శివ కార్తికేయన్‌, సాయి పల్లవి సినిమా టైటిల్‌ రివీల్‌ ఎప్పుడంటే | Sivakarthikeyan And Sai Pallavi Movie Title Released Date, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

శివ కార్తికేయన్‌, సాయి పల్లవి సినిమా టైటిల్‌ రివీల్‌ ఎప్పుడంటే

Published Mon, Nov 27 2023 8:59 AM | Last Updated on Mon, Nov 27 2023 9:30 AM

Sivakarthikeyan And Sai Pallavi Movie Title Plan - Sakshi

కోలీవుడ్‌లో మడోనా అశ్విన్‌ దర్శకత్వంలో నటించిన మా వీరన్‌ చిత్రం విజయంతో మంచి ఖుషిలో ఉన్న నటుడు శివకార్తికేయన్‌ ప్రస్తుతం తన 21వ చిత్రంలో నటిస్తున్నారు. ఆయనకు జంటగా నటి సాయి పల్లవి నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా లోక నాయకుడు కమలహాసన్‌ ఈ చిత్రాన్ని తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తుండటం విశేషం. కాగా ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది.

ఇటీవల కాశ్మీర్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం చైన్నెలో చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ వెల్లడించలేదు. తాజాగా దీనికి సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నటుడు శివకార్తికేయన్‌ ఈ చిత్రానికి ముందు నటించిన చిత్రం అయలాన్‌, నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నాయకిగా నటించిన ఈ చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది.

గత దీపావళికి విడుదల అవుతుందని ప్రకటించినా వీఎఫ్‌ ఎక్స్‌ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో చిత్రాన్ని సంక్రాంతికి వాయిదా వేశారు. కాగా ఈ చిత్రం విడుదల రోజున శివకార్తికేయన్‌ 21 చిత్రం టైటిల్‌, పోస్టర్‌ను విడుదల చేయడానికి యూనిట్‌ వర్గాలు సిద్ధం అవుతున్నట్టు తాజా సమాచారం. నటుడు శివకార్తికేయన్‌ అభిమానులకు ఇది గుడ్‌న్యూసే అవుతుంది. కాగా ఈ రెండు చిత్రాల తరువాత ఏ ఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో నటించనున్న చిత్రం సెట్‌ పైకి వెళ్లనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement