
( ఫైల్ ఫోటో )
హనుమాన్ జంక్షన్ రూరల్: దొంగే దొంగా.. దొంగా అన్నట్లుగా ఉంది ఈనాడు పైత్యం చూస్తుంటే. చట్ట ప్రకారం.. నిబంధనల ప్రకారం కృష్ణాజిల్లా గన్నవరం పోలీసులు విధులు నిర్వర్తించినప్పటికీ వారి విధులకు ఆటంకం కలిగించడమే కాక వారిపై ఎదురుదాడికి దిగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పడక గదిలోకి చొరబడి దౌర్జన్యం’ అంటూ ఆ పత్రిక మంగళవారం సంచికలో అచ్చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
నిజానికి.. తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరు సాయి కల్యాణిని అరెస్టుచేయటానికి వచ్చిన గన్నవరం పోలీసులపై నిందితురాలి కుటుంబ సభ్యులు దురుసుగా ప్రవర్తించి, వారి విధులకు ఆటంకం కలిగించారు. ఆమెను అరెస్టుచేసేందుకు వచ్చినట్లు ఎస్‌ఐ జి. రమేష్‌బాబు వారికి చెప్పారు. కానీ, ఈ సమయంలో సాయికల్యాణి కుటుంబ సభ్యులు ఎస్‌ఐతో పాటుగా వచ్చిన మహిళా కానిస్టేబుళ్లపై దురుసుగా వ్యవహారిస్తూ నానా దుర్భాషలాడారు.
అరెస్టుకు సహాకరించాల్సిందిగా ఎస్‌ఐ రమేష్‌బాబు పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ పోలీసులపై ఆమె కుటుంబ సభ్యులు ఎదురుదాడికి దిగారు. దీంతో సాయికల్యాణిని అరెస్ట్‌చేసి తీసుకువెళ్లేందుకు యత్నించిన పోలీసులకు ఆమె కుటుంబ సభ్యులు అడ్డుపడి ఆటంకాలు సృష్టించారు. ఇలా దాదాపు గంటసేపు అరెస్టుచేయటానికి వచ్చిన గన్నవరం పోలీసులకు చుక్కలు చూపించారు.
చదవండి: టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ.. నోటీసులు
అయినప్పటీ ఎంతో ఓర్పుతో, సంయమనంతో, బాధ్యతాయుతంగా వ్యవహారించిన పోలీసులు ఆమె దుస్తులు మార్చుకుని, బ్రష్ చేసుకునేందుకు తగిన సమయం ఇచ్చిన తర్వాతే అరెస్టు చేసి తీసుకువెళ్లారు. కానీ, ఈనాడు పత్రిక ఈ వివరాలేమీ ప్రస్తావించకుండా ఏకపక్షంగా పోలీసుల తీరును అభ్యంతరకర రీతిలో విమర్శించడం శోచనీయం. అయినా, తప్పు చేసిన వారి కోసం పోలీసులు ఎక్కడైనా వెతుకుతారు. ఇందులో తప్పేముంది?.
Comments
Please login to add a commentAdd a comment