
మిసెస్ సినిమా (Mrs Movie)లో తన నటనతో ప్రశంసలు అందుకుంటున్నాడు సీనియర్ నటుడు కన్వల్‌జిత్ సింగ్ (Kanwaljit Singh). తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతడు గతంలో జరిగిన ఓ సంఘటనను షేర్ చేసుకున్నాడు. కన్వల్‌జిత్ మాట్లాడుతూ.. 1985లో ఛప్టే ఛప్టే సీరియల్ చేశాను. సారిక (Sarika) నాతో జోడీ కట్టింది. కానీ అప్పుడు తను మద్రాస్‌లో ఉన్న ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతడి కోసం షూటింగ్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయింది. మళ్లీ సెట్‌కు రానేలేదు.
ఆమె వెళ్లిపోవడం వల్ల..
దానివల్ల ఒకరకంగా మంచే జరిగిందనుకుంటాను. సారిక స్థానంలో నటి అనురాధ పటేల్‌ను తీసుకున్నారు. అనురాధ నాకు జంటగా నటించింది. సీరియల్ షూటింగ్ సమయంలో మేము బాగా క్లోజ్ అయ్యాం. తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాం అని చెప్పుకొచ్చాడు. కమల్ హాసన్ (Kamal Haasan) కోసమే సారిక సీరియల్ వదిలేసుకుని మరీ వెళ్లిపోయింది. అప్పటికే కమల్‌కు వాణి గణపతితో పెళ్లవగా.. 1984లో ఆమెకు విడాకులిచ్చేశాడు.
కమల్ రిలేషన్స్..
1988లో సారికను పెళ్లి చేసుకున్నాడు. వీరికి శృతి హాసన్, అక్షర హాసన్ అని ఇద్దరు కూతుర్లు జన్మించారు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2004లో విడాకులు తీసుకున్నారు. అనంతరం కమల్.. నటి గౌతమిని ప్రేమించాడు. కానీ పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించడానికి ఇష్టపడ్డారు. అలా 2005-2016 వరకు కలిసున్నారు. తర్వాత బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు.