ఫిలింఫేర్‌ అవార్డ్స్‌ హంగామా | 65th Jio Filmfare Awards South 2018 winners | Sakshi
Sakshi News home page

ఫిలింఫేర్‌ అవార్డ్స్‌ హంగామా

Published Mon, Jun 18 2018 12:53 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

65th Jio Filmfare Awards South 2018 winners - Sakshi

సాయిపల్లవి, కల్యాణి, లిజీ, రకుల్‌ ప్రీత్‌సింగ్

జియో 65 సౌత్‌ ఫిలింఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో దక్షణాది ఇండస్ట్రీలకు సంబంధించిన పలువురు తారలు పాల్గొని అవార్డులను అందుకున్నారు. ఈ ఈవెంట్‌ను సందీప్‌ కిషన్, రాహుల్‌ రవీంద్రన్‌ హోస్ట్‌ చేశారు. రకుల్‌ ప్రీత్‌సింగ్, రెజీనా డ్యాన్స్‌ పర్ఫార్మెన్స్‌లు హైలైట్‌గా నిలిచాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’, ఉత్తమ దర్శకుడు : రాజమౌళి (బాహుబలి: ది కన్‌క్లూజన్‌) ఉత్తమ నటుడిగా విజయ్‌ దేవరకొండ (అర్జున్‌ రెడ్డి), విమర్శకుల ఉత్తమ నటుడు వెంకటేశ్‌ (గురు), ఉత్తమ నటి: సాయి పల్లవి (ఫిదా), విమర్శకుల ఉత్తమ నటి : రితికా సింగ్‌ (గురు), ఉత్తమ సహాయ నటుడు : రానా దగ్గుబాటి (బాహుబలి: ది కన్‌క్లూజన్‌ ), ఉత్తమ సహాయ నటి : రమ్యకృష్ణ (బాహుబలి: ది కన్‌క్లూజన్‌), ఉత్తమ సంగీత దర్శకుడు, సాహిత్యం : కీరవాణి (బాహుబలి: ది కన్‌క్లూజన్‌), ఉత్తమ తొలి చిత్ర కథానాయిక : కల్యాణి ప్రియదర్శన్, ఉత్తమ ఛాయాగ్రాహకుడు: సెంథిల్‌ కుమార్‌ (బాహుబలి: ది కన్‌క్లూజన్‌), ఉత్తమ కొరియోగ్రాఫర్‌: శేఖర్‌ (ఖైది నెం:150, ఫిదా), జీవిత సాఫల్య పురస్కారాన్ని కైకాల సత్యనారాయణ అందుకున్నారు. తమిళం ఉత్తమ చిత్రం: ఆరమ్, మలయాళంలో ఉత్తమ నటుడిగా ఫాహిద్‌ ఫాజల్, కన్నడంలో పునీత్‌ రాజ్‌ కుమార్‌ అవార్డులను కైవసం చేసుకున్నారు.


                                                        రానా, విజయ్‌, శోభు యార్లగడ్డ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement