
మళ్లీ జంటగా...
ఒకే సంఘటనపై ముగ్గురు వ్యక్తుల ప్రతిస్పందన నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘ఓ మనిషి కథ’. జగపతిబాబు, కల్యాణి జంటగా నటిస్తున్నారు.
ఒకే సంఘటనపై ముగ్గురు వ్యక్తుల ప్రతిస్పందన నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘ఓ మనిషి కథ’. జగపతిబాబు, కల్యాణి జంటగా నటిస్తున్నారు. రాధాస్వామి ఆవుల దర్శకుడు. బాలా భాయ్ చోవాటియా నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘మా దర్శకుడు రాధాస్వామి సీనియర్ టెక్నీషియన్. మరాఠీలో పది చిత్రాలకు ఆయన దర్శకత్వం వహిస్తే... అందులో నాలుగు సిల్వర్‌జూబ్లీ ఆడాయి. బాలీవుడ్‌లో బెస్ట్ సౌండ్ రికార్డిస్ట్‌గా పేరు తెచ్చుకు న్నారాయన. ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. ఆయన మా చిత్రానికి దర్శకుడు కావడం ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రచార చిత్రాలను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. జగపతిబాబు, కల్యాణి పోషిస్తున్న పాత్రలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని, త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. కొండవలస, సుమన్‌శెట్టి, అస్మిత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఆది గణేశ్, కెమెరా: జి.రంగనాథ్, సంగీతం: విజయ్ కూరాకుల, పాటలు: సుద్దాల అశోక్‌తేజ.