saipallavi
-
జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరో సినిమాకు నో చెప్పిన సాయిపల్లవి
నటి సాయి పల్లవి సినిమా రంగంలో సంపాదించుకున్న పేరు మామూలుగా లేదు. ముఖ్యంగా గ్లామర్‌కు దూరంగా సహజ నటిగా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ మలయాళ చిత్రం ప్రేమమ్‌తో కథానాయకిగా పరిచయమైంది. అయితే, సాయి పల్లవి తన తొలి చిత్రంతోనే నటనలో తనదైన ముద్ర వేసుకుంది. దీంతో వెంటనే టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ఇక్కడ పలు చిత్రాల్లో నటించి సక్సెస్ ఫుల్ కథానాయకిగా రాణిస్తోంది. అదేవిధంగా కోలీవుడ్ లోనూ నటిస్తూ దక్షిణాదిలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన సాయి పల్లవి ఇటీవల శివకార్తికేయన్‌కు జంటగా అమరన్ చిత్రంలో నటించి మరోసారి నటిగా తన సత్తా చాటుకుంది. కథలోని తన పాత్ర నచ్చితేనే నటించడానికి సమ్మతించే ఈమె పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎలాంటి అవకాశం అయినా తిరస్కరిస్తుంది. అయితే తాజాగా అందుకు భిన్నంగా ఒక అవకాశాన్ని చేజార్చుకుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది. అదే నటుడు విక్రమ్ సరసన నటించే అవకాశం అని సమాచారం. తంగలాన్ చిత్రంలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన నటుడు విక్రమ్ ప్రస్తుతం వీర వీర సూరన్ చిత్రంలో నటిస్తున్నారు. ఎస్.అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. కాగా తదుపరి మడోన్ అశ్విన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు ఈ దర్శకుడు ఇంతకుముందు యోగిబాబు కథానాయకుడిగా మండేలా, శివ కార్తికేయన్ హీరోగా మావీరన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. కాగా విక్రమ్ హీరోగా ఈయన దర్శకత్వం వహించనున్న చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. కాగా ఇందులో విక్రమ్ సరసన నటి సాయిపల్లవి నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. అయితే కాల్షీట్స్ సమస్య కారణంగా ఆమె ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని చేజార్చుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆరు ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్న సాయిపల్లవి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ అందుకున్న విక్రమ్‌తో కలిసి ఒక సినిమా చేస్తే అంచనాలు భారీగానే ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనేది ఎంతవరకు నిజమో అన్నది తెలియాల్సి ఉంది. అదేవిధంగా విక్రమ్ దర్శకుడు మండోన్ అశ్విన్ కాంబోలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
అందుకే సాయిపల్లవి డిఫరెంట్.. చెల్లితో బీచ్‌లో చిల్ అవుతూ! (ఫొటోలు)
-
తండేల్ నుంచి 'బుజ్జి తల్లి' వచ్చేస్తుంది
నాగచైతన్య- సాయిపల్లవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'తండేల్'. ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా.. బన్నివాసు నిర్మాతగా ఉన్నారు. అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రం రానున్నడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే, ఈ చిత్రం నుంచి 'బుజ్జి తల్లి..' సాంగ్ విడుదలపై మేకర్స్ ఒక ప్రకటన చేశారు.నాగచైతన్య, సాయిపల్లవి మీద చిత్రీకరించిన బుజ్జి తల్లి పాటను నవంబర్ 21న విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్‌తో మేకర్స్ ప్రకటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు అదిరిపోయే సంగీతం ఇచ్చారని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ క్రమంలో తండేల్ మ్యూజిక్ జర్నీని మేకర్స్ ప్రారంభిస్తున్నారు. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం నాగచైతన్య కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా నిలుస్తోందని అభిమానులు అంచనా వేస్తున్నారు.శ్రీకాకుళం జిల్లాకు డి.మత్స్యలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తండేల్ చిత్రం తెరకెక్కుతుంది. వాస్తవ సంఘటనలను తీసుకున్నప్పటికీ.. ఇద్దరు ప్రేమికుల జీవితాల్లోని సంఘటనలు, భావోద్వేగాలను చాలా చక్కగా దర్శకుడు తీశాడని టాక్ వస్తుంది. ఈ సినిమా కోసం కొన్ని భారీ సెట్స్ వేసి బడ్జెట్ విషయంలో కూడా వెనుకాడలేదని తెలుస్తోంది. -
సాయిపల్లవి ఉన్నారా..? అంటూ ఆ యువకుడికి భారీగా ఫోన్ కాల్స్
ఇటీవల శివకార్తికేయన్ హీరోగా, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించిన చిత్రం అమరన్. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అయితే, అమరన్ చిత్రంలో ఉపయోగించ్చిన ఓ ఫోన్ నంబరు ప్రస్తుతం ఓ యువకుడిని ఇరకాటంలో పడేసింది. తన సెల్ నంబరును ఆ చిత్రంలో చూపించడంతో వస్తున్న కాల్స్ వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.తాజాగా ఈ ఘటన చైన్నెలో వెలుగు చూసింది. వివరాలు.. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోకు హీరోయిన్ ఓ పేపర్లో ఫోన్ నంబర్ రాసి ఇచ్చినట్టుగా కొన్ని సెకన్ల పాటు ఓ దృశ్యం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆ ఫోన్ నంబరు వాహీసన్ అనే చైన్నె యువకుడి పాలిట శాపంగా మారింది. తాను ఉపయోగిస్తున్న ఫోన్ నంబర్‌ను ఆ చిత్రంలో చూపించడంతో సంతోష పడ్డప్పటికీ ఆ తదుపరి పరిణామాలు ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి. సాయిపల్లవి గారితో మాట్లాడాలంటూ అనేక మంది ఆ నంబర్‌కు ఫోన్ చేసి విసిగిస్తుండటంతో చివరకు అతడు తన తంటాలను ఆ సినీ యూనిట్‌కు తెలిసే విధంగా సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. -
రెండు భాగాలుగా 'రామాయణ'.. విడుదలపై ప్రకటన
భారత ఇతిహాసాలను వెండితెరపై చూపించాలంటే పెద్ద సాహసమేనని చెప్పాలి. ఈ క్రమంలో వచ్చిన చిత్రాలు ఇప్పటకే చాలావరకు విజయాన్ని అందుకున్నాయి. బాలీవుడ్ తెరకెక్కిస్తున్న 'రామాయణ' గురించి ఒక ప్రకటన వచ్చింది. ఈ చిత్రం గురించి ఇప్పటికే కన్నడ స్టార్ యశ్ పలు విషయాలను పంచుకున్నాడు. ఇప్పుడు పోస్టర్స్ విడుదల చేస్తూ విడుదల తేదీలను కూడా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రణ్‌బీర్‌కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు ప్రచారం ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల చేస్తున్నట్లు పోస్టర్స్‌ను కూడా పంచుకున్నారు.ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్‌బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారు. డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్లో రణ్‌బీర్ ప్రత్యేక శిక్షణ పొందారు. ఈ విషయంపై ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణతో పాటు డైట్ కూడా ఫాలో అవుతున్నట్లు తెలిపారు. రాముడి పాత్రలో నటిస్తుండటం వల్ల తాను మద్యపానం మానేసినట్లు చెప్పారు. ఇదే సమయంలో సీత పాత్రలో నటిస్తున్న సాయిపల్లవి కూడా పలు విషయాలను పంచుకున్నారు. సీతమ్మ పాత్రలో నటించే అవకాశం దక్కడం తన అదృష్టమని సాయిపల్లవి పేర్కొన్నారు. ఒక నటిగా కాకుండా భక్తురాలిగా నటిస్తున్నట్లు తెలిపారు. -
శివ కార్తికేయన్, సాయి పల్లవి సినిమా టైటిల్ రివీల్ ఎప్పుడంటే
కోలీవుడ్‌లో మడోనా అశ్విన్ దర్శకత్వంలో నటించిన మా వీరన్ చిత్రం విజయంతో మంచి ఖుషిలో ఉన్న నటుడు శివకార్తికేయన్ ప్రస్తుతం తన 21వ చిత్రంలో నటిస్తున్నారు. ఆయనకు జంటగా నటి సాయి పల్లవి నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా లోక నాయకుడు కమలహాసన్ ఈ చిత్రాన్ని తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తుండటం విశేషం. కాగా ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల కాశ్మీర్లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం చైన్నెలో చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రానికి ఇంకా టైటిల్ వెల్లడించలేదు. తాజాగా దీనికి సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నటుడు శివకార్తికేయన్ ఈ చిత్రానికి ముందు నటించిన చిత్రం అయలాన్, నటి రకుల్ ప్రీత్ సింగ్ నాయకిగా నటించిన ఈ చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. గత దీపావళికి విడుదల అవుతుందని ప్రకటించినా వీఎఫ్ ఎక్స్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో చిత్రాన్ని సంక్రాంతికి వాయిదా వేశారు. కాగా ఈ చిత్రం విడుదల రోజున శివకార్తికేయన్ 21 చిత్రం టైటిల్, పోస్టర్‌ను విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు సిద్ధం అవుతున్నట్టు తాజా సమాచారం. నటుడు శివకార్తికేయన్ అభిమానులకు ఇది గుడ్‌న్యూసే అవుతుంది. కాగా ఈ రెండు చిత్రాల తరువాత ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్న చిత్రం సెట్ పైకి వెళ్లనుంది. -
సాయి పల్లవిని పాన్ ఇండియా స్టార్ ని చేస్తున్న శేఖర్ కమ్ముల
-
నాని సినిమా కోసం హైదరాబాద్‌లో కోల్కత్తా
కోల్కత్తా నగరం హైదరాబాద్‌కి వచ్చింది.. ఆశ్చర్యంగా ఉంది కదూ? ఇంతకీ విషయం ఏంటంటే.. నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఈ సినిమా కోసమే హైదరాబాద్‌లో కోల్‌కత్తాని సృష్టించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతీ శెట్టి, మడోనా సెబాస్టియన్ కథానాయికలు. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల కోల్‌కత్తాను తలపించే భారీ సెట్‌ను హైదరాబాద్‌లో సృష్టించారు. ఆరున్నర కోట్లతో పదెకరాల్లో నిర్మించిన ఈ భారీ సెట్లో ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. నాని సహా ముఖ్యతారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘ఓ యునిక్ కాన్సెప్ట్‌తో రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో తన గత చిత్రాలకు భిన్నమైన సరికొత్త గెటప్స్‌లో నాని కనిపిస్తారు. కోల్కత్తా సన్నివేశాలు సినీ ప్రియులకి ఒక కొత్త అనుభూతిని పంచుతాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్). చదవండి: పాయల్ నెంబర్ చెప్పండంటూ ఆమె ప్రియుడికి రిక్వెస్ట్ -
‘సారంగ దరియా’ సాంగ్ తెలుగు లిరిక్స్.. మీ కోసం
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వస్తున్న విషయం తెలిసిందే. అయితే మొదటిగా ఈ మూవీలోని ‘నీ చిత్రం చూసి’ అనే పాటను విడుదల చేశారు. ఆ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల మరో పాట ‘సారంగ దరియా’ను చిత్రం బృందం విడుదల చేయగా.. ఆ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రేక్షకుల మదిలో మారుమోగుతున్న ‘సారంగ దరియా’ పాట లిరిక్స్ మీ కోసం.. పల్లవి: దాని కుడీ భుజం మీద కడవా.. దాని గుత్తెపు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా.. దాని యెజెంటు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా చరణం: కాళ్ళకు ఎండీ గజ్జెల్.. లేకున్నా నడిస్తే ఘల్ ఘల్.. కొప్పులో మల్లే దండల్.. లేకున్నా చెక్కిలి గిల్ గిల్.. నవ్వుల లేవుర ముత్యాల్.. అది నవ్వితే వస్తాయ్ మురిపాల్.. నోట్లో సున్నం కాసుల్.. లేకున్నా తమల పాకుల్.. మునిపంటితో మునిపంటితో.. మునిపంటితో నొక్కితే పెదవుల్.. ఎర్రగా అయితదిర మన దిల్ చురియా చురియా చురియా.. అది సుర్మా పెట్టిన చురియా అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా !! దాని కుడీ భుజం!! చరణం: రంగేలేని నా అంగీ.. జడ తాకితే అయితది నల్లంగి మాటల ఘాటు లవంగి.. మర్లపడితే అది శివంగి తీగలు లేని సారంగి.. వాయించబోతే అది ఫిరంగి గుడియా గుడియా గుడియా.. అది చిక్కీ చిక్కని చిడియా.. అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా.. దాని సెంపలు ఎన్నెల కురియా.. దాని సెవులకు దుద్దులు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా దాని నడుం ముడతలే మెరియా.. పడిపోతది మొగోళ్ళ దునియా అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా దాని కుడీ భుజం మీద కడవా.. దాని గుత్తెపు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా.. దాని యెజెంటు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా చిత్రం : లవ్ స్టోరీ సంగీతం : పవన్ సీహెచ్ రచన: సుద్దాల అశోక్ తేజ గానం : మంగ్లీ -
రౌడీ బేబి @ వందకోట్లు
ధనుష్, సాయిపల్లవి జంటగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మారి 2’. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. 2018లో విడుదలైన ఈ సినిమా విజయం సాధించింది. ఈ సినిమాలోని రౌడీ బేబి పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. లక్షల నుంచి కోట్లలో వ్యూస్ సాధిస్తూ దూసుకెళుతోంది. దక్షిణాదిలో అత్యధికంగా ఒక బిలియన్ (వంద కోట్లు) వ్యూస్ సాధించిన పాటగా రౌడీ బేబి రికార్డు సృష్టించింది. ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు ధనుష్. ‘నా సినిమా కెరీర్లో అనుకోకుండా ఓ మధురమైన సంఘటన చోటుచేసుకుంది. ‘కొలవెరి డీ..’ పాట విడుదలై తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయిన రోజునే ‘రౌడీ బేబి’ పాట బిలియన్ వ్యూస్ సాధించడం సంతోషంగా ఉంది. పైగా దక్షిణాదిలో బిలియన్ వ్యూస్ సాధించిన పాటగా నిలవడం మాకు గర్వంగా ఉంది’’ అన్నారు. -
విరాటపర్వం మళ్లీ ఆరంభం
రానా విరామ పర్వం పూర్తయింది. త్వరలోనే విరాట పర్వానికి సంబంధించిన పని ప్రారంభిస్తారని టాక్. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ప్రియమణి, నందితా దాస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బాబు, చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథాంశం ఉంటుంది. రానా, సాయిపల్లవి ఉద్యమకారుల పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ మొదటివారం నుంచి మళ్లీ మొదలు కానుందని టాక్. దాదాపు 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన భాగాన్ని తాజా షెడ్యూల్లో పూర్తి చేయడానికి ప్లాన్ చేశారు. -
లవ్‌స్టోరీకి డేట్ లాక్
నాగచైతన్యకు టీచర్‌గా మారారు శేఖర్ కమ్ముల. ఏం పాఠాలు నేర్పించారంటే తెలంగాణ యాస మాట్లాడేందుకు శిక్షణ ఇచ్చారు. ఎందుకంటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ‘లవ్‌స్టోరీ’ సినిమాలో నాగచైతన్య పాత్ర తెలంగాణ యాస మాట్లాడుతుంది. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్నారు. నారాయణ్‌దాస్ కె. నారంగ్, పి. రామ్మోహనరావు నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. మలి షెడ్యూల్ మంగళవారం హైదరాబాద్‌లో మొదలైంది. ఈ ‘లవ్‌స్టోరీ’ విడుదలకు డేట్ లాక్ చేశారని సమాచారం. ఏప్రిల్ 2న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట. ఉన్నత స్థాయికి ఎదగాలనే పట్టుదలతో ఓ మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ వచ్చే యువకుడిగా నాగచైతన్య, కలను నిజం చేసుకోవాలనుకునే తపనతో తన ఊరి నుంచి హైదరాబాద్ చేరుకునే యువతిగా సాయిపల్లవి నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఎలా ప్రేమ చిగురించింది? ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. -
దీపావళి ఎఫెక్ట్: హల్చల్ చేస్తున్న సినిమాలు
సినీ అభిమానులకు దీపావళి రెట్టింపు పండగ వాతావరణం తెచ్చింది. దీపావళి కానుకగా తమ అభిమాన హీరోహీరోయిన్ల కొత్త సినిమాలకు సంబంధించిన విషయాలు, విశేషాలను చిత్ర బృందాలు విడుదల చేస్తున్నాయి. దీంతో సినీ అభిమానులు దీపావళికి డబుల్ ధమాకా అందుకున్నారు. ఇప్పటికే దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ పలు చిత్రాలకు సంబంధించిన టైటిల్స్‌ను అనౌన్స్ చేయడంతో పాటు.. మరికొన్ని చిత్రాల్లోని హీరోహీరోయిన్లతో పాటు ముఖ్య తారాగణం లుక్‌లను విడుదల చేశారు. అంతేకాకుండా ఆయా చిత్రాల టీజర్, ప్రి టీజర్, మోషన్ పోస్టర్లను కూడా అభిమానులపై వదులుతూ సినీ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో వంటి పెద్ద సినిమాలతో మొదలెడితే.. తిప్పరామీసం, అక్షర వంటి చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. భయపెడుత్నున సాయిపల్లవి సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘అధిరన్’. తెలుగులో ‘అనుకోని అతిధి’. ఈ మూవీలో సాయిపల్లవి ఇప్పటివరకు పోషించనట్టువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్, సాయి పల్లవి లుక్ తెగ ఆకట్టుకున్నాయి. తాజాగా దీపావళి శుభాకంక్షలు తెలుపుతూ సినిమా టీజర్‌ను విడుదల చేశారు చిత్ర బృందం. టీజర్‌ను పరిశీలిస్తే సాయి పల్లవి ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. వివేక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతమందిస్తున్నాడు. కాగా ఈ సినిమా నవంబర్ 15న విడుదల కానుంది. సరిలేరు నీకెవ్వరు.. మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.దీపావళి సందర్భంగా దాదాపు పదమూడేళ్ల తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి లుక్‌తో పాటు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు పోస్టర్‌ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. అల వైకుంఠపురంలో.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘అల వైకుంఠపురములో’ . వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఏ రేంజ్లో ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, బన్నీ డైలాగ్‌తో పాటు ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు ఎంత పాపులర్ అయ్యాయో తెలిసింది. తాజాగా అల వైకుంఠపురములో చిత్ర బృందం దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. మరో పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న సభ్యులందరూ దిగిన ఫోటోను షేర్ చేస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. డిస్కో రాజా మాస్ మహారాజ్ రవితేజ తెరపై కనిపించి చాలా కాలమే అయింది. వరుస ఫెయిల్యూర్‌తో ఢీలా పడిన రవితేజ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న చిత్రం ‘డిస్కో రాజా’ . పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యాహోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. తాజాగా ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ డిస్కో రాజా పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్లో రవితేజ నభా నటేష్‌తో జంటగా కనిపించాడు. దీంతో ఈ చిత్రంలో యాక్షన్, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్‌లు కొదువే లేదని స్పష్టం అవుతోంది. రజిని తాళ్లూరి, రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. తిప్పరా మీసం.. కెరీర్ ఆరంభం నుంచి విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తిప్పరామీసం. ఎల్ కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిక్కీ తంబోలి హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన శ్రీవిష్ణు ఫస్ట్ లుక్, టీజర్ విమర్శకులచే ప్రశంసలు అందుకున్నాయి. తాజాగా దీపావళి శుభాకాంక్షలు తెలపుతూ మరో పోస్టర్‌ను విడుదలు చేసింది. శ్రీ విష్ణు రఫ్ లుక్‌లో కనిపిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8న విడుదల కానుంది. ఇక ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, ఎల్ కృష్ణ విజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘సూపర్ మచ్చి’అంటున్న చిరు అల్లుడు ‘విజేత’ఫలితం తర్వాత చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న ‘సూపర్ మచ్చి’ . రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పులివాసు దర్శకత్వం వహిస్తున్నాడు. దీపావళి కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తాజాగా అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ హీరో, హీరోయిన్ల పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఎలాగైనా ఈ చిత్రంతో విజయం సాధించాలని కళ్యాణ్ దేవ్‌తో పాటు మెగా అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ‘అశ్వథ్థామ’గా నాగశౌర్య అంతేకాకుండా నాగశౌర్య, మెహరీన్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపావళి కానుకగా చిత్ర టైటిల్‌ను ‘అశ్వథ్థామ’గా ఫిక్స్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. టైటిల్ లోగో అండ్ డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. రమణ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న ‘వెంకీ మామ’, నందమూరి బాలకృష్ణ ‘రూలర్’. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న ‘ఎంతమంచి వాడవురా’,సత్యదేవ్, ఇషారెబ్బ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న‘రాగల 24 గంటల్లో’ చిత్రాలు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ రిలీజ్ చేసిన పోస్టర్లు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి, . అంతేకాకుండా నిఖిల్ ‘అర్జున్ సురవరం’సినిమాకు సంబంధించిన అప్డేట్ను కూడా దీపావళి కానుకగా విడుదల చేసింది. ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్‌కుమార్ అకెళ్ల నిర్మాణంలో టి. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 29న విడుదల కానుంది. ఇక దీపావళి కానుకగా సోషల్ మీడియా వేదికగా ఆయా చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. -
అలాంటిది ఏమీ లేదు
చెన్నైలో ఓ పుకారు మొదలైంది. కొన్ని నిమిషాల్లోనే అది ఇంతింతై ఎంతెంతో దూరం వెళ్లిపోయింది. అదేంటంటే.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్, నటి సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతున్నారని. ఆ విషయాన్ని క్లారిఫై చేసుకోవడానికి విజయ్, సాయి పల్లవితో వర్క్ చేసినవాళ్లను సంప్రదించగా ఈ వార్తలను కొట్టిపారేశారు. ‘మదరాస పట్టిణమ్, దైవ తిరుమగళ్ (తెలుగులో నాన్న), దేవి (అభినేత్రి), దియ (కణం)’ వంటి సినిమాలను తెరక్కించారు ఏఎల్ విజయ్. 2016లో విజయ్, అమలా పాల్ పెళ్లి చేసుకున్నారు. 2017లో డైవర్స్ తీసుకున్నారు. గత ఏడాది ‘దియ’ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటించారు. ఆ సినిమా టైమ్‌లో వీరి మధ్య స్నేహం ఏర్పడిందట. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లికూడా చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని, ఈ విషయాన్ని కొన్ని రోజుల్లో ప్రకటించాలను కుంటున్నారు’ అన్నది ప్రచారంలో ఉన్న వార్తల సారాంశం. ‘‘అటువంటిదేం లేదు. ఈ వార్త ఎక్కడ నుంచి వచ్చిందో ఐడియా లేదు. ‘దియ’ షూటింగ్ సమయంలో విజయ్‌కు రాఖీ కూడా కట్టింది సాయి పల్లవి’’ అని ఇద్దరి సన్నిహితులు చెప్పుకొచ్చారు. -
మనసు బంగారం
సూర్య లేటెస్ట్ సినిమా ‘యన్‌జీకే’ షూటింగ్ పూర్తయింది. కొన్ని నెలలుగా తనతో పాటు సినిమా అద్భుతంగా రావడానికి కృషి చేసిన టీమ్ అందర్నీ అభినందించాలని భావించారు సూర్య. ఈ సినిమాకు పని చేసిన దాదాపు 120 మందికి గోల్డ్ కాయిన్స్‌ను బహుమతిగా అందించారు. దాంతో ‘మీ మనసు బంగారం’ అని సూర్యకు కితాబులు ఇస్తోంది కోలీవుడ్. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య, సాయి పల్లవి జంటగా యస్ఆర్ ప్రభు నిర్మించిన చిత్రం ‘యన్‌జీకే’ (నంద గోపాల కుమార్). పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. -
ఫిలింఫేర్ అవార్డ్స్ హంగామా
జియో 65 సౌత్ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో దక్షణాది ఇండస్ట్రీలకు సంబంధించిన పలువురు తారలు పాల్గొని అవార్డులను అందుకున్నారు. ఈ ఈవెంట్‌ను సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ హోస్ట్ చేశారు. రకుల్ ప్రీత్‌సింగ్, రెజీనా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు హైలైట్‌గా నిలిచాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’, ఉత్తమ దర్శకుడు : రాజమౌళి (బాహుబలి: ది కన్‌క్లూజన్) ఉత్తమ నటుడిగా విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి), విమర్శకుల ఉత్తమ నటుడు వెంకటేశ్ (గురు), ఉత్తమ నటి: సాయి పల్లవి (ఫిదా), విమర్శకుల ఉత్తమ నటి : రితికా సింగ్ (గురు), ఉత్తమ సహాయ నటుడు : రానా దగ్గుబాటి (బాహుబలి: ది కన్‌క్లూజన్ ), ఉత్తమ సహాయ నటి : రమ్యకృష్ణ (బాహుబలి: ది కన్‌క్లూజన్), ఉత్తమ సంగీత దర్శకుడు, సాహిత్యం : కీరవాణి (బాహుబలి: ది కన్‌క్లూజన్), ఉత్తమ తొలి చిత్ర కథానాయిక : కల్యాణి ప్రియదర్శన్, ఉత్తమ ఛాయాగ్రాహకుడు: సెంథిల్ కుమార్ (బాహుబలి: ది కన్‌క్లూజన్), ఉత్తమ కొరియోగ్రాఫర్: శేఖర్ (ఖైది నెం:150, ఫిదా), జీవిత సాఫల్య పురస్కారాన్ని కైకాల సత్యనారాయణ అందుకున్నారు. తమిళం ఉత్తమ చిత్రం: ఆరమ్, మలయాళంలో ఉత్తమ నటుడిగా ఫాహిద్ ఫాజల్, కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ అవార్డులను కైవసం చేసుకున్నారు. రానా, విజయ్, శోభు యార్లగడ్డ -
ఆటోడ్రైవర్
సాయి పల్లవికి కారు నడపడం బాగా వచ్చు. ‘ఫిదా’ సినిమాలో వరుణ్ తేజ్‌ని రైల్వే స్టేషన్ నుంచి పికప్ చేసుకుని, రయ్‌మని కారులో తీసుకెళ్లే సీన్ గుర్తు చేసుకోండి. అదే సినిమాలో ఈ బ్యూటీ ధైర్యంగా ట్రాక్టర్ నడిపారు. అదే సినిమాలో స్కూటీని కూడా సునాయాసంగా నడిపారు. ఇప్పుడు తమిళ చిత్రం ‘మారీ 2’ కోసం ఆటో నడుపుతున్నారు. ఈ సినిమాలో ఆమె ఆటో డ్రైవర్‌గా కనిపించనున్నారు. ఆల్రెడీ ఆటో ఎలా నడపాలో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ధనుష్ హీరోగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో రూపొందిన ‘మారీ’కి సీక్వెల్ ఇది. ఫస్ట్ పార్ట్‌లో కాజల్ కథానాయికగా నటించగా, రెండో పార్ట్‌లో సాయి పల్లవిని తీసుకున్నారు. ఏ పాత్ర అయినా ఈజీగా చేసేసే సాయి పల్లవి ఆటో డ్రైవర్‌గా మెప్పిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా కాకుండా æశర్వానంద్ హీరోగా రూపొందుతున్న ‘పడి పడి లేచె మనసు’ చిత్రంలోనూ, సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న ‘ఎన్జీకె’ చిత్రంలోనూ సాయి పల్లవి నటిస్తున్నారు. -
మనసు పడ్డారు
అందమైన అమ్మాయిని చూసినప్పుడు అబ్బాయిల మనసు పడి పడి లేస్తుంది. శర్వానంద్‌కి కూడా ఓ అమ్మాయి కనిపించింది. అందమైన ఆ అమ్మాయి లేత బుగ్గపై ఉన్న మొటిమలు తనకు ముత్యాల్లా అనిపించాయి. అమ్మాయి మనసు కూడా అబ్బాయికి ఫిదా అవుతుంది. మరి.. ఈ ఇద్దరి ప్రేమకథ ఎంతవరకూ వచ్చిందంటే కోల్‌కత్తాలో మొదలై ప్రస్తుతానికి హైదరాబాద్ వచ్చింది. శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న సినిమా ‘పడి పడి లేచె మనసు’. బుధవారం హీరోయిన్ సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం కోసం కోల్‌కతాలో కీలక సన్నివేశాలు తీశారు. ‘‘టిపికల్ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ మూవీ ఇది. హైదరాబాద్‌లో ప్లాన్ చేసిన భారీ షెడ్యూల్ ఈ నెల 11న మొదలవుతుంది’’ అని పేర్కొన్నారు చిత్రబృందం. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్. -
సినిమా నుంచి నేను కోరుకునేది ఆనందమే
‘ఫిదా, ఎంసీఏ’ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సాయిపల్లవి ‘కణం’ సినిమాతో మరోసారి తెలుగు ఆడియన్స్‌ను పలకరించబోతున్నారు. నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎ.ఎల్ విజయ్ దర్శకత్వంలో ఎన్.వి.ఆర్ సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ‘కణం’. ఈ సినిమా నేడు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ–‘‘కణం’ సినిమా ద్వారా ‘ఒకటి ఫీల్ అవుతూ మరో ఎమోషన్ ఎలా ఎమోట్ చేయాలో’ అనే విషయం నేర్చుకున్నాను. ‘ప్రేమమ్’లో లవ్, ‘ఫిదా’లో ఇండిపెండెంట్ అమ్మాయిగా ఇలా ఒకే షేడ్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేశాను. ఈ సినిమాలో అమ్మ పాత్ర పోషించాను. అమ్మ పాత్రకు చాలా షేడ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ అన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. లోపల ఎంత బాధ ఉన్నా బయటకు కనిపించకుండా ఉండగలగటం కేవలం ‘అమ్మ’కు మాత్రమే సాధ్యం. ఈ సినిమా ద్వారా చాలా పరిణితి చెందాను అని అనుకుంటున్నాను. ఇలాంటి రోల్స్ ఎప్పుడూ వచ్చేవి కావు. దర్శకుడు విజయ్ సార్ చాలా స్వీట్. నేను ఇప్పటి వరకూ పనిచేసిన దర్శకులు నాకు ఏదో ఒకటి నేర్పించారు. ఇందులో యాక్ట్ చేసిన పాప వెరోనికాతో అటాచ్మెంట్ చాలా పెరిగిపోయింది. ఒకానొక టైమ్‌లో దత్తత తీసుకోవాలన్నంతగా క్లోజ్ అయిపోయాను. సినిమాలో నా పాత్ర నిడివి కంటే ఎంత ఇంపార్టెన్స్ అన్నది ముఖ్యంగా ఆలోచిస్తాను. సినిమా నుంచి నేను కోరుకునేది కేవలం ఆనందమే. ‘ఆ పాత్రను చాలా బాగా చేసింది’ అని ఆడియన్స్ ఫీల్ అయితే చాలు. ఈ సినిమా చూశాక స్క్రీన్ మీద ఒక అమ్మను ఆడియన్స్ చూడగలిగితే నేను సక్సెస్ అయినట్టే’’ అని పేర్కొన్నారు. -
నా సంతోషంకోసమే !
తమిళసినిమా: నటీనటులే కాదు, ఏ శాఖకు చెందిన వారికైనా టర్నింగ్ పాయింట్ అనేది ఒకటుంటుంది.అలా నటి సాయిపల్లవి కెరీర్‌కు మలయాళం చిత్రం ప్రేమమ్ పెద్ద టర్నింగ్‌గా మారింది. అప్పటి వరకూ చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వైద్య విద్య చదుకుకుంటున్న ఈ అమ్మడికి అనూహ్యంగా వరించిన అవకాశమే ప్రేమమ్. ఆ చిత్ర విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇతర నటీమణుల కంటే సాయిపల్లవి కాస్త భిన్నమనే చెప్పాలి. డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు దక్షిణాది క్రేజీ హీరోయిన్గా మారింది. అయితే ఈ అమ్మడికి కాస్త టెక్కు అనే ప్రచారం బాగా జరుగుతోంది. చాలా షరతులు విధిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. క్రమశిక్షణను పాటించదని షూటింగ్‌లకు చెప్పిన టైమ్‌కు రాదని ఆరోపణలను ఎదుర్కొంటున్న సాయిపల్లవి విధించే మరో నిబంధన గ్లామర్‌గా నటించనన్నది. సహ నటీమణులందరూ గ్లామర్కుసై అంటుంటే నువ్వెందుకు మడికట్టుకుని ఉన్నావన్న ప్రశ్నకు ఎందుకంటే తన తల్లిదండ్రులు తన సంతోషం కోసమే నటించడానికి అనుమతించారని, అలాంటి వారి మనసు నొచ్చుకునేలా ఎలాంటి పని తాను చేయనని బదులిచ్చింది. గ్లామర్‌గా నటించకపోవడానికి కూడా అదే కారణం అని పేర్కొంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మలయాళ చిత్రం ప్రేమమ్ తరువాత కోలీవుడ్‌లో మణిరత్నం లాంటి దర్శకుడి అవకాశాన్నే కాలదన్నుకుందన్నుకున్నా ఈ జాణకు చేతి నిండా చిత్రాలుండడం విశేషమే. తమిళంలో ఇప్పటికి ఒక్క చిత్రం తెరపైకి రాకపోయినా మూడు చిత్రాల్లో నటించేస్తోంది. అందులో విజయ్ దర్శకత్వంలో నటించిన కరు చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్యకు జంటగా ఎన్జీకే, ధనుష్ సరసన మరి–2 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటితో పాటు తెలుగులోనూ నటిస్తోంది. దీంతో తాజాగా శివకార్తికేయన్‌తో జతకట్టే అవకాశం తలుపు తట్టగా కాల్షీట్స్ సమస్య తలెత్తడంతో సారీ అని చేతులెత్తేసింది. ఇప్పుడా అవకాశం నయనతారను వెతుక్కుంటూ వెళ్లింది. ఆ అగ్రనటి ఓకే చెప్పినట్లు సమాచారం. ఇంతకు ముందు శివకార్తికేయన్, నయనతార నటించిన వేలైక్కారన్ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. -
పడిపడి లేచె మనసు
శర్వానంద్ కథానాయకుడిగా హనురాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పడి పడి లేచె మనుసు’. సాయిపల్లవి కథానాయిక. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మిస్తున్నారు. మంగళవారం హీరో శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ఖరారు చేశారు. ‘‘డిఫరెంట్ అండ్ క్రియేటివ్ లవ్‌స్టోరీ చిత్రమిది. మా హీరో శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. టైటిల్‌కు మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం కలకత్తాలో మఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్లో వెంకట్ మాస్టర్ నేతృత్వంలో కొన్ని యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నాం. జయకృష్ణ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటాయి’’ అన్నారు నిర్మాతలు. ‘మహానుభావుడు’ సినిమా తర్వాత శర్వానంద్ నటిస్తున్న ఈ లవ్‌స్టోరీపై అంచనాలు ఉన్నాయి. ‘వెన్నెల’ కిషోర్, కల్యాణి నటరాజన్, ప్రియా రామన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్ర శేఖర్ రావిపాటి. -
ఎన్జీకే అంటే?
... ప్రస్తుతం సూర్య కొత్త టైటిల్ చూసినవారందరికీ వచ్చిన డౌట్ ఇది. ఆ డౌట్ తీరాలంటే దీపావళి వరకు ఆగాల్సిందే అంటోంది చిత్రబృందం. సూర్య హీరోగా రకుల్‌ప్రీత్ సింగ్, సాయి పల్లవి కథానాయికలుగా సెల్వ రాఘవన్ డైరెక్షన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సోమవారం దర్శకుడు సెల్వ రాఘవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు ‘ఎన్జీకే’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. లుక్ సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉంది కదూ. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ఫ్రభు, ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
మేకప్ లేకుండా నటించడానికి రీజన్ అదే!
చెన్నై : మలయాళంలో 'ప్రేమమ్' సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయిపల్లవి. కాలేజీ లెక్చరర్‌గా ఆమె పోషించిన పాత్రతో దేశవ్యాప్తంగా అభిమానులను తన సొంతం చేసుకుంది. మలయాళ కుట్టి అయినప్పటికీ.. ఫిదా సినిమాలో అచ్చ తెలంగాణ అమ్మాయిలా నటించి ఇటు తెలుగు వారి మనసుకు దగ్గరైపోయింది. ప్రస్తుతం కణం సినిమాతో మరోసారి తెలుగు ప్రజలను అలరించబోతుంది. అయితే ఆమె నటించిన తొలి సినిమా దగ్గరి నుంచి సాయిపల్లవి మేకప్ వేసుకోకుండా నటించడం మనం చూస్తూ ఉన్నాం. ఆమె మేకప్‌కు ప్రాధాన్యత ఇవ్వదని ఇట్టే తెలిసిపోతుంది. తాను మేకప్ వేసుకోకుండా నటించడానికి గల కారణాన్ని సాయిపల్లవి టైమ్స్ ఆఫ్ ఇండియాకు రివీల్ చేసింది. ముఖంపై మొటిమలు చూసి భయపడిన టీనేజర్లలో తానూ ఉన్నానని, కొన్నిసార్లు నా ముఖాన్ని చున్నీతో దాచుకునే దాన్ని అని తెలిపింది. అయితే 'ప్రేమమ్' షూటింగ్ సమయంలో తన ఆలోచనలో మార్పు వచ్చిందని, ప్రేమమ్ డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుతరెన్, తనను కాస్మోటిక్స్ వాడకుండా సహజంగా నటించడానికి ప్రోత్సహించారని ఆమె చెప్పింది. ఇలా డైరెక్టర్లందరూ తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి, మేకప్ వాడకుండా నటించడానికి ప్రోత్సహించారని పేర్కొంది. తనలాంటి అమ్మాయిలందరికీ ఆత్మస్థైరాన్ని నింపడానికి ఇది ఒక ప్రయత్నమని సాయిపల్లవి తెలిపింది. భవిష్యత్తులో కూడా మేకప్ లేకుండా నటించడానికే ఇష్టపడతానని చెప్పింది. -
నాగశౌర్యకు కాస్ట్లీ గిఫ్ట్.. ఎవరిచ్చారంటే!
సాక్షి, హైదరాబాద్: యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘ఛలో’ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ విజయానందంలో తల్లి, నిర్మాత ఉషా ముల్పూరి నాగశౌర్యను సర్ప్రైజ్ చేశారట. ఆమె ఓ కాస్ట్లీ కారును బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది. ఆమె నాగశౌర్యకు పోర్షే 718 కెమెన్ అనే కారును కొనిచ్చారట. కారు విలువ దాదాపుగా రూ. 1.25 కోట్లు ఉంటుందని అంచనా. నాగశౌర్య తన ఇంటి వద్ద కారుతో దిగిన ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నాగశౌర్య మదర్ ‘ఛలో’ సినిమాకు నిర్మాత. ఈ మూవీ బాక్సాఫిస్ దగ్గర మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ‘ఛలో’ చిత్రానికి వెంకీ కుడుముల డైరెక్టర్. హీరోయిన్గా రష్మికా మండన్న నటించింది. ఈ సినిమాను చాలా వినోదాత్మకంగా రూపొందించారు. ‘కణం’ తమిళ చిత్రంలో నాగశౌర్య హీరోగా నటించారు. హీరోయిన్గా సాయిపల్లవి నటించింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
సాయిపల్లవి నో అంది!
తమిళసినిమా: కరు చిత్రంలో నటించడానికి నటి సాయిపల్లవి నిరాకరించిందని ఆ చిత్ర దర్శకుడు విజయ్ చెప్పారు. ఈయన దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన చిత్రం కరు. ఇందులో టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య హీరోగానూ, నటి సాయిపల్లవి హీరోయిన్‌గానూ నటించారు. సాయిపల్లవికి తమిళంలో ఇదే తొలి చిత్రం. వెరేకా అనే బాల నటి ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నిగల్‌గళ్ రవి, రేఖ, సంతాన భారతి, ఎడిటర్ ఆంటోని ముఖ్యపాత్రలను పోషించారు. శ్యామ్.సీఎస్ సంగీతబాణీలు కట్టిన ఈ చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం స్థానిక టీ.నగర్‌లోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయిపల్లవి మాట్లాడుతూ అనూహ్యంగా నటిగా రంగప్రవేశం చేసిన నటిని తానని చెప్పారు. తమిళ సినీ అభిమానులే తనని ఈ స్థాయికి చేర్చారని అన్నారు. తన తొలి చిత్రాన్నే (ప్రేమమ్ మలయాళ చిత్రం) తమిళ ప్రేక్షకులు విజయవంతం చేశారని, దీంతో తన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. అందుకే తమిళంలో మంచి చిత్రం ద్వారా పరిచయం అవ్వాలని భావించానన్నారు. అందువల్ల ఇంత ఆలస్యమైందని చెప్పారు. దర్శకుడు విజయ్ కురు చిత్ర కథ చెప్పగానే ఇదే తన ఎంట్రీకి సరైన కథ అని భావించానన్నారు. కురు చిత్రంలో భావోద్రేకాలతో కూడిన పాత్రలో జీవించే ప్రయత్నం చేశానని అన్నారు. దర్శకుడు విజయ్ మాట్లాడుతూ తన కెరీర్లోనే చాలా ముఖ్యమైన చిత్రంగా కరు నిలిచిపోతుందన్నారు. రెండేళ్ల క్రితం ఈ చిత్ర కథను లైకా సంస్థకు చెప్పగా ఎప్పుడు చేసినా ఈ కథను లైకా సంస్థకే చేయాలని ఆ సంస్థ అధినేత అన్నారని చెప్పారు. ఈ కథను అనుకున్నప్పుడే ఇందులో సాయిపల్లవి అయితే బాగుంటుందని భావించామని, ఆమెను కలిసినప్పుడు కరు చిత్రంలో నటించలేనని ఖరాఖండిగా చెప్పారని అన్నారు. అయితే ఒకసారి కథ వినండి ఆ తరువాత చెప్పండి అని అడగడంతో కథ విన్న సాయిపల్లవి ఈ చిత్రంలో తాను నటిస్తున్నానని చెప్పారన్నారు. ఈ చిత్రానికి పక్కా బలం సాయిపల్లవినేనని పేర్కొన్నారు. అదే విధంగా నాగశౌర్య చాలా బాగా నటించారని, ఆయనకు తమిళంలో మరిన్ని అవకాశాలు వస్తాయని దర్శకుడు విజయ్ అన్నారు. కరు చిత్ర ఆడియో ఆవిష్కరణ దృశ్యం -
సాయిపల్లవి చిత్రానికి లైన్ క్లియర్
తమిళసినిమా: నటి సాయిపల్లవి నటించిన తొలి తమిళ చిత్రమే ఆటంకాలను ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. మాలీవుడ్‌లో ప్రేమమ్‌తోనూ, టాలీవుడ్లో ఫిదా చిత్రంతోనూ అనూహ్య క్రేజ్‌ను సంపాదించుకున్న నటి సాయిపల్లవికి కోలీవుడ్ ఎంట్రీ మాత్రం కాస్త ఆలస్యంగానే జరిగింది. వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు విజయ్ దర్శకత్వం వహించిన కరు చిత్రం ద్వారా సాయిపల్లవి కోలీవుడ్‌కు పరిచయం కానుంది. టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్న తరుణంలో చిత్ర టైటిల్ వివాదంలో చిక్కుకుంది. కురు చిత్ర టైటిల్ హక్కులు తనకు చెందినవి అంటూ స్థానికి ఎంజీఆర్ నగర్‌కు చెందిన జేఎస్.స్క్రీన్ సంస్థ అధినేత మణిమారన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో సాయిపల్లవి చిత్రం చిక్కుల్లో పడింది. న్యాయస్థానం ఈమె చిత్రానికి కరు టైటిల్‌ను నిషేధించింది. దీంతో లైకా సంస్థ మద్రాసు హైకోర్టులో ఈ చిత్ర టైటిల్‌పై అప్పీల్ చేసుకుంది. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తుల బెంచ్ విచారణ చేపట్టింది. ఈ విచారణకు లైకాసంస్థ తరఫు న్యాయవాది హాజరై కరు చిత్రం టైటిల్‌ను తాము ప్రకటించిన తరువాత జేఎస్.స్క్రీన్ సంస్థ అధినేత మణిమారన్ ఈ టైటిల్ తనదంటూ కోర్టును ఆశ్రయించారని, తాము కరు టైటిల్ పేరుతో ఇప్పటికే ప్రకటనల ద్వారా ప్రచారం చేసుకున్నామని, ఇప్పుడు టైటిల్‌పై నిషేధం విధిస్తే చాలా నష్టపాతామని వాధించారు. ఇరుతరఫు వాదనలు పరిగణలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తుల బెంచ్ కురు చిత్ర టైటిల్‌పై నిషేధాన్ని తొలగిస్తూ లైకా సంస్థకు అనుకూలంగా తీర్పును వెల్లడించింది. దీంతో అడ్డంకులు తొలగడంతో సాయిపల్లవి కరు చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సన్నాహాలు జరుపుకుంటోందని సమాచారం. ఇందులో సాయిపల్లవి ఒక బిడ్డకు తల్లిగా నటించిందన్నది గమనార్హం. -
దీపావళికి వచ్చేస్తాం
‘‘నా గత 35 సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. సెల్వరాఘవన్ కథ చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. సాయిపల్లవి పాత్రకీ ప్రాధాన్యత ఉంటుంది’’ అని హీరో సూర్య అన్నారు. సూర్య, ‘ఫిదా’ ఫేమ్ సాయిపల్లవి జంటగా ‘7/జి బృందావన కాలనీ, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఫేమ్ సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇటీవల ‘ఖాకి’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్. ప్రకాశ్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం ప్రారంభమైంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సూర్య, సాయిపల్లవి, సెల్వ రాఘవన్ కాంబినేషన్లో వస్తున్న మంచి సినిమా ఇది. సూర్య కెరీర్లో ఓ పెద్ద హిట్‌గా నిలిచేలా సెల్వరాఘవన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జనవరి 18న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, దీపావళికి సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సూర్యలాంటి వెర్సటైల్ హీరోతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ కథకు తను మాత్రమే కరెక్ట్ అని సినిమా చూశాక మీకే (ప్రేక్షకులు) తెలుస్తుంది’’ అన్నారు సెల్వరాఘవన్. ఈ చిత్రానికి కెమెరా: శివకుమార్ విజయన్. -
బొం బొం బాటుగుందిరా డైరీ
ఈ హీరోయిన్లు ఈ ఏడాది మేకప్ తీసేట్టు లేరు. సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా.... డైరీ బిజీ. ఫుల్‌గా సినిమాలు... నిల్‌గా డేట్స్. నయా తార: ఎంతమంది కొత్త నాయికలు వచ్చినా.. నయనతార ‘నయా తార’లానే ఉన్నారు. గతేడాది డోరా, ఆరమ్, వేలైక్కారన్ ఇలా.. మూడు తమిళ సినిమాలు చేశారు. ఇందులో ‘డోరా’ తెలుగులో విడుదలైంది. మరి... ఈ ఏడాది స్కోర్ ఎంత అంటే? గతేడాది కన్నా ఎక్కువ. నయనతార ఖాతాలో మూడు తమిళ సినిమాలు (ఇమైక్క నొడిగళ్, కొలైయుదిర్ కాలమ్, కోలమావు కోకిల) ఉన్నాయి. ఇక తెలుగులో సంక్రాంతికి వస్తున్న ‘జై సింహా’లో నయనతారే కథానాయిక. ‘సైరా’కి సై అన్న విషయం తెలిసిందే. ‘కర్తవ్వం’ అనే టైటిల్‌తో ‘ఆరమ్’ని తెలుగులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాల సంగతి ఇలా ఉంచితే.. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార లవ్‌లో ఉన్నారని చెన్నై ఇండస్ట్రీ కోడై కూస్తోంది. పెళ్లి ఎప్పుడు అనేది కాలమే నిర్ణయించాలి. సౌత్‌లో ఆ గౌరవం త్రిషదే: చెన్నై చందమామ త్రిష గత ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై మెరవలేదు. అలాగని అవకాశాలు తగ్గిపోయాయనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఏకంగా ఆరు సినిమాలు (మెహిని, గర్జనై, చతురంగ వెటై్ట 2, 1818, 96, హే జ్యూడ్) ఆమె చేతిలో ఉన్నాయి. మరో మూడు సినిమాలకు డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో... 2018లో లెక్క ఎక్కువ. సినిమాలవైజ్గా గతేడాది వెనక్కి తగ్గారేమో కానీ,, అరుదైన గౌరవం దక్కించుకున్నారు త్రిష. యూనిసెఫ్ (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) సెలబ్రిటీ అడ్వకేట్ స్టేటస్‌ను పొందారామె. సౌత్‌లో ఈ గౌరవం దక్కించుకున్న ఫస్ట్ హీరోయిన్ త్రిషనే అట. వెరీ వెరీ స్పెషల్: గతేడాది సమంతకు వెరీ వెరీ స్పెషల్. మరి... నచ్చిన కుర్రాడి (నాగచైతన్య)తో మూడు ముళ్లు వేయించుకోవడం అంటే స్పెషల్ కాక ఏంటి? పెళ్లి తర్వాత సినిమాల పరంగా స్పీడ్ తగ్గిస్తారేమో? అన్నది కొందరి ఊహ. కానీ, సమంతకు ఆ ఆలోచన లేదు. గతేడాది ‘రాజుగారి గది 2’, తమిళంలో ‘మెర్సెల్’లో నటించారు. ఈ ఏడాది విషయానికొస్తే... ‘రంగస్థలం , మహానటి’ సినిమాల్లో నటిస్తున్నారు. తమిళంలో ‘ఇరంబుదురై, ఇంకా టైటిల్ డిసైడ్ కాని ఓ సినిమా, ‘సూపర్ డీలక్స్’ సినిమాల్లో నటిస్తున్నారు. సో.. లెక్క పెరిగిందే కానీ, తగ్గలేదు. ఫిదా చేసింది: బాన్స్వాడ భానుమతి అందానికి, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. కథానాయిక సాయిపల్లవి గురించి చెబుతున్నామని గ్రహించే ఉంటారు. గతేడాది ‘ఫిదా, ఎంసీఏ’ సినిమాలతో తెలుగు తెరపై కనిపించారామె. తమిళంలో చేసిన ‘కరు’ తెలుగులో ఈ ఏడాది ‘కణం’ పేరుతో రిలీజ్ కానుంది. తమిళంలో మరో రెండు సినిమాలు చేయనున్నారు. ఇక తెలుగులో నెక్ట్స్ శర్వానంద్‌తో జోడీ కట్టారు సాయిపల్లవి. పక్కా స్కెచ్: గత ఏడాది ‘బాహుబలి–2’లో అవంతికగా, ‘జైలవకుశ’లో స్పెషల్ సాంగ్, తమిళ చిత్రం ‘ఏఏఏ’లో నాయికగా కనిపించారు తమన్నా. అందుకే ఈ ఏడాది పక్కా స్కెచ్ వేసుకున్నారామె. తెలుగులో మూడు సినిమాలు (సందీప్‌కిషన్ సరసన ఓ మూవీ, కల్యాణ్‌రామ్‌తో ఓ సినిమా, ‘క్వీన్’ తెలుగు రీమేక్) లైన్లో పెట్టారామె. అంతేకాదు ఈ జనవరిలో తెలుగు, తమిళ భాషల్లో ‘స్కెచ్’ రిలీజ్ కానుంది. అంతేకాదండోయ్ ‘కామోషీ’ సినిమాతో మరోసారి హిందీ ఇండస్ట్రీలో లక్‌ను చెక్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. లెక్క బాగుంది కదూ. బొమ్మాళీ... తగ్గొద్దు : ఓ వైపు స్టార్ హీరోలతో కమర్షియల్ మూవీస్ చేస్తూనే మరో పక్క సోలోగా కత్తి తిప్పారు ఈ ‘అరుంధతి’. 2017లో అనుష్క మూడు చిత్రాల్లో కనిపించారు. ‘సింగమ్ 3’, ‘ఓం నమో వెంకటేశాయ’లో మెరిశారు. ఆ తర్వాత ‘బాహుబలి ది కన్‌క్లూజన్’లో దేవసేనగా అభిమానులను అలరించారు అనుష్క. ఈ ఏడాది జనవరిలో ‘భాగమతి’గా కనిపించనున్నారు. జవనరి 26న ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి శివ దర్శకత్వంలో అజిత్ చేయబోతున్న ‘విశ్వాసం’ సినిమాలో హీరోయిన్గా ఈ భామ పేరును పరిశీలిస్తున్నట్టు కోలీవుడ్ టాక్. సిక్సర్ : తమిళంలో ‘భైరవ’, ‘పాంబు సాటై్ట’, తెలుగులో ‘నేను లోకల్’.. ఇలా 2017లో మూడు సినిమాల్లో కనిపించారు కీర్తీ సురేశ్. వచ్చే ఏడాది ఏకంగా సిక్సర్ కొట్టనున్నారు కీర్తి. ‘గ్యాంగ్’, ‘అజ్ఞాతవాసి’తో సంక్రాంతి పండగకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. మళ్లీ మార్చిలో ‘మహానటి’గా రానున్నారు. ఆ తర్వాత ‘సామీ స్క్వేర్’లో, 2005లో వచ్చిన ‘పందెంకోడి’ చిత్రానికి సీక్వెల్లో, విజయ్ సరసన ఓ సినిమాలోనూ హీరోయిన్గా కనిపిస్తారు కీర్తీ సురేశ్. ఆ విధంగా 2018లో అరడజను సినిమాల్లో సందడి చేయనున్నారు. లెక్క అదిరిందబ్బా. అదే దూకుడు: ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పన్నెండేళ్లవుతున్నా.. కాజల్ దూకుడు ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే చిన్న హీరోల పక్కన నటిస్తున్నారు. 2017లో ‘ఖైదీ నంబర్ 150’లో, ‘నేనే రాజు నేనే మంత్రి’, తమిళంలో విజయ్‌తో ‘మెర్సల్’ (తెలుగులో ‘అదిరింది‘), అజిత్‌తో ‘వివేగం’ (తెలుగులో ‘వివేకం’)’ సినిమాల్లో కనిపించారు కాజల్. ఆ ఉత్సాహంతో 2018లోను నాలుగు సినిమాల్లో కనిపించనున్నారామె. కల్యాణ్ రామ్ ‘ఎమ్మెల్యే’, ‘క్వీన్’ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’, నాని నిర్మిస్తున్న ‘అ’ చిత్రాల్లో సందడి చేయనున్నారు. రాశి బాగుంది: రాశీ ఖన్నా 2017లో మూడు సినిమాల్లో కనిపించారు. ‘జై లవ కుశ’, ‘ఆక్సిజన్’ చిత్రాల్లో మెరిశారు. ‘విలన్’ సినిమా ద్వారా మలయాళ తెరకు పరిచయమయ్యారు. ఈ ఏడాది రాశీ ఖన్నా చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. అందులో మూడు తమిళ సినిమాలు రెండు తెలుగు సినిమాలు. ‘టచ్ చేసి చూడు’, ‘తొలిప్రేమ’. ‘సైతాన్ కా బచ్చా, ఇమైక్క నొడిగల్, అడంగమారు’... ఇలా ఐదు సినిమాలతో ఈ ఏడాది రాశీ ఖన్నా డైరీ బిజీ. లెక్క తేలలేదు: అతి కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లోకి చేరిపోయారు రకుల్ ప్రీత్‌సింగ్. గతేడాది ‘విన్నర్, స్పైడర్, జయ జానకి నాయక, రారండోయ్ వేడుక చూద్దాం, ఖాకీ’ సినిమాల్లో కనిపించారు రకుల్. ఈ ఏడాది మాత్రం కేవలం ఒక్కటే సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అది కూడా బాలీవుడ్ ‘అయ్యారీ’. ప్రస్తుతానికి కొన్ని రోజులు రకుల్ డైరీ ఖాళీ. అధికారికంగా ప్రకటించలేదు కానీ, రవితేజ–కల్యాణ్ కృష్ణ సినిమా, హరీష్ శంకర్–‘దిల్’ రాజు కాంబినేషన్ మూవీ (దాగుడు మూతలు), బోయపాటి–రామ్‌చరణ్ సినిమాలకు రకుల్ పేరుని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇంకా లెక్క తేలలేదు. 2017 ఏం చేశారు? 2018 ఏం చేయబోతున్నారు? గతేడాది స్ట్రైట్‌గా నాలుగు సినిమాల్లో కనిపించారు హీరోయిన్ మెహరీన్ (మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్). తమిళ, తెలుగు బైలింగ్వల్ ‘కేరాఫ్ సూర్య’లో నటించారామె. ఈ ఏడాది ఇప్పటివరకు గోపీచంద్ 25వ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నారు. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే తెలుగులో ఒక సినిమా చేసిందో లేదో అప్పుడే కోలీవుడ్ నుంచి కాలింగ్ రావడం, ఆమె రెండు తమిళ సినిమాలకు (జీవాతో ఓ సినిమా, జీవీ ప్రకాశ్‌కుమార్‌తో ‘100% లవ్’ రీమేక్) సైన్ చేశారు. కెరీర్లో దూసుకెళ్తున్నారు సీనియర్ హీరోయిన్ శ్రియ. 2017లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్’ సినిమాల్లో ఆమె హీరోయిన్గా కనిపించారు. తమిళ సినిమా ‘ఏఏఏ’లో నటించారు. ఇక ఈ ఏడాది తమిళంలో ఆమె నటించిన ‘నరగాసురన్’ (తెలుగులో నరకాసురుడు) థియేటర్స్‌కు రానుంది. హిందీలో ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో వస్తోన్న ‘ధడ్కా’ రిలీజ్‌కి సిద్ధమైంది. ‘గాయత్రి, ‘వీరభోగ వసంతరాయలు’లో కీలక పాత్రలు చేస్తున్నారామె. బాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత జోరు పెంచారు తాప్సీ. 2017లో మూడు హిందీ సినిమాల్లో (రన్నింగ్ షాదీ, నామ్ షబానా, జుడ్వా 2) నటించారు. ‘ఘాజీ’లో చిన్న పాత్ర చేసి, తెలుగు తెరపై మెరిసిన తాప్సీ ‘ఆనందో బ్రహ్మ’ సినిమా చేశారు. ఈ ఏడాది కూడా అదే స్పీడ్‌లో నాలుగు హిందీ సినిమాలను లైన్లో పెట్టారు. మరో తెలుగు సినిమా కోసం డిస్కస్ చేస్తున్నారు. గతేడాది ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, తుప్పరివాలన్’ (తెలుగులో డిటెక్టివ్) సినిమాలతో థియేటర్స్‌లో సందడి చేసిన అనూ ఇమ్మాన్యుయేల్ ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు. అందులో ‘అజ్ఞాతవాసి’ సంక్రాంతికి రిలీజ్ అవుతుండగా, ‘నా పేరు సూర్య’ వేసవి బరిలో ఉంది. నాగచైతన్యతో చేయనున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. ‘లై’ ఫేమ్ మేఘా ఆకాశ్ తొలి హీరో నితిన్‌తో మరో సినిమా చేస్తున్నారు. తెలుగులో ‘మిస్టర్, రాధ, యుద్ధం శరణం, ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రాలతో అలరించిన లావణ్య త్రిపాఠి ప్రజెంట్ సాయిధరమ్ తేజ్ సినిమా చేస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్ గతేడాది ‘శతమానం భవతి, జోమొంటే సువిషంగల్, ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రాల్లో కనిపించారు. ఈ సంవత్సరం నాని ‘కృష్ణార్జున యుద్ధం’, సాయిధరమ్‌తో ఓ సినిమాలో హీరోయిన్గా కనిపించనున్నారు. 2017లో తెలుగులో నక్షత్రం, బాలకృష్ణుడు, తమిళంలో మా నగరం, సరవనన్ ఇరుక్క భయమేన్, నెంజమ్ మరప్పదిల్లయ్, జెమిని గణేశన్ సురళీ రాజనుమ్... ఇలా ఆరు సినిమాల్లో కనిపించారు రెజీనా. ఈ సంవత్సరం తమిళంలో పార్టీ, చంద్రమౌళి, తెలుగులో అ! రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ‘పెళ్ళి చూపులు’తో ఫేమస్ అయిన రీతూ వర్మ ఈ ఏడాది తమిళంలో విక్రమ్ సరసన ‘ధృవనక్షత్రం’, దుల్కర్ సల్మాన్‌తో ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్’ సినిమాల్లో కనిపించనున్నారు. వీళ్లు కాకుండా మరికొంత మంది భామలు ఈ సంవత్సరంలో తెలుగు తెరపై తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. కొందరు బాలీవుడ్ భామల సినిమాలు ఈ ఏడాది తెలుగులో రిలీజ్ కానున్నాయి. వారి హిందీ సినిమాల విషయం పక్కనపెడితే.. ఆ లిస్ట్‌లో శ్రద్ధాకపూర్ (‘సాహో’) అదితిరావ్ హైదరి (సుధీర్‌బాబు సినిమా), కియారా అద్వాని (మహేశ్ 24), కంగనా రనౌత్ (మణికర్ణిక), సన్నీ లియోన్ (వీరమహాదేవి) ఉన్నారు. తెలుగు చిత్రపరిశ్రమ ఎంతమందినైనా ఆహ్వానిస్తుంది. సో.. ఈ ఏడాది ఇంకా నయా తారలు చాలామంది వస్తారని ఊహించవచ్చు. -
ఆ హిట్ ట్రాక్ కంటిన్యూ అవ్వాలనుకున్నా!
‘ఓ మై ఫ్రెండ్’, ‘ఎంసీఏ’ చిత్రానికి కాస్త గ్యాప్ వచ్చింది. ఆ మధ్యలో రెండు సినిమాలు ఫైనలైజ్ అవుతాయనుకున్న తరుణంలో చేజారాయి. వాటి కోసం మూడేళ్లు వృథా అయ్యాయి’’ అని శ్రీరామ్ వేణు అన్నారు. నాని, సాయిపల్లవి జంటగా ఆయన దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ‘ఎంసీఏ’ ఇటీవల విడుదలైంది. శ్రీరామ్ వేణు మాట్లాడుతూ– ‘‘కొన్ని విషయాలు ఎన్నిసార్లు చెప్పినా బాగానే ఉంటాయి. మిడిల్ క్లాస్ అలాంటిదే. నేను, మా బ్రదర్ క్లోజ్‌గా ఉండేవాళ్లం. నాకు పెళ్లయిన తర్వాత మా బ్రదర్ కొంచెం ఫీలయ్యాడు. ఆ స్ఫూర్తితోనే ఈ కథ రాశా. కథ అనుకున్నప్పుడే నాని అనుకున్నాం. ‘ఎంసీఏ’ రిలీజ్ అయ్యాక సుకుమార్‌గారు మొదట ఫోన్ చేశారు. కొరటాల శివగారు మెసేజ్ చేశారు. ఓ సినిమా కోసం టైమ్ వెచ్చించాక అది ఓకే కాకపోవడంతో రెండు, మూడు రోజులు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లి, బయటపడ్డాను. మంచి సినిమా చూసిన ప్రతిసారీ నేను స్ఫూర్తి పొందేవాణ్ణి. ఎందుకంటే.. మాది మధ్యతరగతి కుటుంబం. ఓ పెద్దాయన సలహా మేరకు వేణు శ్రీరామ్‌గా ఉన్న నా పేరుని శ్రీరామ్ వేణుగా మార్చుకున్నా. న్యూమరాలజీ కోసం కాదు. రవితేజగారికి కథ చెబుతా. ఆయనకు నచ్చితే చేస్తా. రాజుగారికి ఆరో హిట్ ఇవ్వాలనే టెన్షన్ ఉండేది. నేను హిట్ ఇవ్వకపోతే ఆయన ట్రాక్ దెబ్బతింటుందని జాగ్రత్తగా పనిచేశా’’ అన్నారు. -
ఎస్... జోడీ కుదిరింది
సక్సెస్ఫుల్ స్టార్ శర్వానంద్, సక్సెస్ఫుల్ హీరోయిన్ సాయి పల్లవి..ఈ ఎస్ అండ్ ఎస్ జోడీ కుదిరింది. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘శర్వానంద్, సాయి పల్లవి, హను రాఘవపూడి వంటి ముగ్గురు ప్రతిభావంతులతో కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉంది. హను ఓ హిలేరియస్ రొమాంటిక్ ఎంటర్టైనింగ్ స్టోరీ రెడీ చేశారు. ఈ అందమైన ప్రేమకథలో శర్వానంద్, సాయి పల్లవిల జంట చూడటానికి కన్నుల విందుగా ఉంటుంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. రెగ్యులర్ షూటింగ్‌ను జనవరి మూడో వారంలో మొదలుపెడతాం. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేస్తాం’’ అని అన్నారు. -
సాయి పల్లవితో ఫెస్టివల్ స్టార్..
టాలీవుడ్లో మరో క్రేజీ ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కనుంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న యువ నటీనటులు ఇందుకోసం సన్నద్ధం అవుతున్నారు. ఫిదా బ్లాక్ బస్టర్‌తో టాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకున్న బ్యూటీ సాయి పల్లవి. తాజాగా నేచురల్ స్టార్ నాని సరసన నటించిన ఎంసీఏతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈఏడాది శతమానం భవతి సినిమాతో మెదలు పెట్టి మహానుభావుడు వంటి హిట్లతో 2017ను యువ హీరో శర్వానంద్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. రెండు సినిమాలు పండుగ సీజన్లో పెద్ద సినిమాలకు పోటీగా వచ్చి మంచి వసూల్లనే సాధించాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్, సాయి పల్లవిలు క్రేజీ కాంబినేషన్లో కలిసి నటించనున్నారని సమాచారం. ప్రేమకధా చిత్రాలు తీయడంలో పేరుపొందిన హను రాగపూడి కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ‘మహానుభావుడు’ సినిమా తరువాత శర్వానంద్ నటించబోతున్న సినిమాపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమగాధ వంటి ప్రేమకథా చిత్రాలతో అలరించిన రాగపూడి ఈ జోడితో రొమాంటిక్ సీన్స్ ని డైరెక్టర్ ఏ విధంగా చిత్రీకరిస్తాడో చూడాలి.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొత్త సంవత్సరంలో మొదలుకానుంది. -
ఎస్ 4
... హెడ్డింగ్ చదవగానే సూర్య ‘సింగమ్ 4’ సినిమా చేయబోతున్నారనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఈ ఎస్ 4 వేరు. ఒక క్రేజీ సినిమా కోసం నాలుగు ‘ఎస్’లు కలిశాయి. ఒక ఎస్ సూర్య అని ఇంకో ఎస్ సాయి పల్లవి అని ఫొటోలు చూసి, ఊహించే ఉంటారు. మరో రెండు ఎస్‌లు ఎవరంటే సెల్వరాఘన్, యస్. ఆర్. ప్రభు. ‘7/జి బృందావన కాలనీ’ ఫేమ్ సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రంలో సాయి పల్లవిని కథానాయికగా తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించబోతున్న నిర్మాత యస్. ఆర్. ప్రభు. అలా నాలుగు ఎస్‌లు కలసి ఓ ‘ఎస్’ ఇవ్వడానికి ఫిక్స్ అయ్యారు. అదేనండీ.. ఎస్ ఫర్ సక్సెస్ కదా. 2018 దీపావళికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఎంసీఏ అంటే... మిడిల్ క్లాస్ ఆడియన్స్
నాని, సాయి పల్లవి జంటగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం ‘ఎంసీఏ’. ఈ నెల 21న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ను చిత్రబృందం వరంగల్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ– ‘‘వేణు నాకీ కథ చెప్పగానే మీరంతా గుర్తొచ్చారు. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి, అమ్మాయికి తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా మొత్తం వరంగల్‌లోనే చిత్రీకరించాం. ఈ సినిమాతో సాయి పల్లవి నా ఫేవరెట్ కో–స్టార్ అయిపోయింది. ‘దిల్’ రాజుగారు, దేవిశ్రీ ప్రసాద్‌లతో సినిమా చేద్దాం అనుకుంటూ ఉన్నా. ఒకే సంవత్సరంలో రెండు సినిమాలు చేసేశాం’’ అని అన్నారు. ‘‘వేణుగారు చాలా కష్టపడి తెరకెక్కించారు. నాని చాలా హార్డ్ వర్కింగ్. ప్రతి సీన్‌ను ఇంప్రూవ్ చేయటానికి తపిస్తుంటారు. రాజుగారికి, శిరీష్‌గారికి థ్యాంక్స్’’ అని సాయి పల్లవి అన్నారు. మిడిల్ క్లాస్ అంటే అమ్మాయో, అబ్బాయో కాదు మిడిల్ క్లాస్ ఆడియన్స్. మిడిల్ క్లాస్ అంటే ఒక మైండ్ సెట్. మిడిల్ క్లాస్ అందరికీ నచ్చుతుంది. నాని వల్లే ఈ సినిమా స్టార్ట్ అయింది. అందరికీ థ్యాంక్స్’’ అన్నారు వేణు శ్రీరామ్. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, ఎర్రబెల్లి దయాకర్, ఆలూరి రమేష్ పాల్గొన్నారు. -
హత్యకూ హోమానికి లింక్ ఏంటి?
గౌరవమే ఆస్తిగా భావించే కుటుంబం అది. కొత్తగా పెళ్లైన దంపతులు. అంతలోనే వాళ్లను ఓ మర్డర్ మిస్టరీ వెంటాడుతుంది. ఆపై హోమాలు. ఈ మర్డర్‌కి, హోమాలకీ సంబంధం ఏమిటి? ఈ పరిస్థితుల నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడగలిగింది? అని తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు ‘కరు’ చిత్రబృందం. నాగశౌర్య, సాయి పల్లవి జంటగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళ, తెలుగులో రూపొందిన చిత్రం ‘కరు’. తెలుగులో ‘కణం’ పేరుతో విడుదల కానుంది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాష్ కరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘నాగశౌర్య, సాయి పల్లవి బాగా నటించారు. ఫిబ్రవరి 9న సినిమా రిలీజ్ అవుతుంది. డైరెక్టర్ విజయ్ ఈజ్ రెడీ టు గివ్ బర్త్’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. ప్రేమ్. -
'ఎంసీఏ' మూవీ స్టిల్స్
-
స్క్రీన్ టెస్ట్
ఈ ఏడాదిలోఇప్పటివరకు రిలీజైనసినిమాల్లోనిపాటలకుసంబంధించినక్విజ్ ఇది.ఈ వారంస్పెషల్. ► ‘వచ్చిండే పిల్ల మెల్లగ వచ్చిండే.. క్రీము బిస్కెట్ ఏసిండే ’ అంటూ చంగు చంగున గంతులేసిన మళయాల కుట్టి ఎవరు? ఎ) అనుపమా పరమేశ్వరన్ బి) అనూ ఇమ్మాన్యుయేల్ సి) నివేధా థామస్ డి) సాయిపల్లవి ► ‘స్వింగ్ జరా’ అనే స్పెషల్ పాటలో తన స్వింగ్‌ను 70 యంయం స్క్రీన్‌పై చూపించిన టాప్ హీరోయిన్ ఎవరు? ఎ) అనుష్క బి) తమన్నా భాటియా సి) కాజల్ అగర్వాల్ డి) అంజలి ► ‘నీ కళ్ల లోన కాటుక ఓ నల్ల మబ్బు కాదా’ అనే పాటను పాడిన అచ్చ తెలుగు పాటగాడెవరో తెలుసా? ఎ) రేవంత్ బి) యస్పీ బాలసుబ్రహ్మణ్యం సి) దీపు డి) హేమచంద్ర ► ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలో‘వాటమ్మా వాటీస్ దిసమ్మా’ అనే పాటను పాడింది, సంగీత దర్శకత్వం వహించింది ఒక్కరే. ఎవరా సంగీత దర్శకుడు? ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) అనూప్ రూబెన్స్ సి) జిబ్రాన్ డి) ఆర్పీ పట్నాయక్ ► ‘భళి భళి భళిరా భళి సాహోరే బాహుబలి’ అనే పాటను ఆలపించిన ప్రముఖ గాయకుడు? ఎ) దలేర్ మెహందీ బి) కైలాశ్ ఖేర్ సి) యాసిన్ నిజార్ డి) విజయ్ ప్రకాశ్ ► ‘ఓ సక్కనోడా దాడి చేసినావ దడదడ, కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంతకాలం’ అని బాక్సర్ రిథికాసింగ్ ఏ హీరో వెంటపడుతుంది? ఎ) నాగార్జున బి) వెంకటేశ్ సి) వరుణ్ తేజ్ డి) సాయిధరమ్ తేజ్ ► ‘పడమటి కొండల్లో వాలిన సూరీడా’ అనే పాటను పాడింది సింగర్ కాలభైరవ. అతను ఏ సంగీత దర్శకుని కుమారుడు? ఎ) యంయం కీరవాణి బి) మణిశర్మ సి) ఇళయరాజ డి) చక్రవర్తి ► ‘డియో డియో డిసక డిసక’ పాటలో దుమ్ము రేపే స్టెప్పులు వేసిన హాట్ గాళ్ ఎవరు? ఎ) రాఖీ సావంత్ బి) సన్నీ లియోన్ సి) బిపాసా బసు డి) మలైకా అరోరా ► ‘అడిగా అడిగా’ అని ‘నిన్ను కోరి’సినిమాలోని సూపర్‌హిట్ పాటనుపాడిందెవరు? (ఈ పాటను తనేపాడినట్లు నాని ప్రమోషన్ సాంగ్లోకూడా నటించారు) ఎ) శ్రీరామచంద్ర బి) దీపు సి) ఆల్ఫాన్స్ జోసఫ్ డి) సిద్ శ్రీరామ్ ► ‘జోగేంద్ర జోగేంద్ర’ అని ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో వచ్చే పాటకు సంగీత దర్శకత్వంవహించిందెవరు? ఎ) కళ్యాణి మాలిక్ బి) అనూప్ రూబెన్స్ సి) యం.యం. శ్రీలేఖ డి) సాయికార్తీక్ ► ‘వేయి నామాల వాడ వెంకటేశుడా’ అంటూ ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో కృష్ణమ్మ పాత్రను పోషించిన నటి ఎవరు? ఎ) రెజీనా కసాండ్రా బి) కేథరిన్ థెరిస్సా సి) అనుష్క శెట్టి డి) ప్రగ్యా జైస్వాల్ ► ‘భ్రమరాంభకు నచ్చేశాను’ అనే పాటను నాగచైతన్యఏ హీరోయిన్ని ఉధ్దేశించి పాడతాడు? ఎ) హన్సిక బి) సమంత సి) లావణ్య త్రిపాఠి డి) రకుల్ ప్రీత్ సింగ్ ► ‘నక్షత్రం’ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో నటించిన టాప్ హీరోయిన్ ఎవరు? ఎ) రాశీ ఖన్నా బి) శ్రియ సి) హెబ్బా పటేల్ డి) చార్మీ ► సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ 2017వ సంవత్సరంలో ఎన్ని తెలుగుసినిమాలకు సంగీతం అందించారు? ఎ) 8 బి) 14 సి) 10 డి) 12 ► ‘రాజుగారి గది 2’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు? ఎ) యస్.యస్. తమన్ బి) గోపిసుందర్ సి) జిబ్రాన్ డి) మహతి ► చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ చిత్రానికి సంబంధించి పాటల్లో ఏ పాట వివాదం అయింది? ఎ) నీరు నీరు బి) రత్తాలు రత్తాలు సి) అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు డి) యు అండ్ మి ► ‘సిసిలియా సిసిలియా’ అనే పాట‘స్పైడర్’ సినిమాలోనిది. ఈ పాటకుసంగీత దర్శకత్వం వహించిన తమిళ సంగీత దర్శకుడెవరు? ఎ) ఏ.ఆర్. రహమాన్ బి) హారిస్ జయరాజ్ సి) ఇళయరాజ డి) అనిరుద్ ► ‘గున్న గున్న మామిడి’ అనేపాపులర్ ఫోక్ సాంగ్‌ను ఏతెలుగు కమర్షియల్సినిమాలో వాడారు? ఎ) నిన్ను కోరి బి) నేను లోకల్ సి) రాజా ది గ్రేట్ డి) ఫిదా ► ‘మధురమే ఈ క్షణము’ అనే పాట అర్జున్ రెడ్డి సినిమాలోనిది. ఈ పాట రచయిత ఎవరు? ఎ) చంద్రబోస్ బి) రామజోగయ్య శాస్త్రి సి) శ్రేష్ఠ డి) శ్రీమణి ► ‘బొమ్మోలెగున్నదిర పోరి బొంబొంబాటుగుందిరా నారి’అనే పాటలో నటించిన హీరో ఎవరు? ఎ) శర్వానంద్ బి) మంచు విష్ణు సి) నితిన్ డి) నాగచైతన్య మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) బి 3) డి 4) ఎ 5) ఎ 6) బి 7) ఎ 8) బి 9) డి 10) బి 11) సి 12) డి 13) బి 14) సి 15) ఎ 16) సి 17) బి 18) సి 19) సి 20) సి -
సాయిపల్లవి కణం ట్రైలర్ వచ్చేసింది
-
సాయిపల్లవి కొత్త ట్రైలర్ వచ్చేసింది
సాక్షి, సినిమా : టాలీవుడ్లో ప్రస్తుతం క్రేజీ బ్యూటీగా మారిపోయిన సాయిపల్లవి కొత్త చిత్రం ‘కణం’ ట్రైలర్ విడుదలయ్యింది. నాగ శౌర్య హీరోగా.. కోలీవుడ్ దర్శకుడు ఏఎల్ విజయ్(అభినేత్రి దర్శకుడు) ఈ చిత్రాన్ని రూపొందించాడు. వరుస హత్యలు, సూపర్ నేచురల్ థీమ్, హర్రర్... నేపథ్యాలతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి ఇందులో పోలీసాఫీసర్ రోల్లో కనిపించాడు. నాలుగేళ్ల ఓ చిన్నపాప చుట్టూ ఈ కథ తిరుగుతుందని గతంలోనే దర్శకుడు విజయ్ చెప్పాడు కూడా. తమిళ్లో ‘కరు’ పేరుతో ఏకకాలంలో ద్విభాషా చిత్రంగా ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్ హౌజ్ నిర్మించింది. కాగా, కణం విడుదల తేదీపై త్వరలో ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
ముందు మల్లు అర్జున్... ఇప్పుడు ‘ఫిదా’ వరుణ్!
మలయాళంలో మంచి మార్కెట్ సంపాదించుకున్న యంగ్ తెలుగు హీరోలు ఎవరు? అంటే... అల్లు అర్జున్ పేరు ముందు వినిపిస్తుంది. ఇప్పుడు బన్నీ రూటులో మరో మెగా హీరో వరుణ్‌తేజ్ వెళ్తున్నాడు. వరుణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా ‘ఫిదా’. త్వరలో మలయాళంలో ఇదే పేరుతో సినిమాను విడుదల చేయనున్నారు. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్. మలయాళ ‘ప్రేమమ్’తో సాయిపల్లవికి స్టార్ స్టేటస్ వచ్చింది. నెక్ట్స్... శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’ కూడా మలయాళంలో మంచి హిట్! అందువల్ల, ‘సాయిపల్లవి ఈజ్ బ్యాక్’, ‘ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ హ్యాపీడేస్’ పేరుతో మలయాళంలో పబ్లిసిటీ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై మలయాళంలో సొంతంగా విడుదల చేయడానికి ‘దిల్’ రాజు సన్నాహాలు చేస్తున్నారట! బన్నీని మలయాళ ప్రేక్షకులు ముద్దుగా ‘మల్లు’ అర్జున్ అని పిలుచుకుంటారు. ఈ సినిమా మంచి హిట్టయితే వరుణ్‌తేజ్‌ను ‘ఫిదా వరుణ్’ అంటారేమో!! తెలుగులో 45 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందీ సినిమా. మలయాళంలో ఎంత కలెక్ట్ చేస్తుందో? వెయిట్ అండ్ సీ!! -
అవన్నీ చేస్తేనే ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’
-
ఎప్పుడు పెళ్లి చేసుకుందాం..
వరుస విజయాలతో జోరుమీదున్న నాచురల్ స్టార్ నాని తాజా సినిమా 'ఎంసీఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి)'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని సరసన 'ఫిదా' స్టార్ సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను దీపావళికి విడుదల చేసింది చిత్ర యూనిట్. లుంగీ కట్టుకొని చేతిలో పాల ప్యాకెట్ పట్టుకొని.. పల్లెలో పక్కా మాస్‌లుక్‌తో నాని ఈ ఫస్ట్‌లుక్‌లో దర్శనమిచ్చాడు. ఈ లుక్‌ని నెటిజన్లను ఆకట్టుకుంది. తాజాగా టీజర్ విడుదల చేసి నాని అభిమానుల్లో జోష్ పెంచింది చిత్ర యూనిట్. ఇందులో ఎంసీఏకు అసలు సిసలు అర్థం చెప్పాడు నాని. టీజర్లో అసలు ఎంసీఏ అంటే ఏంటి అదేమన్నా క్వాలిఫికేషనా అని అడిగిన ప్రెండ్‌తో నాని చెప్పిన డైలాగ్స్ అలరించాయి. 'ఎంసీఏ అంటే మైండ్‌సెట్. ఎప్పుడైనా షర్ట్ బటన్ వూడిపోతే పిన్నీస్ పెట్టుకుని మ్యానేజ్ చేశావా? మామూలు జీన్స్‌ని బ్లేడ్‌తో కట్ చేసి టోర్న్ జీన్స్‌లా కలర్ ఇచ్చావా? అంతెందుకు ఎప్పుడైనా అలా రోడ్డుపై వెళుతూ బస్‌స్టాప్‌లో ఓ అందమైన అమ్మాయిని చూసి ఇద్దరు ముగ్గురు పిల్లలతో ఓ ఫ్యామిలీ ఫొటోను వూహించుకున్నావా? ఇవన్నీ చేసుంటే తెలిసేది ఎంసీఏ అంటే ‘మిడిల్ క్లాస్ అబ్బాయని’ అంటూ నాని చెప్తున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. దీంతో పాటు సాయి పల్లవి ‘నువ్వు నాకు బాగా నచ్చావ్. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం’ అని నానిని అడగటం టీజర్లో హైలైట్. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. -
మిడిల్ క్లాస్ కుర్రాడి సమస్య ఏంటి?
నెక్ట్స్ ఏంటి? అసలు, సిన్మా కథేంటి? ‘నేను లోకల్’తో హిట్ అందుకున్న హీరో నాని, నిర్మాత ‘దిల్’ రాజు మరో సినిమా చేస్తున్నామని అనౌన్స్ చేయగానే ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఆసక్తిని మరింత పెంచుతూ, ‘ఎంసీఏ’ టైటిల్ అనౌన్స్ చేశారు. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే క్యాప్షన్‌తో! దీపావళి సందర్భంగా మిడిల్ క్లాస్ అబ్బాయిని అందరికీ చూపించారు. గళ్ల లుంగీ... చేతిలో రెండు పాల ప్యాకెట్లు... ప్రతి రోజూ పలు ఏరియాల్లో కనిపించే అబ్బాయిలకు ప్రతినిధిలా నాని వచ్చేశారు. అతడి చూపుల్లో సంతోషం కనిపిస్తోంది. మరి, అతనికున్న సమస్య ఏంటి? అది ప్రేమలోనా? పౌరుషంగా బతికే విధానంలోనా? తెలియాలంటే డిసెంబర్ వరకూ వెయిట్ చేయాల్సిందే. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రమిది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఇందులో సాయి పల్లవి హీరోయిన్. భూమిక కీ–రోల్ చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ మంచి మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ చిత్రం మా బ్యానర్ వేల్యూను పెంచుతుంది. యాభై శాతం షూటింగ్ కంప్లీట్ చేశాం. డిసెంబర్ 21న సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
ఈసారి తెలుగుతో పాటు తమిళ్ కూడా!
భాను‘మతి’ పోగొట్టింది. కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అదేనండి.. ‘ఫిదా’లో భానుమతిగా సాయి పల్లవి చేసిన సందడి గురించే చెబుతున్నాం. అందం, అభినయంతో అందర్నీ ఫిదా చేసేసిన సాయి పల్లవి ఇప్పుడు బిజీ స్టార్. ప్రస్తుతం నాని సరసన ‘ఎంసిఎ’లో నటిస్తోన్న ఈ బ్యూటీ మరోవైపు తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ‘కణం’లో చేస్తున్నారు. తాజాగా మరో ద్విభాషా చిత్రం ఒప్పుకున్నారు. ఇటు తెలుగు అటు తమిళ అభిమానులను ఆనందపరిచే వార్త ఇది. సాయి పల్లవి ఒప్పుకున్న సినిమా విషయానికొస్తే.. ధనుష్ కెరీర్లో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘మారి’ ఒకటి. ప్రస్తుతం ‘మారి–2’కి శ్రీకారం చుట్టారు. ఇందులో ధనుష్ సరసన సాయి పల్లవి కథానాయికగా నటించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సీక్వెల్ కూడా బాలాజీ మోహన్ దర్శకత్వంలోనే తెరకెక్కనుంది. -
నాలుగేళ్ల పాపకు తల్లి!
‘‘అప్పుడే అమ్మ పాత్రలా? ఏమంత వయసైపోయిందని?’’ అని అమ్మ పాత్రలకు అడిగినప్పుడు కొందరు హీరోయిన్లు అంటుంటారు. ఒకసారి అమ్మగా కనిపిస్తే.. ఆ తర్వాత అలాంటి పాత్రలకే ఫిక్స్ చేసేస్తారని భయం. కానీ, సాయి పల్లవికి అలాంటి భయాలేవీ లేవు. ‘ప్రేమమ్’, ‘ఫిదా’ చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారీ బ్యూటీ. భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకుంటే, తను చేసిన పాత్రల గురించి గొప్పగా చెప్పుకునేలా ఉండాలన్నది ఆమె అభిప్రాయం. అందుకే అమ్మ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారు. నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో నాలుగేళ్ల పాపకు తల్లిగా నటిస్తున్నారు సాయిపల్లవి. తెలుగులో ‘కణం’, తమిళంలో ‘కురు’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. -
సాయిపల్లవితో నాని షికార్లు
సాక్షి, వరంగల్ : వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న న్యాచురల్ స్టార్ నాని తన బైక్ పై ఓ అమ్మాయిని కూర్చొబెట్టుకొని హన్మకొండ రోడ్లపై షికార్లు చేస్తున్నాడు. ఇది నిజంగా నిజం అయితే నాని ఏదో సరదాకి అలా రోడ్ల మీద తిరిగేయటం లేదు.. ప్రస్తుతం నాని, వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంసీఏ(మిడిల్‌క్లాస్ అబ్బాయి) సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. షూటింగ్ లో భాగంగా ఓ సన్నివేశం కోసం ఇలా బైక్ పై చక్కర్లు కొడుతున్నారు ఈ స్టార్స్. షూటింగ్లో భాగంగా బుధవారం ఉదయం హన్మకొండ గ్రీన్ స్క్వేర్ ప్లాజా సమీపంలో వీరిద్దరు బైక్ పై వెళ్తుండటంతో స్థానికులు వారిని చూసేందుకు ఎగబడ్డారు. ఇటీవల నిన్నుకోరి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని, ఎంసీఏతో పాటు కృష్ణార్జున యుద్ధం సినిమాలో కూడా నటిస్తున్నాడు. -
ఆయనతో రొమాన్స్‌కు నేను రెడీ
తమిళసినిమా: వర్ధమాన నటి సాయిపల్లవి నటుడు సూర్యకు గాలం వేస్తోంది. ఈ మలయాళ అమ్మడు అక్కడ తొలిచిత్రం ప్రేమమ్‌తో మలయాళ సినీ ప్రియుల ప్రేమాభిమానాలను పొందేసింది. దీంతో కోలీవుడ్ కన్ను సాయిపల్లవిపై పడింది. మణిరత్నం లాంటి ప్రఖ్యాత దర్శకులు అవకాశం కల్పించడానికి రెడీ అయినా, నటుడు విక్రమ్‌తో జత కట్టే చాన్స్ వచ్చినా ఎంబీబీఎస్ చదువుతున్నానని చెప్పి ఆ అవకాశాలను సున్నితంగానే తిరస్కరించింది. దీంతో తమిళ చిత్రపరిశ్రమ సాయిపల్లవిని మరచిపోయింది. అలాంటి సమయంలో అనూహ్యంగా టాలీవుడ్లో ఫిదా చిత్రంలో ప్రత్యక్షమైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం చూస్తున్న తెలుగు ప్రేక్షకులిప్పుడు ఫిదా అయిపోతున్నారు. తాజాగా కోలీవుడ్‌లోనూ విజయ్ దర్శకత్వంలో కరు అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం తరువాత తమిళంలో వరుసగా చిత్రాలు చేయాలని నిర్ణయించుకుందట. దీంతో ఇక్కడ అవకాశాల వేట మొదలెట్టిందట. అందులో భాగంగా తాను కాలేజీ చదువుతున్న రోజల్లోనే నటుడు సూర్య వీరాభిమానినని, ఆయన చిత్రాలు మిస్ కాకుండా చూస్తానని డప్పు కొట్టుకుంటోంది. అంతే కాదు సూర్యతో రొమాన్స్ చేసే అవకాశం ఎప్పుడు వచ్చినా అందుకు రెడీగా ఉన్నానని అంటోంది. ఇక ఇష్టమైన నటి ఎవరమ్మా అంటే ఇంకెవరు అనుష్కనే అని టక్కున చెప్పింది. మాలీవుడ్‌లో ప్రేమమ్‌తోనూ, టాలీవుడ్లో ఫిదా చిత్రంతోనూ తన లక్‌ను నిరూపించుకున్న సాయిపల్లవి కోలీవుడ్‌లో కరు చిత్రం కోసం ఎదురుచూస్తోంది. -
సాయిపల్లవి ఔట్, అతిథి రావ్ ఇన్
చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం చేయబోతున్న తదుపరి సినిమాలో హీరోయిన్ గా అతిథి రావ్ హిరానీకి బంపర్ ఆఫర్ దక్కింది. కార్తీ హీరోగా రొమాంటిక్ ఎంటర్ ట్రైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మొదట సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేశారు. సాయి పల్లవి మరో సినిమా ప్రాజెక్టులో బిజీగా ఉండటంతో డేట్స్ కుదరక ఈ ప్రాజెక్టు నుంచి దూరమైనట్టు సమాచారం. దీంతో ఈ అవకాశం అతిథికి దక్కింది. కార్తీక్ ఈ చిత్రంలో పైలట్ గా నటించనున్నాడు. రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి మొదలవుతుంది. ఏఆర్ రహమాన్ సంగీతం సమకూర్చుతున్నాడు.