులు. పిల్లల పెంపకంలో శివాజీ... కల్యాణిల అనుభవాలే ఈ వారం లాలిపాఠం. తాడికొండ శివాజి స్వగ్రామం కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం పైడూరిపాడు. తండ్రి రాఘవయ్యది వ్యవసాయ కుటుంబం. ఎనిమిది మంది సంతానం. నలుగురు అక్కలు, ఒక అన్న, ఓ తమ్ముడు, ఓ చెల్లెలు. చిన్నప్పుడు గేదెలు కాస్తూ, పొలం పనులకు వెళుతూ... బడికి తరచూ ఎగనామం పెడుతూ, ఎలాగో మూడోతరగతి వరకు చదివాడు. శివాజీ మేనమామలు కులవృత్తులు చేసేవారు. శివాజీ తల్లి అన్నపూర్ణమ్మ తన కుమారుణ్ని 12 ఏళ్ల వయస్సులో (1975) గుంటూరు జిల్లా నవులూరు గ్రామంలో ఉంటున్న తన రెండో అల్లుడు అప్పారావు వద్దకు పంపించింది.అతనికి మంగళగిరి పట్టణంలో క్షౌరశాల ఉండేది. జీరోతో జీవితాన్ని ప్రారంభించిన శివాజీ కులవృత్తిలో మెళకువలు నేర్చుకున్నాడు. ఆ వివరాలు శివాజి మాటల్లోనే... ‘‘మా బావ షాపులో నాలుగేళ్లపాటు పనిచేశాక... ఆయన తనకున్న రెండు క్షౌరశాలల్లో ఒక షాపు బాధ్యతను నాకప్పగించారు. ఆ తర్వాత...1982లో మా పెద్దక్కయ్య గారి అమ్మాయి కల్యాణితో నాకు వివాహమైంది. మరో నాలుగేళ్లకి 1986లో సొంతంగా మంగళగిరిలోనే ‘శివాజి హెయిర్‌స్టయిల్’ పేరుతో షాపు పెట్టుకున్నాను. ఆ వివక్ష నా పిల్లలకు ఎదురు కాకూడదనే..! నా వృత్తిద్వారా వచ్చే డబ్బును ఇంట్లో ఒక రేకు డబ్బాలో వేసేవాడ్ని. నా భార్య కల్యాణి వాటిని 15 రోజులకో.. నెలకో ఓ మారు లెక్కించి ఇంట్లో అవసరాలకు పోనూ మిగతా డబ్బుని బ్యాంక్ అకౌంట్లో జమచేయమని ఇచ్చేది. నాకు చదువులేకపోవడం వల్ల బ్యాంకు లావాదేవీలకు ఇతరులపై ఆధారపడాల్సివచ్చేది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఆయా వ్యక్తులు నా పట్ల గౌరవప్రదంగా వ్యవహరించేవారు, కానీ నేను క్షౌరవృత్తి చేస్తానని తెలియగానే వారి ముఖకవళికలు మారిపోయేవి. నా వృత్తిలో నేను గొప్పగా రాణిస్తున్నాను. ఎవరి నుంచి ఏదీ ఆశించకుండా, ఎవరి మీదా ఆధారపడకుండా జీవిస్తున్నాను. కానీ సమాజపరంగా ఈ వృత్తిని విలువైనదిగా గుర్తించకపోవడం ఇబ్బందికరంగా ఉండేది. నా పిల్లలను గౌరవప్రదమైన వృత్తిలో చూసుకోవాలనే కోరిక కలగడానికి కారణం కూడా నాకు ఎదురైన వివక్షే. పిల్లల్ని ఉన్నత విద్య చదివించాలనుకున్నాను. దైవశక్తిపై నమ్మకం! నాకు, కల్యాణికి మొదటి నుంచి దైవశక్తిపై నమ్మకం ఎక్కువే. పిల్లలను దైవఫలంగా అనుకునేవాళ్లం. సత్యవిష్ణుదేవుని వరపుత్రునిగా భావించి మొదటిబాబుకు సవీష్వర్మ అని నామకరణం చేశాం. రెండోబాబుకు వీరాంజనేయ వరపుత్రుడిగా భావించి విజేష్వర్మ అనీ, మూడో బాబుకు శ్రీమహాలక్ష్మి వరప్రసాదంగా భావించి శిరీష్‌వర్మ అని పేర్లు పెట్టాం. పిల్లలకు బడి ఈడుకు వచ్చేనాటికి (1987) నవులూరులోనే ఫణీంద్ర విద్యానికేతన్ అనే ఇంగ్లిష్ మీడియం స్కూల్ పెట్టారు. అందులో టీచర్లు అందరూ మహిళలే. మగవాళ్లు అయితే సిగరెట్లు తాగడం, దురుసుగా వ్యవహరిస్తారని, అటువంటి దృశ్యాల ప్రభావం పిల్లల మీద ఉంటుందనేది నా అభిప్రాయం. అందుకే మహిళా టీచర్లు మాత్రమే ఉండే స్కూల్లో చేర్పించాను’’ అన్నారు శివాజీ. ముగ్గురు పిల్లల్నీ ఒకేలా చూశాను! ఇంటిని ఒద్దికగా దిద్దుకోవడానికి కారణం తండ్రి నేర్పిన బాధ్యతలేనంటారు కల్యాణి. ‘‘మాది కొండపల్లి. మా నాన్న జమలాపురపు కనకరాజు, ఆయన నాస్తికుడు. ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా, మన పనిని ఎదుటివారి నెత్తిన రుద్దకుండా బాధ్యతగా ఉండాలని చెప్పేవారు. నేను ఇంటికి పెద్దదాన్ని. ఏడో తరగతి వరకు చదివిన తర్వాత స్కూలు మానిపించి నాకు ఇంటి పనులు అలవాటు చేశారు. దాంతో పెళ్లయిన తర్వాత ఇంటిని దిద్దుకోవడం పెద్ద కష్టం కాలేదు. మా పిల్లలు స్కూల్‌కు వెళ్లే వయస్సు వచ్చేసరికి నాకు పుట్టింటికి వెళ్లడం కూడా కుదిరేది కాదు. తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు పిల్లలను స్కూల్‌కు పంపి నేను కొండపల్లి వెళ్లేదాన్ని. మళ్లీ సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేసేదాన్ని. పెంపకంలో నేను పాటించిన పెద్దపెద్ద నియమాలేవీ లేవు కానీ, ఒక విషయాన్ని మాత్రం నా పిల్లల దగ్గర జరక్కుండా జాగ్రత్తపడ్డాను. కొన్ని కుటుంబాల్లో ఒక బిడ్డపై ఎక్కువ ప్రేమ చూపడం, ఒక బిడ్డను తక్కువగా చూడడం గమనించాను. అలా నిరాదరణకు గురవుతున్న పిల్లలను చూస్తే చాలా బాధనిపించేది. నాకు మాత్రం ముగ్గురు పిల్లలపై సమభావం ఉండేది. ముగ్గురిలో మూడోవాడు చదువులో వెనకబడి ఉండేవాడు. అయితే, ఆటల్లో ప్రైైజులు తెచ్చేవాడు. ముగ్గురూ సమంగా ఉండాలని, అన్నయ్యల్లా నువ్వు కూడా బాగా చదవాలని చెప్పేదాన్ని. నేను చెప్పినప్పుడు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించేవాడు కాదు, కానీ రాను రాను చదువుపై ఆసక్తి పెంచుకున్నాడు’’ అన్నారు కల్యాణి. ఎందులో సీటు తెచ్చుకుంటే అదే చదివించాలనుకున్నా! పెదబాబును డాక్టర్ చేయాలనే తలంపుతో విజయవాడ శ్రీచైతన్యలో ఇంటర్ బైపీసీలో చేర్పించాం. ఎంసెట్ రాస్తే... ఆయుర్వేదం కోర్సులో సీటొచ్చింది. విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో చదివాడు. ఇక్కడో విషయం చెప్పాలి. పెదబాబుకు ఇంటర్ రెండేళ్ల చదువుకుగాను 65 వేల రూపాయలైంది. చాలామంది తెలిసినవాళ్లు ‘మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎకరం ధర ముప్పైవేలు ఉంది. అంత ఖర్చు పెట్టి ఇంటర్ చదివించాలా? పొలం కొనుక్కోవచ్చు కదా’ అనేవారు. ఆ మాటలేవీ పట్టించుకోలేదు. పెదబాబుకు డాక్టర్ సీటు రావడంతో మిగతా ఇద్దరికీ అదే చదువు చెప్పించాలనుకున్నా. ఇద్దరికీ లక్షా 40 వేలయింది. రెండోబాబుకు ఎంసెట్‌లో 176వ ర్యాంక్ వచ్చింది. మావాడికి ఓపెన్ కేటగిరిలో గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు ఎలాట్ అయిందని తెలియగానే ఎంతో గర్వంగా ఫీలయ్యా. ఇక మూడోబాబుకు గుడివాడలో బీహెచ్ఎంఎస్ సీటు వచ్చింది’’ అని గుర్తుచేసుకున్నారు శివాజీ. ముగ్గురు పిల్లల్ని ఆయుర్వేదం, అల్లోపతి, హోమియా వైద్య కోర్సుల్లో ఎందుకు చేర్పించారని అడగ్గా... ‘‘ఎంసెట్ మొదటి ప్రయత్నంలో ఏ సీటు వస్తే అదే చదివించాలనుకున్నాం. అలాగే వచ్చిన సీట్లలో జాయిన్ చేశాం. మా పిల్లలకు కట్నం తీసుకోదల్చుకోలేదు... ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేశారు కదా అని ప్రస్తావించగా.. నేను పెళ్లి చేసుకున్నప్పుడు కట్నంగా మూడు వేల రూపాయలు ఇచ్చారు. కట్నం తీసుకున్నందుకు ఇప్పటికీ గిల్టీగా ఫీలవుతుంటా. అందుకే మా పిల్లలకు నేను కట్నం తీసుకోదల్చుకోలేదు. మా అబ్బాయిలకు భారీ కట్నకానుకలు ఇస్తామని సంబంధాలు వచ్చాయి. కానీ కట్నం తీసుకోకూడదనే నా అభిప్రాయంతో ఇంట్లో అందరూ ఏకీభవించారు. పెదబాబు సవీష్వర్మ ఎండీ (రసశాస్త్ర) చేసి తన జూనియర్ దీప్తిని గత ఏడాది డిసెంబర్ 9న వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ బీఏఎంఎస్‌లో స్టేట్ గోల్డ్‌మెడలిస్టులు. రెండోబాబు విజేష్వర్మకు మా బంధువుల అమ్మాయి రాణిశిరీషతో ఈ ఏడాది మే 30న వివాహమైంది. బీడీఎస్ చేసిన రాణిశిరీష గుంటూరు సిబార్ దంతవైద్యకళాశాలలో ఎండీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. మూడోబాబు శిరీష్‌వర్మ బీహెచ్ఎంఎస్, ప్రాక్టీస్ యోచనలో ఉన్నాడు’’ అన్నారు శివాజీ. నా కూతురైతే అన్ని పనులు చేయిస్తానా! పెద్దకోడలు విజయవాడలో భర్తతోపాటే ప్రాక్టీసు చేస్తున్నారు. మరి రెండోకోడలు మీ ఇంటి వద్ద నుంచే ఎండీఎస్ చదివేందుకు గుంటూరు వెళుతున్నారు కదా. ఇప్పటికీ మీకు ఇంటి పనిలో విశ్రాంతి వచ్చినట్టు లేదు అన్నప్పుడు కల్యాణి చాలా ఉన్నతంగా స్పందించారు. ‘‘శిరీష ఎండీఎస్ చదవాలని పీజీ ఎంట్రన్స్ రాసింది. ఇంతలో పెళ్లి చేశాం. గుంటూరులోని సిబార్ దంత వైద్యకళాశాలలో ఎండీఎస్ సీటు వచ్చింది. ఆ అమ్మాయిది పని చేసే మనస్తత్వమే కానీ నాకే మనసు ఒప్పుకోలేదు. పొద్దున్న కాలేజికెళ్లి సాయంత్రానికి వస్తుంది. అలసట, ప్రయాణ బడలిక ఉంటాయి. ఆ పరిస్థితిలో నా కూతురు ఉంటే ఇంటి పనులు చెప్పను కదా. అదే ఉద్దేశంతో నేను శిరీషకు ఇంటి పనులు చెప్పడం లేదు. డాక్టర్ల అమ్మ! మా ముగ్గురు పిల్లలూ డాక్టర్లు అయినా నాకు ప్రత్యేకంగా ఎలాంటి ఫీలింగ్ ఉండేది కాదు. అయితే, ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు బంధువులు, తెలిసినవాళ్లు.. ‘ముగ్గురు డాక్టర్ల అమ్మ’ అని మెచ్చుకోలుగా అంటుంటారు. ఆ సందర్భాల్లో మాత్రం నాకెంతో గర్వంగా ఉంటుంది’’ అన్నారు కల్యాణి. ఇక మూడోబాబుకు కూడా పెళ్లి చేస్తే మీ బాధ్యతలు తీరిపోతాయి. ఇంతకీ మీరు పిల్లల నుంచి ఏం కోరుకుంటున్నారన్నప్పుడు... ‘‘సమాజంలో పిల్లలు గౌరవప్రదమైన స్థానాల్లో, సుఖసంతోషాలతో జీవితం గడపాలని ఆశిస్తున్నాం’’ అన్నారు శివాజీ దంపతులు. ఈ తల్లిదండ్రుల ఆశ నెరవేరాలని ఆశిద్దాం. - అవ్వారు శ్రీనివాసరావు, సాక్షి, గుంటూరు ఫొటోలు: పల్లి ప్రకాష్‌బాబు, సీహెచ్ సుధాకర్ అడిగి మరీ ష్యూరిటీ ఇచ్చారు! రెండోబాబుకు ఎండీ పీడియాట్రిక్స్‌లో సీటు వచ్చినప్పుడు 20 లక్షల రూపాయలకు ఏపీ గెజిటెడ్ ఆఫీసర్లు ఇద్దరు బాండ్ ఇవ్వాలన్నారు. ‘నా కొడుక్కి ష్యూరిటీ ఉండండి’ అని ఎవర్ని అడగాలో తెలియక మధన పడ్డాను. నా రెగ్యులర్ కష్టమర్ అయిన వేమూరి నాగేశ్వరరావుగారికి ఈ విషయం తెలిసి ‘నేను గెజిటెడ్ ఆఫీసర్ని, సంతకం పెడతాను’ అన్నారు. ఆ దేవుడే వచ్చాడని సంతోషించాను. మా మరో కష్టమర్ డాక్టర్ రాంబాబుగారు రెండో సంతకం పెట్టారు. - శివాజీ