
సాక్షి, కృష్ణా: టీడీపీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, గత ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరంలో పట్టాభితో పాటు ఆమె కూడా అల్లర్లు సృష్టించి సీఐని గాయపరిచిన ఘటనలో కల్యాణిపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ రాకపోవడంతో కల్యాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కల్యాణి హనుమాన్ జంక్షన్‌లో ఉన్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో వారు అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై కల్యాణి పరుష పదజాలంతో వాగ్వాదానికి దిగారు.